కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 7/1 పేజీలు 25-27
  • దేవుని వాక్యము “అద్భుతాలను” చేస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యము “అద్భుతాలను” చేస్తుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని ప్రజలకొరకు నా అన్వేషణ
  • మా స్వగ్రామంలో ప్రకటించడం
  • దేవుని వాక్యంవల్ల “అద్భుతాలు” జరగడం
  • సమస్యల నెదుర్కొనుటకు దేవునితోటి సన్నిహితత్వం నాకు సహాయపడింది
    తేజరిల్లు!—1993
  • దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను
    తేజరిల్లు!—1995
  • ఆస్ట్రేలియాలో నేను నిజమైన సంపదను కనుగొన్నాను
    తేజరిల్లు!—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 7/1 పేజీలు 25-27

దేవుని వాక్యము “అద్భుతాలను” చేస్తుంది

టేరెజ్‌ ఏయోన్‌ చెప్పిన ప్రకారం

నేను 1965లో ఒకనాడు ఓ వ్యాపార సంస్థలోకి ప్రవేశించి, కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను వ్యాపారస్థులకు అందించాను. వెళదామని నేను వెనక్కు తిరిగినంతలో ఓ పెద్ద చప్పుడు వినిపించింది. నా కాలిదగ్గర ఓ బుల్లెట్టు నేలను తాకింది. “యెహోవాసాక్షులతో అలాగే వ్యవహిరించాలి” అని ఓ వ్యాపారస్థుడు వెక్కిరింపుగా అన్నాడు.

ఆ అనుభవం నన్ను భయపెట్టింది, కానీ నా పూర్తికాల సేవను మానుకునేంత మాత్రం కాదులెండి. నేను నేర్చుకున్న బైబిలు సత్యాలు, నా పరిచర్యను మానుకోవడానికి అనుమతించనంత అమూల్యమైనవి. నేను ఇలా ఎందుకంటున్నానో వివరిస్తానుండండి.

1918లో నేను పుట్టిన తర్వాత నా తలిదండ్రులు కెనడాలోని క్యూబెక్‌ నందలి, అద్భుతాల ప్రాంతం అని పేరుగాంచిన కేప్‌-డి-ల-మడిలీన్‌ అనే గ్రామంలో స్థిరపడ్డారు. కన్యమరియ గోపురం వద్ద ప్రార్థనలు చేసేందుకు సందర్శకులు ఈ ఊరిలో గుమికూడేవారు. మరియ అద్భుతాలను చేస్తుందని చెప్పినవాటిని నిరూపించబడలేకపోయినప్పటికీ, 30,000 మంది నివాసులకు పైగానున్న ఆ గ్రామంలోని అనేకమంది ప్రజల జీవితాల్లో దేవుని వాక్యం అద్భుతాలను చేసింది.

నాకు సుమారు 20 ఏళ్లున్నప్పుడు, మతం విషయంలో నాకున్న ఆసక్తిని చూసి మా నాన్నగారు తన బైబిలును నాకిచ్చారు. నేను దాన్ని చదవడం ప్రారంభించినప్పుడు, నిర్గమకాండము 20వ అధ్యాయంనందు విగ్రహారాధన స్పష్టంగా ఖండించబడిందని తెలుసుకుని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. కాథోలిక్‌ చర్చి బోధల్లో నా విశ్వాసం వెంటనే పోయింది, నేను పూజకు వెళ్లడం మానుకున్నాను. నేను విగ్రహాలను ఆరాధించదలుచుకోలేదు. “టేరెజ్‌, చర్చికి వెళ్లడం లేదా?” అని మా నాన్నగారు అడగడం, “లేదు, నేను బైబిలు చదువుతున్నాను” అని నేను బదులివ్వడం నాకు ఇంకా జ్ఞాపకముంది.

1938 సెప్టెంబరులో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బైబిలు చదవడం నా జీవితంలో ఒక భాగంగా కొనసాగేది. నా భర్త రోజర్‌ తరచూ రాత్రిళ్లు పనిచేసేవాడు కనుక, ఆయన పని చేసే సమయాల్లో నేను బైబిలును చదవడం అలవాటు చేసుకున్నాను. కొద్దికాలానికే, దేవునికి తప్పక ప్రజలుంటారనే ముగింపుకు నేను వచ్చి వారి కొరకు వెతకడం ప్రారంభించాను.

దేవుని ప్రజలకొరకు నా అన్వేషణ

చిన్నప్పుడు చర్చిలో నేను నేర్చుకున్న దాన్నిబట్టి, నరకంలో కళ్లు తెరుస్తానేమో అనే భయంతో నేను నిద్రపోయేందుకు భయపడేదాన్ని. అలాంటి భయంతో పోరాడేందుకు, ప్రేమా స్వరూపియైన దేవుడు అంత దారుణమైన విషయం జరిగేందుకు అనుమతించడని నాకు నేను సర్ది చెప్పుకునేదాన్ని. నమ్మకంతో నేను బైబిలు చదువుతూ సత్యం కొరకు వెదుకుతూ ఉండేదాన్ని. నేను, చదివినప్పటికీ దాని భావాన్ని గ్రహించని ఐతియోపీయుడైన నపుంసకునిలా ఉండేదాన్ని.—అపొస్తలుల కార్యములు 8:26-39.

మా క్రింది అంతస్తులో నివసిస్తున్న నా సోదరుడైన ఆండ్రా, అతని భార్య 1957లో యెహోవాసాక్షులతో బైబిలు పఠనాన్ని పఠించడం ప్రారంభించారు. ఆ భవనంలో సాక్షులు ప్రకటించేందుకు వచ్చినప్పుడు వాళ్ల ఇంటి కప్పుపైన కొట్టి నాకు తెలియజేయమని మా వదినతో నేను చెప్పాను. అలా, వాళ్లు వచ్చినప్పుడు తలుపు తెరవకుండా ఉండవచ్చుకదా. ఒకరోజు తాను నాకు చెప్పడం మర్చిపోయింది.

ఆ రోజు నేను తలుపు తెరిచినప్పుడు కే మండె అనే ఓ పయినీరును—యెహోవాసాక్షుల పూర్తికాల సేవకులు అలా పిలవబడేవారు—కలిశాను. దేవునికి యెహోవా అనే వ్యక్తిగత నామం ఉందని వివరిస్తూ ఆమె నాతో దేవుని నామాన్ని గూర్చి మాట్లాడింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత, ఆమె చెప్పినవాటికి బైబిలు వాక్యం మద్దతునిస్తుందో లేదో నిర్ధారించుకునేందుకు నేను నా బైబిలును పరిశీలించాను. నేను చేసిన పరిశోధనవల్ల నేను ఆనందించాను.—నిర్గమకాండము 6:3, డ్యువే వర్షన్‌ అధఃసూచి; మత్తయి 6:9, 10; యోహాను 17:6.

కే మరలా వచ్చినప్పుడు, ఒక దేవునిలో ముగ్గురు దేవుళ్ళున్నారని చెప్పే త్రిత్వ సిద్ధాంతాన్ని గూర్చి మేము చర్చించాము. ఆ తర్వాత, నా స్వంత బైబిలు త్రిత్వాన్ని బోధించడం లేదని చూసి నేను తృప్తిపడేందుకు నా బైబిలును నేను జాగ్రత్తగా పరిశీలించాను. (అపొస్తలుల కార్యములు 17:11) యేసు దేవుడంతటి గొప్పవాడు కాడని నా పఠనం నిర్ధారించింది. ఆయన సృష్టించబడ్డాడు. ఆయనకు ఓ ప్రారంభమంటూ ఉంది, కానీ యెహోవాకు లేదు. (కీర్తన 90:1, 2; యోహాను 14:28; కొలస్సయులు 1:15-17; ప్రకటన 3:14) నేర్చుకునే వాటివల్ల నేను సంతృప్తి చెంది, బైబిలు చర్చలను కొనసాగించడంలో ఆనందించాను.

1958లో ఓ రోజు, నవంబరు మంచు తుపాను వస్తున్న సమయమందు, అద్దెకు తీసుకున్న ఓ హాలులో ఆ రోజు సాయంకాలమే జరిగే ప్రాంతీయ సమావేశానికి రమ్మని కే నన్ను ఆహ్వానించింది. నేను ఆ ఆహ్వానాన్ని అంగీకరించి, ఆ కార్యక్రమాన్ని ఆనందించాను. ఆ తర్వాత, నా దగ్గరికి వచ్చిన సాక్షితో మాట్లాడుతూ, “ఓ నిజమైన క్రైస్తవుడు ఇంటింటి సేవలో ప్రకటించాలా” అని నేను అడిగాను.

“అవును, సువార్త ప్రకటించబడాలి, అంతేకాకుండా ప్రజలను వారి ఇంటి యొద్దకు వెళ్లి కలవడం, ప్రకటించడంలో ప్రాముఖ్యమైన పద్ధతని బైబిలు బయల్పరుస్తుంది” అని ఆయన అన్నాడు.—అపొస్తలుల కార్యములు 20:20.

ఆయన చెప్పిన జవాబుకు నేను ఎంతగా ఆనందించానో! నేను దేవుని ప్రజలను కనుగొన్నానని అది నన్ను ఒప్పింపజేసింది. “అబ్బే, అవసరంలేదు” అని ఆయన చెప్పివుంటే, నేను సత్యాన్ని కనుగొనలేదేమోనని సందేహించివుండేదాన్ని, ఎందుకంటే బైబిలు ఇంటింటి పరిచర్యను గూర్చి మాట్లాడుతోందని నాకు తెలుసు. ఆ సమయం నుండి నేను ఎంతో వేగంగా అభివృద్ధిని సాధించాను.

ఆ ప్రాంతీయ సేవ తర్వాత, ట్రోయిస్‌-రివీరెస్‌ అనే ప్రక్క ఊర్లో జరిగే యెహోవాసాక్షుల కూటాలకు నేను హాజరవ్వడం ప్రారంభించాను. కే ఆమె సహచరైన ఫ్లోరెన్స్‌ బవుమాన్‌ మాత్రమే కేప్‌-డి-ల-మడిలీన్‌లో సాక్షులుగా ఉన్నారు. ఒకరోజు, “నేను రేపు మీతో ప్రకటించేందుకు వస్తాను” అని చెప్పాను. నేను వారితో వెళ్ళినందుకు వారు ఆనందించారు.

మా స్వగ్రామంలో ప్రకటించడం

ప్రతి ఒక్కరూ బైబిలు వర్తమానాన్ని వింటారని నేననుకున్నాను, కానీ అలాంటిదేమీ లేదని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. కే, ఫ్లోరెన్స్‌లు వేరేచోటికి నియమించబడినప్పుడు, ఆ గ్రామంలో నేనొక్కదాన్నే ఇంటింటికి వెళ్లి బైబిలు సత్యాలను ప్రకటించేదాన్ని. నేను 1963 జూన్‌ 8లో బాప్తిస్మం తీసుకునేంతవరకు మానకుండా అంటే ఇంచుమించు 2 సంవత్సరాలవరకూ నేను ఒంటరిగానే ప్రకటించాను. ఆ రోజే నేను వెకేషన్‌ పయినీరు అని పిలువబడే సేవ చేయడం ప్రారంభించాను.

నేను ఒక సంవత్సరం వెకేషన్‌ పయినీరు సేవను చేశాను. తర్వాత డెల్విన సెయింట్‌ లారెంట్‌ కేప్‌-డి-ల-మడిలీన్‌ వచ్చి, నేను క్రమపయినీరైతే వారానికి ఒకసారి నాతో పనిచేస్తానని వాగ్దానం చేసింది. కనుక నేను నా పయినీరు అప్లికేషన్‌ పూరించి ఇచ్చాను. అయితే విషాదమేమంటే, నేను పూర్తికాల సేవను ప్రారంభించేందుకు రెండు వారాలు ఉందనగా డెల్విన మరణించింది. నేను ఏంచేయాలి? నేను అప్లికేషన్‌ వ్రాశాను కాబట్టి ఇక వెనుదిరిగేందుకు ఇష్టపడలేదు. కనుక 1964 అక్టోబరులో నా పూర్తికాల సేవను నేను జీవిత భాగంగా ప్రారంభించాను. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాలు నేను ఇంటింటి సేవకు ఒంటరిగానే వెళ్లాను.

కేప్‌-డి-ల-మడలీన్‌లోని కాథోలిక్‌ భక్తులు తరచూ వైరాన్ని కనపర్చేవారు. ప్రకటించకుండా నన్ను మాన్పే ప్రయత్నంలో కొందరు పోలీసులను పిలిపించారు. మొదట్లో చెప్పినట్లుగా ఒకరోజు ఓ వ్యాపారస్తుడు నా కాలిదగ్గిర తుపాకీ పేల్చి నన్ను భయపెడదామనుకున్నాడు. అయితే, ఇది ఆ నగరంలో అందరి అవధానాన్ని ఆకర్షించింది. స్థానిక దూరదర్శిని దాన్ని యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా జరిగే దండయాత్ర అని పేర్కొంది. ఆ పరిస్థితంతా అనుకూలమైన సాక్ష్యాన్నిచ్చింది. పది సంవత్సరాల తర్వాత, నన్ను కాల్చిన ఆ వ్యాపారస్తుని బంధువొకడు సాక్షి అయ్యాడు.

దేవుని వాక్యంవల్ల “అద్భుతాలు” జరగడం

సంవత్సరాలు గడిచే కొలది, కేప్‌-డి-ల-మడిలీన్‌ నందు బైబిలు సత్యాల ఎడల ఉన్న వ్యతిరేకతా గోడలు కూలడాన్ని నేను చూశాను. సుమారు 1968 నందు, ఇతర సాక్షులు అక్కడికి వచ్చారు మరియు స్థానిక నివాసులు బైబిలు సత్యాలకు ప్రతిస్పందించడం ప్రారంభించారు. తత్ఫలితంగా 1970ల తొలి భాగంలో బైబిలు పఠనాల సంఖ్య బాగా పెరిగింది. ఇంటింటి పరిచర్యలో కొంతైనా భాగం వహించేందుకు వీలుగా నేను నిర్వహించే బైబిలు పఠనాల్లో చాలా వాటిని ఇతర సాక్షులు తీసుకోవాలని నేను వారిని అడిగే పరిస్థితి ఏర్పడింది.

ఒకరోజు ఓ యువతి, బైబిలు పఠన సహాయకమైన నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని అంగీకరించింది. ఆ సమయంలో ఆమెతో ఆండ్రీ అనే మహాకఠినంగా కనిపించే యువ నేరస్థుడు ఉండేవాడు. అతను మా సంభాషణలో చేరాడు. ఆండ్రీతో మేము చేసిన చర్చ అతని ఆసక్తిని పెంచింది, మరి ఓ బైబిలు పఠనం ప్రారంభించబడింది. త్వరలోనే తాను నేర్చుకున్న వాటిని అతను తన స్నేహితులతో మాట్లాడడం ప్రారంభించాడు.

ఒక సమయంలో, నలుగురు దోపిడీ దొంగలతో నేను బైబిలు పఠనాన్ని నిర్వహించేదాన్ని, వారిలో ఒకడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కాని బాగా వినేవాడు. అతని పేరు పైయర్‌. ఒకరోజు రాత్రి సుమారు రెండు గంటలకు, నేనూ మా ఆయన ఎవరో తలుపు తడుతున్నట్లు విన్నాము. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి: నలుగురు దోపిడి దొంగలు ప్రశ్నలతో నాకొరకు ఎదురుచూస్తున్నారు. రోజర్‌ ఇలాంటి అకాల సందర్శనాలను గూర్చి ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు.

మొదట్లో ఆ నలుగురు వ్యక్తులూ కూటాలకు హాజరయ్యేవారు. అయితే, ఆండ్రీ పైయర్‌ ఇద్దరు మాత్రమే కొనసాగారు. వారు తమ జీవితాలను దేవుని సూత్రాలకు అనుగుణంగా మలుచుకుని బాప్తిస్మం పొందారు. సుమారు 20 సంవత్సరాలకు పైగా ఆ ఇద్దరు పురుషులు యెహోవాకు నమ్మకంగా సేవచేశారు. పఠించడం ప్రారంభించేసరికెల్లా, వారు తమ నేర కార్యాలకు పేరుమోశారు. పోలీసులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండేవారు. కొన్నిసార్లు బైబిలు పఠనాలను నిర్వహించేటప్పుడో లేక సంఘకూటాలు జరిగేటప్పుడో పోలీసులు వారిని వెతుక్కుంటూ వచ్చేవారు. నేను ‘అన్నిరకాల మనుష్యులకు’ ప్రకటించగల్గినందుకు ఆనందిస్తున్నాను మరి ఆవిధంగా అద్భుతమన్నట్లుగా తోచే, దేవుని వాక్యం తీసుకొచ్చే మార్పులను నేను నా కళ్ళార చూశాను.—1 తిమోతి 2:4.

నా పరిచర్య ప్రారంభంలో, కేప్‌-డి-ల-మడిలీన్‌లో రాజ్యమందిరం తయారౌతుంది మరియు అది యెహోవా ప్రజలతో నిండుతుంది అని చెప్పివుంటే నేను నమ్మకపోయివుండేదాన్ని. ట్రోయి-రివిరెకు సమీపంలోని పట్టణంలో ఒక సంఘం, కేప్‌-డి-ల-మడిలీన్‌ నందున్న మూడు సంఘాల్లో కూడుకునే అభివృద్ధిచెందుతున్న ఆరు సంఘాలుగా పెరగడం నాకెంతో ఆనందాన్ని తెచ్చింది.

సుమారు 30 మంది వ్యక్తులు సమర్పణ మరియు బాప్తిస్మం తీసుకునే స్థాయికి చేరేందుకు నేను సహాయపడినందుకు నాకు ఆనందమనిపించింది. ఇప్పుడు 78 ఏళ్ల వయస్సులో, నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నందుకు నేను ఆనందిస్తున్నాను. అయితే కొన్నిసార్లు నేను నిరుత్సాహం చెందానన్నది వాస్తవమే. అలాంటి పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కునేందుకు, నేను ఎల్లప్పుడూ నా బైబిలును తెరచి, నాకు ఎంతగానో సేదదీర్చే కొన్ని భాగాలను చదివేదాన్ని. దేవుని వాక్యాన్ని చదవకుండా ఒకరోజైనా గడవడం నేను ఊహించలేనిది. ప్రత్యేకంగా, “నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును” అని యోహాను 15:7లోని మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉండేవి.

చాలా సమీపంలో ఉన్న నూతనలోకంలో రోజర్‌ను చూస్తానని ఆశిస్తున్నాను. (2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) 1975లో తాను మరణించక ముందు ఆయన బాప్తిస్మము తీసుకునేందుకు చక్కగా పురోగమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు, నేను పూర్తికాల సేవలో కొనసాగుతూ యెహోవా సేవలో ఆనందిస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాను.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి