ఈనాడు గవర్నింగ్ బాడితో సహకరించుట
“అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచును.”—లూకా 12:44.
1. సా.శ. 33 నుండి ఏ రాజ్యమందు క్రీస్తు ఏలనారంభించెను, మరియు దేనిద్వారా?
సా.శ. 33 పెంతెకొస్తునాడు సంఘ శిరస్సు అయిన యేసుక్రీస్తు, తన ఆత్మాభిషేక దాసుల రాజ్యమును చురుకుగా పాలించుటకు ఆరంభించెను. ఎట్లు? పరిశుద్ధాత్మ, దేవదూతలు మరియు ఒక దృశ్య గవర్నింగ్ బాడిద్వారా. అపొస్తలుడైన పౌలు సూచించినట్లుగా, దేవుడు ‘అభిషక్తులను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులుగా చేసెను.’—కొలొస్సయులు 1:13-18; అ.కార్యములు 2:33, 42; 15:2; గలతీయులు 2:1, 2; ప్రకటన 22:16.
2. 1914లో మరి ఏ పెద్ద రాజ్యమును క్రీస్తు ఏలనారంభించెను?
2 “అన్యరాజుల కాలముల” ముగింపునందు, యెహోవా క్రీస్తు రాజ్యాధికారమును క్రైస్తవసంఘ పరిధికిమించి విస్తరింపజేసెను. (లూకా 21:24) అవును, 1914వ సంవత్సరములో “జనాంగముల” పైన, “లోక రాజ్యము” పైన, అనగా సమస్తమానవజాతిపైన దేవుడు తన కుమారునికి రాజ్యాధికారమును యిచ్చెను.—కీర్తన 2:6-8 NW; ప్రకటన 11:15.
“తనకు కలిగినదానియంతటిమీద” నియమింపబడుట
3, 4. (ఎ) మీనాలనుగూర్చిన యేసు ఉపమానములో, రాజకుమారుడు ఎవరికి ప్రాతినిధ్యమైయున్నాడు? (బి) 1918 మరియు 1919లో రాజ్యమునకు సంబంధించిన ఎలాంటి ప్రగతిదాయక సంఘటనలు జరిగినవి?
3 యిక్కడ రాజకుమారునిగూర్చిన యేసు ఉపమానము గమనార్షమైయున్నది. (లూకా 19:11-27) రాజ్యాధికారమును సంపాదించుకొని మరలా తిరిగి రావలెనని దూరదేశమునకు ప్రయాణమగుటకు ముందు, వ్యాపారము చేయుటకుగాను ఆయన తన దాసులకు ధనమును (మీనాలను) యిచ్చెను. క్రీస్తుకు ప్రాతినిధ్యమైయున్న ఈ మనుష్యుడు తిరిగివచ్చిన పిదప, “ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను” తనయొద్దకు పిలిపించెను. (లూకా 19:15) యేసు రాజ్యాధికారము సంపాదించిన తర్వాత యిది ఎట్లు నెరవేరెను?
4 1918లో క్రీస్తుమతసామ్రాజ్యమును వదిలి తమ యజమాని భూసంబంధమైన విషయములయెడల జాగ్రత్త చూపించుటలో పనిరద్దీని కలిగియున్న ఒక చిన్న క్రైస్తవ గుంపును సింహాసనాధీనుడైన రాజగు యేసు క్రీస్తు కనుగొనెను. అగ్నితో అన్నట్లుగా వారిని శుద్ధిచేసిన పిదప, యేసు తన దాసులకు 1919లో మరింత అధికారమునిచ్చెను. (మలాకి 3:1-4; లూకా 19:16-19) ఆయన వారిని “తనకు కలిగినదానియంతటిమీద” నియమించెను.—లూకా 12:42-44.
“తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుట”
5, 6. (ఎ) క్రీస్తు గృహనిర్వాహకునికి ఎలాంటి విస్తారమైన పని అప్పగింపబడెను? (బి) 1914 తర్వాత ఏ ప్రవచనములు నెరవేరవలసియుండెను, మరియు వాటి నెరవేర్పునందు గృహనిర్వాహకుని తరగతి ఎట్లు చురుకుగా పాల్గొనవలసియుండెను?
5 పరిపాలించుచున్న రాజగు యేసు క్రీస్తు తన గృహనిర్వాహకునికి, లేక గృహపరిపాలకునికి భూమిమీద విస్తారమైన పనిని అప్పగించెను. అభిషక్త క్రైస్తవులు, భూమిమీదగల సమస్త ప్రజలను పరిపాలించ శక్తిననుగ్రహింపబడిన సింహాసనాధీనుడైన రాజుకు ప్రత్యామ్నాయముగా దేవునికి “రాయబారులుగా” వుండవలసియుండెను. (2 కొరింథీయులు 5:20; దానియేలు 7:14) కేవలము క్రీస్తు అభిషక్తులకు “తగిన కాలమున ఆహారము పెట్టుటతో” మాత్రమే వారి సముదాయక బాధ్యత తీరిపోదు. (లూకా 12:42) వారిప్పుడు 1914లో రాజ్యము స్థాపించబడిన తర్వాత నెరవేరవలసియున్న ప్రవచన కార్యమునందు చురుకుగా భాగము వహించవలసి యుండిరి.
6 వాస్తవాభ్యాసమందు దీని భావమేమైయుండెను? అనగా ‘ఈ రాజ్యసువార్తను లోకమందతటను’ ప్రకటించుటకు విస్తరింపజేయుట అని దీని భావము. (మత్తయి 24:14) అంతేకాకుండా, సాతాను దుష్టవిధానమునకు మరియు దాని మద్దతుదారులకు వ్యతిరేకముగా శక్తివంతమైన తీర్పువర్తమానములను ప్రచురించుటయనికూడా దీని భావమైయుండెను. దీనికి ‘జనములను కదిలించు’ ప్రభావముండెను. ఆవిధముగా, క్రీస్తు “వేరే గొర్రెల,” “యిష్ట వస్తువులు,” లోనికివచ్చుట ఆరంభమాయెను. (హగ్గయి 2:7; యోహాను 10:16) 1935నుండి ప్రపంచవ్యాప్తముగా “గొప్ప సమూహము” యెహోవా సంస్థలోనికి వచ్చిచేరుటకు మొదలాయెను. (ప్రకటన 7:9, 10) యిది సంస్థయందు ప్రగతిదాయక మార్పులకు పిలుపునిచ్చినది. సూచనార్థకముగా మాట్లాడినట్లయితే, రాళ్లకు ప్రతిగా యినుమును, కర్రకు బదులు యిత్తడిని, యినుముకు ప్రతిగా వెండిని, వెండికి ప్రతిగా బంగారమును చేర్చవలసియుండెను. (యెషయా 60:17) తన నమ్మకమైన దాసుని తరగతికి మరియు దాని గవర్నింగ్ బాడికి తన భూసంబంధమైన రాజ్యాసక్తులను, లేక తనకు కలిగినయావత్తును అప్పగించిన యేసు క్రీస్తు చురుకైన మరియు నిశితమైన నడిపింపుక్రింద 1919 నుండి యిదంతయు జరిగెను.
7. గృహనిర్వాహకుని విస్తరింపబడిన బాధ్యతయందు ఏమి యిమిడియుండెను?
7 యజమాని దాసుని, గృహనిర్వాహకుని, లేక గృహపరిపాలకునికి బహుగా రచించుట మరియు సంపాదకత్వపు కార్యక్రమములు చేరియున్న బాధ్యతాభారము పెరుగుటను మనము సులభముగా అర్థము చేసుకొనవచ్చును. వాచ్‌టవర్‌నందు క్రమముగా తగినవేళ ఆత్మీయాహారపు విషయములను ప్రచురించవలసియుండెను. దీనికి తోడుగా, “యింటివారిని” కట్టుటతోపాటు ప్రజాసక్తిని పెంచుటకుగాను, 1919లో మొదట ది గోల్డెన్ ఏజ్ అని ఆ తదుపరి కన్‌సోలేషన్ అని, ప్రస్తుతము అవేక్! అని పిలువబడుచున్న పత్రిక ప్రచురింపబడుటకు ఆరంభించబడెను. (మత్తయి 24:45) ఆపైన సంవత్సరములుగా, పుస్తకములు, చిన్నపుస్తకములు, కరపత్రములు ప్రవాహమువలె అసంఖ్యాకముగా ఉత్పత్తిచేయబడెను.
కొనసాగిన సంస్కరణలు
8. గవర్నింగ్ బాడి సభ్యులు మొదట దేనితో గుర్తింపబడిరి, మరియు 1944లో ది వాచ్‌టవర్ ఏమని చెప్పినది?
8 ఈ “యుగాంతమందు” వెనుకకు ఒకసారి చూచినట్లయిన గవర్నింగ్ బాడి మొదట వాచ్‌టవర్ సొసైటి సంపాదకవర్గముతో కలిసియుండినట్లు గుర్తింపబడుటలో ఆశ్చర్యమేమియు లేదు. (దానియేలు 12:4) 1944, నవంబరు 1, ది వాచ్‌టవర్ సంచికలో ప్రచురింపబడిన “ఈనాటి దైవపాలనా క్రమము” అను శీర్షిక యిలా చెప్పినది: “కారణయుక్తముగా, బయల్పరచబడిన బైబిలు సత్యముల ప్రచురణ పని అప్పగింపబడినవారు, ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించుచు అలాగే ఈ బయల్పరచబడిన సత్యములను తిరిగి ఎవరైతే ఆకలిగొని దప్పికగలవారై యున్నారో వారికి ప్రచారముచేయుటయందు ఆయనను ఐక్యతతో సేవించకోరుదురో వారందరిని నడిపించుటకు ప్రభువు ఏర్పరచుకొనిన గవర్నింగ్ బాడిగా చూడబడిరి.”
9. ఆ తర్వాత గవర్నింగ్ బాడి దేనితో సన్నిహితముగా గుర్తింపబడెను, మరియు ఎందుకు?
9 పత్రికలను యితర బైబిలు సహాయక సాహిత్యములను ప్రచురించుటకు చట్టబద్ధమైన ఆదేశములు అందు యిమిడియుండెను. కాబట్టి, అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రమందు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్టు సొసైటి స్థాపించబడి రిజిష్టరు చేయబడెను. అలా అనేక సంవత్సరములు, భూవ్యాప్తితముగా ప్రభువు ప్రజలకు కావల్సిన మరియు వారు ఉపయోగించిన బైబిలు సహాయక సాహిత్యములను ప్రచురించుటకు స్థాపించబడిన ఈ కార్పొరేషన్‌యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోని ఏడుగురు సభ్యులతో దృశ్య గవర్నింగ్ బాడి గుర్తింపబడినది.
10, 11. 1944లో ఏ మార్పు జరిగెను, మరియు దీనినిగూర్చి ది వాచ్‌టవర్ ఏ వాఖ్యానము చేసినది?
10 సొసైటియొక్క ఏడుగురు డైరెక్టర్లుకూడా నమ్మకమైన క్రైస్తవులైయుండిరి. అయితే చట్టబద్ధమైన కార్పొరేషన్‌నందు వారిపాత్ర ఎలావుండుననగా, వారిని గవర్నింగ్ బాడి స్థానములకు వాచ్‌టవర్ సొసైటి చట్టపరమైన సభ్యులు ఎన్నుకొందురు. అంతేకాకుండా, ఎవరైతే ప్రత్యేకించి సొసైటికి విరాళములను అందించిరో వారికి మాత్రమే చట్టము తొలుత అటువంటి సభ్యత్వమును, ఎన్నుకొను ఆధిక్యతలను కలుగజేసినది. ఈ ఏర్పాటు మార్పుచేయవలసిన అవసరమేర్పడెను. కాగా ఈ మార్పు 1944 అక్టోబరు 2న, జరిగిన వాచ్‌టవర్ సొసైటి పెన్సిల్వేనియా కార్పొరేషన్ వార్షిక సమావేశములో చేయబడెను. కేవలము ఆర్ధికసహాయ ప్రాతిపదికగా సభ్యత్వమును కలిగియుండకుండా సొసైటి నియమావళి సవరించబడెను. ఇకమీదట సభ్యులు యెహోవా నమ్మకమైన సేవకులనుండి ఎంపికచేయబడుదురు, కాగా వీరిలో న్యూయార్కు, బ్రూక్లిన్‌లోని సొసైటి ప్రధాన కార్యాలయములో, మరియు ప్రపంచవ్యాప్తముగావున్న దాని శాఖలలో పూర్తికాల సేవచేయుచున్న వారు చేరియుండిరి.
11 ఈ మార్పునుగూర్చి నివేదించుచు 1944 నవంబరు 1నాటి ది వాచ్‌టవర్ యిలా చెప్పినది: “ఆర్ధిక విరాళములందు ప్రాతినిధ్యము వహించినట్లుగా, డబ్బుకు తీర్మానించు అధికారము, అనగా భూమిమీది యెహోవా సాక్షుల గవర్నింగ్ బాడిలో సభ్యులను చేర్చుటతో యిక ఎంతమాత్రము సంబంధములేనిదై యున్నది. . .క్రీస్తు యేసుద్వారా యెహోవా దేవునినుండివచ్చు చురుకైన శక్తియగు పరిశుద్ధాత్మయే ఈ విషయములో తీర్మానముచేయును మరియు నడిపింపునిచ్చును.”
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌నుండి వేరైయుండుట
12. గవర్నింగ్ బాడి నడిపింపుక్రింద జరిగిన మార్పులను యెహోవా ఆశీర్వదించెనని ఏమి చూపించుచున్నది?
12 గడచిన దశాబ్దములలో ప్రకటించు పనిలో కలిగిన అభివృద్ధి, గవర్నింగ్ బాడిని అర్థము చేసుకొనుటలో ముందుచేసిన మార్పులను యెహోవా ఆశీర్వదించినట్లు నిరూపించినది. (సామెతలు 10:22) అంతెందుకు, రాజ్యప్రచారకుల సంఖ్య భూవ్యాప్తముగా 1944లో 1,30,000 ఉండగా, అది 1970నాటికి ఒక్కసారిగా 14,83,430కి పెరిగిపోయెను! అయితే యింకా అభివృద్ధిచేయవలసిన సంగతులు రానైయుండెను.
13. (ఎ) 1971 వరకు, గవర్నింగ్ బాడి విషయములో ఏ పరిస్థితి యుండెను? (బి) 1971లో జరిగిన సొసైటి వార్షిక సమావేశమునందు ఏమి జరిగెను?
13 1971వరకు గవర్నింగ్ బాడి యింకను వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్టు సొసైటి ఆఫ్ పెన్సిల్వేనియా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌నందలి ఆ ఏడుగురు సభ్యులతోనే గుర్తింపబడెను. లోకవ్యాప్తముగాయున్న సొసైటి శాఖల పనివిధానమునకు సంబంధించిన నిర్ణయములనుచేయు బరువైన బాధ్యతలో ముఖ్యభాగమును సొసైటి అధ్యక్షుడు వహించెడివాడు. అయితే 1971 అక్టోబరు 1 నాడు జరిగిన వార్షిక సమావేశములో చారిత్రాత్మకమైన ప్రసంగములివ్వబడెను. సొసైటి అధ్యక్షుడు, “పరిశుద్ధ స్థలమును సరియైన స్థితికి తెచ్చుట” అను అంశముమీద ప్రసంగించగా, ఉపాధ్యక్షుడు “చట్టబద్ధమైన కార్పొరేషన్‌నుండి వేరుగాయుండు గవర్నింగ్ బాడి” అను అంశముమీద ప్రసంగించెను. గవర్నింగ్ బాడికి ఒక చట్టబద్ధమైన కార్పొరేషన్‌కు మధ్య భేదమేమున్నది?
14. చట్టబద్ధమైన కార్పొరేషన్ మరియ గవర్నింగ్ బాడికి మధ్య ఏ భేదములుండును?
14 యింతకుముందే ప్రస్తావించినట్లుగా, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్టు సొసైటి ఆఫ్ పెన్సిల్వేనియా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌నందు సభ్యుల సంఖ్య కేవలము ఏడుగురికి మాత్రమే పరిమితము చేయబడెను. ఈ సమర్పిత క్రైస్తవులు కార్పొరేషన్‌లోని 500లకు మించని సభ్యులతో 3 సంవత్సరముల కాలవ్యవధి కొరకు ఎన్నుకొనబడుదురు, వీరిలో అనేకులు అభిషక్త క్రైస్తవులు కారు. అంతేకాకుండా, కార్పొరేషన్ పూర్తిగా చట్టబద్ధమైనది మరియు ఏదోఒక భూప్రాంతమందు స్థిరమైన కేంద్రకార్యాలయమును కలిగియుండును గనుక, కైసరు అనగా ప్రభుత్వము దానిని రద్దుచేయగల అవకాశము కలదు. (మార్కు 12:17) అయితే గవర్నింగ్ బాడి చట్టపరిధిలోనిదికాదు. దాని సభ్యులు ఎన్నుకొనబడరు. వారు యెహోవా దేవుని మరియు యేసు క్రీస్తు నడిపింపుక్రింద పరిశుద్ధాత్మద్వారా నియమింపబడుదురు. (అ.కార్యములు 20:28 పోల్చుము.) అలాగే గవర్నింగ్ బాడి సభ్యులు ఒక స్థిరమైన ప్రాంతము లేక కేంద్రకార్యాలయముల బాధ్యతలవంటివేమి లేకుండా ఆత్మాభిషక్తులైన మనుష్యులైయుందురు.
15. 1971 డిశంబరు 15, నాటి ది వాచ్‌టవర్‌నందు సంస్థనుగూర్చి ఏమి చెప్పబడెను, మరియు ఆధునిక దిన గవర్నింగ్ బాడినిగూర్చి ఏమిచెప్పవచ్చును?
15 అవగాహనయందలి అలాంటి మార్పుల విషయమై 1971 డిశంబరు 15నాటి ది వాచ్‌టవర్ యిలా చెప్పినది: “యిది ఒక-మనుష్యుని మత సంస్థకాదు, అయితే దానికి ఆత్మాభిషక్త క్రైస్తవుల గవర్నింగ్ బాడి ఒకటి కలదని క్రైస్తవ యెహోవా సాక్షులు కృతజ్ఞతాదాయకముగా ఎరిగియున్నారు, మరియు అలా అని వారు స్థిరముగా చెప్పుదురు.” అభిషక్త దాసుని తరగతి మరియు దాని వేరేగొర్రెలలోని లక్షలాదిమంది సహచరులు దాని కార్యభారమును పర్యవేక్షించేందుకు ప్రగతిదాయకముగా సంసిద్ధులైరి.
16. 1971నుండి క్రీస్తు భూసంబంధమైన ఆస్తులు ఎట్లు వృద్ధియాయెను, మరియు గవర్నింగ్ బాడిచే ప్రాతినిధ్యము వహించబడిన, నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు చూచుటకు అప్పగింపబడిన సంగతులలో కొన్ని ఏమైయున్నవి?
16 రాజైన యేసు క్రీస్తు భూమిమీది ఆస్తి క్రమేణి పెరగసాగెను. సాక్షుల సంఖ్య 1971లో 16,00,000 ఉండగా, 1989నాటికి అది శిఖరాగ్ర స్థాయిలో 37,00,000కుపైగా పెరిగిపోయెను. దేవుని ఆశీర్వాదమునకు యిది ఎంతచక్కని నిరూపణ! (యెషయా 60:22) ఈ అభివృద్ధి సొసైటి కేంద్రకార్యాలయము మరియు దాని శాఖలలోని వసతులను విస్తరింపజేయుటకు, అలాగే ఉత్పత్తిని మరియు పంచుటను పెంచుటకు ఆధునిక పద్ధతులను చేపట్టుటకు పిలుపునిచ్చినది. తత్ఫలితముగా భూవ్యాప్తితముగా అనేక రాజ్యమందిరములు మరియు అసెంబ్లి హాల్సు నిర్మించబడెను. ఈ కాలమంతటిలో, గవర్నింగ్ బాడికూడా ప్రకటించు పనిని, బైబిలు పఠన సాహిత్యములను ఉత్పత్తిచేయుటను, బ్రాంచిలలో, డిస్ట్రిక్టులలో, సర్క్యూట్లలో, సంఘములలో ఓవర్‌సీయర్లను నియమించుటను పర్యవేక్షించు బాధ్యతను నెరవేర్చినది. జాగ్రత్తవహించుటకు, గవర్నింగ్ బాడిద్వారా ప్రాతినిధ్యము వహించబడిన నమ్మకమైన మరియు బుద్ధిమంతుడునైన దాసునికి క్రీస్తు ఈ రాజ్యాసక్తులనే అప్పగించెను.
17. పర్యవేక్షణ సంబంధముగా 1971, 1974, మరియు 1976లలో మరింకే మార్పులు చేయబడెను?
17 మొదటి శతాబ్ద గవర్నింగ్ బాడి యేసు అపొస్తలులే కాకుండా యితరులును చేరియుండుటకు విస్తరింపబడెను. సున్నతినిగూర్చిన వివాదము పరిష్కరించబడినప్పుడు ఆ సభయందు సాక్ష్యాధారముగా “యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలును” చేరియుండిరి. (అ.కార్యములు 15:1, 2) దానికి సారూప్యముగా, గవర్నింగ్ బాడి 1971లో మరియు 1974లో విస్తరింపబడెను. వారి పర్యవేక్షణా పని సౌలభ్యముకొరకు, 1976 జనవరి 1, నుండి పనిచేయనారంభించుటకు గవర్నింగ్ బాడి ఐదు కమిటీలను ఏర్పాటుచేసినది. ప్రతి కమిటీలో 3నుండి 6గురు సభ్యులుందురు, అలాగే విషయ విచారణయందు ప్రతివారికి మాట్లాడుటకు సమానహక్కు ఉండును. ప్రతి కమిటి ఛైర్మన్ ఒక సంవత్సరకాలము సేవచేయును, కాగా గవర్నింగ్ బాడిలోని వివిధ వ్యక్తులు ఈ కమిటీలలోని ఒకటి లేక అంతకంటే ఎక్కువవాటిలో సేవచేయుదురు. ఈ ఐదు కమిటీలుకూడా క్రీస్తు భూసంబంధ ఆస్తియొక్క ప్రతిప్రత్యేక అంశముమీద ప్రత్యేక శ్రద్ధను చూపించును. ఆరవ కమిటీ—ఛైర్మన్స్ కమిటీ, దాని సభ్యత్వము ప్రతి సంవత్సరము మారుచుండును, యిది అత్యవసర సమస్యలయెడల పనిచేయుచుండును.
గవర్నింగ్ బాడితో చురుకుగా సహకరించుట
18. గవర్నింగ్ బాడి ఎట్లు పనిచేయుచున్నది, మరియు దానితో మన సహకారమును ప్రతిబింబించుటకుగల ఒక మార్గమేమైయున్నది?
18 ముఖ్యమైన విషయములను సమీక్షించుటకు, ప్రార్థనాపూర్వక విచారణల తదుపరి నిర్ణయములు చేయుటకు, బావి దైవపాలనా కార్యముకొరకు పథకము వేయుటకు గవర్నింగ్ బాడి వారమునకొకసారి సమావేశమగును. యింతకుముందు గమనించినట్లుగా, తీర్మానము చేయవలసియున్న గంభీరమైన ప్రశ్న ఒకటి మొదటి శతాబ్ద గవర్నింగ్ బాడి దృష్టికి తీసుకురాబడినట్లు అ.కార్యములు 15వ అధ్యాయము చూపించుచున్నది. అదేవిధముగా ఈనాడు, ప్రాముఖ్యమైన ప్రశ్నలు వారమునకు ఒకసారి లేక అవసరమైతే తరచుగా సమావేశమగు గవర్నింగ్ బాడి సభ్యులందరి దృష్టికి తీసుకురాబడును. ప్రస్తుతము 12మంది సభ్యులుగల గవర్నింగ్ బాడి, లేఖనములద్వారా, మరియు ప్రార్థనద్వారా యెహోవా దేవుని నడిపింపును వెదుకుదురు. ప్రత్యేకముగా నియమింపబడిన వీరిని మన అనుదిన ప్రార్థనలయందు గుర్తుతెచ్చుకొనుట గవర్నింగ్ బాడితో సహకరించుటను ప్రతిబింబించుటకొక మార్గమైయున్నది.—రోమీయులు 12:12.
19. గవర్నింగ్ బాడి ఉపదేశములు సంఘములకు ఎట్లు చేరును?
19 గవర్నింగ్ బాడి ఉపదేశములు నిర్ణయములు సంఘములకు ఎట్లు చేరును? మొదటి శతాబ్ద గవర్నింగ్ బాడి సభ్యులు పరిశుద్ధాత్మ సహాయముద్వారా ఒక నిర్ణయమునకు వచ్చిన తర్వాత, వారు అన్ని సంఘములకు ఒకలేఖను పంపిరి. (అ.కార్యములు 15:22-29) అయితే, ఈనాడు అలాచేయుట ప్రధానముగా క్రైస్తవ ప్రచురణలద్వారా జరుగుచున్నది.
20. (ఎ) 1976లో మరింకే వ్యవస్థాపరమైన మార్పు చేయబడెను? (బి) గవర్నింగ్ బాడితో బ్రాంచి కమిటీలు ఎట్లు సహకరించును?
20 1976 ఫిబ్రవరి 1, నుండి ప్రతి వాచ్‌టవర్ బ్రాంచి కార్యాలయము గవర్నింగ్ బాడి నియమించిన సామర్థ్యముగల వారితో బ్రాంచి కమిటీని కలిగియుండుటకు ఆరంభమాయెను. ఒకానొక దేశము లేక తమ పర్యవేక్షణక్రిందగల ఆయా దేశములలోని ఈ సహోదరులు గవర్నింగ్ బాడి ప్రతినిధులుగా తప్పక నమ్మకస్థులుగాను, యథార్థవంతులుగాను ఉండవలెను. ప్రాచీన ఇశ్రాయేలునందు తీర్పుతీర్చుటకు మోషేకు సహాయపడిన సామర్థ్యముగల, దైవభక్తిగల, నమ్మదగిన మనుష్యులను యిది మనకు గుర్తుతెచ్చుచున్నది. (నిర్గమకాండము 18:17-26) బ్రాంచి కమిటీ సభ్యులు సొసైటి పుస్తకములు, పత్రికలు, అలాగే మన రాజ్య పరిచర్య, సాధారణ లేఖలు, ప్రాంతీయ సమస్యలతో వ్యవహరించు ప్రత్యేక లేఖలద్వారా లభించిన ఉపదేశములను అమలుచేయుదురు. ఆయాదేశములలోని పని పురోగభివృద్ధి, మరియు ఉత్పన్నముకాగల సమస్యలను బ్రాంచి కమిటీలు ఎప్పటికప్పుడు గవర్నింగ్ బాడికి తెలియజేయుచుండును. ప్రపంచ నలుమూలలనుండి వచ్చు అటువంటి నివేదికలు సొసైటి సాహిత్యములలో ఎటువంటి అంశములను విచారించవలెనో తీర్మానించుటకు గవర్నింగ్ బాడికి సహాయము చేయును.
21. ప్రయాణకాపరులు ఎట్లు నియమింపబడుదురు, వారి విధులలో ఏమేమి చేరియుండును?
21 పరిశుద్ధాత్మ నడిపింపుక్రింద బ్రాంచి కమిటీలు పరిణతిగల, ఆత్మీయ పురుషులను సర్క్యూట్, మరియు డిస్ట్రిక్టు ఓవర్‌సీయర్లుగా సేవచేయుటకు సిఫారసు చేయుదురు. తిన్నగా గవర్నింగ్ బాడిచే నియమింపబడిన తర్వాత, వీరు ప్రయాణ కాపరులుగా సేవచేయుదురు. ఆత్మీయముగా నిర్మించుటకు, గవర్నింగ్ బాడినుండి వచ్చిన ఉపదేశములను అన్వయించుటకు ఈ సహోదరులు సర్క్యూట్లను, సంఘములను దర్శింతురు. (అ.కార్యములు 16:4; రోమీయులు 1:11, 12 పోల్చుము.) ప్రయాణకాపరులు బ్రాంచి కార్యాలయములకు తమ నివేదికలను అందజేయుదురు. గవర్నింగ్ బాడి లేక వారి ప్రతినిధులద్వారా పరిచారకులను, పెద్దలను నియమించుటకు సిఫారసు చేయుటకు వీరు పరిశుద్ధాత్మ సహాయముతో, మరియు లేఖనముల సహాయముతో ప్రాంతీయ పెద్దలతో భాగము వహింతురు.—ఫిలిప్పీయులు 1:1; తీతు 1:5; 1 తిమోతి 3:1-13; 4:14 పోల్చుము.
22. (ఎ) సంఘ పెద్దలు గవర్నింగ్ బాడితో ఎట్లు సహకరింతురు? (బి) ఈ దైవపాలనా ఏర్పాటును యెహోవా ఆశీర్వదించుచున్నాడని ఏమి నిరూపించుచున్నది?
22 తిరిగి పెద్దల సభలుగా తయారగువారు ‘పరిశుద్ధాత్మ దేనియందు వారిని అధ్యక్షులుగా నియమించెనో, ఆ యావత్తు మందనుగూర్చి, వారిమట్టుకు వారు జాగ్రత్తగా యుందురు.’ (అ.కార్యములు 20:28) ఈ ఓవర్‌సీయర్లు నమ్మకమైన మరియు బుద్ధిమంతుడునైన దాసుడు అతని గవర్నింగ్ బాడిద్వారా వచ్చు యెహోవా దేవుని మరియు యేసు క్రీస్తు ఉపదేశములను నమ్మకముగా అన్వయించ చూచెదరు. యెహోవా ఈ ఏర్పాటును ఆశీర్వదించుచున్నాడు, ఏలయనగా ‘సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచున్నవి.’—అ.కార్యములు 16:5.
23. గవర్నింగ్ బాడి విషయములో, మనమేమి చేయ తీర్మానించుకొనవలెను?
23 గవర్నింగ్ బాడిద్వారా, యెహోవా దేవుడు మరియు యజమానియైన యేసు క్రీస్తు, దేవుని ప్రజలకు మద్దతు చూపించుట ఎంత శ్రేష్ఠము! (కీర్తన 94:14) యెహోవా దేవుని సంస్థలో భాగముగా మనము వివిధ వ్యక్తులుగా అటువంటి మద్దతునుండి ప్రయోజనము పొందుదుము. (కీర్తన 145:14) దేవుని ఏర్పాట్లతో సహకరించుటకు యిది మన తీర్మానమును బలపరచవలెను. “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండు” కాలమువైపుకు మనము సాగుచుండగా, నిజముగా మనము ఎల్లవేళలా యెహోవా సాక్షుల గవర్నింగ్ బాడితో సహకరించుదుము గాక.—యెషయా 11:9. (w90 3/15)
గుర్తుంచుకొనవలసిన ముఖ్యాంశములు
◻1919లో గృహనిర్వాహకుని తరగతి పెరిగిన ఏ బాధ్యతలను పొందెను?
◻ అనేక సంవత్సరములు దృశ్య గవర్నింగ్ బాడి దేనితో గుర్తింపబడినది?
◻ గవర్నింగ్ బాడి సభ్యుల నియామకములో ఏ ప్రగతిదాయక మార్పులు చేయబడెను?
◻ దాసుని తరగతికి దాని గవర్నింగ్ బాడికి క్రీస్తు అప్పగించిన భూసంబంధమైన ఆస్తులు కొన్ని ఏమైయున్నవి?
◻ గవర్నింగ్ బాడితో మనమెట్లు సహకరించగలము?
[16వ పేజీలోని చిత్రాలు]
న్యూయార్కు, బ్రూక్లిన్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయము నుండి గవర్నింగ్ బాడి, వాచ్‌టవర్ సొసైటియొక్క 93 శాఖలలోని యెహోవా సాక్షుల ప్రచురించు మరియు ప్రకటించు పనిని పర్యవేక్షించుచున్నది
జర్మని
జపాను
దక్షిణాఫ్రికా
బ్రెజిల్