కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 2/1 పేజీలు 4-7
  • నిర్ణయించుకోడానికి ఇదే ఎందుకు సమయము?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిర్ణయించుకోడానికి ఇదే ఎందుకు సమయము?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇశ్రాయేలు ఎందుకు నిరాకరించబడింది
  • క్రైస్తవమత సామ్రాజ్యపు గొప్ప మతభ్రష్టత్వం
  • సంస్కరణ అసాధ్యమా?
  • “దానిలో నుండి బయటికి” రావడానికి సమయమిదే
  • క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా ఈ లోకంలో భాగమయ్యింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • “ధర్మవిరోధికి” విరుద్ధమైన దేవుని తీర్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఎందుకు ప్రాపంచిక మతం అంతమొందుతుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 2/1 పేజీలు 4-7

నిర్ణయించుకోడానికి ఇదే ఎందుకు సమయము?

సా.శ.పూ. 16వ శతాబ్దంలో దేవుడు ఇశ్రాయేలీయులను ‘సమస్తదేశ జనులలోనుండి స్వకీయ సంపాద్యముగా, పరిశుద్ధ జనముగా’ ఎన్నుకున్నాడు. (నిర్గమకాండము 19:5, 6) పొరుగు దేశాల విగ్రహారాధనతో మరియు భ్రష్ట ఆచారాలతో తమ్మును తాము మలినపర్చుకోడానికి అనుమతిస్తూ, త్వరలోనే వారు తమ పరిశుద్ధతను, తమ మతసంబంధమైన పవిత్రతను కోల్పోయారు. అలా వారు తాము “లోబడనొల్లని” ప్రజలమని తెలియజేసుకున్నారు. (ద్వితీయోపదేశకాండము 9:6, 13; 10:16; 1 కొరింథీయులు 10:7-11) యెహోషువ మరణం తర్వాత మూడు వందల సంవత్సరాల కంటే ఎక్కువ సమయంలో, ఇశ్రాయేలీయులను మళ్లీ సత్యారాధనవైపుకు మళ్లించగల నమ్మకమైన నిర్దేశకులైన న్యాయాధిపతులను యెహోవా నియమించాడు. అయితే, ప్రజలు “తమ క్రియలలోనేమి తమ మూర్ఖప్రవర్తనలోనేమి దేనిని విడువక” యుండిరి.—న్యాయాధిపతులు 2:17-19.

ఆ తర్వాత, ప్రజలు సత్యారాధన వైపు మళ్లునట్లు ప్రేరేపించడానికి దేవుడు నమ్మకమైన రాజులను, ప్రవక్తలను నియమించాడు. ప్రవక్తయైన అజర్యా రాజైన ఆసాను, తనతోటి దేశస్థులను యెహోవా కొరకు వెదకమని ప్రోత్సహించాడు: “మీరు ఆయన కొరకు వెదకిన యెడల ఆయన మీకు తనను తాను కనుపరచుకొనును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును.” యూదా రాజ్యంలో ఆసా మతసంబంధమైన సంస్కరణను అమలుపరిచాడు. (2 దినవృత్తాంతములు 15:1-16 NW) ఆ తర్వాత, దేవుడు తన ప్రవక్తయైన యోవేలు ద్వారా తన ఆహ్వానాన్ని పునర్‌ నూతన పరచవలసి వచ్చింది. (యోవేలు 2:12, 13) ఇంకా ఆ తర్వాత, “యెహోవాను వెదకుడి” అని జెఫన్యా యూదా నివాసులను వేడుకున్నాడు. విగ్రహారాధనను మరియు భ్రష్టత్వాన్ని నిర్మూలించడానికి చేసిన ఒక సంస్కరణోద్యమంలో యౌవనుడైన రాజగు యోషీయా అలాగే చేశాడు.—జెఫన్యా 2:3; 2 దినవృత్తాంతములు 34:3-7.

పశ్చాత్తాపానికి సంబంధించిన అలాంటి సంఘటనలు జరిగినప్పటికీ, ప్రజల మత పరిస్థితి అంతకంతకు మరీ క్లిష్టమై పోతుండేది. (యిర్మీయా 2:13; 44:4, 5) విగ్రహారాధన సంబంధమైన ఆచారాలతో కలుషితమైన మత విధానం సంస్కరించబడలేనిదని వర్ణిస్తూ యిర్మీయా దాన్నిలా బాహాటంగా నిందించాడు: “కూషుదేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.” (యిర్మీయా 13:23) ఈ కారణాన్నిబట్టి, దేవుడు యూదా రాజ్యంపై తీవ్రమైన శిక్ష విధించాడు. సా.శ.పూ. 607లో యెరూషలేము, దాని ఆలయం నాశనం చేయబడ్డాయి, తప్పించుకొని బ్రదికినవారు బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు, వాళ్లు అక్కడే 70 సంవత్సరాలు ఉండిపోయారు.

ఆ సమయం ముగిసిన తర్వాత, దేవుడు దయ చూపించాడు. ఇశ్రాయేలీయులను స్వతంత్రులను చేయడానికి ఆయన కోరేషు రాజును ప్రేరేపించాడు, వారిలో కొంత శేషము ఆలయాన్ని పునర్నిర్మించడానికి యెరూషలేముకు తిరిగి వచ్చింది. దీనంతటి నుండి ఒక పాఠం నేర్చుకోడానికి బదులు, వాళ్లు మళ్లీ ఒకసారి సత్యారాధన నుండి తొలగిపోయి, “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదు”ననే తన ఆహ్వానాన్ని యెహోవా దేవుడు పునర్‌ నూతనం చేసేలా చేశారు.—మలాకీ 3:7.

ఇశ్రాయేలు ఎందుకు నిరాకరించబడింది

యేసు కాలంలో ఇశ్రాయేలీయుల మత పరిస్థితి ఎలా వుంది? వేషధారులైన మత నాయకులు “మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని” బోధించుచు “గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవచూపు” వారిగా (అంధులైన మార్గదర్శకులుగా) ఉండిరి. ‘వారు తమ ఆచారాన్ని బట్టి దేవుని ఆజ్ఞలను మీరుతుండిరి.’ ప్రజలు దేవున్ని “తమ పెదవులతో” ఘనపర్చారు, కాని వారి హృదయం ఆయన నుండి ఎంతో దూరంగా ఉండినది. (మత్తయి 15:3, 4, 8, 9, 14) ఒక జనాంగంగా వారు పశ్చాత్తాపపడడానికి మరో అవకాశాన్ని పొందుతారా? లేదు. యేసు ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” యెరూషలేము నందలి ఆలయమైన “మీ యిల్లు మీకు విడువబడియున్నది” అని ఆయన కొనసాగించాడు. (మత్తయి 21:43; 23:38) వారి తప్పు చాలా పెద్దది. వారు క్రూరమైన రోమా కైసరును తమ రాజుగా ఎన్నుకుని యేసును మెస్సీయగా నిరాకరించి ఆయనను చంపేలా చేశారు.—మత్తయి 27:25; యోహాను 19:15.

యేసు పరిచర్య చేసిన కాలం తీర్పు సమయమని గ్రహించడానికి ఇశ్రాయేలీయులు యిష్టపడలేదు. అవిశ్వాసులైన యెరూషలేము నివాసులకు యేసు యిలా చెప్పాడు: “నిన్ను దర్శించిన [తనిఖీ చేసిన (NW)] కాలము నీవు ఎరుగకుంటివి.”—లూకా 19:43.

సా.శ. 33 పెంతెకొస్తు నందు, దేవుడు ప్రతి జాతిలో నుండి, ప్రతి జనములోనుండి ఎన్నుకొనబడే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మాభిషక్త శిష్యులనే ఒక క్రొత్త జనాంగాన్ని లేక జనమును రూపొందించాడు. (అపొస్తలుల కార్యములు 10:34, 35; 15:14) చివరికి యూదా మత విధానం సంస్కరించబడగలదనే నిరీక్షణ ఏదైనా ఉండినదా? సా.శ. 70లో రోమా లీజియన్లు (సైన్యం) యెరూషలేమును నేలమట్టం చేసి దానికి జవాబిచ్చింది. దేవుడు ఆ మత విధానాన్ని పూర్తిగా నిరాకరించాడు.—లూకా 21:5, 6.

క్రైస్తవమత సామ్రాజ్యపు గొప్ప మతభ్రష్టత్వం

ఆత్మాభిషక్త క్రైస్తవులు కూడా “పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై” యుండిరి. (1 పేతురు 2:9; గలతీయులు 6:16) కాని ఆదిమ క్రైస్తవ సంఘం కూడా తన మత సంబంధ పవిత్రతను ఎంతోకాలం కాపాడుకోలేక పోయింది.

లేఖనాలు గొప్ప మత భ్రష్టత్వాన్ని లేక నిజమైన విశ్వాసం నుండి పడిపోవడాన్ని గూర్చి ముందే తెలియజేశాయి. యేసు ఉపమానంలోని సూచనార్థక గురుగులు, అంటే, నకిలీ క్రైస్తవులు, సూచనార్థక గోదుమలను లేక దేవుని ఆత్మచే అభిషేకించబడిన నిజ క్రైస్తవులను అణచి వేయడానికి ప్రయత్నిస్తాయి. దేవుని ప్రధాన శత్రువైన అపవాదిచే వృద్ధి చేయబడే అబద్ధ క్రైస్తవత్వం యొక్క వ్యాప్తి “మనుష్యులు నిద్రించుచుండగా” ప్రారంభమవ్వబోతుందని ఉపమానం తెలియజేస్తుంది. క్రీస్తు నమ్మకమైన అపొస్తలుల మరణం వల్ల ఆ తర్వాత ఏర్పడిన ఆత్మీయ మగత సమయంలో ఇది సంభవించింది. (మత్తయి 13:24-30, 36-43; 2 థెస్సలొనీకయులు 2:6-8) అపొస్తలులు ముందుగా తెలియజేసినట్లుగా, అనేకమంది నకిలీ క్రైస్తవులు గుంపులోకి యుక్తిగా చొరబడ్డారు. (అపొస్తలుల కార్యములు 20:29, 30; 1 తిమోతి 4:1-3; 2 తిమోతి 2:16-18; 2 పేతురు 2:1-3) అపొస్తలులలో యోహాను చివరిగా మరణించాడు. దాదాపు సా.శ. 98వ సంవత్సరంలో, అపొస్తలత్వ కాలపు చివరి భాగమనే “కడవరి గడియ” అప్పటికే ప్రారంభమైందని ఆయన వ్రాశాడు.—1 యోహాను 2:18, 19.

రోమా చక్రవర్తియైన కాన్‌స్టన్‌టైన్‌చే మత మరియు రాజకీయ శక్తి యొక్క ఒప్పందం అంగీకరించబడిన తర్వాత, క్రైస్తవమత సామ్రాజ్య ఆత్మీయ, సిద్ధాంతపరమైన మరియు నైతిక స్థితి ఎంతో దిగజారిపోయింది. “నాలుగవ శతాబ్దంలో చర్చి యొక్క విజయం” క్రైస్తవ దృక్కోణం నుండి చూస్తే, “ఒక వినాశనమే” అని అనేకమంది చరిత్రకారులు అంగీకరిస్తారు. ‘క్రైస్తవమత సామ్రాజ్యం తన ఉన్నత నైతిక స్థితిని కోల్పోయి’ “మరియ ఆరాధన,” “పరిశుద్ధుల” ఆరాధన, అలాగే త్రిత్వ సిద్ధాంతం వంటి అనేక ఆచారాలను, తత్త్వశాస్త్రాలను అన్యమతం నుండి స్వీకరించింది.

తన అబద్ధ విజయం తర్వాత, క్రైస్తవమత సామ్రాజ్య పరిస్థితి దిగజారిపోయింది. పోపులు మరియు కౌన్సిళ్లు (సలహా సంఘాలు) యిచ్చిన ఆజ్ఞలు, సిద్ధాంతపరమైన నిర్వచనాలు, అంతేగాక కాథోలిక్కులు నిర్వహించిన విచారణా నిర్వాహకాలు, మత యుద్ధాలు, కాథోలిక్కులు మరియు ప్రొటెస్టెంట్లకు మధ్య జరిగిన “పరిశుద్ధ” యుద్ధాలు సంస్కరించలేని మత విధానాన్ని ఉత్పన్నం చేశాయి.

ఎ వరల్డ్‌ లిట్‌ ఓన్లీ బై ఫైర్‌ అనే తన పుస్తకంలో విల్యమ్‌ మాన్చెస్టర్‌ యిలా వ్రాశాడు: “పదిహేను, పదహారు శతాబ్దాలలోని పోపులు రోమా చక్రవర్తుల్లా జీవించారు. వారు ప్రపంచంలో అత్యంత ధనికులు, పరిశుద్ధ కార్యాలయాలను అమ్మడం ద్వారా వారు, వారి మతాధికారులు (కార్డినల్స్‌) ధనవంతులయ్యారు.” గొప్ప మత భ్రష్టత్వ సమయంలో, చిన్న గుంపులు లేక ఒంటరి వ్యక్తులు సూచనార్థక గోదుమల లక్షణాలను ప్రదర్శిస్తూ, నిజ క్రైస్తవత్వాన్ని తిరిగి కనుగొనడానికి ప్రయత్నించారు. వారు తీవ్రమైన హింసను అనుభవించారు. అదే పుస్తకం ఇంకా ఇలా చెబుతుంది: “కొన్నిసార్లు క్రైస్తవత్వం యొక్క నిజమైన పరిశుద్ధులు అంటే ప్రొటెస్టెంటు మరియు కాథోలిక్‌లు ఒకేలా, హతసాక్షులుగా మంటల్లో కాల్చబడినట్లుంది.” ఇతరులు, సంస్కర్తలుగా పిలువబడిన మార్టిన్‌ లూథర్‌, జాన్‌ కాల్విన్‌ వంటి వారు కాథోలిక్‌ చర్చి నుండి వేరైనప్పటికీ దాని ప్రాథమిక సిద్ధాంతాలను యింకా అంటిపెట్టుకొనివున్న, దీర్ఘకాలం నిలిచే మత విధానాలను రూపొందించగలిగారు. వారు రాజకీయ కార్యకలాపాల్లో కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు.

ప్రొటెస్టెంట్‌ ప్రాంతంలో, మత సంబంధమైన పునర్మేల్కొల్పు అని పిలువబడిన దాన్ని అమలు చేసే ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు, 18 మరియు 19 శతాబ్దాలలో, ఈ ప్రయత్నాల ఫలితంగా ఉద్ధృతమైన విదేశీ మిషనరీ పరిచర్య జరిగింది. అయితే, కాపరులు తామే అంగీకరిస్తున్నట్లుగా, నేడు ప్రొటెస్టెంటు మంద యొక్క ఆత్మీయ స్థితి ఎంతమాత్రం ప్రోత్సాహకరంగా లేదు. “చర్చీల మధ్యనే విశ్వాస సంక్షోభం ఉంది” అని ప్రొటెస్టెంటు తత్త్వవేత్తయైన ఆస్కర్‌ కూల్‌మాన్‌ ఇటీవలనే అంగీకరించాడు.

కాథోలిక్‌ చర్చిలో సంస్కరణోద్యమాలు, ప్రతిసంస్కరణోద్యమాలు కూడా వృద్ధి చెందాయి. పదకొండు నుండి పదమూడు శతాబ్దాలలో, మతనాయకుల విస్తృతమైన లంచగొడితనం మరియు విశేషమైన ధనార్జనలతో పాటు దారిద్ర్యపు ప్రమాణాన్ని కచ్చితంగా అనుసరించిన సన్యాసి సమాజాలు రూపొందించబడ్డాయి. కాని, వారు సన్నిహితంగా గమనించబడి, వేదాంతులు చెప్పినదాని ప్రకారం, క్రైస్తవమత సంబంధ వ్యవస్థచే అణచివేయబడ్డారు. తర్వాత, కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రెన్ట్‌చే ప్రేరేపింపబడిన 16వ శతాబ్దపు ప్రతిసంస్కరణోద్యమం వచ్చింది, ప్రొటెస్టెంటు సంస్కరణతో పోటీ పడడానికి ఎక్కువగా అది నడిపింపబడింది.

పంతొమ్మిదవ శతాబ్దపు మొదటి అర్థభాగంలో, క్రైస్తవమత సంబంధ పునరుద్ధరణ సమయంలో, కాథోలిక్‌ చర్చి పెత్తందారిత్వాన్ని మరియు సాంప్రదాయ పరిరక్షణా మనోవైఖరిని గైకొంది. అయినప్పటికీ, నిజ క్రైస్తవత్వాన్ని పునరుద్ధరించే ఏ నిజమైన సంస్కరణలు చేయబడినట్లు చెప్పడానికి వీలులేదు. బదులుగా ఇవి, ప్రపంచ మత, రాజకీయ మరియు సామాజిక మార్పు సమయంలో మతనాయకుల అధికారాన్ని బలపర్చడానికి చేయబడిన కనీస ప్రయత్నాలు మాత్రమే.

ఇటీవలనే, 1960వ పడిలో, రెండవ వాటికన్‌ విశ్వవ్యాప్త క్రైస్తవ చర్చీల సమాలోచనా సభ యందు ఒక గంభీరమైన మార్పుల ప్రక్రియను ప్రారంభించడానికి కాథోలిక్‌ చర్చి ఇష్టపడ్తున్నట్టు కన్పించింది. అయితే, అభివృద్ధి చెందుతున్న చర్చీ సభ్యుల స్ఫూర్తిని అణచివేసేందుకు, పునరుజ్జీవింపబడిన సమన్వయముగా పిలువబడిన దానికి ప్రస్తుతమున్న పోపు అనుకోని అవాంతరాన్ని కలుగజేశాడు. వాయిటివా పునరుద్ధరణ అని కొంతమంది పిలిచిన ఈ ఘట్టం ఒక కాథోలిక్‌ గుంపుచే ఇలా నిర్వచించబడింది: “ఒక క్రొత్త విధమైన కాన్‌స్టన్‌టైన్‌ వాదం.” లా చివిల్టా కాటొలికా అనే ఒక జసూట్‌ పత్రికలో చెప్పబడినట్లుగా, కాథోలిక్‌ చర్చి, ఇతర మతాల వలె, “ఒక హేతువాద, భౌగోళ సంక్లిష్టతను” ఎదుర్కొంటున్నది. “దానిలో విశ్వాసం మరియు క్రైస్తవ జీవితం యొక్క ఆధారాలు ఇమిడి ఉన్నాయి గనుక హేతువాదితమైనది; క్రైస్తవత్వం యొక్క ముఖవైఖరులన్నీ దానిలో ఇమిడివున్నాయి గనుక అది భౌగోళికమైనది.”

క్రైస్తవమత సామ్రాజ్య మతాలు నిజానికి సంస్కరింపబడలేదు, ఇక సంస్కరించబడలేవు కూడా, ఎందుకంటే, సూచనార్థక గోదుమలను ఒకే స్వచ్ఛమైన సంఘముగా సమకూర్చబడడంతో “కోతకాలమందు” మాత్రమే నిజ క్రైస్తవత్వం పునరుద్ధరించ బడుతుంది. (మత్తయి 13:30, 39) మతం పేరట చేయబడిన అనేక నేరాలు, దుష్టకార్యాల దీర్ఘ పట్టిక, క్రైస్తవులని చెప్పుకున్నప్పటికీ లేకపోయినప్పటికీ, క్రైస్తవమత సామ్రాజ్యం నుండి నిజమైన సంస్కరణను అపేక్షించడం వాస్తవమైనదేనా? అనే ప్రశ్నను ఉత్పన్నం చేస్తుంది.

సంస్కరణ అసాధ్యమా?

ప్రకటన గ్రంథం లేక, అపోకలిప్స్‌, “మహా బబులోను” అనే మర్మమైన పేరుగల సూచనార్థక మహా వేశ్యను గూర్చి మాట్లాడుతుంది. (ప్రకటన 17:1, 5) ఈ సూచన యొక్క మర్మాన్ని వివరించాలని బైబిలు పాఠకులు శతాబ్దాలుగా అన్వేషించారు. మతనాయకుల ఐశ్వర్యం మరియు లంచగొండితనాన్ని బట్టి అనేకులకు ఏవగింపు కల్గింది. మహాబబులోను క్రైస్తవమత సంబంధ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందని కొందరు తలంచారు. వారిలో, 1415లో సజీవంగా దహించబడిన బొహెమెయిన్‌ కాథోలిక్‌ ఆచార్యుడైన జాన హాస్‌, 1570లో ఉరితీయబడి, దహించబడిన ఇటలీ దేశపు మానవతావాదియైన ఆన్యో పాలెయార్యో ఉన్నారు. కాథోలిక్‌ చర్చి దాని “మునుపటి గౌరవానికి” తిరిగి వస్తుందనే నిరీక్షణతో ఇద్దరూ కూడా దానిని సంస్కరించాలని ఎంతో ప్రయత్నించి సఫలం కాలేకపోయారు.

దానికి వ్యతిరేకంగా, ప్రకటన 17 మరియు 18 అధ్యాయాలు మహాబబులోను అన్ని అబద్ధ మతాల ప్రపంచ సామ్రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని సూచిస్తాయి.a ఈ సంకీర్ణ “మహావేశ్య” సంస్కరింపబడలేనిది ఎందుకంటే, “దాని పాపములు ఆకాశమునంటుచున్నవి.” వాస్తవానికి, ఈ 20వ శతాబ్దంలో, కేవలం క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందినవే కాదు, దాదాపు అన్ని మతాలు, ఎంతో రక్తాన్ని చిందించడంలో కొనసాగుతున్న యుద్ధాలకు, మానవజాతిని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన నైతిక పతనానికి బాధ్యత వహిస్తాయి. తత్ఫలితంగా, దేవుడు “బబులోను” నాశనాన్ని నిర్ణయించాడు.—ప్రకటన 18:5, 8.

“దానిలో నుండి బయటికి” రావడానికి సమయమిదే

బైబిలు ప్రవచనాల నెరవేర్పు మన కాలం ఈ దుష్ట “యుగసమాప్తి”కి సరిపోతాయని తెలియజేస్తున్నాయి. (మత్తయి 24:3) దేవున్ని యథార్థంగా ఆరాధించాలనుకునే వారు తమ స్వంత ఆలోచనలు లేక యిష్టాలు అనుసరించలేరు. అతడు ఇప్పుడే, అవును, ‘యెహోవా దొరుకు కాలమునందే ఆయనను వెదకాలి,’ ఎందుకంటే యేసు ప్రవచించిన “మహా శ్రమ” సమీపంలో ఉంది. (యెషయా 55:6; మత్తయి 24:21) ఇశ్రాయేలు ప్రజల విషయంలో నిజమైనట్లుగానే, తన ప్రాచీనత్వాన్ని బట్టి గొప్పలుపోయినంత మాత్రాన దేవుడు ఒక మతం యొక్క భ్రష్టత్వాన్ని సహించడు. మునిగిపోబోయే ఓడను బాగుచేయడానికి ప్రయత్నించే బదులు, దేవుని అంగీకారం మరియు రక్షణ కావాలనుకునే వారందరు ప్రకటన 18:4 నందలి ఈ ప్రేరేపిత ఆజ్ఞకు ఆలస్యం చేయకుండా లోబడాలి: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును [మహాబబులోనును] విడిచి రండి.”

కాని ఎక్కడికి వెళ్లడానికి “బయటికి” రావాలి? మరెక్కడ రక్షణను కనుగొనవచ్చు? పొందకూడని స్థలంలో ఆశ్రయం పొందే ప్రమాదం లేదా? దేవుని అంగీకారం వున్న ఏకైక మతాన్ని ఎలా గుర్తించవచ్చు? నమ్మదగిన సమాధానాలను కేవలం దేవుని వాక్యమందు కనుగొనవచ్చు. (2 తిమోతి 3:16, 17) బైబిలును మరింత క్షుణ్ణంగా పరిశీలించమని యెహోవాసాక్షులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుడు ఎవరిని “తన నామము కొరకు” ఎన్నుకున్నాడో, రానైయున్న తన ఉగ్రత దినాన ఎవరిని తాను కాపాడతాడో మీరు గ్రహించగలుగుతారు.—అపొస్తలుల కార్యములు 15:14; జెఫన్యా 2:3; ప్రకటన 16:14-16.

[అధస్సూచీలు]

a సూచనార్థక మహాబబులోనును లేఖనాధారంగా సరైన విధంగా గుర్తించడానికి, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ 1988లో ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తక మందలి 33 నుండి 37 అధ్యాయాలను చూడండి.

[7వ పేజీలోని చిత్రం]

మీ మత సంబంధమైన ఓడ మునిగిపోతుంటే, నిజ క్రైస్తవత్వమనే రక్షణ ఓడలోకి మరలండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి