మీ మతం ఎన్నడూ విడిచిపెట్టకూడని ఓడనా?
ఒక ఓడ తుపానులో చిక్కుకుంది. తమ ఓడను కాపాడుకోడానికి తీవ్రంగా పోరాడుతున్న నావికగణం, ఓడలో ఉండాలా లేక ఓడను విడిచిపెట్టి తమను తాము కాపాడుకోవాలా అనే ఒక ఆకస్మికమైన నిర్ణయాన్ని ఎదుర్కున్నారు. భయం గొల్పే ఈ దృశ్యం ఒక ఆధ్యాత్మిక ఉపమానంగా ఉపయోగించబడుతుందని మీకు తెలుసా?
వేదాంతులు, ప్రాముఖ్యంగా కాథోలిక్ పండితులు తరచూ తమ చర్చీని తుపానుకు ఊగుతున్న ఒక ఓడకు పోలుస్తారు. యేసు లేక పేతురు సరంగులుగా ఈ ఓడ మాత్రమే రక్షణకు మూలంగా ప్రాతినిధ్యం వహిస్తుందని వారంటారు. మతనాయకుల స్థానం ఇలా ఉంది: ‘ఎన్నడూ ఓడను విడిచిపెట్టకండి. చర్చీ మునుపు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది, కాని అది చరిత్రలోని తుపానులన్నిటినీ తట్టుకొన్న ఓడ.’ కొందరిలా అంటారు: ‘దానిని ఎందుకు విడిచిపెట్టడం? ఏ ప్రత్యామ్నాయాలున్నాయి? దానిలోనే ఉండి, దానిని నిశ్చలమైన నీటిలోకి నడపడానికి ఎందుకు సహాయం చేయకూడదు?’
ఈ లాక్షిణిక భాషా శైలికి అనుగుణ్యంగా, అన్ని విధాలైన మతాలకు చెందిన అనేకమంది ప్రజలు ఇలా తర్కిస్తారు, ‘నా మతం అనేక విషయాల్లో తప్పు అని నాకు తెలుసు, కాని అది మారుతుందని నేను నిరీక్షిస్తాను. దాన్ని విడిచిపెట్టడం నాకిష్టం లేదు. తన కష్టాలను ఎదుర్కోవడానికి దానికి సహాయం చేయడంలో నేను భాగం వహించాలని ఇష్టపడుతున్నాను.’ ఈ విధమైన తర్కానికి తమ పూర్వీకుల మతం యెడల గల యథార్థమైన అనురాగం లేక దానికి “నమ్మకద్రోహం” చేస్తున్నామన్న భయం కారణం కావచ్చు.
ప్రఖ్యాత కాథోలిక్ అసమ్మతివాద వేదాంతవేత్తయైన హాన్స్ కూంగ్ ఒక చక్కని ఉదాహరణ, ఆయనిలా ఆశ్చర్యపోయాడు: “గాలిని ఎదుర్కోడానికి, నీటిని తీసివేయడానికి బహుశా తప్పింపబడేందుకు పోరాడడానికి, నేను ఇంతవరకు కలిసి పయనించిన వారిని వదిలేసి, తుపాను సమయంలో నేను పడవను విడిచిపెట్టి వెళ్లాలా?” ఆయనిలా జవాబిచ్చాడు: “నేను చర్చి నందు ప్రభావవంతంగా పనిచేయడాన్ని విడిచిపెట్టను. దాని ద్రోహాన్ని బట్టి, ఉన్నత విలువల యెడల ప్రేమ వలన, బహుశా మరింత నిష్ఠగల క్రైస్తవులగుట కొరకు ఈ చర్చితో తెగతెంపులు చేసుకోవడమే” మరొక ప్రత్యామ్నాయం కాగలదు.—డై హఫానన్ బెవారెన్.
అయినా, దేవుడు తన దయను బట్టి, అన్ని మతాలు సంస్కరించబడడానికి అపరిమితమైన సమయాన్ని అనుమతిస్తాడనే నిరీక్షణతో ఒక వ్యక్తి తన స్వంత చర్చి అనే పడవలోనే ఉండిపోవచ్చా? అది ఒక గంభీరమైన ప్రశ్న. ఉపమానం ద్వారా సూచించబడినట్లుగా, ప్రమాదంలో వున్న ఓడను హడావుడిగా విడిచిపెట్టి, అసురక్షితమైన ప్రాణరక్షిత పడవలలోనికి మారడం, మునిగిపోతున్న ఓడలోనే ఉండిపోవడమంత ప్రమాదకరం కాగలదు. చర్చి పరిస్థితి ఎలా ఉన్నా, ఎంత కష్టమైనా దానిలోనే వుండిపోవడం జ్ఞానయుక్తమేనా? మతాలు నేడు ఏ సంస్కరణా సాధ్యతలను అందజేస్తున్నాయి? తన చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయడానికి దేవుడు వాటికి ఎంతకాలం అనుమతిస్తాడు?
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Chesnot/Sipa Press