అతి పరిశుద్ధ విశ్వాసంలో గిలియడ్ శిక్షణ
“మన విద్యార్థులు అతి పరిశుద్ధ విశ్వాసంలో శిక్షణ పొందారు.” సెప్టెంబరు 12, 1993 ఆదివారం నాడు జరిగిన వాచ్‌టవర్ గిలియడ్ పాఠశాల 95వ తరగతి కార్యక్రమంలోని ప్రారంభ వాక్కులు అవి. ఆ రోజు ఉదయం, జెర్సీ సిటీ అసెంబ్లీ హాలులో సమకూడిన 4,614 మంది ఆహ్వాన అతిధులు, బేతేలు కుటుంబ సభ్యులు, జార్జి గాంగెస్ చేసిన ప్రారంభ ప్రార్థనలో పాల్గొన్నారు. సహోదరుడు గాంగెస్ గత 65 సంవత్సరాలుగా బేతేలు కుటుంబ సభ్యునిగా ఉంటున్నారు, అంతేకాక 97 సంవత్సరాలున్న ఈయన పరిపాలక సభలోని అతి వృద్ధ సభ్యుడు.
పరిపాలక సభ సభ్యుడు, ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైన ఆల్‌బర్ట్ ష్రోడర్ యిలా పేర్కొన్నాడు: “ఐదు నెలల ఈ గిలియడ్ శిక్షణ అతిపరిశుద్ధ విశ్వాసంపై ఆధారపడివుంది.” అయితే “అతి పరిశుద్ధ విశ్వాసం” అంటే ఏమిటి? యూదా 20 నందు పేర్కొనబడిన ‘ఈ అతిపరిశుద్ధమైన’ విశ్వాసం అంటే సంపూర్ణ బైబిలు సత్యమని ఆయన వివరించారు. కాబట్టి గిలియడ్ శిక్షణ, యెహోవా వాక్యమైన బైబిలుపై ఆధారపడినది. ఎందుకనగా, దాని ముఖ్య పాఠ్యపుస్తకము అదే.
విద్యార్థులు అధిక బోధను పొందుట
మొదటి ప్రసంగీకుడు, వాచ్‌టవర్ ఫామ్స్ కమిటీకి చెందిన జాన్ స్ట్యూఫ్లోటెన్ “జ్ఞానులైన వారి ప్రభావంనుండి ప్రయోజనం పొందుట” అనే అంశంపై ప్రసంగించారు. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగల వాడగును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 13:20) గిలియడ్ శిక్షణ కాలంలో విద్యార్థులు 900 గంటలకంటే ఎక్కువ సమయాన్ని బైబిలు చదవడంలో గడిపారు. సహోదరుడు స్ట్యూఫ్లోటెన్ విద్యార్థులను యిలా ప్రశ్నించారు: “యెహోవా ప్రభావం మీపై భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? మీరు 17 కోట్ల ప్రజలున్న 18 దేశాలకు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఆ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తారు?” యెహోవా జ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ. క్రొత్త మిషనరీలు, యితరులు అంతులేని జ్ఞానానికి మూలమైన యెహోవా ఆరాధికులు కావడానికి సహాయపడతారు.
“అందరికీ అన్ని విధాలవారై ఉండండి” అన్న అంశంపై యివ్వబడిన ఆ తర్వాత ప్రసంగాన్ని పరిపాలక సభ సభ్యుడైన లోయిడ్ బ్యారి వివరించారు. (1 కొరింథీయులు 9:22, కింగ్ జేమ్స్ వర్స్‌న్) సహోదరుడైన బ్యారి 45 సంవత్సరాలక్రితం 11వ గిలియడ్ తరగతుల్లో తానొక విద్యార్థిగా ఉన్నవాడే. ఇప్పుడు, విదేశంలో సంవత్సరాల అనుభవంగల మునుపటి మిషనరీనుండి అభ్యాసయోగ్యమైన సలహాలను పొందడాన్ని 95వ క్లాసు మెచ్చుకుంది. వారి ప్రాంతీయ నాగరికతనూ ప్రాంతీయ భాషనూ నేర్చుకోవడంతో తమకు క్రొత్తదైన విదేశీప్రాంతంలోని ప్రజలతో త్వరగా కలిసిపొమ్మని ఆయన విద్యార్థులను ప్రోత్సహించాడు. ప్రాంతీయ ప్రజలతో కలిసిపోతూ సన్నిహితంగా సహవసిస్తూ రాజ్య పనిలో పాల్గొనడం, అలాగే వారి ఆచారాలను నేర్చుకొని, ఎక్కడ సబబో అక్కడ వారి పద్ధతులను అలవర్చుకోవడంతో దీన్ని చక్కగా చేయవచ్చునని ఆయన చెప్పారు.
తర్వాత, ఫ్యాక్టరీ కమిటీకి చెందిన డేన్ సోంజర్ గారు “కర్తవ్యం నుండి విడుదల నొందుట” అనే ఆసక్తికరమైన అంశంపై ప్రసంగమిచ్చారు. సహోదరుడైన సోంజర్, 35 ఏండ్ల పూర్తికాల సేవ తర్వాత, నిర్దిష్ట గురికలిగి దానికొరకు జీవించడం, సరళమైన జీవనం, ముందున్న దైవపరిపాలన పనిపై అవధానమివ్వడం, వస్తుసంబంధ శ్రద్ధ నుండి దూరంగా ఉండడం అంటే ఏమిటో ఆయన చక్కగా అర్థంచేసుకోగలరు. ఆయన విద్యార్థులకు యిచ్చిన సలహాలోని సారాంశం అదే. యెహోవా మందిరంలోని గాయకులు తమ ప్రత్యేక పనికై తమ్మును తాము పూర్తిగా అర్పించుకోవడం కొరకు, యితర లేవీయులకు సహజంగా ఉన్న కర్తవ్యంనుండి విడుదల పొందారు. (1 దినవృత్తాంతములు 9:33) అదే విధంగా, గిలియడ్ మిషనరీలు, తమ ప్రత్యేక సేవపై అవధానమివ్వడానికిగాను లౌకిక ఉద్యోగం వంటి సామాన్య విషయాలనుండి, స్వతంత్ర్యంగా ఉన్నారు. సహోదరుడైన సోంజర్ ఈ హెచ్చరికతో ముగించారు: “జీవితం యెడల మీ దృక్పథాన్ని కేంద్రీకరించి ఉంచండి, మీ జీవితాన్ని సరళం చేసుకోండి. ఇతర బాధ్యతలు లేనివారిగా, యెహోవాను కొనియాడుతూ రాత్రింబవళ్లు ఆయన పనిలో ఉండడమే మీ బాధ్యత.”
పరిపాలక సభ సభ్యుడైన డానియేల్ సిడ్లిక్ “జీవితంనుండి శ్రేష్ఠమైన దానిని ఎలా పొందాలో యితరులకు బోధించుట” అనే అంశంపై ప్రసంగించారు. “కేవలం సిద్ధాంతాలను బోధించడమేకాక, ప్రజలు తమ జీవితాలను దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చడానికి వారు ఏమి చేయాలో చూపే ధైర్యం కల్గివుండాలి” అని విద్యార్థులను ప్రోత్సహించారు. మంచి బోధకులు ప్రేరేపించి పురికొల్పాలి. “నియమ నిబంధనలను బోధించడమే కాకుండా క్రైస్తవ విలువలను పెంపొందించుకునే మెలకువను కల్గివుండాలి” అని చెప్పి, ముగింపులో యింకా యిలా అన్నారు: “అన్నిటికంటే ముఖ్యంగా, మీకై మీరు, అలాగే యితరులకు కూడా ప్రేమించడం నేర్పండి, ఎందుకంటే అది పరిపూర్ణ అనుబంధమైన ప్రేమ.”—1 కొరింథీయులు 13:1-3; కొలొస్సయులు 3:14.
కొద్ది నెలల శిక్షణ తర్వాత, విద్యార్థులలో తమకు గిలియడ్ శిక్షణనిచ్చే యిద్దరు ఉపదేశకుల యెడల ప్రత్యేక మక్కువ పెరిగింది. మునుపటి మిషనరీ, జాక్ రెడ్‌ఫర్డ్, మొదట “మీరు సరైన దాన్ని ఎన్నుకున్నారు” అనే విషయంపై ప్రసంగించారు. ప్రాచీన యూదా ప్రపంచంలో, క్రైస్తవ అపొస్తలుడు కాకముందు పౌలుకు, స్థానము, హోదా, ప్రభావం, ఆర్థిక భద్రత ఉండేవి. అయితే ఫిలిప్పీయులు 3:8 నందు ఫిలిప్స్ అనువాదం ప్రకారం, పౌలు వీటినన్నింటినీ “అయిష్టమైనవి,” “చెత్త” అని వర్ణించాడు. ఆయన హృదయం సేవపై ఉంది, మరి ఆయన సరైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానికి భిన్నంగా ఈనాడు మానవజాతిలో అధిక శాతం, తమ జీవితాల్లోని ఎంపిక ద్వారా తాము నిత్య జీవంకన్నా వస్తుసంబంధమైన వాటికే ఎక్కువ విలువనిస్తున్నట్లు చూపుతున్నారు. గిలియడ్ మిషనరీలు సరైన ఎంపికను చేసుకున్నారు. జాక్ రెడ్‌ఫర్డ్ యిలా చెబుతూ ముగించాడు: “మిషనరీ సేవతో పోల్చదగిన దేనినైనా ఈ అపవాది లోకం మీకు అందించలేదు. ఆ విలువకట్టలేని ఆధిక్యతను కాపాడుకోండి, లోకపు చెత్తను గూర్చి దాన్నే శ్రద్ధతీసుకోనివ్వండి!”
గత 32 సంవత్సరాలుగా, యులిసీజ్ గ్లాస్ గిలియడ్ బోధకునిగా ఉన్నారు. ఆయన విద్యార్థులకు చివరిగా కొన్ని అభ్యాస యోగ్యమైన సలహాలను కీర్తన 1:3పైన ఆధారపడిన “దేవుడు మాత్రమే వృక్షాన్ని కలుగజేయగలడు” అనే అంశంపైని ప్రసంగంలో చెప్పారు. దేవుడు చేసిన వృక్షానికి పోటీగా దానికి సమానమైన మరోవృక్షాన్ని ఆధునిక సాంకేతిక విజ్ఞానము చేయలేకపోయింది. అదే భావంలో, నిజ క్రైస్తవులు దేవుడు నాటి, సాగుచేసే వృక్షాల్లాంటివారు. అయిదు నెలలదాకా ఆత్మీయ తోట లేక పరదైసులోని వృక్షాల్లా, విద్యార్థులు “దేవుని వాక్యం నుండి జీవమిచ్చే నీటి బుగ్గ ద్వారా క్రమంగా సాగుచేయబడ్డారు” అని గ్లాస్ సహోదరుడు పేర్కొన్నారు. అయితే, మిషనరీలుగా వారు తమ “ఆత్మీయ వేర్లు పాడైపోకుండా కాపాడుకోవాలి.” ‘యెహోవా నుండి వచ్చే జీవజలమును ఎడతెగక త్రాగుతూవుండండి. ఎందుకంటే, దేవుడే వృక్షాన్ని కలుగజేయగలడు’ అని వారు ఉద్బోధించబడ్డారు.
ముగింపు ప్రసంగాన్ని పరిపాలక సభలోని సభ్యుడైన కారి బార్బర్ యిచ్చారు. డెభ్బై సంవత్సరాల పూర్తికాల సేవ తర్వాత, సహోదరుడైన బార్బర్ “యెహోవా యెడల అనితర భక్తిని కల్గియుండండి” అనే అంశంపై నమ్మకంతో ప్రసంగం యివ్వగల్గారు. మానవజాతిలో అధిక శాతం యెహోవా యెడల అనితర భక్తిని కనపర్చలేదు. (ద్వితీయోపదేశకాండము 5:9) అయితే, సహోదరుడైన బార్బర్ సూచించినట్లుగా, మనలో అసంపూర్ణత ఉన్నప్పటికీ “దేవునికి పూర్తిగా అర్పించుకోవడం సాధ్యమే.” ఆయన యిలా చెప్పాడు: “‘అపవాది నాచేత దీనిని చేయించింది.’ అని ఎవరూ నిజంగా అనలేరు.” అయితే మనం అపవాదిని ఎదిరించకపోతే అతనే మనల్ని ఓడించగలడు. (యాకోబు 4:7) యెహోవా పనిలో తీరికలేకుండా ఉండడం, సాతాన్ని దాని లోకాన్ని ఎదిరించడానికి గల ఒక ప్రాముఖ్య విధానమే కాకుండా యెహోవాకు శ్రేష్ఠమైన సమర్పణను అందించడానికి గల విధానం కూడ.
మిషనరీలుగా నియమించబడుట
ఉదయకాల కార్యక్రమం, ఆ 46 మంది విద్యార్థులను మిషనరీలుగా అధికారికంగా నియమించడంతో ముగిసింది. పట్టభద్రులు “విద్యాపనికి, మంచిని వ్యాప్తి చేసేందుకు, శాశ్వత సమాధానాని కొరకు, పరిపూర్ణ న్యాయం, అందరి ప్రజల్లో నీతికొరకు పనిచేసే వారని” పేర్కొంటూ ఇరవైమూడు జంటలకు డిప్లమోలు అందించబడ్డాయి. వారు నియమింపబడిన 18 దేశాల్లో ఈ గొప్పపనిని సాధించడానికి 95వ గిలియడ్ తరగతి తప్పక పాటుపడుతుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ వీరు నియమించబడ్డారు. వాటిలో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, లాటిన్ అమెరికా, కరేబియన్‌ల దేశాలు కూడా యిమిడివున్నాయి.
మధ్యాహ్నం, సేవా విభాగ కమిటీకి చెందిన చార్ల్స్ వుడె నిర్వహించిన క్లుప్తమైన కావలికోట పఠనం తర్వాత క్రొత్త గిలియడ్ పట్టభద్రులు “గిలియడ్ మమ్మల్ని మిషనరీలుగా బోధించడానికి తయారు చేసింది” అనే అంశంపై తమ విద్యార్థి కార్యక్రమాన్ని అందించారు. “మేము ఎదుర్కొనే ఎంపికలు” అనే నాటకంతో ఆ కార్యక్రమం ముగిసింది.
ఈ పురికొల్పే కార్యక్రమం తర్వాత, యిప్పుడు క్రొత్త మిషనరీలు, యితరులతో తమ ‘అతి పరిశుద్ధ విశ్వాసాన్ని’ పంచుకోడానికి భూమి నలుదిశలకు పంపబడడానికి సిద్ధంగా ఉన్నారు.
[26వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకము
ప్రాతినిధ్యం వహించబడిన దేశాల సంఖ్య: 7
నియమించబడిన దేశాల సంఖ్య: 18
విద్యార్థుల సంఖ్య: 46
వివాహమైన దంపతుల సంఖ్య: 23
సగటు వయస్సు: 30.06
సత్యమందు సగటు సంవత్సరాలు: 12.92
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 9.4
[26వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిలు గిలియడ్ పాఠశాలలో పట్టభద్రులైన 95వ తరగతి
ఈ క్రింది పట్టికలో, వరుసలకు ముందునుండి వెనుకకు నెంబర్లువేయబడ్డాయి, మరి పేర్లు ప్రతి వరుసలోనూ ఎడమనుండి కుడికి లిఖించబడ్డాయి.
(1) బ్యూలో, డి.; డొన్‌జా, వి.; ఐనెస్, ఎస్.; ఫల్క్, ఎన్.; బిలింగ్స్‌బి, ఎమ్.; హోడినాట్, ఎల్.; నైగ్రిన్, బి.; ఎరిక్సన్, ఎల్.; (2) బోకర్, జె.; థామస్, ఎమ్.; స్టెడ్‌మ్యాన్, ఎస్.; బిలింగ్స్‌బి, డి.; వో, ఐ.; పెర్‌విస్, ఎమ్.; లర్టెల్, ఎమ్. (3) యాకొబ్‌సెన్, టి.; బోకర్, జె.; మార్టెనెస్, ఎల్.; నిల్సన్, ఈ.; పుర్‌విస్, పి.; హోల్ట్, ఎల్.; లార్‌సెన్, ఎమ్.; జోన్స్, ఎల్.; (4) న్యూమెనెన్, పి.; న్యూమెనెన్, హెచ్.; బ్యూలో, ఎమ్.; ఒల్సన్, డబ్ల్యూ, హోల్ట్, ఎస్.; డోన్‌జె, జి.; డజార్డన్, సి.; డజార్డన్, డి.; (5) లార్‌సెన్, కె.; మార్టెనెస్, డి.; నైగ్రెన్, పి.; వో, పి.; జోన్స్, డి.; హోడినాట్, జె.; థామస్, జి. (6) ఐనెస్, బి.; ఫల్క్, ఆర్.; ఎరిక్‌సన్, ఎ.; నిల్సన్, ఎస్.; స్టెడ్‌మ్యాన్, జే.; ఒల్ససన్, కె.; యాకొబ్‌సన్, ఎఫ్.; లట్రెల్, జె.