సువార్తనందించుట—ఒక కుటుంబముగా
1 పరిశుద్ధసేవలో పూర్తిగా పాల్గొనియున్న ఒక సమర్పించుకొనిన కుటుంబము—తండ్రి, తల్లి, పిల్లలు పూర్ణాత్మతో దేవుని సేవించుట—యెహోవా దేవుని గొప్ప నామమునకు స్తుతియైయున్నది. అట్టి అనేక కుటుంబములు భూవ్యాప్తముగాయున్న యెహోవా ప్రజల సంఘములలో కనుగొనబడుచున్నందుకు మనము సంతోషిస్తున్నాము.
2 అయినను, తన కుటుంబముయొక్క ఆత్మీయ అవసరములను తీర్పు మొదటి బాధ్యతను తండ్రి కలిగియున్నాడు. (1 కొరిం. 11:3) తన భార్య మరియు పిల్లల సహకారముతో ఆయన కుటుంబము ఇతరులపై బలమైన ప్రభావమును చూపగలదు. (మత్త. 5:16) ఈ సహకారమును చూపగల కొన్ని ప్రాంతములేవి?
తలిదండ్రులారా నాయకత్వము వహించుడి
3 అనేక సందర్భాలలో తండ్రి పెద్ద, లేక పరిచారకుడై యుండవచ్చును. అనగా తన కుటుంబ శ్రద్ధలతోపాటు తన సమయము, అవధానములలో కొంత సంఘవిషయములకు వెళ్లవలసియున్నదని దీని భావము. తన కుటుంబము నిర్లక్ష్యపరచబడకుండునట్లు తనకు లభించు సమయమును వారికి కేటాయించుకొనునట్లు చూచుట తండ్రి బాధ్యతైయున్నది. తన పరిమితమైన సమయములో తనను గట్టిగా కోరు విషయములనుబట్టి ఇది ఎప్పుడు సులభమైనదైయుండకపోవచ్చును. అయితే ఆయన కుటుంబము తన ముఖ్య బాధ్యత గనుక కుటుంబముతోపాటు పఠనమందును, ప్రాంతీయసేవయందును, కూటములందును, తగిన వినోదమందును విలువైన తన సమయమును ఇతర బాధ్యతలు ఒక సమయమున తండ్రి కార్యక్రమ పట్టికను మార్చవచ్చును. అయితే, ప్రతి నెలలో ప్రాంతీయ సేవలో తన కుటుంబ సభ్యులతో గడపగలిగిన అది ఎంతటి ప్రతిఫలదాయకము!
4 భార్యనుండి సహకారము ముఖ్యము. పరిచర్యలో పిల్లలకు శిక్షణనిచ్చుటద్వారా తన భర్తకు అతి ప్రాముఖ్యమైన మార్గములో సహాయకారిగానుండగలదు. ఆమె మాదిరికరమైన ఆసక్తి మరియు భక్తి, పిల్లలు పరిచర్యయందలి మెప్పులో పెరుగుటకు ఎంతో ప్రభావమును కలిగియుండును.—2 తిమో. 3:14, 15.
5 ఒంటరియైన తండ్రి లేక తల్లి బాధ్యతతో కూడిన ఈ ఆత్మీయభారమును మోయుచు పరిచర్యలో విజయవంతముగా తమ పిల్లలకు తర్ఫీదునిచ్చిన మాదిరికర పరిస్థితులు అనేకము కలవు. తండ్రి లేక తల్లియొక్క శ్రేష్టమైన మాదిరివలన అనేకమంది యవనులు సత్యము కొరకు స్థిరమైన స్థానమును చేపట్టి, చివరకు పూర్తికాల పరిచర్యను కూడా తీసుకొనిరి.
పిల్లల బాధ్యత
6 పిల్లలయొక్క బాధ్యత విషయమేమి? దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసు సహితము, యింకా చిన్న పిల్లవానిగా యున్నప్పుడే తన తల్లిదండ్రులయొక్క ఉపదేశమునకును, నడిపింపునకును లోబడియుండెను. (లూకా 2:51) కాబట్టి తండ్రి మరియు తల్లి తమ సమయమును అందరు కలిసి పరిచర్యలో గడుపునట్లు ఏర్పాటు చేసినట్లయిన వారి తల్లిదండ్రులకు సహకరించుట ద్వారా తమ దైవభక్తిని ప్రదర్శించుట పిల్లల కర్తవ్యమైయున్నది.—ఎఫెసి. 6:1-3.
7 కుటుంబముగా కలసి ఆరాధించుట అనగా—పఠించుట, ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుట, కూటములకు హాజరగుట కుటుంబ వలయములో ప్రేమబంధములను, ఐక్యతను బలపరచును. ఈ విషయములో తల్లిదండ్రులు మరియు పిల్లలు బాధ్యతను పంచుకొందురు.