కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 10/15 పేజీలు 9-13
  • సత్య దేవునికి ఇప్పుడే ఎందుకు భయపడాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్య దేవునికి ఇప్పుడే ఎందుకు భయపడాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శక్తి యొక్క అద్భుత ప్రదర్శన
  • దేవుని ఎడల మన భయాన్ని ప్రదర్శించడం
  • ఇప్పుడు దేవునికి భయపడడంలోని ఫలితాలు
  • యెహోవాకు భయపడి ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • సత్యదేవునికి భయపడడంలోని ప్రయోజనాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనేందుకు నేర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 10/15 పేజీలు 9-13

సత్య దేవునికి ఇప్పుడే ఎందుకు భయపడాలి?

“దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.

1, 2. దేవుని ఎడల యుక్తమైన భయం ఎందుకు సరైనది?

దేవుని ఎడల ఆరోగ్యదాయకమైన మరియు భక్తిపూర్వకమైన భయాన్ని కల్గివుండడం ఒక వ్యక్తికి ఎంతో మంచిది. అవును, అనేక మానవ భయాలు భావోద్రేకపరంగా కలతపర్చేవిగా ఉన్నప్పటికీ, మరి అవి మన ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ మనం యెహోవా దేవునికి భయపడడం మనకు మంచిది.—కీర్తన 112:1; ప్రసంగి 8:12.

2 సృష్టికర్తకు ఇది తెలుసు. తన సృష్టి ఎడల ప్రేమతో, అందరూ ఆయనకు భయపడి ఆయనను ఆరాధించాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఇలా చదువుతాం: “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.”—ప్రకటన 14:6, 7.

3. మన మొదటి తలిదండ్రుల కొరకు సృష్టికర్త ఏమి చేశాడు?

3 జీవానికి మూలమైన అన్నిటి సృష్టికర్తైన వానిని మనం అలక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆయన మనకు, ఈ గ్రహానికి యజమాని. (కీర్తన 24:1) ఆయన గొప్ప ప్రేమకు మంచి సూచనగా భూమ్మీది తన పిల్లలకు యెహోవా జీవాన్నిచ్చాడు మరియు వారు జీవించేందుకు వారికి అద్భుతమైన స్థలాన్నిచ్చాడు—అదే అందమైన పరదైసు. అయినా, ఈ అద్భుతమైన బహుమానం నిర్నిబంధమైనది కాదు. నిజానికి, దాన్ని బాధ్యత వహిస్తారనే నమ్మకంతో ఇవ్వబడింది. మన మొదటి తలిదండ్రులు తమ ఇంటిని చూసుకోవల్సి ఉండింది మరియు భూమియంతా ప్రజలతో నిండి లోబరచుకోబడేంతవరకూ అది విస్తరించబడవల్సివుంది. జంతువులూ పక్షులూ చేపలు అంటే తమతో తమ సంతతివారితో భూమిని పంచుకునే అన్నిరకాల జీవుల ఎడల ఆధిక్యతలనూ బాధ్యతలను కల్గివుండేవారు. ఇది మానవునికి అప్పగింపబడినందుకు మానవుడు దానికి లెక్క ఒప్పజెప్పవల్సివున్నాడు.

4. మానవుడు దేవుని సృష్టికి ఏమి చేశాడు?

