కుటుంబ సహకారము ప్రయోజనములను తెచ్చును
1 మానవ వ్యవస్థలన్నిటిలో కెల్లా కుటుంబ వ్యవస్థ (ఫామిలీ యూనిట్) మిక్కిలి పురాతనమైనది. “పరలోకమునందును, భూమి మీదను ఉన్న “ప్రతికుటుంబము” ఆయన నామమునుబట్టి కుటుంబమని పిలువ”బడుచున్నందున అది యెహోవాకును ప్రశస్తమైనది.—ఎఫెసీ. 3:15.
2 బైబిలు కాలములో కుటుంబమంతయు పూర్తిగా దైవపరిపాలనా క్రింద యుండునట్లు చూచు బాధ్యతను ముఖ్యముగా తండ్రి కలిగియున్నాడు. అయితే నేడును విషయము అంతే. (యెహోషు. 24:15; ఎఫెసీ. 6:1-4) కుటుంబమునకు అవసరమైన అన్ని విషయములను గూర్చి శ్రద్ధ తీసుకొనుట ఒక సవాలై యున్నది. అయితే ఇది ఎట్లు నెరవేర్చబడవచ్చును? కుటుంబ సహకారము మరియు వ్యవస్థీకరణ ద్వారానే ఇది సాధ్యము.
శిరస్సుగా, నాయకత్వము తీసుకొనుము
3 అందరియొక్క ఆత్మీయత ముఖ్యముగా శ్రద్ధవహించవలసిన విషయము. కుటుంబ పఠనము క్రమముగా జరుపబడుతూ కుటుంబ అవసరతలకు తగినట్లు మలచబడునదై యుండవలెను. ఇది దినవచనము చర్చించు విషయములోను నిజమై యుండవలయును. దేవుని వాక్య చర్చతో దినమును ప్రారంభించుట ఎంత శ్రేష్టకరమైన విషయము! దినమంతయు ఆ వచనమును ధ్యానించుట యనునది “పవిత్రమైన వాటిని, రమ్యమైనవాటిని, ఖ్యాతి గలవాటిని” తలంచుకొనుచుండుటకు మనకు సహాయము చేయును. (ఫిలిప్పీ. 4:8) ఈ విషయంలో మీరు అభివృద్ధిని సాధించగలరా?
4 కుటుంబ పఠనమునకు తోడుగా, వ్యక్తిగత పఠన కార్యక్రమము ప్రాముఖ్యము. యెహోషువ 1:8 యందలి మాటలు అంతే బలముతో మనలోని ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా అన్వయించుము: “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్థిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.”
5 సంఘ కూటములకు సరిగ్గా సమయానికి రావటము ఒక సవాలు. దీనికి కూడా సహకారము అవసరము. కుటుంబ శిరస్సు నుండి వచ్చు నడిపింపు, అవసరమైన విషయంలో (చోట) సహాయము అందించబడునట్లు చేయును. ఇది అందరు సరియైన సమయంలో వచ్చి ప్రారంభపాట మరియు ప్రార్థనలో భాగము వహించుటకు తోడ్పడును.
6 కుటుంబ ఏర్పాటు యొక్క ఐక్యతకు వ్యతిరేకముగా పనిచేయు అనేక మూలాంశములున్నందున, కుటుంబ శిరస్సు ప్రార్థనలో నాయకత్వము తీసుకొనుట చాలా ముఖ్యము. (2 తిమో. 3:1-5) ఎందుకనగా రోమీయులు 12:12 లో “ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి” అని పౌలు హెచ్చరించుచున్నాడు. దీనిని క్రమమైన పద్ధతిలో చేయుట కుటుంబమును బలముగా, కలసికట్టుగా యుంచుటకు సహాయము చేయగలదు. అయితే ఈ ప్రార్థన కుటుంబసభ్యులు వ్యక్తిగతముగా చేసుకొను ప్రార్థనలతోపాటు అదనముగా ఉండవలెను.
సిద్ధపడుము
7 యెహోవాకు మనము చేయు ఆరాధనలో ఆయన నామమును తెలియపరచుటయు యిమిడివున్నది. కుటుంబములో అభ్యాసము చేయు కార్యక్రమ భాగాలు పరిచర్యకు అందరు సిద్ధపడుటకు సహాయము చేయును. దానికి మనము ఉపయోగించగల శ్రేష్టమైన సాధనము రీజనింగ్ పుస్తకము. అందులోని 9-15 పేజీలలోగల ఉపోద్ఘాతములను మన సంభాషణా అంశమునకు సహాయకరముగా ఎన్నుకొనవచ్చును. ఈ విషయంలో అభివృద్ధిని చేసుకొనుటకు తగిన సలహాలను కుటుంబ శిరస్సు యివ్వవచ్చును.
8 కుటుంబములోని ఒకరు లేక ఎక్కువమంది పూర్తికాల సేవలో ఉండుటకు సాధ్యమవుతుందా? (1 కొరిం. 16:9) దీనికి కుటుంబములోని వారందరి యొక్క సహకారము, వ్యవస్థీకరణ అవసరము. తమ జీవిత విధానాన్ని సామాన్యమైనదానిగా చేసుకొని, కావలసిన వాటిని తాము అందించువారలుగా యుండుట ద్వారా అనేక కుటుంబములు ఈ సంతోషమును మరియు ఆధిక్యతను కలిగియున్నవి.
9 తండ్రి లేక కుటుంబ శిరస్సు నాయకత్వము తీసుకొనవలసియున్నప్పటికిని, కుటుంబములోని ప్రతిసభ్యుడు ఆ కుటుంబమునకు యెహోవా ఆరాధనలో సహాయపడుటకు తాము వ్యక్తిగతంగా బాధ్యులమై యున్నామని గుర్తించుకొనవలసిన అవసరమున్నది. అందరి శ్రద్ధల విషయమును గూర్చి చూచుట యనునది సంతోషకరమైన మరియు ఐక్యతగల కుటుంబమును తయారు చేయును.