కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 5/1 పేజీలు 4-7
  • మీరెలా ఆరాధిస్తారన్నది ప్రాముఖ్యమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరెలా ఆరాధిస్తారన్నది ప్రాముఖ్యమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కేవలం ఏ మతమైనా దేవున్ని ప్రీతిపర్చగలదా?
  • ఆరాధన కొరకు సృష్టికర్త యొక్క నిర్ణీత ప్రమాణాలు
  • సహాయం అందుబాటులో ఉంది
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి ఏంటి?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 5/1 పేజీలు 4-7

మీరెలా ఆరాధిస్తారన్నది ప్రాముఖ్యమా?

చిన్న ఆఫ్రికా పట్టణం మిట్టమధ్యాహ్న ఎండలో ఉడికిపోతోంది. సమీపంలోవున్న లోయదగ్గరి నుండి డప్పుల ఉన్మత్త శబ్దాలు, పాటలు, సంతోషంగా కొడుతున్న చప్పట్ల శబ్దాలను వినవచ్చు. కాని అదొక సాంఘిక కార్యక్రమం కాదు. ఆఫ్రికా సాంప్రదాయబద్దమైన ఆరాధన. అయినా ఈ శబ్దాలు, దగ్గరలోవున్న అద్భుతశక్తిగల చర్చి నుండి వినిపిస్తున్న అపశ్రుతి శబ్దాలతో పోటీపడుతున్నాయి. అక్కడ పరవశించి పోతున్న ఆరాధికులు అద్భుతమైన “స్వస్థతలు” చేస్తారు, భాషల్లో మాట్లాడతారు. పట్టణం మరో చివరన మరో విధమైన ఆరాధన జరుగుతోంది: ఒక ముస్లిం మత గురువు యొక్క స్వరం తనతోటి ముస్లిం ఆరాధికులను ప్రార్థన కొరకు బిగ్గరగా పిలుస్తోంది.

అవును, అనేక ఆఫ్రికా నగరాలలో, పట్టణాలలో విభిన్న రకాల మత భక్తిని చూడవచ్చు. అనేక తరాలుగా ఆఫ్రికా దేశస్థులు తమ స్వంత మతసంబంధ సాంప్రదాయాలను అనుసరించడంలో సంతుష్టి కలిగివున్నారు. కాని తర్వాత, క్రైస్తవమత సామ్రాజ్య మిషనరీలు, వారితోపాటు ఐరోపా యొక్క వేరువేరు దేశాల నుండి సైనిక సంస్థలు వచ్చి, ప్రతి ఒక్కరిని, “క్రైస్తవులను” చేయాలని, చివరికి వారి పేర్లను కూడా క్రైస్తవ పేర్లుగా మార్చాలని నిర్దాక్షిణ్యంగా ప్రయత్నించారు.

ఫలితం? ఆఫ్రికా సాంప్రదాయబద్ధమైన నమ్మకాలను, ఆచారాలను విదేశీ మత విశ్వాసాలతో కలిపిన మిశ్రిత మతం తయారైంది. నేడు కూడా అనేకమంది “క్రైస్తవ” ఆరాధికులు సాంప్రదాయబద్ధమైన మంత్రాలను, తాయత్తులను ఉపయోగిస్తారు. ఇంకా, క్రైస్తవమత సామ్రాజ్య మిషనరీలు నిజ క్రైస్తవత్వాన్ని పూర్తిగా వక్రీకరించారు. వారు ప్రతీకారాన్ని వారసత్వంగా మిగిల్చారు. నేడు కొంతమంది ఆఫ్రికన్లలో బైబిలు యెడల ఏర్పడిన నిరాసక్త దృక్పథానికి చాలా వరకు వారే బాధ్యులు.

అయినప్పటికీ, అనేక రకాలైన “క్రైస్తవత్వాలు” ఇప్పటికీ విస్తృతంగా ఆచరించబడుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో అద్భుతశక్తిగల మత గుంపులు ప్రాముఖ్యంగా జనాదరణ పొందాయి; విశ్వాస-స్వస్థత చర్చీలు పెరిగిపోయాయి. ఒక వార్తాపత్రిక విలేఖరి ఇలా చెప్పడం ద్వారా ఈ చర్చీల విజ్ఞప్తిని వివరించాడు: ‘ఆఫ్రికా మత విధానం ఎక్కువగా ఉపయోగితావాదమైనది. ఆఫ్రికా దేశస్థుని మనస్సుకు, మతం మానవ ఉనికి కొరకు సూటియైన వస్తుదాయక సంతృప్తి నివ్వగలిగేదై ఉండాలి. అందుకే, ఆత్మీయ మాధ్యమాలు దాదాపు ప్రతిదానిలో అవసరమని విశ్వసించే ఒక ఆఫ్రికా దేశస్థునికి, ఆత్మీయ [లేక విశ్వాస-స్వస్థత] చర్చీల యొక్క కార్యపద్ధతి అతని జీవనవిధాన అవసరతలకు అనుగుణ్యంగానే ఉంది.’ దుఃఖకరంగా, అద్భుతశక్తిగల అనేక చర్చీలు వ్యాపార కేంద్రాల వలెనే స్థాపించబడ్డాయి.

నేడు, ఆఫ్రికాలో 6,000 మత శాఖలకంటే ఎక్కువే పనిచేస్తున్నాయి. ఈ మతాలు, శాఖలన్నీ రక్షణకు కీలకాన్ని కలిగివున్నాయని బహుశ మీరు భావించి యుండవచ్చు. కాని అసలు ప్రశ్నేమిటంటే, దేవుడు ఎలా భావిస్తాడు?

కేవలం ఏ మతమైనా దేవున్ని ప్రీతిపర్చగలదా?

నిజంగా, విశ్వ సృష్టికర్త ఈ విషయంలో మనకు ఏ మార్గం చూపించకుండా విడిచిపెట్టడు. (ఆమోసు 3:7; అపొస్తలుల కార్యములు 17:26, 27) బైబిలు నందు దైవిక నడిపింపును కనుగొనవచ్చుననే దానికి విస్తృతమైన సాక్ష్యాధారం ఉంది. కొంతమంది పిలిచేలా బైబిలు తెల్లవాని పుస్తకం కానేకాదు. వాస్తవానికి, తెల్లవాడైనా, నల్లవాడైనా ఏ మనిషీ దాన్ని తమ స్వంతమని చెప్పుకోవటానికి వీలు లేదు. “దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము” అని 2 తిమోతి 3:16 చెబుతుంది. బైబిలు యొక్క సత్యవంతమైన, సూటియైన బోధలు, దాని గొప్ప ప్రాచీనత, తీవ్ర వత్తిడులను అది ఎదుర్కొని నిలబడగలగటం, దాని కచ్చితమైన ప్రవచనాలు, సాటిలేని విశ్వవ్యాప్త చలామణి—ఇవన్నీ అది దేవుడు రచించినదనటానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు.

ఆ పుస్తకం మనకేమి బోధిస్తుంది? ఒక విషయమేమిటంటే, కేవలం ఒకే ఒక్క “సత్య దేవుడు” ఉన్నాడని అది మనకు చెబుతుంది. (యోహాను 17:3) విషయమదైనప్పుడు, అన్ని మతాల్లో సత్యమెలా ఉండగలదు? దేవుడెవరు, దేవుడంటే ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు అన్ని మత వర్గాల వారు ఒకరితో ఒకరు విభేదం కలిగివుండటం లేదా? బైబిలు రచయితయైన యాకోబు “స్వచ్ఛమైన, అసలైన మతం” గురించి చెప్పాడు. (యాకోబు 1:27, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌) అసలైన మతాన్ని గుర్తించాల్సిన అవసరత ఉన్నట్లైతే, అబద్ధమైన లేక కృత్రిమమైన మతం కూడా తప్పక ఉండి ఉండాలి. దేవున్ని చేరటానికి అన్ని మతాలు కేవలం వేరు వేరు మార్గాలనే ఆలోచనను ఇది వ్యతిరేకిస్తుంది.

ఆరాధన కొరకు సృష్టికర్త యొక్క నిర్ణీత ప్రమాణాలు

దేవున్ని ఆరాధించడంలో సరైన మార్గం ఏది? నిజమైన ఆరాధన కచ్చితమైన జ్ఞానంలో వేరుపారినదై ఉంటుందని బైబిలు మనకు బోధిస్తుంది. గొప్ప ప్రవక్తయైన యేసుక్రీస్తు ఒకసారి ఒక సమరయ స్త్రీతో ఇలా చెప్పాడు: “మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు.” (యోహాను 4:22) బహుశా ఇది మీ విషయంలో కూడా నిజమైయుందా? సర్వశక్తిగల దేవునికి యెహోవా అనే వ్యక్తిగతమైన పేరు ఉందని మీకు నేర్పబడిందా? (కీర్తన 83:18) మానవునికి, భూమికి సంబంధించి ఆయన ఏ సంకల్పాలు కలిగివున్నాడో మీకు తెలుసా? (మత్తయి 6:9, 10; ఎఫెసీయులు 1:9, 10; 3:11) మీ మతం మీకు మంచి భవిష్యత్తును గూర్చి ఒక నిజమైన నిరీక్షణ నిస్తుందా? మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా భావించుకుంటే, మీరు మీ నమ్మకాలను లేఖనాల నుండి వివరించగలరా, లేక అది కేవలం మీరు దానిని వేరొకరి నుండి వారసత్వంగా పొంది పరీక్షించడానికి ఎక్కువగా శ్రద్ధ తీసుకోనిదై ఉందా?

కచ్చితమైన జ్ఞానం మీలో కొరవడినట్లు మీరు భావిస్తే, దేవుని వాక్యమైన బైబిలును పఠించడం ద్వారా మీరు దాన్ని పొందవచ్చు. ఆ పరిశుద్ధ పుస్తకం బోధిస్తున్న దానితో ఆయన నిజమైన ఆరాధికులు బాగా పరిచయం కలిగివుండాలని యెహోవా దేవుడు కోరుతున్నాడు. అంతకంటే ఎక్కువగా, వాటిని వారు తమ జీవితాల్లో అన్వయించుకోవాలని ఆయన కోరుతున్నాడు. మన దృక్పథం “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది” అని చెప్పిన కీర్తనల రచయిత దృక్పథం వలె ఉండాలి. (కీర్తన 119:105) బైబిలును తెలుసుకోవటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి మీ మతం మీకు ఎంతమేరకు సహాయం చేసింది?

సత్యారాధనయొక్క మరో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు నందు కేవలం గొప్ప ప్రవక్తగానే కాక దేవుని అద్వితీయ కుమారునిగా కూడా ఆయన యందు విశ్వాసముంచడం. లేఖనాలు స్పష్టంగా యేసు “జీవాధిపతి” అని తెలియజేస్తున్నాయి. (అపొస్తలుల కార్యములు 3:15; 4:12) అనేకమంది యేసునందు విశ్వాసముందని చెప్పుకొంటున్నారు, కాని వారి విశ్వాసం ఎంత వాస్తవమైంది? క్రీస్తుయందలి నిజమైన విశ్వాసం ఆయన ఉపదేశాల్ని పాటించేదైవుండాలి. “ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని” చెప్పినప్పుడు దేవుడు తానే దీన్ని ప్రోత్సహించాడు. (మార్కు 9:7) నిజమైన ఆరాధికులు సాధ్యమైనంత సన్నిహితంగా యేసు అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నిస్తారు. (1 పేతురు 2:21) వారు అలా చేసే ఒక మార్గమేమిటంటే, ఆయన ప్రారంభించిన బహిరంగ ప్రకటన పనిలో పాల్గొనడం. (మత్తయి 4:17; 10:5-7) ఈ పనిలో వ్యక్తిగతమైన భాగం కలిగివుండమని మీ మతం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందా?

ప్రేమ కూడా సత్యారాధన యొక్క మరో అవసరత. యెహోవా దేవుడు ప్రేమాస్వరూపి అని వర్ణించబడ్డాడు, తమలో తాము చూపించుకొనే ప్రేమను బట్టి తన అనుచరులు గుర్తించబడతారని యేసు చెప్పాడు. (యోహాను 13:34, 35; 1 యోహాను 4:8) నేడు తమను తాము క్రైస్తవులమని చెప్పుకొంటున్న లక్షలాది మందిని బట్టి, ప్రపంచం ప్రేమతో నిండిపోవద్దా? వాస్తవానికి, మన ప్రపంచం అస్సలు ప్రేమలేని స్థలంగా నిరూపించబడింది. కేవలం ఈ శతాబ్దంలోనే యుద్ధాలు లక్షలాదిమంది జీవితాలను నిర్మూలించాయి. నేరము, దౌర్జన్యం పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘ప్రతి ఒక్కరు నా మతానికి చెందిన వారైతే, ప్రపంచం మరెంతో ప్రేమపూర్వకమైన స్థలమైయుండేదా?’

చివరికి, దేవున్ని ఎరుగని లోకం నుండి సత్యారాధికులు తమను తాము వేరుగా ఉంచుకోవాలని బైబిలు చూపిస్తుంది. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు వేరుచేసి, స్వచ్ఛారాధనకు సంరక్షకులుగా ఉంచినప్పుడు, వారి చుట్టూవున్న దిగజారిపోయిన జనాంగాలతో సన్నిహిత సహవాసం కలిగివుండకూడదని దేవుడు తన ప్రజలను హెచ్చరించాడు. (ద్వితీయోపదేశకాండము 7:1-6) అలాగే యోహాను 17:16 నందు, క్రీస్తుయేసు తన అనుచరులను గూర్చి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” దేవుని సత్యారాధికులు రాజకీయాలు, అవినీతి, అత్యాశతో కూడిన వాణిజ్యం, లేక దేవున్ని అగౌరవపరిచే సిద్ధాంతాలతో భాగం కలిగివుండరు. (యోహాను 18:36; 1 యోహాను 2:15-17) “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి” అని రోమీయులు 12:2 నందు వ్రాయబడియున్న ఆజ్ఞను వారు పాటిస్తారు. మీ మతం మిమ్మల్ని అలాగే చేయమని ప్రోత్సహిస్తుందా?

సహాయం అందుబాటులో ఉంది

అవును, మీరెలా ఆరాధిస్తారన్నది నిజంగా దేవునికి ప్రాముఖ్యమే. ఆయనకు సంబంధించి నంత వరకు కేవలం ఒకే నిజమైన మతం ఉంది. (ఎఫెసీయులు 4:4-6) మన స్వల్ప చర్చ కేవలం బైబిలు బోధ యొక్క కొన్ని కీలక విషయాలను స్పర్శించింది. ఇంకా ఎక్కువ నేర్చుకోవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు?

మీరు ఏ మతంలో పెంచబడినప్పటికీ, యెహోవాసాక్షులు ఈ విషయంలో మీకు సహాయం చేయగలరు. వారు తమ విస్తృత బైబిలు విద్యాపని గురించి విశ్వవ్యాప్తంగా పేరుపొందారు. అన్ని వర్గాల, అన్ని మతసంబంధ పూర్వాపరాలు గల ప్రజలు బైబిలును లోతుగా అర్థంచేసుకొనేలా సహాయం చేయడాన్ని వారు తమ బాధ్యతగా భావిస్తారు. (సామెతలు 2:1-6) బాగా పరిశోధించి వ్రాయబడిన బైబిలు సాహిత్యాన్ని వారు ప్రచురిస్తారు.a వాస్తవానికి, మీకు వ్యక్తిగతంగా బైబిలును బోధించటానికి వారు ఉచితంగా మీ ఇంటికి కూడా వస్తారు. ఈ బైబిలు విద్యా కార్యక్రమం నుండి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఇప్పుడు ప్రయోజనం పొందుతున్నారు. మీరు కూడా అలాగే ఎందుకు చేయకూడదు? మీరు ఎలా ఆరాధిస్తారనేది నిజంగా ప్రాముఖ్యమైంది గనుక వాస్తవానికి మీరలా చేయడం అత్యవసరము.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ న్యూయార్క్‌ 1990లో ప్రచురించిన మ్యాన్‌కైండ్స్‌ సర్చ్‌ ఫర్‌ గాడ్‌ అనే ప్రచురణ అలాంటివాటిలో ఒకటి. ప్రపంచ ప్రముఖ మతాలను గూర్చిన దాని జ్ఞానయుక్తమైన, పాండిత్యంతో కూడిన చర్చను అనేకమంది ప్రజలు మెచ్చుకొన్నారు.

[5వ పేజీలోని చిత్రం]

క్రైస్తవమత సామ్రాజ్య మిషనరీలు నిజ క్రైస్తవత్వాన్ని పూర్తిగా వక్రీకరించారు

[5వ పేజీలోని చిత్రం]

అనేక అద్భుతశక్తిగల చర్చీలు డబ్బు చేసుకొనే వ్యాపార కేంద్రాలు

[6వ పేజీలోని చిత్రం]

యేసునందు విశ్వాసం సత్యారాధన యొక్క ప్రాముఖ్యమైన భాగము

[7వ పేజీలోని చిత్రం]

ఉచిత గృహ బైబిలు పఠనాల ద్వారా కచ్చితమైన జ్ఞానాన్ని పొందటానికి యెహోవాసాక్షులు లక్షలాదిమందికి సహాయం చేస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి