దేవుని వాక్యాన్ని అమ్ముకొనువారు కాదు
“మేము మా పరిచర్యను డబ్బుకు అమ్ముకున్నాము.” పందొమ్మిది వందల తొంభై ఒకటి చివరి భాగంలో, అమెరికన్ టెలివిజన్ సువార్తికుల పరిశోధనాత్మక నివేదికలో పరిచయం చేయబడిన ఒక మాజీ “టెలిఫొన్ ప్రార్థనా పరిచారకుడు” ఆ మాటలన్నాడు.
ఈ కార్యక్రమం అమెరికాలోని మూడు టెలివిజన్ సువార్త సంస్థలపై దృష్టినిల్పింది. కేవలం ఈ మూడు సంస్థలే ప్రతి సంవత్సరం ప్రజలనుండి లక్షలకు లక్షల డాలర్లు కాజేస్తున్నవని అది వెల్లడించింది. “లాఘవంగా విరాళాలు సేకరించే కర్మాగారమని” వాటిలోని ఒక “సంస్థ” వర్ణింపబడింది. అవన్నియు అనేక మోసాలలో ఇరుక్కున్నవి. ఇది నిన్ను దిగ్భ్రాంతి పరుస్తున్నదా?
మతము నిశిత పరిశీలన క్రింద ఉన్నది
టెలివిజన్ సువార్త పనినే కాదు, సైద్ధాంతిక, గోడమీది పిల్లివంటి మతాలను కూడ ప్రభుత్వాలు, ప్రయివేటు అపరాధ పరిశోధక సంస్థలు, సాధారణ ప్రజానీకం ఒక కంట కనిబెడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో చర్చి స్టాక్ సర్టిఫికేట్లు, మతసంబంధంగా ఆర్థిక మద్దతుపొందిన రాజకీయాసక్తులు, ఎక్కువ జీతాలందుకునే మతనాయకుల ఆడంబర జీవితాలు, వాటి నిజానిజాలను గూర్చిన ప్రశ్నలను లేవదీస్తున్నవి.
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు వర్ణించిన శ్రేష్ఠమైన క్రైస్తవ పరిచర్య వర్ణనకు మతనాయకులు ఎట్లు సరితూగుచున్నారు? ఆయనిలా వ్రాశాడు: “మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు (అమ్ముకొను NW) అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము.” (2 కొరింథీయులు 2:17) ఈనాడు అట్టి వర్ణనకు ఎవరు సరిపోతున్నారు?
విషయాల్ని తరచి చూచుటకు నీకు సహాయపడేందుకు, పౌలు ఆయన సహవాసుల క్రైస్తవ పరిచర్యకు ఆర్థిక మద్దతు ఎలా లభించిందో మనం నిశితంగా పరిశీలిద్దాము.
మొదటి శతాబ్దపు ప్రయాణ ప్రచారకులు
సంచార ప్రచారకునిగా, పౌలు సాటిలేని వాడేమి కాదు. ఆ కాలంలో అనేకులు తమ మతాన్ని, తత్వాన్ని గూర్చిన అభిప్రాయాలను వ్యాప్తిచేయుటకు దేశసంచారం చేసేవారు. బైబిలు రచయితయగు లూకా “దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులను” గూర్చి మాట్లాడాడు. (అపొ. కార్యములు 19:13) పరిసయ్యులను ఖండిస్తూ యేసు ఇంకను యిలా అన్నాడు: “ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు.” (మత్తయి 23:15) యేసు స్వయంగా ఒక ప్రయాణ పరిచారకుడై యుండెను. యూదయ, సమరయలలోనే కాదు “భూదిగంతముల వరకును” ప్రకటించుట ద్వారా తనను అనుకరించుటకు ఆయన తన అపొస్తలులకు, శిష్యులకు శిక్షణనిచ్చాడు.—అపొ. కార్యములు 1:8.
వారి ప్రయాణాలలో, యేసు అనుచరులు యూదాయేతర ప్రచారకులను కలుసుకొన్నారు. ఏథెన్సులో, పౌలుకు ఎపికూరీయుల, స్తోయకుల తత్వవేత్తలు కలిశారు. (అపొ. కార్యములు 17:18) రోమా సామ్రాజ్యమంతటిలో, మతభిక్షువులు ఉద్రేకపూరిత ప్రసంగాల ద్వారా వత్తిడితేవడాన్ని అభ్యసించేవారు. ఐసిస్ మరియు సెరాపిస్ భక్తులు పురుషులతో సమానంగా మత, సామాజిక స్వేచ్ఛను వాగ్దానంచేస్తూ స్త్రీలపై, బానిసలపై తమ ప్రభావాన్ని విస్తరించారు. తూర్పు దేశాలలోని తెగలు గ్రీసు-రోమనుల సంబంధమగు మర్మంతోకూడిన అనేక మతాలు ఉద్భవించడానికి కారణమయ్యాయి. పాప పరిహార వాగ్దానం మరియు దైవిక మర్మాలలో భాగం వహించాలనే కోరిక డిమెటర్, డయానిసిస్ మరియు సైబలె వంటి అబద్ధ దేవతలవైపు వాటి అనుచరులను ఆకర్షించినవి.
ఖర్చులు ఎలా భరించబడేవి?
అయితే, ప్రయాణపు ఖర్చులు అధికంగా ఉండేవి. వాహన ఖర్చులు, రహదారి పన్నులు, సముద్రయాన ఖర్చులతో పాటు సంచారకులకు ఆహారం, బస, వంటచెరకు, వస్త్రాలు, ఆరోగ్య రక్షణ అవసరం. ప్రచారకులు, బోధకులు, తత్వవేత్తలు, మతాచార్యులకు ఈ అవసరతలు ముఖ్యంగా ఐదు విధాలుగా తీర్చబడేవి. అవేవనగా, (1) జీతం పుచ్చుకొని బోధించుట; (2) తేలికైన వృత్తులు, చిన్నచిన్న చేతిపనులు చేస్తూ ఉద్యోగం చేయడం; (3) ఆతిథ్యం, ఇష్టపూర్వకంగా యిచ్చే విరాళాలు స్వీకరించడం; (4) మతాచారులుగా తరచు సంపన్నుల పంచన చేరడం; (5) భిక్షమెత్తడం మొదలైనవి. సాదరంగా ఆహ్వానింపబడడానికి సిద్ధపడుటకు ప్రఖ్యాత గ్రీకుతత్వ భిక్షువైన డయజెనెస్ అన్నవస్త్రాలకై నిర్జీవ విగ్రహాలను సహితం యాచించాడు.
తాము క్రైస్తవ పరిచారకులమని చెప్పుకుంటూ గ్రీకు తత్వవేత్తలను పోలి ధనవంతులతో స్నేహంచేసి బీదవారిని దోచుకునే కొంతమంది పరిచారకులను పౌలు ఎరిగియున్నాడు. ఆయన కొరింథు సంఘాన్ని గద్దిస్తూ యిలా అన్నాడు: “ఒకడు మిమ్ము మ్రింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను . . . మీరు సహించుచున్నారు.” (2 కొరింథీయులు 11:20) యేసుక్రీస్తు దేనిని కాజేయలేదు, ఆలాగే పౌలు, ఆయన తోటి పనివారు అలాచేయలేదు. అయితే కొరింథులోని దురాశపరులైన సువార్తికులు “దొంగ అపొస్తలులును, మోసగాండ్రగు పనివారును,” సాతాను పరిచారకులునై యుండిరి.—2 కొరింథీయులు 11:13-15.
తన శిష్యులకు యేసు ఇచ్చిన ఉపదేశములు డబ్బుకు బోధించే విషయాన్ని నిరోధించినవి. “ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి” అని ఆయన సలహానిచ్చాడు. (మత్తయి 10:8) భిక్షాటన సర్వసాధారణమై యున్నను, ఆ రోజుల్లో దానిని హీనంగా చూసేవారు. తాను చెప్పిన ఒక దృష్టాంతములో, ఒక గృహనిర్వాహకుడు యిలా చెప్పడాన్ని యేసు చిత్రీకరించాడు, “భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను.” (లూకా 16:3) కాబట్టి, బైబిలు కథనమంతటిలో యేసు నమ్మకమైన అనుచరులు వస్తువులను లేదా డబ్బును వసూలు చేయడాన్ని మనమెన్నడు కనుగొనము. “ఎవడైనను పనిచేయనొల్లని యెడల వాడు భోజనము చేయకూడదు” అనే సూత్రాన్నిబట్టి జీవించారు.—2 థెస్సలొనీకయులు 3:10.
రెండు విధములుగా తమ అవసరతలు తీర్చుకొనుటకు యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. మొదటిది, వారు పౌలు చెప్పినట్లుగా, “సువార్తవలన జీవింపవలెను.” ఎలా? యిష్టపూర్వకముగా యిచ్చిన ఆతిథ్యమును అంగీకరించి చేయాలి. (1 కొరింథీయులు 9:14; లూకా 10:7) రెండవది, తమనుతాము వస్తుదాయకముగా పోషించుకొనవలెను.—లూకా 22:36.
పౌలు అన్వయించిన సూత్రాలు
ముందు ప్రస్తావించబడిన సూత్రాలను పౌలు ఎలా అన్వయించాడు? అపొస్తలుని రెండవ మిషనరీ యాత్రను గూర్చి లూకా యిలా వ్రాశాడు: “మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడనుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదొనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణము. . . . మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి.” ప్రయాణానికి, భోజనానికి, బసకు సంబంధించిన ఖర్చులన్నీ వ్యక్తిగతంగా వారే భరించారు.—అపొ. కార్యములు 16:11, 12.
చివరకు, లూదియ అనుపేరుగల స్త్రీ “పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె—నేను ప్రభువు [యెహోవా NW] విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.” (అపొ. కార్యములు 16:13-15) బహుశ, లూదియ యిచ్చిన ఆతిథ్యం కారణంగా, పౌలు ఫిలిప్పీలోని తోటి విశ్వాసులకు యిలా వ్రాయగల్గాడు: “మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, . . . మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడు సంతోషముతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను.”—ఫిలిప్పీయులు 1:3-5.
ఈ క్రైస్తవ ప్రయాణ సేవకులను ఆయావ్యక్తులు ఆహ్వానించిన అనేక సంఘటనలను లూకా వ్రాస్తున్నాడు. (అపొ. కార్యములు 16:33, 34; 17:7; 21:7, 8, 16; 28:2, 7, 10, 14) తన ప్రేరేపిత లేఖలలో పౌలు వాటిని గుర్తించి తనకు ఆతిథ్యమిచ్చినందుకు, తనకు బహుమతులు అందజేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. (రోమీయులు 16:23; 2 కొరింథీయులు 11:9; గలతీయులు 4:13, 14; ఫిలిప్పీయులు 4:15-18) అయినప్పటికిని, ఆయన గాని ఆయన సహవాసులు గాని తమకు బహుమతులివ్వాలని లేదా తమకు ఆర్థిక సహాయం చేయాలని నామమాత్రంగానైనను సూచించలేదు. తమలోని ప్రయాణ కాపరులలో ఈ చక్కని దృక్పధం ఇంకను చూడవచ్చని యెహోవాసాక్షులు చెప్పగలరు.
ఆతిథ్యంమీదే ఆధారపడలేదు
పౌలు ఆతిథ్యంమీదే ఆధారపడలేదు. అయితే ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయాల్సిన వృత్తిని ఆయన నేర్చుకున్నాడు. దానికి అంతంత మాత్రమే జీతం దొరికేది. మిషనరీగా అపొస్తలుడు కొరింథుకు వచ్చినప్పుడు, “అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను. . . . వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.”—అపొ. కార్యములు 18:1-3.
ఆ తర్వాత, ఎఫెసులో పౌలు యింకను కష్టపడి పనిచేశాడు. (అపొ. కార్యములు 20:34; 1 కొరింథీయులు 4:11, 12 పోల్చండి.) తమ ప్రాంతపు కిలికియమ్ అనే మేక బొచ్చుతో తయారైన ముతక బట్టతో డేరాలు కుట్టడంలో ఆయన ప్రవీణుడై ఉండవచ్చు. పౌలు ఒక స్టూలుపై కూర్చుని పనిచేసే బల్లపైనున్న ఆ బట్టను కత్తిరిస్తూ రాత్రిపొద్దుపోయే వరకు కుట్టడాన్ని మనం ఊహించవచ్చును. ఆ దుకాణంలో శబ్దం వినిపించదు గనుక, పనిచేస్తూనే మాట్లాడడం సులభం, కావున ఆ దుకాణం యజమానితో, తోటి పనివారితో, దాసులతో, ఖాతాదారులతో, స్నేహితులతో మాట్లాడే అవకాశం పౌలుకు ఉండియుండవచ్చును.—1 థెస్సలొనీకయులు 2:9 పోల్చండి.
మిషనరీయైన పౌలు తన పరిచర్యను వ్యాపారంగా చేయడానికి లేదా డబ్బు సంపాదనకు దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నాడనే ఎలాంటి భావం కలుగడానికి తావియ్యలేదు. థెస్సలొనీకయులకు ఆయనిలా చెప్పాడు: “ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు; ఎవనియొద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసములతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారము లేదని చేయలేదు.”—2 థెస్సలొనీకయులు 3:7-9.
ఇరవయ్యో శతాబ్దంలో ఆయనను పోలి నడుచుకొనువారు
నేడును యెహోవాసాక్షులు పౌలుయొక్క చక్కని మాదిరిని అనుకరిస్తున్నారు. వారు సేవచేయు సంఘాల నుండి పెద్దలు పరిచారకులు ఎలాంటి జీతము లేదా ఉపకారవేతనము పుచ్చుకొనరు. బదులుగా ప్రతివారి వలెనే తమ కుటుంబాలను పోషిస్తూ, వారిలో అనేకులు ఉద్యోగాలు చేస్తున్నారు. పూర్తికాల పయినీరు పరిచారకులనేకులు తమ పోషణార్థమై తమ ప్రాథమిక అవసరతలకు సరిపడ ఆదాయాన్నిచ్చే పనులు చేస్తున్నారు. అరుదుగా సువార్తచేరే దూరప్రాంతాలలో ప్రకటించుటకు ప్రతి సంవత్సరం కొంతమంది సాక్షులు తమ స్వంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. భోజనానికి లేదా బసచేయడానికి స్థానిక కుటుంబాల వారు వారిని ఆహ్వానిస్తే, వారు దానిని అభినందిస్తారు, అయితే అటువంటి ఆతిథ్యాన్ని వారు దుర్వినియోగపర్చరు.
యెహోవాసాక్షులు చేసే ఈ ప్రకటన, బోధన అంతా స్వచ్ఛందమే, తమ పరిచర్య కొరకు వారెన్నడు డబ్బు వసూలు చేయరు. అయితే, వారి ప్రపంచవ్యాప్త సేవకు నమ్రతతో ఇచ్చే విరాళాలను అంగీకరించి వారు వాటిని ఆ సేవ కొరకు వాచ్‌టవర్ సొసైటికి పంపిస్తారు. (మత్తయి 24:14) ప్రతి విధముగా కూడ సాక్షుల పరిచర్య వ్యాపార దృష్టిలేనిది. పౌలు వలెనే వారిలో ప్రతివారును యథార్థంగా యిలా చెప్పగలరు: “దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించితిని.” (2 కొరింథీయులు 11:7) యెహోవాసాక్షులు ‘దేవుని వాక్యాన్ని అమ్ముకొనువారు కాదు.’
[27వ పేజీలోని బాక్సు]
రాజ్య ప్రచారపు సేవకు కొందరెలా విరాళాలిస్తారు
◻ ప్రపంచవ్యాప్త సేవకు చందాలిచ్చుట: “సొసైటియొక్క ప్రపంచవ్యాప్త సేవకొరకు చందాలు—మత్తయి 24:14” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయుటకు అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీస్తారు లేదా తమ బడ్జెట్టులో దాన్ని చేరుస్తారు. ప్రతినెల ఈ మొత్తాలను సంఘాలు తమ దగ్గరలోని వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.
◻ బహుమతులు: స్వచ్ఛంద విరాళాలను సూటిగా Watch Tower Bible and Tract Society of India, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., లేదా ఈ పత్రిక ప్రకాశకులకు పంపించవచ్చును. ఆభరణాలు, ఇతర వెలగల నగలు సహితము విరాళముగా ఇవ్వవచ్చును. ఈ విరాళములతో పాటు అది పూర్తిగా ఒక విరాళమని తెలియజేసే ఒక క్లుప్త లేఖను కూడ పంపవలెను.
◻ షరతుపై విరాళమిచ్చు ఏర్పాటు: వ్యక్తిగత అవసరము కలిగినప్పుడు దాతకు ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటుతో, దాత మరణించు పర్యంతము వాచ్‌టవర్ సొసైటి ట్రస్టుకు డబ్బు ఇవ్వవచ్చును.
◻ భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథకము యొక్క లబ్దిదారుగా వాచ్‌టవర్ సొసైటి పేరును సూచించవచ్చును.
◻ బ్యాంకు ఖాతాలు: బ్యాంకు ఖాతాలను, డిపాజిట్ సర్టిఫికేట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలను స్థానిక బ్యాంకు నియమాలను అనుసరించి వాచ్‌టవర్ సొసైటి ట్రస్టు కొరకు లేదా మరణానంతరము వాటిని ఆ సొసైటికే చెల్లించు ఏర్పాటుచేయవచ్చును. అలాంటి ఏ యేర్పాటునైనను సొసైటికి తెలియజేయవలెను.
◻ స్టాక్స్ మరియు బాండ్లు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించు ఏర్పాటుతో స్టాక్స్ మరియు బాండ్లను వాచ్‌టవర్ సొసైటికి విరాళముగా ఇవ్వవచ్చును.
◻ ఇళ్లస్థలాలు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆమె లేదా అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో పూర్తిగా అమ్మదగిన ఇళ్లస్థలాలను వాచ్‌టవర్ సొసైటికి విరాళముగా ఇవ్వవచ్చును.
◻ వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధముగా Watch Tower Bible and Tract Society of India పేర వీలునామా వ్రాయవచ్చును, లేదా ఒక ట్రస్టు ఏర్పాటుయొక్క లబ్దిదారుగా సొసైటి పేరు వ్రాయవచ్చును. ఒక మత సంస్థకు లాభం సమకూర్చే ట్రస్టుకు పన్నులు చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలివ్వవచ్చును. వీలునామా లేదా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన ఒక కాపీని సొసైటికి పంపవలెను.
ఇటువంటి విషయాలలో మరింత సమాచారము కొరకు, Watch Tower Bible and Tract Society of India, H-58 Old Khandala Road, Lonavla 410 401., లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి.
[29వ పేజీలోని బాక్సు]
సహాయం చేయాలని ఆమె కోరుకుంది
పదకొండు సంవత్సరాల టిఫెనె అమెరికా, లూసియానాలో బాటన్ రోగ్‌నందు ఒక పాఠశాల విద్యార్థిని. ఇటీవలనే ఈ యౌవన యెహోవాసాక్షి “అమెరికాలో విద్య” అనే మూలాంశంపై ఒక వ్యాసం తయారుచేసింది. దాని ఫలితంగా, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నుండి సాక్షులైన ఆమె తలిదండ్రులకు ఈ ఉత్తరం అందింది:
“అమెరికా విద్యా వారంలో, ఇంటర్‌కమ్ ద్వారా ప్రతి గ్రేడువారికి ఒక అసాధారణమైన వ్యాసం చదవడం జరిగింది. టిఫెనె వ్రాసిన వ్యాసాన్ని ఈ ఉదయం చదివే చక్కని అవకాశం నాకు లభించింది. ఆమె నిజంగా ఎంతో ప్రతిభావంతురాలు. ఆమె ధైర్యం, కృతనిశ్చయం, సామర్థ్యం, ఉదార స్వభావం గలది. ఆరవ గ్రేడులో ఇన్ని లక్షణాలున్న అమ్మాయిని నేను చూడడం అరుదు. టిఫెనె మా పాఠశాలకే ఒక ఆభరణం లాంటిది.”
ఆ వ్యాస రచన పోటీలో టిఫెనెకు మొదటి స్థానం వచ్చింది. ఆ తర్వాత ఆమె వాచ్‌టవర్ సొసైటికి ఉత్తరం వ్రాస్తూ యిలా అంది: “నేను కేవలం క్వెశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అనే సాహిత్యం కారణంగానే ఆ బహుమతి గెల్చుకున్నాను. . . . అందు విద్యను గూర్చి వ్రాయబడిన అధ్యాయాలను నేను ఉపయోగించాను. . . . ఉపయుక్తమును స్ఫూర్తిదాయకమైన ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు మీకు ధన్యవాదాలు. గెలుపొందిన నా వ్యాసానికి నాకు ఏడు డాలర్లు లభించాయి. ఈ 7 డాలర్లతోపాటు మరి 13 డాలర్లుకలిపి మొత్తం 20 డాలర్లు మన ప్రపంచవ్యాప్త ప్రకటించు సేవకు నేను చందాగా పంపుతున్నాను. . . . నేను పెరిగి పెద్దదాన్నయిన తర్వాత స్వచ్ఛంద బేతేలు సేవకొరకు కూడ నిరీక్షిస్తున్నాను.”
[26వ పేజీలోని చిత్రం]
కొన్నిసార్లు, పౌలు డేరాలు కుట్టి జీవించడం నేర్చుకున్నాడు