కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 9/1 పేజీలు 30-31
  • క్షమించడానికి సిద్ధంగావున్న ఒక తండ్రి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షమించడానికి సిద్ధంగావున్న ఒక తండ్రి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పిపోయి దొరికాడు
  • మన కొరకు పాఠాలు
  • తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • తప్పిపోయిన కుమారుని కథ
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • ‘యెహోవా కనికరము, దయగల దేవుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా కనికరాన్ని అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 9/1 పేజీలు 30-31

వారు యెహోవా చిత్తాన్ని చేశారు

క్షమించడానికి సిద్ధంగావున్న ఒక తండ్రి

ఇంతవరకు వ్రాయబడిన వాటన్నిటిలోకెల్లా అత్యంత గొప్ప కథానిక అని పిలువబడింది. అది అలా పిలువబడటం సబబే. తప్పిపోయిన తన కుమారుని ఎడల ఒక తండ్రి చూపించిన ప్రేమను గురించిన యేసు ఉపమానం ఒక కిటికీ లాంటిది. దానిలో నుండి, పశ్చాత్తాపపడే పాపుల ఎడల దేవునికి గల కనికరం యొక్క చక్కని దృశ్యాన్ని మనం చూడవచ్చు.

తప్పిపోయి దొరికాడు

ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులున్నారు. చిన్నవాడు ఆయనతో ఇలా అన్నాడు: ‘నీవు చనిపోయేంతవరకు ఆగే బదులు, ఆస్తిలో నా వంతు నాకు ఇప్పుడే కావాలి.’ తండ్రి ఒప్పుకున్నాడు, తనకున్నదానంతటిలో నుండి బహుశా మూడవ వంతును అంటే ఇద్దరు కుమారుల్లో చిన్నవాడికి న్యాయబద్ధంగా రావలసిన వంతును అతనికిచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 21:17) ఆ యౌవనస్థుడు ఆత్రంగా తన ఆస్తంతా సమకూర్చుకుని దూరదేశానికి ప్రయాణమై వెళ్లి, అక్కడ తన డబ్బంతా చెడు జీవితాన్ని గడపి ఖర్చు చేసేశాడు.—లూకా 15:11-13.

అప్పుడు తీవ్రమైన కరవు ఏర్పడింది. విధిలేక, ఆ యౌవనస్థుడు పందులను మేపే పనిని అంగీకరించాడు, ఆ పని ఒక యూదునికి నీచమైనది. (లేవీయకాండము 11:7, 8) ఆహార కొరత ఎంతగా ఉండేదంటే, పందులకు ఆహారంగా ఇవ్వబడే పొట్టు తినడానికి అతడు ఆశపడనారంభించాడు! చివరికి ఆ యౌవనస్థునికి బుద్ధి వచ్చింది. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ‘నా కంటే నా తండ్రి సేవకులకు మంచి ఆహారం లభిస్తుంది! నేను ఇంటికి తిరిగివెళ్లి, నా పాపాలు ఒప్పుకుని, నా తండ్రికున్న కూలివాళ్లల్లో ఒకరిగా ఉంటానని అడుగుతాను.’a—లూకా 15:14-19.

ఆ యౌవనస్థుడు కాలినడకన ఇంటిదారి పట్టాడు. అతని రూపం చాలామేరకు మారిందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, ‘అతడింకా దూరంగా ఉండగానే’ అతని తండ్రి అతన్ని గుర్తుపట్టాడు. కనికరంతో, ఆయన తన కుమారుని దగ్గరికి పరుగెత్తి వెళ్లి అతన్ని కౌగిలించుకుని, ‘అతన్ని ముద్దుపెట్టుకున్నాడు.’—లూకా 15:20.

ఈ వాత్సల్యపూరితమైన ఆహ్వానం ఆ యౌవనస్థుడు తన భావాలను వ్యక్తం చేయడాన్ని సులభతరం చేసింది. అతడు, “తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.” తండ్రి తన దాసులను పిలిపించి, వారికిలా ఆజ్ఞాపించాడు, “ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకె[ను].”—లూకా 15:21-24.

సంగీత నాట్యాలతో సహా పెద్ద విందు ప్రారంభమయ్యింది. పొలం నుండి తిరిగి వస్తున్న పెద్ద కుమారుడు ఈ శబ్దాలు విన్నాడు. తన సహోదరుడు తిరిగి వచ్చాడనీ, వేడుకకు కారణం అదనీ తెలుసుకున్నప్పుడు అతడు ఉగ్రుడైపోయాడు. ‘ఇన్ని ఏళ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివి’ అని తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. అతని తండ్రి దయగా ఇలా సమాధానమిచ్చాడు, ‘కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడ ఉన్నావు. నావన్నియు నీవి; మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరికెను.’—లూకా 15:25-32.

మన కొరకు పాఠాలు

యేసు ఉపమానంలోని తండ్రి కనికరంగల మన దేవుడైన యెహోవాను సూచిస్తున్నాడు. తప్పిపోయిన కుమారునిలా, కొంతమంది ప్రజలు కొంతకాలంపాటు దేవుని కుటుంబంలోవున్న భద్రతను వదిలి వెళతారు, కాని ఆ తర్వాత తిరిగివస్తారు. అలాంటి వారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు? యథార్థమైన పశ్చాత్తాపంతో యెహోవా యొద్దకు తిరిగి వచ్చేవారు, “ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు” అనే నిశ్చయతను కలిగివుండవచ్చు. (కీర్తన 103:9) ఆ ఉపమానంలో, తండ్రి తన కుమారున్ని తిరిగి ఆహ్వానించడానికి పరుగెత్తి వెళ్లాడు. అలాగే యెహోవా, పశ్చాత్తాపపడే పాపులను క్షమించడానికి సుముఖంగా ఉండడమే కాదు ఆత్రపడుతున్నాడు కూడా. ఆయన “క్షమించుటకు సిద్ధమైన మనస్సు” కలిగివున్నాడు, అదీ ఆయన “బహుగా” క్షమిస్తాడు.—కీర్తన 86:5; యెషయా 55:7; జెకర్యా 1:3.

యేసు ఉపమానంలో, తండ్రి చూపిన నిజమైన ప్రేమ, కుమారుడు తాను తిరిగి రావడానికి కావలసిన ధైర్యాన్ని కూడగట్టుకోవడాన్ని సులభతరం చేసింది. కాని ఇది పరిశీలించండి: తండ్రి అతన్ని నిరాకరించివుంటే లేక మళ్లీ ఎన్నడూ తిరిగి రావద్దని ఆగ్రహావేశాలతో చెప్పివుంటే, ఏం జరిగివుండేది? అలాంటి దృక్పథం అతన్ని శాశ్వతంగా విరోధ స్వభావిగా చేసివుండేది.—2 కొరింథీయులు 2:6, 7 పోల్చండి.

కాబట్టి, ఒక విధంగా, ఆ తండ్రి తన కుమారుడు వెళుతున్నప్పుడే అతడు మళ్లీ తిరిగి రావడానికి మార్గాన్నేర్పరిచాడు. కొన్నిసార్లు, నేటి క్రైస్తవ పెద్దలు పశ్చాత్తాపపడని పాపులను సంఘంలో నుండి తీసివేయవలసి ఉంటుంది. (1 కొరింథీయులు 5:11, 13) అలా చేయడంలో, భవిష్యత్తునందు తిరిగి సంఘంలోకి చేర్చుకొనబడేందుకు అతడు తీసుకోగల చర్యలను ప్రేమపూర్వకంగా తెలియజేయడం ద్వారా ఆ పాపి తిరిగి రావడానికి వారు మార్గాన్ని సుగమం చేయడం ప్రారంభించవచ్చు. హృదయపూర్వకంగా చేయబడిన అలాంటి విన్నపం యొక్క జ్ఞాపకం, ఆత్మీయంగా తప్పిపోయిన వారిని పశ్చాత్తాపపడేలా పురికొల్పి, వారు దేవుని కుటుంబానికి తిరిగి రావడానికి వారిని ప్రేరేపించింది.—2 తిమోతి 4:2.

తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి కనికరం కూడా చూపించాడు. అతని యథార్థమైన పశ్చాత్తాపాన్ని గుర్తించడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు. కాబట్టి, తన కుమారుడు తాను చేసిన పాపాల ప్రతీ వివరణనూ ఇవ్వాలని పట్టుబట్టే బదులు ఆయన అతన్ని తిరిగి ఆహ్వానించాడు, అదీ ఎంతో ఆనందంతో ఆయనలా చేశాడు. క్రైస్తవులు ఈ మాదిరిని అనుకరించవచ్చు. తప్పిపోయిన వ్యక్తి తిరిగి దొరికాడని వాళ్లు ఆనందించాలి.—లూకా 15:10.

తప్పిపోయిన తన కుమారుడు తిరిగి రావాలని ఆ తండ్రి ఎంత కాలంనుండో ఎదురు చూశాడని ఆయన ప్రవర్తన సుస్పష్టంగా చూపిస్తుంది. అయితే అది, తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిన వాళ్లందరి ఎడలా యెహోవాకున్న ఇష్టత యొక్క ఛాయ మాత్రమే. ఆయన, “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు[న్నాడు].” (ఇటాలిక్కులు మావి.) (2 పేతురు 3:9) కాబట్టి తమ పాపాల గురించి పశ్చాత్తాపపడేవారు, తాము ‘యెహోవా సముఖమునుండి విశ్రాంతికాలములతో’ ఆశీర్వదించబడతామని నిశ్చయత కలిగివుండవచ్చు.—అపొస్తలుల కార్యములు 3:19.

[అధస్సూచీలు]

a ఒక దాసుడు కుటుంబంలోని సభ్యునిగా దృష్టించబడతాడు కానీ ఒక కూలివానికి ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజు ఇవ్వబడతాయి, అతన్ని ఏ సమయంలోనైనా పనిలో నుండి తీసేయవచ్చు. తన తండ్రి గృహంలో అత్యల్ప స్థానాన్ని తీసుకోవడం కూడా తనకు సమ్మతమేనని ఆ యౌవనస్థుడు తర్కించుకున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి