‘యెహోవా కనికరము, దయగల దేవుడు’
“యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.”—నిర్గమకాండము 34:6.
1. (ఎ) తాము ప్రేమించే వ్యక్తులు పవిత్ర ఆరాధననుండి వైదొలగిపోవడాన్ని చూసిన వారికి బైబిలు ఏ ఓదార్పును ఇస్తోంది? (బి) తప్పిదస్థులను యెహోవా ఎలా దృష్టిస్తాడు?
“తానిక క్రైస్తవ సంఘంలో ఒక సభ్యురాలిగా ఉండనని మా అమ్మాయి నాతో అన్నది” అని ఒక క్రైస్తవ తండ్రి చెబుతున్నాడు. “రోజుల తరబడీ, వారాల తరబడీ, నెలల తరబడీ నాలో నేను కుమిలిపోయాను. దానికన్నా చావేమేలు.” మనం ప్రేమించే వ్యక్తి పవిత్ర ఆరాధననుండి వైదొలగిపోవడాన్ని చూడడం నిజానికెంతో కలతపర్చే విషయం. అలాంటి పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైందా? ఎదురైతే, యెహోవా మీ విషయంలో తదనుభూతిని కల్గివున్నాడని తెలుసుకోవడం, మీకు ఓదార్పునిస్తుంది. (నిర్గమకాండము 3:7; యెషయా 63:9) కానీ అలాంటి తప్పిదస్థుల్ని ఆయనెలా దృష్టిస్తాడు? తన అనుగ్రహాన్ని తిరిగి పొందేందుకు రమ్మని యెహోవా వారిని కనికరంతో ఆహ్వానిస్తున్నాడని బైబిలు చూపిస్తోంది. మలాకీ కాలంనాటి తిరుగుబాటుదారులైన యూదులను ఆయన ఇలా వేడుకున్నాడు: “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదు[ను].”—మలాకీ 3:7.
2. యెహోవా దేవుని వ్యక్తిత్వంలో కనికరమనేది ఒక ప్రధానమైన భాగమని బైబిలు ఎలా చూపిస్తోంది?
2 దేవుని కనికరము, సీనాయి పర్వతంపై మోషేకు ఉన్నతపర్చబడింది. అక్కడ యెహోవా తనను తాను “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవు[ని]”గా బయల్పర్చుకున్నాడు. (నిర్గమకాండము 34:6) యెహోవా దేవుని వ్యక్తిత్వంలో కనికరమనేది ఒక ప్రధానమైన భాగమని ఆ ప్రకటన నొక్కి చెబుతోంది. ఆయన “అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు[న్నాడు]” అని క్రైస్తవ అపొస్తలుడైన పేతురు రాశాడు. (2 పేతురు 3:9) దేవుని కనికరము అవధుల్లేనిదేమీ కాదు. “ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచ[డని]” మోషేకు చెప్పబడింది. (నిర్గమకాండము 34:7; 2 పేతురు 2:9) అయినప్పటికీ, “దేవుడు ప్రేమాస్వరూపి,” కనికరము ఆ లక్షణానికున్న ఒక ప్రధానమైన భాగమైవుంది. (1 యోహాను 4:8; యాకోబు 3:17) “ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక” యెహోవా “నిరంతరము కోపముంచడు.”—మీకా 7:18, 19.
3. కనికరము విషయంలో శాస్త్రులూ, పరిసయ్యుల దృక్కోణానికి భిన్నంగా యేసు దృక్కోణమెలా ఉంది?
3 యేసు తన పరలోకపు తండ్రిని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. (యోహాను 5:19) ఆయన తప్పిదస్థులతో దయాపూర్వకంగా వ్యవహరించడం, వాళ్లు చేసిన పాపాల్ని చూసీచూడనట్లు ఊరుకుంటున్నాడని కాదుగానీ భౌతిక అస్వస్థతలకు గురైన వారిపట్ల ఆయన చూపించిన వాత్సల్యపూరితమైన భావాలవంటి వాటినే వారిపట్ల కూడా వ్యక్తపర్చడమని భావం. (పోల్చండి మార్కు 1:40, 41.) అవును, యేసు దేవుని ధర్మశాస్త్రములో “ప్రధానమైన విషయముల”లో కనికరమును చేర్చాడు. (మత్తయి 23:23) దానికి భిన్నంగా, న్యాయానికి సంబంధించి ఎవరి చట్టబద్ధమైన సిద్ధాంతాలు సాధారణంగా కనికరానికి పూర్తిగా తావివ్వవో ఆ శాస్త్రులనూ, పరిసయ్యులనూ పరిశీలించండి. యేసు పాపులతో కలిసి ఉండడాన్ని వాళ్లు చూసినప్పుడు, వాళ్లు “ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని” ఫిర్యాదు చేశారు. (లూకా 15:1, 2) యేసు మూడు ఉపమానాల్ని చెప్పడం ద్వారా, తనను నిందించిన వారికి జవాబిచ్చాడు. వాటిలో ప్రతీదీ దేవుని కనికరాన్ని నొక్కి చెబుతున్నాయి.
4. ఏ రెండు ఉపమానాల్ని యేసు తెలియజేశాడు, ప్రతీ దాంట్లోనూ ఏ విషయం వ్యక్తపర్చబడింది?
4 మొదటిగా, యేసు తొంభైతొమ్మిది గొఱ్ఱెలనూ విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొఱ్ఱెను వెదకవెళ్లిన మనుష్యుని గురించి చెప్పాడు. ఆయన చెప్పిన విషయం? “మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.” తర్వాత, తాను పోగొట్టుకున్న వెండి నాణాన్ని గురించి వెదకి, అది దొరికినప్పుడు సంతోషించిన స్త్రీని గురించి యేసు చెప్పాడు. ఆయన అన్వయింపు? “మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగు[ను].” తన మూడవ ఉపమానాన్ని యేసు ఒక నీతికథ రూపంలో తెలియజేశాడు.a అనేకమంది దాన్ని ఎంతో చక్కని చిన్న కథ అని కొనియాడారు. ఈ నీతి కథను పరిశీలించడం, దేవుని కనికరాన్ని గుణగ్రహించి, దాన్ని అనుకరించేందుకు మనకు సహాయపడుతుంది.—లూకా 15:3-10.
తిరుగుబాటు చేసిన కుమారుడు ఇంట్లో నుండి వెళ్లి పోవడం
5, 6. యేసు చెప్పిన మూడవ నీతికథలోని చిన్న కుమారుడు దిగ్భ్రాంతిని కల్గించేలా మెప్పుదలలేనితనాన్ని ఎలా చూపించాడు?
5 “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు—తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయ, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను [“భోగవిలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి, తన ఆస్తిని అంతటిని మంటకలిపెను,” క్యాతలిక్ అనువాదము].” (ఇటాలిక్కులు మావి.)—లూకా 15:11-13.
6 చిన్న కుమారుడు ఇక్కడ దిగ్భ్రాంతిని కల్గించేలా మెప్పుదలలేనితనాన్ని చూపించాడు. మొదట, తనకు రావాల్సిన ఆస్తిని ఇమ్మని అడిగాడు, ఆ తర్వాత అతడు “భోగవిలాసములతో” కూడిన జీవితాన్ని జీవించడం ద్వారా దాన్ని దుర్వినియోగం చేశాడు. “భోగవిలాసములు” అనే పదబంధం “విచ్చలవిడిగా జీవించడం” అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం నుండి అనువదించబడింది. ఆ పదం “శీలానికి పూర్తిగా తిలోదకాలు ఇవ్వడం అనే భావాన్ని వ్యక్తపరుస్తుంద”ని ఒక పండితుడు తెలియజేస్తున్నాడు. సకారణంగానే, యేసు చెప్పిన నీతికథలోని చిన్న కొడుకు తరచుగా తప్పిపోయిన కుమారుడు అని పిలువబడ్డాడు. అది నిర్లక్ష్యంగా దుబారా చేసే, వృధాచేసే వ్యక్తిని వర్ణిస్తోన్న పదమైవుంది.
7. తప్పిపోయిన కుమారుణ్ణి నేడు ఎవరు ప్రతిబింబిస్తున్నారు, అలాంటి వ్యక్తులు “దూర దేశము”లో స్వేచ్ఛాజీవితాన్ని ఎందుకు వెదుకుతున్నారు?
7 ఆ తప్పిపోయిన కుమారుడ్ని ప్రతిబింబించే ప్రజలు నేడు ఉన్నారా? ఉన్నారు. సాపేక్షకంగా చూస్తే కొంతమంది మన పరలోకపు తండ్రియైన యెహోవా దేవుని సురక్షితమైన ‘గృహాన్ని’ విడిచిపెట్టి వెళ్లిపోవడం విచారకరమైన విషయం. (1 తిమోతి 3:15) దేవుని గృహ వాతావరణం మరీ నిర్బంధంగా ఉన్నట్టూ, యెహోవా దృష్టి కాపుదలగా ఉండడానికి బదులు మరింత ప్రతిబంధకంగా ఉన్నట్టూ వారిలో కొందరు భావిస్తారు. (పోల్చండి కీర్తన 32:8.) బైబిలు సూత్రాల ప్రకారంగా పెరిగినా అటు తర్వాత మద్యపాన మాదకద్రవ్యాల దుర్వినియోగంలో చిక్కుకున్న ఒక క్రైస్తవ స్త్రీని పరిశీలించండి. తన జీవితంలోని ఆ చీకటి గడియలనొకసారి వెనక్కి తిరిగి చూసుకొని, ఆమె ఇలా అంటోంది: “నాకుగా నేనొక మంచి జీవితాన్ని గడపగలనని రుజువు చేసుకోవాలనుకున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో దాన్నే చేయాలనుకునేదాన్ని, దానికి భిన్నంగా నాకు ఎవ్వరూ చెప్పకూడదని అనుకునేదాన్ని.” తప్పిపోయిన కుమారునివలే, ఈ యువతి స్వేచ్ఛను కోరుకుంది. విచారకరంగా, లేఖన విరుద్ధంగా చేసిన క్రియలనుబట్టి ఆమె క్రైస్తవ సంఘం నుండి వెలివేయబడింది.—1 కొరింథీయులు 5:11-13.
8. (ఎ) దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా జీవించాలని కోరుకునే వ్యక్తులకు ఎలాంటి సహాయం అందించబడుతుంది? (బి) ఆరాధనా విషయంలో ఒకరు తాను చేసుకునే ఎంపికను ఎందుకు గంభీరంగా పరిశీలించుకోవాలి?
8 దేవుని ప్రమాణాలకు భిన్నంగా జీవించాలనే కోరికను తోటి విశ్వాసి కనుపర్చినప్పుడు, అది హృదయాన్ని నిజంగా నలిపివేస్తుంది. (ఫిలిప్పీయులు 3:18) ఇది జరిగినప్పుడు, పెద్దలూ, ఆధ్యాత్మిక అర్హతలున్న ఇతరులూ తప్పు చేసిన వ్యక్తిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. (గలతీయులు 6:1) అయినప్పటికీ, క్రైస్తవ శిష్యరికమనే కాడిని అంగీకరించమని ఎవ్వరూ ఒత్తిడి చేయబడలేదు. (మత్తయి 11:28-30; 16:24) పిల్లలు కూడా తమకు యుక్తవయస్సు వచ్చినప్పుడు, ఆరాధన విషయంలో వాళ్లు వ్యక్తిగతమైన ఎంపికను చేసుకోవాల్సిందే. మొత్తంమీద, మనలో ప్రతి ఒక్కరూ, తనకుగా తాను దేవునికి లెక్కను అప్పగించాల్సిన స్వేచ్ఛా నైతిక ప్రతినిధియై ఉన్నారు. (రోమీయులు 14:11) మనం ‘ఏం విత్తుతామో దాన్నే కోస్తా’ము, యేసు చెప్పిన నీతికథలోని తప్పిపోయిన కుమారుడు త్వరలోనే అదే గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంది.—గలతీయులు 6:7, 8.
దూర దేశంలో అగచాట్లు
9, 10. (ఎ) తప్పిపోయిన కుమారుడు, పరిస్థితుల్లో ఏ మార్పును చవిచూడాల్సి వచ్చింది, మరి దానికి అతడెలా ప్రతిస్పందించాడు? (బి) తప్పిపోయిన కుమారుడు చవిచూసిన దురవస్థని పోలిన దాన్నే నేడు సత్యారాధనను విడనాడిన కొందరెలా చవిచూడాల్సి వచ్చిందో ఉదహరించండి.
9 “అదంతయు ఖర్చుచేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.” (ఇటాలిక్కులు మావి.)—లూకా 15:14-16.
10 తప్పిపోయిన కుమారుడు దిక్కులేనివాడిగా ఉన్నప్పటికీ, అతడు తిరిగి ఇంటికి వెళ్లిపోదామని అప్పటికింకా నిశ్చయించుకోలేదు. బదులుగా, అతడు ఆ దేశస్థుల్లో ఒకడ్ని కలుసుకొని, అతడి దగ్గర పందుల్ని మేపే పనికి కుదిరాడు. పందులను అపవిత్రమైన జంతువులుగా మోషే ధర్మశాస్త్రం నిర్ణయించింది గనుక, అలాంటి పని చేయడం ఒక యూదునికి ధర్మశాస్త్రానుసారంగా అంగీకృతమైన పనికాకపోవచ్చు. (లేవీయకాండము 11:7, 8) కానీ తప్పిపోయిన కుమారుడి మనస్సాక్షి కలతపర్చి ఉన్నట్టైతే అతడు ఆ మనస్సాక్షిని అణగద్రొక్కేసి ఉంటాడు. ఎంతైనా ఆ దేశస్థుల్లో ఒకడైన తన యజమాని, దిక్కులేని పరాయి దేశస్థుడైన తన భావాలను పరిగణలోకి తీసుకోవాలని అతడు అపేక్షించలేడు. తప్పిపోయిన కుమారుని దురవస్థ, నేడు పవిత్రారాధన యొక్క తిన్నని మార్గాన్ని విడనాడిన అనేకమంది అనుభవాన్ని పోలి ఉంది. తరచుగా, అటువంటి వ్యక్తులు ఇంతకు ముందు తాము నీచమైనవని వేటినైతే భావించేవారో అలాంటి కార్యకలాపాల్లో ఇప్పుడు ఇమిడిపోతారు. ఉదాహరణకు, 17 ఏళ్ల వయస్సులో ఓ యువకుడు తన క్రైస్తవ పెంపకానికి విరుద్ధంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. “సంవత్సరాల తరబడి నేర్చుకున్న బైబిలు బోధల్ని దుర్నీతీ, మాదక ద్రవ్యాల దుర్వినియోగమూ తుడిచివేశాయి” అని అతడు అంగీకరించాడు. త్వరలోనే, సాయుధ దోపిడీ, హత్యా చేసినందుకుగాను ఆ యువకుడు కటకటాల వెనుక కూర్చోవాల్సి వచ్చింది. అటు తర్వాత అతడు ఆధ్యాత్మికంగా కోలుకున్నప్పటికీ, ‘అల్పకాల పాపభోగాన్ని అనుభవించడం’ మూలంగా అతడెంత పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందో కదా!—పోల్చండి హెబ్రీయులు 11:24-26.
11. తప్పిపోయిన కుమారుని దురవస్థ ఎంతగా దిగజారిపోయింది, లోకపు ఆశలు “మోసకరమైన శుష్క” విషయాలుగా ఉన్నట్టు నేడు కొంతమంది ఎలా కనుగొన్నారు?
11 “యెవడును వాని కేమియు ఇయ్యలేద”నే వాస్తవాన్నిబట్టి చూస్తే తప్పిపోయిన కుమారుని దురవస్థ మరింత దిగజారినట్టుంది. అతనితో క్రొత్తగా జతగట్టిన స్నేహితులంతా ఏమయ్యారు? ఇప్పుడు అతని దగ్గర చిల్లిగవ్వైనాలేదు, అతడు వారికిప్పుడు ‘అసహ్యునిగా’ ఉన్నట్టున్నాడు. (సామెతలు 14:20) అదే విధంగా, నేడు తమ విశ్వాసాన్ని విడనాడే అనేకులు, ఈ లోకపు ఆశలూ, దృక్పథాలూ “మోసకరమైన శుష్క” విషయాలుగా ఉన్నట్టు కనుగొన్నారు. (కొలొస్సయులు 2:8, క్యాతలిక్ అనువాదము) “యెహోవా నడిపింపు లేకపోవడంతో నేనెంతో వేదనా బాధల్ని అనుభవించాను” అని దేవుని సంస్థను కొంతకాలం విడిచిపెట్టిన ఓ యువతి అంటోంది. “నేను లోకంలో ఇమిడిపోవడానికి ప్రయత్నించాను కానీ, నిజానికి నేను ఇతరుల్లా లేకపోవడంతో వాళ్లు నన్ను తిరస్కరించారు. నేను దారితప్పిన పసిబిడ్డలా అయ్యాను, నన్ను నడిపించడానికి తండ్రి అవసరమెంతైనా ఉంది. నాకు యెహోవా అవసరమని నేను గ్రహించినప్పుడు జరిగిందది. ఆయన్ని విడిచి స్వేచ్ఛగా జీవించాలని ఇక నేనెన్నడూ కోరుకోను.” యేసు ఉపమానంలోని తప్పిపోయిన కుమారుడు కూడా అదే విధమైన నిర్ధారణకు వచ్చాడు.
తప్పిపోయిన కుమారునికి కనువిప్పు కలగడం
12, 13. కనువిప్పు కలిగేందుకు నేడు ఏ కారకాలు కొంతమందికి సహాయపడ్డాయి? (బాక్సును చూడండి.)
12 “బుద్ధి [“కనువిప్పు కలిగి,” క్యాతలిక్ అనువాదము] వచ్చినప్పుడు వాడు—నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి—తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.” (ఇటాలిక్కులు మావి.)—లూకా 15:17-20.
13 తప్పిపోయిన కుమారునికి ‘కనువిప్పు కలిగింది.’ అతడు కొంతకాలం ఊహాలోకంలో ఉన్నట్టుగా భోగలాలస జీవితాన్ని వెదకడంలో మునిగితేలాడు. కానీ ఇప్పుడు అతడు తానున్న ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటో బాగా గుర్తెరిగాడు. అవును, అతడు దిగజారిపోయినప్పటికీ, ఆ యువకునికి ఇంకా నిరీక్షణ ఉంది. అతనిలో ఇంకా ఏవో కొన్ని మంచి లక్షణాలు మిగిలే ఉన్నాయి. (సామెతలు 24:16; పోల్చండి 2 దినవృత్తాంతములు 19:2, 3.) నేడు దేవుని మందను విడిచి వెళ్లిపోయే వారి సంగతేమిటి? దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా వాళ్లు పాపం చేశారని ప్రతి సందర్భంలోనూ వాళ్లు ఎగురవేసిన తిరుగుబాటు బావుటా రుజువు చేస్తున్నందున వాళ్లపై ఆశలు వదులుకోవాల్సిందే అనే నిర్ధారణకు రావడం సహేతుకమేనా? (మత్తయి 12:31, 32) తప్పకుండా సహేతుకమైన విషయమై ఉండాలనేమీ లేదు. బాధ్యతారహితమైన తమ నడవడినిబట్టి కొంతమంది బాధలు పొందారు, వారిలో అనేకమందికి సకాలంలోనే కనువిప్పు కలిగింది. దేవుని సంస్థనుండి తాను వైదొలగిపోయిన కాలాన్ని గురించి తలపోస్తూ, ఒక సహోదరి “నేనెప్పుడూ, కనీసం ఒక్కరోజు కూడా, యెహోవాను మర్చిపోలేదు” అని చెబుతోంది. “ఏదో ఒక విధంగా, ఏదొక రోజున ఆయన, నేను వెనక్కి, సత్యంలోకి తిరిగి రావడానికి అంగీకరిస్తాడని ఎల్లప్పుడూ ప్రార్థించేదాన్ని.”—కీర్తన 119:176.
14. తప్పిపోయిన కుమారుడు ఏమని తీర్మానించుకున్నాడు, అలా చేయడంలో అతడు తన దీనత్వాన్ని ఎలా చూపించుకున్నాడు?
14 కానీ త్రోవ తప్పిపోయినవాళ్లు తమ దుస్థితి విషయంలో ఏం చెయ్యగలరు? యేసు చెప్పిన నీతికథలోని తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగివెళ్లి, తన తండ్రిని క్షమించమని అడగాలని నిశ్చయించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు “నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని” చెప్పడానికి తీర్మానించుకున్నాడు. కూలికి పనిచేసే సేవకుడు రోజువారీ పనివాడు, అతనికి ఒక్కరోజు గడువిచ్చి పనిలోనుండి తీసివేయవచ్చు. ఇది కుటుంబ సభ్యుల్లో ఒకనిగా కలిసిపోయి ఉండే ఒక దాసుని స్థాయికన్నా కూడా తక్కువే. కాబట్టి కుమారునిగా తన్ను తిరిగి చేర్చుకోమని అడగాలనే ఆలోచనే తప్పిపోయిన కుమారునికి లేదు. పునరుజ్జీవించబడిన తన యథార్థతను తన తండ్రికి నానాటికీ రుజువుచేసుకునేలా నీచమైన స్థాయిని అంగీకరించడానికి అతడు ఎంతో సుముఖంగా ఉన్నాడు. అయితే, తప్పిపోయిన కుమారుడు ఆశ్చర్యానికిలోనౌతాడు.
