కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/1 పేజీలు 15-20
  • తమ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనే యౌవనులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తమ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనే యౌవనులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మీకు ఎంత వాస్తవమై ఉన్నాడు?
  • జ్ఞాపకం ఉంచుకోవడం యొక్క భావం
  • ఒక సంకల్పంతో విద్య
  • మీ డబ్బును జ్ఞానయుక్తంగా ఎందుకు వినియోగించాలి?
  • అనుకరించదగిన యౌవనులు
  • సంకల్పముతో కూడిన విద్య
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • అదనపు విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • బైబిలు విద్యాభ్యాసాన్ని నిరుత్సాహపరుస్తుందా?
    తేజరిల్లు!—1998
  • విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచుట
    తేజరిల్లు!—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/1 పేజీలు 15-20

తమ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనే యౌవనులు

“ఇప్పుడే మీ యౌవనదశలోనే మీ గొప్ప సృష్టికర్తను . . . జ్ఞాపకము చేసుకోండి.”—ప్రసంగి 12:1, 2, NW.

1. పదకొండు సంవత్సరాల ఒక బాలుడు తెలియజేసిన ఏ విషయాలు మన సృష్టికర్త అతనికి వాస్తవమైనవాడై ఉన్నాడని బయల్పరుస్తున్నాయి?

బాలలు తాము అభిమానించి ప్రీతిపర్చాలనుకునే యెహోవా దేవున్ని తాము వాస్తవమైన వ్యక్తిగా దృష్టిస్తున్నామని చూపించే విధంగా మాట్లాడి ప్రవర్తించినప్పుడు ఎంత చక్కగా ఉంటుందోకదా! 11 సంవత్సరాల ఒక బాలుడు ఇలా చెప్పాడు: “నేను ఒంటరిగా ఉండి కిటికీలోనుండి బయటికి చూస్తున్నప్పుడు, యెహోవా సృష్టి ఎంత అద్భుతంగా ఉందో చూస్తాను. భవిష్యత్తులో పరదైసు ఎంత అందంగా ఉంటుందనే దాని గురించి, అప్పుడు నేను జంతువులను ఎలా ముట్టుకోగలుగుతాననే దాని గురించి నేను ఊహిస్తాను.” (యెషయా 11:6-9) అతడింకా ఇలా చెప్పాడు: “నేను ఒంటరిగా ఉన్నప్పుడు, యెహోవాకు ప్రార్థిస్తాను. నేను ఎప్పుడూ తనతో మాట్లాడుతున్నందుకు ఆయనకు చిరాకు కలగదని నాకు తెలుసు. ఆయన ఎల్లప్పుడూ నన్ను గమనిస్తుంటాడని నాకు తెలుసు.” మన సృష్టికర్త ఈ బాలునికి ఎంత వాస్తవమై ఉన్నాడో మీకూ అలాగే ఉన్నాడా?

దేవుడు మీకు ఎంత వాస్తవమై ఉన్నాడు?

2. (ఎ) మీ సృష్టికర్త మీకు ఎలా వాస్తవమైనవాడు కాగలడు? (బి) దేవుడు వాస్తవమైన వ్యక్తియై ఉన్నాడని తమ పిల్లలు గుణగ్రహించడానికి సహాయం చేయడంలో తలిదండ్రులు ఏ పాత్ర వహించవచ్చు?

2 యెహోవా మరియు ఆయన వాగ్దానాలు మీకు వాస్తవమై ఉండాలంటే, మీరు మొదట ఆయన గురించి, బైబిలు వర్ణించే నీతియుక్తమైన నూతన లోకంలో ఆయన అందజేసే అద్భుతమైన భవిష్యత్తు గురించి నేర్చుకోవాలి. (ప్రకటన 21:3, 4) మీ తలిదండ్రులు మీకు ఈ విషయాల గురించి బోధించి ఉంటే, అది “ఇప్పుడే . . . మీ గొప్ప సృష్టికర్తను . . . జ్ఞాపకము చేసుకోండి” అనే ప్రేరేపిత ఆజ్ఞకు విధేయత చూపేందుకు మీకు సహాయం చేస్తుంది గనుక మీరు కృతజ్ఞత కలిగివుండడానికి కారణం ఉంది. (ప్రసంగి 12:1, NW) తన తలిదండ్రులిచ్చిన తొలి తర్ఫీదు గురించి ఒక యౌవనస్థురాలు ఇలా చెప్పింది: “యెహోవా మన జీవితంలో ఎలా ఇమిడి ఉన్నాడో నా తలిదండ్రులు ఎల్లప్పుడూ నొక్కిచెప్పేవారు. నేను నా సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవడానికి కీలకం ఇదే.” మరో యువతి ఇలా తెలియజేసింది: “యెహోవా వాస్తవమైన వ్యక్తియని నాకు బోధించినందుకు నేను నా తలిదండ్రుల ఎడల నిత్యమూ కృతజ్ఞత కలిగివుంటాను. ఆయనను ఎలా ప్రేమించాలో వారు నాకు చూపారు, పూర్తికాలం ఆయన సేవచేయడం ద్వారా వచ్చే ఆనందం గురించి వారు నాకు చెప్పారు.”

3, 4. యెహోవాను వాస్తవమైన వ్యక్తిగా తలంచడానికి మీకు ఏది సహాయం చేయగలదు?

3 అయితే, దేవుడు తమయందు ఆసక్తి కలిగివున్న నిజమైన వ్యక్తి అని గ్రహించడం అనేకులకు కష్టంగా ఉంటుంది. మీకూ అలాగే ఉంటుందా? కావలికోట (ఆంగ్లం) నందలి ఈ వ్యాఖ్యానం ద్వారా ఒక యౌవనుడు దేవుని గురించి వ్యక్తిగతమైన విధంగా ఆలోచించడానికి సహాయాన్ని పొందాడు: “శరీరరూపంలో యెహోవా ఎంత పెద్దగా ఉంటాడో మనకు తెలియదు.” అయితే, “ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడనే దానిపై ఆయన నిజమైన గొప్పతనం ఆధారపడి ఉంటుంది” అని కావలికోట నందలి తర్వాతి వాక్యం చెప్పినట్లుగా, దేవుని ఉత్కృష్టత ఆయన పరిమాణం లేక ఆకారంపై ఆధారపడి ఉండదు. వాస్తవానికి ఆయన నమ్మకమైన, దయాపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, క్షమించే దేవుడు.a (నిర్గమకాండము 34:6; ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 86:5; యాకోబు 5:11) మీరు యెహోవాను అలాంటి వ్యక్తిగా, మీరు అమూల్యమైన సంబంధం కలిగివుండగల విశ్వసనీయ స్నేహితునిగా దృష్టిస్తున్నారా?—యెషయా 41:8; యాకోబు 2:23.

4 దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఆనందించడానికి యేసు తన తొలి అనుచరులకు సహాయం చేశాడు. అందుకే, అపొస్తలుడైన యోహాను పరలోక జీవితం నిమిత్తమైన నిరీక్షింపబడిన తన పునరుత్థానం గురించి వ్రాసినప్పుడు, యోహాను ఇలా అన్నాడు: ‘ఆయన [దేవుడు] యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని.’ (1 యోహాను 3:2; 1 కొరింథీయులు 15:44) నేడు యౌవనులు దేవున్ని వాస్తవమైన వ్యక్తిగా దృష్టించేందుకు కూడా వారికి సహాయం చేయవచ్చు. వారు ఆయనను వ్యక్తిగతంగా చూడలేకపోయినప్పటికీ ఆయన గురించి ఎక్కువ తెలుసుకొనగలిగేలా వారికి సహాయం చేయవచ్చు. ఒక యౌవనస్థుడు ఇలా తెలియజేశాడు: “నా తలిదండ్రులు, ‘యెహోవా ఏమంటాడు? నీవు దాన్ని నీ సొంత మాటల్లో ఎలా వివరిస్తావు? దాని భావమేమిటి?’ వంటి అనేక ప్రశ్నలను అడగడం ద్వారా, నేను యెహోవాను జ్ఞాపకముంచుకొనేందుకు నాకు సహాయం చేశారు.” ఇటువంటి ప్రశ్నలు దేవునితో మనకు గల వ్యక్తిగత సంబంధం గురించి ఆలోచించేలా చేయవా?

జ్ఞాపకం ఉంచుకోవడం యొక్క భావం

5. ఎవరినైనా జ్ఞాపకం ఉంచుకోవడమంటే ఆయన పేరును జ్ఞాపకం ఉంచుకోవడంకంటే ఎక్కువని బైబిలులోని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

5 “ఇప్పుడే, . . . మీ గొప్ప సృష్టికర్తను . . . జ్ఞాపకము చేసుకోండి” అనే ఆజ్ఞకు విధేయులవ్వడమంటే యెహోవా గురించి ఆలోచించడంకంటే ఎక్కువే. దానిలో చర్యగైకొనడం ఇమిడి ఉంది, ఆయనకు ప్రీతికరమైనది చేయడం. “నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొను”మని నేరస్థుడు యేసును వేడుకున్నప్పుడు, యేసు తన పేరును జ్ఞాపకం చేసుకోవడంకంటే ఎక్కువే చేయాలని అతడు కోరుకున్నాడు. యేసు చర్యగైకొనాలని, తనను పునరుత్థానం చేయాలని అతడు కోరుకున్నాడు. (లూకా 23:42, ఇటాలిక్కులు మావి.) అలాగే, బంధింపబడివున్న యోసేపు తన గురించి ఫరోకు జ్ఞాపకము చేయమని ఫరో పానదాయకున్ని అడిగినప్పుడు తన నిమిత్తం చర్యగైకొనాలని ఆయన నిరీక్షించాడు. మరియు “నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని” యోబు దేవున్ని వేడుకున్నప్పుడు, భవిష్యత్తులో ఒక సమయంలో దేవుడు తనను పునరుత్థానం చేసేందుకు చర్య తీసుకోవాలని యోబు కోరుతున్నాడు.—యోబు 14:13, ఇటాలిక్కులు మావి; ఆదికాండము 40:14, 23.

6. “జ్ఞాపకము” చేసుకోవడం అనేదాని కొరకైన హెబ్రీ పదం జ్ఞాపకం ఉంచుకోబడిన విషయం లేక వ్యక్తి ఎడల ఇష్టం అని ఎలా సూచిస్తుంది?

6 “జ్ఞాపకము” చేసుకోవడం అని అనువదించబడిన హెబ్రీ పదం తరచూ “మనస్సుకు ఇష్టమైనది మరియు జ్ఞాపకం ఉంచుకున్నదానిననుసరించి జరిగే చర్య” అని సూచిస్తుంది. “జ్ఞాపకము” అనే పదంలోని “ఇష్టమైన” అనే సూచనను అరణ్యంలోని “మిశ్రితజనము” యొక్క ఈ వివరణలో చూడవచ్చు: “ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు . . . జ్ఞాపకమునకు వచ్చుచున్నవి.” దేవుడు తనను దయాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలని యోబు విన్నవించుకున్నట్లుగానే, తమ విశ్వాస్యతను గుర్తిస్తూ యెహోవా తమను ఇష్టపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలని హిజ్కియా, నెహెమ్యా, దావీదు, అనామకుడైన కీర్తనల రచయిత వేడుకున్నారు.—సంఖ్యాకాండము 11:4, 5, ఇటాలిక్కులు మావి; 2 రాజులు 20:3; నెహెమ్యా 5:19; 13:31; కీర్తన 25:7; 106:4.

7. మనం దేవున్ని ఇష్టపూర్వకంగా జ్ఞాపకం ఉంచుకుంటే, ఇది మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది?

7 కాబట్టి మనమిలా ప్రశ్నించవచ్చు, ‘మనం మన సృష్టికర్తను ఇష్టపూర్వకంగా జ్ఞాపకము చేసుకుంటూ, ఆయనకు బాధ లేక నొప్పి కలిగేదేదైనా చేయడాన్ని మానుకుంటామా?’ ఒక యువతి ఇలా తెలియజేసింది: “యెహోవాకు భావాలున్నాయని గుర్తించడానికి మా అమ్మ నాకు సహాయం చేసింది, నా క్రియలు ఆయనపై ప్రభావం చూపుతాయని తొలి ప్రాయంలోనే నాకు తెలుసు.” (కీర్తన 78:40-42) మరో యువతి ఇలా వివరించింది: “సాతాను యెహోవాకు చేసిన సవాలుకు జవాబిచ్చేందుకు నా చర్యలు సహాయం చేయడమో లేక ఆటంకపర్చడమో చేస్తాయని నాకు తెలుసు. యెహోవా హృదయాన్ని సంతోషపరచాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి అది నాకు సహాయం చేసింది, నేడు కూడా సహాయం చేస్తోంది.”—సామెతలు 27:11.

8. (ఎ) మనం యెహోవాను ఇష్టపూర్వకంగా జ్ఞాపకం ఉంచుకుంటున్నామని ఏ కృషి సూచిస్తుంది? (బి) యౌవనులు ఏ ప్రశ్నలను జ్ఞానయుక్తంగా పరిగణిస్తారు?

