లాభసాటి ఫలితాలకు కరపత్రాలను ఉపయోగించడం
1 యెహోవా కలిగియున్న ఆధునిక దిన సంస్థ కరపత్రాలను విజయవంతంగా ఉపయోగించడంలో చరిత్రను సృష్టించింది. సువార్త ప్రచారములో కరపత్రాలు కీలక పాత్ర వహిస్తున్నాయని వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అనే మన చట్టపరమైన సంస్థ పేరే సూచిస్తుంది. యెహోవా ప్రజల ద్వారా 1881 నుండి 1918 వరకు, 30 కోట్ల కరపత్రాలు పంచిపెట్టబడ్డాయి. ఈ కాలంలో క్రీస్తు సహోదరుల శేషములో భాగమైయున్న అనేకులు ఈ తొలి కరపత్రాల వలననే సత్యానికి పరిచితులయ్యారు.
2 నాలుగు రంగుల కరపత్రాలను 1987లో విడుదలచేసి సరిక్రొత్తగా చిన్న కరపత్రాల ఉపయోగంపై మళ్లీ అవధానాన్ని నిలిపారు, అప్పటినుండి ఈ కరపత్రాలు లభ్యమౌతున్నవి. ఆలోచనను రేకెత్తించు ఇంకా నాలుగు రంగురంగుల కరపత్రాలను వీటికి జతచేయుట ద్వారా ఈ కరపత్రాల పరంపరను విస్తృతపర్చదల్చినట్లు 1992 “వెలుగు ప్రకాశకులు” జిల్లా సమావేశములో ప్రకటించబడింది. అవి కంఫర్ట్ ఫర్ ది డిప్రెస్‌డ్, ఎన్‌జాయ్ ఫామిలీ లైఫ్, హూ రియల్లీ రూల్స్ ది వరల్డ్? మరియు విల్ దిస్ వరల్డ్ సర్‌వైవ్? అనునవి. మీ పరిచర్య లాభసాటి ఫలితాలనిచ్చేందుకు వీలుగా మీరు ఈ ఎనిమిది కరపత్రాలను ఉపయోగిస్తున్నారా?
3 కరపత్రాలను ప్రభావవంతంగా ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. మీరు వాటిలో ప్రతి దానితో పరిచయం పెంచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ప్రతిది ఏ విషయాన్ని చర్చిస్తుందో తెలుసుకొనుటకు వాటిలో అన్నింటిని మీరు జాగ్రత్తగా చదివారా? ఏ కరపత్రం ఏ విధమైన మనుష్యులను ఆకట్టుకుంటుందో మీరు ఆలోచించారా? ఒకొక్క కరపత్రంతో పూర్తి పరిచయం ఏర్పరచుకొనడం, ఇంటింటి సేవలో, ఆలాగే మనము తటస్థ సాక్ష్యం ఇవ్వగల అనేక పరిస్థితులలో వాటిని ఉపయోగించుటకు మీ మనోనమ్మకాన్ని పెంచుతుంది.
4 ఇంటింటి పరిచర్యలో ఉపయోగించండి: ఒక ప్రాంతీయ కాపరి ఇలా వ్రాస్తున్నాడు: “నా చర్చలలో చాలా వాటిని కరపత్రాల ద్వారా మొదలు పెట్టడం వలన నేను మంచి విజయం పొందగల్గుతున్నాను.” మీరు ఈ విధంగా ప్రయత్నించి చూశారా? మీ సంభాషణకు పరిచయంగా కరపత్రాలను ఉపయోగించండి. ఎనిమిది కరపత్రాలతో, ఎన్నుకొనుటకు ఇప్పుడు మనవద్ద ఎనిమిది ఉత్తేజకరమైన పరిచయాలున్నాయి. ప్రతి కరపత్రం మొదటి దర్శనమందో లేక పునర్దర్శనమందో ఒక బైబిలు పఠనాన్ని మొదలు పెట్టుటకు అవకాశాన్ని ఇస్తుంది.
