సాక్ష్యమిచ్చుటకు ప్రతి అవకాశమును దృఢముగా చేబట్టుము—1వ భాగము
1 హెబ్రీ క్రైస్తవులకు వ్రాయునపుడు అపొస్తలుడైన పౌలు ఇట్లు ప్రోత్సహించెను: “ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీ. 13:15) దీనిని నెరవేర్చు ఒక మార్గము, సంఘము యొక్క ప్రాంతీయ సేవా ఏర్పాట్లకు క్రమముగా మద్దతునిచ్చుట. దేవునికి స్తుతియాగము నర్పించు మరొక మంచి మార్గము. యాదృచ్చికంగా సాక్ష్యమిచ్చు ప్రతి అవకాశమును తీసికొనుట.
2 మన అనుదిన చర్యలలో మనలో అనేకమంది ఇతరులను కలియుదురు. ఆ అవకాశములను గ్రహించి, ప్రయత్నించినట్లయిన రాజ్యవిత్తములననేకమైనవి విత్తిన వారమగుదుము. అది, ఒక సాక్ష్యమునకు దారితీయు సంభాషణను ప్రారంభించుటకు కేవలం, లోక పరిస్థితులు లేక స్థానిక సమస్యలపై క్లుప్తమైన వ్యాఖ్యానము లేక ప్రశ్న చాలును. పరిస్థితులు మరియు ఆ వ్యక్తి యొక్క ప్రక్రియను బట్టి మనము సాహిత్యమును కూడ అందించవచ్చు.
సిద్ధపడి యుండుము
3 యాదృశ్చికంగా సాక్ష్యమిచ్చుటకు ముందు సిద్ధపాటు అవసరము. అట్లు ప్రయత్నించుటకు ఇష్టపడుచున్నామా? ఒక దినమంతటిలో మనమేమి చేయుచున్నామో పరిశీలించినట్లయిన, మనతో కలియు ప్రజలను గూర్చి ఆలోచించినట్లయిన మరియు ఒక సంభాషణను ప్రారంభించుటకు మనమేమి చెప్పవచ్చునో ధ్యానించిన యెడల మనము మానసికముగా సిద్ధపడి యాదృశ్చికంగా సాక్ష్యమిచ్చుటకు సులభముగా నుండును. వినువారికి అందించుటకై కరపత్రములను మాగజీన్లను మరియు ఇతర సాహిత్యములను సిద్ధముగా నీ వద్ద ఉంచుకొనుము. ఒక బైబిల్ విషయమేమి? ఒక పాకెట్ సైజ్ బైబిల్ తేలికగా ఒక పర్స్లోను లేక ఒక కోటు జేబులో తేలికగా పట్టును. అవకాశమున్నప్పుడు దానిని ఉపయోగించవచ్చు. బాగుగా సిద్ధపడుటకు మనము చేయునది ఇంకను ఉన్నదా? బైబిల్ ప్రవచనములకు సంబంధించిన తాజా వార్తలను సంఘటనలను తెలిసికొంటూ ఉండవలెను. మరియు సత్యమును ప్రేమించు ప్రజలనాకర్షించు సంభాషించు బైబిల్ అంశములను పరిచయము చేయుటకు సిద్ధపడుము. “ఈ విషయములో” “వాచింగ్ ది వర్లడ్” మరియు “ఇన్సైట్ ఆన్ ది న్యూస్” అను మాగజీన్లలోని ఆర్టికల్స్ మనకు సహాయపడును. మన మనస్సులో అట్టి వార్తలనుంచుకొంటే, ఒక విషయమును చక్కగా పరిచయము చేయుటకు నమ్మకమును కలిగియుందుము.
ప్రారంభించుటకు శ్రద్ధ తీసికొనుము
4 ఏ సందర్భములోనైనను మనకు తారసపడు ప్రజలకు సాక్ష్యమిచ్చుటకు అవకాశము లభించును. ఆసుపత్రిలో చేరిన సువార్తికులు కూడ, డాక్టర్లతో, నర్సులతో, ఆసుపత్రి పనివారితో, సందర్శించు వారితో మరియు ఇతర రోగులతో సత్యమును గూర్చి మాట్లాడు అవకాశములను తీసికొనిరి. ఇతర సువార్తికులు తాము పనిచేయుచోట లేక పాఠశాల వద్ద భోజనము చేయు విశ్రాంతి సమయమును లేక ఏ పనిని గురించియైనను వేచి యుండవలసిన సమయమును ఉపయోగించెదరు. ఒక సాక్ష్యమునిచ్చు అవకాశము బజారు చేయునప్పుడు, శెలవులలోనున్నప్పుడు లేక బస్సు, విమానము లేక రైలు యందు ప్రయాణము చేయునపుడు లభించును. కొంత మంది సువార్తికులు, తమ యింటి వద్దకే వచ్చు అమ్మకపు దారులకు, సరుకు దించువారికి, పొరుగువారికి, బంధువులకు మరియు తమను దర్శించు ఇతరులకు ఎంతో విజయవంతముగా సాక్ష్యమిచ్చెదరు.—1970 యియర్ బుక్, పేజి. 97-8, 231-2 మరియు 263-4 చూడుము.
5 “దైవ భక్తి” జిల్లా సమావేశములు, యాదృశ్చిక సాక్ష్యము నందించుటకు మంచి అవకాశములనిచ్చును. మనము ధరించు లేపెల్ కార్టులు, కొన్నిసార్లు ఇతరులు, మనమెవరము, ఎక్కడికి వెళ్లుచున్నాము అని ప్రశ్నించునట్లు మరియు ఎందుకు హాజరగుచున్నామో వివరించుటద్వారా సంభాషణ ప్రారంభించవచ్చు. మనము పెట్రోల్ కొరకు ఆగినపుడు, హోటల్లో భుజించునప్పుడు, బజార్కి వెళ్లునప్పుడు లేక కేవలం విహారం చేయుచున్నప్పుడు యాదృశ్చికంగా సాక్ష్యమిచ్చు మార్గమును వెదకవలెను.—ప్రసం. 11:6.
6 సత్యము యెడల హృదయ పూర్వకమైన మెప్పు మరియు మన కాలము యొక్క అత్యవసర పరిస్థితి, మనము కలిగియున్న అద్భుతమైన నిరీక్షణను గూర్చి ఇతరులతో మాట్లాడుటకు ప్రేరేపింపవలెను. యాదృశ్చిక సాక్ష్యము ద్వారా రాజ్య సత్యమను విత్తనములను విత్తుటకు ప్రతి అవకాశమును తీసికొందముగాక.—మత్త. 24:14.