కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/93 పేజీలు 3-4
  • ‘యెహోవా మందిరమునకు వెళ్లుదము’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘యెహోవా మందిరమునకు వెళ్లుదము’
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన పేరు వెనుకనున్న సంస్థకు విద్యార్థులను నడిపించండి
    మన రాజ్య పరిచర్య—1997
  • కూటాలకు హాజరయ్యేందుకు ఇతరులకు సహాయం చేయండి
    మన రాజ్య పరిచర్య—2001
  • బైబిలు విద్యార్థులను యెహోవా సంస్థవైపు నడిపించుట
    మన రాజ్య పరిచర్య—1990
  • ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 4/93 పేజీలు 3-4

‘యెహోవా మందిరమునకు వెళ్లుదము’

1 “యెహోవా మందిరమునకు వెళ్లుదమని” ఆహ్వానించబడినప్పుడు దావీదు ఎంతో ఆతురతతో అందుకు స్పందించెను. (కీర్తన 122:1) ఆలయమునకు ప్రాతినిధ్యముగానున్న యెహోవా “మందిరము” సత్యదేవుని ఆరాధించే కోరికగలవారు సమకూడే స్థలము. అది భద్రత, సమాధానముగల పరిశుద్ధ స్థలము. ప్రపంచవ్యాప్తమైన క్రైస్తవ సంఘము ఈనాడు దేవుని “మందిరము,” “సత్యమునకు స్తంభమును ఆధారమునైయున్నది.” (1 తిమోతి 3:15) రక్షణకొరకు కావలసిన ఏర్పాటులన్ని ఈ మార్గముద్వారానే అందించబడుతున్నవి. అందుకే దేవుని రాజ్యముక్రింద వాగ్దానముచేయబడిన ఆశీర్వాదములను అనుభవించాలను ఆశవున్నట్లయితే “సమస్త జనములు ప్రవాహమువలె అందులోకి రావలెను.”—యెషయా 2:2.

2 ఈ “మందిరము” 229 దేశాలలో 69,000 కంటె ఎక్కువ సంఘములను కలిగివుంది. “రమ్ము! ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అని ఆహ్వానమునందించే నలభై లక్షలకంటె ఎక్కువుగానున్న ఆసక్తిగల పనివాళ్లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యమందిరముల ద్వారములు తెరచుకొని ఉన్నవి. (ప్రక. 22:17) అనేకులు ఈ వర్తమానమును విని మెప్పుతో దీనికి ప్రతిస్పందించారు. మరికొందరు చలించబడినప్పటికీ, క్రైస్తవ సంఘముతో సహవసించి యెహోవా మందిరమునకు వచ్చినవారు కారు. అలాంటివారు కేవలము సంఘములోని ఏర్పాటులద్వారా మాత్రమే సంతృప్తిపర్చబడగల “ఆత్మీయ అవసరతను” కలిగివున్నారు. (మత్తయి 5:3, NW) ఈ విధానాంతము అతివేగముగా సమీపిస్తున్న క్లిష్టకాలములలో మనము జీవిస్తున్నాము. ఉదాసీనత, తాత్సారమైన స్వభావము చివరకు నాశనమునకు నడిపేలా జాగుచేయిస్తుంది. దేవుని సంస్థకు సన్నిహితులై దేవునికి సమీస్థులవడం ఇప్పుడు ప్రజలకు అత్యవసరం. (యాకోబు 4:8) మనమెట్లు వారికి సహాయపడగలము?