4 ఇంత అద్భుతంగా ప్రారంభమైనప్పటికీ, తన అందమైన భూగృహాన్ని కలుషితం చేసేందుకు మానవుడు ఏమి చేశాడో చూడండి! ఈ రత్నం వంటి దానిపై దేవుని ఆధిపత్యం విషయంలో బుద్ధిపూర్వక అనాదరణతో మానవులు భూమిని రోత చేశారు. అంతకంతకు ఎక్కువ జంతువులు, పక్షులు మరియు చేపల ఉనికికి అపాయకరమైయ్యేంతగా ఇది కలుషితమైంది. మన న్యాయవంతుడైన ప్రేమగల దేవుడు దీన్ని నిరంతరం సహించడు. భూమిని పాడుచేయడం లెక్కఒప్పజెప్పేందుకు పిలుపునిస్తుంది, అందుకు అనేకులు భయపడడానికి వారికి కారణముంది. మరో వైపు, జరగబోయేదాన్ని గూర్చి తెలుసుకోవడం, దేవున్ని గౌరవప్రదంగా విశ్వసించేవారికి ఎంతో ఓదార్పుకరంగా ఉంటుంది. యెహోవా తీర్పుతీర్చేందుకు తప్పకుండా పిలుస్తాడు మరియు భూమి తప్పకుండా పూర్వస్థితికి తీసుకురాబడుతుంది. భూమ్మీద ఉన్న సద్‌హృదయులందరికీ అది ఆనందమయమైన వర్తమానం.

5, 6. మానవుడు తన సృష్టికి చేసిన దానికి యెహోవా ఎలా ప్రతిస్పందిస్తాడు?

5 దేవుడు ఎవరి ద్వారా తన తీర్పు తీరుస్తాడు? ఇప్పుడు దేవుని పరలోక రాజ్యంలో రాజుగా సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ద్వారా. ఆ పరలోక కుమారుని ద్వారా, ప్రస్తుతమున్న అశుద్ధమైన, తిరుగుబాటు విధానాన్ని యెహోవా అంతమొందిస్తాడు. (2 థెస్సలొనీకయులు 1:6-9; ప్రకటన 19:11) ఈ రకంగా తనకు భయపడేవారికి ఆయన ఉపశమనాన్ని తెస్తాడు, అదే సమయంలో మన భూగృహాన్ని కాపాడి నిలుపుతాడు.

6 ఇది ఎలా జరుగుతుంది? అర్మగిద్దోను యుద్ధపు చివరిఘట్టంగా రాబోవు మహా శ్రమను గూర్చి బైబిలు చెబుతోంది. (ప్రకటన 7:14; 16:16) ఈ కలుషితమైన విధానము దానిని కలుషితం చేసేవారికి ఇది దేవుని తీర్పైవుంటుంది. మానవులెవరైనా సజీవంగా ఉంటారా? ఉంటారు! దేవుని భయం అనుచితమైనది మరియు అనారోగ్యకరమైనది కాదుకానీ, ఆయన ఎడల గౌరవపూర్వకమైన, భక్తితోకూడిన భయంగల వారే వారు. వారు విడిపించబడతారు.—సామెతలు 2:21, 22.

శక్తి యొక్క అద్భుత ప్రదర్శన

7. మోషే కాలంలో ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎందుకు జోక్యం చేసుకున్నాడు?

7 యెహోవా దేవుడు చేయబోయే ఈ నాటకీయ క్రియను, మన సామాన్య శకానికి 1,500 సంవత్సరాల క్రితం తన ఆరాధికుల కొరకు ఆయన చేసిన మహత్తర కార్యం ఛాయగా సూచిస్తోంది. ఐగుప్తు యొక్క మహా గొప్ప సైనిక శక్తి వలసవచ్చిన ఇశ్రాయేలీయుల పనివారిని బానిసలను చేసింది, మరి దాని పరిపాలకుడైన ఫరో ఇశ్రాయేలీయుల్లో మగ శిశువులను చంపమని ఆదేశించినప్పుడు జాతినిర్మూలనా ప్రయత్నం కూడా జరిగింది. ఐగుప్తుపై దేవుని విజయం ఇశ్రాయేలీయులకు క్రూర రాజకీయ విధానం నుండి, అవును అనేక దేవతల ఆరాధనచే కలుషితమైన దేశము నుండి విడుదల తీసుకువచ్చేదై ఉండేది.

8, 9. దేవుడు జోక్యం కలుగజేసుకోవడం విషయంలో మోషే మరియు ఇశ్రాయేలీయులు ఎలా ప్రతిస్పందించారు?

8 విడుదలకు ఇశ్రాయేలీయుల ప్రతిస్పందనను గూర్చి నిర్గమకాండము 15వ అధ్యాయం నమోదు చేస్తోంది. ఈ దృష్టాంతాన్ని విశ్లేషించడం, ప్రస్తుతం ఆత్మీయంగానూ భౌతికంగాను మలినమైన విధానం నుండి క్రైస్తవులు ఎలా విమోచించబడతారన్న విషయాల్ని గుణగ్రహించేందుకు సహాయపడుతుంది. సత్యదేవుడైన యెహోవాకు ఎందుకు భయపడాలన్న విషయాన్ని నేర్చుకునేందుకు కొన్ని ఎంపికచేసిన వచనాలపై దృష్టినిల్పుతూ నిర్గమకాండము 15వ అధ్యాయాన్ని మనం పరిశీలిద్దాం. మనం 1 మరియు 2వ వచనాలతో ప్రారంభిద్దాం:

9 “అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి—యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.”

10. ఐగుప్తు సైన్యాన్ని దేవుడు నాశనం చేసేందుకు ఏది నడిపించింది?

10 యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి ఎలా విడిపించాడన్న దృష్టాంతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు బాగా పరిచయం. చివరికి ఫరో ఇశ్రాయేలీయులను విడిచిపెట్టేంతవరకు ఆ గొప్ప ప్రపంచ శక్తి మీదికి ఆయన తెగుళ్లను రప్పించాడు. అయితే రక్షణలేని ఈ ప్రజలను ఫరో సైన్యం వెంటాడింది మరియు ఎఱ్ఱ సముద్రం ఒడ్డున అది వారిని బంధించిందా అన్నట్లు అనిపించింది. ఇశ్రాయేలు కుమారులు ఇక తొందరలోనే తమ నూతన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నట్లు అనిపించినప్పటికీ యెహోవా మనస్సులో వేరే విషయం ఉంది. అద్భుత రీతిగా ఆయన సముద్రంలో వారికొరకు దారినేర్పరచి, తన ప్రజలను భద్రంగా తెచ్చాడు. ఐగుప్తీయులు వెంబడించినప్పుడు, ఆయన ఎఱ్ఱ సముద్రాన్ని మూసేసి, ఫరో మరియు ఆయన సైనిక శక్తులను ముంచేశాడు.—నిర్గమకాండము 14:1-31.

11. ఐగుప్తు విషయంలో దేవుడు చేసిన కార్యం ఏమి ఫలింపజేసింది?

11 ఐగుప్తీయుల సైనిక శక్తులను యెహోవా నాశనం చేయడం, తన ఆరాధికుల దృష్టిలో ఆయనను ఉన్నతపర్చింది మరియు ఆయన నామం నలుమూలలా తెలిసింది. (యెహోషువ 2:9, 10; 4:23, 24) అవును, తమ ఆరాధికులను విడిపించలేమని నిరూపించుకున్న ఐగుప్తు అబద్ధ దేవుళ్ల శక్తిహీనతకుపైగా ఆయన నామం ఉన్నతమైంది. తమ దేవతల్లోనూ మరియు మృతతుల్య మానవునిలోనూ మరియు సైనిక శక్తిలోనూ వారి విశ్వాసం ఘోరమైన నిరాశకు దారితీసింది. (కీర్తన 146:3) తన ప్రజలను బలమైనరీతిలో విమోచించే సజీవ దేవుని ఎడల ఆరోగ్యకరమైన భయాన్ని ప్రతిబింబించే స్తుతిగానాలను పాడేందుకు ఇశ్రాయేలీయులు కదిలించబడ్డారనడంలో ఆశ్చర్యంలేదు!

12, 13. ఎఱ్ఱ సముద్రం వద్ద దేవుడు సాధించిన విజయంనుండి మనం ఏమి నేర్చుకోవాలి?

12 అదేవిధంగా, మన కాలంలోనూ ఏ అబద్ధ దేవుళ్లైన మరియు అణ్వాయుధాలు కలిగిన ఏ అగ్రశక్తియు యెహోవాకు సరిసమానం కాలేవని మనం గుర్తించాలి. ఆయన తన ప్రజలను విమోచించగలడు విమోచిస్తాడు కూడా. “ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.” (దానియేలు 4:35) ఈ మాటలను మనం పూర్తిగా గ్రహించినప్పుడు మనం కూడా ఆయన స్తుతులను ఆనందంతో పాడేందుకు ప్రేరేపించబడతాము.

13 ఎఱ్ఱ సముద్రం వద్ద పాడిన విజయగీతం ఇలా కొనసాగుతోంది: “యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు.” కనుక ఈ అజేయుడైన యోధుడు మానవ ఊహల్లోని అనామక కాల్పనికుడు కాడు. ఆయనకు ఓ పేరు ఉంది! ఆయన ‘తానే కర్త అయిన’ గొప్ప నిర్మాణకుడు, ఆయన ‘యెహోవా అను నామము ధరించిన . . . సర్వలోకములో మహోన్నతుడు.’ (నిర్గమకాండము 3:14; 15:3-5; కీర్తన 83:18) సర్వోన్నతుని తృణీకరించే బదులు కారణయుక్తమైన, గౌరవప్రదమైన భయాన్ని ఆయన ఎడల కల్గివుండడం ఆ ప్రాచీన ఐగుప్తీయులకు శ్రేయస్కరంగా ఉండేదని మీరు అంగీకరించరా?

14. ఎఱ్ఱ సముద్రం వద్ద దైవిక భక్తి యొక్క విలువ ఎలా కనపర్చబడింది?

14 భూమిని తయారు చేసిన వానిగా, సముద్రాల నిర్మాణకునిగా జల ప్రవాహాలమీద పూర్తి ఆధిపత్యం కల్గివున్నాడు. (నిర్గమకాండము 15:8) గాలిపైన కూడా తనకు గల ఆధిపత్యాన్ని ఉపయోగించి, అసాధ్యమైనవన్నట్లు కనిపించిన దాన్ని ఆయన సాధించాడు. ఒక ప్రాంతంలో ఆయన నీటిని వేరుచేసి, తన ప్రజలు ఆ దారిన వెళ్లేందుకు వీలుగా వాటిని ఎదురెదురుగా ఆవలివైపుకు పారేట్లు చేశాడు. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి: లక్షలకొలది టన్నుల సముద్రపు నీరు రెండు సమాంతర గోడలుగా ఎత్తుగా ఏర్పడి, ఇశ్రాయేలీయులు తప్పించుకునేందుకు రక్షణ మార్గంగా పనిచేసింది. అవును, దేవుని ఎడల ఆరోగ్యదాయకమైన భయాన్ని కనపర్చేవారు రక్షణను పొందారు. తర్వాత ఫరో శక్తులనూ వారి పరికరాలను ముంచి వేస్తూ ఓ గొప్ప వెల్లువగా ఉప్పొంగేందుకు అనుమతిస్తూ యెహోవా నీటిని విడిచిపెట్టాడు. యోగ్యతలేని దేవుళ్లు మరియు మానవ శక్తిపై దైవిక శక్తి ఎంత అద్భుతంగా ప్రదర్శించబడింది! నిశ్చయంగా, భయపడాల్సింది యెహోవాకే, కాదా?—నిర్గమకాండము 14:21, 22, 28; 15:8.

దేవుని ఎడల మన భయాన్ని ప్రదర్శించడం

15. దేవుని శక్తివంతమైన రక్షణ కార్యాలకు మనం ఎలా ప్రతిస్పందించాలి?

15 మనం మోషేతో భద్రంగా నిలుచున్నట్లైతే, “యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు” అని పాడేందుకు కదిలించబడతాము. (నిర్గమకాండము 15:11) ఆ నాటినుండి అలాంటి మనోభావనలు శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. బైబిల్లోని చివరి పుస్తకంలో అపొస్తలుడైన యోహాను, దేవుని నమ్మకమైన అభిషక్త సేవకుల గుంపును వర్ణిస్తున్నాడు: “దేవునిదాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.” ఈ గొప్ప కీర్తన ఏమిటి? “ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?”—ప్రకటన 15:2-4.

16, 17. నేడు జరిగే ఏ అద్భుతమైన పురోభివృద్ధిని మనం చూస్తున్నాము?

16 నేడుకూడా దేవుని చేతిపనులనే కాక ఆయన ఆదేశాలను కూడా మెచ్చుకునే విడిపించబడిన ఆరాధికులున్నారు. అన్ని జనాంగాల్లోని ప్రజలు ఈ కలుషితమైన ప్రపంచంనుండి ఆత్మీయంగా విమోచించబడి వేరుచేయబడ్డారు, ఎందుకంటే వారు దేవుని నీతియుక్తమైన ఆదేశాలను గ్రహించి, వాటిని క్రియల్లో కనపర్చారు. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది ఈ అవినీతికరమైన లోకాన్ని విడిచి యెహోవా ఆరాధికుల పరిశుభ్రమైన, సరైన సంస్థతో సహవసిస్తున్నారు. వెంటనే, అబద్ధ మతం మరియు మిగతా దుష్టవిధానంపై దేవుడు తీవ్రమైన తీర్పులు తీర్చిన వెంటనే వారు నీతియుక్తమైన నూతన లోకంలో నిరంతరం జీవిస్తారు.

17 ప్రకటన 14:6, 7 వచనాలకనుగుణంగా, దేవదూతల నడిపింపుతో యెహోవాసాక్షులు ప్రకటించే తీర్పు యొక్క హెచ్చరికా సమాచారాన్ని మానవజాతి నేడు వింటోంది. గత సంవత్సరం 230 కంటే అధిక దేశాల్లో 50 లక్షల సాక్షులు దేవుని రాజ్య సువార్తను ఆయన తీర్పు ఘడియను ప్రకటించారు. తమ తోటి మానవులు తప్పించుకోడానికి వారికి నేర్పిస్తూ ప్రజలతో ఉచిత బైబిలు పఠనాలను నిర్వహిస్తూ వారి ఇళ్లను సాక్షులు క్రమంగా సందర్శిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సత్య దేవునికి భయపడేందుకు అవసరమైనంతగా జ్ఞానయుక్తంగా నేర్చుకుంటారు, ఆయనకు తమ జీవితాలను సమర్పిస్తారు మరియు బాప్తిస్మం తీసుకుంటారు. అలాంటి వారు సత్య దేవునికి భయపడడం ఎంత ఆనందదాయకం!—లూకా 1:49-51; అపొస్తలుల కార్యములు 9:31; హెబ్రీయులు 11:7 పోల్చండి.

18. మన ప్రకటన పనిలో దేవదూతలు ఇమిడివున్నారని ఏది ఉదహరిస్తోంది?

18 ఈ ప్రకటన పనిలో దూతలు చేరివుండడం నిజమేనా? తరచూ దేవదూతల నడిపింపువల్ల ఆత్మీయ సహాయం కొరకు పరితపిస్తూ, ప్రార్థిస్తూ ఉన్న కలతచెందిన వారి ఇళ్లకు యెహోవాసాక్షులు నడిపించబడడం స్పష్టమనిపిస్తుంది! ఉదాహరణకు, ఓ చిన్న పిల్లవానితో ఇద్దరు యెహోవాసాక్షులు ఓ కరీబియన్‌ ద్వీపంలో సువార్తను చెబుతూ ఉన్నారు. మధ్యాహ్నం సమీపిస్తూ ఉండగా, ఇంకా ఆ రోజుకు చాలించి ఇంటికి వెళ్లాలని పెద్దలిద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే ఈ పిల్లవాడు మాత్రం ఎందుకో తర్వాతి ఇంటికి వెళ్లాలని మారాంచేశాడు. ఆ సమయంలో ఆ పెద్దలకు వెళ్లాలని లేదని ఆ అబ్బాయి గమనించి తానే వెళ్లి తలుపు తట్టాడు. ఓ యువతి తలుపు తెరచింది. పెద్దలు ఇది చూసినప్పుడు వారు వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఆమె అప్పుడే, తనకు బైబిలు నుండి బోధించేందుకు సాక్షులను పంపించమని దేవునికి ప్రార్థిస్తోందని వివరిస్తూ వారిని లోపలికి ఆహ్వానించింది. బైబిలు పఠనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి.

19. దేవునికి భయపడడంవల్ల ప్రయోజనం ఉందనడానికి మనం దేన్ని సూచించగలం?

19 మనం నమ్మకంగా దేవుని తీర్పు సమాచారాలను అందిస్తుండగా ఆయన నీతియుక్తమైన ఆజ్ఞలను కూడా మనం బోధిస్తాము. ఇవి ప్రజల జీవితాల్లో అన్వయించబడినప్పుడు, అటు శారీరక మరియు ఆత్మీయ ఆశీర్వాదాలు ఫలిస్తాయి. ఉదాహరణకు, అన్ని విధాలైన లైంగిక అనైతికతను బైబిలు ఖండిస్తోంది. (రోమీయులు 1:26, 27, 32) నేడు లోకవ్యాప్తంగా దైవిక సూత్రాలు అలక్ష్యం చేయబడుతున్నాయి. దాని ఫలితమేమిటి? వివాహాలు విచ్ఛిన్నమౌతున్నాయి. నేరం పెరుగుతోంది. బలహీనపర్చే లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఈ 20వ శతాబ్దంలో వ్యాపిస్తున్నాయి. నిజానికి, భయాన్ని కలిగించే ఎయిడ్స్‌ ఎక్కువగా లైంగికావినీతివల్లనే సోకుతుంది. అయితే దేవుని ఎడల గౌరవప్రదమైన భయం నిజమైన ఆరాధికులకు గొప్ప రక్షణ అని నిరూపించబడలేదా?—2 కొరింథీయులు 7:1; ఫిలిప్పీయులు 2:12; అపొస్తలుల కార్యములు 15:28, 29 కూడా చూడండి.

ఇప్పుడు దేవునికి భయపడడంలోని ఫలితాలు

20. యెహోవాసాక్షులకు గల పేరును గూర్చి ఇతరులకు తెలుసునని ఏ విషయం ఉదహరిస్తోంది?

20 దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచేవారికి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. మంచి నైతికత గల క్రైస్తవుల శాంతియుతమైన సహోదరత్వంగా యెహోవాసాక్షులు ఏర్పడుతున్నారన్న వాస్తవం అంతకంతకూ గుర్తించబడుతోందని ఉదహరించే సంఘటనను పరిశీలించండి. దక్షిణమెరికాలోని అంతర్జాతీయ సమావేశానికి ప్రతినిధులుగా అనేక మంది సాక్షులు వెళ్లారు. ఒక రోజు రాత్రి ఆ దేశాధ్యక్షుడు సాక్షులుకాని వారినుద్దేశించి ప్రసంగించేందుకు కూడా ఉపయోగించుకున్న ఓ హోటల్లోనే వారు బసచేశారు. ఓ లిఫ్టులోకి భద్రతా దళం అధ్యక్షుణ్ణి త్వరగా తీసుకువెళుతుండగా, ఆ లిఫ్టులో ఉన్నదెవరో తెలియక ఓ సాక్షి ప్రవేశించింది, అందుకు ఆ భద్రతనిచ్చేవారు ఆశ్చర్యపోయారు! ఆమె చేసిందేమిటో గ్రహించి ఆ సాక్షి అలా జొరబడినందుకు క్షమాపణను కోరింది. తాను ఓ యెహోవాసాక్షియని సూచించే తన సమావేశ కార్డును ఆమె చూపించి, అధ్యక్షునికి తాను ఏ హాని కలుగజేయదని చెప్పింది. సన్నగా నవ్వుతూ ఓ గార్డు ఇలా చెప్పాడు: “ప్రజలందరూ యెహోవాసాక్షుల్లా ఉంటే మనకు ఇలాంటి భద్రత అవసరముండేది కాదు.”—యెషయా 2:2-4.

21. చర్యగైకొనగల ఏ మార్గాలు నేడు ప్రజలకు తెరవబడివున్నాయి?

21 ఈ విధానాన్ని అంతంచేసే ‘మహా శ్రమలనుండి వచ్చేందుకు’ యెహోవా నేడు సమకూర్చి, సిద్ధపరుస్తున్న ప్రజలు ఇలాంటి వారే. (ప్రకటన 7:9, 10, 14) అలా తప్పించుకోవడం అకస్మాత్తుగా సంభవించేదికాదు. తప్పించుకునేందుకు ఒక వ్యక్తి యెహోవాకు భయపడాలి, ఆయన అర్హతగల సర్వాధికారియని గుర్తించాలి మరియు ఆయనకు సమర్పించుకోవాలి. అయితే వాస్తవమేమిటంటే, రక్షణనిచ్చేటువంటి అట్టి భయాన్ని అనేకులు అలవర్చుకోరు. (కీర్తన 2:1-6) అందుబాటులో ఉన్న రుజువులన్నింటి ప్రకారంగా, యెహోవా ఎన్నుకున్న యేసుక్రీస్తు, నిర్ణయాత్మక సంవత్సరమైన 1914 నుండి రాజుగా పరిపాలిస్తున్నాడు. దాని భావం, యెహోవా ఎడల ఆరోగ్యకరమైన భయాన్ని వృద్ధిచేసుకుని కనపర్చేందుకు ఇక మిగిలిన సమయం చాలా కొంచెమే. అయినప్పటికీ, ఉన్నత స్థానాల్లోని వారితో సహా ఆయా వ్యక్తులు ప్రతిస్పందించేందుకు మన సృష్టికర్త అనుమతిస్తున్నాడు: “రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.”—కీర్తన 2:7-12.

22. నేడు దేవునికి భయపడేవారికి భవిష్యత్తులో ఏమి ఉంది?

22 మనలను కాపాడిన వానిగా ఉన్న సృష్టికర్తను స్తుతించే వారిలో మనం కూడా ఉందాము. అయితే, అందుకు మనం ఇప్పుడు సత్యదేవునికి భయపడాలి! (కీర్తన 2:11; హెబ్రీయులు 12:28; 1 పేతురు 1:17 పోల్చండి.) మనం ఎడతెగక ఆయన నీతియుక్తమైన ఆజ్ఞలను నేర్చుకుని ఆయనకు లోబడి ఉండాలి. యెహోవా ఈ భూమ్మీది దుష్టతనంతటీని తుడిచివేసి, పాపపు మలినపర్చే ప్రభావం నుండి మానవున్ని ఆయన భూగృహాన్ని స్వస్థపర్చడం ప్రారంభించినప్పుడు, ప్రకటన 15:3, 4 నందు నమోదు చేయబడిన మోషే గీతం మరియు గొఱ్ఱెపిల్ల గీతం వాటి తారస్థాయికి చేరుకుంటాయి. అప్పుడు, మన పూర్ణ హృదయంతో, మనం ఇలా పాడతాము: “ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, . . . నీకు భయపడనివాడెవడు?”

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ మన ఆరోగ్యదాయకమైన భయానికి యెహోవా ఎందుకు అర్హుడు?

◻ ఎఱ్ఱ సముద్రం వద్ద దేవుడు సాధించినవాటి వల్ల ఏమి కనపర్చబడింది?

◻ యెహోవా ఎడల మనం గౌరవప్రదమైన భయాన్ని కల్గివుండడం వల్ల ఏ ప్రయోజనాలు వస్తాయి?

◻ సత్య దేవునికి ఇప్పుడే భయపడేవారికి ఎలాంటి భవిష్యత్తు ఉంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి