కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 12/15 పేజీలు 16-21
  • దైవిక భయాన్ని వృద్ధిపరచుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక భయాన్ని వృద్ధిపరచుకొనుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను ఘనపరచుట
  • ప్రేమపూర్వక గద్దింపులు
  • మహాగొప్ప సంతోషము
  • నిజమైన జ్ఞానాన్ని పెంపొందించుకొనుట
  • మంచి చేయడం పట్ల ప్రేమ
  • చెడును అసహ్యించుకోండి!
  • యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • జ్ఞానమును సంపాదించుకోండి, క్రమశిక్షణను అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • సామెతల గ్రంథములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 12/15 పేజీలు 16-21

దైవిక భయాన్ని వృద్ధిపరచుకొనుట

“యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనమును విడిచి పెట్టుము.”—సామెతలు 3:7.

1. సామెతలు ఎవరి కొరకు వ్రాయబడ్డాయి?

బైబిలు పుస్తకమైన సామెతలు ఆత్మీయ సలహాల అపార సంపదను కలిగి ఉంది. నడిపింపునిచ్చే ఈ పుస్తకాన్ని యెహోవా మొదట్లో సాదృశ్యమైన తన ఇశ్రాయేలు జనాంగమునకు బోధించడానికి ఇచ్చాడు. ఈనాడు, అది “యుగాంతమందున్న” తన పరిశుద్ధ క్రైస్తవ జనాంగానికి జ్ఞానవంతమైన మాటలను అందిస్తుంది.—1 కొరింథీయులు 10:11; సామెతలు 1:1-5; 1 పేతురు 2:9.

2. సామెతలు 3:7లోని హెచ్చరిక ఈనాడు ఎందుకు సమయోచితంగా ఉంది?

2 సామెతలు 3:7లో మనం ఇలా చదువుతాము: “నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము.” “మంచి చెడ్డలను ఎరిగినవారై” ఉంటారు అనే వాగ్దానంతో సాతాను హవ్వను మోసగించినప్పటినుండి అనగా, మన మొదటి తలిదండ్రుల కాలంనుండి, మానవుని జ్ఞానము మానవజాతి అవసరతలను తీర్చలేకపోయింది. (ఆదికాండము 3:4, 5; 1 కొరింథీయులు 3:19, 20) చరిత్రలో మరి ఏ ఇతర కాలంకంటే ఈ 20వ శతాబ్దంలోనే అనగా ఈ “అంత్య దినములలో” నాస్తికత్వం, పరిణామ సిద్ధాంత ఆలోచనల ఫలాలను కోస్తున్న మానవజాతి, జాతివైషమ్యం, బలాత్కారము, మరియు ప్రతి విధమైన లైంగికతతో మరి ఎక్కువగా పీడించబడుతున్నది. (2 తిమోతి 3:1-5, 13; 2 పేతురు 3:3, 4) ఈ ‘నూతన లోక అవ్యవస్థను’ ఐక్యరాజ్య సమితి లేక ప్రపంచ విచ్ఛిన్న మతాలు ఏవి కూడా సరిచేయలేవు.

3. మన కాలంలో ఎట్టి పరిణామాలు సంభవిస్తాయని ప్రవచింపబడ్డాయి?

3 దయ్యముల సమూహాలు “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని . . . హెబ్రీభాషలో హార్‌ మెగిద్దోనను, చోటుకు వారిని పోగు” చేయడానికి బయల్దేరాయని దేవుని ప్రవచనార్థక వాక్యం మనకు తెలియజేస్తుంది. (ప్రకటన 16:14, 15) ఆ రాజులను, లేక పరిపాలకులను యెహోవానుండి వచ్చే భయము త్వరలోనే కమ్ముకుంటుంది. యెహోషువ మరియు ఇశ్రాయేలీయులు తమపై తీర్పును అమలుపర్చడానికి వచ్చినప్పుడు కనానీయులకు కలిగినటువంటి భయములా అది ఉంటుంది. (యెహోషువ 2:9-11) కానీ ఈనాడు యెహోషువాచే సూచింపబడిన—“రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయిన యేసుక్రీస్తు “సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను” వ్యక్తపరుస్తూ ‘ఆయన జనములను కొట్టును, యినుపదండముతో వారిని ఏలును.’—ప్రకటన 19:15, 16.

4, 5. రక్షణను ఎవరు పొందుతారు, ఎందుకు?

4 ఆ సమయంలో ఎవరు రక్షణ పొందుతారు? రక్షింపబడే వారు భీతిచెందిన వారు కాదు గానీ, యెహోవాయందు భక్తిపూర్వక భయాన్ని పెంపొందించుకున్న వారై ఉంటారు. నేను జ్ఞానిని కదాయని అనుకొనే బదులు, వారు “చెడుతనము విడిచి” పెడ్తారు. చెడుతలంపులకు అసలు తావులేకుండా ఉండేలా, వారు దీనత్వంతో, తమ మనస్సులను మంచి విషయాలతో నింపుకుంటారు. భ్రష్టులైన సొదొమీయులను సర్వనాశనం చేసినట్లు, చెడుతనానికి హత్తుకుపోయే వాళ్లందరిపై తీర్పు తీర్చబోతున్న, “సర్వలోకమునకు తీర్పు తీర్చు వాడు”ను, సర్వాధికారియైన ప్రభువగు యెహోవాపట్ల, హృదయపూర్వక గౌరవాన్ని కలిగి ఉండటానికి వారు ఇష్టపడతారు. (ఆదికాండము 18:25) నిజానికి, దేవుని స్వంత ప్రజలకు, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట. అది మరణపాశములలోనుండి విడిపించును.”—సామెతలు 14:27.

5 దైవిక తీర్పు జరుగు ఈ కాలంలో, యెహోవాకు అయిష్టమైన కార్యములను ఎన్నడూ చేయక భయముతో ఆయనకు తమ్మును తాము పూర్తిగా అర్పించుకున్న వారు సామెతలు 3:8 నందు “[యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట] నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును” అని సూచనార్థకంగా చెప్పబడిన సత్యాన్ని గ్రహించగల్గుతారు.

యెహోవాను ఘనపరచుట

6. సామెతలు 3:9ని లక్ష్యపెట్టడానికి మనల్ని ఏది ప్రేరేపించాలి?

6 యెహోవాపట్ల మెప్పుతో కూడిన మన భయము, ఆయన పట్లగల అమిత ప్రేమతో కలిసి, సామెతలు 3:9ని లక్ష్యపెట్టడానికి మనల్ని ప్రేరేపించాలి: “నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.” మన అర్పణలతో యెహోవాను ఘనపర్చాలని మనము ఒత్తిడి చేయబడటం లేదు. అవి స్వచ్ఛందంగా ఉండాలని, ప్రాచీన ఇశ్రాయేలులో బలులకు సంబంధించి నిర్గమకాండము 35:29 నుండి ద్వితీయోపదేశకాండము 23:23 వరకు ఇంచుమించు 12 సార్లు చూపబడింది. ఆయన నుండి మనం అనుభవించిన మంచితనము మరియు ప్రేమపూర్వక దయను గుర్తిస్తూ, యెహోవాకు ఇచ్చే ప్రధమ ఫలాలు, మనము ఇవ్వగల అతి శ్రేష్ఠమైన బహుమానాలై ఉండాలి. (కీర్తన 23:6) “ఆయన రాజ్యమును నీతిని మొదట” వెదకాలి అనే మన నిశ్చయాన్ని అవి ప్రతిబింబించాలి. (మత్తయి 6:33) యెహోవాను మన ఆస్తితో ఘనపర్చడం ద్వారా ఏమి ప్రతిఫలం ఉంటుంది? “అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.”—సామెతలు 3:10.

7. మనము యెహోవాకు ఏ ప్రథమ ఫలాలను అందించాలి, దాని ఫలితమేమి?

7 యెహోవా మనల్ని ప్రాథమికంగా ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. (మలాకీ 3:10) కావున, మనం ఆయనకు ఇచ్చే ప్రథమ ఫలాలు కూడా ప్రాథమికంగా ఆత్మీయమైనవై యుండాలి. ఆయన చిత్తాన్ని చేయడానికి మనము మన సమయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించాలి. అటువంటి పని తనకు బలాన్నిచ్చే “ఆహార”ముగా యేసుకు ఉండినట్లే, మనల్ని కూడా ఆ పని పోషిస్తుంది. (యోహాను 4:34) మన ఆత్మీయ కొట్లు నింపబడతాయి, మరి క్రొత్త ద్రాక్షారసంతో పోల్చబడిన మన సంతోషము, పొరలి పారుతుంది. దానికి తోడు, మనము మన అనుదిన ఆహారం కొరకు నమ్మకంతో ప్రార్థిస్తూ, మనకున్న దానిలో నుండి మనము ప్రపంచవ్యాప్త రాజ్యపరిచర్య నిమిత్తం ఉదారంగా అనుకూలమైనంత ఇవ్వవచ్చు. (మత్తయి 6:11) మనము కలిగి ఉన్న సమస్తము, మన వస్తు సంపదతో సహా అన్నీ మన ప్రేమపూర్వక పరలోకపు తండ్రి వద్దనుండి వచ్చాయి. వాటిని మనము ఆయనను స్తుతించడానికి ఉపయోగిస్తున్న కొద్దీ ఆయన ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు.—సామెతలు 11:4; 1 కొరింథీయులు 4:7.

ప్రేమపూర్వక గద్దింపులు

8, 9. గద్దింపును మరియు ఉపదేశాన్ని మనమెలా దృష్టించాలి?

8 సామెతలు 3వ అధ్యాయం 11, 12 వచనాలు, దైవిక కుటుంబాలలో, అలాగే యెహోవా మరియు భూమిపై ఆయన ప్రియమైన పిల్లల మధ్య ఉండే తండ్రీ కుమారుల సంతోషకరమైన సంబంధాన్ని గురించి మళ్లీ మాట్లాడుతోంది. మనమిలా చదువుతాము: “నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.” లోక ప్రజలు గద్దింపును అసహ్యించుకుంటారు. యెహోవా ప్రజలు దాన్ని ఆహ్వానించాలి. సామెతల నుండి ఈ పదాలను ఎత్తి వ్రాస్తూ, అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని . . . దండించును . . . ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.”—హెబ్రీయులు 12:5, 6, 11.

9 అవును, వాటిని మన తలిదండ్రుల ద్వారా పొందినా, క్రైస్తవ సంఘం ద్వారా పొందినా, లేక వ్యక్తిగత పఠనం చేస్తూ మనం లేఖనాలను ధ్యానించినప్పుడు వాటిని పొందినా, గద్దింపు మరియు ఉపదేశము అనేవి మనందరి శిక్షణలో ఒక ఆవశ్యక భాగమై ఉన్నాయి. సామెతలు 4:1, 13 కూడా చెబుతున్నట్లు, ఉపదేశానికి చెవియొగ్గడమనేది జీవన్మరణ విషయమై ఉంది: “కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము.”

మహాగొప్ప సంతోషము

10, 11. సామెతలు 3:13-18లోని యింపైన మాటల యొక్క కొన్ని ముఖరూపాలు ఏమై ఉన్నాయి?

10 ఎంత సుందరమైన పదజాలములు యిప్పుడు రాబోతున్నాయి, వాస్తవానికి ‘యింపైన మాటలు, సత్యమును గూర్చిన మాటలు యథార్థభావముతో’ ఉన్నాయి! (ప్రసంగి 12:10) సొలొమోను యొక్క ప్రేరేపింపబడిన ఈ మాటలు నిజమైన సంతోషాన్ని వర్ణిస్తున్నాయి. అవి మనం మన హృదయాలపై వ్రాసుకోవాల్సిన పదాలైయున్నాయి. మనమిలా చదువుతాము:

11 “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.”—సామెతలు 3:13-18.

12. జ్ఞానము మరియు వివేచన మనకు ఎలా సహాయం చేయాలి?

12 జ్ఞానము—సామెతల గ్రంథంలో ఎంత తరచుగా ఉపయోగించబడింది, మొత్తం మీద 46 సార్లు! “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.” దేవుని వాక్య జ్ఞానముపై ఆధారపడి ఉన్న దైవిక, ఆచరణాత్మకమైన బుద్ధి కుశలతయే యిది. సాతాను లోకములో చెలరేగుతున్న భయంకరమైన తుఫానులో ఆయన ప్రజలు క్షేమంగా దరిచేరడానికి అది సహాయం చేస్తుంది. (సామెతలు 9:10) జ్ఞానము యొక్క పరిచారికయైన వివేచన, సాతాను కుయుక్తులను త్రిప్పికొట్టడానికి సహాయం చేస్తుంది. సామెతల గ్రంథంలో ఈ వివేచన 19 సార్లు సూచింపబడింది. తన కుతంత్రాలను ఉపయోగించడంలో ఈ మహా విరోధికి వేవేల సంవత్సరాల అనుభవం ఉంది. కానీ బోధకునిగా అనుభవం కంటే చాలా ఎక్కువ విలువైనది మనకు ఒకటి ఉంది—అదే దైవిక వివేచన. అది తప్పు ఒప్పులను వివేచించి తెలుసుకొని, సరైన మార్గాన్ని ఎన్నుకోగల సామర్థ్యం. దీనినే యెహోవా తన వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నాడు.—సామెతలు 2:10-13; ఎఫెసీయులు 6:11.

13. కష్టమైన ఆర్థిక ఇబ్బందుల్లో మనల్ని ఏది రక్షించగలదు, ఎలా?

13 నేటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం యెహెజ్కేలు 7:19లోని ప్రవచన నెరవేర్పుకు ముందు సూచనగా ఉంది: “తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు.” భూమిపై ఉన్న సమస్త వస్తుసంపద, వివేచన, జ్ఞానం కలిగియున్న రక్షింపగల శక్తితో పోల్చబడ జాలదు. ఇంకొక సందర్భంలో జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా అన్నాడు: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును.” (ప్రసంగి 7:12) రమ్యమైన యెహోవా మార్గాల్లో నేడు ఎవరైతే నడుస్తున్నారో మరియు ఎవరైతే జ్ఞానంతో “దీర్ఘాయువును,” అనగా యేసు విమోచనా క్రయధనమందు విశ్వాసముంచే వారందరికి దేవుడిచ్చు బహుమానమైన నిత్య జీవమును ఎన్నుకున్నారో వారందరూ నిజంగా ధన్యులే!—సామెతలు 3:16; యోహాను 3:16; 17:3.

నిజమైన జ్ఞానాన్ని పెంపొందించుకొనుట

14. మాదిరికరమైన జ్ఞానాన్ని యెహోవా ఏయే విధాలుగా ప్రదర్శించాడు?

14 దేవుని స్వరూపంలో సృజింపబడ్డ మానవులమైన మనము, యెహోవా తానే తన అద్భుత సృష్టి కార్యాలను చేయడంలో ప్రదర్శించిన లక్షణాలైన జ్ఞానము మరియు వివేచనలను వృద్ధిపరచుకోవడానికి కృషిచేయడం సమంజసంగా ఉంటుంది. “జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.” (సామెతలు 3:19, 20) ఆయన జీవించే ప్రాణులను, ఏదో అర్థంకాని, అస్పష్టమైన పరిణామ పద్ధతిలో తయారు చేయలేదు కానీ, ప్రతిదాన్ని సూటిగా “ఆయా జాతుల ప్రకారము” ఒక జ్ఞానవంతమైన సంకల్పం నిమిత్తం సృష్టి కార్యాల ద్వారా తయారు చేశాడు. (ఆదికాండము 1:25) చివరకు వివేకం మరియు సామర్థ్యాలతో, జంతువులకంటే ఉన్నతంగా మానవుడు సృజింపబడినప్పుడు, దేవుని కుమారులుగా ఉన్న దూతల ఆనంద జయధ్వనులు ఆకాశమండలంలో పదే పదే ప్రతిధ్వనించి ఉండవచ్చు. (యోబు 38:1, 4, 7 పోల్చండి.) యెహోవాకున్న వివేకవంతమైన దూరదృష్టి, ఆయన జ్ఞానము, మరియు ఆయన ప్రేమ భూమిపైని ఆయన నిర్మాణాలన్నింటిలో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.—కీర్తన 104:24.

15. (ఎ) కేవలం జ్ఞానాన్నే పెంపొందించుకొనుట ఎందుకు సరిపోదు? (బి) సామెతలు 3:25, 26 మనలో ఏ దృఢ నమ్మకాన్ని రేకెత్తించాలి?

15 మనము యెహోవా లక్షణాలైన జ్ఞానము, వివేచనలను వృద్ధిపరచు కోవడమే కాకుండా, ఆయన వాక్యాన్ని పఠించడంలో ఎప్పుడూ మాంద్యులం కాకుండా ఉంటూ, ఆ లక్షణాలను గట్టిగా హత్తుకోవాలి కూడా. ఆయన మనకిలా ఉద్బోధ చేస్తున్నాడు: “నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును.” (సామెతలు 3:21, 22) ఆ విధంగా, “ఆకస్మికముగా నాశనము” వచ్చు దినము దొంగవలె వచ్చి సాతాను లోకంపై విరుచుకు పడినప్పుడు కూడా, మనము భద్రత మరియు నెమ్మదితో జీవించవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:2, 3) మహా శ్రమలప్పుడు కూడా, “ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.”—సామెతలు 3:23-26.

మంచి చేయడం పట్ల ప్రేమ

16. పరిచర్యలో ఆసక్తిని ప్రదర్శించుటతోపాటు క్రైస్తవులు ఏ క్రియలు కూడా చేయవలసి ఉన్నారు?

16 ఈ రాజ్య సువార్తను సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించడంలో ఆసక్తి చూపడానికి ఇవే సరైన దినాలు. కానీ సామెతలు 3:27, 28లో వివరించబడినట్లు, ఈ సాక్ష్యపు పనికి మద్దతుగా ఇతర క్రైస్తవ కార్యకలాపాలు కూడా అవసరము: “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము. ద్రవ్యము నీయొద్ద నుండగా—రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.” (యాకోబు 2:14-17 పోల్చండి.) ప్రపంచంలోని చాలా భాగము దారిద్ర్యము మరియు కరువుతో పీడింపబడుతుండగా, మన తోటి వారికి, ప్రత్యేకంగా మన ఆత్మీయ సహోదరులకు సహాయం చేయవలసిందిగా మనందరికి కూడా అత్యవసర పిలుపులు వచ్చాయి. మరి యెహోవాసాక్షులు ఎలా ప్రతిస్పందించారు?

17-19. (ఎ) మరి 1993లో ఏ అత్యవసర పరిస్థితి తీర్చబడింది, మరియు ఏ ప్రతిస్పందనతో? (బి) ముట్టడించబడిన మన సహోదరులు “వీటన్నిటిలో అత్యధిక విజయము” పొందుతున్నారని ఏది నిరూపిస్తుంది?

17 ఒక ఉదాహరణ చూడండి: గత సంవత్సరం, సహాయం కొరకు ఇదివరకటి యుగోస్లేవియా నుండి అత్యవసర పిలుపు వచ్చింది. చుట్టు ప్రక్కల దేశాలలోని సహోదరులు అద్భుతంగా ప్రతిస్పందించారు. గత శీతాకాలంలోని ఎముకలు కొరికే చలి నెలల్లో, అవసరంలో ఉన్న సాక్షుల కొరకు ప్రస్తుత ప్రచురణలు, ఉన్ని వస్త్రాలు, ఆహారం, మరియు మందులను రవాణా చేసే చాలా సహాయ వాహనాలు యుద్ధం జరిగే ప్రాంతాల్లోకి వెళ్ల గల్గాయి. ఒక సందర్భంలో, 15 టన్నుల సహాయ సామాగ్రిని తీసుకొని వెళ్లడానికి సహోదరులు అనుమతిని అడుగుతూ అర్జీ పెట్టారు, కానీ వారు అనుమతి పత్రం అందుకున్నప్పుడు, అందులో 30 టన్నులను అనుమతించినట్లు ఉంది! ఆస్ట్రియాలో ఉన్న యెహోవాసాక్షులు మరో మూడు ట్రక్కులను వెంటనే పంపించారు. మొత్తం 25 టన్నులు అవి చేరుకోవలసిన గమ్యాలు చేరుకున్నాయి. ఆత్మీయ మరియు భౌతిక వస్తువులను పుష్కలంగా అందుకోవడానికి మన సహోదరులు ఎంతగా ఉప్పొంగిపోయారో!

18 వాటిని అందుకున్న వారు ఎలా ప్రతిస్పందించారు? ఈ సంవత్సరం తొలిభాగంలో, ఒక పెద్ద యిలా వ్రాశాడు: “సరవేజోలో ఉన్న సహోదర సహోదరీలు సజీవంగా ఉన్నారు, వారు ఆరోగ్యంగా ఉన్నారు, అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఈ వెర్రి యుద్ధాన్ని సహించడానికి మేము ఇంకా ఆత్మీయంగా బలంగా ఉన్నాము. ఆహార విషయంలో పరిస్థితి చాలా కష్టతరంగా ఉండింది. మా కొరకై మీరు చేసిన ప్రయత్నాల విషయమై యెహోవా మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించు గాక. యెహోవాసాక్షుల మాదిరికరమైన జీవిత విధానం మరియు అధికారులపట్ల వారు కలిగియున్న గౌరవాన్నిబట్టి, అధికారులకు వారిపట్ల ప్రత్యేక గౌరవం ఉంది. మీరు మాకు పంపిన ఆత్మీయ ఆహారాన్నిబట్టి కూడ మేము మీకు కృతజ్ఞులమై ఉన్నాము.”—కీర్తన 145:18 పోల్చండి.

19 ప్రమాదంలో ఉన్న ఈ సహోదరులు ఆసక్తితో క్షేత్రసేవ చేయడం ద్వారా కూడా తమ మెప్పును చూపించారు. చాలామంది పొరుగువారు గృహ బైబిలు పఠనాలు కావాలని కోరుతూ వారిని అడిగారు. ఐదు టన్నుల సహాయ ఆహారం అందించబడిన తుజ్లా పట్టణంలో, సంఘంలోని తొమ్మిదిమంది పయినీర్లకు మంచి మద్దతునిస్తూ, 40 మంది ప్రచారకులు ప్రతి ఒక్కరు నెలకు సగటున 25 గంటలు పరిచర్యలో గడిపినట్లు రిపోర్టు చేశారు. యేసు మరణ జ్ఞాపకార్థ దినానికి పేర్కొనదగిన రీతిలో 243 మంది హాజరయ్యారు. నిజంగా ఈ ప్రియ సహోదరులు “మనలను ప్రేమించినవాని ద్వారా . . . వీటన్నిటిలో అత్యధిక విజయము” పొందుతున్నారు.—రోమీయులు 8:37.

20. మునుపటి సోవియట్‌ యూనియన్‌లో “సమానముగా” పంచే ఏ పని జరిగింది?

20 మునుపటి సోవియట్‌ యూనియన్‌లోకి పెద్ద వాహనాల ద్వారా పంపబడిన సహాయ ఆహారం మరియు ఉన్ని వస్త్రాల మూలంగా చూపబడిన ఉదారత, అక్కడి సహోదరుల ఆసక్తితో సమతూకం చేయబడింది. ఉదాహరణకు, మాస్కోలో గడచిన సంవత్సరం జ్ఞాపకార్థ దినానికి హాజరైన 3,500 మందితో పోలిస్తే, ఈ సంవత్సరం 7,549 మంది హాజరయ్యారు. అదే సమయంలో, ఆ పట్టణంలోని సంఘాలు 12 నుండి 16కు పెరిగాయి. మునుపటి సోవియట్‌ యూనియన్‌ అంతటిలో (బాల్టిక్‌ రాష్ట్రాలను వదిలేస్తే), సంఘాల్లో 14 శాతం, రాజ్య ప్రచారకుల్లో 25 శాతం, మరియు పయినీర్లలో 74 శాతం పెరుగుదల ఉంది. ఎంతటి ఆసక్తి మరియు స్వయంత్యాగ స్ఫూర్తి! అది ఒకనికి మొదటి శతాబ్దంలో “అందరికి సమానముగా” పంచియిచ్చుటను గుర్తుకు తెస్తుంది. ఆత్మీయంగాను మరియు భౌతికంగాను సమృద్ధిని కల్గియున్న క్రైస్తవులు, కొరతగా ఉన్న వారికి ఉదారమైన బహుమానాలు ఇచ్చారు. కాగా అవసరతలో ఉన్న వారి ఆసక్తి దాతలకు ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని తెచ్చింది.—2 కొరింథీయులు 8:14.

చెడును అసహ్యించుకోండి!

21. సామెతలు 3వ అధ్యాయంలోని ముగింపు మాటల్లో జ్ఞానులు మరియు మూర్ఖులు ఎలా భిన్నపర్చబడ్డారు?

21 సామెతలు మూడవ అధ్యాయం అటు తరువాత భిన్న పరంపరలను అందిస్తుంది, ఈ హెచ్చరికతో ముగిస్తుంది: “బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.”—సామెతలు 3:29-35.

22. (ఎ) మూర్ఖుల గతిని మనము ఎలా తప్పించుకోవచ్చు? (బి) జ్ఞానులు దేన్ని అసహ్యించుకుంటారు, మరియు వారు దేన్ని వృద్ధిపరచుకుంటారు, ఏ బహుమానంతో?

22 మనం బుద్ధిహీనుల లెక్కలో రాకుండా ఎలా ఉండగలము? మనము చెడుతనాన్ని అసహ్యించుకోవడం నేర్చుకోవాలి, అవును, దేన్ని యెహోవా అసహ్యించుకుంటాడో అట్టి దౌర్జన్యం, రక్తాపరాధం ఉన్న ఈ లోకం యొక్క మోసకరమైన మార్గాలన్నింటిని అసహ్యించుకోవాలి. (సామెతలు 6:16-19 కూడా చూడండి.) దానికి భిన్నంగా, దీనత్వం మరియు యెహోవాయందు భయభక్తులతో మనము “ఐశ్వర్యమును ఘనతయు జీవమును” పొందేట్లు, మంచితనాన్ని—యథార్థత, నీతి, మరియు దీనత్వాన్ని—వృద్ధిచేసుకోవాలి. (సామెతలు 22:4) మనలో ఆ హెచ్చరికను యథార్థంగా అన్వయించుకునే వారందరికి అది బహుమానంగా ఉంటుంది: “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”

మీ వ్యాఖ్యానం ఏమిటి?

◻ ఈ చర్చ యొక్క మూల వచనం నేడు ఎలా అన్వయిస్తుంది?

◻ మనము యెహోవాను ఎలా ఘనపర్చవచ్చు?

◻ మనము శిక్షను ఎందుకు చిన్నచూపు చూడకూడదు?

◻ మహా గొప్ప సంతోషము ఎక్కడ కనుగొనబడుతుంది?

◻ మనము ఎలా మంచితనాన్ని ప్రేమించి, చెడుతనాన్ని ద్వేషించగలము?

[18వ పేజీలోని చిత్రం]

తమకున్న దానిలో శ్రేష్ఠమైన దాన్ని యెహోవాకు యాగంగా ఇచ్చే వారు అత్యధికంగా దీవించబడతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి