కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/93 పేజీ 2
  • ఏప్రిల్‌ కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఉపశీర్షికలు
  • ఏప్రిల్‌ 5తో ఆరంభమగు వారము
  • ఏప్రిల్‌ 12తో ఆరంభమగు వారము
  • ఏప్రిల్‌ 19తో ఆరంభమగు వారము
  • ఏప్రిల్‌ 26తో ఆరంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1993
km 4/93 పేజీ 2

ఏప్రిల్‌ కొరకైన సేవా కూటములు

ఏప్రిల్‌ 5తో ఆరంభమగు వారము

పాట 129 (66)

10 ని: స్థానిక ప్రకటనలు. పత్రికలలో తాజా సంచికలను పునఃసమీక్షించి, మీ ప్రాంతంలో ఎక్కువ ఆసక్తికరంగా వుండే శీర్షికలను ఉన్నతపరచండి. క్లుప్తమైన లేఖన అందింపు ప్రసంగములను ప్రదర్శించుటకు ఇద్దరు ప్రచారకులను, పెద్దవారినొకరిని, మరొక బాలున్ని ఏర్పాటుచేయండి.

15 ని: “కావలికోట—తగినవేళ ఆత్మీయాహారము.” ప్రశ్న సమాధానముల చర్చ. చందా కట్టకపోయినను, పత్రికలు తీసుకొనకపోయినను నిజంగా ఆసక్తిచూపినవారిని మరలా దర్శించే అవసరతను ప్రస్తావించండి. సంభాషించడానికి, అభిప్రాయమును వ్యక్తపరచడానికి ఇష్టపడటం, సంభాషణలో పాల్గొనటం, దయార్ధమైన స్వభావమును కనపర్చడం, బైబిలు వచనములను చదువుతుంటే వాటిని చూస్తుండటం, చర్చించడానికి మరలా రమ్మని ఆహ్వానించడం నిజమైన ఆసక్తికి నిదర్శనాలు.

20 ని: “కరపత్రములతో ఇతర సాహిత్యమును ముడిపెట్టండి.” ప్రశ్నాసమాధానములతో వివరణ. రెండు నుండి ఆరు పేరాలలో సూచించబడిన సలహాల ఆధారంగా క్లుప్తమైన అందింపు ప్రసంగాలను యిమడ్చండి.

పాట 14 (6), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 12తో ఆరంభమగు వారము

పాట 15 (119)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జ్ఞాపకార్థదిన ఆచరణ సందర్భంగా ఏవైనా చెప్పుకోదగ్గ అనుభవాలుంటే తెలియజేయండి. “మంచి సేవాధిక్యత” శీర్షికనుండి ముఖ్యాంశములను చర్చించండి. సమయము అనుమతించేకొలది ఒక స్థిరమైన పత్రికా మార్గమునేర్పరచుకొనిన ప్రచారకుని ఇంటర్‌వ్యూ చేయండి. దాన్ని ఆయన ఎలా ప్రారంభించాడు? ఇంటివారిలో ఆసక్తి కలిగించడానికి అది ఎలా సహాయపడింది తెలియపరచనివ్వండి. ప్రచారకులందరిని ఈవారాంతములో వారి ప్రాంతీయ సేవా గ్రూపులతో పనిచేయమని ప్రోత్సహించండి.

20 నిమి: “కొత్తవారు అభివృద్ధిచెందునట్లు సహాయపడండి.” ఇద్దరు లేక ముగ్గురు పుస్తకపఠన నిర్వాహకుల మధ్య చర్చ. శీర్షికలోని ఉన్నతాంశములను పునఃసమీక్షించిన తర్వాత ఆ సూచనలను స్థానికంగా అన్వయింపజేయడానికి ఏ పథకములు వేయబడుతున్నాయో వివరించండి. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరై కొత్తగా ఆసక్తిచూపువారికి మనమెట్లు సహాయపడగలము? కొత్తవారు ప్రాంతీయసేవలో పాల్గొనుటకు ఇష్టపడినట్లయిన వారినుండి ఏమి కోరబడుతుంది? గతంలో క్రమంగా భాగమువహించ నటువంటి వ్యక్తులకు సహాయంచేయడానికి ఏమిచేయవచ్చును? ప్రతినెలా అందరూ పూర్తిగా భాగంవహించేలా అందరిని ఎలా ప్రోత్సహించవచ్చును? బలముగల ప్రచారకులు ఇతరులకు సహాయంచేయడంలో ఎలా తోడ్పడగలరు?—రోమా 15:1, 2.

15 నిమి: “ది గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌ పుస్తక పఠనము” ప్రశ్నా సమాధానముల చర్చ. మే 10తో ఆరంభమయ్యేవారంలో ప్రారంభమగు ఈ పుస్తక పఠనమందు ఉత్సాహమును నెలకొల్పుము.

పాట 39 (16), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 19తో ఆరంభమగు వారము

పాట 194 (105)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి సంబంధిత ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టును, విరాళములు పంపినందుకు తెలిపిన కృతజ్ఞతలను చదవండి. లూకా 6:38 చదివి ప్రపంచవ్యాప్తమైన పనికి మద్దతుగా, అలాగే స్థానిక సంఘ అవసరతలకు ఉదారంగా తమ చేయూత నిచ్చినందుకు సంఘమును మెచ్చుకొనుము.

20 నిమి: గ్రేటెస్ట్‌ మ్యాన్‌ పుస్తకమునుండి సంఘ పుస్తక పఠనమును నిర్వహించుట. సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు నలుగురు లేక అయిదుగురు ప్రచారకుల గుంపుతో పుస్తక పఠనము ఎలా నిర్వహించబడుతుందో సంఘమునకు ప్రదర్శించి చూపును. ఈ ప్రదర్శనను ముందుగానే బాగా అభ్యాసముచేసి మన రాజ్య పరిచర్య ఈ సంచిక 8వ పేజీలోని శీర్షికలో ఇవ్వబడిన సూచనలకు అనుగుణ్యంగా దానిని నిర్వహించాలి. దీనికొరకు గ్రేటెస్ట్‌ మ్యాన్‌ పుస్తకము 11 అధ్యాయాన్ని ఉపయోగించండి. పొడవుగావున్న లేఖన భాగాలను ఒకరికంటె ఎక్కువమంది చదువగల్గునట్లు ఎలా విభాగించవచ్చునో, లేక పూర్తిగా చదవడానికి సమయము అనుమతించనప్పుడు కీలక భాగాలను ఉన్నతపరచుటకు వాటిని ఎలా ఉపయోగించవచ్చునో ప్రదర్శించండి. ఇచ్చట నిర్వహించబడే పద్ధతిని చూపడానికి నిర్వాహకుడు ప్రేక్షకులతో క్లుప్తంగా ముచ్చటించవచ్చును. ప్రేక్షకులలోనున్న వారందరూ తమ స్వంత పుస్తకములో దానిని పరిశీలిస్తుండాలి.

15 నిమి: “యెహోవా మందిరమునకు వెళ్లుదము.” ఇన్సర్ట్‌లోని 1-8 పేరాలను ప్రశ్నా సమాధానములద్వారా వివరించుట. పేరా 7లో ప్రస్తావించబడిన ప్రచురణలలోని ఉన్నతాంశములను క్లుప్తముగా పునఃసమీక్షించండి. సామర్థ్యముగల ప్రచారకుడు మనమెందుకు సంఘాలుగా వ్యవస్థీకరించబడ్డామో ఒక క్రొత్త వ్యక్తి అర్థంచేసుకొనేలా సహాయపడటాన్ని ప్రదర్శించండి. (w84 11/1 పే. 15 పేరా 6, 7) క్రైస్తవ మతసామ్రాజ్య మత కార్యక్రమాలకు మన కూటములకునున్న పరస్పర భేదాన్ని చూపే అంశాలను ఉన్నతపరచండి. బైబిలు పఠనములను నిర్వహించేవారినందరిని విద్యార్థిలో సంస్థపట్ల, దానిలో భాగమగుటపట్ల గొప్ప మెప్పును వృద్ధిచేసేలాగున ప్రతివారం క్లుప్తమైన చర్చను జరపమని ప్రోత్సహించండి.

పాట 28 (5), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 26తో ఆరంభమగు వారము

పాట 180 (100)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. ఈ నెలలో ప్రాంతీయసేవలో ఎక్కువగా పాల్గొన్న ఆయావ్యక్తులను తమ అనుభవాలు చెప్పడానికి ఆహ్వానించండి. వాటిలో సహాయపయినీరుగా చేయడం, క్రొత్త బైబిలు పఠనములను ప్రారంభించడం, లేదా జ్ఞాపకార్థదిన ఆచరణకు హాజరైన ఆసక్తిగలవారికి సహాయంచేయడం మొదలగువాటిని చేర్చవచ్చును.

15 నిమి: ప్రశ్నా భాగము. సేవాధ్యక్షుడు లేక సహాయపయినీరుగా పనిచేసిన మరొక పెద్దచే ప్రోత్సాహకరమైన చర్చ. అప్పుడప్పుడు సహాయపయినీర్లుగా సేవచేసే ఒకరు లేక ఇద్దరు ప్రచారకులను ఇంటర్‌వ్యూ చేయుము.

20 నిమి: “యెహోవా మందిరమునకు వెళ్లుదము.” ఇన్సర్ట్‌లోని 9-14 పేరాలను ప్రశ్నా సమాధానములతో చర్చించుట. పేరాలు 12, 13లలోని సలహాలను ఉపయోగిస్తూ వెనుకంజవేస్తున్న వారితో ఎలా మాట్లాడాలో ప్రచారకుడు ప్రదర్శించనివ్వండి.

పాట 127 (64), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి