కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 12/15 పేజీలు 8-10
  • “సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు దీనత్వాన్ని వెదకాలి?
  • ఈనాడు ‘దీనత్వాన్ని వెదికే’ వారు
  • దీనత్వంతో ప్రతిస్పందించండి
  • సాత్వికంగా ఉంటూ యెహోవాను సంతోషపెట్టండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • పరిస్థితులు మారినా దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 12/15 పేజీలు 8-10

“సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి”

“దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”—జెఫన్యా 2:3.

ప్రవక్తయైన జెఫన్యా ఈ మాటలను “దేశములో సాత్వికులైన” వారికి చెబుతున్నాడు, మరియు “ఆయన ఉగ్రత దినమున” రక్షింపబడడానికి ‘దీనత్వాన్ని వెదకమని’ ఆయన వారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. జీవాన్ని పొందడానికి దీనత్వం ముందుగా కావాలి అన్నది నిస్సందేహమైన విషయము. కాని ఎందుకు?

ఎందుకు దీనత్వాన్ని వెదకాలి?

దీనత్వం అంటే సాధు స్వభావంగల లక్షణం, అహంకారం లేదా అహంభావం లేకపోవడము. అది ఇతర విశేష లక్షణాలైన వినయము మరియు సాత్వికంతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది. అది ప్రస్తుతానికి బాధాకరంగా ఉన్నా, దీనులైన వ్యక్తులు బోధింపబడటానికి, దేవుని నుండి క్రమశిక్షణ అంగీకరించడానికి ఇష్టపడతారు.—కీర్తన 25:9; హెబ్రీయులు 12:4-11.

దీనత్వానికి ఒకరి విద్యతో లేక జీవితంలోని హోదాతో ఏ మాత్రం పని లేదు. అయితే, ఎక్కువ విద్య పొందిన వారు లేక లోకపరంగా విజయవంతం అయిన వారు తాము అన్ని విషయాల్లో, చివరకు ఆరాధనా విషయంలో కూడ తమకు తామే తీర్మానించుకొనగలమని భావించడానికి మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇంకొక వ్యక్తి తమకేదైనా బోధించడానికి లేక సలహాను అంగీకరించి తమ జీవితంలో అవసరమైన మార్పులను చేసుకోకుండా అది వారిని ఆపవచ్చు. వస్తుదాయకంగా ధనికులైన ఇంకొందరు తమ వస్తు సంపదలోనే తమ భద్రత ఉందని భావించే తప్పుడు ఆలోచనలో పడిపోవచ్చు. కావున, దేవుని వాక్యమైన బైబిలు నుండి ఆత్మీయ సంపదను పొందవలసిన అవసరత ఉందని వారు భావించరు.—మత్తయి 4:4; 5:3; 1 తిమోతి 6:17.

యేసు కాలం నాటి శాస్త్రులను, పరిసయ్యులను, మరియు ప్రధాన యాజకులను గమనించండి. ఒక సందర్భంలో యేసును నిర్భందించమని తాము పంపిన అధికారులు ఆయనను తీసుకొని రాకుండా వచ్చినప్పుడు పరిసయ్యులు: “మీరుకూడ మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని” అన్నారు. (యోహాను 7:45-49) అంటే అమాయకులు, విద్యలేని పామరులు మాత్రమే యేసు మాటలయందు నమ్మకముంచగలరని వారి అర్థము.

అయిననూ, కొందరు పరిసయ్యులు సత్యానికి దగ్గరయ్యారు, మరియు వారు యేసును, క్రైస్తవత్వాన్ని సమర్థించారు. వీరిలో నీకొదేము మరియు గమలీయేలు ఉన్నారు. (యోహాను 7:50-52; అపొస్తలుల కార్యములు 5:34-40) యేసు మరణం తరువాత “యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.” (అపొస్తలుల కార్యములు 6:7) నిస్సందేహంగా అందుకు అపొస్తలుడైన పౌలు ఒక అసాధారణ ఉదాహరణ. ఆయన గమలీయేలు వద్ద విద్యను అభ్యసించాడు మరియు యూదా మతంయొక్క ప్రతిష్ఠాత్మకమైన మరియు గౌరవనీయమైన ప్రతివాదిగా తయారయ్యాడు. అయితే, యుక్తకాలంలో క్రీస్తుయేసు పిలుపుకు దీనంగా ప్రతిస్పందించి ఆయన ఆసక్తిగల ప్రచారకునిగా తయారయ్యాడు.—అపొస్తలుల కార్యములు 22:3; 26:4, 5; గలతీయులు 1:14-24; 1 తిమోతి 1:12-16.

ఒకరి గత జీవితం ఏమైననూ లేక బైబిలు వర్తమానాన్ని ప్రస్తుతం ఎలా దృష్టించిననూ, జెఫన్యా పలికిన మాటలు ఇంకా అన్వయింపును కలిగి ఉన్నాయనే దాన్ని ఇదంతా దృష్టాంతపరుస్తున్నది. ఒకడు దేవునిచే అంగీకరించబడాలని, ఆయన వాక్యంచే నడిపింపబడాలని కోరుతుంటే, దీనత్వం తప్పనిసరిగా అవసరము.

ఈనాడు ‘దీనత్వాన్ని వెదికే’ వారు

నేడు, రాజ్య సువార్తకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిస్పందిస్తున్నారు. అటువంటి ప్రజల యిండ్లలో యెహోవాసాక్షులు ప్రతి వారం నలభై లక్షలకంటే ఎక్కువ గృహ బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. వీరు అనేకమైన విభిన్న జీవిత విధానాలు, వేర్వేరు ఆర్థిక, సామాజిక పరిస్థితులనుండి వచ్చినవారై యున్నారు. అయితే వీరందరూ సామాన్యంగా కలిగివున్న ఒక విషయం ఏమిటంటే, ఎవరో తమ ఇంటి వద్దనో లేక వేరే ఎక్కడనో బైబిలు వర్తమానాన్ని అందించినప్పుడు దాన్ని అంగీకరించేంత దీనత్వాన్ని కలిగి ఉన్నారు. తమ మార్గమధ్యలో వచ్చే అడ్డంకులను అధిగమించుటకు ప్రయత్నించడానికి వారు సిద్ధంగా ఉన్నారు గనుక వారిలో చాలామంది మంచి అభివృద్ధిని సాధిస్తున్నారు. అవును, నేడు “దేశములో సాత్వికులైన” వారిలో వీరు కూడా ఉన్నారు.

ఉదాహరణకు, మెక్సికోలోని మారియాను గమనించండి. ఆమె విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివింది, మరి ఆస్తిని కలిగి ఉన్నందున ఆమెకు ఆర్థిక భద్రత ఉంది. దీన్ని బట్టి, “తిరుగుబాటు, కఠినత్వం, అధికార గర్వం, మరియు నాస్తికత్వం” గల మనిషిగా తనను మార్చే స్వేచ్ఛాభిప్రాయాలను తాను వృద్ధిచేసుకుందని ఆమె తెల్పింది. “అన్నింటినీ డబ్బుతో పరిష్కరించవచ్చని మరి దేవుడు ప్రాముఖ్యం కాడని నేను ఆలోచించడం మొదలు పెట్టాను. వాస్తవానికి, ఆయన అసలు ఉనికియందే లేడని నేను భావించాను,” అని మారియా గుర్తుకు తెచ్చుకుంది. ఆమె ఇంకా ఇలా చెప్పింది: “నాకు చర్చి అంటే ఏదో పరిహాసాస్పదమైన దానిగా మరి అది కేవలం ఒక సామాజిక అవసరతగా మాత్రమే ఉండేది.”

తరువాత, ఆమె తన సోదరుడు యెహోవా సాక్షులలో ఒకడైన తర్వాత అతనిలో వచ్చిన మార్పులను మారియా గమనించింది. “అతడు చాలా భయంకరంగా ఉండేవాడు, మరి ఇప్పుడైతే అతడు చాలా ప్రశాంతంగా, నీతిమంతుడైన వ్యక్తిగా ఉన్నాడు,” అని మారియా వివరించింది. “అతను ఒక ప్రచారకుడని, బైబిలు చదువుతాడని, అందుకని ఇక యిప్పుడతడు త్రాగడు లేక స్త్రీల వెంటపడడు అని బంధువులు చెప్పారు. కావున అతను వచ్చి నా వద్ద బైబిలు చదవాలని నేను కోరాను, ఎందుకంటే ఆ విధంగానైనా నేను ఎంతగానో కోరుకునే శాంతి, నిశ్చలత నాకు లభిస్తుందని నేను భావించాను.” దాని పర్యవసానం మారియా ఒక సాక్షుల జంటతో బైబిలు పఠనానికి అంగీకరించింది.

ఆమె ఎన్నో విషయాలను అధిగమించవలసి ఉంది, మరి తన భర్తకు లోబడియుండాలని బైబిలు నందున్న శిరస్సత్వపు సూత్రాన్ని అంగీకరించడం కూడా ఆమెకు చాలా కష్టంగా ఉండెను. అయితే ఆమె తన జీవితం మరియు ప్రవర్తనలో త్వరగా మార్పులు చేసుకుంది. ఆమె యిలా ఒప్పుకుంది: “సహోదరులు నా యింటికి వచ్చి తమతోపాటు యెహోవా సహాయాన్ని తెచ్చినప్పటినుండి నా యింట్లో సంతోషము, నిశ్చలత, మరియు దేవుని దీవెనలు నివసించాయి.” నేడు, మారియా సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న ఒక యెహోవాసాక్షి.

సత్యారాధనను వెంబడించడంలో, దీనత్వాన్ని కలిగి ఉండడం, లేక అది లేకపోవడం ప్రముఖమైన పాత్ర వహించే ఇంకొక విషయముంది. బహు తరచుగా, కుటుంబంలో భార్య సత్యాన్ని అంగీకరిస్తుంది మరి దేవున్ని సేవించాలని ఇష్టపడుతుంది, కానీ భర్త మాత్రం యిష్టపడడు. బహుశా తమ భార్యలు ఇప్పుడు లోబడ వలసిన వారు వేరొకరు—యెహోవా దేవుడు—ఉన్నాడను విషయాన్ని అంగీకరించడానికి భర్తలకు కష్టంగా ఉండవచ్చు. (1 కొరింథీయులు 11:3) మెక్సికో, చిహువాహువాలోని ఒక స్త్రీ బైబిలు పఠనం కొరకు అడిగింది, యుక్తకాలంలో ఆమె, ఆమె ఏడుగురు పిల్లలు సత్యాన్ని హత్తుకున్నారు. మొదట్లో ఆమె భర్త వ్యతిరేకించే వాడు. ఎందుకు? తన కుటుంబం ఇంటింటికి వెళ్లి ప్రకటించడం, బైబిలు ప్రచురణలు అందించడం ఆయన ఇష్టపడలేదు. అది తన హోదాకు తక్కువని ఆయనకు అనిపించింది. అయితే, ఆయన కుటుంబం దేవున్ని సేవించాలనే తన నిర్ణయంలో దృఢంగా నిలిచింది. యుక్తకాలంలో దేవుని ఏర్పాట్లను అంగీకరించడంయొక్క విలువను భర్త గమనించడం మొదలుపెట్టాడు. అయితే ఆయన యెహోవాకు తననుతాను సమర్పించుకొనుటకు ముందు 15 సంవత్సరాలు గడిచాయి.

మెక్సికో అంతటా, వేరుపరచబడిన సమాజాలు చాలా ఉన్నాయి. అక్కడి స్థానిక ప్రజలు తమ స్వంత ఇండియన్‌ భాషలు, ఆచారాలను కలిగి ఉన్నారు. బైబిలు వర్తమానం ఈ ప్రజలకు చేరుతుంది మరి వారు సత్యాన్ని నేర్చుకొనేటప్పుడు కొందరు వ్రాయడం మరియు చదవడం నేర్చుకొనడం ద్వారా వారు తమ సాంస్కృతిక స్థాయిని మెరుగుపరచుకోడానికి సహాయం లభిస్తుంది. అయితే, ప్రజలకు కొద్ది పాటి విద్య లేక వస్తు సంపద కొంచెమే ఉన్నంత మాత్రాన వారు తప్పకుండా ఎంతో ఆసక్తితో వింటారని దాని అర్థం కాదు. జాత్యహంకారం మరియు పూర్వికుల ఆచారాలకు హత్తుకుని ఉండడం, కొన్నిసార్లు సత్యాన్ని అంగీకరించడానికి కొందరికి కష్టం కావచ్చు. కొన్ని ఇండియన్‌ గ్రామాల్లో, సత్యాన్ని అంగీకరించిన వారు తరచూ ఇతరులచేత ఎందుకు బాధింపబడుతున్నారో కూడా ఇది వివరిస్తుంది. కావున దీనత్వం ఎన్నో రూపాలు ధరిస్తుంది.

దీనత్వంతో ప్రతిస్పందించండి

వ్యక్తిగతంగా మీ గురించి ఏమిటి? దేవుని వాక్య సత్యానికి మీరు ప్రతిస్పందిస్తున్నారా? లేక కొన్ని బైబిలు సత్యాలను అంగీకరించడం మీకు కష్టతరంగా ఉందా? బహుశా మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఏమిటో మీకై మీరే పరీక్షించాలని అనుకోవచ్చు. సత్యానికి ఆకర్షితులైనవారు చాలామంది దీనస్థితి నుండి వచ్చినవారు అనే విషయం మిమ్మల్ని కలతపరుస్తుందా? మీ ఆలోచనలో వ్యక్తిగత అహం ఇమిడి ఉందా? అపొస్తలుడైన పౌలు పలికిన మాటలపై దృష్టి నిలపడం మంచిది: “ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.”—1 కొరింథీయులు 1:27-29.

మీరు ఒక సాధారణ మట్టి పాత్రలో ధననిధిని కనుగొన్నారు గనుక దానిని తిరస్కరిస్తారా? ఎంత మాత్రం చేయరు! అయిననూ, అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నట్లు, దేవుడు జీవాన్ని రక్షించగల తన వాక్యసత్యాన్ని మనకు అదే విధంగా అందించడానికి ఇష్టపడుతున్నాడు: “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” (2 కొరింథీయులు 4:7) కేవలం దాన్ని మనకు అందిస్తున్న ‘మంటి ఘటములను,’ లేక మానవ ప్రతినిధులను మాత్రమే కాక నిధియొక్క నిజమైన విలువను చూడడానికి దీనత్వం మరియు సాత్వికము మనకు సహాయంచేస్తాయి. మనమలా చేస్తే, ‘ఆయన ఉగ్రత దినమున దాచబడగల’ సాధ్యతను కూడా పెంచుకుంటూ, ‘భూలోకమును స్వతంత్రించుకొను’ వారి మధ్య మనము ఉండగలము.—జెఫన్యా 2:3; మత్తయి 5:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి