కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/1 పేజీలు 24-28
  • “దేవుడు ఉల్లాసంతో ఇచ్చేవాణ్ణి ప్రేమిస్తాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుడు ఉల్లాసంతో ఇచ్చేవాణ్ణి ప్రేమిస్తాడు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అవసరమైన వారి కోసం విరాళాలను సేకరించడం
  • ఉదారంగా ఉండమని అభ్యర్థిస్తాడు
  • నేడు ఉల్లాసంగా ఇచ్చేవారు
  • ఔదార్య బాహుళ్యం ఆనందాన్ని తెస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “మీ విలువైనవాటితో యెహోవాను ఘనపరచండి”—ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • రాజ్య ప్రచారసేవకు కొందరెలా విరాళాలిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవాకు ఎందుకివ్వాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/1 పేజీలు 24-28

“దేవుడు ఉల్లాసంతో ఇచ్చేవాణ్ణి ప్రేమిస్తాడు”

యెహోవా ఔదార్యానికి మూర్తివంతమై ఉన్నాడు. వాస్తవంగానే, “శ్రేష్ఠమైన ప్రతి యూవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చేవాడు ఆయనే అని బైబిలు చెబుతుంది. (యాకోబు 1:17) ఉదాహరణకు, దేవుడు సృష్టించిన వాటిని గురించి ఆలోచించండి. ఆయన సృష్టియైన ఆహారపదార్థాలు రుచిలేనివి కాదు, చాలా రుచిగా ఉంటాయి; పువ్వులు పాలిపోయినట్లు కాక వివిధ వర్ణాల్లో ఆకర్షణీయంగా ఉంటాయి; సూర్యాస్తమయం ఆకర్షణీయత లేనివిధంగా కాక కనులవిందుగా ఉంటుంది. అవును, యెహోవా సృష్టిలోని ప్రతిదీ ఆయన ప్రేమా, ఔదార్యాలకు నిదర్శనాన్నిస్తున్నాయి. (కీర్తన 19:1, 2; 139:14) అంతేకాక, యెహోవా ఉల్లాసంగా ఇచ్చే వ్యక్తి. తన సేవకుల పక్షంగా మంచిని చేయడంలో ఆయన చాలా ఆనందిస్తాడు.—కీర్తన 84:11; 149:4.

ఒకరితోనొకరు వ్యవహరించేటప్పుడు, దేవుని ఉదార స్వభావాన్ని ప్రతిబింబించాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది. “సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీవు నిశ్చయముగా వాని కియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు” అని మోషే వాళ్ళకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 15:7, 10) ఇవ్వడమనేది హృదయం నుండి రావలసి ఉంటుంది కనుక, ఇశ్రాయేలీయులు ఉదార క్రియల్లో ఆనందించవలసి ఉండింది.

అలాంటి ఉద్బోధ క్రైస్తవులకు కూడా ఇవ్వబడింది. వాస్తవానికి, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:35) ఉల్లాసంగా ఇవ్వడంలో యేసు శిష్యులు మాదిరికరంగా ఉండేవారు. ఉదాహరణకు, యెరూషలేములో విశ్వాసులైనవారు “తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి” అని బైబిలు నివేదిస్తుంది.—అపొస్తలుల కార్యములు 2:44, 45.

కాని ఔదార్యంగల ఈ యూదాదేశస్థులు తర్వాత బీదరికంలో పడిపోయారు. వాళ్ళను ఆ పరిస్థితిలోకి తెచ్చినదేమిటో బైబిలు కచ్చితంగా చెప్పడం లేదు. అపొస్తలుల కార్యములు 11:28, 29లో పేర్కొనబడిన కరువే దానికి కారణమై ఉండవచ్చు అని కొందరు పండితులు చెబుతున్నారు. ఏమి జరిగినప్పటికీ, యూదయ క్రైస్తవులు సంకట పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ అవసరాలు తీరేలా చూడాలని పౌలు కోరుకున్నాడు. కాని ఆయన అలా ఎలా చేయగల్గేవాడు?

అవసరమైన వారి కోసం విరాళాలను సేకరించడం

పౌలు మాసిడోనియా అంత దూరాల్లో ఉన్న సంఘాల సహకారాన్ని కూడా తీసుకున్నాడు. యూదయలో బీదరికం బారినపడిన క్రైస్తవుల కోసం విరాళాల సేకరణకు ఆయన ఏర్పాటు చేశాడు. కొరింథీయులకు, “నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను”a అని పౌలు వ్రాశాడు.—1 కొరింథీయులు 16:1, 2.

యెరూషలేములో ఉన్న సహోదరులకు ఈ ఫండ్‌లను వెంటనే అందించాలని పౌలు ఉద్దేశించాడు. కొరింథీయులు పౌలు నిర్దేశాలకు తక్షణం ప్రతిస్పందించలేకపోయారు. ఎందుకని? తమ యూదయ సహోదరుల అవస్థ విషయమై వాళ్ళకు సానుభూతి కలగలేదా? అలాగని కాదు. కొరింథీయులు “ప్రతివిషయములో, అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును . . . అభివృద్ధి” పొందుతూ ఉన్నారని పౌలుకు తెలుసు. (2 కొరింథీయులు 8:7) పౌలు తన మొదటి లేఖలో వ్రాసిన ఇతర ముఖ్య విషయాలను చేయడంలో కూడా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కాని ఇప్పుడు యెరూషలేములోని ఈ పరిస్థితిలో తక్షణ చర్య అత్యవసరం. కనుక, పౌలు కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖలో ఈ అంశాన్ని చర్చించాడు.

ఉదారంగా ఉండమని అభ్యర్థిస్తాడు

మొదటిగా, పౌలు సహాయ కార్యక్రమాలకు ప్రతిస్పందించడంలో మాదిరిగా ఉన్న మాసిడోనియా వారిని గురించి కొరింథీయులకు చెప్పాడు. “వారిని తీవ్రంగా పరీక్షించే కష్టాలలో కూడా వారి ఆనంద సమృద్ధినుంచీ వారి అతి దారిద్ర్యంలోనుంచి అధికమైన ఔదార్యం వెల్లువగా ప్రవహించింది” అని పౌలు వ్రాశాడు. దాతృత్వం విషయంలో మాసిడోనియా వారిని మరొకరు ప్రోత్సహించనవసరం లేదు. “ఈ ఉపకార క్రియలో—ఈ సేవలో తమను పాల్గొననివ్వండని” వారు “మనసారా మమ్ములను వేడుకొన్నారు” అని పౌలు చెప్పాడు. మాసిడోనియా వారు అప్పట్లో “అతి దారిద్ర్యంలో” ఉన్నారు అన్న విషయం ఉల్లాసంతో కూడిన వారి ఔదార్యాన్ని మరింత గమనార్హమైనదిగా చేస్తుంది.—2 కొరింథీయులు 8:2-4, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

మాసిడోనియావారిని ప్రశంసిస్తూ పౌలు కొరింథీయుల్లో పోటీ స్ఫూర్తిని రేకెత్తించాలని ప్రయత్నించాడా? ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే అలా పురికొల్పడం సముచితం కాదని ఆయనకు తెలుసు. (గలతీయులు 6:4) అంతేకాక, సరైన పని చేయడానికి కొరింథీయులను సిగ్గుపరచనవసరం లేదని కూడా ఆయనకు తెలుసు. దానికి భిన్నంగా, కొరింథీయులు తమ యూదయ సహోదరులను నిజంగానే ప్రేమిస్తారనీ, వాళ్ళకు ఉపకారం చేయడంలో తోడ్పడాలని కోరుకుంటారనీ ఆయనకు నమ్మకం ఉండింది. మీరు “క్రిందటనే యూ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటివారై” ఉన్నారు అని ఆయన వాళ్ళకు చెప్పాడు. (2 కొరింథీయులు 8:10) వాస్తవంగానే, ఉపకార ప్రయత్నాల సంబంధంగా కొన్ని విషయాల్లో కొరింథీయులు చాలా మాదిరికరంగా ఉన్నారు. “మీరు సిద్ధంగా వున్నారని నాకు తెలుసు. . . . మిమ్ముల్ని గూర్చి మాసిదోనియా వారికి చెప్తూ ఎంతో అతిశయించాను” అని పౌలు వాళ్ళతో అన్నాడు. “మీ ఆసక్తి వారిలో ఎంతో మందికి ప్రోత్సాహం కలిగించింది” అని కూడా ఆయన అన్నాడు. (2 కొరింథీయులు 9:2, పరిశుద్ధ బైబిల్‌) (ఇటాలిక్కులు మావి.) అయితే, ఇప్పుడు, కొరింథీయులు తమ ఆసక్తిని తమ సిద్ధ మనస్సునూ క్రియా రూపంలో పెట్టవలసి వచ్చింది.

అలా, “ప్రతివాడూ సణుక్కోకుండా, బలవంతం లేకుండా తనలో నిశ్చయించుకున్నట్టు యివ్వాలి. ఎందుకంటే దేవుడు ఉల్లాసంతో ఇచ్చేవాణ్ణి ప్రేమిస్తాడు” అని పౌలు వాళ్ళకు చెప్పాడు. (2 కొరింథీయులు 9:7, పరిశుద్ధ బైబిల్‌) అయితే, పౌలు లక్ష్యం కొరింథీయులను ఒత్తిడి చేయాలని కాదు. ఎందుకంటే, ఒక వ్యక్తిని బలవంతం చేసినట్లైతే, అతడు ఉల్లాసంతో ఇచ్చినవాడు కాడు. సరైన ప్రేరణ అప్పటికే ఉందనీ, అంటే ప్రతి ఒక్కరూ ఇవ్వాలని అప్పటికే నిశ్చయించేసుకున్నారనీ ఆయన ఊహించాడన్నది స్పష్టం. అంతేకాక, “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును” అని పౌలు వాళ్ళకు చెప్పాడు. (2 కొరింథీయులు 8:12) అవును, సిద్ధమనస్సు ఉన్నప్పుడు—ఒక వ్యక్తి ప్రేమచేత పురికొల్పబడినప్పుడు—అతడు ఇచ్చేది ఏదైనా, ఎంత చిన్న మొత్తమైనా సరే దేవుడికి అంగీకారమే.—పోల్చండి లూకా 21:1-4.

నేడు ఉల్లాసంగా ఇచ్చేవారు

యూదయ క్రైస్తవుల కొరకైన ఉపకార ప్రయత్నం మన కాలానికి ఉన్నతమైన మాదిరిని ఉంచుతుంది. యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్త ప్రకటన పనిని చేపట్టి, ఆధ్యాత్మికంగా పస్తులు ఉంటున్న లక్షలకొలదిమందికి ఆధ్యాత్మిక పోషణనిస్తున్నారు. (యెషయా 65:13, 14) “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అన్న యేసు ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఈ పనిని చేస్తున్నారు.—మత్తయి 28:19, 20.

ఈ ఆదేశాన్ని శిరసావహించడం అంత సులభమైన పని కాదు. అందులో మిషనరీ హోమ్‌లను, ప్రపంచవ్యాప్తంగా నూరుకన్నా ఎక్కువగా ఉన్న బ్రాంచ్‌ల విషయాలను చూసుకోవడమూ ఇమిడి ఉంది. యెహోవా ఆరాధకులు కలుసుకునేందుకు, ఒకరినొకరు ప్రోత్సహించుకునేందుకు తగిన స్థలాలు ఉండేలాగున, రాజ్య మందిరాల, అసెంబ్లీ హాల్‌ల నిర్మాణం కూడా అవసరమౌతుంది. (హెబ్రీయులు 10:24, 25) కొన్నిసార్లు, ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో యెహోవాసాక్షులు ఉపశమన సహాయాన్ని కూడా అందిస్తారు.

ముద్రణకు అయ్యే భారీ ఖర్చును గురించి కూడా ఆలోచించి చూడండి. ప్రతివారం, సరాసరి, 2,20,00,000 కన్నా ఎక్కువ కావలికోట ప్రతులూ, దాదాపు 2,00,00,000 తేజరిల్లు! ప్రతులూ ముద్రించబడుతున్నాయి. దానికి తోడు పుస్తకాలు, లక్షల కొలది బ్రోషూర్‌లు, ఆడియోక్యాసెట్లు, వీడియోక్యాసెట్ల రూపంలోని అదనపు ఆధ్యాత్మిక ఆహారపు క్రమమైన సరఫరా కూడా ప్రతి సంవత్సరం సిద్ధం చేయబడుతుంది.

ఈ పనంతటికి మద్దతు ఎలా లభిస్తుంది? స్వచ్ఛంద విరాళాల ద్వారానే. ఈ పని పబ్లిసిటీ కోసమో స్వార్థ లక్ష్యంతోనో కాదు గానీ, సత్యారాధన పురోభివృద్ధి కోసమే. కనుక, అలా విరాళాలు ఇవ్వడం దాతకు సంతోషాన్నీ, దేవుని ఆశీర్వాదాన్నీ తెస్తుంది. (మలాకీ 3:10; మత్తయి 6:1-4) యెహోవాసాక్షులలోని పిల్లలు కూడా తాము ఉదార స్వభావంగలవారమనీ, ఉల్లాసంగా ఇచ్చేవారమనీ చూపిస్తారు. ఉదాహరణకు, అమెరికాలోని ఒక ప్రాంతాన్ని తుపాను తుడిచిపెట్టడాన్ని గురించి విన్న తర్వాత, నాలుగేండ్ల అలసన్‌ 2 డాలర్లను పంపించింది. “నా కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న డబ్బు ఇంతే. పిల్లలు తమ ఆటవస్తువులనూ, పుస్తకాలనూ, బొమ్మలనూ అన్నింటినీ కోల్పోయారని నాకు తెలుసు. నా వయస్సులోని ఒక పాపకు ఒక పుస్తకాన్ని కొనేందుకు మీరు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు” అని ఆ పాప వ్రాసింది. మక్లేన్‌ అనే ఎనిమిదేండ్ల బాబు, ఆ తుపానులో సహోదరులెవరూ మరణించలేదని తెలిసినందుకు సంతోషిస్తున్నాని వ్రాశాడు. “నేను మా నాన్నతో కలిసి హబ్‌క్యాప్‌లను అమ్మి 17 డాలర్లను సంపాదించాను. నేను ఆ డబ్బుతో వేరే ఏదో కొనుక్కుందామని అనుకున్నాను, కాని నేను సహోదరుల గురించి తలంచాను” అని కూడా ఆ బాబు వ్రాశాడు.—పై బాక్స్‌ కూడా చూడండి.

చిన్నలూ పెద్దలూ కూడా ‘తమ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుస్తూ’ తన రాజ్యాసక్తులను ముందుంచడాన్ని చూడడం యెహోవా హృదయానికి ఆనందాన్నిస్తుంది. (సామెతలు 3:9, 10) నిజమే ఎవరూ కూడా యెహోవాను ఐశ్వర్యవంతుడిగా చేయలేరు. ఎందుకంటే అన్నింటి సొంతదారుడు ఆయనే. (1 దినవృత్తాంతములు 29:14-17) కనుక, ఈ పనికి మద్దతునివ్వడం ఒక ఆధిక్యత. అది ఒక ఆరాధకుడికి యెహోవాపై తనకు గల ప్రేమను ప్రదర్శించే అవకాశాన్నిస్తుంది. ఈ విధంగా తమను ప్రేరేపించిన హృదయంగల ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞులం.

[అధస్సూచి]

a పౌలు “నియమించి”నప్పటికీ, ఆయన సొంత ప్రయోజనార్థమై, తప్పనిసరి నియమాలను ఉంచాడని భావం కాదు కానీ, అనేక సంఘాలు ఇచ్చిన విరాళాల సేకరణలకు పౌలు పైవిచారణ చేశాడంతే. అంతేకాక, ప్రతి ఒక్కరు “తాను వర్ధిల్లిన కొలది” ఇవ్వాలి అని పౌలు చెప్పాడు. వేరే మాట్లలో చెబితే, ప్రతి చందా వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఎవరినీ బలవంతపెట్టడం జరగలేదు.

[26, 27వ పేజీలోని బాక్సు]

ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాలు ఇవ్వడానికి కొంతమంది ఎన్నుకునే పద్ధతులు

“సొసైటీ యొక్క ప్రపంచవ్యాప్త పనికొరకు చందాలు.—మత్తయి 24:14.” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్‌లో దాన్ని చేరుస్తారు. ప్రతినెలా సంఘాలు ఈ మొత్తాలను స్థానిక బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.

డబ్బు రూపంలోని స్వచ్ఛంద విరాళాలను నేరుగా Treasurer’s Office, Praharidurg Prakashan Society, Plot A/35, Near Industrial Estate, Nangargaon, Lonavla, 410 401కి కూడా పంపించవచ్చు. ఆభరణాలను ఇతర విలువైన వాటిని సహితం విరాళంగా ఇవ్వవచ్చు. ఈ విరాళాలతో పాటు వీటిని బహుమానంగా ఇస్తున్నామని ఖచ్చితంగా తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా జతచేయాలి.

పథకం వేసి ఇవ్వడం

ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలివ్వడంలో, నేరుగా డబ్బునే కానుకగా ఇవ్వడం మరియు షరతు మీద ఇచ్చే విరాళాలే కాక, వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథకం యొక్క లబ్దిదారుగా Praharidurg Prakashan Society పేరును సూచించవచ్చు.

బ్యాంక్‌ ఖాతాలు: స్థానిక బ్యాంక్‌ నియమాల ప్రకారం, బ్యాంక్‌ ఖాతాలను, డిపాజిట్‌ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలను Praharidurg Prakashan Society ట్రస్టుకు ఇవ్వవచ్చు లేదా మరణానంతరం వాటిని Societyకి చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

స్టాక్‌లు మరియు బాండ్లు: పూర్తిగా ఒక బహుమానంగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించే ఏర్పాటుతో స్టాక్‌లను మరియు బాండ్లను ప్రహరీదుర్గ్‌ ప్రకాశన్‌ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు.

ఇళ్లస్థలాలు: అమ్మదగిన ఇళ్లస్థలాలను పూర్తిగా ఒక బహుమానంగా లేక ఆమె/అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో Praharidurg Prakashan Societyకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటివాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు సొసైటీని సంప్రదించాలి.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా Praharidurg Prakashan Society పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు అగ్రిమెంట్‌ లబ్దిదారుగా సొసైటీ పేరు వ్రాయవచ్చు.

“పథకం వేసి ఇవ్వడం” అనే పదబంధం సూచిస్తున్నట్లే, ఈ తరహా విరాళాలను ఇవ్వాలంటే దాత కొంత పథకం వేసుకోవలసి ఉంటుంది.

[28వ పేజీలోని బాక్సు]

పిల్లలు కూడాఆనందంగా ఇస్తారు!

మీరు మా కోసం మరిన్ని పుస్తకాలను తయారు చేయడానికి ఈ డబ్బు మీకు ఇస్తున్నాను. నేను మా డాడీకి సహాయం చేసి కూడబెట్టుకున్న డబ్బు ఇది. మీరు ఎంతో శ్రద్ధగా చేస్తున్న పనికి చాలా కృతజ్ఞతలు.—పమల, ఏడు సంవత్సరాలు.

మీరు మరిన్ని రాజ్య మందిరాలను నిర్మించడంలో సహాయపడేందుకు 6.85 డాలర్లను పంపుతున్నాను. నేను వేసవిలో బండి మీద నిమ్మరస పానీయాన్ని అమ్మి సంపాదించిన డబ్బిది.—సెలేనా, ఆరు సంవత్సరాలు.

నేను ఒక కోడి పెట్టను పెంచాను. దాని వల్ల ఒక పుంజును, ఒక పెట్టను పొందాను. చివరి దాన్ని యెహోవాకు అంకితం చేశాను. అది మరో మూడు పెట్టలను ఇచ్చింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బునే యెహోవా పని కోసం పంపుతున్నాను.—టైరీ, ఎనిమిది సంవత్సరాలు.

నా దగ్గర ఉన్న డబ్బు ఇంతే. దయచేసి దీనిని జ్ఞానపూర్వకంగా ఉపయోగించండి. దీనిని కూడబెట్టడం చాలా కష్టమైంది. 21 డాలర్లు పంపుతున్నాను.—సెరా, పది సంవత్సరాలు.

స్కూల్‌ అసైన్‌మెంట్‌లో నాకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. దానితో నేను మా మండలంలో జరిగిన పోటీల్లో పాల్గొనవలసి వచ్చింది. అక్కడ కూడా నాకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. తర్వాత జిల్లా పోటీల్లో సెకండ్‌ ప్రైజ్‌ వచ్చింది. ప్రైజ్‌లన్నీ డబ్బు రూపంలోనే వచ్చాయి. దాంట్లో కొంత డబ్బును సొసైటీతో పంచుకోవాలనుకున్నాను. దైవపరిపాలనా పాఠశాలలో నేను పొందిన తర్ఫీదు వల్లే నేను ప్రైజ్‌లు సంపాదించగల్గానని భావిస్తున్నాను. న్యాయనిర్ణేతల ఎదుట నా నివేదికను ఇవ్వడానికి ఆత్మవిశ్వాసం ఉన్నట్లు అనిపించింది.—అంబర్‌, ఆరవ గ్రేడ్‌

ఈ డబ్బును యెహోవా కోసం మీకివ్వాలని కోరుకున్నాను. దానితో ఏం చేయాలో ఆయనను అడగండి. ఆయనకు అన్నీ తెలుసు.—కరన్‌, ఆరు సంవత్సరాలు.

[25వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షుల క్రియాశీలతలకు స్వచ్ఛంద విరాళాలు మద్దతునిస్తున్నాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి