కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wtsbr 5/15 పేజీలు 57-61
  • “సంఘపు పెద్దలను పిలిపించండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సంఘపు పెద్దలను పిలిపించండి”
  • కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహాయం అందుబాటులో ఉంది
  • “ఈవులను పొందిన మనుష్యులు”
  • చొరవ తీసుకొనుట
  • “సంఘపెద్దలు” ఎలా సహాయపడతారు
  • వ్యక్తిగత బాధ్యత, ప్రార్థన
  • యెహోవా గొఱ్ఱెలపట్ల శ్రద్ధ వహించడానికి ‘మనుష్యులలో ఈవులు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ‘పెద్దల్ని పిలవండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ‘మనుష్యులలో ఈవులను’ మెప్పుదలతో చూడటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • నాయకులుగా ఉన్నవారికి విధేయులై యుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
wtsbr 5/15 పేజీలు 57-61

“సంఘపు పెద్దలను పిలిపించండి”

“మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను.”—యాకోబు 5:14.

1, 2. (ఎ) యెహోవా సేవకులు తాము ఎటువంటి భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు వారు గుర్తించారు, మరియు వారు ఎలా భావించవచ్చును? (బి) ప్రస్తుతం ఏ ప్రశ్నలకు సమాధానం అవసరమైయుంది?

మనము “అపాయకరమైన కాలములలో” జీవిస్తున్నాము. ఈ “అంత్య దినములలో” ప్రజలు స్వార్థంతోను, ఐశ్వర్యాసక్తితోను, గర్వంతోను, తరచు అల్లరి సృష్టిస్తున్నారు. (2 తిమోతి 3:1-5) ప్రస్తుతమున్న దుష్టవిధానంలో జీవిస్తున్న క్రైస్తవులుగా, మూడు అత్యంతగొప్ప అపాయాలను గూర్చిన బెదిరింపు మనకుంది: అవి అపవాదియైన సాతాను, భక్తిహీన మానవజాతి, మరియు మనకు సంప్రాప్తమైన పాపప్రవృత్తి.—రోమీయులు 5:12; 1 పేతురు 5:8; 1 యోహాను 5:19.

2 ఈ అపాయాలతో బెదిరించబడటం వలన, మనము కొన్ని సమయాలలో అణచివేయబడినట్లు భావించవచ్చును. అయితే, విశ్వాసంతో సహించుకోడానికి కావలసిన మద్దతును, మనము ఎక్కడ కనుగొనగలం? మన క్రైస్తవ పనులకు, మన ఆరాధనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొనునప్పుడు నడిపింపుకు ఎవరివైపు తిరుగగలం?

సహాయం అందుబాటులో ఉంది

3. మనం యెవరియొద్దనుండి ఓదార్పుతోకూడిన అభయాన్ని పొందగలం, ఎలా?

3 యెహోవాయే మనలను బలపరచువాడని తెలుసుకోవడం మనకు ఓదార్పుతోకూడిన ఆదరణను దయచేస్తుంది. (2 కొరింథీయులు 1:3, 4; ఫిలిప్పీయులు 4:13) దైవీక సహాయాన్ననుభవించిన కీర్తనల గ్రంథకర్తయైన దావీదు, యిలా ప్రకటించాడు: “నీమార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.” “నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 37:5; 55:22) అలాంటి మద్దతు కొరకు మనమెంత కృతజ్ఞులమో కదా!

4. పేతురు, పౌలు యిద్దరూకూడ ఎలా ఓదార్పును దయచేశారు?

4 శ్రమలను, అపాయాలను ఎదుర్కొనేది కేవలం మనం మాత్రమే కాదని తెలుసుకొనుటనుండి కూడా మనం ఓదార్పును పొందగలము. అపొస్తలుడైన పేతురు తోటిక్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని [అపవాదియైన సాతానును] ఎదిరించుడి.” (1 పేతురు 5:9) నిశ్చయంగా, క్రైస్తవులందరూ విశ్వాసంలో దృఢంగా ఉండాలనే కోరిక కల్గియున్నారు. నిజమే, తరచూ మనము అపొస్తలుడైన పౌలు వలెనే, “ఎటుబోయినను శ్రమపడునట్లు” భావించవచ్చును. అయినను, ఆయన “ఇరికింపబడలేదు.” ఆయన వలెనే, మనము అపాయంలోనున్నను “కేవలము ఉపాయము లేనివారము కాము.” మనము హింసింపబడిననూ, మనము “దిక్కులేనివారము కాము.” ఒకవేళ “పడద్రోయబడితే,” మనము “నశించువారము కాము.” కాబట్టి, “మనము ఓడిపోయేవారము కాదు.” ఎందుకనగా, “దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుటకు” మనము కృషిచేస్తున్నాము. (2 కొరింథీయులు 4:8, 9, 16, 17) దీనిని మనమెలా చేయగలం?

5. యెహోవా ఏ మూడువిధాల సహాయకం అనుగ్రహించాడు?

5 “ప్రార్థనను ఆలకించువాడైన” యెహోవా, మూడువిధాలుగా సహాయం అందజేస్తున్నాడు. (కీర్తన 65:2; 1 యోహాను 5:14) మొదటిగా, ఆయన ప్రేరేపిత వాక్యమగు బైబిలుద్వారా, మార్గాన్ని దయచేయుచున్నాడు. (కీర్తన 119:105; 2 తిమోతి 3:16) రెండవదిగా, ఆయన చిత్తాన్ని చేయుటకు తన పరిశుద్దాత్మశక్తి మనలను శక్తిమంతులుగా చేస్తుంది. (అపొస్తలుల కార్యములు 4:29-31 పోల్చండి.) మరి మూడవదిగా, యెహోవా భూసంబంధ సంస్థ మనకు సహాయాన్నందించుటకు సిద్ధంగా ఉంది. సహాయం అందుకొనుటకు మనమేమి చేయాలి?

“ఈవులను పొందిన మనుష్యులు”

6. తభేరా దగ్గర యెహోవా యే సహాయం చేశాడు, మరియు ఎలా?

6 మోషే ప్రవక్త కాలంలో జరిగిన సంఘటన యెహోవా తన సేవకులకు సహాయం చేయుటలోగల ప్రేమపూర్వక శ్రద్ధను అభినందించుటకు మనకు సహాయంచేస్తుంది. ఇది తభేరా దగ్గర జరిగింది, “మండుచున్న; దహనకాండ; అగ్నిజ్వాల” అని దీని భావము. సీనాయి అరణ్యప్రాంతంలోని ఈ ప్రదేశంలోనే, దేవుడు, సణుగుచున్న ఇశ్రాయేలీయులకు విరుద్ధంగా అగ్ని రగులుకొనునట్లు చేశాడు. ఐగుప్తునుండి వచ్చి ఇశ్రాయేలీయుల మధ్యనున్న “మిశ్రితజనము” వారితోపాటు కలసి, దైవీకంగా ఏర్పాటుచేసిన ఆహారమునుగూర్చి అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేవుని ఉగ్రతను గమనిస్తూ ప్రజలు, వారి అవసరతలను గూర్చిన బాధ్యతా భావంతో, మోషే ఈవిధంగా అన్నాడు: “ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము. నామీద నీకటాక్షము వచ్చిన పక్షమున నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.” (సంఖ్యాకాండము 11:1-15) యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? ఆయన “ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి డెబ్బదిమంది మనుష్యులను” నియమించి, మోషేతోపాటు కార్యనిర్వహణ పనిలో సరియైనవిధంగా భాగంవహించుటకు వారిపై తన ఆత్మను ఉంచాడు. (సంఖ్యాకాండము 11:16, 17, 24, 25) అటువంటి అర్హతకల్గిన మనుష్యులను నియమించుటతో, ఇశ్రాయేలీయులకును, “అనేకులైన అన్యజనుల సమూహమునకును,” సహాయము మరియెక్కువ అందుబాటులో ఉండేందుకు అనువైంది.—నిర్గమకాండము 12:38.

7, 8. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలులో యెహోవా యేవిధంగా “మనుష్యులను కానుకలుగా” దయచేశాడు? (బి) కీర్తన 68:18 యొక్క మొదటి శతాబ్దపు యే అన్వయింపు పౌలు చేశాడు?

7 ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలు వాగ్దానదేశంలో గడపిన పిమ్మట, యెహోవా సూచనార్థకంగా సీయోను పర్వతముపైకి ఆరోహణమై, దావీదు రాజుగానున్న ఒక ప్రత్యేక రాజ్యానికి యెరూషలేమును రాజధానిగా చేశాడు. “సర్వశక్తుడైన,” దేవుని స్తుతించుటలో, దావీదు తన స్వరాన్ని పెంచి ఈవిధంగా కీర్తించాడు: “నీవు ఆరోహణమైతివి; నీవు పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. నీవు మనుష్యులను కానుకలుగా తీసికొనియున్నావు.” (కీర్తన 68:14, 18 NW) నిజంగా, వాగ్దానదేశాన్ని జయించిన సందర్భంలో చెరపట్టబడిన మనుష్యులు లేవీయులకు వారి పనులలో సహాయంచేయుటకు ఉపయోగపడ్డారు.—ఎజ్రా 8:20.

8 సామాన్య శకము మొదటి శతాబ్దంలో, క్రైస్తవుడైన అపొస్తలుడైన పౌలు కీర్తనల గ్రంథకర్తయైన దావీదు మాటల ప్రవచన నెరవేర్పునకు దృష్టిని మళ్లించాడు. పౌలు ఇలా వ్రాశాడు: “అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరముయొక్క పరిమాణముచొప్పున కృపయియ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రిందిభాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైనవాడునై యున్నాడు.” (ఎఫెసీయులు 4:7-10) “తానే” అంటే ఎవరు? ఎవరో కాదు, యెహోవాకు ప్రతినిధి, గొప్ప దావీదును మెస్సీయ రాజైన యేసుక్రీస్తే. ఈయననే దేవుడు పునరుత్థానంచేసి, “అధికముగా హెచ్చించెను.”—ఫిలిప్పీయులు 2:5-11.

9. (ఎ) మొదటి శతాబ్దపు ఈవులను పొందిన మనుష్యులెవరైయున్నారు? (బి) ఆధునిక కాలపు ఈవులను పొందిన మనుష్యులెవరు?

9 అయితే, “ఈవులను పొందిన మనుష్యులు” (లేదా, “పొందికగానున్న మనుష్యులు”) ఎవరైయున్నారు? పౌలు వివరించిన విధంగా దేవుని ముఖ్య ప్రతినిధి, “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులగాను, కొందరిని ప్రవక్తలగాను, కొందరిని సువార్తికులగాను, కొందరిని కాపరులగాను ఉపదేశకులగాను నియమించెను.” (ఎఫెసీయులు 4:11, 12) అపొస్తలులగాను, ప్రవక్తలగాను, సువార్తికులగాను, ఉపదేశకులగాను సేవచేసిన యేసు అనుచరులంతా, దైవపాలనామార్గం క్రిందనే సేవచేశారు. (లూకా 6:12-16; అపొస్తలుల కార్యములు 8:12; 11:27, 28; 15:22; 1 పేతురు 5:1-3) మన కాలంలో, ఆత్మీయార్హత కల్గిన పెద్దలు పరిశుద్ధాత్మచే నియమింపబడి, ప్రపంచవ్యాప్తంగా 70,000 యెహోవాసాక్షుల సంఘాలలో అధ్యక్షులుగా సేవచేస్తున్నారు. వీరు మనకు మనుష్యులలో ఈవులుగా ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 20:28) ప్రపంచవ్యాప్త రాజ్యసువార్త పని అభివృద్ధి ఎక్కువగావడంతో, మరింత ఎక్కువమంది సహోదరులు “అధ్యక్ష పదవిని” ఆశిస్తూ, “అర్హులగుచున్నారు.” (1 తిమోతి 3:1) నియమింపబడిన పిదప, వారుకూడా ఈవులను పొందిన మనుష్యులగుదురు.

10. “అధికారులను” గూర్చి యెషయా చేసిన వర్ణన యేవిధంగా ఈనాటి క్రైస్తవ సంఘపెద్దల పాత్రకు సరిపడుతుంది?

10 రాజ్యపరిపాలనలో పరిపాలకులైన “అధికారుల” పాత్రనుగూర్చి ప్రవక్తయైన యెషయా ముందుగా ప్రవచిస్తూ చేసిన వర్ణనకు ఈ క్రైస్తవ పెద్దలు, లేదా ఈవులను పొందిన మనుష్యులు సరిపోతారు. ప్రతిఒక్కరూ “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండినచోట నీళ్లకాలువలవలెను, అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.” (యెషయా 32:1, 2) నియమింపబడిన ఈ మనుష్యుల ప్రేమపూర్వక కాపుదల ఎంత ఆశ్రయపూరితంగా వుండాలో యిది బయల్పరుస్తుంది. దీనినుండి యేవిధంగా పూర్తిస్థాయిలో మీరు ప్రయోజనం పొందగలరు?

చొరవ తీసుకొనుట

11. మనం ఆత్మీయంగా దిగజారినపుడు, ఏవిధంగా సహాయాన్నందుకోగలం?

11 మునిగిపోతున్న ఒక మనిషి సహాయంకొరకు స్వాభావికంగా అరుస్తాడు. దానిలో ఏవిధమైన సంకోచమూ లేదు. ప్రాణాపాయస్థితిలో నున్నప్పుడు, సహాయమర్థించుటకు మరొకరి పురికొల్పు అనేది అక్కర్లేదు. యెహోవానుండి సహాయంకొరకు దావీదు రాజు పదేపదే అర్థించలేదా? (కీర్తన 3:4; 4:1; 5:1-3; 17:1, 6; 34:6, 17-19; 39:12) ఆత్మీయంగా దిగజారినపుడు, ఒకవేళ నిరాశతో కృంగినప్పుడు, మనముకూడ అలాగే యెహోవాతట్టు తిరిగి ప్రార్థించెదము, పరిశుద్ధాత్మతో మనలను నడిపింపుమని వేడుకొంటాము. (కీర్తన 55:22; ఫిలిప్పీయులు 4:6, 7) మనం లేఖనాలనుండి ఓదార్పుకోసం ఎదురుచూస్తాము. (రోమీయులు 15:4) ప్రయోజనాత్మక సలహాకొరకు వాచ్‌టవర్‌ సొసైటి క్రైస్తవ ప్రచురణలను సంప్రదిస్తాము. తరచు యిది మన స్వంత సమస్యలను సరిచేసుకొనుటకు సహాయం చేస్తుంది. ఒకవేళ మనం కష్టాలలో మునిగిపోయినట్లుగా కనబడితే, నియమింపబడిన సంఘపెద్దల సలహానుకూడ పొందగలము. నిజానికి, మనం “సంఘపెద్దలను పిలువ” వలసిన అవసరతగల సందర్భాలుకూడ ఉండవచ్చును. క్రైస్తవపెద్దలను ఎందుకు పిలవాలి? ఆత్మీయావసరత గల్గినవారికి వారేవిధంగా సహాయాన్నందించగలరు?

12-14. (ఎ) ఒకడు జబ్బుపడినప్పుడు అనుసరించవలసిన వివేకమైన మార్గమేమిటి? (బి) యాకోబు 5:14 ప్రకారం, “రోగులైన” క్రైస్తవులు ఏమి చేయాలని సలహా యివ్వబడిరి? (సి) యేవిధమైన అనారోగ్యాన్ని గూర్చి యాకోబు 5:14 సూచిస్తుంది, మీరెందుకలా చెప్తారు?

12 మనము అనారోగ్యులమైనప్పుడు, శరీరం దానంతటదే ఆరోగ్యాన్ని పునఃస్థాపించడం కొరకు విశ్రాంతి తీసుకుంటాము. కాని మన వ్యాధి అలానే కొనసాగుతున్నట్లైతే, వివేకంగా మనం యోగ్యమైన వైద్యసహాయం పొందుతాము. మనం ఆత్మీయంగా బలహీనులమైతేకూడ అలాగే చేయవద్దా?

13 శిష్యుడైన యాకోబు ఈ విషయంలో మనకే సలహానిస్తున్నాడో గమనించండి. ఆయనిలా అంటున్నాడు: “మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను.” (యాకోబు 5:14) యాకోబు యిక్కడ యేరకమైన రోగమును ప్రస్తావిస్తున్నాడు? నూనె రాయడమనేది ఆకాలంలోవున్న సామాన్య వైద్యఅలవాటని తర్కిస్తూ, బైబిలు వ్యాఖ్యాతలు కొందరు యిది శరీరసంబంధ రోగమని నిర్ధారించారు. (లూకా 10:34) స్వస్థత అనే వరంద్వారా అద్భుతంగా బాగుచేయుట అనేది యాకోబు మనస్సునందున్నదని కూడా వారు నమ్ముతున్నారు. అయితే, దీని సందర్భవాక్యం దేనిని సూచిస్తుంది?

14 “సంతోషము” “శ్రమతో” భిన్నంగా చూపబడింది. యాకోబు ఆత్మీయ రోగాన్నిగూర్చి చర్చిస్తున్నట్లు యిది సూచిస్తుంది. (యాకోబు 5:13) వైద్యులు కానటువంటి లేదా స్వస్థపరచే వరములేనటువంటి “పెద్దమనుషులు” [సంఘపు పెద్దలు, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌] సహితం, పిలువబడవలసి యున్నారు. మరి వారేమి చేయవలసి యుండిరి? యాకోబు ఇలా చెప్పాడు: “వారు . . . అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును.” (యాకోబు 5:14, 15; కీర్తన 119:9-16 పోల్చండి.) స్వస్థతపొందునట్లు పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడని, యాకోబు ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఆయన ఆత్మీయరోగాన్నే ప్రస్తావిస్తున్నాడనేది చివరకు నిరూపించబడుచున్నది. ఆయనిలా వ్రాస్తున్నాడు: “మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి.” ఆత్మీయరోగానికి, గంభీరమైన పాపమే కారణమైతే, రోగగ్రస్తుడైన వ్యక్తి దేవునివాక్యంపై ఆధారపడిన ఉద్బోధకు అనుకూలంగా ప్రతిస్పదించి, పశ్చాత్తాపపడి, పాపపు జీవితంనుండి తిరిగినట్లయితేనే అతడు కోలుకొనుటకు ఎదురుచూడవచ్చును.—యాకోబు 5:16; అపొస్తలుల కార్యములు 3:19.

15. యాకోబు 5:13, 14 లో యేవిధమైన చర్య ప్రోత్సహించబడింది?

15 యాకోబు ఇస్తున్న సలహానుండి మరొకటి గుర్తించవలసి యున్నది. శ్రమననుభవిస్తున్నప్పుడు, ఒక క్రైస్తవుడు “ప్రార్థన చేయవలెను.” ఒకవేళ సంతోషము కల్గినట్లయితే, “అతడు కీర్తన పాడవలెను.” ప్రతీసందర్భంలోను—ఒక వ్యక్తి శ్రమననుభవిస్తున్నను లేదా సంతోషముతోనున్నను—చర్య తీసుకోవాల్సి వుంటుంది. ఒకవంక ప్రార్థన, మరొకవంక ఆనందమయ పలుకులు అవసరము. కాబట్టి, “మీలో ఎవడైనను రోగియై యున్నాడా?” అని యాకోబు అడుగుతున్నప్పుడు, మనం దేనికొరకు ఎదురు చూడాలి? మరలా ఆయన చొరవ తీసుకొనుమని, అవును, అనుకూలమైన పనిని సిఫారసుచేస్తున్నాడు. “అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను.”—కీర్తన 50:15; ఎఫెసీయులు 5:19; కొలొస్సయులు 3:16.

“సంఘపెద్దలు” ఎలా సహాయపడతారు

16, 17. బైబిలు సూత్రాలు పాఠించుటలో ఏవిధంగా పెద్దలు మనకు సహాయపడగలరు?

16 కొన్ని సమయాలలో మన వ్యక్తిగత పరిస్థితులకు బైబిలు నియమాలనెలా అన్వర్తించుకోవాలో తెలుసుకొనుట చాలా కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో సహాయమందించుటలో క్రైస్తవపెద్దలు అమూల్యమైన మూలం కాగలరు. ఉదాహరణకు, వారు రోగియై యున్నవానికొరకు ప్రార్థన చేసి, నేర్పుగా దేవునివాక్యం నుండి ఉపదేశమును అన్వర్తించడంద్వారా ‘ప్రభువు [యెహోవా] నామమున అతనికి నూనె రాయుదురు.’ ఆవిధంగా పెద్దలు మన ఆత్మీయతను పునరుద్ధరించుటకు తోడ్పడగలరు. (కీర్తన 141:5) తరచు, మనం సన్మార్గంలో ఆలోచిస్తున్నామాయని నిర్ధారించుకోవలసిన అవసరత ఉంది. విషయాలను గురించి అనుభవంగల క్రైస్తవ సంఘపెద్దతో మాట్లాడటం అనేది మంచి చేయాలనే మన నిశ్చయతను బలపరుస్తుంది.—సామెతలు 27:17.

17 దర్శించుమని కోరినపుడు, క్రైస్తవ సంఘపెద్దలు “నిరుత్సాహపడిన వారితో ఓదార్పుగా మాట్లాడవలసిన” అవసరతవుంది. వారు “బలహీనులకు ఊతమిచ్చి . . . అందరియెడల దీర్ఘశాంతముగలవారై” ఉంటారు. (1 థెస్సలొనీకయులు 5:14) “సంఘపెద్దలు,” “బలహీనుల” మధ్యనున్న వివేకంతోకూడిన, ఈ సన్నిహిత సంబంధం ఆత్మీయారోగ్యాన్ని తిరిగి పూర్తిగా పొందే సంభావ్యతను వృద్ధిచేస్తుంది.

వ్యక్తిగత బాధ్యత, ప్రార్థన

18, 19. గలతీయులు 6:2, 5 ఆధారంగా క్రైస్తవ సంఘపెద్దలు ఏపాత్రను వహించెదరు?

18 క్రైస్తవ సంఘపెద్దలు దేవుని మందయెడల తన బాధ్యతను స్వీకరించాలి. వారు బలపరచువారిగా ఉండాలి. ఉదాహరణకు, పౌలు ఇలా చెప్పాడు: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. ఒకని భారముల నొకడు భరించి యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.” అపొస్తలుడు యింకనూ ఇలా వ్రాశాడు: “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?”—గలతీయులు 6:1, 2, 5.

19 మనము ఒకరి భారము నొకడు భరిస్తూ, అదే సమయంలో మన స్వంత బరువు ఎలా భరించగలము? “భారము,” “బరువు” అని అనువదింపబడిన గ్రీకుపదాల భావాల్లోని భేదం దీనికి సమాధానం సమకూరుస్తుంది. ఒక క్రైస్తవుడు తనకు చాలా భారమైన ఆత్మీయ చిక్కులలోబడితే, క్రైస్తవ సంఘపెద్దలు, ఇతర తోటి విశ్వాసులు అతనికి సహాయమందించెదరు, తద్వారా తన “భారములను” అతనే మోసేటట్లు సహాయపడెదరు. అయినప్పటికి, ఒక వ్యక్తి, దేవునికి తన బాధ్యతల “బరువును” తానే మోయుటకు కోరబడుచున్నాడు.a ప్రార్థన, లేఖనపూరిత సలహా, మరియు ప్రోత్సహించుట ద్వారా క్రైస్తవ సంఘపెద్దలు వారి సహోదరుల “భారములను” ఆనందంగా మోసెదరు. అదేసమయంలో, మన వ్యక్తిగత ఆత్మీయ బాధ్యతల “బరువును” పెద్దలు తీసివేయరు.—రోమీయులు 15:1.

20. ప్రార్థననెందుకు నిర్లక్ష్యం చేయకూడదు?

20 ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, దానిని నిర్లక్ష్యం చేయరాదు. కాని ఆత్మీయంగా జబ్బుపడిన క్రైస్తవులు చాలామంది ప్రార్థించడం కష్టం. ఆత్మీయంగా వ్యాధిగ్రస్థుడైనవాని నిమిత్తం సంఘపెద్దలు విశ్వాససహితమైన ప్రార్థన చేసినప్పుడు, వారి ఉద్దేశ్యమేమి? నిరాశనుండి “ప్రభువు అతనిని లేవనెత్తుననియు,” నీతి, సత్యముతో కూడిన జీవితాన్ని వెంబడించుటకు శక్తిమంతుని చేస్తాడనియు వారి ఉద్దేశము. ఆత్మీయంగా జబ్బుపడిన ఒక క్రైస్తవుడు ఆవశ్యంగా ఏదో గంభీరమైన పాపం చేసియుండకపోవచ్చు కాని చెడుభావాలు కల్గియుండవచ్చు, ఎందుకంటే యాకోబు ఇలా చెబుతున్నాడు: “అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.” ఆత్మీయంగా బలహీనంగానున్న వ్యక్తి ఒకవేళ గంభీర పాపములను చేసినయెడల వాటిని ఒప్పుకొని, పశ్చాత్తాప భావాలను వ్యక్తం చేయుటకు పట్టుదలకల్గిన ప్రార్థనలతోకూడిన సంఘపెద్దల లేఖనానుసారమైన సలహా పురికొల్పుతుంది. ఇది, దేవునినుండి పాపక్షమాపణ కొరకు పునర్విచారించుటకు వీలవుతుంది.—యాకోబు 5:15, 16.

21. (ఎ) పెద్దలను పిలుచుటకు కొంతమంది క్రైస్తవులెందుకు విముఖతను చూపించెదరు? (బి) తరువాతి శీర్షికలో చర్చించేదేమిటి?

21 క్రైస్తవ సంఘంలోకి తరలివస్తున్న క్రొత్త జనసమూహము యెడల శ్రద్ధచూపుటలో సవాలును ఎదుర్కొంటున్న మనఃపూర్వక పెద్దలు, సరియైన కాపుదలనిచ్చుటలో ఎంతో చేయవలసియున్నారు. నిజంగా, ఈవులను పొందిన మనుష్యులు, ఈ అపాయకరమైన కాలంలో మనం ఓర్పు కల్గియుండుటకు సహాయంచేయుటలో యెహోవా మనకందించిన ఒక మంచి ఏర్పాటైయున్నారు. అయినను, ఈ సహోదరులు పనిలో మునిగి ఉంటారని, సమస్యలతో నిండిపోయారని తలంచుచూ క్రైస్తవులు కొందరు వారి సహాయాన్ని కోరుటకు వెనుకాడుతున్నారు. క్రైస్తవ సంఘంలో ఉపకాపరులుగా యిష్టపూర్వకంగా సేవచేస్తున్న వీరు, సహాయం చేయుటలో సంతోషిస్తున్నారనేదానిని మనం గుణగ్రహించుటకు దీని తరువాతి అంశం సహాయంచేస్తుంది. (w93 5/15)

[అధస్సూచీలు]

a ఫోర్‌షన్‌ అనేగ్రీకుపదాన్ని “ఒక వ్యక్తి మోయవలెనని నిర్ధారించిన బరువు” అని ఫ్రిట్స్‌ రెనెకర్‌ వ్రాసిన ఎ లింగ్విస్టిక్‌ కీ టు ది గ్రీక్‌ న్యూ టెస్టమెంట్‌ నిర్వచించింది. “ఒక మనిషికి సంబంధించిన మూట లేదా ఒక సైనికుని సామాను మూటకు సైన్యంలో ఉపయోగించే పదమని” కూడా ఇది చెబుతుంది.

మీరెలా సమాధానమిచ్చెదరు?

▫ మనకు సహాయమవసరమైనపుడు, ఎలాంటి మూడువిధాల సహాయకం యెహోవా దయచేయును?

▫ ఆధునిక కాలపు ఈవులను పొందిన మనుష్యులెవరు?

▫ మనం పెద్దలను ఎప్పుడు పిలువవలెను?

▫ మనం క్రైస్తవ సంఘపెద్దలనుండి ఏ సహాయాన్ని ఆశించవచ్చును?

[బాక్సు]

ప్రార్థన, బైబిలు అధ్యయనం, క్రైస్తవ సంఘపెద్దలనుండి సహాయం అనే ఆత్మీయ ప్రయోజనాలను మీరు అనుభవిస్తున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి