దైవపరిపాలనా వార్తలు
ఇటీవల మనపని అధికారికంగా గుర్తించబడిన ఈ క్రింది దేశాలలో బైబిలు పఠన కార్యక్రమము ఎంతో ఉన్నతదశలో రిపోర్టుచేయబడింది:
అల్బేనియా: మొత్తము 99 ప్రచారకులు 210 బైబిలు పఠనాలను నిర్వహించారు.
బాల్టిక్ స్టేట్స్: ఈ దేశములు అన్ని కలిసి 2,199 మంది ప్రచారకులను, 4,632 బైబిలు పఠనాలను రిపోర్టుచేశాయి.
బల్గేరియా: 296 మంది ప్రచారకులు 657 బైబిలు పఠనములను రిపోర్టుచేశారు.
ఆఫ్రికా నుండి కూడా ప్రోత్సాహకరమైన అనేక రిపోర్టులు వచ్చాయి:
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: 1,600 మంది ప్రచారకులతో అక్టోబరులో క్రొత్త శిఖరాన్ని చేరుకున్నారు. 2,966 గృహబైబిలు పఠనములను రిపోర్టుచేశారు.
చాద్: అక్టోబరులో 345 మంది ప్రచారకులున్నారు. వారి మొత్తము 6 ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాలకు 654 మంది హాజరయ్యారు.
ర్వాండ: నవంబరులో రిపోర్టుచేసిన 1,762 మంది ప్రచారకులు 6,270 గృహబైబిలు పఠనములను నిర్వహించారు.
ఈ రిపోర్టులన్ని మనదినములలో సమకూర్చే పనిని త్వరపెట్టుదునని యెహోవా చేసిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తున్నాడనటానికి గొప్పరుజువునిస్తున్నవి.—యెషయా 60:22.