3 సంస్థవైపు ఆసక్తిని మళ్లించండి: ఆసక్తిగలవారిని మనము మొదట కలిసినప్పటినుండి వారి అవధానాన్ని మనము సంస్థవైపు మళ్లిస్తుండాలి. ఒకవేళ మనము వ్యక్తిగతంగా లేఖనములను చూపించగలిగి, మూల సిద్ధాంతములను వివరించగలిగినను అటువంటి జ్ఞానమునకు మూలము మనము కాదు. మనము నేర్చుకొన్న ప్రతిదీ సంస్థనుండి అనగా “తగినవేళ ఆహారమును” అందించే దాసుని తరగతి నుండి లభించినదే. (మత్తయి 24:45-47) క్రొత్తవారు మొదటినుండే, సత్యారాధనంటే కేవలం మనమేకాదు లేక స్థానిక సంఘమే కాదు అనేదాన్ని గ్రహించాల్సిన అవసరమున్నది. యెహోవా నడిపింపుక్రింద సంస్థీకరించబడి, దైవపరిపాలనా విధానములో నడిపించబడే ఒక ప్రపంచవ్యాప్తమైన సొసైటి ఉన్నదని వారు గుర్తించాలి.

4 మనము పొందే నడిపింపు మనకు త్రోవచూపి, బోధిస్తానని వాగ్దానముచేసిన యెహోవానుండే వస్తున్నది. (కీర్తన 32:8; యెషయా 54:13) ఈ ఉపదేశము ముఖ్యంగా మన సాహిత్యముద్వారా అందించబడుతుంది. అది ప్రాణమును రక్షించే ఉపదేశమని గుర్తించి తద్వారా సాహిత్యముయెడల ఉన్నతగౌరవమును మనము ఆసక్తిగల వ్యక్తులలో వృద్ధిచేయగలిగితే, వారు దాన్ని వెంటనే త్రోసివేయకుండా చదివి, ఆ వర్తమానమును అన్వయింపజేసుకొనుటకు ప్రయత్నిస్తారు. మనమెల్లప్పుడు ఈ సాహిత్యమును దానియెడల గౌరవమును కలిగించేరీతిలో ఉపయోగించడం, అందించడం చెయ్యాలి. కొత్తవారు సంస్థను గుణగ్రహించి, దాని ఏర్పాట్లపై ఆధారపడునట్లు ఈ సాహిత్యము బోధిస్తున్నది.

5 ఉపదేశమును క్రమముగా అందించే ప్రధాన కూటమి స్థలము ఈ ప్రాంతములో ఉందని ఆసక్తిగలవారు ఎరిగేలా చేయండి. రాజ్యమందిరం అడ్రసు, కూటముల సమయములనివ్వండి. వారు ఇంతకుముందు హాజరైన మరితర మతకూటములకు మన కూటములకు మధ్యనున్న భేదాన్ని వివరించండి. ప్రతివారు ఆహ్వానించబడుతున్నారు; చందా వసూలు లేవు, వ్యక్తిగతంగా నిధులకొరకు యాచించడం జరుగదు. నియమించబడిన పరిచారకులు కార్యక్రమములను నిర్వహిస్తున్నప్పటికి, వ్యాఖ్యానించుటద్వారా, కార్యక్రమంలో భాగం వహించడంద్వారా ప్రతిఒక్కరూ కూటములలో పాల్గొనే అవకాశమున్నది. కుటుంబములు ఆహ్వానించబడుతున్నవి; మన బైబిలు చర్చలలో పిల్లలుకూడా పాల్గొంటారు. మన పరిచారకులు ప్రత్యేకమైన దుస్తులనుగాని, అంగీలనుగాని ధరించరు. రాజ్యమందిరం మనోహరంగా అలంకరించబడుతుందేగాని క్రొవ్వొత్తులు, విగ్రహాలతో నిండివుండదు. హాజరయ్యేవారు ప్రముఖంగా స్థానిక ప్రాంతములో నివసించేవారు మాత్రమే.

6 క్రమక్రమంగా బైబిలు పఠనములవైపు ఆసక్తిని మళ్లించండి: బైబిలు పఠనముయొక్క ముఖ్య ఉద్దేశము దేవునివాక్య సత్యమును బోధించుటయే. అది విద్యార్థిలో యెహోవా సంస్థయెడల మెప్పును పెంపొందించి, అందొక భాగంగా తయారయ్యే ప్రాముఖ్యతను కూడా తెల్పాలి. యేసు, ఆయన శిష్యులు మొదటి శతాబ్దంలో చేసిన గొప్పపని నిష్కపటులైనవారిని ఆకర్షించి, అందరికొరకున్న ఒకే ఒక పరిపాలక సభ క్రింద వారిని ఐక్యపరచెను. ఎక్కువగా ప్రతిస్పందించిన ప్రాంతాలలో క్రమమైన శిక్షణ, ఉపదేశాన్నిచ్చుటకు సంఘములు ఏర్పాటుచేయబడ్డాయి. అలా సహవసించినవారు ఆత్మీయంగా బలంపొంది, శ్రమల కాలంలో సహించుటకు తగిన సహాయము పొందారు. (హెబ్రీ. 10:24, 25; 1 పేతురు 5:8-10) మనదినములలో “సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని” యెహోవా సంకల్పమైయున్నది. (ఎఫెసీ. 1:9, 10) తత్ఫలితంగా ‘ప్రపంచవ్యాప్త సహోదర సహవాసమును’ పొందగలము.—1 పేతురు 2:17, NW.

7 వారంవారం నిర్వహించే బైబిలు పఠనములో సంస్థను గుణగ్రహించి, రక్షణకొరకైన ఏర్పాట్లనుండి ప్రయోజనము పొందునట్లు వారికి సహాయముచేసే ఉద్దేశమును చేర్చాలి. సంస్థనుగూర్చి లేక అది ఎలా పనిచేస్తుందో తెలియజేసే విషయాలను చర్చించడానికి ప్రతివారం కొన్నినిమిషాలను తీసుకొనండి. ఈ విషయంలో మాట్లాడడానికి తగిన అంశాలను వాచ్‌టవర్‌ నవంబరు 1, 1984లో చూడవచ్చును. జెహోవాస్‌ విట్‌నెసెస్‌ ఇన్‌ ది ట్వంటియత్‌ సెంచురీ, జెహోవాస్‌ విట్‌నెసెస్‌—యునైటెడ్‌లీ డూయింగ్‌ గాడ్స్‌ విల్‌ వరల్డ్‌వైడ్‌ బ్రోషర్లు సంస్థ వివిధ ఆకృతులను, అవి మనకెలా ప్రయోజనకరమో తెల్పుతున్నాయి. బైబిలు విద్యార్థులు జెహోవాస్‌ విట్‌నెసెస్‌—ది ఆర్గనైజేషన్‌ బిహైండ్‌ ది నేమ్‌ వీడియోను చూచేటట్లు ఏర్పాటుచేయడంద్వారా వారు తమంతటతామే జరుగుతున్న పనిని చూసే అవకాశముంటుంది. ఇయర్‌బుక్‌ లోని కొన్నిఎంపిక చేయబడిన అనుభవాలు మన సంస్కృతికి భిన్నమైన ఇతర దేశాలలో పని ఎలా విజయవంతమౌతుందో చూపించగలవు. ఇతర ప్రచురణలను కూడా ఉపయోగించవచ్చును. కొంతకాలమైన పిమ్మట మనమెందుకు ఇంటింటికి వెళ్తామో, కూటముల ఉద్దేశమేమో, మన పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుందో, ప్రపంచవ్యాప్త పని ఎంత విస్తృతంగా వుందో క్రమక్రమంగా వివరించవచ్చును.

8 ఇతర సాక్షులతో పరిచయం కావడంకూడా క్రొత్తవారిపై పురికొల్పే ప్రభావాన్ని కలిగియుండగలదు. సంఘాన్నిగూర్చిన వారి ఉద్దేశమును విశాలపరచగలదు. దానికొరకై అప్పుడప్పుడు ఇతర ప్రచారకులు పఠనములో కూర్చొనేందుకై వారిని ఆహ్వానించుము. సంఘములో వారికున్నటువంటి గతపరిస్థితులనే, లేక వారిలాంటి అభిలాషలేగల మరొకరితో పరిచయము కావడంకూడా మీ విద్యార్థి దృక్పథంలో ఒక నూతన రూపాన్ని కలుగజేయగలదు. వారితో పరిచయమేర్పరచుకొనుటకు బహుశా ఒకపెద్ద మీతో రావచ్చును. ప్రాంతీయకాపరినిగాని, లేక ఆయన భార్యనుగాని మీ పఠనమును దర్శించే ఏర్పాటుచేయడం నిజంగా ఆశీర్వాదకరం కాగలదు. వారి సమీపంలో నివసించే సాక్షులెవరైనా ఉంటే వారిని మీ బైబిలు విద్యార్థికి పరిచయము చేయడం సంఘ కూటములకు హాజరవడంలో ఆయనకది అదనపు ప్రోత్సాహాన్నివ్వగలదు.

9 కొత్తవారిని కూటములకు హాజరయ్యేలా ప్రోత్సహించండి: కూటములకు హాజరవడం ఎంతప్రాముఖ్యమో కొత్తవారు గుర్తించవలసిన అవసరమున్నది. వారిలో ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నించండి. కావలికోట పఠనములలో వివరించబడే శీర్షికలను సూచించండి. రాబోవు బహిరంగ ప్రసంగముల అంశములను ప్రస్తావించండి. దైవపరిపాలనా పాఠశాల, పుస్తక పఠనంలో వివరించబడే సమాచారపు ముఖ్యాంశములను వివరించండి. ఈ కూటములలో నేర్చుకొనేవాటిని మీరెలా భావిస్తున్నారో వ్యక్తపర్చండి. కూటములకు హాజరుకావలసిన అవసరతను మీరెలా తలస్తున్నారో తెలియపర్చండి. మీకు సాధ్యమైతే, రవాణా ఏర్పాటునుచేస్తానని చెప్పండి. కూటములకు ముందు ఒక ఫోనుకాల్‌ చేయడం కూడా అలా హాజరుకావడానికి అదనపు ఉత్సాహాన్నివ్వవచ్చును.

10 ఒక బైబిలు విద్యార్థి కూటమునకు వచ్చినప్పుడు అతను ఆహ్వానించబడుతున్నట్లు భావించుకొనేలా చేయండి. ఆయనను పెద్దలతో సహా, ఇతరులకు పరిచయము చేయండి. ఆయన బహిరంగ ప్రసంగమునకు హాజరైతే ప్రసంగీకునికి పరిచయం చేయండి. రాజ్యమందిరము చుట్టుప్రక్కల చూపండి. లిటరేచర్‌, మ్యాగజీన్‌ కౌంటర్లు, చందా పెట్టెలు, లైబ్రరీ, సాంవత్సరిక వచనముల ఉద్దేశాన్ని వివరించండి. రాజ్యమందిరము ఆరాధనా మందిరమేగాక, స్థానికంగా ప్రకటించేపనిని నిర్వహించడానికి కేంద్రస్థానమనికూడా వారికి తెలపండి.

11 మన కూటములు ఎలా నడిపించబడతాయో వివరించండి. మనము ఉపయోగించే ప్రచురణలను విద్యార్థికి చూపండి. బైబిలు మన మూల పాఠ్యపుస్తకమని సూచించండి. చిన్నపిల్లలతో సహా ప్రతిఒక్కరూ పాల్గొనవచ్చును. ఆరాధనలో ఉపయోగించడానికి మన కీర్తన పుస్తకములోని గీతములు, సంగీతము యెహోవాసాక్షులే సమకూర్చారని వివరించండి. హాజరయ్యేవారు విభిన్న సంస్కృతులనుండి వచ్చినవారని వివరించండి. స్నేహము, ఆతిథ్యము మొదలగు వాటిని గూర్చి అనుకూలమైన వ్యాఖ్యానములు చేయండి. దయ మరియు నిష్కపటముతోకూడిన ఈ విధమైన శ్రద్ధ విద్యార్థి మరలా రావడానికి ప్రోత్సహించే ఒక ప్రాముఖ్యమైన సంగతికాగలదు.

12 ఎందుకు కొంతమంది వెనుకాడుతుండవచ్చు: కొన్నిసార్లు, మీరు చేసే ప్రయత్నాలెన్ని ఉన్నప్పటికీ సంస్థతో సన్నిహితులు కావడానికి వెనుకాడేవారు ఉంటారు. వారిని వెంటనే విడిచిపెట్టవద్దు. నిన్నునీవు వారి స్థానంలో పెట్టుకొని చూడుము. ఇప్పటివరకు కేవలం ప్రత్యేక సందర్భాలలో తప్ప మతసంబంధమైన కార్యక్రమాలకు హాజరయ్యే అలవాటు వారికి ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులు లేక సన్నిహిత స్నేహితులు వారిపై ఒత్తిడి తెస్తుండవచ్చు. అవహేళనచేసే పొరుగువారి మాటలనుబట్టి వారు వెనుకాడుతుండవచ్చు. లేక వారు సాంఘికసంబంధమైన లేదా వినోదసంబంధమైన విభిన్న వాటివలన పరధ్యానులై ప్రక్కకు లాగబడుతుండవచ్చును. వారికి ఇవి అధిగమించలేని భారమైనవిగా కన్పిస్తుండవచ్చును; అట్టివారికి మీరు విషయాలను సరియైన దృష్టితో దృష్టించులాగున, “శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగు” టకు సహాయముచేయవలసి ఉన్నది.—ఫిలిప్పీ. 1:10.

13 పట్టుదలతో కృషిసల్పుటకు తగిన లేఖన కారణములనివ్వండి. మనందరం సహవాసంగా కూడుటనుబట్టి పొందే ప్రోత్సాహము, ఆత్మీయ బలం మనందరికి అత్యవసరము అనేదాన్ని నొక్కి తెలియపరచండి. (రోమా. 1:11, 12) వెనుకబడిపోవడానికి కుటుంబ వ్యతిరేకత సరైన కారణముకాదని యేసు స్పష్టపరచెను. (మత్తయి 10:34-39) యేసు శిష్యులని బహిరంగంగా గుర్తించబడుటకు సిగ్గుపడనక్కరలేదని పౌలు ఉద్బోధించాడు. (2 తిమోతి 1:8, 12-14) వ్యక్తిగతకార్యాలను, పరధ్యానములను అదుపుచేసుకోవాలి. లేకపోతే అవి ఉరికాగలవు. (లూకా 21:34-36) యెహోవా ఆశీర్వాదమునకు పాత్రులు కాగోరువారు పూర్ణహృదయముతో ఉండాల్సిందేగాని, అర్థహృదయముగలవారుగా ఉండుటకు వీల్లేదు. (కొలొస్స. 3:23, 24) అలాంటి బైబిలు సూత్రములయెడల మెప్పును కలుగజేయుట వారు ఆత్మీయముగా అభివృద్ధిచెందడానికి మార్గం తెరవగలదు.

14 తలుపులు తెరవబడియున్నవి: యెహోవాయొక్క సత్యారాధన మందిరము ఇతరవాటన్నిటికంటె ఎంతో ఉన్నతముగా హెచ్చింపబడియున్నది. “దేవుని మందిరమునకు . . . యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును” అను ఆహ్వానము 229 దేశములలో ప్రతిధ్వనిస్తుంది. (యెషయా 2:3) క్రొత్తవారు చూపించే అనుకూలమైన ప్రతిస్పందన వారి ప్రాణమును కాపాడగలదు. వారి ఆసక్తిని యెహోవా సంస్థవైపు మళ్లించడం మనము వారికి సహాయంచేయగల శ్రేష్ఠమైన మార్గములలో ఒకటి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి