కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 1/1 పేజీలు 12-21
  • “నీ హృదయం నాపట్ల యథార్థంగా ఉందా?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నీ హృదయం నాపట్ల యథార్థంగా ఉందా?”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధునికకాల యెహూ, ఆధునికకాల యెహోనాదాబు
  • ఇంకా ఆసక్తితో ప్రకటిస్తున్నారు
  • స్థిరంగా నిలబడడం
  • విశిష్టమైన జ్ఞాపకార్థ ఆచరణ
  • “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు . . . ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు”
  • ‘రథంలోనే ఉండడం’
  • యెహూ సత్యారాధనకు ఆసక్తితో మద్దతిచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ‘యెహోవా దినంలో’ ఎవరు సజీవంగా మిగిలి ఉంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన సమయం ఇదే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దుష్ట రాణికి శిక్ష పడింది
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 1/1 పేజీలు 12-21

“నీ హృదయం నాపట్ల యథార్థంగా ఉందా?”

“యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ ర[మ్ము.]” —2 రాజులు 10:16.

1, 2. (ఎ) ఇశ్రాయేలీయుల మతపరిస్థితి ఏ విధంగా మరీ అధ్వాన్నంగా తయారయ్యింది? (బి) సా.శ.పూ. 905లో, ఇశ్రాయేలులో ఏ నాటకీయ పరిస్థితులు సంభవించనైవున్నాయి?

సా.శ.పూ. 905వ సంవత్సరం, ఇశ్రాయేలులో ఓ గొప్పమార్పును తీసుకొచ్చిన సమయం. దీనికి దాదాపు 100 సంవత్సరాల క్రిందట, సొలొమోను భ్రష్టత్వాన్నిబట్టి సమైక్య ఇశ్రాయేలు రాజ్యాన్ని యెహోవా రెండుగా విభజించాడు. (1 రాజులు 11:9-13) దక్షిణ రాజ్యమైన యూదాను సొలొమోను కుమారుడైన రెహబాము అప్పట్లో పరిపాలించగా, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు ఎఫ్రామీయుడైన యరొబాము ఆధ్వర్యం క్రిందకు వచ్చింది. విచారకరంగా, ఉత్తరరాజ్య పరిపాలన ఘోరంగా ప్రారంభమైంది. దావీదు గృహానికి తిరిగి వెళ్తున్నామనే అభిప్రాయం తన పరిపాలనక్రింద ఉన్న ప్రజలకు కలుగుతుందనే భయాన్నిబట్టి, దేవాలయంలో ఆరాధించడానికి వాళ్లు దక్షిణ రాజ్యానికి వెళ్లడం యరొబాముకు ఇష్టంలేదు. కాబట్టి అతడు ఇశ్రాయేలులో దూడ ఆరాధనను ఏర్పాటుచేశాడు, అలా విగ్రహారాధనా విధానాన్నొకదాన్ని స్థాపించాడు. అది కొంతమేరకు ఉత్తర రాజ్య చరిత్రయందంతటా కొనసాగింది.—1 రాజులు 12:26-33.

2 ఒమ్రీ కుమారుడైన అహాబు రాజైనప్పుడు పరిస్థితులు మరీ అధ్వాన్నంగా తయారయ్యాయి. అన్యురాలైన అతని భార్య యెజెబెలు, బయలు దేవతారాధనను పెంపొందింపచేసి, యెహోవా ప్రవక్తల్ని చంపించింది. ప్రవక్తయైన ఏలీయా కచ్చితంగా ఎన్నిసార్లు హెచ్చరించినా, అహాబు ఆమెను అదుపులో పెట్టేందుకు ఏ చర్యల్నీ తీసుకోలేదు. అయితే, సా.శ.పూ. 905లో అహాబు మరణించాడు, అతని కుమారుడైన యెహోరాము పరిపాలకుడయ్యాడు. దేశాన్ని ప్రక్షాళన చేయడానికి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఏలీయా తదనంతర ప్రవక్తయైన ఎలీషా, ఇశ్రాయేలు తర్వాతి రాజుగా సైన్యాధిపతియైన యెహూను యెహోవా అభిషేకించాడని అతనికి తెలియజేశాడు. అతని నియామకం ఏమిటి? పాపపంకిలమైన అహాబు ఇంటిని సర్వనాశనం చేయడం, యెజెబెలు చిందించిన ప్రవక్తల రక్తానికి ప్రతీకారాన్ని తీర్చుకోవడం!—2 రాజులు 9:1-10.

3, 4. తన హృదయం ‘యెహూ హృదయంపట్ల యథార్థంగా’ ఉందని యెహోనాదాబు ఎలా చూపించుకున్నాడు?

3 దేవుని ఆజ్ఞకు విధేయుడైన యెహూ, దుష్టురాలైన యెజెబెలును చంపించాడు, మరి అటుతర్వాత అహాబు ఇంటివారినందరినీ నాశనం చేయడం ద్వారా ఇశ్రాయేలు ప్రక్షాళనకు నాంది పలికాడు. (2 రాజులు 9:15–10:14; 9:17) తర్వాత అతడు ఒక మద్దతుదారున్ని కలుసుకున్నాడు. “తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి—నీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా [“నా హృదయం నీ పట్ల ఉన్నట్లుగానే నీ హృదయం నాపట్ల యథార్థంగా ఉందా?” NW] అని అతని నడుగగా యెహోనాదాబు—ఉన్నదనెను. ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని “యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.”—2 రాజులు 10:15, 16.

4 యెహోనాదాబు (లేదా, యోనాదాబు) ఇశ్రాయేలీయుడు కాడు. అయినా, (“యెహోవా ఇష్టుడు,” “యెహోవా ఘనుడు,” లేదా “యెహోవా ఉదారుడు” అని భావంగల) అతని పేరుకు తగ్గట్టుగా అతడు యెహోవా ఆరాధికుడు. (యిర్మీయా 35:6) కచ్చితంగా, ‘యెహోవాను గూర్చిన యెహూ ఆసక్తిని’ చూడడంలో అతడు విశేషమైన శ్రద్ధను కల్గివున్నాడు. అది మనకెలా తెలుసు? అభిషిక్తుడైన ఇశ్రాయేలు రాజును కలుసుకోవడమనేది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనకాదు. యెహోనాదాబు ‘[అతనిని] ఎదుర్కొన వచ్చాడు,’ మరి యెహోనాదాబు వచ్చేటప్పటికే యెహూ యెజెబెలునీ అహాబు ఇంటిలోని ఇతరుల్నీ చంపివేశాడు. రథంలోకి రమ్మని యెహూ తనను ఆహ్వానించినప్పుడు ఏమి జరుగుతున్నదో యెహోనాదాబుకు తెలుసు. అబద్ధ ఆరాధనకూ, సత్యారాధనకూ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో అతడు కచ్చితంగా యెహూ తరపున అంటే యెహోవా తరుపున ఉన్నాడు.

ఆధునికకాల యెహూ, ఆధునికకాల యెహోనాదాబు

5. (ఎ) సర్వమానవాళికి ఏ మార్పులు త్వరలో సంభవించనై ఉన్నాయి? (బి) గొప్ప యెహూ ఎవరు, భూమిపై ఆయనకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు?

5 వెనుకటికి సా.శ.పూ. 905లో ఇశ్రాయేలు విషయంలో పరిస్థితులు తీవ్రంగా మారిపోయినట్లుగానే సర్వమానవాళి విషయంలోనూ నేడు పరిస్థితులు త్వరలోనే మారిపోతాయి. అబద్ధమతంతో పాటూ, సాతాను ప్రభావపు చెడు ఫలితాలన్నిటినీ భూమిపైనుండి యెహోవా పరిశుభ్రపర్చే సమయం ఇప్పుడు దగ్గరపడింది. ఆధునికకాల యెహూ ఎవరు? “శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము” అనే ప్రవచనాత్మక మాటలు సంబోధించబడిన యేసుక్రీస్తే. (కీర్తన 45:3, 4) “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన” అభిషిక్త క్రైస్తవులగు “దేవుని ఇశ్రాయేలు” భూమిపై యేసుకు ప్రాతినిధ్యం వహిస్తారు. (ప్రకటన 12:17; గలతీయులు 6:16) యేసు అభిషిక్త సహోదరులైన వీళ్లు, 1922 నుండీ రానైవున్న యెహోవా తీర్పుచర్యల్ని గూర్చి నిర్భయంగా హెచ్చరించారు.—యెషయా 61:1, 2; ప్రకటన 8:7–9:21; 16:2-21.

6. అభిషిక్త క్రైస్తవులకు మద్దతునిచ్చేందుకు జనాంగాలనుండి ఎవరు వచ్చారు, మరి అలంకారికంగా చెప్పాలంటే గొప్ప యెహూ రథంలోనికి వాళ్లెలా ప్రవేశించారు?

6 అభిషిక్త క్రైస్తవులు ఒంటరివారేమీ కాదు. యెహూను కలుసుకోవడానికి యెహోనాదాబు వచ్చినట్లుగానే, గొప్ప యెహూ అయిన యేసుకూ, ఆయన భూసంబంధ ప్రతినిధులకూ మద్దతునిచ్చేందుకు సత్యారాధన పక్షంవహిస్తూ అన్యజనులలో నుండి అనేకులు వచ్చారు. (జెకర్యా 8:23) యేసుచే పిలువబడినవారైన ఆయన “వేరే గొఱ్ఱెలు,” 1932లో ప్రాచీన యెహోనాదాబుకు ఆధునికకాల సమాంతరంగా గుర్తించబడ్డారు, ఆధునికకాల యెహూ ‘రథంలోనికి రమ్మని’ వాళ్లు ఆహ్వానించబడ్డారు. (యోహాను 10:16) ఎలా? ‘దేవుని ఆజ్ఞల్ని గైకొని,’ “యేసునుగూర్చి సాక్ష్యమిచ్చు” పనిలో అభిషిక్తులతో భాగం వహించడం ద్వారానే. ఆధునిక కాలాల్లో, రాజుగా యేసు ఆధ్వర్యంలో స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించడం ఇందులో చేరివుంది. (మార్కు 13:10) 1935లో ఈ “యెహోనాదాబులు” ప్రకటన 7:9-17లో ఉన్న “గొప్ప సమూహము”గా గుర్తించబడ్డారు.

7. యేసు హృదయంపట్ల తమ ‘హృదయం ఇప్పటికీ యథార్థంగా’ ఉందని క్రైస్తవులు నేడెలా చూపించుకున్నారు?

7 గొప్ప సమూహమూ, మరి వారి అభిషిక్త సహోదరులూ సత్యరాధనకు తామిచ్చే మద్దతును 1930ల నుండీ ధైర్యంగా రుజువుచేసుకున్నారు. తూర్పు, పశ్చిమ యూరప్‌లలోని, దూర ప్రాచ్యం, ఆఫ్రికాలలోని కొన్ని దేశాల్లో అనేకమంది తమ విశ్వాసం నిమిత్తం మరణించారు. (లూకా 9:23, 24) ఇతర దేశాల్లో, వాళ్లు ఖైదు చేయబడ్డారు, దోచుకోబడ్డారు అలాకాకపోతే హింసించబడ్డారు. (2 తిమోతి 3:12) విశ్వాసం విషయంలో వాళ్లెంతటి చరిత్రను సంపాదించుకున్నారో కదా! ఫలితమేదైనప్పటికీ, వాళ్లు దేవుని సేవచేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నారని 1997 వార్షిక సేవా నివేదిక చూపిస్తోంది. వారి హృదయం ఇప్పటికీ యేసు హృదయంపట్ల యథార్థంగానే ఉంది. 55,99,931 మంది రాజ్యప్రచారకులు అంటే దాదాపుగా అంతా ‘యెహోనాదాబులే’ అయిన ఈ రాజ్యప్రచారకులు యేసును గూర్చి సాక్ష్యమిచ్చే పనిలో మొత్తం 1,17,97,35,841 గంటల్ని వెచ్చించినప్పుడు 1997 సంవత్సరంలో ఇది కనబడింది.

ఇంకా ఆసక్తితో ప్రకటిస్తున్నారు

8. సత్యారాధన కొరకైన తమ ఆసక్తిని యెహోవాసాక్షులు ఎలా చూపిస్తారు?

8 తన రథాన్ని వెఱ్ఱితోలుడు తోలతాడనే పేరు యెహూకుంది. అది తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చడంలో ఆయనకున్న ఆసక్తికి ఒక నిదర్శనం. (2 రాజులు 9:20) గొప్ప యెహూయైన యేసు ఆసక్తితో ‘భక్షించబడుతున్న’ వానిగా వర్ణించబడ్డాడు. (కీర్తన 69:9) అయితే, నేటి నిజ క్రైస్తవులు, తమ ఆసక్తినిబట్టి గుర్తించబడడం ఆశ్చర్యకరమైన విషయమేమీకాదు. సంఘంలోనూ, బహిరంగంగానూ వాళ్లు ‘వాక్యాన్ని . . . సమయమందును అసమయమందును ప్రకటిస్తున్నారు.’ (2 తిమోతి 4:2) వీలైనంతమంది సహాయ పయినీరు సేవలో భాగం వహించాలని మన రాజ్య పరిచర్యలోని ఒక శీర్షిక ప్రోత్సహించిన తర్వాత, 1997 తొలి భాగంలో వారి ఆసక్తి విశేషంగా కన్పించింది. ప్రతీ దేశానికీ సహాయ పయినీర్ల నిర్దేశిత సంఖ్య ఏర్పర్చబడింది. ప్రతిస్పందన ఎలావుంది? గుర్తించదగిన రీతిలో ఉంది! అనేక బ్రాంచ్‌లు తమ నిర్దేశిత సంఖ్యను అధిగమించాయి. ఈక్వెడార్‌ నిర్దేశిత సంఖ్యగా 4,000 మంది పయినీర్లను పెట్టుకుంది, అయితే మార్చిలో 6,936 మంది సహాయ పయినీర్లు రిపోర్టు చేశారు. జపాన్‌లో ఆ మూడు నెలల కాలంలో మొత్తంగా 1,04,215 మంది రిపోర్టు చేశారు. 6,000 మంది సహాయ పయినీర్లు నిర్దేశిత సంఖ్యగాగల జాంబియాలో, మార్చిలో 6,414 మందీ, ఏప్రిల్‌లో 6,532 మందీ, మేలో 7,695 మందీ రిపోర్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సహాయ, క్రమ పయినీర్ల శిఖరాగ్ర సంఖ్య 11,10,251, మరి ఇది 1996కన్నా 34.2 శాతం అధికం!

9. ప్రజలకు రాజ్యసువార్తను తెలియజేయడానికి ఇంటింటి పరిచర్యతోపాటూ, ఏ ఇతర మార్గాల్లో యెహోవాసాక్షులు వారిని కనుగొంటారు?

9 ఎఫెసు నుండి వచ్చిన పెద్దలతో అపొస్తలుడైన పౌలు ఇలా తెలియజేశాడు: “ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు[న్నాను.]” (అపొస్తలుల కార్యములు 20:20) యెహోవాసాక్షులు నేడు పౌలు మాదిరిని అనుసరిస్తున్నారు, ఇంటింట సువార్తను ఆసక్తితో ప్రకటిస్తున్నారు. అయితే, ప్రజల్ని తమ గృహాల్లో కనుగొనడం అంత సులభమైన విషయమేమీ కాదు. అందుకే, ప్రజలు ఎక్కడున్నా అంటే వ్యాపార స్థలాల్లో ఉన్నా, వీధుల్లో ఉన్నా, బీచ్‌లలో ఉన్నా, పబ్లిక్‌ పార్కుల్లో ఉన్నా వాళ్లను కలుసుకోమని ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ రాజ్యప్రచారకుల్ని ప్రోత్సహిస్తున్నాడు. (మత్తయి 24:45-47) ఫలితాలు ఎంతో చక్కగా ఉన్నాయి.

10, 11. సాధారణంగా ఇంటిదగ్గర కలుసుకోవడానికి వీల్లేని ఆసక్తిగల వ్యక్తుల్ని కనుగొనడానికి రెండు దేశాల్లోని ప్రచారకులు ఎలా చక్కని చొరవను చూపించారు?

10 డెన్మార్క్‌లోని కోపెన్హాగిన్‌ నగరంలో రైల్వే స్టేషన్లకు వెలుపల ఉన్న వీధుల్లో, ప్రచారకుల చిన్న గుంపొకటి సాక్ష్యమిస్తోంది. జనవరి నుండి జూన్‌ వరకూ, వాళ్లు 4,733 పత్రికల్ని అందించి, అనేకమంది ప్రజలతో మాట్లాడగలిగేరు, మరి అనేక పునర్దర్శనాల్ని చేశారు. ఆ దేశంలో ఉన్న ప్రచారకుల్లో అనేకమంది, వ్యాపార ప్రాంతంలో పత్రికా మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక పట్టణంలో ప్రతీ శుక్రవారం ఓ పెద్ద సంత జరుగుతుంది, అక్కడకి వేలాదిమంది సందర్శకులు వస్తారు. కాబట్టి సంఘం సంతలో క్రమంగా సాక్ష్యమివ్వడానికి ఏర్పాటు చేసింది. ఒక ప్రాంతంలోని ప్రచారకులు, విశేషంగా పాఠశాల ఉపాధ్యాయులకు తగిన ప్రచురణలున్న సమాచార పేకేజితో పాఠశాలల్ని సందర్శించేవారు.

11 ఇంటి వద్దలేని వారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు హవాయిలో కూడా చేయబడ్డాయి. ప్రత్యేక ప్రాంతాల్లో (వీధులూ, పార్కులూ, పార్కింగ్‌ స్థలాలూ, బస్‌ స్టాపులూ వంటి) బహిరంగ స్థలాలూ, వాణిజ్యకేంద్రాలూ, షాపింగ్‌ సెంటర్లూ, విమానాశ్రయాలూ, టెలిఫోన్‌ ద్వారా సాక్ష్యమివ్వడమూ, ప్రజా రవాణా (బస్సుల్లో ప్రకటించడమూ), మరి కాలేజీ ఆవరణలూ చేరివున్నాయి. ప్రతీ ప్రాంతానికి సరిపడినంతమంది సాక్షులు నియమించబడేలా, మరి వారికి తగిన తర్ఫీదు ఇవ్వబడేలా సంఘం జాగ్రత్త తీసుకోవాలి. వీటిని పోలిన బాగా సంస్థీకరించబడిన ప్రయత్నాలు, అనేక దేశాలనుండి రిపోర్టు చేయబడ్డాయి. తత్ఫలితంగా, ఇంటింటి పరిచర్యలో కలుసుకోవడానికి బహుశా ఎన్నటికీ వీలుకాని ఆసక్తిగల ప్రజల్ని కలుసుకోవడం జరిగింది.

స్థిరంగా నిలబడడం

12, 13. (ఎ) సాతాను యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా 1997 సంవత్సరకాలంలో ఏ తంత్రాన్ని ఉపయోగించాడు? (బి) ఒక దేశంలో అబద్ధ ప్రచారం ఏ విధంగా తిప్పి కొట్టింది?

12 అనేక దేశాల్లో 1997లో, యెహోవాసాక్షులపై వీలైనన్ని చట్టపరమైన చర్యల్ని తీసుకోవాలనే స్పష్టమైన లక్ష్యంతో చేయబడ్డ తీవ్రమైన, అబద్ధ ప్రచారానికి వాళ్లు బాధితులయ్యారు. కానీ వాళ్లు నిబ్బరాన్ని కోల్పోలేదు! (కీర్తన 112:7, 8) వాళ్లు కీర్తనల గ్రంథకర్త చేసిన ఈ ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నారు: “గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును.” (కీర్తన 119:69) అలాంటి అబద్ధ ప్రచారం, యేసు ప్రవచించినట్లుగా నిజ క్రైస్తవులు ద్వేషించబడతారనడానికి కేవలమొక నిదర్శనమైవుంది. (మత్తయి 24:9) మరి కొన్నిసార్లు అది తిప్పికొట్టింది. బెల్జియంలో ఒక వ్యక్తి, పేరుగాంచిన దినపత్రికలో యెహోవాసాక్షుల్ని గూర్చి వచ్చిన తిరస్కారపూరిత శీర్షికనొకదాన్ని చదివాడు. అపవాదులతో కూడిన వ్యాఖ్యానాలకు దిగ్భ్రాంతి చెందినవాడై, అతడు రాజ్యమందిరంలో జరిగే కూటానికి ఆ తర్వాతి ఆదివారం హాజరయ్యాడు. సాక్షులతో బైబిలు పఠనం చేయించుకోవడానికి అతడు ఏర్పాట్లు చేసుకున్నాడు, త్వరత్వరగా పురోభివృద్ధిని సాధించాడు. గతంలో, ఈ వ్యక్తి ఒక ముఠా సభ్యుడు. తన చుట్టూ ఉండే ప్రజలు గుర్తించే రీతిలో, తన జీవితాన్ని పరిశుభ్రపర్చుకునేందుకు అతనికి బైబిలు పఠనం సహాయపడింది. కచ్చితంగా, నిందాపూరితమైన ఆ శీర్షికను రాసిన రచయిత అలాంటి ఫలితం కలుగుతుందని అనుకోలేదు!

13 బెల్జియంలోని కొంతమంది యథార్థహృదయులైన ప్రజలు మోసపూరిత ప్రచారానికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వారిలో, యెహోవాసాక్షులు సాధించినదాన్ని బట్టి ఆశ్చర్యంతో నిండిపోయానని అంగీకరించిన మాజీ ప్రధానమంత్రి ఉన్నాడు. దిగువ సభలోని సభ్యుడు ఒకడు ఇలా రాశాడు: “[యెహోవాసాక్షులు] అప్పుడప్పుడూ వ్యాపించే అప్రతిష్ఠాత్మక వ్యాఖ్యానాలకు భిన్నంగా, ప్రభుత్వసంస్థలకు ఏ విధమైన అపాయాన్నైనా తెచ్చేవారిగా నాకు కన్పించలేదు. వాళ్లు శాంతికాముకులైన, మనస్సాక్షి ప్రకారం నడుచుకునే, అధికారుల ఎడల గౌరవాన్ని కల్గివున్న పౌరులు.” నిశ్చయంగా, అపొస్తలుడైన పేతురు రాసిన ఈ మాటలు జ్ఞానయుక్తమైనవి: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”—1 పేతురు 2:12.

విశిష్టమైన జ్ఞాపకార్థ ఆచరణ

14. 1997 సంవత్సరంలో జ్ఞాపకార్థదిన ఆచరణ కూటాల హాజరుకు సంబంధించిన ఉల్లాసవంతమైన కొన్ని రిపోర్టులు ఏవి?

14 యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నవారు, ఆయన మరణ జ్ఞాపకార్థ దినాన్ని సంవత్సరంలో ప్రముఖమైన సంఘటనగా తాము దృష్టించాలనే విషయం తగినదైవుంది. 1997లో, ఆ సంఘటనను ఆచరించడానికి మార్చి 23న 1,43,22,226 మంది హాజరయ్యారు, 1996లో హాజరైన సంఖ్యతో పోల్చితే 14,00,000కన్నా ఎక్కువ మంది హాజరయ్యారు. (లూకా 22:14-20) భవిష్య పురోభివృద్ధి కొరకైన చక్కని ఉత్తరాపేక్షల్ని చూపిస్తూ, అనేక దేశాల్లో జ్ఞాపకార్థదినానికి హాజరైనవారి సంఖ్య రాజ్యప్రచారకుల సంఖ్యను మించిపోయింది. ఉదాహరణకు, హైతీలో, జ్ఞాపకార్థ దినానికి 67,259 మంది హాజరుకాగా, 10,621 మంది ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్యను 1997వ సంవత్సరం చూసింది. 18 నుండి  21 పేజీల వరకూ ఉన్న వార్షిక నివేదికను మీరు పరిశీలించి, వివిధ దేశాల్లో ప్రచారకుల సంఖ్యతో పోల్చితే జ్ఞాపకార్థ ఆచరణకు అదే విధంగా ఎంత ఎక్కువమంది హాజరయ్యారో మీరు చూడవచ్చు.

15. కొన్ని దేశాల్లో, జ్ఞాపకార్థదినాన్ని ఆచరించేందుకు మన సహోదరులు గంభీరమైన సమస్యల్ని ఎలా అధిగమించారు?

15 కొంతమందికైతే, జ్ఞాపకార్థ దినానికి హాజరవ్వడమనేది అంత సులభం కాలేదు. అల్బేనియాలో, పౌరసంబంధ అల్లర్లనుబట్టి రాత్రి 7 గంటలకు కర్ఫ్యూ విధించబడింది. ఆ దేశమందంతటా ఉన్న 115 చిన్న గుంపుల్లో, జ్ఞాపకార్థదిన ఆచరణ సాయంత్రం 5:45 నిమిషాలకు ప్రారంభమైంది. నీసాను 14 ఆరంభమైందని సూచిస్తూ, 6:08 నిమిషాలకు సూర్యాస్తమయమైంది. సుమారు 6:15 నిమిషాలకు చిహ్నాలు అందించబడ్డాయి. అనేక గుంపుల్లో చివరి ప్రార్థన ముగిసేటప్పటికి 6:30 అయ్యింది, మరి హాజరైనవారు కర్ఫ్యూ ప్రారంభం కావడానికి ముందే ఇళ్లకు చేరుకోవడానికి త్వరపడ్డారు. అయినప్పటికీ, 1,090 శిఖరాగ్ర రాజ్యప్రచారకులతో పోల్చితే 3,154 మంది ఆ జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరయ్యారు. ఒక ఆఫ్రికా దేశంలో, పౌరసంబంధమైన అలజడులు రాజ్యమందిరానికి వెళ్లలేని పరిస్థితుల్ని తీసుకొచ్చాయి, కాబట్టి ఇద్దరు పెద్దలు చిన్న చిన్న గుంపులుగా జ్ఞాపకార్థ ఆచరణను జరిపించడానికి ఏర్పాటు చేయడానికి మూడవ పెద్ద ఇంటిలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇంటిని చేరుకునేందుకు, ఆ ఇద్దరు పెద్దలు మురికి కాలువను దాటాల్సి వచ్చింది. అయితే, ఆ ప్రాంతంలో పోరాటం జరుగుతోంది, అక్కడ కనబడకుండా తుపాకులతో కాచుకు కూర్చున్న వ్యక్తులు, ఆ మురికి కాలువను దాటడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కర్నీ కాల్చేస్తున్నారు. ఒక పెద్ద నిరపాయంగా ఆ కాలువను దాటాడు. రెండవ పెద్ద కాలువను దాటుతుండగా అతను గుళ్ల శబ్దాన్ని విన్నాడు. అతడు నేలపై బోర్లాపడి, బుల్లెట్లు అతని తలపైనుండి దూసుకుపోతుండగా సురక్షిత ప్రదేశం వైపు ప్రాకుతూ వెళ్లాడు. పెద్దల కూటం విజయవంతంగా జరిగింది, మరి సంఘావసరాలు తీర్చబడ్డాయి.

“ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు . . . ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు”

16. చిన్న చిన్న భాషాగుంపుల్లో సువార్తను వ్యాపింపచేసేందుకు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ఏవిధంగా ఏర్పాట్లుచేసింది?

16 “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు” గొప్ప సమూహం వస్తుందని అపొస్తలుడైన యోహాను తెలియజేశాడు. (ప్రకటన 7:9) అందుకే, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదిమ తెగలూ, చిన్న చిన్న ప్రజా గుంపులూ మాట్లాడే భాషలతోపాటూ అనేక భాషల్లో సాహిత్యాలు లభ్యమయ్యేలా పరిపాలక సభ ఏర్పాటు చేస్తోంది. ఉదాహరణకు, మొజాంబిక్‌లో, శాంతియుతమైన నూతన లోకంలో జీవితము అనే కరపత్రం ఐదు అదనపు భాషల్లో విడుదల చేయబడింది. నికరాగ్వాలో భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రొషూరు మిస్కిటో భాషలో లభ్యమౌతోంది. అది ఆ భాషలో వాచ్‌ టవర్‌ సొసైటీ మొట్టమొదటి ప్రచురణ. మిస్కిటో ఇండియన్లు తమ స్వభాషలో ఆ బ్రొషూరును చూసి దాన్ని సంతోషంతో తీసుకున్నారు. 1997లో సొసైటీ 25 అదనపు భాషల్లో సాహిత్యాలను అనువదించడానికి అనుమతించి, 100 కోట్లకన్నా ఎక్కువ పత్రికల్ని ముద్రించింది.

17. కొరియాలో ఏ భాషాగుంపుకు సహాయం చేయబడింది, ఈ తరహా ప్రజలకు వీడియోటేపులు ఏ విధంగా సహాయపడ్డాయి?

17 కొరియాలో మరో భాషా గుంపుకు సహాయం చేయబడింది. 1997వ సంవత్సరం కొరియన్‌ సంజ్ఞా భాషలో మొట్టమొదటి సమావేశాన్ని చూసింది. కొరియాలో 543 మంది ప్రచారకులతో 15 సంజ్ఞా భాషా సంఘాలు ఉన్నాయి, సమావేశానికి 1,174 మంది హాజరయ్యారు, మరి 21మంది బాప్తిస్మం తీసుకున్నారు. మౌఖికంగాగానీ లేదా రాతపూర్వకంగాగానీ సులభంగా అర్థంచేసుకోలేని బధిరులకు సహాయపడేందుకు 13 వివిధ సంజ్ఞా భాషల్లో వీడియో టేపుపై సాహిత్యాలు ముద్రించబడుతున్నాయి. సువార్తను “చదువుకునేందుకూ,” అధ్యయనం చేసేందుకూ బధిరులు ఆ విధంగా సహాయాన్ని పొందారు, చక్కని ఫలితాల్ని సాధించడం జరిగింది. అమెరికాలో, ఒక బధిరుడు బాప్తిస్మం తీసుకునే స్థాయికి ఎదిగేలా పురోభివృద్ధి సాధించడానికి ఇంతకు మునుపు ఐదేళ్లు పట్టేది. ఇప్పుడు, అమెరికన్‌ సంజ్ఞా భాషలో అనేక వీడియోలు లభ్యమవ్వడంతో, కొంతమంది బధిరులకైతే, ఆ స్థాయికి పురోభివృద్ధి సాధించడానికి పట్టే సమయం దాదాపు ఒక్క సంవత్సరానికి తగ్గిపోయింది.

‘రథంలోనే ఉండడం’

18. యెహోనాదాబును కలుసుకున్న తర్వాత, యెహూ ఏమి చేయడం మొదలుపెట్టాడు?

18 వెనుకటికి సా.శ.పూ. 905లో, యెహోనాదాబు వచ్చి చేరిన తర్వాత, యెహూ అబద్ధ ఆరాధనను నాశనం చేయడం మొదలు పెట్టాడు. బయలు ఆరాధికులందరికీ అతనొక ఆహ్వానాన్ని పంపించాడు: “బయలునకు పండుగ నియమింపబడిన[ది.]” తర్వాత బయలు ఆరాధికుడెవడూ తప్పిపోకుండా హాజరయ్యేలా దేశమంతటా అతడు వర్తమానాన్ని పంపించాడు. అబద్ధ దేవత యొక్క గొప్ప ఆలయంలోనికి ప్రజలు తండోపతండాలుగా వచ్చినప్పుడు, అక్కడ యెహోవా ఆరాధికుడెవ్వడూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. చివరగా, యెహూ, అతని సైన్యమూ బయలు ఆరాధికుల్ని నరికివేశారు. “ఈ ప్రకారము యెహూ బయలు దేవతను ఇశ్రాయేలువారిమధ్య నుండకుండ నాశనము చేసెను.”—2 రాజులు 10:20-28.

19. సర్వమానవాళి ఎదుటా ఉన్నదాని దృష్ట్యా, మనమే స్ఫూర్తిని చూపించాలి, మరి ఏ పనిలో మనం శ్రద్ధగా నిమగ్నమై ఉండాలి?

19 నేడు, అబద్ధమతాలన్నిటికీ అంతిమతీర్పు వేచివుంది. దేవునికి భయపడి, అబద్ధమతం నుండి వేరైవుండమని సర్వమానవాళినీ ప్రోత్సహిస్తూ, దేవదూతల నడిపింపుక్రింద క్రైస్తవులు వారికి సువార్తను ప్రకటిస్తున్నారు. (ప్రకటన 14:6-8; 18:2, 4) సింహాసనాసీనుడైన యెహోవా నియమిత రాజగు యేసుక్రీస్తు ఆధ్వర్యంలో ఉన్న దేవుని రాజ్యానికి తమనుతాము లోబర్చుకోవాలని దీనులు ప్రోత్సహించబడుతున్నారు. (ప్రకటన 12:10) ఈ ఉల్లాసపూరిత సమయంలో, సత్యారాధన కొరకు మనం స్థిరంగా ఉంటుండగా మనం మన ఆసక్తి బలహీనపడడానికి అనుమతించకూడదు.

20. మీరు 1998 సేవాసంవత్సరంలో ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు?

20 ఒకసారి, రాజైన దావీదు తీవ్రమైన ఒత్తిడికిలోనైనప్పుడు, ఆయనిలా ప్రార్థించాడు: “నా హృదయము నిబ్బరముగా నున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. . . . ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను.” (కీర్తన 57:7, 10) మనం కూడా నిబ్బరంగా ఉందాం. 1997 సేవాసంవత్సర కాలంలో, అనేక ఆటంకాల్ని ఎదుర్కొంటున్నప్పటికీ, యెహోవా దేవుని మహిమపర్చేందుకు విస్తారమైన స్తుతి పైకెగిసింది. అదే విధమైన స్తుతి, అంతకన్నా మరింత ఎక్కువైన స్తుతి, ప్రస్తుత సేవాసంవత్సరంలో వినబడాలి. మనల్ని నిరుత్సాహపర్చేందుకు లేదా మనల్ని వ్యతిరేకించేందుకు సాతాను ఏమి చేసినప్పటికీ మనం యెహోవాను స్తుతించడంలో కొనసాగుదాం. ఆ విధంగా, గొప్ప యెహూయైన యేసుక్రీస్తుపట్ల మన హృదయం యథార్థంగా ఉందని చూపించుకుందాం, మరి ఈ ప్రేరేపిత ఉద్బోధనకు పూర్ణాత్మతో మనం ప్రతిస్పందిస్తాం: “నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.”—కీర్తన 32:11.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ సా.శ.పూ. 905లో ఇశ్రాయేలులో ఏ మార్పులు సంభవించాయి?

◻ ఆధునికకాల యెహూ ఎవరు, ఆయన హృదయంపట్ల తమ ‘హృదయం యథార్థంగా’ ఉందని “గొప్ప సమూహము” ఎలా చూపించుకుంది?

◻ 1997 సేవా సంవత్సర కాలంలో యెహోవాసాక్షులు చూపించిన ఆసక్తిని వార్షిక నివేదికలోని ఏ గణాంకాలు చూపిస్తున్నాయి?

◻ మనకు వ్యతిరేకంగా సాతాను ఏమి చేసినా, 1998 సేవా సంవత్సర కాలంలో మనమే స్ఫూర్తిని చూపిస్తాం?

[18-21వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 1997 సేవా సంవత్సరపు నివేదిక

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

[15వ పేజీలోని చిత్రం]

జ్ఞాపకార్థదిన ఆచరణ విశిష్టహాజరు, భవిష్యపురోభివృద్ధి కొరకైన చక్కని ఉత్తరాపేక్షల్ని చూపిస్తోంది

[16వ పేజీలోని చిత్రం]

యెహూకు యెహోనాదాబు మద్దతునిచ్చినట్లుగానే గొప్ప యెహూయైన యేసుక్రీస్తుకూ, ఆయన అభిషిక్త సహోదరులకూ నేడు “గొప్ప సమూహము” మద్దతునిస్తోంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి