మీ పరిచర్యను మనస్ఫూర్తిగా చేయండి
1 యేసు శిష్యులుగా, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుటకు మరియు యేసుక్రీస్తు యొక్క శిష్యులను చేయుటకు మనము నియమింపబడినాము. (మత్తయి 24:14; 28:19, 20) అత్యవసరం, లేదా ప్రాముఖ్యత విషయంలో ఈ భూమి మీద ఉన్న మరి ఏ ఇతర పనికూడా దీనికి సాటిరాదు. లక్షలాది మంది ప్రజల జీవితాలు ఇమిడి ఉన్నాయి. మనం పూర్తి ప్రయత్నాలు చేయవలసి ఉంది. పౌలు సలహా బాగా వర్తిస్తుంది: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” (కొలొస్స. 3:23) “మనస్ఫూర్తిగా” అనునది “అత్యంత ఉత్సాహము లేక ఏక మనస్కమైన భక్తి” అని నిర్వచించబడినది. మీరు మీ పరిచర్యను మనస్ఫూర్తిగా చేస్తున్నారా?
2 మనస్ఫూర్తిగా ఉండాలంటే మనమేమి చేయవలసి ఉంది? అంగీకారము పొందు సేవను పదియవ భాగముగా లేక దశమ భాగముగా యెహోవా సూచించాడు. (మలా. 3:10) ఒక నిర్దిష్ట పరిమాణాన్ని నిర్ణయించుటకు బదులు, యెహోవాయెడల మనకున్న ప్రేమను వ్యక్తపర్చునదిగాను ఆయనకు మనం చేసుకున్న సమర్పణకు గుర్తింపుగా ఆయన సేవకు మనమర్పించు సమయము, ప్రయత్నమునకు పదియవ భాగము ప్రాతినిధ్యము వహిస్తుంది. (w92 12/1 p. 15) మన పరిచర్య యెహోవాపట్ల మనకున్న ప్రేమ మరియు భక్తి యొక్క లోతును ప్రతిబింబించాలి. మనస్ఫూర్తిగా సేవించు వ్యక్తి తన ఆరోగ్యము మరియు పరిస్థితులు అనుమతించు వరకు యెహోవాను వీలైనంత మట్టుకు సేవించుటకు ప్రేరేపించబడతాడు.
3 “నిరీక్షణ నుంచి . . . ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడు” వారిని గురించి పౌలు చాలా ఉన్నతంగా మాట్లాడాడు. (1 తిమో. 4:10) ‘ఐశ్వర్యమిచ్చు’ యెహోవా ఆశీర్వాదములు వారికి బహుకరించబడినవి. (సామె. 10:22) దానికి బదులుగా, తక్కువగా లేక సణుగుతూ సేవ చేయువారు ఇచ్చుటలో ఉన్న ఆనందాన్ని అనుభవించ లేకపోతున్నారు. (అపొ. 20:35) మనకున్న శ్రేష్ఠమైన వాటిని ఇచ్చుటకు అలక్ష్యం చేయడం యెహోవాకు ఇవ్వవలసిన పదియవ భాగమును దొంగిలించినట్లు అవుతుంది.—మలా. 3:8.
4 మనకున్న శ్రేష్ఠమైన వాటిని ఇచ్చుట: మనము క్షేత్రసేవలో పాల్గొని మన రిపోర్టును ఇచ్చినప్పుడు, అది కచ్చితంగా ఉంటుందా? అవర్ మినిస్ట్రీ పుస్తకము, 104వ పేజీ ఇలా చెబుతుంది: “మీరు మీ పరిచర్య పనిని మొదలు పెట్టినప్పుడు మీ సమయము మొదలగును మరియు మీరు సాక్ష్యమిచ్చు ప్రతిసారి మీ ఆఖరు ఇంటిని ముగించినప్పుడు మీ సమయము ముగియును. క్షేత్రసేవా సమయములో భోజనము లేక ఫలహారము తీసుకున్న సమయమును లెక్కించకూడదు.” మనము క్షేత్రసేవలో ఉన్నప్పుడు పూర్తిగా చేయుటకు మంచి పథకము మరియు ప్రయత్నము అవసరము.
5 మనకున్న శ్రేష్ఠమైన వాటిని ఇచ్చుట అంటే మనము సేవలో పాల్గొన్నప్పుడు మనకు వీలైనదంతయూ చేయుట అని అర్థము. మనస్ఫూర్తిగా సేవచేసేవారు ఇంటింటి పనిలో పాల్గొనుటకు బదులు కొన్నిసార్లు తటస్థ సాక్ష్యం ఇచ్చుటకు సంకల్పంతో ప్రయత్నించుటతో సరిపుచ్చుకొనరు. మనస్ఫూర్తిగా సేవ చేసే, ఒక యౌవనుడైన, బాప్తిస్మము తీసుకొనని ప్రచారకుడు ఇంటింటికి వెళ్లుటకు లేక అందింపును ఇచ్చుటకు కొద్ది పాటి ఆసక్తినే చూపిస్తూ, తన తలిదండ్రులు బలవంతము పెట్టినప్పుడు మాత్రమే ప్రకటించుటకుపోడు.
6 మనము మందులము కాకుండునట్లు ఆసక్తిని కలిగి ఉండవలసిందిగా పౌలు చేత ప్రోత్సహించబడుచున్నాము. (హెబ్రీ. 6:11, 12) మన వ్యక్తిగత సేవను పునఃపరిశీలించుకొని మనము మనస్ఫూర్తిగా సేవ చేశాము గనుక సిగ్గుపడనక్కరలేదు అంటే అదెంత సంతోషకరమైన విషయము! (2 తిమోతి 2:15) మనము వ్యక్తిగతంగా సహాయం అందించిన వారిని మహా శ్రమలను తప్పించుకున్న వారిలో చూస్తే మనము అతి గొప్ప ఆనందాన్ని పొందగలుగుతాము. తనను మనస్ఫూర్తిగా సేవించు వారిని యెహోవా గొప్పగా ఆశీర్వదిస్తాడని మనము కచ్చితంగా నమ్మవచ్చు.