5 కరపత్రాలను ఉపయోగించుటకు వేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ఇంట్లో సంభాషిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ఈ మధ్యే తన ప్రియులను ఎవరినైనా మరణమందు పోగొట్టుకున్నాడనో లేక ఆ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనో మీరు తెలుసుకొనవచ్చు. దీర్ఘకాల కష్టాలతో పోరాడుతున్న వారు లేక గొప్ప దుఃఖాన్ని అనుభవిస్తున్న ప్రజలు తరచూ ప్రతికూల భావాలను పెంపొందించుకొని కృంగిపోతారు. కంఫర్ట్ ఫర్ ది డిప్రెస్‌డ్! అనే కరపత్రంలో కనుగొనబడే ప్రోత్సాహకరమైన సమాచారాన్ని వారితో పంచుకొనడం ఎంత ప్రేమపూర్వకంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఈమధ్యే విడాకులు పొందాడనో లేక తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడనో మీరు తెలుసుకొనవచ్చు. అటువంటి అనుభవాలు బాధాకరంగా ఉండి కుటుంబంపై చాలా ప్రభావం చూపిస్తాయి. ఎన్‌జాయ్ ఫామిలీ లైఫ్ కరపత్రంలోని రెండవ పేజీలోని ప్రశ్నలను ఉపయోగించండి: “ఈనాడు కుటుంబాలు అటువంటి గంభీరమైన సమస్యలను ఎందుకు ఎదుర్కొనవలసి వస్తుంది? మనము కుటుంబ జీవితమును ఎలా ఆనందించవచ్చు?” బహుశ ఆ వ్యక్తి మనస్సులో ప్రస్తుతం ఆ ప్రశ్నలే ఉండవచ్చు. ఆసక్తి వెంటనే కనబడకపోయినను, అతడు ఆ కరపత్రాన్ని తరువాత చదివే అవకాశం ఉంది.—ప్రసంగి 11:6.
6 కొన్ని సంఘాలలో ప్రాంతాన్ని తరచు పనిచేస్తుంటారు, మన ప్రచురణలను కొన్నింటిని అనేకులు ఇప్పటికే కలిగియున్నారు. కరపత్రాలను ఉపయోగించుట ద్వారా, ఇంటివారికి ఆసక్తికలిగించే దానిని చర్చించుటకు, వారి ఆలోచనలను తెలుసుకొనుటకు, రాజ్య నిరీక్షణ గురించి వారు ఆలోచించునట్లు చేయుటకు మనకు ఒక అవకాశం ఉంటుంది. తరువాతి సమయంలో చర్చించగల ఒక ప్రశ్నను వారి మనస్సులో నాటండి. పునర్దర్శించి, ఆ ఆసక్తిని పెంపొందించండి. కొద్ది సమయంలో వారి దగ్గర ముందే ఉన్న ఒక పుస్తకమును లేక బ్రోషూరును ఉపయోగించి పఠనమును మొదలుపెట్టవచ్చు.
7 తటస్థసాక్ష్యంలో కరపత్రాలను ఉపయోగించండి: కరపత్రాలను మనము సుళువుగా అందుకొనగల చోట—చొక్కా జేబులో, కోటు జేబులో, పర్సులో, లేక సాక్ష్యమిచ్చే సంచిలో—ఉంచుకుంటే, ప్రజలను కనుగొనినప్పుడు అనేక సందర్భాలలో వాటిని మనం ఉపయోగించవచ్చు. బజారుకెళ్లినప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, లేక బంధువులతో లేక సందర్శకులతో మాట్లాడునప్పుడు వాటిని ఉపయోగించండి. మనం క్లుప్తంగా సాక్ష్యమివ్వడానికి కరపత్రాలు అవకాశం కల్పిస్తాయి. ఒక వ్యక్తికి కరపత్రం విసుగు కలిగించదు కాని సూటిగా మరియు యుక్తిగా ఉంటుంది. దానిలో చదివేందుకు ఎక్కువ లేదు గనుక, ఒక పుస్తకము లేక పత్రికకన్నా సులభంగా దాన్ని అంగీకరిస్తారు.
8 మీ పాఠశాల వద్ద లేక ఉద్యోగ స్థలంలో, రెస్టారెంటులో, పెట్రోలు పంపువద్ద, మరియు ఇతర చోట్లలో తటస్థంగా కరపత్రాలను అందించగల అవకాశాల కొరకు మెలకువగా ఉండండి. ఒక సహోదరి తన అమ్మమ్మను వైద్యుని వద్దకు తీసుకొనిపోవునప్పుడు తన వద్ద కరపత్రములను ఉంచుకొన్నది. వైద్యుని కార్యాలయంలో, ఒక గర్భిణీ స్త్రీతో ఆమె సంభాషణ మొదలుపెట్టింది. ఆ స్త్రీకి లైఫ్ ఇన్ ఎ పీస్‌ఫుల్ న్యూ వరల్డ్ అను కరపత్రాన్ని చూపించిన తరువాత, “ఇక్కడ చిత్రీకరించబడిన లోకంలాంటి దానిలో మీరు మీ పిల్లవాన్ని పెంచుటకు ఇష్టపడుతున్నారా?” అని సహోదరి అడిగింది. ఆ సంభాషణ ద్వారా ఆమె ఆ స్త్రీని ఇంటికి వెళ్లి దర్శించుటకు వీలుచేసుకుంది. ఇది కొన్ని క్రమమైన పునర్దర్శనములకు దారి తీసింది.
9 కరపత్రాలతో బైబిలు పఠనములను మొదలుపెట్టవచ్చు: తను దర్శిస్తున్న సంఘస్థులు ఇంటివారిని పరిచయం చేసుకునేటప్పుడే కరపత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఆ వారంలో 64 బైబిలు పఠనాలను మొదలుపెట్టారని ఒక ప్రాంతీయ కాపరి నివేదించాడు.
10 ఇంటింటి పరిచర్యలో మొదటి దర్శనమందే బైబిలు పఠనం కొరకు అడుగుటకు మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? కరపత్రాన్ని ఉపయోగించుట ద్వారా, బైబిలు పఠనం ఎలా నిర్వహించబడుతుందో మీరు వారికి క్లుప్తంగా ప్రదర్శించవచ్చు. లైఫ్ ఇన్ ఎ పీస్‌ఫుల్ న్యూ వరల్డ్ అనే కరపత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఒక సహోదరి అలా చేసింది. చిత్రాన్ని చూపిస్తూ, మన భూమి ఎప్పటికైనా ఇలా ఉంటుందని ఆమె అనుకుంటుందా అని సహోదరి ఆ స్త్రీని అడిగింది. ఆ స్త్రీ జవాబు ఇచ్చిన తరువాత, కరపత్రంలో ఉన్నతపరచబడిన 2 పేతురు 3:13 మరియు యెషయా 65:17,ను చదువమని సహోదరి ఆమెను ఆహ్వానించింది. అప్పుడు మన సహోదరి ఇలా అన్నది “ఇవి కలలు కల్పనలు కావుగాని దేవుని వాక్యమైన బైబిలులో చేయబడిన నిజమైన వాగ్దానాలు.” ఆ సంభాషణను తరువాతి వారంలో కొనసాగించుటకు ఆమె ఏర్పాటు చేసింది. తరువాతి దర్శనములో, ఆ స్త్రీ వేసిన అనేక ప్రశ్నలకు జవాబులివ్వబడినవి మరియు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను పుస్తకము అందించబడింది. తత్ఫలితంగా ఒక బైబిలు పఠనము మొదలైంది.
11 మీరు క్రొత్తగా బాప్తిస్మము తీసుకున్నారా లేక మీ పరిచర్యలో అనుభవము గడిస్తున్న ఒక బాప్తిస్మము పొందని ప్రచారకులా? ఆలాగైతే, మీరు ఎక్కువ అనుభవముగల వారిని కనుగొని మీ సంఘ ప్రాంతంలో కరపత్రములను ఉపయోగించడంలో వారి సలహాలను కోరుటకు ఇష్టపడవచ్చు. విశ్వాసంలో ఎదిగిన వారినుండి నడిపింపు మరియు ప్రోత్సాహము పొందినవారి ఉదాహరణలు మనకు బైబిలునందు చాలా కలవు.—అపొ. 18:24-27; 1 కొరింథీ 4:17.
12 కరపత్రాలను ప్రభావవంతంగా ఉపయోగించుటలో మీకు నడిపింపు నిచ్చేందుకు ఇతరులను ఏర్పాటు చేయుటకు సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు మీకు ప్రత్యేక సహాయాన్ని అందించగలరు. ప్రకటించు పనిలో తమ పిల్లలు అభివృద్ధి సాధించుటకు సహాయము చేయవలసిన బాధ్యత తలిదండ్రులకున్నది. ఒక యౌవన సాక్షి లైఫ్ ఇన్ ఏ పీస్‌ఫుల్ న్యూ వరల్డ్ కరపత్రమును అందించుటలో తన తలిదండ్రులచే తర్ఫీదు పొందింది. తన తల్లితో బైబిలు పఠనమునకు వెళ్లినప్పుడు, ఆసక్తిగల వ్యక్తి భర్తకు ఆమె ఒక కరపత్రాన్ని అందించింది. ఒక చిన్న బాలికకు అంత దృఢమైన మతపర నమ్మకాలు ఉండడం చూసి భర్త ప్రభావితుడయ్యాడు. కరపత్రాన్ని చదివి అతను చాలా ఆనందించాడు. ఆ చిన్న బాలిక తన తల్లితో వచ్చినప్పుడల్లా, అతని కొరకే తాను ప్రత్యేకంగా సిద్ధపరచిన లేఖనాన్నైనా లేక ఒక బైబిలు కథనైనా చెబుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడు పత్రికలను క్రమంగా చదువుతున్నాడు, రెవెలేషన్ క్లైమాక్స్ పుస్తకమందు ఆసక్తి చూపించాడు, మరియు కొన్ని కూటములకు హాజరయ్యాడు. తమ కుమార్తెకు కరపత్రములను మంచిగా ఉపయోగించడం నేర్పాలను తమ బాధ్యతను నిర్వహించుటకు ఆ తలిదండ్రులు సమయాన్ని తీసుకున్నందుకు లభించిన ఫలితమే యిది.
13 మన క్రొత్త కరపత్రములను ప్రభావవంతంగా ఉపయోగించండి: విల్ దిస్ వరల్డ్ సర్‌వైవ్? అను కరపత్రమును ఉపయోగించునప్పుడు, మీరు పరిచయం చేసుకుని ఇలా చెప్పడం ద్వారా మీ సంభాషణను మొదలుపెట్టవచ్చు: “నమస్కారం. ఈవేళ మేము జీవన పరిస్థితి గురించి ప్రజలతో మాట్లాడుతున్నాము. మీరు జీవన పరిస్థితి బాగుపడుతుందని అనుకుంటున్నారా, లేక అది యింకనూ క్షీణిస్తుందా? [జవాబు ఇవ్వనివ్వండి.] ప్రపంచంలో నేడు సంభవిస్తున్నది బైబిలు ప్రవచనాల నెరవేర్పుగా జరుగుతున్నదని, లోకాంతం దగ్గరలో ఉందని కొందరు అనుకుంటున్నారు. మీరు ఏమని అనుకుంటున్నారు?” ఇంటివారు జవాబిచ్చిన తరువాత, కరపత్రమును అందించి రెండవ పేరాలోని మూడు ప్రశ్నలవైపు అవధానాన్ని మరల్చండి. తరువాత కరపత్రంలో చెప్పిన విధంగా మునుపు ఒక లోకము ఎలా అంతమైంది మరియు ఇప్పుడున్నది కూడా ఎలా అంతమౌతుందో చూపించండి. దర్శనము ముగించునప్పుడు, లోకాంతము దగ్గరలో ఉన్నదను బైబిలు రుజువును పరిశీలించుటకు ఇంకొక దర్శనము కొరకు ఏర్పాటు చేసుకొనండి.
14 పనిచేసే చోటు లేక పాఠశాల వంటి ప్రాంతంలో ఇతరులతో రాజ్య సువార్తను మనం చాలా క్లుప్తంగా పంచుకునే పరిస్థితిలో ఉన్నామని మనము కనుగొంటాము. మీ ఉద్యోగ స్థలములో, ప్రభుత్వాలను గూర్చి ఈమధ్య వార్తలలోని విషయము చర్చకురావచ్చు. ప్రపంచ నాయకులు ఎన్నో ప్రయత్నాలు మంచి ఉద్దేశాలతో చేసినా, చరిత్రంతటిలో ప్రపంచం భయానకంగా కష్టపడవలసి వచ్చిందని మీరు ఒప్పుకొనవచ్చు. హూ రియల్లీ రూల్స్ ది వరల్డ్? అను కరపత్రమందలి రెండవ పేజీలోని క్రింది పేరాను సూచించవచ్చు. ఆలోచనను పురికొల్పు మూడు ప్రశ్నలను చదవండి. క్లుప్త సంభాషణకు సమయము లేకపోతే, ఆ వ్యక్తికి (లేక వ్యక్తులకు) కరపత్రమును ఇచ్చి వేరే సమయము లేక వేరే స్థలంలో ఈ ప్రశ్నలను చర్చించుటకు ఏర్పాట్లు చేసుకొనండి.
15 వ్యక్తిగతంగా మరియు కుటుంబాలుగా, ఈ విభిన్న కరపత్రాలను ఒక్కొక్క దానిని ఏలా అందించాలో గమనించుటకు సమయాన్ని తీసుకొనండి. సిద్ధపాటు కూటాలను నిర్వహించండి. ఈ నెల క్షేత్రసేవలో అందించవలసిన ప్రచురణలతో కరపత్రములను మీరెలా ఉపయోగించగలరు? కొన్ని కరపత్రములను మీ వెంట తీసుకొనివెళ్లగల ఏర్పాట్లు ఇంకా ఏమి ఉన్నవి? ఈ కరపత్రములు అందిస్తున్న సమయానుకూలమైన సమాచారము వలన లాభము పొందగల వారినెవరినైనా మీరు ఈ వారములో కలువబోవుచున్నారా?
16 యెహోవాపట్ల లోతైన ప్రేమ మరియు ప్రజలపట్ల శ్రద్ధ, సువార్తను తెలియజేయుటలో మనము చేయగలిగినదంతా చేయుటకు మనలను ప్రేరేపించును. కరపత్రములను క్రమముగా ఉపయోగించుట మనమట్లు చేయుటకు సహాయము చేయును. ఏడు సంవత్సరాల వయస్సుగల, ఒక బాలుడు, తన ప్రక్క ఇంటి ఆమె నూతన విధానములో ప్రవేశించునట్లు ఆమెకు సహాయము చేయదలచాడు, కావున ఆమెకు ఒక కరపత్రాన్ని ఇచ్చాడు, ఒక బైబిలు పఠనము మొదలైనది. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది కదా! కాని మన పరిచర్యలో ఈ సులభ ప్రయత్నాన్ని గుణగ్రహిస్తామా? వచ్చేసారి మనము ఎవరివద్దనైనా కరపత్రాన్ని వదలి వెళ్లినట్లైన, అది ఒక బైబిలు పఠనమునకు దారితీయవచ్చు. రాజ్య సువార్తను ప్రకటించుటకు కరపత్రములను యుక్తిగా ఉపయోగించినట్లైన, లాభకరమైన ఫలితాలను తప్పక అనుభవించవచ్చు.