కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/09 పేజీ 8
  • క్షేత్రసేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షేత్రసేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్షేత్రసేవా కూటాలు, వాటికున్న ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తాయి
    మన రాజ్య పరిచర్య—2015
  • క్షేత్రసేవా కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందండి
    మన రాజ్య పరిచర్య—2006
  • మీ క్షేత్ర సేవా గుంపు నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2012
  • భాగము 3: ప్రాంతీయ సేవకొరకైన కేంద్రము
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 8/09 పేజీ 8

క్షేత్రసేవా కూటాలు

1. క్షేత్ర సేవను ఒక పద్ధతి ప్రకారం ఎందుకు చేయాలి?

1 పద్ధతిప్రకారంగా, సమర్థవంతంగా రాజ్య ప్రకటనా పనిని నిర్దేశించే విషయంలో యేసు మనకు ఆదర్శంగా నిలిచాడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనా పనిని నిర్దేశించే బాధ్యత ఉన్నవారు, నేడు ఆ పని పద్ధతి ప్రకారం, సమర్థవంతంగా జరిగేలా చూడాలని ఎంతో కోరుకుంటున్నారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు క్షేత్రసేవ కోసం రాజ్య ప్రచారకుల గుంపులను సిద్ధంచేయడానికి క్షేత్రసేవా కూటాలను ఏర్పాటు చేస్తున్నాయి.—మత్త. 24:45-47; 25:21; లూకా 10:1-7.

2. క్షేత్రసేవా కూటంలో ఏమేమి చేయాలి?

2 చక్కని ఏర్పాటు: క్షేత్రసేవా కూటాలు, పరిచర్య చేయడానికి వెళ్తున్న వారిని ప్రోత్సహించడానికి, వారికి ఆచరణాత్మక సలహాలను, నిర్దేశాలను ఇవ్వడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఆ రోజుటి దినవచనం పరిచర్యకు చక్కగా సరిపోయేలా ఉంటే దాన్ని క్లుప్తంగా చర్చించవచ్చు. కొన్నిసార్లు, ఆ రోజు ప్రకటనా పనికి వచ్చిన వాళ్ళను సిద్ధం చేయడానికి మన రాజ్య పరిచర్య, లేఖనాల నుండి తర్కించడం లేదా పరిచర్య పాఠశాల పుస్తకం నుండి కొన్ని విషయాలను చర్చించడం మంచిది. ప్రచురణకు సంబంధించి ఒక అందింపును క్లుప్తంగా ప్రదర్శించవచ్చు. ఎవరు ఎవరితో పనిచేయాలో, ఎక్కడ చేయాలో ప్రతీ ఒక్కరికీ తెలియజేసిన తర్వాత ప్రార్థనతో కూటాన్ని ముగించాలి. ఈ కూటం పదిహేను నిమిషాలకు మించకూడదు. అది ముగిసిన వెంటనే అందరూ తమ తమ క్షేత్రాలకు వెళ్లిపోవాలి.

3. క్షేత్రసేవా కూటాలను ఏర్పాటు చేసే బాధ్యత ఎవరిది?

3 క్షేత్రసేవా కూటం ఎలా ఏర్పాటు చేయబడుతుంది? సేవా పైవిచారణకర్త అన్ని గ్రూపులు క్షేత్రసేవా కూటాలు జరుపుకునేలా చూడాలి. గ్రూపు పైవిచారణకర్తలకు లేదా వారి సహాయకులకు వారాంతాల్లో తమ తమ క్షేత్రసేవా గ్రూపులతో కలిసి పరిచర్య చేయాల్సిన బాధ్యత ఉంది. వారం మధ్యలో క్షేత్రసేవా గ్రూపులతో కలిసి సేవ చేసే అవకాశం కొంతమంది పైవిచారణకర్తలకు లేదా పరిచర్య సేవకులకు ఉండవచ్చు. గ్రూపు పైవిచారణకర్తలు సేవా పైవిచారణకర్త పర్యవేక్షణలో, వారాంతాల్లో ఇంటింటి పరిచర్య చేయడానికి తమ గ్రూపుకు తగినంత క్షేత్రం ఉండేలా చూస్తారు. వారమంతటిలో తమ గ్రూపులను క్షేత్రసేవకు తీసుకువెళ్ళే వారి కోసం చేయబడిన ఏర్పాట్లను సేవా పైవిచారణకర్త పర్యవేక్షిస్తాడు.

4-6. (ఎ) సంఘ క్షేత్రానికి సంబంధించి, క్షేత్రసేవా కూటాల ఉద్ధేశమేమిటి? (బి) క్షేత్రసేవా కూటాల అవసరాన్ని నిశ్చయించుకోవడానికి ఏ విషయాలను పరిశీలించవచ్చు?

4 ఈ కూటాలు ఎప్పుడు, ఎక్కడ జరగాలి? సంఘమంతా క్షేత్రసేవా కూటాలను ఒకేచోట జరుపుకునే బదులు సాధారణంగా అనువైన స్థలాల్లో అంటే సహోదరుల ఇళ్ళల్లో జరుపుకోవడం మంచిది, క్షేత్రాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి క్షేత్రానికి దగ్గర్లో ఉన్న సహోదరుల ఇళ్ళల్లో వాటిని ఏర్పాటు చేయాలి. వీటిని రాజ్యమందిరాల్లో కూడా నిర్వహించవచ్చు. చాలా సంఘాలు ఆదివారం బహిరంగ ప్రసంగం, కావలికోట అధ్యయనం ముగిసిన తర్వాత రాజ్యమందిరంలోనే క్షేత్రసేవా కూటాన్ని జరుపుకుంటాయి. క్షేత్రసేవా కూటాన్ని క్షేత్రానికి దగ్గర్లోనే జరుపుకోవడం మంచిది, ఇలా చేస్తే చాలా దూరం ప్రయాణించవలసిన అవసరం ఉండదు. కాబట్టి క్షేత్రాన్ని సమర్థవంతంగా, సంపూర్ణంగా పూర్తిచేయడానికి ప్రస్తుతం క్షేత్రసేవా కూటం జరుగుతున్న స్థలం ఇప్పటికీ అనువుగానే ఉందో లేదో తెలుసుకోవడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లను అప్పుడప్పుడు పరిశీలించవచ్చు.

5 ఈ కూటాలు ఏ సమయంలో జరుపుకుంటే మంచిదో, వారంలో ఎన్నిసార్లు ఈ కూటాలు నిర్వహించాలో క్షేత్రంలోని పరిస్థితులను బట్టి నిర్ణయించాలి. క్షేత్రసేవా కూటాలను ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తే మంచిదనే విషయాన్ని నిశ్చయించుకోవడానికి ఈ క్రింది ప్రశ్నలు సహాయం చేస్తాయి.

6 ఏ క్షేత్రంలో ఇంకా ఎక్కువ పనిచేయాల్సిన అవసరముంది? ఇంటింటి పరిచర్య చేయడానికి ఏది సరైన సమయం? ఇంటింటి పరిచర్యగానీ, పునర్దర్శనాలుగానీ సాయంకాలాలు చేస్తే మంచిదా? క్షేత్రసేవా ఏర్పాట్ల వివరాలను సంఘ సమాచార బోర్డు మీద పెట్టాలి. “నేనిక సంచరింపవలసిన భాగము లేదు” అని చెప్పిన అపొస్తలుడైన పౌలులా చెప్పగలిగేంత సంపూర్ణంగా మనం మనకు నియమించబడిన ప్రాంతాన్ని పూర్తిచేయాలని రాజ్య ప్రచారుకుల్లో ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.—రోమా. 15:23.

7. గ్రూపును క్షేత్రసేవా ప్రాంతానికి పంపించే వారి బాధ్యతేమిటి?

7 క్షేత్రసేవా కూటాలను నిర్వహించడం: ఈ కూటాలను నిర్వహించాల్సిన సహోదరులు వాటికి బాగా సిద్ధపడడం ద్వారా ఈ దైవపరిపాలనా ఏర్పాటుపట్ల ప్రగాఢమైన గౌరవాన్ని చూపించవచ్చు. ఈ కూటాలను సమయానికి ప్రారంభించి, అవసరమైన సమాచారాన్ని క్లుప్తంగా తెలియజేస్తూ 10, 15 నిమిషాల్లో ముగించాలి. ఈ కూటాలను ప్రారంభించక ముందే, గ్రూపు పనిచేయాల్సిన ప్రాంతం నిర్వాహకుని దగ్గర ఉండాలి. క్షేత్రసేవా కూటాలు ముగిసిన తర్వాత ఆలస్యంగా వచ్చేవారికోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదుగానీ గ్రూపు అంతా ఏ ప్రాంతంలో సేవచేస్తుందో తెలియజేసే సందేశాన్ని విడిచిపెట్టడం సహాయకరంగా ఉంటుంది. క్షేత్రసేవా కూటాలు ముగిసిన వెంటనే అందరూ తాము చేయాల్సిన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. చక్కగా, ఉపదేశాత్మకంగా నిర్వహించబడిన సేవా కూటాలు, హాజరైనవారంతా ఆ రోజు చక్కగా పరిచర్య చేయడానికి అవసరమైన నిర్దేశాన్నిస్తాయి.—సామె. 11:14.

8. మనందరం క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించే సహోదరునితో ఎలా సహకరించవచ్చు?

8 క్షేత్రసేవా కూటాలకు హాజరవడం: పరస్పర సహకారం ఎంతో అవసరం. (హెబ్రీ. 13:17) గ్రూపును క్షేత్రసేవా ప్రాంతానికి పంపించే సహోదరుడు వీలైనప్పుడు, సహాయం అవసరమైన వారితో కలిసి సేవ చేయవచ్చు. అనుభవం గల ప్రచారకులు కొత్త ప్రచారకులకు, అంతగా అనుభవం లేని ప్రచారకులకు సహాయం చేయడానికి వీలుగా క్షేత్ర సేవకు రావడం మంచిది. అప్పుడప్పుడు వేరేవాళ్ళతో కలిసి పరిచర్య చేయడంవల్ల ప్రయోజనం ఉంటుంది. (సామె. 27:17; రోమా. 15:1, 2) అందరూ సమయానికి రావడానికి కృషి చేయాలి. మనకు దైవపరిపాలనా ఏర్పాటు పట్ల గౌరవం, తోటి పనివారిపట్ల శ్రద్ధ ఉంటే అవసరమైన సర్దుబాట్లు చేసుకుని సమయానికి వస్తాము.—2 కొరిం. 6:3, 4; ఫిలి. 2:4.

9. పయినీర్లు క్షేత్రసేవా కూటాలకు ఏయే విధాలుగా తమ విలువైన మద్దతునివ్వవచ్చు?

9 పయినీర్ల మద్దతు: క్షేత్రసేవా కూటాలకు పయినీర్లు ఇచ్చే మద్దతు ఎంతో విలువైనది. అది అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. పయినీర్లకు చాలా బాధ్యతలుంటాయని అర్థంచేసుకోవచ్చు. వాళ్ళు బైబిలు అధ్యయనాలు నిర్వహించడం, పునర్దర్శనాలు చేయడం మాత్రమే గాక కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి, ఉద్యోగం చేయాలి. కాబట్టి, వాళ్ళు సంఘం ఏర్పాటు చేసే ప్రతీ క్షేత్రసేవా కూటానికి, ముఖ్యంగా అది ప్రతీరోజు ఉంటే, దానికి వాళ్ళు ఖచ్చితంగా హాజరవ్వాలనేమీ లేదు. అయితే పయినీర్లు, వారంలో జరిగే క్షేత్రసేవా కూటాల్లో కనీసం కొన్నిటికి హాజరై తమ మద్దతు ఇవ్వవచ్చు. క్షేత్రసేవా కూటాలు సంఘ సభ్యులకు క్షేత్రసేవలో తర్ఫీదు ఇవ్వడానికి కొంతమేరకు సహాయం చేస్తాయి. పయినీర్ల ఆధ్యాత్మిక నేపథ్యం, వాళ్ల అనుభవం ఇతరులకు ఎంతో సహాయపడతాయి. వాళ్ళు క్షేత్రసేవలో క్రమంగా పాల్గొంటారు కాబట్టి వాళ్ళకు క్షేత్రసేవలో ఎంతో అనుభవముంటుంది. దాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. వాళ్ళు పరిచర్యలో, క్షేత్రసేవా కూటాల్లో ఉత్సాహంగా పాల్గొంటే ఇతరులు వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటారు. ఈ క్షేత్రసేవా కూటాల్లో వాళ్ళు పాల్గొనడం ఎంతో ప్రశంసనీయమైనది.

10. రాజ్య ప్రచారకులందరూ ఈ కూటాలకు హృదయపూర్వకంగా మద్దతునివ్వడం ఎందుకు సరైనది?

10 యేసు, ఆయన శిష్యులు చేసినట్లే, మన రాజ్య ప్రకటనా పని కూడా ఎక్కువగా ఇంటింటి పరిచర్య ద్వారానే జరుగుతోంది. క్షేత్రసేవా కూటాలు, పరస్పర ప్రోత్సాహానికి, ఈ పనిలో సమర్థవంతంగా పాల్గొనడానికి దోహదపడతాయి. సువార్త ప్రచారకులందరూ అలాంటి దైవపరిపాలనా ఏర్పాట్లకు సాధ్యమైనంత మేరకు మద్దతునివ్వాలి. (అపొ. 5:42; 20:20) ఈ కూటాలకు మనం హృదయపూర్వకంగా మద్దతునిద్దాం. మనమలా చేయడం ద్వారా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ యెహోవా ఆశీర్వాదాలను పొందవచ్చనీ మన నాయకుడైన యేసుక్రీస్తు హృదయాన్ని సంతోషపర్చవచ్చనీ మనం నిశ్చయత కలిగివుండవచ్చు.—మత్త. 25:34-40; 28:19, 20.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి