కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 9/15 పేజీలు 16-20
  • ‘యెహోవా దినంలో’ ఎవరు సజీవంగా మిగిలి ఉంటారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘యెహోవా దినంలో’ ఎవరు సజీవంగా మిగిలి ఉంటారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవిక లక్షణాలు ప్రాముఖ్యం
  • ‘నా పక్షమందున్న వారెవరు?’
  • సత్యారాధనకు హృదయపూర్వక మద్దతు
  • నాటకీయ సంఘటనలు త్వరలో జరుగనున్నాయి!
  • ఎలీషావంటి ఆసక్తితో సేవ చేయడం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు మరి మీరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యథార్థత మరియు స్వయంత్యాగ స్ఫూర్తికి మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ‘యెహోవా, అతని కళ్లు తెరువు’
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 9/15 పేజీలు 16-20

‘యెహోవా దినంలో’ ఎవరు సజీవంగా మిగిలి ఉంటారు?

“దేవుని [“యెహోవా,” NW] దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”—2 పేతురు 3:11, 12.

1. ఏలీయా యొక్క ఆత్మతో మరియు శక్తితో ఎవరు పని చేశారు?

యెహోవా దేవుడు పరలోక రాజ్యంలో తన కుమారుడైన యేసుక్రీస్తుకు తోటి వారసులయ్యే వ్యక్తులను మానవజాతిలో నుండి ఎన్నుకున్నాడు. (రోమీయులు 8:16, 17) వారు ఇంకా భూమిపై ఉన్నప్పుడు, అభిషిక్త క్రైస్తవులు ఏలీయా యొక్క ఆత్మతో మరియు శక్తితో పని చేశారు. (లూకా 1:17) దీనికి ముందున్న శీర్షికలో, వారి కార్యకలాపాలకూ ప్రవక్తయైన ఏలీయా కార్యకలాపాలకూ మధ్యగల కొన్ని సమాంతరాలను మనం గమనించాము. అయితే ఏలీయా స్థానాన్ని భర్తీ చేసిన వాడైన ప్రవక్తయైన ఎలీషా పని సంగతేమిటి?—1 రాజులు 19:15, 16.

2. (ఎ) ఏలీయా యొక్క చివరి అద్భుతం మరియు ఎలీషా యొక్క మొదటి అద్భుతం ఏది? (బి) ఏలీయా పరలోకానికి పోలేదనేందుకు ఏ రుజువులు ఉన్నాయి?

2 ఏలీయా చేసిన చివరి అద్భుతం తన వస్త్రంతో యొర్దాను నదీ జలాలను రెండుగా విభజించడమే. ఇది ఏలీయా మరియు ఎలీషాలు ఎండిన నేలపై నడిచేలా చేసింది. వారు నది యొక్క తూర్పు వైపు నుండి నడుస్తుండగా, ఒక సుడిగాలి ఏలీయాను భూమి మీది మరొక ప్రాంతానికి తీసుకుపోయింది. (15వ పేజీలోని “ఏలీయా ఏ పరలోకానికి ఆరోహణమయ్యాడు?” అనే శీర్షికగల బాక్సును చూడండి.) ఏలీయా వస్త్రం అక్కడే ఉండిపోయింది. యొర్దానును కొట్టేందుకు ఎలీషా దాన్ని ఉపయోగించినప్పుడు, ఆ నీళ్లు మళ్లీ విభజించబడ్డాయి, అలా ఆయన పొడి నేలపై నడిచి తిరిగి వెళ్లగలిగాడు. ఇశ్రాయేలులో సత్యారాధనను ప్రోత్సహించేందుకు ఎలీషా ఏలీయా యొక్క స్థానాన్ని భర్తీ చేశాడని ఆ అద్భుతం స్పష్టం చేసింది.—2 రాజులు 2:6-15.

దైవిక లక్షణాలు ప్రాముఖ్యం

3. యేసు ప్రత్యక్షత గురించి, ‘యెహోవా దినం’ గురించి పౌలు పేతురులు ఏమి చెప్పారు?

3 ఏలీయా మరియు ఎలీషాల కాలం గడిచిన శతాబ్దాల తర్వాత, అపొస్తలులైన పౌలు మరియు పేతురులు రాబోయే ‘యెహోవా దినాన్ని,’ యేసుక్రీస్తు ప్రత్యక్షతతో, ఇంకా భవిష్యత్తులో రానైయున్న “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి”తో జత చేశారు. (2 థెస్సలొనీకయులు 2:1, 2; 2 పేతురు 3:10-13) యెహోవా యొక్క ఆ మహా దినంలో అంటే దేవుడు తన శత్రువులను నాశనం చేసి తన ప్రజలను కాపాడేటప్పుడు, సజీవంగా మిగిలి ఉండేందుకు, మనం యెహోవాను వెదకి దీనత్వాన్నీ నీతినీ ప్రదర్శించాలి. (జెఫన్యా 2:1-3) ప్రవక్తయైన ఎలీషా ఇమిడివున్న కొన్ని సంఘటనలను మనం పరిశీలిస్తుండగా కొన్ని అదనపు లక్షణాలు మనకు స్పష్టమౌతాయి.

4. యెహోవా సేవలో ఆసక్తి ఏ పాత్ర వహిస్తుంది?

4 మనం ‘యెహోవా దినం’లో సజీవంగా మిగిలి ఉండాలంటే దేవుని సేవ కొరకు ఆసక్తి ఎంతో ప్రాముఖ్యం. ఏలీయా ఎలీషాలు యెహోవా సేవలో ఆసక్తి కలిగి ఉన్నారు. అదే విధమైన ఆసక్తితో, నేడు అభిషిక్త క్రైస్తవుల శేషం యెహోవాకు పవిత్రసేవను అందిస్తుంది మరియు రాజ్యసువార్త ప్రకటనలో నాయకత్వం వహిస్తుంది.a 1930వ దశాబ్దపు మధ్యకాలం నుండీ కూడా, రాజ్య వర్తమానాన్ని అంగీకరించి భూమిపై నిత్యం జీవించాలనే నిరీక్షణను కలిగివున్న వారిని యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలని వీరు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. (మార్కు 8:34; 1 పేతురు 3:21) ఈ ప్రోత్సాహానికి లక్షలాదిమంది అనుకూలంగా ప్రతిస్పందించారు. వారు ఒకప్పుడు ఆత్మీయ అంధకారంలో మరియు పాపంలో మరణించి ఉన్నప్పటికీ, ఇప్పుడు వారు దేవుని సత్యాలను నేర్చుకున్నారు, భూ పరదైసులో నిత్యం జీవించాలనే నిరీక్షణను హత్తుకున్నారు, మరియు యెహోవా సేవలో ఆసక్తిగా ఉన్నారు. (కీర్తన 37:29; ప్రకటన 21:3-5) వారు తమ ఆసక్తి, సహకారం, ఆతిథ్యం మరియు ఇతర సత్క్రియల ద్వారా ఇంకా భూమిపై మిగిలి ఉన్న క్రీస్తు ఆత్మీయ సహోదరులకు గొప్ప సేదదీర్పును అందిస్తున్నారు.—మత్తయి 25:31-46.

5. యేసు “సహోదరులకు” మేలు చేయడం ఎందుకంత ప్రాముఖ్యమైన విషయం, మరియు ఎలీషా కాలంనుండి మనకు ఏ ఉదాహరణ ఉంది?

5 క్రీస్తు ‘సహోదరులైన’ ఈ అభిషిక్తులు ఆయన అనుచరులై ఉన్నారనే కారణం మూలంగా వారికి మేలు చేసే ప్రజలు ‘యెహోవా దినం’లో సజీవంగా మిగిలి ఉండే నిరీక్షణను కలిగి ఉన్నారు. ఎలీషా ఎడలా ఆయన సేవకుని ఎడలా దయతో ప్రవర్తించి వారికి ఆతిథ్యాన్నిచ్చినందుకు షూనేము గ్రామంలోని ఒక వివాహిత జంట గొప్పగా ఆశీర్వదించబడ్డారు. వారికి కుమారుడు లేడు, భర్త వృద్ధుడు. అయితే ఆ షూనేమీయురాలగు స్త్రీ ఒక కుమారునికి జన్మనిస్తుందని ఎలీషా ఆమెకు వాగ్దానం చేశాడు, మరి ఆలాగే జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కుమారుడు మరణించినప్పుడు, ఎలీషా షూనేముకు వెళ్లి ఆ పిల్లవాన్ని పునరుత్థానం చేశాడు. (2 రాజులు 4:8-17, 32-37) ఎలీషాకు ఆతిథ్యాన్నివ్వడం ఎంతచక్కని ప్రతిఫలాన్ని తెచ్చిందో కదా!

6, 7. నయమాను ఎలాంటి మాదిరి ఉంచాడు, మరియు ‘యెహోవా దినంలో’ సజీవంగా మిగిలి ఉండటంపై ఇది ఎలాంటి ప్రభావం కలిగి ఉంటుంది?

6 యెహోవా దినంలో సజీవంగా మిగిలి ఉండే నిరీక్షణను కలిగి ఉండేందుకు క్రీస్తు “సహోదరుల” నుండి బైబిలు ఆధారిత నడిపింపును అంగీకరించేందుకు దీనత్వం అవసరం. సిరియా సైనికాధికారియైన కుష్టువ్యాధి గ్రస్తుడైన నయమానుకు, చెరలోనున్న ఇశ్రాయేలీయుల చిన్నది ఇచ్చిన సలహా వినేందుకూ స్వస్థతను కోరడానికి ఎలీషాను కనుగొనేందుకు ఇశ్రాయేలుకు వెళ్లేందుకూ దీనత్వం అవసరమయ్యింది. నయమానును కలిసేందుకు తన ఇంటి వెలుపలికి రావడానికి బదులుగా, ఎలీషా తన నుండి ఈ వర్తమానాన్ని పంపిస్తాడు: “నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదు[వు].” (2 రాజులు 5:10) నయమాను అహం దెబ్బతిన్నది, ఆయనకు ఆగ్రహం వచ్చింది, అయితే ఆ తర్వాత ఆయన దీనత్వంతో వెళ్లి యొర్దానులో ఏడుసార్లు మునుగుతాడు, “అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.” (2 రాజులు 5:14) ఇంటికి వెళ్లే ముందు నయమాను యెహోవా ప్రవక్తకు ధన్యవాదాలు చెప్పేందుకు తిరిగి షోమ్రోనుకు ప్రయాణమై వెళ్తాడు. దేవుడిచ్చిన శక్తుల ద్వారా వస్తురూపంగా లాభాన్ని పొందకూడదని తీర్మానించుకుని, ఎలీషా నయమానును కలిసేందుకు బయటకు వస్తాడు, అయితే ఎలాంటి బహుమతులనూ అంగీకరించడు. నయమాను దీనత్వంతో ఎలీషాకు ఇలా చెప్పాడు: ‘నీ దాసుడనైన నేను, యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు ఇకను అర్పింపను.’—2 రాజులు 5:17.

7 అభిషిక్తుల లేఖనాధార సలహాను దీనత్వంతో అంగీకరించడం ద్వారా, నేడు లక్షలాదిమంది గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు. అంతే కాకుండా, యేసు బలి మరణంలో విశ్వాసాన్ని ప్రదర్శించడం ద్వారా, యథార్థమైన హృదయంగల వీరు ఆత్మీయంగా శుద్ధి చేయబడ్డారు. వారు ఇప్పుడు యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తుల స్నేహితులుగా ఉండగల ఆధిక్యతను కలిగి ఉన్నారు. (కీర్తన 15:1, 2; లూకా 16:9) మరియు దేవుని ఎడలా ఆయన పరిచర్య ఎడలా వారికిగల భక్తికి ప్రతిఫలంగా, త్వరిత గతిన సమీపించబోతున్న ‘యెహోవా దినం’లో అహంకారులైన, పశ్చాత్తాపం చెందని పాపులకు కలుగబోయే నాశనం నుండి వారు తప్పించబడతారు.—లూకా 13:24; 1 యోహాను 1:7.

‘నా పక్షమందున్న వారెవరు?’

8. (ఎ) ‘యెహోవా దినం’లో సజీవంగా మిగిలి ఉండేవారు దైవిక చిత్తాన్ని చేయడం ఎడల ఏ దృక్పథాన్ని కలిగి ఉన్నారు? (బి) యెహూకు ఏ ఆజ్ఞ ఇవ్వబడింది? (సి) యెజెబెలుకు ఏమి జరుగనైయుండెను?

8 ‘యెహోవా దినంలో’ సజీవంగా మిగిలి ఉండాలని నిరీక్షించే వారు, దైవిక చిత్తాన్ని చేయడంలో నిర్ణయాత్మకంగా ఉండాలి. రాజైన అహాబు హత్యాకృతమైన మరియు బయలు ఆరాధికులైన కుటుంబమంతా నాశనం చేయబడుతుందని ఏలీయా ధైర్యంగా ముందే చెప్పాడు. (1 రాజులు 21:17-26) అయితే ఈ తీర్పు అమలు పర్చబడేందుకు ముందు, ఏలీయా స్థానాన్ని భర్తీ చేసిన వాడైన ఎలీషా, ముగించబడని కొంత పనిని తుదముట్టించ వలసి ఉంది. (1 రాజులు 19:15-17) యెహోవా యొక్క తగిన సమయం వచ్చినప్పుడు, వెళ్లి ఇశ్రాయేలీయుల క్రొత్త రాజుగా సైనికాధికారియైన యెహూను అభిషేకించమని ఎలీషా తన సేవకునికి చెప్పాడు. యెహును తైలంతో అభిషేకించిన తర్వాత, వర్తమానాన్ని తెచ్చిన సేవకుడు ఆయనకిలా చెప్పాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా—యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానిని బట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము. అహాబు సంతతివారందరును నశింతురు.” దుష్ట రాణియైన యెజెబెలు కుక్కలకు ఆహారమగునట్లు పడద్రోయబడుతుంది, ఆమె గౌరవంగా సమాధి చేయబడదు.—2 రాజులు 9:1-10.

9, 10. యెజెబెలు విషయంలో ఏలీయా మాటలు ఎలా నెరవేరాయి?

9 యెహూ అభిషేకించబడటం యొక్క ప్రామాణికతను ఆయన అనుచరులు గుర్తించి ఆయనను ఇశ్రాయేలీయుల క్రొత్త రాజుగా ప్రకటించారు. నిర్ణయాత్మకంగా ప్రవర్తిస్తూ, బయలు ఆరాధనలో ప్రముఖులైన మత భ్రష్టులకు తీర్పుతీర్చే తన పని ప్రారంభించేందుకు, యెహూ యెజ్రెయేలు వైపుకు ప్రయాణమౌతాడు. యెహూ యొక్క మొదటి బాణానికి గురైనది అహాబు కుమారుడైన రాజైన యెహోరాము. యెహూ శాంతి సమాచారాన్ని తెచ్చాడా అనే విషయాన్ని కనుగొనేందుకు అతడు నగరం వెలుపలకు వస్తాడు. “నీ తల్లియైన యెజెబెలు జారత్వమును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధానమెక్కడనుండి వచ్చు[ను?]” అని యెహూ ప్రశ్నిస్తాడు. దానితో యెహూ వేసిన బాణం యెహోరాము గుండెల్లో దిగింది.—2 రాజులు 9:22-24.

10 దైవిక స్త్రీలు యెజెబెలువలె లేక ఆమెవంటి వారివలె ఉండటాన్ని విసర్జిస్తారు. (ప్రకటన 2:18-23) యెహూ యెజ్రెయేలును చేరుకునే సరికి, ఆమె తనను తాను ఆకర్షణీయంగా చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె తన కిటికీ నుండి క్రిందకు చూస్తూ హేళనగా ఉక్రోషంతో ఆయనతో మాట్లాడింది. ఆయన ఆమె పని వాళ్లను ఇలా అడిగాడు: ‘నా పక్షమందున్న వారెవరు?’ వెంటనే ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూశారు. వారు యెహూ పక్షాన ఉన్నారా? “దీనిని క్రింద పడద్రోయు[డి]” అని ఆయన వారిని పురికొల్పాడు. అప్పుడు వారు ఎలాంటి సంశయానికి తావివ్వకుండా యెజెబెలును కిటికీలో నుండి క్రిందికి పడదోస్తారు. ఆమె గుర్రపు కాలి గిట్టలతో త్రొక్కబడుతుంది. ప్రజలామెను పాతి పెట్టేందుకు వచ్చినప్పుడు, వాళ్లకు “దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.” “కుక్కలు యెజెబెలు మాంసమును తినును” అని ఏలీయా పలికిన మాటల యొక్క ఎంత ఆశ్చర్యకరమైన సంపూర్ణమగు నెరవేర్పో గదా!—2 రాజులు 9:30-37.

సత్యారాధనకు హృదయపూర్వక మద్దతు

11. యెహోనాదాబు ఎవరు, సత్యారాధన ఎడల ఆయన తన మద్దతును ఎలా చూపాడు?

11 ‘యెహోవా దినం’లో సజీవంగా మిగిలి ఉండేందుకూ మరియు భూమిపై నిత్యం జీవించేందుకూ నిరీక్షిస్తున్న వారు సత్యారాధనకు హృదయపూర్వక మద్దతు ఇవ్వవలసి ఉన్నారు. వారు ఇశ్రాయేలీయుడు కాని యెహోవా ఆరాధికుడైన యెహోనాదాబు లేక యోనాదాబు వలె ఉండాలి. యెహూ తన నియామకాన్ని ఆసక్తితో ఇంకనూ నెరవేరుస్తుండగా, యెహోనాదాబు తన అంగీకారాన్నీ, మద్దతునూ చూపించాలని కోరుకున్నాడు. కాబట్టి, అహాబు కుటుంబంలోని మిగిలిన వారిని వధించేందుకు షోమ్రోను వైపుకు వెళ్తున్న ఇశ్రాయేలీయుల క్రొత్త రాజును కలిసేందుకు ఆయన వెళ్లాడు. యెహోనాదాబును చూసి యెహూ ఇలా అడిగాడు: “నీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా?” యెహోనాదాబు యొక్క అనుకూలమైన సమాధానం, “యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మ”ని చెబుతూ యెహోనాదాబుకు చేయి ఇచ్చి ఆయనను తన యుద్ధ రథంలోకి ఆహ్వానించేందుకు యెహూను పురికొల్పింది. యెహోవా యొక్క అభిషిక్త న్యాయతీర్పరికి తన మద్దతును చూపేందుకు లభించిన ఆధిక్యతను ఆయన ఆలస్యం చేయకుండా అంగీకరించాడు.—2 రాజులు 10:15-17.

12. యెహోవా సంపూర్ణ భక్తిని కోరడం ఎందుకు సరియైన విషయమే?

12 సత్యారాధనకు హృదయపూర్వక మద్దతునివ్వడం నిశ్చయంగా యోగ్యమైన విషయమే, ఎందుకంటే యెహోవా సృష్టికర్త మరియు విశ్వ సర్వాధిపతి, మన సంపూర్ణ భక్తిని ఆయన కోరడం సరియైన విషయమే, అందుకాయన అర్హుడు. ఆయన ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను.” (నిర్గమకాండము 20:4, 5) ‘యెహోవా దినం’లో సజీవంగా నిలిచి ఉండేందుకు నిరీక్షించే వారు ఆయనను మాత్రమే ఆరాధించాలి, అదీ “ఆత్మతోనూ సత్యముతోనూ” ఆరాధించాలి. (యోహాను 4:23, 24) వారు ఏలీయా, ఎలీషా మరియు యెహోనాదాబుల వలె సత్యారాధన నిమిత్తం స్థిరబుద్ధి కలిగి ఉండాలి.

13. యెహోనాదాబు హృదయం యెహూతో ఉన్న విధంగానే, మెస్సీయ రాజును ఎవరు అంగీకరించారు, మరి వారు దాన్ని ఎలా చూపుతారు?

13 అహాబు కుటుంబాన్ని మట్టుబెట్టిన తర్వాత, బయలు ఆరాధికులను గుర్తించి ఇశ్రాయేలులో నుండి అబద్ధ మతాన్ని నిర్మూలించేందుకు యెహూ ఇతర చర్యలు తీసుకున్నాడు. (2 రాజులు 10:18-28) నేడు, పరలోక రాజైన యేసుక్రీస్తు యెహోవా శత్రువులను నిర్మూలించి ఆయన సర్వాధిపత్యాన్ని ఘనపర్చేందుకు నియమించబడ్డాడు. యెహోనాదాబు హృదయం యెహూతో ఉన్న విధంగానే, యేసు యొక్క “వేరే గొఱ్ఱెలకు” చెందిన “గొప్ప సమూహం” నేడు క్రీస్తును మెస్సీయ రాజుగా హృదయపూర్వకంగా అంగీకరిస్తారు మరియు భూమిపైనున్న ఆయన ఆథ్యాత్మిక సహోదరులతో సహకరిస్తారు. (ప్రకటన 7:9, 10; యోహాను 10:16) సత్య మతాన్ని ఆచరించడం మరియు క్రైస్తవ పరిచర్యలో ఆసక్తితో భాగం వహించడం మరియు త్వరలో రాబోతున్న ‘యెహోవా దినాన్ని’ గురించి దేవుని శత్రువులను హెచ్చరించడం ద్వారా వారు దీనికి రుజువునిస్తారు.—మత్తయి 10:32, 33; రోమీయులు 10:9, 10.

నాటకీయ సంఘటనలు త్వరలో జరుగనున్నాయి!

14. అబద్ధ మతానికి మున్ముందు ఏమి జరుగుతుంది?

14 ఇశ్రాయేలులో బయలు ఆరాధనను రూపుమాపేందుకు యెహూ చర్యలు తీసుకున్నాడు. మన దినంలో, మహా గొప్ప యెహూ అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనుకు నాశనాన్ని కలిగిస్తాడు. అపొస్తలుడైన యోహానుకు దేవదూత చెప్పిన ఈ మాటల నెరవేర్పును మనం త్వరలోనే చూస్తాము: “నీవు పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను [మహా బబులోనును] ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.” (ప్రకటన 17:16, 17; 18:2-5) ఆ “పది కొమ్ములు” భూమిపై పరిపాలన సాగిస్తున్న సైనికపరమైన రాజకీయ శక్తులను సూచిస్తాయి. వారికి ఇప్పుడు మహాబబులోనుతో ఆథ్యాత్మికపరమైన వ్యభిచార సంబంధాలు ఉన్నప్పటికీ దాని సమయం స్వల్పకాలమే. ఈ ప్రపంచ రాజకీయ భాగం అబద్ధ మతాన్ని నిర్మూలిస్తుంది, మరి “క్రూర మృగం” అంటే ఐక్యరాజ్య సమితి దానిని నాశనం చేయడంలో “పది కొమ్ముల”తో కలిసి ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది.b యెహోవాను స్తుతించేందుకు అదెంత గొప్ప సందర్భమో కదా.—ప్రకటన 19:1-6.

15. దేవుని భూసంస్థను నిర్మూలించేందుకు ప్రయత్నం జరిగినప్పుడు ఏమి సంభవిస్తుంది?

15 రాజైన యెహూ బయలు ఆరాధనకు విరుద్ధంగా దాడి చేసిన తర్వాత, ఆయన రాజ కుటుంబం ఇశ్రాయేలు యొక్క రాజకీయ శత్రువులవైపు అవధానాన్ని మళ్లించింది. రాజైన యేసుక్రీస్తు అదే విధమైన చర్యలు తీసుకుంటాడు. బయలు వంటి అబద్ధమతం యొక్క నాశనం తర్వాత రాజకీయ శక్తులు ఇంకా మిగిలే ఉంటాయి. అపవాదియగు సాతాను ప్రభావం క్రింద, యెహోవా సర్వాధిపత్యపు శత్రువులు దేవుని భూ సంస్థను నిర్మూలించేందుకు తీవ్రమైన దాడి చేస్తారు. (యెహెజ్కేలు 38:14-16) అయితే “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అయిన అర్మగిద్దోనులో వారు నాశనమగులాగున వారిని హతమార్చేలా యేసుక్రీస్తును యెహోవా ఉపయోగించుకుంటాడు, ఇది యెహోవా సర్వాధిపత్యాన్ని సంపూర్ణంగా ఘనపరుస్తుంది.—ప్రకటన 16:14, 16; 19:11-21; యెహెజ్కేలు 38:18-23.

ఎలీషావంటి ఆసక్తితో సేవ చేయడం

16, 17. (ఎ) ఎలీషా తన జీవితాంతం వరకూ ఆసక్తితో ఉన్నాడనే విషయం మనకు ఎలా తెలుసు? (బి) సత్యపు బాణాలతో మనం ఏమి చేయాలి?

16 సాతాను యొక్క పూర్తి దుష్ట విధానానికి ‘యెహోవా దినం’ అంతం తెచ్చేంత వరకూ, దేవుని సేవకులు ఎలీషా వలె ధైర్యంగా మరియు ఆసక్తితో ఉంటారు. ఏలీయా శిష్యునిగా ఆయనకున్న నియామకానికి తోడు, ఎలీషా ఒంటరిగా యెహోవా ప్రవక్తగా 50 కంటే ఎక్కువ సంవత్సరాలు సేవ చేశాడు! మరి ఎలీషా తన సుదీర్ఘకాల జీవితాంతం వరకూ ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ఆయనిక మరణిస్తాడనగా, యెహూ మనుమడును రాజైన యెహోయాషు ఆయనను సందర్శించాడు. కిటికీ నుండి బయటకు బాణం వేయమని ఎలీషా అతడికి చెప్పాడు. ఆ బాణం గురి తప్పలేదు, మరి ఎలీషా ఇలా అన్నాడు: “ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువు.” ఎలీషా కోరిన మీదట యెహోయాషు తన బాణములతో నేలను కొడతాడు. అయితే ఆయన దాన్ని అల్పాసక్తితో కేవలం మూడుసార్లు మాత్రమే కొడతాడు. దాని ఫలితంగా, యెహోయాషు సిరియనులపై కేవలం మూడుసార్లు మాత్రమే విజయాన్ని సాధిస్తాడని ఎలీషా చెబుతాడు, వాస్తవమందు అదే సంభవిస్తుంది. (2 రాజులు 13:14-19, 25) రాజైన యెహోయాషు సిరియనులను పూర్తిగా అంటే “నాశనమగునట్లు” నిర్మూలించడు.

17 అయితే ఎలీషావంటి ఆసక్తితో అభిషిక్తులు అబద్ధారాధనకు విరుద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. భూ నిరీక్షణ గల వారి సహవాసులు అదే విధంగా చేస్తున్నారు. అంతే కాకుండా, ‘యెహోవా దినం’లో సజీవంగా మిగిలి ఉండేందుకు నిరీక్షిస్తున్న వారందరూ, నేలను కొట్టే విషయంలో ఎలీషా చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది. మన సత్యపు బాణాలను తీసుకుని వాటిని పదే పదే ఆసక్తిగా ఉపయోగిద్దాం, అవును వాటితో మన పని ముగిసిందని యెహోవా చెప్పేంత వరకూ అలానే చేద్దాము.

18. రెండవ పేతురు 3:11, 12 నందలి మాటలకు మనం ఎలా ప్రతిస్పందించాలి?

18 ‘యెహోవా దినం’ ప్రస్తుత దుష్ట విధానానికి త్వరలోనే అంతం తెస్తుంది. అపొస్తలుడైన పేతురు యొక్క హృదయపూర్వకమైన మాటల చేత ప్రోత్సహించ బడేందుకు మనలను మనం అనుమతించుకుందాము. “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, . . . దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను” అని పేతురు చెప్పాడు. (2 పేతురు 3:11, 12) యేసుక్రీస్తు ద్వారా వ్యక్తపర్చబడే దేవుని ఆగ్రహమనే అగ్నితో ఈ విధానం యొక్క ప్రతి భాగమూ నాశనం అయినప్పుడు, మంచి ప్రవర్తన మరియు దైవ భక్తిగల చరిత్రగలవారు మాత్రమే రక్షించబడతారు. నైతిక మరియు ఆత్మీయ శుద్ధత ఎంతో ప్రాముఖ్యం. తోటి మానవుల ఎడల వారి అవసరతల విషయంలో ప్రత్యేకంగా మన క్రైస్తవ పరిచర్య ద్వారా ఆత్మీయ రీతిలో ప్రతిస్పందించడం ద్వారా ప్రేమ చూపించడం కూడా అంతే ప్రాముఖ్యం.

19. ‘యెహోవా దినంలో’ సజీవంగా మిగిలి ఉండేందుకు మనం ఏమి చేయాలి?

19 మీ మాటలూ మరియు క్రియలూ మీరు దేవుని నమ్మకమైన, ఆసక్తిగల సేవకులనే విషయాన్ని గుర్తిస్తున్నాయా? ఒకవేళ అదే నిజమైతే, ‘యెహోవా దినంలో’ సజీవంగా మిగిలి ఉండి దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలోకి ప్రవేశించే నిరీక్షణను మీరు కలిగి ఉండగలరు. అవును, షూనేముకు చెందిన దంపతులు ఎలీషాకు ఆతిథ్యాన్ని ఇచ్చిన విధంగా క్రీస్తు ఆత్మీయ సహోదరులు ఆయన అనుచరులై ఉన్నారనే కారణాన్ని బట్టి వారికి మీరు మేలు చేస్తే మీరు కూడా సజీవంగా మిగిలి ఉండగలరు. సజీవంగా మిగిలి ఉండేందుకు మీరు కూడా, దైవిక ఉపదేశాన్ని దీనత్వంతో అంగీకరించి యెహోవా ఆరాధికునిగా మారిన నయమాను వలె ఉండాలి. మీరు భూ పరదైసులో నిత్యం జీవించేందుకు కోరుకుంటే, యెహోనాదాబు చూపిన విధంగా మీరు సత్యారాధనకు హృదయపూర్వకమైన మద్దతును ప్రదర్శించవలసి ఉంటుంది. అలాగైతే, “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని యేసు పలికిన మాటల నెరవేర్పును అనుభవించే యెహోవా యొక్క నమ్మకస్థులైన సేవకులలో మీరూ ఒకరై ఉంటారు.—మత్తయి 25:34.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రచురించిన “నీ నామము పవిత్రపరచబడు గాక” (ఆంగ్లం) అనే పుస్తకం యొక్క 18, 19 అధ్యాయాలను చూడండి.

b వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! లోని 254-6 పేజీలను చూడండి.

మీరు ఎలా ప్రత్యుత్తరమిస్తారు?

◻ ‘యెహోవా దినంలో’ సజీవంగా మిగిలి ఉండేందుకు అవసరమైన కొన్ని లక్షణాలు ఏవి?

◻ ఎలీషా దినాల్లో షూనేముకు చెందిన దంపతులు ఏ మాదిరినుంచారు?

◻ నయమాను నుండి ఏ పాఠాన్ని నేర్చుకోవచ్చు?

◻ మనం యెహోనాదాబు మాదిరిని ఎలా అనుకరించగలం?

◻ 2 పేతురు 3:11, 12 మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి