పాఠకులనుండి ప్రశ్నలు
అందర్ని యూదులనే—అంటే ఒకే జాతికి దేశానికి సంబంధించిన పురుషులను మాత్రమే తొలి పరిపాలక సభకు ఎన్నుకోవడం ద్వారా దేవుడు పక్షపాతం చూపాడా?
కాదు, ఆయన అలా చూపలేదు. యేసు తనకు శిష్యులుగా పిలిచిన వారందరూ యూదులే. తర్వాత, సా.శ. 33 పెంతెకొస్తునాడు యూదులూ మరియు యూదా మత ప్రవిష్టులు పరిశుద్ధాత్మతో అభిషక్తులయ్యారు మరియు పరలోకంలో క్రీస్తుతో పరిపాలించేందుకు అర్హులయ్యారు. ఆ తర్వాతే సమరయులు మరియు మతం మార్చుకుని సున్నతి పొందని అన్యులు చేర్చబడ్డారు. కనుక, ఆ కాలంలోని పరిపాలక సభలో, అపొస్తలుల కార్యములు 15:2నందు ప్రస్తావించినట్లుగా ‘యెరూషలేములోని అపొస్తలులు పెద్దలు’ ఉన్నారన్న విషయం అర్థమౌతోంది. ఈ వ్యక్తులకు లేఖన పరిజ్ఞానం ఉంది మరియు నిజమైన ఆరాధనలో సంవత్సరాలకొలది అనుభవము ఉంది అంతేకాకుండ పరిపక్వతగల క్రైస్తవ పెద్దలుగా వృద్ధిచెందేందుకు వారికి ఎంతో సమయముండేది.—రోమీయులు 3:1, 2 పోల్చండి.
అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో వివరించిన పరిపాలక సభకూటం జరిగే సమయానికి అనేకమంది అన్యులు క్రైస్తవులయ్యారు. వీరిలో ఆఫ్రికాదేశీయులు, ఐరోపావారు మరియు ఇతర ప్రాంతాలనుండి వచ్చిన ప్రజలున్నారు. అయినప్పటికీ, యూదులు కానివారికి క్రైస్తవత్వం ప్రియమైనదానిగా చేసేందుకు అలాంటి అన్యులు పరిపాలక సభలో చేర్చబడ్డారనేందుకు ఏ దాఖలా లేదు. “దేవుని ఇశ్రాయేలు” నందు క్రొత్తగా మతం మార్చుకున్న అన్యులైన క్రైస్తవులకూ ఒకే స్థానమున్నప్పటికీ, ఆ నాటి పరిపాలక సభలో భాగమైన అపొస్తలులవంటి, పరిపక్వతగల మరియు మరింత అనుభవంగల యూదా క్రైస్తవులను గౌరవించి ఉంటారు. (గలతీయులు 6:16) అపొస్తలుల కార్యములు 1:21, 22 నందు ఇలాంటి అనుభవం ఎంత ఉన్నతంగా పరిగణించబడేదో గమనించండి.—హెబ్రీయులు 2:3; 2 పేతురు 1:18; 1 యోహాను 1:1-3.
అనేక శతాబ్దాల వరకు దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో ప్రత్యేకమైన విధంగా వ్యవహరించాడు, యేసు వారిలోనుండి తన అపొస్తలులను ఎన్నుకున్నాడు. ఈనాటి దక్షిణమెరికా లేక ఆఫ్రికా లేక చైనా జపాన్ నుండి ఏ అపొస్తలులు లేకపోవడంలో ఏ పొరపాటూ లేదు లేక అన్యాయమూ కాదు. కాలం గడిచేకొలది, ఆ ప్రాంతాల్లోని స్త్రీపురుషులు, భూమిమీద అపొస్తలునిగా ఉండడంకంటే, మొదటి శతాబ్దంలో పరిపాలక సభలో సభ్యునిగా ఉండడం కంటే, లేక నేడు దేవుని ప్రజల్లో మరో నియామకాన్ని కల్గివుండడం కంటే ఎంతో గొప్ప ఆధిక్యతను కల్గివుండగలరు.—గలతీయులు 3:27-29.
“దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువారిని ఆయన అంగీకరించును” అని ఒక అపొస్తలుడు పేర్కొనేందుకు కదిలించబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 10:34, 35) అవును, క్రీస్తు విమోచన క్రయధనపు ప్రయోజనాలు పక్షపాత రహితంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. మరియు ప్రతి జాతి, భాష, దేశానికి చెందిన వారు పరలోక రాజ్యంలోను భూమిమీద నిరంతరం జీవించే గొప్ప సమూహంలోను ఉంటారు.
అనేకమంది, జాతి, భాష, లేక దేశ చరిత్ర విషయంలో ఎంతో శ్రద్ధగల్గి ఉంటారు. గ్రీకు మాట్లాడే క్రైస్తవులు మరియు హెబ్రీ భాష మాట్లాడే క్రైస్తవులు సణుగుకునేందుకు కారణమైన విషయాన్ని గూర్చి, అపొస్తలుల కార్యములు 6:1 నందు చెప్పబడిన విషయంలో సూచించబడింది. భాష, తెగ, జాతి లేక స్త్రీపురుషుల్లో తేడాలవల్ల మనలో పాతుకుపోయిన భావాలతో మనం పెరిగివుంటాము. ఆ నిజమైన సాధ్యత దృష్ట్యా, మన బాహ్య రూపమేదైనప్పటికీ, మన భావాలూ ప్రతిస్పందనలూ దేవుని దృక్కోణంతో మలచబడేందుకు మనం అనుమతించాలనే తీర్మానంతో కూడిన ప్రయత్నాన్ని మనం చేయడం మంచిది. పెద్దలు మరియు పరిచారకుల అర్హతలను దేవుడు వ్రాయించినప్పుడు, ఫలానా జాతి లేక దేశానికి చెందినవారై ఉండాలని ప్రస్తావించలేదు. అలాకాకుండ, సేవించేందుకు అందుబాటులో ఉన్న వారి ఆత్మీయ అర్హతలపైన ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. మొదటి శతాబ్దంలో దేవుడు పరిపాలక సభను ఏర్పాటు చేసినప్పుడు ఇది ఎలా ఉండేదో అలాగే నేటి స్థానిక పెద్దలు, ప్రయాణ కాపరులూ బ్రాంచి క్యారాలయ సిబ్బంది విషయంలోకూడా అలాగేవుంది.