8 ఈ దుష్టలోకంలో, యెహోవాకు ప్రీతికరమైన పనిని చేయడంలో పూర్తిగా భాగం వహించడం ద్వారా ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ఎల్లప్పుడూ అంత సులభమేమి కాదన్నది అంగీకరించవలసిందే. అయినా, పయినీరు సేవకులుగా క్రైస్తవ సేవను పూర్తికాలం చేపట్టడం ద్వారా, మొదటి శతాబ్దపు యౌవనుడైన తిమోతిని అలాగే దైవభయంగల నేటి వేలాదిమంది యౌవనులను మీరు అనుకరించగలిగితే ఎంత బాగుంటుందో కదా! (అపొస్తలుల కార్యములు 16:1-3; 1 థెస్సలొనీకయులు 3:2) అయితే, ఇలా అడుగవచ్చు, మీరు పయినీరు పరిచర్యలో భాగం వహిస్తూ మిమ్మల్ని మీరు పోషించుకోగలరా? మీకు వివాహమైతే, మీ కుటుంబంలోని వారిని సంరక్షించేందుకు కావలసిన నైపుణ్యాలు మీకు ఉంటాయా? (1 తిమోతి 5:8) ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలు, వాటి గురించి మీరు గంభీరంగా తలంచడం అత్యావశ్యకం.

ఒక సంకల్పంతో విద్య

9. లౌకిక విద్యకు సంబంధించి యౌవనులు ఏ నిర్ణయాన్ని ఎదుర్కొంటారు?

9 మానవ సమాజం మరింత సంక్లిష్టమౌతుండగా, పయినీరు పనిలో మీకు మీరు మద్దతునిచ్చుకునేందుకు తగిన ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ విద్యనభ్యసించడం అవసరం కావచ్చు. విశ్వవిద్యాలయ విద్య పూర్తి చేసిన కొందరు కూడా, నేడు యజమానులు విలువైనవిగా ఎంచుతున్న క్రొత్త నైపుణ్యాలను సంపాదించుకోవడానికి అదనపు విద్యను అభ్యసించవలసి వస్తోందని మీరు గమనించే ఉంటారు. దేవున్ని ప్రీతిపర్చాలని కోరుకునే యౌవనులైన మీరు ఎంత విద్యనభ్యసించాలి? “ఇప్పుడే, . . . మీ గొప్ప సృష్టికర్తను జ్ఞాపకము సుకోండి” అనే ప్రేరేపిత ఆజ్ఞను మనస్సులో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి.

10. మనం పొందగల శ్రేష్ఠమైన విద్య ఏది?

10 అనేక లౌకిక అధికారాలు కూడా శ్రేష్ఠమైన విద్య అని పరిగణించేదాన్ని అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పఠించడం ద్వారా గ్రహించదగిన విద్యను మీరు పొందాలనుకోవచ్చు. జర్మన్‌ రచయితైన యోహాన్‌ వోల్ఫ్‌గాంగ్‌ వోన్‌ గోతె ఇలా తెలియజేశాడు: “[ప్రజల] జ్ఞానాభివృద్ధి ఎంత ఎక్కువగా ఉంటే, విద్యకు పునాదిగాను ఉపకరణంగాను బైబిలును ఉపయోగించడం అంత ఎక్కువగా వీలౌతుంది.” అవును, మరే ఇతర విద్యకంటే కూడా బైబిలు పఠనం ఎక్కువ శ్రేష్ఠంగా మిమ్మల్ని జీవితం కొరకు సంసిద్ధులను చేయగలదు!—సామెతలు 2:6-17; 2 తిమోతి 3:14-17.

11. (ఎ) మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని ఏది? (బి) ఒక యౌవనస్థురాలు ఒక మోస్తరు విద్యను పొందడానికి ఎందుకు ఎంపిక చేసుకుంది?

11 దేవుని గూర్చిన జ్ఞానం జీవాన్నిస్తుంది గనుక, నేడు మీరు చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడమే. (సామెతలు 3:13-18; యోహాను 4:34; 17:3) అయితే దీన్ని ప్రభావవంతంగా చేసేందుకు, మీరు ప్రాథమిక విద్యనభ్యసించడం అవసరం. మీరు స్పష్టంగా ఆలోచించగలగాలి, యుక్తిగా మాట్లాడగలగాలి, మీకు చక్కగా చదవడం వ్రాయడం వచ్చి ఉండాలి, ఈ నైపుణ్యాలన్నీ పాఠశాలలో బోధించబడతాయి. కాబట్టి, మీరు మీ పాఠశాల విద్యను గంభీరమైనదిగా ఎంచండి, విద్యావిషయక గౌరవాలతో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించిన అమెరికానందలి ఫ్లోరీడాకు చెందిన ట్రేసీ అనే యౌవనస్థురాలు అలాగే చేసింది. ఆమె తన నిరీక్షణను ఇలా తెలియజేసింది: “నా దేవుడైన యెహోవాకు పూర్తికాల సేవకురాలిగా ఉండాలన్నది ఎల్లప్పుడూ నా లక్ష్యంగా ఉండేది, ఆ లక్ష్యాన్ని సాధించడానికి నా విద్య నాకు సహాయం చేస్తుందని నేను నిరీక్షిస్తున్నాను.”

12. అదనపు లౌకిక విద్యను ఎంపిక చేసుకుంటే, ఏ సంకల్పాన్ని నెరవేర్చడానికి అది సహాయం చేయవచ్చు?

12 మీరు పాఠశాలకు ఎందుకు వెళుతున్నారనేదాని గురించి మీరు ఆలోచించారా? ప్రాథమికంగా, యెహోవా యొక్క ప్రభావవంతమైన పరిచారకులుగా ఉండడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికేనా? అలాగైతే, ఈ సంకల్పాన్ని మీ విద్య ఎంత చక్కగా సాధిస్తుందనే దాన్ని మీరు గంభీరంగా పరిగణనలోకి తీసుకోవాలి. మీ తలిదండ్రులతో చర్చించిన తర్వాత, చట్టపరంగా అవసరమైనదానికంటే అదనపు విద్యను అభ్యసించాలని నిర్ణయించుకోవచ్చు. అలాంటి అదనపు విద్య మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి, అదే సమయంలో రాజ్య కార్యకలాపాల్లో పూర్తిగా భాగం వహించడానికి మీకు తగినంత సమయాన్ని శక్తిని మిగల్చగలిగే ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి మీకు సహాయం చేయవచ్చు.—మత్తయి 6:33.

13. అనుబంధ విద్యనభ్యసించిన ఇద్దరు రష్యన్‌ క్రైస్తవులు జీవితంలో తమకుగల సంకల్పాన్ని ఎలా చూపించారు?

13 అనుబంధ విద్యనభ్యసించే కొందరు అదనపు విద్యనభ్యసిస్తున్న సమయంలో కూడా పూర్తికాల పరిచర్యలో పాల్గొంటారు. రష్యానందలి మాస్కోకు చెందిన ఇద్దరు యువతులైన నాడ్యా, మర్యీనాలను పరిశీలించండి. ఇద్దరూ 1994 ఏప్రిల్‌లో బాప్తిస్మం తీసుకుని, సహాయ పయినీరు పరిచారకులుగా సేవ చేయనారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి వారు ఉన్నత పాఠశాల విద్య ముగించి, రెండు సంవత్సరాల అక్కౌంటింగ్‌ తరగతుల్లో చేరారు. 1995 మేలో వారు క్రమ పయినీర్లయ్యారు, అయినా వారు తమ అక్కౌంటింగ్‌ తరగతుల్లో ఉత్తమ శ్రేణి పొందారు. అంతేగాక, పాఠశాలకు వెళుతూనే వారు ఇద్దరూ కలిసి ప్రతి వారం సగటున 14 బైబిలు పఠనాలు నిర్వహించగలుగుతున్నారు. పూర్తికాల పరిచర్యలో తమకు తాము మద్దతునిచ్చుకొనేందుకు తగిన ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి తమ అక్కౌంటింగ్‌ విద్య తమకు సహాయం చేస్తుందని ఆ అమ్మాయిలు నిరీక్షిస్తున్నారు.

14. మనం ఎంత లౌకిక విద్యనభ్యసించడానికి ఎంపిక చేసుకున్నప్పటికీ, మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏదై ఉండాలి?

14 చట్టం కోరేదానికంటే అదనపు లౌకిక విద్యను మీరు అభ్యసించాలనుకుంటే, అలా చేయడానికి మీకుగల కారణాన్ని జ్ఞానయుక్తంగా పరిశీలించుకోండి. మీకు మీరు పేరు సంపాదించుకొని, వస్తుసంబంధ సంపదలను పొందడానికా? (యిర్మీయా 45:5; 1 తిమోతి 6:17) లేక యెహోవా సేవలో మరింత పూర్తిగా భాగం వహించడానికి అనుబంధ విద్యను ఉపయోగించాలన్నది మీ లక్ష్యమా? అదనపు విద్యనభ్యసించడానికి ఎంపిక చేసుకున్న లిడియా అనే యౌవనస్థురాలు, “ఇతరులు ఉన్నత విద్యనభ్యసించి, భౌతికవాదం మధ్యలో ప్రవేశించడాన్ని అనుమతించారు మరియు వారు దేవున్ని మరిచిపోయారు. వ్యక్తిగతంగా దేవునితో నాకుగల సంబంధం నాకు అత్యంత ప్రాముఖ్యమైన విషయం” అని వివరిస్తూ ఆత్మీయ విషయాల గురించి స్పష్టమైన దృక్కోణాన్ని వ్యక్తపర్చింది. మనమందరం కలిగివుండవలసిన ఎంతటి ప్రశంసనీయమైన దృక్పథమో కదా!

15. మొదటి శతాబ్దపు క్రైస్తవుల మధ్య విద్యావిషయక పూర్వరంగాల్లో ఎలాంటి వైవిధ్యం ఉంది?

15 విశేషంగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులకు విస్తృత వైవిధ్యంగల విద్యావిషయక పూర్వరంగాలున్నాయి. ఉదాహరణకు, అపొస్తలులైన పేతురు యోహానులు రబ్బీల పాఠశాలల్లో శిక్షణ పొందలేదు గనుక “విద్యలేని పామరులని” ఎంచబడ్డారు. (అపొస్తలుల కార్యములు 4:13) మరో వైపున, అపొస్తలుడైన పౌలు నేటి విశ్వవిద్యాలయ విద్యతో పోల్చదగిన విద్యనభ్యసించాడు. అయినప్పటికీ, తనవైపుకు శ్రద్ధను మళ్లించుకునేందుకు పౌలు తన విద్యను ఉపయోగించలేదు; బదులుగా, ఆయన వివిధ అంతస్తులకు చెందిన ప్రజలకు ప్రకటించేటప్పుడు అది ఒక సంపదగా ఉండేది. (అపొస్తలుల కార్యములు 22:3; 1 కొరింథీయులు 9:19-23; ఫిలిప్పీయులు 1:7) అలాగే “చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన [“విద్యనభ్యసించిన,” NW]” మనయేను, అంతియొకయ సంఘంలో నాయకత్వం వహించినవారిలో ఒకడు.—అపొస్తలుల కార్యములు 13:1.

మీ డబ్బును జ్ఞానయుక్తంగా ఎందుకు వినియోగించాలి?

16. (ఎ) మనం అప్పుల్లో ఉంటే మనం మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు కష్టం కావచ్చు? (బి) మనం ఖర్చు చేయడానికి ముందు ఆలోచించడాన్ని గూర్చిన ప్రాముఖ్యతను యేసు ఉపమానాల్లో ఒకటి ఎలా చూపిస్తుంది?

16 మీరు మీ డబ్బును జ్ఞానయుక్తంగా వినియోగించడంలో విఫలమౌతే, మీ సృష్టికర్తకు ప్రీతికరమైనది చేయడం ద్వారా ఆయనను జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం కావచ్చు. మీరు అప్పుల్లో పడిపోతే మీకు మరో యజమాని ఉన్నాడని చెప్పవచ్చు. బైబిలు ఇలా వివరిస్తుంది: “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” (సామెతలు 22:7) యేసు చెప్పిన ఉపమానాల్లో ఒకటి, మనం ఖర్చు చేయక ముందు ఆలోచించడం యొక్క ప్రాముఖ్యతను ఉన్నతపరుస్తుంది. యేసు ఇలా చెప్పాడు: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున చూచువారందరు—ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయసాగుదురు.”—లూకా 14:28, 29.

17. ఒకరు తమ ఖర్చులను అదుపు చేసుకోవడం తరచు ఎందుకు కష్టమౌతుంది?

17 కాబట్టి జ్ఞానయుక్తంగా, “ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు” అనే లేఖనాధార సూత్రానికి అనుగుణంగా జీవించడానికి మీరు ప్రయత్నిస్తారు. (రోమీయులు 13:8) ప్రాముఖ్యంగా, ప్రకటనకర్తలు మీకు నిజంగా అవసరమైనవని చెప్పే క్రొత్త ఉత్పాదకాలు క్రమంగా వెలువడుతూనే ఉన్నప్పుడు అలా చేయడం కష్టమే. తన పిల్లలు వివేచన కలిగివుండడానికి సహాయం చేసేందుకు ప్రయత్నించిన ఒక తండ్రి ఇలా చెప్పాడు: “ఏది అవసరత ఏది కోరిక అనేది చర్చిస్తూ మేము ఎంతో సమయం గడిపాము.” డబ్బును బాధ్యతాయుతంగా ఎలా వినియోగించాలనే దానిపై చాలా తక్కువ సలహాలనిస్తూ, సాధారణంగా పాఠశాలలు అలాంటి విషయాలను బోధించడంలో విఫలమయ్యాయి. “మనం ఎలా పొదుపు చేయాలి అనే దానికంటే ఐసోసిల్స్‌ త్రిభుజం గురించి ఎక్కువగా తెలుసుకుని ఉన్నత పాఠశాల విద్యను ముగిస్తాము” అని ఒక సంఘ సేవకురాలు అంటోంది. కాబట్టి మరి డబ్బును జ్ఞానయుక్తంగా ఖర్చుచేయడానికి మీకు ఏది సహాయం చేయగలదు?

18. డబ్బును జ్ఞానయుక్తంగా వినియోగించడానికి కీలకం ఏమిటి మరియు ఎందుకు?

18 “ఇప్పుడే . . . మీ గొప్ప సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోండి” అనే ఆజ్ఞను పాటించడం మీ డబ్బును జ్ఞానయుక్తంగా వినియోగించడానికి ఒక కీలకం. అలా ఎందుకంటే, మీరు ఆ ఆజ్ఞకు విధేయులైనప్పుడు, యెహోవాను ప్రీతిపర్చడం మీకు ప్రాముఖ్యమైన విషయమౌతుంది, ఆయన ఎడల మీకుగల ప్రేమ మీరు మీ డబ్బును ఎలా ఖర్చు చేస్తారనేదాన్ని ప్రభావితం చేస్తుంది. తదనుగుణంగానే, దేవునికి పూర్ణప్రాణంతో కూడిన భక్తిని చెల్లించడంలో వ్యక్తిగత కోరికలు జోక్యం చేసుకోవడాన్ని మీరు అనుమతించరు. (మత్తయి 16:24-26) మీరు మీ కంటిని “తేటగా” ఉంచుకోవడానికి, అంటే దేవుని రాజ్యంపై, ఆయన చిత్తాన్ని చేయడంపై మీ దృష్టిని స్పష్టంగా కేంద్రీకరించి ఉంచడానికి మీరు కృషి చేస్తారు. (మత్తయి 6:22-24) “నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము” అనే దైవిక ఆజ్ఞను మీరు ఆనందభరితమైన ఆధిక్యతగా దృష్టించనారంభిస్తారు.—సామెతలు 3:9.

అనుకరించదగిన యౌవనులు

19. గతంలో యౌవనులు తమ సృష్టికర్తను ఎలా జ్ఞాపకం చేసుకున్నారు?

19 సంతోషకరంగా, గత మరియు ప్రస్తుత కాలాల్లోని యౌవనులనేకమంది తమ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నారు. తనతోపాటు సేవచేస్తున్నవారి అవినీతికరమైన ప్రభావం ఉన్నప్పటికీ బాలుడైన సమూయేలు గుడార సేవలో స్థిరంగా ఉన్నాడు. (1 సమూయేలు 2:12-26) మరులుగొల్పే శోధకురాలైన పోతిఫరు భార్య యౌవనుడైన యోసేపును వ్యభిచారం చేసేలా ప్రలోభపెట్టలేకపోయింది. (ఆదికాండము 39:1-12) యిర్మీయా ‘బాలుడే’ అయినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత సమయంలో కూడా ధైర్యంగా ప్రకటించాడు. (యిర్మీయా 1:6-8) చిన్నదైన ఇశ్రాయేలు బాలిక శక్తిమంతుడైన సిరియా సైనికాధికారి ఇశ్రాయేలులో సహాయాన్ని పొందేలా ఆయనకు నిర్భయంగా సూచించింది, అక్కడ ఆయన యెహోవా గురించి తెలుసుకోగలిగాడు. (2 రాజులు 5:1-4) ఆహారానికి సంబంధించిన దేవుని సూత్రాల విషయంలో పరీక్షించబడినప్పుడు యౌవనుడైన దానియేలు ఆయన సహచరులు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. యౌవనులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలు విగ్రహం ఎదుట ఆరాధన చేయడం ద్వారా దేవుని ఎడల తమ యథార్థతతో రాజీపడే బదులు అగ్ని గుండంలో పడవేయబడడాన్ని ఎంపిక చేసుకున్నారు.—దానియేలు 1:8, 17; 3:16-18; నిర్గమకాండము 20:5.

20. నేడు అనేకమంది యౌవనులు తమ సృష్టికర్తను ఎలా జ్ఞాపకం చేసుకున్నారు?

20 నేడు 19 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సుగల 2,000 కంటే ఎక్కువమంది యౌవనులు అమెరికానందలి న్యూయార్క్‌ రాష్ట్రంలోగల యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్న లక్షలాదిమంది యౌవనుల్లో వీరు కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ప్రాచీన కాలంనాటి యోసేపు వలె వారు తమ నైతిక పరిశుభ్రత విషయంలో రాజీపడేందుకు నిరాకరించారు. ఎవరి సేవచేస్తారనేది ఎంపిక చేసుకోమని బలవంతపెట్టబడినప్పుడు అనేకులు మనుష్యులకు బదులుగా దేవునికి విధేయత చూపారు. (అపొస్తలుల కార్యములు 5:29) 1946లో, పోలండులో 15 సంవత్సరాల బాలికైన హెన్రికా జుర్‌ మత సంబంధమైన విగ్రహారాధనా క్రియ చేయడానికి నిరాకరించినప్పుడు హింసింపబడింది. హింసిస్తున్నవారిలో ఒకతను ఇలా సలహా ఇచ్చాడు: “మనస్సులో ఏది నమ్మాలనుకుంటే అది నమ్ముకో, కాని కాథోలిక్‌ శిలువ గుర్తు మాత్రం వేసుకో.” ఆమె నిరాకరించినందుకు ఆమెను అడవిలోకి లాక్కెళ్లి కాల్చేశారు, నిత్యజీవాన్ని గూర్చిన ఆమె నిశ్చయమైన నిరీక్షణ సుస్థిరంగా ఉంది!b

21. ఏ ఆహ్వానాన్ని అంగీకరించడం జ్ఞానయుక్తమైనది, ఏ ఫలితంతో?

21 శతాబ్దాలుగా తనను జ్ఞాపకం ఉంచుకున్న యౌవనస్థులనుబట్టి యెహోవా హృదయం ఎంతగా ఉప్పొంగిపోయి ఉండవచ్చోకదా! “ఇప్పుడే . . . మీ గొప్ప సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోండి” అనే ఆహ్వానానికి మీరు ప్రతిస్పందిస్తారా? నిజంగా ఆయన మీరు జ్ఞాపకముంచుకొనదగినవాడు! ఆయన మీ కొరకు చేసినదానంతటి గురించి, ఇంకా చేయబోయేదాని గురించి అనుదినం ఆలోచించి, ఆయన ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని అంగీకరించండి: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”—సామెతలు 27:11.

[అధస్సూచీలు]

a కావలికోట, డిశంబరు 15, 1953, పేజీ 750.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సంస్థ ప్రచురించిన యెహోవాసాక్షుల 1994 వార్షిక పుస్తకం (ఆంగ్లం), 217-18 పేజీలను చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ దేవున్ని నిజమైన వ్యక్తిగా దృష్టించడానికి యౌవనులకు ఎలా సహాయం చేయవచ్చు?

◻ మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడమనేదాని భావమేమిటి?

◻ మన విద్య ఏ సంకల్పాన్ని నెరవేర్చాలి?

◻ మన డబ్బును జ్ఞానయుక్తంగా వినియోగించడం ఎందుకు ప్రాముఖ్యము?

◻ మీరు అనుకరించదగిన యౌవనులు ఎవరు?

[17వ పేజీలోని చిత్రం]

మీరు పాఠశాలకు ఎందుకు వెళుతున్నారనే దాని గురించి మీరు ఆలోచించారా?

[18వ పేజీలోని చిత్రం]

మీరు డబ్బును జ్ఞానయుక్తంగా వినియోగించడం నేర్చుకుంటున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి