దేవుని వాక్యంలో ఉన్న సంపద | జెఫన్యా 1–హగ్గయ్యి 2
యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి
ఆయన ఉగ్రత రోజున యెహోవా మనల్ని దాచిపెట్టాలంటే, మనం సమర్పించుకోవడం కంటే ఎక్కువే చేయాలి. జెఫన్యా ఇశ్రాయేలీయులకు చెప్పిన విషయాలను మనం తప్పకుండా పాటించాలి.
యెహోవాను వెదకండి: ఆయన సంస్థతో సహవసిస్తూ, యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండండి
నీతిని వెదకండి: యెహోవా నీతి ప్రమాణాలను సమర్థించండి
అణకువగా ఉండండి: యెహోవా ఇష్టానికి వినయంగా లోబడి ఉంటూ ఆయనిచ్చే క్రమశిక్షణను అంగీకరించండి
నేను యెహోవాను, ఆయన నీతిని, ఆయన అణకువను సాధ్యమైనంత ఎక్కువగా ఎలా వెదకగలను?