బంధువులకు సాక్ష్యమివ్వడం చక్కని ఫలితాలను తెస్తుంది
తైవాన్ నందలి తైనాన్లోని ఒక యౌవన గృహిణి బైబిలు పఠించడం ప్రారంభించింది. వాళ్లది ఉమ్మడి కుటుంబం, కుటుంబంలోని వారనేకులు ప్రెస్బిటేరియన్ చర్చిలో ప్రముఖులు. ‘ఇతర మతాలపై దాడి చేస్తారని’ తన చర్చి సాక్షులను తరచూ విమర్శిస్తుంది గనుక, ఆమె దాన్ని జాగ్రత్తగా నివారించింది కానీ క్రైస్తవ లక్షణాలను ప్రదర్శించడంపై అవధానం నిలిపింది. ఆమె కూటాలకు వెళ్లేందుకు పదహారు కిలోమీటర్లు మోటర్ సైకిలుపై ప్రయాణించాల్సి ఉంటుంది, అయినప్పటికీ ఆమె క్రమంగా హాజరయ్యేది. ఆమె తన వ్యక్తిత్వంలో చేసుకుంటున్న మార్పులను ఆమె కుటుంబ సభ్యులు త్వరలోనే గమనించడం ప్రారంభించారు. దీని ఫలితంగా అలాగే ఆమె యుక్తిగా సాక్ష్యమివ్వడం వల్ల, ఆమె వదిన పఠించడం ప్రారంభించింది. అప్పుడు ఆమె ఏమి నేర్చుకుంటుందో పరిశీలించడానికి ఆమె భర్త కూడా అంగీకరించాడు. ఆ తర్వాత, ఆయన అన్న మరియు ఒక బావ పఠించడం ప్రారంభించారు. కుటుంబంలోని సభ్యులనేకులు నేర్చుకుంటున్న దానిలో అత్త కూడా ఆసక్తి చూపింది. ఆ యౌవన మహిళ, 322 కిలోమీటర్ల దూరానున్న తన తలిదండ్రులకు కూడా సాక్ష్యమిచ్చింది. వాళ్లు పఠించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ యౌవన మహిళ, ఆమె భర్త, మరి ఇద్దరు బంధువులు బాప్తిస్మం తీసుకున్నారు, ఇతర బంధువులు అనేకులు సత్యాన్ని నేర్చుకోవడంలో చక్కగా అభివృద్ధి చెందుతున్నారు, అదే చర్చికి చెందిన మరో జంట, తాము ప్రకటనా పనిలో భాగం వహించేందుకు ఇటివలనే చర్చికి రాజీనామా చేశారు. సత్యాన్ని వాక్యం ద్వారా, చక్కని ప్రవర్తన ద్వారా ఇతరులకు తెలిపినందుకు యెహోవా నుండి ఎంత గొప్ప దీవెన!