ప్రశ్నా భాగము
• బాప్తిస్మమునకు అంగీకరించబడుటకు ముందు ఒక బాప్తిస్మము పొందని ప్రచారకుడు ఎంతమేరకు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనియుండవలెను?
బాప్తిస్మము పొందని ప్రచారకునిగా అర్హుడైన వ్యక్తి అప్పటికే యెహోవాసాక్షిగా యుండవలెనను తన బలమైన కోరికను అనేక విధములుగా ప్రదర్శించియున్నాడు. (కీర్త. 110:3) పట్టుదలతో కూడిన లేఖనముల పరిశోధన తన ఆలోచనయందు, దృక్పధమునందు, జీవితవిధానమందు మార్పును తీసుకొచ్చినది. యెహోవాను సంతోషపెట్టి ఆయన చిత్తము చేయవలెనను హృదయ పూర్వక కోరికనుండి వచ్చినవాడై, అట్టి గంభీరమైన బైబిలు విద్యార్థి యెహోవా ప్రజలతో సంఘకూటములందును, అసెంబ్లీలందును, సమావేశములందును క్రమముగా సహవసించును. (హెబ్రీ. 10:24, 25) అలాంటి క్రైస్తవ కూటములందు హాజరగుటతోపాటు, చాలావరకు కూటములయందు వ్యాఖ్యానించుట ద్వారా తన విశ్వాసమునుగూర్చి బహిరంగప్రకటన చేయుటకు హృదయమునుండి కదలింపబడియున్నాడు. మరియు బహుశ, దైవపరిపాలనా పాఠశాలయందును పాల్గొనియుంటాడు.—కీర్త. 40:9, 10; ఓయం. పే. 73.
ఒకసారి బైబిలు విద్యార్థి సత్యమును హత్తుకొని రాజ్యవర్తమాన విలువను తాను నిజముగా మెచ్చుకొనుచున్నానని చూపునప్పుడు ఇంటింటి పరిచర్యయందు పాల్గొను అధిక్యతను తాను కలిగియుండవచ్చును. ఇది యెహోవాసాక్షుల ముఖ్యమైన పనియైయున్నది. (మత్త. 24:14; 28:19, 20; ఓయం. పే. 111) ఈ విషయమందు పఠనముచేయు ప్రచారకుడును, పెద్దలను విద్యార్థి జీవితమంతయు బైబిలు సూత్రములకు అనుగుణ్యముగా ఉన్నదని నిశ్చయపరచుకొనవలసిన గంభీరమైన బాధ్యతను కలిగియున్నారు. యెహోవాసాక్షులలో ఒకరిగా యుండవలెనను నిజమైన కోరికను తాను కలిగియుండి రాజ్యప్రకటన మరియు శిష్యులను తయారుచేయుపనిలో భాగము వహించు అధికత్యను మెచ్చుకొనవలసియున్నాడు.—గల. 6:6; వా88 11/15 పే. 17; ఓయం. పేజీలు 98-9, 174.
ఒక బైబిలు విద్యార్థి మనతో పరిచర్యలో పాల్గొనుటకు అర్హుడైనప్పటినుండి తాను నీటి బాప్తిస్మమునకు తననుతాను అప్పగించుకొనగలుగునప్పటికి దీర్ఘకాలము పట్టనవసరములేదు. ఇప్పటికి తన జీవితము క్రైస్తవ సూత్రములకు పూర్ణ అనుగుణ్యతను కలిగియున్నది. అయితే ఆయనకు బహిరంగ పరిచర్యలో అనుభవము లోపించియున్నది. ప్రాంతీయ పరిచర్యలో ఆయన క్రమమైన మరియు ఆసక్తితో కూడిన భాగము వహించుటకు స్థిరముగా తీర్మానించుకొనియున్నాడని ప్రదర్శించుటకు తగినంత సమయమును యివ్వబడవలసియున్నాడు.—కీర్త. 40:8; రోమా. 10:9, 10, 14, 15.
ఒక వ్యక్తి బాప్తిస్మమునకు సిద్ధమౌనప్పటికి, చాలా మట్టుకు తాను ఇతరులతో సువార్తను క్రమముగా పంచుకొనుచు ప్రతి నెల ఒకటి లేక రెండు గంటల కంటె ఎక్కువగా ప్రాంతీయ సేవలో గడుపుచుండును. (వా84 6/1 పే. 8 పేరా) అయినను వయస్సు, తనకున్న స్థితి, పరిమితులు మొదలగు వాటిని పరిగణనలోనికి తీసుకొంటూ బాప్తిస్మమును కోరు ప్రతివారి వ్యక్తిగత పరిస్థితులు పునఃసమీక్షించబడవలెను. పెద్దలు అవర్ మినిస్ట్రీ పుస్తకము 175వ పేజీలో వారికివ్వబడిన ఇట్టి నడిపింపుచే నడవబడవలెనని కోరుకొందురు: “బైబిలు యొక్క ప్రాథమిక సత్యములను గ్రహించుకొని ఎవరి హృదయములు యెహోవా తట్టు తిరిగియున్నవో అట్టివారిపైన మా ఆసక్తియున్నది. మీ ప్రేమగల సహాయమువలన ఈ ప్రాముఖ్యమైన పనిని నెరవేర్చుటకు తగినట్లుగా సిద్ధపడినవారై క్రైస్తవ పరిచర్యలో ప్రవేశించుటకు బాప్తిస్మము పొందువారు ప్రోత్సహించబడి సహాయము చేయబడుదురు.”—మత్త. 16:24; యోహా. 4:34; 1 పేతు. 2:21.