కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 7/15 పేజీలు 2-4
  • లోకాన్ని భయం ఆవరిస్తోంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోకాన్ని భయం ఆవరిస్తోంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • న్యూక్లియర్‌ భయాలు యింకా ఉన్నాయి
  • దౌర్జన్యం భయాన్ని పెంపొందిస్తుంది
  • ఎయిడ్స్‌ సోకుతుందనే భయం
  • అణు భయం చివరికి అంతరించిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఎయిడ్స్‌—పిల్లల విషాదాంత మరణాలు
    తేజరిల్లు!—1992
  • శాశ్వత శాంతిని ఎవరు తీసుకురాగలరు?
    తేజరిల్లు!—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 7/15 పేజీలు 2-4

లోకాన్ని భయం ఆవరిస్తోంది

ఉగ్రవాదులు, పార్కు చేయబడిన కారులో బాంబు పెట్టి జరిపిన ప్రేలుడు, ఫిబ్రవరి 26, 1993న, న్యూయార్క్‌ పట్టణంలోని ప్రపంచ వ్యాపార కేంద్రమైన 110 అంతస్తుల భవనాన్ని కుదిపేసింది. వేలకొలది ఉద్యోగులు లిఫ్ట్‌లలో యిరుక్కుపోయారు లేక పొగతో నిండిపోయిన మెట్లు దిగి పారిపోవలసి వచ్చింది. ఈ దౌర్జన్యపూరిత లోకంలో యిప్పుడు ప్రబలివున్న భయాన్ని వారు అనుభవించారు.

అనేక దేశాల్లోన్ని ప్రజలు బాంబులవల్ల భయబ్రాంతులయ్యారు, ఐర్లాండ్‌, లెబనాన్‌ వంటి దేశాల్లో అవి సర్వసాధారణమయ్యాయి. అంతెందుకు, మార్చి 12, 1993న ఇండియాలోని బొంబాయిలో కేవలం ఒకేఒక రోజున సంభవించిన 13 బాంబు ప్రేలుళ్లలో 200 మంది ప్రజలు దారుణంగా చంపబడ్డారు! ఒక పరిశీలకుడు యిలా చెప్పాడు: “బొంబాయి అంతటిలో భయం నెలకొన్నది.” న్యూస్‌వీక్‌ పత్రిక ప్రకారం, కారు బాంబులు “సర్వసాధారణమవ్వడం భయాన్ని ఇంకా అధికం చేస్తుంది.”

న్యూక్లియర్‌ భయాలు యింకా ఉన్నాయి

న్యూక్లియర్‌ రియాక్టర్లు బాంబు దాడులకు గురికాగలవనే భయం ఉంది. అణ్వస్త్ర ఉత్పాదక కేంద్రంపై విజయవంతంగా దాడి చేయ గల్గితే అది లెక్కించ లేనంత నష్టాన్ని, కష్టాన్ని కల్గించగలదు. అమెరికాలోని త్రీ మైల్‌ ఐలండ్‌ నందలి అణ్వస్త్ర ఉత్పాదక కేంద్రంలో భద్రతా ద్వారంగుండా ఒక వ్యక్తి కారులో బయటకు దూసుకుపోడానికి ప్రయత్నించడమే ఈ భయానికి నిదర్శనంగా ఉంది.

ఉగ్రవాదులు, అధికార దాహంగల పరిపాలకులు అణ్వస్త్ర ఆయుధాలను చేజిక్కించుకుంటారేమోనని అనేకులు భయపడుతున్నారు. మునుపటి సోవియట్‌ యూనియన్‌లోని నిరుద్యోగులైన వేలకొలది అణ్వస్త్ర వైజ్ఞానికులు తమ నైపుణ్యాలను అమ్ముకోడానికి ప్రయత్నిస్తారేమోనని కొందరు భయపడుతున్నారు. అంతేకాకుండా, స్టార్ట్‌ సంధి ప్రకారము ముఖ్యమైన అణు ఆయుధాలన్నిటిని నిర్మూలము చేయవలసివున్నను, దానిని అమలుపర్చడం 1999 వరకు లేక ఆ తర్వాతి వరకు పూర్తికాదు. ఈలోగా, పర్వతాన్ని కమ్ముకొనిన భయంకరమైన తుఫాను మేఘంవలె, ఏ ఉన్మాద ప్రేరణ మూలంగానైనా ఈ ఆయుధాలను ఉపయోగించే సాధ్యత ఉండవచ్చు.

దౌర్జన్యం భయాన్ని పెంపొందిస్తుంది

హింసాత్మక దౌర్జన్యం విస్తృతంగా పెరగడం, ప్రజలను తమ యిళ్లల్లో వీధుల్లో భయబ్రాంతులను చేస్తుంది. ఇంచుమించు 23,200 మంది అమెరికా వాస్తవ్యులు 1990లో హత్యగావించబడ్డట్లు అంచనా వేయబడింది. ఉదాహరణకు, చికాగో పట్టణంలో, పెరుగుతున్న క్రాక్‌ కొకేన్‌ వాడకం ఒక్క సంవత్సరంలోనే 700 హత్యలకు కారణమైంది. కొన్ని పట్టణాల్లోని ప్రత్యేకమైన ప్రాంతాలు, యిరు పక్షాల కాల్పుల్లో పిల్లలతోసహా దారినపోయేవాళ్లను చంపే యుద్ధస్థలాలుగా మారిపోయాయి. ఒక పత్రిక యిలా అంటోంది: “మధ్య తరహా పట్టణాల్లో దౌర్జన్యం ఎంతో వేగంగా పెరుగుతోంది. . . . [అమెరికాలోని] సమాజాలు మాదక ద్రవ్యాలు, యౌవన దుర్మార్గులతో నిండిపోతున్నప్పుడు, వీటికి ప్రభావితులు కాకుండా ఎవ్వరూ ఉండలేరు. ప్రతి సంవత్సరమూ అమెరికాలోని ప్రతి నాలుగు యిళ్లల్లో ఒకటి హింసాత్మక దౌర్జన్యాన్నో లేక దొంగతనాన్నో అనుభవిస్తుంది.”—యు.ఎస్‌.న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌, అక్టోబరు 7, 1991.

అత్యాచారం గావించబడతామనే భయం స్త్రీలు భీతి నొందేలా చేస్తుంది. ఫ్రాన్స్‌లో, నివేదించబడిన అత్యాచారాలు 1985 నుండి 1990 వరకు 62 శాతం పెరిగాయి. కెనడాలో, రెండు సంవత్సరాల్లోనే లైంగిక అత్యాచారాలు 27,000లకు పెరిగి రెండింతలయ్యాయి. జర్మనీలోనైతే, ప్రతి ఏడు నిమిషాలకు ఒక మహిళపై లైంగిక దౌర్జన్యం జరుగుతుందని నమోదు చేయబడింది.

పిల్లలు కూడా తమ భద్రత విషయమై భయపడుతున్నారు. అమెరికాలో, “నాలుగు ఐదు తరగతుల్లో చదివే పిల్లలు కూడా ఆయుధాలను ధరిస్తున్నారు, దానితో టీచర్లు, పాఠశాల అధికారులు, భయపడుతున్నారు,” అని న్యూస్‌వీక్‌ నివేదించింది. పరిస్థితి ఎంత గంభీరంగా ఉందంటే, పెద్ద పట్టణ పాఠశాలల్లో నాలుగోభాగాన్ని మెటల్‌ డిటెక్ట్‌ర్ల కోసం ఉపయోగిస్తున్నాయి, అయినా మొండిగా ప్రవర్తించే యౌవనులు వాటిని తప్పించుకుని, తుపాకులను కిటీకీల్లోంచి ఇతరులకు జారేస్తున్నారు.

ఎయిడ్స్‌ సోకుతుందనే భయం

అనేకమంది ప్రజలు ఎయిడ్స్‌ సోకుతుందని భయపడుతున్నారు. కేవలం అమెరికాలోనే 230,000 కంటే ఎక్కువ మందికి ఈ వ్యాధి ఉంది. ఎయిడ్స్‌, 15 నుండి 24 సంవత్సరాలకు మధ్య ఉన్న వారి మరణానికి ఆరవ ముఖ్య కారణమైంది. “ఈ వ్యధ విస్తృతంగా పెరగటంలో భవిష్యత్తు మరింత భయావహంగా ఉండే అవకాశముందని,” న్యూస్‌వీక్‌ చెబుతోంది.

నాట్యం, నాటకం, సినిమాలు, సంగీతం, ఫ్యాషన్‌, దూరదర్శిని, చిత్రకళ, ఇంకా అలాంటి యితర రంగాల్లోని ప్రజల్లో ఎయిడ్స్‌ వల్ల వచ్చే మరణాల సంఖ్య తరచూ ఎక్కువగా ఉంటుంది. పారిస్‌, ఫ్రాన్స్‌లో ఉండే పత్రికా రచన, చిత్రకళ, వినోద వృత్తుల్లోని పురుషులు, 25 నుండి 44 సంవత్సరాల వయస్సులో చనిపోడానికి 60 శాతం కారణం ఎయిడ్స్‌ అని ఒక నివేదిక చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా, ఎనభై లక్షలనుండి కోటిమంది ప్రజలు హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యారని డబ్ల్యూహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నివేదించింది. డబ్ల్యూహెచ్‌ఓ యొక్క డైరెక్టరైన డా. మైకెల్‌ మెర్స్‌న్‌ యిలా అన్నారు: “భూవ్యాప్తంగా, ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ అతి వేగంగా వ్యాపిస్తోందని యిప్పుడు స్పష్టమైంది.”

నిజమే, పర్యావరణానికి సంబంధించినవి, మరితర భయాలు ఉన్నాయి. అయితే, ఇంతకు క్రితం చర్చించిన నివేదికలే ప్రపంచాన్ని భయం ఆవరించి ఉందని స్పష్టం చేస్తున్నాయి. దీన్ని గూర్చి ప్రత్యేకంగా గుర్తించదగిన విషయం ఏదైనా ఉందా? భయం నుండి విముక్తిని పొందగలమని మనం ఎన్నడైనా నిరీక్షించగలమా?

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Cover photos: Left: Tom Haley/Sipa Press; Bottom: Malanca/Sipa Press

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Bob Strong/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి