“ధర్మవిరోధికి” విరుద్ధమైన దేవుని తీర్పు
“మంచి ఫలములు ఫలించని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.”—మత్తయి 7:19.
1, 2. ధర్మవిరోధి అనగా ఏమి మరియు అది ఎట్లు అభివృద్ధిచెందెను?
ఒక “ధర్మవిరోధి” రావటము గూర్చి ముందే తెలియజేయుటకు అపొస్తలుడైన పౌలు దేవునిచే ప్రేరేపింపబడినపుడు తనకాలములో అతడు అగుపించుట ప్రారంభము అని తెల్పెను. పోయిన ఆర్టికల్ వివరించినట్లు, సత్యమైన క్రైస్తవత్వము నుండి భ్రష్టత్వమునకు నడిపించు వ్యక్తులయొక్క ఒక తరగతిని గూర్చి పౌలు మాట్లాడుచుండెను. సత్యము నుండి ఆ తొలగింపబడుట మొదటి శతాబ్దములోని చివర, ముఖ్యముగా చివరి అపొస్తలుల మరణము, అనంతరము ప్రారంభమైనది. ఈ ధర్మవిరోధి తరగతి, దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన సిద్ధాంతములు మరియు ఆచారములు ప్రవేశపెట్టెను.—2 థెస్సలొనీకయులు 2:3, 7; అపొస్తలులకార్యములు 20:29, 30; 2 తిమోతి 3:16,17; 4:3, 4.
2 కాలక్రమేణ, ఈ ధర్మవిరోధి తరగతి ఎదిగి క్రైస్తవసామ్రాజ్యముయొక్క మతాధికారులుగా మారినది. ఈ భ్రష్టత్వమునొందిన చర్చీలు అన్యమత స్టేట్‌తో (రాజకీయవ్యవస్థ) మిళితమైనప్పుడు రోమా చక్రవర్తియైన కాన్‌స్టెన్‌టైన్‌చే నాలుగవ శతాబ్దములో దాని శక్తి మరింత జటిలమైనది. ఈ క్రైస్తవ సామ్రాజ్యము అనేక శాఖలుగా చీలిపోతూనే యుంటుండగా ఈ మతాధికారులు ఆరాధికుల సంఘముపై మరియు అప్పుడప్పుడు రాజకీయ పరిపాలకులపై కూడ హెచ్చించుకొనుచుండిరి.—2 థెస్సలొనీకయులు 2:4.
3. ఈ ధర్మవిరోధికి సంభవించునదేమి?
3 ధర్మవిరోధియొక్క ముగింపు ఏమైయుండును? పౌలు ముందే తెల్పెను: “అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును.ప్రభువైన యేసు. . .తన ఆగమన ప్రకాశముచేత నాశనముచేయును.” (2 థెస్సలొనీకయులు 2:8) అనగా సాతాను యొక్క పూర్తి విధానమును దేవుడు అంతమునకు తెచ్చినపుడు ఈ మతాధికారుల నాశనము జరుగును. సంహరించు దేవదూతల సైన్యమును నడిపించుటకు దేవుడు, పరలోకపు రాజైన యేసుక్రీస్తును ఉపయోగించును. (2 థెస్సలొనీకయులు 1:6-9; ప్రకటన 19:11-21) ఇట్టి అంతము ఆ మతాధికారులకొరకై ఎదురుచూస్తున్నది, ఎందుకనగా వారు దేవుని మరియు క్రీస్తును అవమానపరచి అనేక లక్షలమందిని సత్యారాధననుండి తొలగించిరి.
4. ఏ సూత్రమును బట్టి ధర్మవిరోధి తీర్పుతీర్చబడును?
4 ఈ ధర్మవిరోధి తీర్పుతీర్చబడు సూత్రమును ఇస్తూ యేసు ఇట్లు చెప్పెను: “అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెలచర్మములను వేసికొని మీయొద్దకు వత్తురు. కాని లోపలవారు కృరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్ల పొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచిచెట్టు మంచిఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచిచెట్టు కానిఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.. . .‘ప్రభువా ప్రభువా,’ అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నాతండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.”—మత్తయి 7:15-21; తీతు 1:16; 1 యోహాను 2:17 కూడ చూడుము.
మంచి క్రైస్తవ ఫలములు
5. మంచి క్రైస్తవ ఫలమునకు పునాది ఏమిటి, మరియు ఒక మూలమైన ఆజ్ఞ ఏది?
5 మంచి క్రైస్తవ ఫలముల కొరకైన పునాది 1 యోహాను 5:3 నందు తెల్పబడినది, అది ఇట్లున్నది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.” మరియు ఒకమూల శాసనము ఇది: “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.” (మత్తయి 22:39) అట్లు దేవుని నిజసేవకులు జాతి, దేశభేదము లేక తమ పొరుగువారిని ప్రేమింపవలెను.—మత్తయి 5:43-48; రోమా 12:17-21.
6. ప్రత్యేకముగా ఎవరియెడల క్రెస్తవప్రేమ చూపబడవలెను?
6 దేవుని సేవకులు ప్రత్యేకముగా తమ ఆత్మీయసహోదరులయెడల ప్రేమను కలిగియుండవలెను. “ఎవడైనను, ‘నేను దేవుని ప్రేమించుచున్నాను’ అని చెప్పి, తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.” (1 యోహాను 4:20, 21) యేసుచెప్పిన ఆ ప్రేమ, నిజమైన క్రైస్తవులను గుర్తించు ఒక గురుతు: “మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”—యోహాను 13:35; మరియు రోమా 14:19; గలతీయులకు 6:10; 1 యోహాను 3:10-12 కూడ చూడుము.
7. నిజమైన క్రైస్తవులు ప్రపంచవ్యాప్తముగా ఎట్లు ఏకీభవించియున్నారు?
7 దేవుని సేవకులను ఐక్యతలో కట్టిపెట్టు సహోదర ప్రేమయే “అంటిపెట్టు పదార్థము”: “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొస్సయులకు 3:14) మరియు నిజమైన క్రైస్తవులు ప్రపంచవ్యాప్తముగానున్న తమ సహోదరులతో ఐక్యతను కలిగియుందురు. ఎందుకనగా దేవుని వాక్యము ఇట్లు ఆదేశించుచున్నది: “మీరందరు ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలులేక, యేక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను సన్నద్ధులైయుండవలెను.” (1 కొరింథీయులకు 1:10) ప్రపంచవ్యాప్తముగా ఈ ప్రేమను మరియు ఐక్యతను కొనసాగించుటకు సహోదరులు ఈ లోకసంబంధమైన రాజకీయ వ్యవహారములలో తటస్థంగానుండవలసియున్నారు. యేసు ఇట్లనెను: “నేను లోక సంబంధిని కానట్టు వారును లోకసంబంధులుకారు.—యోహాను 17:16.
8. క్రైస్తవులు ఏమి చేయవలెనను దానిపై యేసు ఎట్లు ప్రదర్శించెను?
8 యేసును బంధించుటకు వచ్చినవారిలో ఒకని చెవిని పేతురు కత్తితో నరికినపుడు, తనమనస్సులో ఏమున్నదో ప్రదర్శించెను. దేవుని కుమారుని శత్రువుల నుండి సంరక్షించుటకైనను అట్టి శక్తిని ఉపయోగించుటను యేసు ప్రోత్సహించెనా? లేదు, కాని ఆయన పేతురుతో ఇట్లనెను: “నీ కత్తి వరలో తిరిగిపెట్టుము.” (మత్తయి 26:52) అట్లు నిజమైన క్రైస్తవులు తాము మరణించ వలసివచ్చినప్పటికిని, దేశములు తలపెట్టు యుద్ధములలోగాని లేక ఏ ఇతర మార్గములలోనైనను మానవుని రక్తము చిందించుటలో చేరక తటస్థవైఖరిని అవలంభించెదరు. అట్లు అనేక శతాబ్దాలుగా అనేకమంది ప్రవర్తించిరి మరియు మన కాలములో కూడ ఉండిరి. క్రీస్తు క్రింద దేవుని రాజ్యమొక్కటే యుద్ధమును, రక్తమును చిందించుటను నిర్మూలించునని వారికి తెలియును.—కీర్తనలు 46:9; మత్తయి 6:9, 10; 2 పేతురు 3:11-13.
9. (ఎ) మొదటి క్రైస్తవులను గూర్చి చరిత్ర ఏమి చెప్పుచున్నది? (బి) ఇది క్రైస్తవసామ్రాజ్యమతములకు ఎట్లు భిన్నమైనది?
9 మొదటి శతాబ్దపు క్రైస్తవులు మానవ రక్తమును చిందించలేదని చరిత్ర నిర్థారించుచున్నది. ఇంగ్లాండ్‌కు చెందిన థియోలజి యొక్క పూర్వము ఫ్రొఫెసర్, పీటర్ డి రోజా ఇట్లు వ్రాసెను: “రక్తము చిందించుట దుఃఖకరమైన ఒక పాపము. అందుకనే గాడియేటర్‌ల పోరాటమును క్రైస్తవులు వ్యతిరేకించిరి. రోమును కాపాడుటకు యుద్ధము మరియు సైన్యము అవసరమైనప్పటికిని వాటియందు క్రైస్తవులు చేరలేకపోయిరి. . . యేసువలె క్రైస్తవులు, శాంతికి రాయబారులుగా తలపోసిరి; ఏ సందర్భములలోను వారు మరణమునకు దారితీయు క్రియలలో చేరకపోయిరి.” దానికి వ్యతిరేకముగా అనైక్యతగల క్రైస్తవ సామ్రాజ్యములోని మతములు, ప్రేమచట్టమును ఉల్లంఘించి అత్యధిక పరిమాణములో రక్తమును చిందించెను. వారు శాంతి దూతలుకారు కాని అనేకమారులు వారు మరణమునకు ప్రతినిధులు.
రక్తాపరాధి మహాబబులోను
10. మహాబబులోను అనగా ఏమి, మరియు అది ఎందుకు అట్లు పిలువబడుచున్నది?
10 సాతాను, “ఈలోక అధికారి,” మరియు “ఈ యుగసంబంధమైన దేవుడు.” (యోహాను 12:31; 2 కొరింథీయులకు 4:4) ఈ సాతాను లోకములో శతాబ్దములుగా తాను నిర్మించిన లోకవ్యాప్తమైన అబద్ధమత విధానము, క్రీస్తుమతసామ్రాజ్యము, దాని మతాధికారులు భాగమైయున్నారు. ఈ లోక వ్యాప్తమైన అబద్ధమత విధానమును, “వేశ్యలకును (మతసంబంధమైన) భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను” అని బైబిల్ పిలుచుచున్నది. (ప్రకటన 17:5) ఈనాటి అబద్ధమతములు దేవుని అవమానపరచు సూత్రములు మరియు ఆచారములలో బాగుగా మునిగియున్న పురాతన బబులోనులో వాటి వేరులను కలిగియున్నవి. అందువలననే పురాతన బబులోనుకు ప్రతిరూపమైన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యము మహాబబులోను అని పిలువబడుచున్నది.
11. మహాబబులోను గూర్చి బైబిల్ ఏమిచెప్పుచున్నది, మరియు ఎందుకు?
11 మతసంబంధమైన బబులోనును గూర్చి దేవుని వాక్యముఇట్లు చెప్పుచున్నది: “ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.” (ప్రకటన 18:24) వధింపబడిన వారందరి రక్తము యెడల ఈ లోక మతములు ఎట్లు బాధ్యతవహించుచున్నవి? ఒక విషయములో ఈ మతములన్నియు—క్రీస్తుమతసామ్రాజ్యపు చర్చీలు అలాగే క్రైస్తవేతర మతములు—రాజ్యములయొక్క యుద్ధములకు మద్దతునిచ్చినవి, సమర్థించినవి లేక నడిపింపును కూడ తీసికొనినవి; వాటితో ఏకీభవించని దైవభయముగల ప్రజలనుకూడ అవి హింసించి, చంపినవి.
దేవుని అవమానపరచు ఒక నమోదు
12. ఇతర మతనాయకులకంటె క్రైస్తవసామ్రాజ్య మతాధికారులు ఎక్కువగా ఎందుకు తిరస్కరింపబడదగినవారు?
12 ఇతర మతనాయకుల కంటె క్రైస్తవ సామ్రాజ్యముయొక్క మతాధికారులు రక్తము చిందించుటలో ఎక్కువ బాధ్యతనుకలిగియున్నారు. ఎందుకు? ఎందుకనగా వారు దేవుని నామమునేగాక క్రీస్తు నామమును కూడ ధరించియున్నారు. అట్లు వారుక్రీస్తు బోధలను అనుసరించవలసియున్నారు. (యోహాను 15:10-14) కాని వారు ఆ బోధలను అనుసరించలేదు, అట్లు వారు దేవునికిని క్రీస్తుకును నిందను తెచ్చియున్నారు. ఈ మతాధికారులు క్రూసేడ్ పోరాటములు, ఇతర మతయుద్ధములు, తమను వ్యతిరేకించువారి వ్యక్తిగతహక్కులను త్రోసిపుచ్చి శ్రమపెట్టు ఇంక్విజిషన్‌లు మరియు హింసలద్వారా ప్రత్యక్షముగాను, ఇతరదేశములలోనున్న తోటి మానవులను చంపునట్లు చర్చి సభ్యులు పాల్గొనిన యుద్ధములను సమర్థించుటవలన పరోక్షముగాను రక్తపరాధమునకు బాధ్యతవహించియున్నారు.
13. ఈ క్రైస్తవ మతాధికారులు, 11 నుండి 13వ శతాబ్దమువరకు ఏ విషయములో బాధ్యులైయున్నారు?
13 ఉదాహరణకు 11 నుండి 13వ శతాబ్దము వరకు క్రైస్తవ సామ్రాజ్యము క్రూసేడ్‌లను ప్రవేశపెట్టినది. ఇవి భయంకరమైన రక్తపాతము, దేవునియొక్కయు మరియు క్రీస్తుయొక్కయు నామముపేరట దోచుకొనుటకు దారితీసినవి. అనేక వేలమంది మరణించిరి. దానిలో పాల్గొనుటకు ప్రేరేపింపబడిన అనేకవేలమంది పిల్లల అవివేకయుక్త మరణాలకు దారితీసిన, 1212వ సంవత్సరపు పిల్లల క్రూసేడ్‌యు వీటిలో చేరియున్నది.
14, 15. కాథలిక్ చర్చి 13వ శతాబ్దములో ప్రవేశపెట్టిన దానిపై ఒక కాథలిక్ రచయిత ఎట్లు వ్యాఖ్యానించెను?
14 రోమన్ కేథలిక్ చర్చి 13వ శతాబ్దములో, దేవుని అగౌరపరచు మరియొక భయంకరమైన దానిని అనగా ఇంక్విజిషన్‌నును (కేథలిక్ సిద్ధాంతములను వ్యతిరేకించిన వారిని విచారించి, శిక్షించుటకు ఏర్పరచిన న్యాయస్థానము) అధికారపూర్వకముగా మంజూరు చేసినది. ఇది యూరప్‌లో ప్రారంభమయి అమెరికాదేశములకు వ్యాపించి ఆరు శతాబ్దములకుమించి కొనసాగినది. అది చర్చితో సహకరించని వారిని హింసించి వారిని లేకుండ చేయుటలో జరిగిన హత్యాపూర్వకమైన ఒక ప్రయత్నము. ఇది పాపసిచే ప్రారంభింపబడి మద్దతునివ్వబడినది. అంతకు ముందు, కేథలిక్ కాని వారిని చర్చి హింసించినట్లు, ఈ ఇంక్విజిషన్ ఇంకా ఎక్కువ విపరీతముగా యుండెను.
15 తాను “భక్తిపరుడైన కాథలిక్” అని చెప్పుకొనుచున్న పీటర్ డి రోజా వికార్స్ ఆఫ్ క్రైస్ట్—ది డార్క్ సైడ్ ఆఫ్ ది పాపసి అను తాను వ్రాసిన ఇటీవలి పుస్తకములో ఇట్లు చెప్పెను. “వ్యతిరేకించువారిని శ్రమపెట్టుటలో యూదులను హింసించుటలో మరియు వేలాదిమంది భక్తిపరులను సంహరించుటలో మరియు న్యాయవిచారణలో భాగముగా హింసించుటను యూరప్‌లో ప్రవేశపెట్టుటలో చర్చి బాధ్యతవహించుచున్నది. . .పోపులు చక్రవర్తులను నియమించుటను లేక తొలగించుటను సహితము చేస్తూ, హింస మరియు మరణముయొక్క భయముతో క్రైస్తవ మతమును బలవంతముగా ప్రజలపై రుద్దవలెనని అధికారముగల వారివలె అడిగిరి. . . సువార్త వర్తమానమును గైకొనుటయొక్క పర్యవసానము అత్యంత భయంకరమైనది.” హత్యగావింపబడిన కొందరు చేసిన ఒకే ఒక “నేరము” కేవలం బైబిల్‌ను కలిగియుండుటయే.
16, 17. ఇన్‌క్విజిషన్‌పై (హింసించు ఉద్దేశ్యముతో జరిపిన కేథలిక్ న్యాయవిచారణ) ఏ వ్యాఖ్యానములున్నవి?
16 పదమూడవ శతాబ్దపు పోప్ ఇన్నోసెంట్ IIIని ఉద్దేశించి డి రోజా ఇట్లు తెల్పెను: “[రోమా] చక్రవర్తి డయోక్లేటియన్ (3వ శతాబ్దము) క్రింద జరిగిన అత్యంత కృరమైన హింసలో ప్రపంచవ్యాప్తముగా రెండువేలమంది క్రైస్తవులవరకు నిర్మూలమైరి. పోప్ ఇన్నోసెంట్ క్రూసేడ్ యొక్క అతికృరమైన చర్యతో కూడిన మొదటి దాడిలో [ఫ్రాన్స్‌లోని “హెరిటిక్స్” కు వ్యతిరేకముగా] సంహరింపబడిన ప్రజలు దానికి, పదిరెట్లుండిరి. . .ఒకేసారి ఒకపోపు డయొక్లేటియన్ కంటె ఎక్కువమంది క్రైస్తవులను చంపుట, క్రీస్తు వ్యతిరేకించిన ప్రతిదానిని చేయుటలో క్రీస్తునామమునే ఉపయోగించుటను గూర్చి ఏమాత్రము పరితాపము చెందకపోవుటను చూచుట గొప్ప ఆశ్చర్యమును కలిగించినది.”
17 డి రోజా ఇట్లు గమనించెను: “జాతియొక్క చరిత్రలో మానవ ఔన్నత్యాన్ని మొరటుగా సంహరించిన దానికి వారు [ఇంక్విజిటర్స్ (ఇంక్విజిషన్‌లో తీర్పుచెప్పువారలు)] పోపు నామము పేరిట బాధ్యులైయున్నారు.” టార్కివిమేడా అను డొమినికన్‌కు చెందిన స్పెయిన్‌లోని ఇంక్విజిటర్‌ను గూర్చి ఆయన ఇట్లు చెప్పెను: “అతడు 1483లో నియమింపబడి పదిహేను సంవత్సరములు కౄరముగా పరిపాలించెను. అతనికి బలియైనవారు 1,14,000 మంది, వారిలో 10,220 మంది కాల్చబడిరి.”
18. ఒక గ్రంథకర్త ఇన్‌క్విజిషన్‌ను ఎట్లు వర్ణించెను మరియు అది ఆరు శతాబ్దములవరకు కొనసాగుటకు గల ఏ ఇతర కారణములను తెలియజేసెను?
18 ఈ రచయిత ఇట్లు ముగించెను: “ఈ ఇంక్విజిషన్‌ను గూర్చిన రికార్డు ఏ సంస్థకైనను సిగ్గును కలిగించును. . . చరిత్ర చూపునదేమంటే, విరామములేకుండ ఆరుశతాబ్దములు, ఈ పాపసి అతిసామాన్యమైన మూలన్యాయమునకు విరుద్ధంగా ప్రమాణముచేసిన శత్రువైయున్నది. పదమూడవ శతాబ్దమునుండి వరుసగా ఎనుబదిమంది పోపులలో ఏ ఒక్కరు కూడ, ఈ వేదాంతమును మరియు ఇంక్విజిషన్ పేరుతో శ్రమలు పెట్టు విధానమును ఖండించలేదు. బదులుగా, ఒకరి తరువాత మరొకరు ఈ మారణ హింసకు మరి ఎక్కువ కౄరత్వమును చేర్చుచువచ్చిరి. దీనిలోని రహస్యమేమంటే: ఈ పోపులు తరమువెంబడి తరము ఈ అసలైన వ్యతిరేకక్రియలను ఎట్లు కొనసాగించగలిగిరి? ప్రతివిషయములో వారు క్రీస్తు సువార్తను ఎట్లు నిరాకరించుచు వచ్చిరి?” అతడీవిధముగా సమాధానమిచ్చెను: “పోపులు, తనకు ముందున్న ‘అసలు తప్పులేచేయరని తలంచబడిన’ పోపును కాకుండ ఆ సువార్తనే వ్యతిరేకించుటకు ఇష్టపడుచుండెను, అట్లు పోపు పద్ధతినేస్థిరపరచిరి.”
19. అనేకమంది మతాధికారులచే ఏ ఇతర అ ధర్మక్రియ సమర్థింపబడినది?
19 మరియు బానిసత్వముతో కూడిన ఈ కౄరమైన సంస్థలో ఈ మతాధికారులు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించిరి. క్రైస్తవ సామ్రాజ్యముయొక్క రాజ్యములు అనేక వేల ఆఫ్రికన్‌లను బలవంతముగా ఎత్తుకుపోయి, తమప్రాంతములకు దూరముగానుంచి, అనేక శతాబ్దముల తరబడి వారిని బానిసలుగా చేసి భౌతికముగా మరియు మానసికముగా చిత్రహింసలు పెట్టిరి. ఎవరో కొద్దిమంది మతాధికారులు వ్యతిరేకించిరి. వారిలో కొంతమంది అది దేవుని చిత్తమని కూడ వాదించిరి.—మత్తయి 7:12 చూడుము.
20వ శతాబ్దములోని రక్తపరాధము
20. ఈ శతాబ్దములో ఈ ధర్మవిరోధియొక్క రక్తపరాధము ఎట్లు ఉన్నత స్థాయికి చేరినది?
20 ఈ ధర్మవిరోధియొక్క రక్తపరాధము మన శతాబ్దములో శిఖరాగ్రము చేరినది. అనేక లక్షలాది ప్రాణములను తీసిన, చరిత్రలోకెల్ల అతినీచమైన యుద్ధములకు అండ నిలిచిరి. రెండు ప్రపంచయుద్ధములలోను వారు ఇరువైపుల వారికి మద్దతునిచ్చి, ఆ యుద్ధములలోని ఒకే మతమునకు చెందిన “సహోదరులను” ఒకరినొకరు చంపుకొనునట్లు చేసిరి. ఉదా. రెండవ ప్రపంచ యుద్ధములో, ఫ్రెంచ్ మరియు అమెరికన్ కేథలిక్స్, జర్మని మరియు ఇటలి కేథలిక్‌లను చంపిరి: బ్రిటీష్ మరియు అమెరికా ప్రొటెస్టెంట్‌లు జర్మని ప్రొటెస్టెంటులను చంపిరి. కొన్నిసార్లు వారు తమ స్వంతమతములోని వారిని మాత్రమేగాక తమ జాతీయతకే చెందినవారిని చంపిరి. ఈ రెండు ప్రపంచయుద్ధములు క్రైస్తవసామ్రాజ్యము యొక్క హృదయంలో ఉద్భవించినవి, మరియు ఆ మతాధికారులు ప్రేమించుమను ఆజ్ఞను పాటించి, తమ ననుసరించువారికి కూడా దానినే బోధించియున్నట్లయితే ఆ యుద్ధములు జరిగియుండెడివి కావు.
21. యుద్ధములో మతాధికారుల హస్తమునుగూర్చి లోకములోని ఆధారములు ఏమిచూపుచున్నవి?
21 దిన్యూయార్క్ టైమ్స్ ఇట్లు నొక్కిచెప్పినది: “సైన్యములను ఆశీర్వదించుట, విజయముకొరకు వారికై ప్రార్థించుటవంటి ప్రవర్తనచే, గతకాల స్థానిక కాథలిక్ పరిపాలకులు లేక అధికారులు తమ దేశ యుద్ధములకు మద్దతునిచ్చిరి. మరియు అదేసమయములో వేరొకవైపున్న గుంపుయొక్క బిషప్‌లు వారి శత్రువులకు నష్టము కలుగవలెనని బహిరంగముగా ప్రార్థించిరి.. ఆయుధములు అతి కౄరముగా పెరిగిపోవుటను బట్టి, యుద్ధములను తలపెట్టుట, మరియు క్రైస్తవ ఆత్మ మధ్య పరస్పర విరుద్ధత స్పష్టముగా తెలియుచున్నది.” మరియు యు.యస్. న్యూస్ వర్ల్‌డ్ రిపోర్టు ఇట్లు వ్యాఖ్యానించినది: “క్రైస్తవ దేశములు అని పిలువబడు దేశములు కొనసాగించుచున్న దౌర్జన్యములను బట్టి క్రైస్తవత్వముయొక్క ఖ్యాతి అతి నీచముగా క్షీణించిపోయినది.”
22. మనకాలములో మరి ఏ ఇతరవాటికి ఈ మతాధికారులు బాధ్యులైయుండిరి?
22 ఈనాడు అధికారపరంగా ఇన్‌క్విజిషన్ లేకపోయినను, తమతో ఏకీభవించని “ప్రవక్తలను” మరియు “పరిశుద్ధులను” హింసించుటకు ప్రభుత్వమును ఉపయోగించుచున్నది. ‘చట్టముయొక్క ముసుగులతో హాని కలిగించునట్లు కుట్రచేయుటకు’ రాజకీయ నాయకులను ఒత్తిడిచేసిరి. ఈ విధముగా వారు మన శతాబ్దములోని దేవునికి భయపడు ప్రజలపై నిషేదాజ్ఞలనుంచుట, వారిని చెరసాలలోవేయుట, కొట్టుట, హింసించుట మరియు తుదకు చంపుటను అంగీకరించిరి లేక వాటికి కారణములైరి.—ప్రకటన 17:6; కీర్తనలు 94:20, ది న్యూఇంగ్లీషు బైబిల్.
లెక్క అప్పజెప్పుట
23. ఈ ధర్మవిరోధి నుండి దేవుడు ఎందుకు లెక్క అప్పజెప్పుకొనును?
23 నిజముగా, అబద్ధమతములో ప్రవక్తలయొక్క పరిశుద్ధులయొక్క మరియు ఈ భూమిమీద సంహరింపబడిన వారి యొక్క రక్తము కనబడుచున్నది. (ప్రకటన 18:24) క్రైస్తవ సామ్రాజ్యములో అత్యధికమైన రక్తమును చిందించుట సంభవించినది గనుక ఆ మతాధికారుల అపరాధము మిక్కిలి ఎక్కువైనది. బైబిల్ ఎంతఖచ్చితముగా వారికి “ధర్మవిరోధి” అనిపేరు పెట్టినది! అయితే దేవుని వాక్యము ఇట్లు చెప్పినది: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు” మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” (గలతీయులకు 6:7) కనుక ధర్మవిరోధియైన మతాధికారులనుండి దేవుడు లెక్కఅప్పజెప్పుకొనును.
24. లోకమును కదలించు ఏ సంఘటనలు సమీపములో సంభవించును?
24 యేసు ఇట్లు చెప్పెను: “అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.” (మత్తయి 7:23) మరియు ఆయన “మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును” అని తెలిపెను. (మత్తయి 7:19) వేశ్యతో సాంగత్యము చేసిన రాజకీయశక్తులు వారిపై తిరుగబడినపుడు, అబద్ధమతములన్నిటితో ఈ ధర్మవిరోధిని నాశనముచేయు భయంకరమైన అంతముయొక్క సమయము శీఘ్రముగా సమీపించుచున్నది. వారు తిరుగబడుట ఇట్లున్నది: “వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను, దిగంబరిగానుచేసి, దానిమాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” (ప్రకటన 17:16) లోకమును కదలించు అట్టి సంఘటనలు త్వరలో సంభవించును గనుక దేవుని సేవకులు వీటిని ఇతరులకు తెలియజేయవలెను. వారు దీనిని ఎట్లు చేయుచున్నారో తదుపరి ఆర్టికల్ వివరించును. (w90 2⁄1)
పునరీక్షణ కెరకైన ప్రశ్నలు
◻ ఈ ధర్మవిరోధి ఎవరు మరియు ఎట్లు వృద్ధిచెందెను?
◻ నిజమైన క్రైస్తవులు ఏ మంచి ఫలములను ఫలింపవలెను?
◻ మహాబబులోను ఎవరు మరియు అది ఎంతటి రక్తాపరాధియైయున్నది?
◻ ఈ ధర్మవిరోధి దేవుని అవమానపరచు ఏ రికార్డును సృష్టించెను?
◻ ఈ ధర్మ విరోధినుండి దేవుడు ఎట్లు లెక్క అప్పజెప్పుకొనును?
[20వ పేజీలోని చిత్రాలు]
క్రూసేడులు దేవుడు మరియు క్రీస్తు పేరున ఘోరమైన రక్తపాతమునకు దారితీసినవి
[21వ పేజీలోని చిత్రాలు]
“స్థానిక కాథలిక్ పరిపాలనలు ఎల్లప్పుడు వారిదేశముల యుద్ధములను బలపరచినవి”