హృదయాన్నుత్సాహపర్చే స్వాగతం
15-17. (ఎ) తన కుమారుడ్ని చూసి తండ్రి ఎలా ప్రతిస్పందించాడు? (బి) తండ్రి తన కుమారుడికి ఇచ్చిన వస్త్రం, ఉంగరం, చెప్పులు దేన్ని సూచిస్తున్నాయి? (సి) విందుకోసం తండ్రి చేసిన ఏర్పాట్లు దేన్ని సూచించాయి?
15 “వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో—తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయతే తండ్రి తన దాసులను చూచి—ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నా కుమారుడు చనిపోయమరల బ్రదికెను, తప్పిపోయ దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.” (ఇటాలిక్కులు మావి.)—లూకా 15:20-24.
16 ప్రేమగల ఏ తండ్రైనా తన బిడ్డ ఆధ్యాత్మికంగా తిరిగి కోలుకోవాలని ఎదురుచూస్తాడు. కాబట్టి, తప్పిపోయిన కుమారుని తండ్రి ప్రతి దినమూ త్రోవవైపు తేరిచూస్తూ, తన కుమారుని రాక కోసం వ్యాకులతతో ఎదురు చూడడాన్ని మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఆయన తన కుమారుడు రావడాన్ని చూస్తాడు! ఆ చిన్నవాని రూపం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందనడంలో సందేహమేమీలేదు. అయినప్పటికీ, ‘వాడింక దూరముగా ఉండగానే’ తండ్రి వాడ్ని గుర్తిస్తాడు. ఆయన వాడి చింపిరి గుడ్డల్నిగానీ, నిరాశాజనకమైన మనఃస్థితినిగానీ చూడడు; ఆయన తన కుమారుణ్నే చూస్తున్నాడు, వాడ్ని కలుసుకోవడానికి పరిగెడతాడు!
17 ఆ తండ్రి తన కొడుకును సమీపించి, వాడి మెడమీదపడి ఎంతో వాత్సల్యంతో ముద్దుపెట్టుకొన్నాడు. ఆ తండ్రి తన దాసుల్ని పిలిచి తన కుమారుడికి వస్త్రాన్నీ, ఉంగరాన్నీ, చెప్పులనూ ఇవ్వమని ఆజ్ఞాపించాడు. ఆ వస్త్రం సాదాసీదాయైన వస్త్రం కాదుగానీ, ‘ప్రశస్తమైన’ వస్త్రం అంటే బహుశా గౌరవనీయుడైన అతిథికి బహుకరించేటువంటి చక్కని ఎంబ్రాయిడరీ చేసిన ఓ తరహా అధికారిక వస్త్రం. ఉంగరాలనూ, చెప్పులనూ సాధారణంగా దాసులు ధరించరు కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఒకనిగా ఉండే హోదాతో తన కుమారుడ్ని ఆహ్వానిస్తున్నాననే విషయాన్ని తండ్రి స్పష్టం చేశాడు. కానీ ఆ తండ్రి అంతకన్నా ఇంకా ఎక్కువే చేశాడు. తన కుమారుడు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని విందుకు ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. తన కుమారుడ్ని అపాత్రంగా క్షమించలేదు లేదా తన కుమారుడు తిరిగొచ్చాడు కదా పోనీలే క్షమాబిక్ష పెడదాం అనీ చేయలేదు; ఆయన క్షమాగుణాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. అది ఆయన సంతోషించేలా చేసింది.
18, 19. (ఎ) తప్పిపోయిన కుమారుని నీతికథ యెహోవాను గురించి మీకేమి బోధిస్తోంది? (బి) యూదా యెరూషలేములతో ఆయన వ్యవహారాలు చూపించినట్లుగా, పాపులు తిరిగి రావాలని యెహోవా ఎలా “కనిపెడ్తున్నాడు”?
18 మనకు ఎవరినైతే ఆరాధించే ఆధిక్యత ఉందో ఆ సత్య దేవుని గురించి తప్పిపోయిన కుమారుని నీతికథ ఏం తెలియజేస్తోంది? మొదట, యెహోవా “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవు”డని తెలియజేస్తోంది. (నిర్గమకాండము 34:6) నిశ్చయంగా, కనికరం అనేది దేవుని ప్రాముఖ్యమైన లక్షణం. అవసరతలో ఉన్న వారి విషయంలో సర్వసాధారణంగా ఆయన ప్రతిస్పందించే విధానమే అది. తర్వాత, యేసు చెప్పిన నీతికథ యెహోవా “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడ”ని మనకు బోధిస్తోంది. (కీర్తన 86:5) అలంకారికంగా చెప్పాలంటే, తాను వారిపట్ల కనికరాన్ని చూపించడానికి ఆధారాన్నిచ్చేలా పాపులైన మానవుల హృదయాల్లో వచ్చే ఏ కొద్దిపాటి మార్పునైనా గమనించేందుకు ఆయన ఎంతో జాగ్రత్తగా అవధానాన్ని నిలుపుతాడు.—2 దినవృత్తాంతములు 12:12; 16:9.
19 ఉదాహరణకు, ఇశ్రాయేలీయులతో దేవుని వ్యవహారాల్ని గురించి ఆలోచించండి. యూదా యెరూషలేములకు ‘అరకాలు మొదలుకొని నడినెత్తివరకు స్వస్థత కొంచెమైనను లేనట్టుగా’ వర్ణించేలా యెహోవా యెషయా ప్రవక్తను ప్రేరేపించాడు. అయినప్పటికీ, ఆయన ఇంకా ఇలా తెలియజేశాడు: “మీకు తన దయను చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాడు.” (యెషయా 1:5, 6; 30:18, పరిశుద్ధ బైబల్; 55:7; యెహెజ్కేలు 33:11) యేసు చెప్పిన నీతికథలోని తండ్రివలే, అలంకారికంగా చెప్పాలంటే యెహోవా ‘త్రోవవైపు ఎదురుతెన్నులు చూస్తున్నాడు.’ తన ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయిన వాళ్లలో ఎవరైనా తిరిగివస్తారేమోనని ఆయన ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ప్రేమగల తండ్రి నుండి మనం ఎదురుచూసేదదే కదా?—కీర్తన 103:13.
20, 21. (ఎ) నేడు అనేకమందిని దేవుని కనికరాన్ని ఏ విధంగా ఆకట్టుకుంటోంది? (బి) దీని తర్వాతి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?
20 ప్రతీ సంవత్సరమూ, అనేకమందికి కనువిప్పు కలిగి, వాళ్లు తిరిగి సత్యారాధనలోనికి వచ్చేలా, యెహోవా దేవుని కనికరము వారిని ఆకట్టుకుంటోంది. వాళ్లను ప్రేమించేవారికి అదెంతటి ఆనందాన్ని తెస్తుందో కదా! ఉదాహరణకు, ఈ శీర్షిక ప్రారంభంలో ప్రస్తావించబడిన క్రైస్తవ తండ్రినే తీసుకోండి. సంతోషదాయకంగా, ఆయన కుమార్తె ఆధ్యాత్మికంగా తిరిగి కోలుకుంది, మరి ఇప్పుడు పూర్తికాల పరిచారకురాలుగా సేవ చేస్తోంది. “ఈ పాత విధానంలో ఒక వ్యక్తి ఎంతమేరకు సంతోషంగా ఉండగలడో నేను అంత మేరకు సంతోషంగా ఉన్నాను, నా కన్నీరు ఆనంద బాష్పాలుగా మారింది” అని ఆయన అంటున్నాడు. నిశ్చయంగా, యెహోవా కూడా ఆనందిస్తాడు!—సామెతలు 27:11.
21 కానీ తప్పిపోయిన కుమారుని గూర్చిన నీతికథలో అంతకన్నా ఇంకా ఎక్కువే ఇమిడివుంది. శాస్త్రులూ, పరిసయ్యులలో సర్వసాధారణమైన దండించే ధోరణికి యెహోవా దేవుని కనికరము ఎంత భిన్నంగా ఉందో చూపించేలా యేసు ఆ కథను ఇంకా కొనసాగించాడు. ఆయన దాన్నేవిధంగా కొనసాగించాడు—ఇది మనకే భావాన్ని ఇస్తుంది అనేవి దీని తర్వాతి శీర్షికలో చర్చించబడతాయి.
[అధస్సూచీలు]
a బైబిల్లో చెప్పబడిన నీతి కథలూ, మరితర ఉపమానాలూ వాస్తవికంగా జరిగినవై ఉండాల్సిన అవసరంలేదు. అంతేగాక, ఈ కథల ఉద్దేశం నీతిని బోధించడమే గనుక, ప్రతీ వివరణలో సూచనార్థక అర్థాన్ని వెదకాల్సిన అవసరంలేదు.
పునఃసమీక్షలో
◻ కనికరము విషయంలో యేసు వైఖరి పరిసయ్యులకు భిన్నంగా ఎలా ఉంది?
◻ తప్పిపోయిన కుమారుడ్ని నేడు ఎవరు ప్రతిబింబిస్తున్నారు, ఏ విధంగా?
◻ ఏ పరిస్థితులు తప్పిపోయిన కుమారుడికి కనువిప్పును కలిగించాయి?
◻ పశ్చాత్తాపాన్ని కనపర్చిన తన కుమారునిపట్ల తండ్రి ఎలా కనికరాన్ని చూపించాడు?
[11వ పేజీలోని బాక్సు]
వాళ్లకు కనువిప్పు కలిగింది
ఒకసారి క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడిన వారిలో కొందరికి కనువిప్పు కలిగేలా ఏం సహాయపడింది? ఆ విషయంపై ఈ క్రింది వ్యాఖ్యానాలు వెలుగును ప్రసరింపచేస్తున్నాయి.
“సత్యమెక్కడుందనే విషయం నా అంతరంగానికి ఇప్పటికీ తెలుసు. సంవత్సరాల తరబడి బైబిల్ని చదవడమూ, క్రైస్తవ కూటాలకు హాజరవ్వడమూ నాపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. నేనిక యెహోవాను బాహాటంగా ఎలా నిర్లక్ష్యం చేయగలను? ఆయన నన్ను విడనాడలేదు; నేనే ఆయన్ని విడిచిపెట్టాను. నేను చేసిందెంత తప్పో, నేనెంత మూర్ఖుణ్ణో గ్రహించాను, ‘మీరేం విత్తుతారో దాన్నే కోస్తారని’ తెలియజేసిన యెహోవా వాక్యం ఎల్లప్పుడూ సరియైదనే విషయాన్ని నేను చివరకు గ్రహించాను.—సి. డబ్ల్యు.
“నా చిన్నారి పాపకు యెహోవా ఎవరు, ఆయనకు ఎలా ప్రార్థించాలి వంటి విషయాల్ని చెప్పాలని అనుకున్నాను, అది మాట్లాడ్డం మొదలు పెట్టడం నా హృదయాన్ని ఎంతగానో తాకింది. నిద్రపట్టక కొట్టుమిట్టాడుతూ, అర్థరాత్రి లేచి పార్కుకెళ్లి భోరున ఏడ్చాను. నేను ఏడ్చి ఏడ్చి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రార్థనలో యెహోవాతో ఎక్కువసేపు గడిపాను. నాకు కావాల్సిందల్లా ఏమిటంటే యెహోవా నా జీవితంలో మరలా ప్రవేశించాలి, ఆయన నన్ను క్షమిస్తాడని నేను అనుకున్నాను.”—జి.హెచ్.
“మత ప్రస్తావన వచ్చినప్పుడు, సత్యాన్ని బోధించే ఏ మతాన్నైనా నేను గనుక ఎంచుకోవాలని అనుకుంటే, నేను యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండడానికే నిశ్చయించుకుంటాను. ఆపై నేను ఒకప్పుడు వారిలో ఒక వ్యక్తినేగానీ దానికి అనుగుణంగా జీవించలేకపోయాను గనుక దాన్ని విడిచిపెట్టాను అని చెప్పేదాన్ని. దీన్ని గ్రహించినదాన్నై, నేను తరచూ దోషిగానూ, అసంతోషిగానూ ఉండేదాన్ని. నేను దౌర్భాగ్యురాలిననీ, నేను జీవితంలో కొన్ని తీవ్రమైన మార్పుల్ని చేసుకోవాల్సి ఉందనీ చివరకు ఒప్పుకుంటున్నాను.’”—సి. ఎన్.
“ముప్ఫై ఐదేళ్ల క్రిందట నేనూ నా భర్తా బహిష్కరించబడ్డాం. ఆ తర్వాత, 1991లో ఇద్దరు పెద్దలు మా దగ్గరకు వచ్చి మేం యెహోవా దగ్గరకు తిరిగివచ్చే అవకాశం ఉందని మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆరు నెలలు గడిచిన తర్వాత, మేం తిరిగి చేర్చుకోబడినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయాం. అప్పుడు మా ఆయనకు 79 ఏళ్లు, నాకు 63 ఏళ్లు.—సి. ఎ.