నాయకులుగా ఉన్నవారికి విధేయులై యుండుడి
“మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్కఒప్పజెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు, గనుక వారి మాటవిని వారికి లోబడియుండుడి.”—హెబ్రీయులు 13:17.
1. క్రైస్తవ పైవిచారణకర్తల సేవనుండి మనమెట్లు ప్రయోజనం పొందుచున్నాము?
యెహోవా తన సంస్థ కొరకు ఈ “అంత్యదినములలో” కాపరులను ఏర్పాటుచేశాడు. (దానియేలు 12:4) వారు గొర్రెలాంటివారిని కాయుటలో నాయకత్వం వహిస్తున్నారు మరియు వారి పైవిచారణ ఊరటకలిగించునదిగా వున్నది. (యెషయా 32:1, 2) అంతేగాక, దేవుని మందను కనికరముతో కాయు పెద్దల ప్రేమపూర్వక పైవిచారణ, సాతానునుండి ఈ దుష్ట విధానమునుండి రక్షణ కల్పిస్తుంది.—అపొ.కార్యములు 20:28-30; 1 పేతురు 5:8; 1 యోహాను 5:19.
2. కొందరు పౌలునెట్లు భావించారు, కాని పెద్దలయెడల ఎటువంటి స్వభావాన్ని కనబరచుట యుక్తము?
2 నీవు పెద్దలను ఎట్లు దృష్టించుచున్నావు? నీ హృదయములో నీవిలా అనుకుంటున్నావా: ‘నాకేదైనా సమస్య వస్తే ఈ సంఘములో ఏ పెద్దను సమీపించను, ఎందుకంటే నా కెవరిమీద నమ్మకం లేదు’? నీవలాగు తలంచుచునట్లయితే నీవువారి అసంపూర్ణతను యింకా బహిర్గతం చేస్తున్నావేమో? పూర్వం కొరింథు సంఘములో అపొస్తలుడైన పౌలునుగూర్చి కొందరిట్లన్నారు: “అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవిగాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగం కొరగానిది.” అయిననూ, దేవుడు పౌలును పరిచర్య నిమిత్తం నియమించి, ఆయనను “అన్యులకు అపొస్తలునిగా” వుపయోగించుకున్నాడు.(2 కొరింథీయులు 10:10; రోమీయులు 11:13; 1 తిమోతి 1:12) కావున, ఒక సహోదరి చెప్పినట్లే నీవును వారినిగూర్చి భావించాలని నిరీక్షిస్తాం: “మాకు లోకంలో ఎక్కడను లేనంత ఉత్తమమైన పెద్దల సభవుంది. అవసరమైనప్పుడు మాకు సహాయం చేయుటకే వారిక్కడున్నారు.”
వారికెందుకు లోబడవలెను?
3. ప్రభువు మన ఆత్మతో వున్నట్లయితే మనం క్రైస్తవ ఉపకాపరులను ఎట్లు చూడాలి?
3 క్రైస్తవ ఉపకాపరులను యెహోవా దేవుడే ఏర్పాటు చేసియున్నందున, వారినిగూర్చి మనమేమనుకోవాలని ఆయన కోరుకుంటాడు? నిశ్చయంగా, యెహోవా సాక్షులయొక్క పరిపాలక సభ ఆధ్వర్యంక్రింద నున్న ఈ ప్రేమగల కాపరులు ఇచ్చే బైబిలు-ఆధారిత నడిపింపును అనుసరించాలని దేవుడు మనలను కోరుచున్నాడు. అప్పుడు ‘ప్రభువు ఆత్మ మనకు తోడుగా వుండును’ గనుక మనకు శాంతి లభించును, మనం ఆత్మీయంగా క్షేమాభివృద్ధినొందెదము.—2 తిమోతి 4:22; అపొ.కార్యములు 9:31; 15:23-32.పోల్చుము
4. హెబ్రీయులు 13:7 మనమెట్లు వ్యక్తిగతంగా వర్తింపజేసుకోవాలి?
4 పౌలు ఇట్లు ఉద్భోదించాడు: “మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా వుండినవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” (హెబ్రీయులు 13:7) తొలి క్రైస్తవులలో, ముఖ్యంగా అపొస్తలులు నాయకత్వం వహించారు. ఈనాడు పరిపాలక సభ సభ్యులను ఇతర అభిషేక కాపరులను మనలో నాయకత్వం వహించు “గొప్ప సమూహమునకు” సంబంధించిన పురుషులను శ్రద్ధగా గమనించవచ్చును. (ప్రకటన 7:9) మనం వారి స్వరాన్ని, తీరును, లేదా ఇతర మానవ లక్షణాలను అనుకరించుమని చెప్పక పోయిననూ వారి విశ్వాసమును అనుసరించి మన ప్రవర్తన మార్చుకొనగలం.
5. భూమిపై ఈనాడు క్రైస్తవ సంఘ ముఖ్యబాధ్యతను ఎవరిపైవుంచారు, దేనికి వారర్హులు?
5 భూమిపై ఈనాడు మన ఆత్మీయావసరతలను తీర్చే బాధ్యత ముఖ్యంగా “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసునికి” అప్పగించబడినది. ఆ దాసుని ప్రతినిధియైన పరిపాలక సభ లోకమంతట జరుగు రాజ్య ప్రచారపు పనిలో నాయకత్వం వహిస్తు నిర్వహిస్తువుంది. (మత్తయి 24:14, 45-47) విశేషంగా ఈ ఆత్మాభిషేకమునొందిన పెద్దలను ఆత్మీయ పాలకులుగా పరిగణించవచ్చును ఏలయనగా హెబ్రీయులు 13:7 ను ఇలా తర్జుమా చేయవచ్చును: “మిమ్ములను పాలించు . . . వారిని జ్ఞాపకముంచుకొనుడి.” (కింగ్డం ఇంటర్లీనియర్) 40,17,000 మంది రాజ్యప్రచారకులతో 63,000 కంటే అధికంగా వున్న సంఘాలను పాలించుటకు 12 మంది పెద్దలతో కూడిన పరిపాలక సభకు ‘ప్రభువు కార్యములో సమృద్ధిగా పనివున్నది.’ (1 కొరింథీయులు 15:58) దేవుడొసంగిన వారి పని దృష్ట్యా, మొదటి శతాబ్దంలోని పరిపాలక సభకు తొలి క్రైస్తవుల సహకారమున్నట్లే, వారు మన సంపూర్ణ సహకారం పొందనర్హులు.—అపొ.కార్యములు 15:1, 2.
6. యెహోవా ప్రజల ప్రయోజనాల నిమిత్తము పెద్దలు చేసిన కొన్ని పనులేమిటి?
6 సంఘ ఆత్మీయావసరాలు తీర్చడానికి కాపరులు ఆత్మచే నియమింపబడియున్నారు. (అపొ.కార్యములు 20:28) వారు స్థానిక సంఘములో రాజ్యప్రచారం జరుగునట్లు చూస్తారు. ఈ లేఖనారక్షతలుగల పురుషులు ప్రేమపూర్వకంగా ఆత్మీయ నడిపంపుకూడ అందిస్తారు. తమ ఆత్మీయ సహోదరీ సహోదరులకు వారు బోధిస్తూ, ఓదార్చి, సాక్ష్యమిస్తూ వీరును దేవుని దృష్టిలో యోగ్యప్రవర్తనులై నడుచుకొనునట్లు సహాయపడతారు. (1 థెస్సలొనీకయులు 2:7, 8, 11, 12) ఒకడు తానెరుగకనే తప్పులో పడితే వీరు అతనిని “సాత్వికముతో” మంచి దారికి మళ్లించుటకు ప్రయత్నిస్తారు.—గలతీయులు 6:1.
7. హెబ్రీయులు 13:17 లో పౌలు ఏ సలహా ఇచ్చాడు?
7 అట్టి ప్రేమగల కాపరులకు మనం సహకరించుటకు మన హృదయాలు ప్రేరేపిస్తున్నవి. ఇది యుక్తమే, పౌలు ఇలా వ్రాశాడు: “మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలిసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతోకాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీయులు 13:17) ఈ సలహాను మనమెట్లు గ్రహించాలి?
8, 9. (ఎ) హెబ్రీయులు 13:17 దృష్ట్యా, నాయకత్వం వహించేవారికి మనమెందుకు విధేయులమై వుండాలి? (బి) మన విధేయత, అణకువ ఎటువంటి సత్ఫలితాలిస్తుంది?
8 మనలను ఆత్మీయముగా పాలించే వారికి మనం విధేయులమై యుండాలని పౌలు కోరుచున్నాడు. మనం “విధేయులమై” ఈ ఉపకాపరులకు లోబడియుండాలి. ఎందుకు? ఎందుకనగా దేవుని సమర్పించుకొన్న మన జీవితాలను లేక మన ‘ఆత్మలను వీరు కాయుచున్నారు.’ వారెలా “కాయుచున్నారు”? ఇచ్చటవున్న గ్రీకులోని ఆగ్రునియో అను వర్తమాన సకర్మక క్రియా సూచక ప్రకారం పెద్దలు “నిద్రపోవుటలేదు” అని అక్షరార్థమైన భావం. కాపరి రాత్రిపూట తన మందను కాపాడుటకు నిద్రమానుకుంటాడనే నగ్నసత్యాన్నిది మనకు జ్ఞాపకం చేస్తుంది. తోటి విశ్వాసులకు ఆత్మీయ సహాయం చేయుటకొరకు లేదా దేవునిమంద యెడల ప్రార్థనాపూర్వక శ్రద్ధచూపుటకు పెద్దలు కొన్నిసార్లు నిద్రలేని రాత్రులను గడిపెదరు. వారి యథార్థమైన సేవను మనమెంత బాగా ప్రశంసించాలి! నిశ్చయంగా, మనం యూదా కాలంలోని “భక్తిలేని వారివలె” వుండ కోరకూడదు. వారు దేవుడొసంగిన మహిమ లేక ఘనతనొందిన అభిషక్త క్రైస్తవులను, అధికారాన్ని నిరాకరించుచు, మహాత్ములను దూషించిరి.—యూదా 3, 4, 8.
9 మనం క్రైస్తవ పెద్దలకు విధేయులై, లోబడకపోతే అది యెహోవాకు ఇష్టముండదు. ఇది వారికి భారంగా వుంటుంది, మనకు ఆత్మీయ హాని కలిగిస్తుంది. మనం సహకరించకపోతే, పెద్దలు దుఃఖముతో వారిపనులను నిర్వహించవలసి వచ్చును, బహుశ మనకు క్రైస్తవ పనులలో సంతోషం కలుగనంతటి నిరుత్సాహం వారికి రావచ్చును. అయితే, మన విధేయత అణకువ, దైవభక్తిని పెంచి మన విశ్వాసమును బలపరచును. ‘మనం విత్తే ఆత్మకు ప్రభువు తోడుగా వుంటాడు,’ మరియు అట్టి సహకార, శాంతి, ఐక్యతలో ఆనందం పెల్లుబుకుతుంది.—2 తిమోతి 4:22; కీర్తన 133:1.
10. మొదటి తిమోతి 5:17 ప్రకారం బాగుగా పాలనచేయు వారెందుకు సన్మానమునకు పాత్రులైవున్నారు?
10 సంఘ పెద్దలకు మనం విధేయులమై, లోబడియున్నంత మాత్రమున మనుష్యులను ప్రీతిపరచే వారమని అర్థంకాదు. ఆలాగైతే అది లేఖనానుసారమైనది కాదు, ఎందుకంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారి యజమానులకు విధేయులై యుండవలెనని “మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడవలెనని కాక యెహోవాకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై” యుండాలని ఉపదేశించబడిరి. (కొలొస్సయులు 3:22; ఎఫెసీయులు 6:5, 6) ‘బాగుగా పాలనచేయుచు విశేషముగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు పెద్దలు సన్మానారక్షులు ఎందుకంటే ముఖ్యంగా వారి బోధ దేవుని వాక్యంపై ఆధారపడివున్నది. అపొస్తలుడైన పౌలు ఇట్లు వ్రాశాడు: “బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు ‘నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు.’”—1 తిమోతి 5:17, 18.
11. ఒక పెద్దకు “రెట్టింపు సన్మానము” ఎలా కలుగుతుంది, అయితే అతడు దేనిని విసర్జించాలి?
11 పైన తెల్పిన పౌలు మాటలు ఇతరుల ఆత్మీయావసరతలనుచూచే వారికి వస్తుదాయక సహాయం చేయుట యుక్తమేనని సూచిస్తున్నవి. అయిననూ, పెద్దలు జీతం పుచ్చుకోవాలని దీని అర్థంకాదు. మరి “రెట్టింపు సన్మానమును” పెద్దలు గుంజుకునేదేమి కాదు. సంఘసభ్యులు ఇష్టపూర్వకంగా ఇచ్చే సన్మానమది గాని అధికారాన్ని లేక వస్తు సంపదను పొందటానికి అతడు తన స్థానాన్ని దుర్వినియోగం చేయకూడదు. అతడు తన స్వంత మహిమకొరకే పాటుపడకూడదు లేక ఆర్ధిక ప్రయోజనం కొరకు అధిక ధనవంతుల వెంట తిరుగుతూ ఇతరులను అలక్ష్యపరచకూడదు. (సామెతలు 25:27; 29:23; యూదా 16) బదులుగా, కాపరి దేవుని మందను ‘ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోగాక, సిద్ధమనస్సుతో’ కాయవలెను.—1 పేతురు 5:2.
12. దేనిని జ్ఞాపకముంచుకొనుట వలన మనకు నాయకత్వము వహించువారికి విధేయులగుటకు మనకు సహాయపడును?
12 దేవుడే పెద్దలనేర్పాటుచేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నాయకత్వంవహించే వారికి మనం విధేయులమై గౌరవించగలం. (ఎఫెసీయులు 4:7-13) ఈ పురుషులు ఆత్మచే నియమించబడి యున్నందుననూ, దేవుని సంస్థ యెహోవా సాక్షుల జీవితాల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నందువల్లను నిశ్చయంగా మనం దైవపాలనా ఏర్పాటుకు కృతజ్ఞలమై దాన్ని గౌరవించుటకు కోరుకొనాలి. అదియునుగాక, మనలో నాయకత్వం వహించువారికి విధేయతచూపి లోబడి యుండుటలో మనం శ్రేష్ఠమైన మాదిరిని చూపితే క్రొత్తవారును అట్టి అభిప్రాయాన్నే వృద్ధి చేసికొనుటకు సహాయపడగలం.
వారి సేవలనెందుకు మెచ్చుకోవాలి
13. (ఎ) నాయకత్వం విషయంలో లోకానికి, దేవుని సంస్థకు తేడా ఏమిటి? (బి) మనలో నాయకత్వం వహించు పురుషుల యెడల దృఢనమ్మకముంచుటకు ఎటువంటి బలమైన కారణములు మనకున్నవి? (సి) ప్రయాసపడి సేవచేసే పెద్ద అసంపూర్ణతలను బహిర్గతం చేసే బదులు మనమేమిచేయాలి?
13 లోకంలో, నాయకత్వాన్ని తిరస్కరించే ధోరణి వుంది. ఒకానొక లెక్చరర్ ఇలా అన్నాడు: “విద్య ఎంతవరకు ఎదిగిందంటే అనుచరులు నడిపించబడుటకు అసాధ్యమైనంత క్లిష్టస్థితికి దిగజారిపోయారు.” అయితే దేవుని సంస్థలో స్వతంత్రతా భావనకు తావేలేదు. మనలో నాయకత్వం వహించే పురుషుల యెడల నమ్మకముంచుటకు మనకు పఠిష్టమైన కారణాలున్నవి. ఉదాహరణకు, లేఖనారక్షతలుగల వారే పెద్దలుగా నియమించబడతారు. (1 తిమోతి 3:1-7) వారు దయ, ప్రేమ, సహాయ సహకారములు చూపువారిగా తర్ఫీదునొందారు. అయినను యెహోవా నీతి నియమాలను గట్టిగా చేపట్టువారై వుంటారు. పెద్దలు లేఖనమందలి సత్యమును హత్తుకొని ‘హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువారునై’ యున్నారు. (తీతు 1:5-9) మనం వారి మానవ అసంపూర్ణతలను బహిర్గతం చేయకూడదు, ఎందుకంటే మనమంతా అసంపూర్ణులమే. (1 రాజులు 8:46; రోమీయులు 5:12) వారికున్న హద్దులను చూచి, వారి సలహాను తేలికగా తీసుకొని బాధపడే బదులు, పెద్దలిచ్చే బైబిలు-ఆధారిత నడిపింపు దేవునినుండియే వస్తుందని అంగీకరించి అభినందించెదము.
14. మొదటి తిమోతి 1:12 దృష్ట్యా తన కప్పగింపబడిన పరిచర్యనుగూర్చి ఒక పెద్ద ఎటువంటి దృష్టిని కనబరచాలి?
14 ప్రశంసించే వ్యక్తిగా పౌలు ఇలా అన్నాడు: “నన్ను పరిచర్యకు నియమించి, నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనైయున్నాను.” (1 తిమోతి 1:12) ఆ పరిచర్య లేక సేవయందు, ప్రచారపుపని, తోటి విశ్వాసులకు చేసే సేవ ఇమిడివుంది. పైవిచారణకర్తకు కాపరిగా సేవ చేసేపని పరిశుద్ధాత్మవలన కలిగినప్పటికిని అతడు ఇందుమూలముగా ఇతరులకంటె తాను గొప్పవాడని భావించకూడదు, ఏలయనగా గొర్రెలాంటి దేవుని మందలో తాను కూడా ఒకడు. (1 పేతురు 5:4) బదులుగా, దేవుని మంద సభ్యులను కాయుటకు తనను యోగ్యునిగా ఎంచినందుకు వాస్తవానికతడు సంఘ శిరస్సైన యేసుకు, మరియు తెలివి, జ్ఞాన వివేచనలను ప్రసాదించి తనను అర్హునిగా చేసిన దేవునికిని కృతజ్ఞుడై యుండవలెను. (2 కొరింథీయులు 3:5) ఒక పెద్ద తనకు దేవుడిచ్చిన ఆధిక్యతల నిమిత్తము కృతజ్ఞుడై యుండుటకు హేతువున్నందువలన సంఘమందలి ఇతర సభ్యులు అతని పరిచర్యను లేక సేవను అభినందించాలి.
15. మొదటి థెస్సలొనీకయులు 5:12, 13 నందలి పౌలు సలహాయొక్క సారాంశమేమిటి?
15 యెహోవా సాక్షులు ఈ అంత్యదినాలలో దేవుడేర్పాటు చేసిన సంస్థ కొరకు కృతజ్ఞులైవున్నారు, ఆ అభినందనే మనం పెద్దలను గౌరవించుటకు పురికొల్పుతుంది. వారు మన ప్రయోజనాల కొరకు చేసే ఏర్పాట్లకు మన పూర్తి సహకారాన్ని అందించుటకు మనం సంతోషించాలి. పౌలు ఇట్లనెను: “సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము.” (1 థెస్సలొనీకయులు 5:12, 13) ఈ సలహా పాటించుటవల్ల సంతోషం మరియు యెహోవా దీవెనలు కలుగును.
సలహాను పాటించుటకు వేగిరపడుము
16, 17. వివాహాన్నిగూర్చి పెద్దలెటువంటి సలహా ఇవ్వవచ్చును, మరియు దాన్ని పాటించినందువలన ప్రయోజనమేమి?
16 “సంపూర్ణాధికారముతో హెచ్చరించుచూ, ఖండించుచునుండుము” అని పౌలు తీతుకు ఉపదేశించాడు. (తీతు 2:15) అదేవిధంగా, ఈనాడు దేవుని ప్రతినిధులు మనల్ని బైబిలు సూత్రాలు, చట్టాలయొద్దకు నడిపిస్తున్నారు. యెహోవా సంస్థ మరియు నియమిత పెద్దలు ఇచ్చే నడిపింపును, సలహాను పాటించవలెనను పలుమారులిచ్చు హెచ్చరికను అంగీకరించుటకు బలమైన కారణాలున్నవి.
17 ఉదాహరణకు: “ప్రభువునందే” పెండ్లిచేసికొనవలెనని పెద్దలు క్రైస్తవున్ని ఉపదేశిస్తారు. (1 కొరింథీయులు 7:39; ద్వితీయోపదేశకాండము 7:3, 4) సొలొమోను రాజు అన్యస్త్రీలను వివాహమాడినందున అన్యదేవతలనారాధించి, యెహోవాకు దూరమై గొప్ప పాపముచేసినట్లే, బాప్తిస్మము పొందని వారిని వివాహమాడితే తీవ్ర సమస్య నెదుర్కొనవలసి వస్తుందని వారు చెప్పవచ్చును. (1 రాజులు 11:1-6) ఎజ్రా, యూదులు తమ అన్యస్త్రీలను విసర్జించునట్లు చేసాడనియు, అవిశ్వాసులను వివాహమాడువారు ‘దేవునికి విరోధముగా పాపము గొప్పకీడు చేయుచున్నారని,’ నెహెమ్యా చెప్పాడనియు పెద్దలు వివరించవచ్చును. (నెహెమ్యా 13:23-27; ఎజ్రా 10:10-14; ది వాచ్‌టవర్, మార్చి 15, 1982 పు. 31; నవంబరు 15, 1986 పు. 26-30 చూడండి.) ప్రేమగల పెద్దలిచ్చే అట్టి లేఖనానుసారమైన సలహాను పాటించుట వలన యెహోవాను ప్రీతిపరచుచున్నామనే తృప్తి, దీవెన కలుగుతుంది.
18. మొదటి కొరింథీయులు 5:9-13 నందు పౌలు వ్రాసిన దాన్ని పరిశీలించిన మీదట, మన కుటుంబ సభ్యులొకరు వెలివేయబడితే మనమెట్లు స్పందించాలి?
18 పెద్దల న్యాయ నిర్ణయాలను గౌరవించుటకూడ సరియైనదే. పౌలు కొరింథు సంఘముతో “సహోదరుడన బడినవాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయివున్న యెడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని” చెప్పాడు. వారు ఆ ‘దుర్మార్గుని వారిలోనుండి వెలివేయవలసి’ యుండిరి. (1 కొరింథీయులు 5:9-13) కాని నీ బంధువులొకరు వెలివేయబడితే నీవేమి చేస్తావు? కుటుంబ విషయములలో నామ మాత్రపు సంబంధమే వుంటుందిగాని వెలివేయబడిన బంధువులతో సహవాసమంతటిని తెంచుకోవాల్సివస్తుంది. (ది వాచ్‌టవర్ ఏప్రిల్ 15, 1988 పు. 26-31 చూడండి.) నిశ్చయంగా, దేవునికి మరియు ఆయన సంస్థకు యథార్థత మూలంగా మనం పైవిచారణకర్తల న్యాయనిర్ణయాలను గౌరవించాలి.
19. మనం ఆత్మీయంగా తప్పుదారిలో పడ్డామని పెద్దలు మనకు చూపిస్తే మనమేమి చేయాలి?
19 జీవానికి నడుపు ఇరుకు మార్గంలో నిలద్రొక్కుకొనివుండుట అంత సులభమేమీ కాదు. అలా వుండాలంటే మనం, దేవుని వాక్యంలో ఇవ్వబడిన నడిపింపును, తన సంస్థలో కాపుదల బాధ్యతలుగల వారిచ్చే సలహాలను అనుసరించాలి. (మత్తయి 7:13, 14) మనం ఒక పట్టణంనుండి మరోవూరికి ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పుదారిలో వెళ్తే మన మార్గాన్ని మార్చుకొనే అవసరముంది. లేకపోతే, మన గమ్యాన్ని ఎన్నటికిని చేరలేము. ఆలాగే బహుశ అవిశ్వాసితో సహవసిస్తూ వున్నందుకు, మనం ఆత్మీయంగా తప్పు మార్గంలో వున్నామని పెద్దలు మనకు చూపిస్తే, వెంటనే మనం వారిచ్చిన లేఖనానుసారమైన సలహాను పాటించాలి. మనం నిజంగా “యెహోవాయందు నమ్మిక యుంచివున్నామని” చూపుటకిదొక మార్గమై వుండును.—సామెతలు 3:5, 6.
చిన్న విషయాల్లోకూడ గౌరవం చూపండి
20. మనకు మనము ఏ ప్రశ్నలు ప్రశ్నించుటద్వారా చిన్న విషయాలలో సహితం పెద్దల నడిపింపునకు గౌరవమిచ్చునట్లు మనకు సహాయపడును?
20 చిన్న విషయాల్లోకూడ మనం పెద్దల నడిపింపునకు గౌరవమివ్వవలసిన అవసరముంది. గనుక మనమిట్లు ప్రశ్నించుకోవచ్చును: ‘రోగులను దర్శించవలెనని లేదా ప్రాంతీయ పరిచర్యలో క్రొత్తవారికి తర్ఫీదునివ్వవలెనని పెద్దలు నాకు చెబితే నేను వారికి సహకరిస్తున్నానా? కూటములలో ప్రసంగాలిస్తే వెంటనే అంగీకరించి, బాగాసిద్ధపడతానా? సమావేశాల్లో సీట్లను కేటాయించుకొను విషయంలోను, దుస్తులు ధరించే విషయములోను మరి ఇతర వాటిని గూర్చియు పెద్దలిచ్చు నిర్దేశములను వింటున్నానా? రాజ్యమందిరాన్ని శుభ్రంచేయాలని, ప్రాంతీయ సేవా రిపోర్టును సకాలంలో ఇవ్వాలని, లేక కూటములకు సరిగ్గా సమయానికి రావాలని వారడిగితే నేను సహరిస్తున్నానా?
21. పెద్దలయెడల మనం చూపు గౌరవం, యేసుచెప్పిన ఏ మాటలను మనకు జ్ఞాపకమునకు తెచ్చును?
21 సంఘ పైవిచారణకర్తలు మన సహకారాన్ని మెచ్చుకుంటారు, ఇందువల్ల చాలామంచి జరుగుతుంది. నిజానికి, చిన్న విషయాల్లో మనమిచ్చే గౌరవసహకారాలు యేసు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చును: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా వుండువాడు ఎక్కువలోను నమ్మకముగా వుండును.” (లూకా 16:10) నిశ్చయంగా మనం నమ్మకస్థులమని లెక్కించబడగోరెదము.
ప్రేమగల కాపుదలకు స్పందిస్తునే వుండుడి
22. నమ్మకమైన దాసుడు, సంఘ పెద్దల ప్రేమగల కాపుదలనుండి కలుగు కొన్ని ప్రయోజనాలేవి?
22 నమ్మకమైన దాసుని మరియు సంఘపెద్దల ప్రేమాపూర్వక కాపుదల మూలంగా యెహోవా గొప్ప దీవెన తన భూలోక సంస్థపైనున్నదని రుజువగుచున్నది. అదియునుగాక, పెద్దల నిపుణతగల నడిపింపు వారి సామర్థ్యములను కలబోసి మనలో ఐక్యతను వృద్ధిచేస్తుంది. అది రాజ్యాసక్తులను వ్యాపింపజేయుటకు గట్టి జయప్రదమగు ప్రయత్నము చేయులాగున తోడ్పడుతుంది. నిజానికి, నాయకత్వం వహించే వారి కాపుదలకు అభినందనాపూర్వక ప్రతిక్రియ వలన కలిగే ఒక ప్రతిఫలమును గమనిస్తే దేవుడు మన ప్రచారాన్ని, శిష్యులనుగా చేసే పనిని దీవిస్తున్నాడని అర్థమవుతుంది. (మత్తయి 28:19, 20) పెద్దలకు మనమిచ్చే సహకారం, నూతన విధానంలో పొందే నిత్యజీవానికికూడ మనల్ని సిద్ధంచేస్తుంది.
23. మొదటి యోహాను 5:3 ప్రకారం, మనమేమి చేయుటకు పురకొల్పబడవలెను?
23 మనం యెహోవాను ప్రేమిస్తాము, గనుక ఆయనకు విధేయులమగుటకు అసంతోషకరమైన పనేమి కాదు. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాసాడు: “మన మాయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) యథార్థ క్రైస్తవులు సంతోషంగా యెహోవా ఆజ్ఞలు గైకొంటారు, ఆయనెవరికి సంఘకాపుదల బాధ్యతనప్పగించాడో వారితో వీరు సహకరిస్తారు. దేవుని సంస్థలో వుండుటకు అట్టి “మనుష్యులకు ఈవులను” కలిగియుండుటకు కృతజ్ఞులమై యున్నాము! (ఎఫెసీయులు 4:8) కాబట్టి, దేవుడు తన ప్రజల్ని నడిపిస్తున్నాడనే దృఢనమ్మకముతో యెహోవా సాక్షులలో నాయకత్వం వహించే ఆధిక్యతగలవారికి ఎల్లప్పుడు విధేయులమై యుందాము. (w89 9/15)
నీ వ్యాఖ్యానములు ఏమిటి?
◻ మనలో నాయకులైన వారికి ఎందుకు విధేయులై యుండాలి?
◻ ప్రయాసపడే పెద్దలందించే సేవ విషయంలో ఎటువంటి స్వభావాన్ని మనం వ్యక్తపరచాలి?
◻ పెద్దల సలహానెందుకు వెంటనే పాటించాలి?
◻ ప్రేమగల కాపుదలకు మన ప్రశంసతోకూడిన ప్రతిస్పందనవలన ఎటువంటి ప్రయోజనములు కలుగును?
[26వ పేజీలోని బాక్సు]
కూటములలో భాగం వహించుటద్వారా, రాజ్యమందిరాన్ని శుభ్రంచేయుటకు సహాయపడుటద్వారా నీ ప్రాంతీయసేవను సకాలములో రిపోర్టుచేయుటద్వారా, మరి ఇతర పనులద్వారా పెద్దలకు సహకరిస్తావా?
[25వ పేజీలోని చిత్రాలు]
పౌలు సువార్త ప్రకటించుటకును, తోటివిశ్వాసులకు సేవచేయుటలో సంతోషించాడు. పెద్దగా, నీవు దేవుడిచ్చిన సేవాధిక్యతకు కృతజ్ఞుడవై యుంటావా?