రాజ్య ప్రచారకుల నివేదిక
“ఆమె చదివిన ప్రతిలేఖనము నా హృదయమును తట్టెను
“దేవుని వాక్యము సజీవమై బలముగలదైయున్నది.” అని అపొస్తలుడైన పౌలు చెప్పెను. (హెబ్రీ. 4:12) బౌద్ధమతస్థురాలిగా పెరిగిన వియత్నాంకు చెందిన ఒక స్త్రీ జీవితములో ఇది సత్యమని నిరూపింపబడెను. ఇది ఆమె కథ.
ఇంకా వియత్నాంలోనే నివసించుచున్న నా తల్లిదండ్రులు పేరుకు బౌద్ధులు గనుక నావయస్సు 22 వచ్చి వివాహము అయ్యేంత వరకు ఒక బౌద్ధురాలిగానే పెంచబడ్డాను. కేథలిక్ చర్చిలో బాప్తిస్మము పొందవలెనని నా భర్త కుటుంబము నన్ను బలవంతముచేసిరి. నేను బౌద్ధురాలైనందున చనిపోయిన మా అత్తగారు పరలోకమునకు వెళ్లకుండ నేను అడ్డంగా నున్నానని వారు చెప్పిరి. మొదట నేను దానిని వ్యతిరేకించాను. గాని తదుపరి వారిని సంతోషపరచుటకు బాప్తిస్మము తీసుకున్నాను. ఏమైనప్పటికిని కేథలిక్ చర్చిలోనున్న వేషధారణను నేను అసహ్యించుకొని లోలోపల నేను చాలా బాధపడ్డాను. అది బౌద్ధమతము కంటె ఏమాత్రము వేరుగా లేదు. అది యుద్ధము మరియు రాజకీయములలో నిమగ్నమైయున్నది. ఈ రెండుమతములు పూర్వీకుల ఆరాధనను ప్రోత్సహించినవి.
“నేను వియత్నాంలోనే ఉన్నట్లయితే సత్యమును నేర్చుకొను అవకాశము బహు తక్కువగా ఉండేది. దక్షిణవియత్నాంలో రాజకీయ ఒరవడి బాగా ఉన్న సమయములో సైగాన్కు దూరంగా ఉన్న ఒక పట్టణంలో పెరిగాను. కావున ఆస్ట్రేలియాకు పారిపోవుట నాకు ఆశీర్వాదములు తెచ్చినది.
“పడవ ప్రజలలోనున్న అనేకమంది అదృష్టవంతులలో నేనొకదాన్ని. పోలీసుల బారినుండి తప్పించుకొనుటకు నా రెండునెలల శిశువును చేతులలో ఎత్తుకొని చీకటిలో పరుగెత్తి ఒక చిన్న చేపల పడవను ఎక్కాను. ఆస్ట్రేలియా రాకముందు ఏడు దినములు సముద్రప్రయాణము చేసి మలేషియా చేరుకొని అక్కడ శరణార్ధుల శిబిరములో కొన్ని నెలలు గడిపాము.
ఆస్ట్రేలియాలో రెండున్నర సంవత్సరము గడచినపిదప వారి ఇంటింటి పరిచర్యలో యెహోవాసాక్షులకు నేను తారసపడ్డాను. అడిగిన వెంటనే నేను క్రమ బైబిల్ పఠనమునకు ఒప్పుకున్నాను. ఎందుకనగా అది ఇంగ్లీషు నేర్చుకొనుటకు మంచి అవకాశమైయున్నది. నన్ను కనుగొన్న ఆ స్త్రీ సాక్షియొక్క ప్రవర్తన మరియు ఆమె నేర్పిన సత్యము నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. ఆమె చదివిన ప్రతిలేఖనము నా హృదయమును తట్టెను. మరియు యెహోవా సంస్థలో ఏ వేషధారణను నేను చూడలేదు. ఒకటిన్నర సంవత్సరములు బైబిల్ పఠించిన పిదప యెహోవాకు నా జీవితము సమర్పించుకొని బాప్తిస్మము పొందాను.
సత్యము నా జీవిత సరళిని మార్చివేసినదని చెప్పక తప్పదు. నా భర్త అవిశ్వాసి అయినప్పటికిని నా చిన్న కుటుంబము కలసికట్టుగా నుండుటకు యెహోవా సహాయముచేసి నన్ను కాపాడినాడు. ఆయనే నాకు గొప్ప బోధకుడు, మరియు నేను ఒక ఉత్తమమైన తల్లిగా, భార్యగా నుండుటకు నాకు నేర్పించాడు. ఆత్మీయ అంధకారమునుండి బైబిల్ సత్యముల వెలుగులోనికి తెచ్చుటకు సాయపడిన యెహోవాకు ఎల్లప్పుడు నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను.”
ఈ విషయములో ప్రేరేపిత దేవుని వాక్యము మంచిని సాధించుటకు నిజముగా బలముగలదైయున్నది. బైబిల్ను పఠించుచు, నేర్చుకొనిన దానిని నిజజీవితములో పాటించినట్లయిన అది జీవితమునకు అర్థమును, సంకల్పమును ఇచ్చి దేవుని నూతన లోకములో నిత్యజీవమునకు నడుపును. దేవునిచే ప్రేరేపితుడైన మోషే చెప్పినట్లు “ఇది మీకు నిరర్థకమైన మాట కాదు. ఇది మీకు జీవమే.”—ద్వితీయో 32:47. (w91 4/1)