తటస్థసాక్ష్యమిచ్చుటలో మీరు పాల్గొందురా?
1 మనజీవిత అనుదిన క్రమములో యెహోవానుగూర్చి ప్రజలతో మాట్లాడుటకు నిర్థిష్ట సమయాలను కలిగియున్నాము. ఒక పథకము ప్రకారము ఇంటింటి సాక్ష్యమిచ్చుటకు, పునర్దర్శనములను చేయుటకు బైబిలు పఠనములను నిర్వహించుటకు సమయమును ప్రత్యేకపరచుకొందుము. అయితే మనము ప్రజలతో సత్యమునుగూర్చి మాట్లాడగల తలంచని సందర్భములు అనేకముంటాయి. ఇటువంటి ప్రకటన పనినే మనము తటస్థసాక్ష్యమంటాము.
2 కొంతమంది ప్రచారకులు ఈ రకమైన పరిచర్యలో పాల్గొను అనేక అవకాశములను కనుగొంటారు. సమావేశములకు వెళ్లి, తిరిగివచ్చు ప్రయాణములందు, సెలవులు తీసుకున్నప్పుడు, బంధువులను దర్శించు సందర్భములలో ఇలా సాక్ష్యమిచ్చుటకు మనమందరము మెలకువగా ఉండుటకు ప్రయత్నించవచ్చును. అలా లభించు సందర్భములను మీరు తటస్థ సాక్ష్యమిచ్చుటకు ఉపయోగించుకుంటారా?
3 ముందుగా పథకములు వేసికొనండి: సిద్ధపాటు, ముందు ఆలోచన అనేవి మనం సమర్థవంతంగా తటస్థసాక్ష్యమిచ్చుటకు సహాయముచేయును. మనము ఇలా చేయుటకు సహాయకరంగా వివిధ ప్రచురణలున్నవి. ది వాచ్‌టవర్ మరియు అవేక్! లతోపాటు ఆసక్తిని పెంపొందించుకొనుటకు ఆలోచింపజేసే అనేక ముఖ్యాంశములతో కూడిన కరపత్రములు ఉన్నవి. వివిధ సంస్కృతులు, మతాలుగల ప్రజలకు ఆసక్తికరంగా వుండే బ్రోషూరులున్నవి. ప్రస్తుత సమయంలో ఆసక్తికరంగావుండే అంశాలను వివరించే పాకెట్-సైజ్ పుస్తకాలున్నవి. వీటిలో ఏ ప్రచురణలు ఉపయోగించుటకు అనుకూలంగా ఉంటాయని మీరు భావిస్తారు? కుటుంబ సమేతంగా దీనిని ఆలోచించండి. ఆ తరువాత సరైన సందర్భము వచ్చినప్పుడు మీరు చెప్పబోయే విషయాన్ని అభ్యాసం చేయండి.
4 సెలవులలో ఉన్నప్పుడు: సెలవులో ఉన్నప్పుడు తటస్థసాక్ష్యమిచ్చుటకు మంచి అనుకూలముండును. విమానము, ట్రెన్, లేక బస్సులో ప్రయాణించే పథకం మీరు వేసికొనుచున్నారా? ఆలాగైన మీతోకూడ బైబిలును, పైన చెప్పబడిన ప్రచురణలలో ఒకదానిని తీసుకెళ్లండి. అలా ప్రజారవాణాల ద్వారా ప్రయాణం చేసేటప్పుడు అలాంటి ప్రచురణలను చదవటం సంభాషణను ప్రారంభించుటకు అవకాశాన్నిస్తుంది. మీరు మోటారు వాహనంద్వారా ప్రయాణం చేస్తుండగా ఇంధనం నింపుకొనుటకు ఆగినచోట, రెస్టారెంటువద్ద లేక హోటల్లో ఉంటున్నప్పుడూ ఏమి చెప్పవచ్చునో ఆలోచించండి. అలాంటి సందర్భాలలో ఆసక్తిగలవారికి అందించటానికి కొన్ని కరపత్రములను దగ్గర ఉంచుకొనవచ్చును. మీరు మార్గమధ్యలో ఏదైన చూడదగిన మనోహర దృశ్యం దగ్గర ఆగినప్పుడు, అక్కడున్న ఒకరిని ఇలా అడుగుట ద్వారా సాక్ష్యాన్ని ప్రారంభించవచ్చును. “దీని మాదిరే భూమి అంతా కనబడితే ఎంత బాగుంటుంది?” ఒక అందమైన సముద్రపు ఒడ్డున లేక పార్కులో ఉన్నప్పుడూ అలాంటి ఉపోద్ఘాతాన్నే ఉపయోగించవచ్చును.
5 జిల్లాసమావేశము దగ్గర: జిల్లాసమావేశమప్పుడును తటస్థసాక్ష్యమిచ్చుటకు మనకు సందర్భాలు ఉంటాయి. రహదారి బంగ్లా లేక హోటల్ ఉద్యోగస్థులతో, లేక వీధులలో లేక బస్సులు నిలిచే స్థలాల్లో ప్రజలతో మాట్లాడుటలో అనేకులు విజయము సాధించారు. సమావేశసమయంలో బ్యాడ్జిని విధిగా ధరించండి. తద్వారా స్థానిక రెస్టారెంటులు, దుకాణముల వారిని మీరు సంభాషణకు ప్రోత్సహించవచ్చును. బహుశా ప్రజలే మీ బ్యాడ్జి ఏమి సూచిస్తుందని మిమ్ములనడుగవచ్చును. ఇది మంచి సాక్ష్యమిచ్చుటకు నడుపుతుంది.
5 రాబోవు నెలలు మనకు విశ్రాంతి, విరామములను అందించవచ్చును. కానీ తటస్థసాక్ష్యమిచ్చుటకు మనకున్న అవకాశములను అలక్ష్యం చేయకుందము. ఈ రకమైన ప్రకటన ఫలవంతమైనది మరియు యెహోవా సేవకులు ఇందు పాల్గొనాలి. యేసువలెనే, తోటిమానవులయెడలగల మనకున్న ప్రేమ యుక్తమైన ప్రతి సందర్భంలోను ధైర్యముగా మాట్లాడుటకు మనలను పురికొల్పనిద్దామా!—మత్త. 5:14-16.