“స్వస్థమనస్కత సరిహద్దులకు వెలుపల”
“మనుష్యుల మనస్సుల్లోనే యుద్ధం ప్రారంభమౌతుంది కనుక, శాంతి సౌధాలను మనం మనుష్యుల మనస్సుల్లోనే నిర్మించాలి.” (ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ యొక్క శాసన పత్రము) ఈ వాక్యం మనస్సులో పెట్టుకుని, 1993 నందు, నిరాయుధీకరణపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సభకు హాజరైన 500 మందికి పైగా నిపుణులు అలాంటి సౌధాలను నిర్మించడంలో మతం నిర్వహించే పాత్రను గూర్చి పరిశీలించారు.
ప్రపంచ భద్రత కొరకు న్యాయాధిపతుల కూటమికి ప్రాతినిథ్యం వహిస్తూ జోనాతాన్ గ్రానఫ్ ఆ సభకు సంధానకర్తగా పనిచేశాడు. ఆయన ఇలా చెప్పాడు: “మతపరమైన, జాతిపరమైన పోరాటం నాగరికతకెదిగిన ప్రవర్తనకు, బహుశ పరిపక్వతా సరిహద్దులను దాటిపోయింది.” జాన్ కెనెత్ గాల్బేత్ మాటలు ఆ సభలో సరైన విధంలో ఎత్తి చెప్పబడ్డాయి: “యుద్ధాలను మరియు ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ కలిపి చూస్తే, మతం పేరిట ఎక్కువ మంది ప్రజలు చంపబడ్డారు.”
డా. శేషగిరి రావు ఇలా చెప్పాడు: “వైద్యులు చికిత్స చేయాలే కానీ వ్యాధిని వ్యాప్తిచేయకూడదు. మత పారంపర్యాలు ఒకరి ఎడల ఒకరు ద్వేషాన్ని, దౌర్జన్యపూరితమైన విభేదాన్ని వ్యాప్తిచేసేవిగా ఉండకూడదు. అవి సమాధానకర శక్తులుగా ఉండాలి. అయితే, నిజానికి మాత్రం అవి విచ్ఛినకర శక్తులుగానే పనిచేశాయి, ఇంకా పనిచేస్తున్నాయి.”
“నేటి చర్చీలన్నీ ఏకంగా యుద్ధాన్ని ఖండించినట్లైతే” శాంతి నిలుస్తుందనే హామీ ఉందని లండన్లోని కాథోలిక్ హెరాల్డ్ కొన్ని సంవత్సరాల క్రితం వ్యాఖ్యానించింది. అయితే, వార్తాపత్రిక ఇంకా ఇలా వ్యాఖ్యానించింది: “ఇది ఎన్నడూ జరగదని మాకు తెలుసు.” ఒక కాథోలిక్ నన్ ఇలా వ్యాఖ్యానించింది: “యెహోవాసాక్షుల్లా . . . మనం ఇక ఎన్నడూ ఆయుధాలను తీసుకోము అని ప్రపంచమంతా ఓ రోజు దృఢంగా నిశ్చయించుకుంటే ఎంత భిన్నంగా ఉంటుందో కదా!”
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Tom Haley/Sipa Press