దైవపరిపాలనా వార్తలు
హయిటీ: నవంబరులో రిపోర్టుచేసిన 7,209 మంది ప్రచారకులు 14,281 బైబిలు పఠనములను నిర్వహించారు. సంఘ ప్రచారకులు సగటున ఒక్కొక్కరు 1.3 బైబిలు పఠనములను కలిగియుండిరి.
మార్టినిక్: నవంబరు మాసములో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 3,169 మంది ప్రచారకులకు చేరుకొనినది. జోన్ ఓవర్సీర్ ప్రసంగమునకు 5,046 మంది హాజరయ్యారు.
టాహితి: నవంబరు మాసములో 1,366 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాన్ని చేరుకొన్నది, 10-శాతము అభివృద్ధి.
థాయ్లాండ్: నవంబరులో క్రొత్త శిఖరంగా 1,366 మంది ప్రచారకులు రిపోర్టుచేశారు. గత సంవత్సరము ఇదే మాసముపైన 6-శాతము ఎక్కువ.
జైరీ: అనేక నగరాలలో అల్లర్లు, దోపిడీల కారణంగా అక్టోబరు నెలలో పనికి అంతరాయం కలిగింది. ఆర్థికసంబంధమైన కష్టములున్నను సువార్తను ప్రకటించుటలో సహోదరులు రద్దీగా ఉన్నారు. కిన్షాసాలో అత్యవసరంగా సహోదరులకు సహాయము చేయుటకు ఆహారము అందించు కార్యక్రమము ప్రవేశపెట్టబడింది. ఇది వారిచే ఎంతగానో మెచ్చు కొనబడింది.
సెయింట్ లూయిస్: నవంబరు మాసములో 481 మంది ప్రచారకులతో ఒక క్రొత్త శిఖరము చేరుకొనబడింది.