కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 4/1 పేజీలు 30-32
  • సువార్త పనిలో తీవ్రముగా నిమగ్నమైయుండెను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సువార్త పనిలో తీవ్రముగా నిమగ్నమైయుండెను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈనాడు మనకొక మాదిరి
  • నీవు నీ భాగమును చేస్తున్నావా?
  • సమతూకమైన పరిచర్యయొక్క ఫలితాలు
  • నిన్నునీవు అందుబాటులో వుంచుకొనుము
  • మీ పరిచర్యలో ‘ఆతురతగలవారై’ ఉండండి
    మన రాజ్య పరిచర్య—2001
  • “మాట్లాడుతూనే ఉండు, ఆపకు”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • అత్యంత ఉత్సాహంతో సువార్తను ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 4/1 పేజీలు 30-32

సువార్త పనిలో తీవ్రముగా నిమగ్నమైయుండెను

అపొస్తలుడైన పౌలు చాలిచాలని నిధులతో—దుఃస్థితిలో ఉన్నాడను సంగతి యెహోవాసాక్షులలో పూర్తికాల పరిచారకులైనవారికి తెలియనిది కాదు. యువకునిగా ఉన్నప్పుడు నేర్చుకొనిన దీనమైన డేరాలు కుట్టుపనిని ఆయన అందుకే కొరింథులో చేపట్టెను. అది చాలా కష్టమైన పని. దళసరిగా గరుకుగా ఉండు డేరాగుడ్డతో పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయన చేతులు రక్తముతో కరుడుగట్టి యుండవచ్చును. దానివలన వచ్చు ఆదాయము ఆయన అన్న, వస్త్రములకే చాలిచాలనట్లుండెను. అయినను, సంతృప్తిగలవాడై, తన లౌకిక పనిని ముగించిన వెంటనే, పనిముట్లను ప్రక్కనబెట్టి, మొదట ఎందుకైతే కొరింథుకు వచ్చాడో ఆ పనిని అనగా—సువార్తను ప్రకటించుటను ఆయనచేసెను.—ఫిలిప్పీయులు 4:11, 12.

విశ్రాంతి దినమురాగానే సమాజమందిరములోకి వెళ్లేవాడు. నిజానికి, కొరింథులోని తన ప్రేక్షకులను మొదట సమీపించునప్పుడు పౌలు “బలహీనతతోను, భయముతోను, ఎంతో వణకుతోను” ఉండెను. (1 కొరింథీయులు 2:1, 3) కానీ తన వర్తమానమునకు కొందరు ప్రతిస్పందించిన తీరుకు ఉత్తేజపరచబడినవాడై, పౌలు “ప్రతి విశ్రాంతి దినమున సమాజమందిరములో తర్కించుచు (ప్రసంగించుచు NW) యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచునుండెను.”—అపొస్తలుల కార్యములు 18:1-4.

అయినను, పౌలు కొంతకాలమువరకు, పనిచేసుకుంటూ దినములో కొంతసమయమున మాత్రమే ప్రకటించుటతప్ప ఎక్కువ చేయలేకపోయెను. తరువాత, సీలయు తిమోతియు మాసిదోనియనుండి ఉదారమైన కానుకతోవచ్చి, ‘ఆయన అక్కరను (పూర్తిగా NW) తీర్చిరి.’ (2 కొరింథీయులు 11:9; ఫిలిప్పీయులు 4:15) దానితోపాటు థెస్సలొనీకయలోని సహోదరులు హింసలోను స్థిరముగా నిలబడిరను వార్త ఆయన హృదయమును ఆనందపరచినది.—1 థెస్సలొనీకయులు 3:6.

పౌలుపై అది ఎట్టి ప్రభావమును చూపినది? “పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై [“తన సమయమంతటిని ప్రకటించుటకు వినియోగించెను,” ది జెరూసలేమ్‌ బైబిల్‌; టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌] యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.” (అపొస్తలుల కార్యములు 18:5) కొంతకాలము ఆర్ధిక వత్తిడులనుండి విడుదల పొందినందున ప్రకటించుపనిలో తిరిగి పూర్తికాలము ప్రవేశించకుండ ఉండలేకపోయాడు. మంచి అభిరుచితో ఈ పనిలో ఆయన తిరిగి ప్రవేశించి, యూదులకు ప్రకటించుటలోనేగాక, తన ప్రేరేపిత పత్రికలలో మొదటగా వ్రాయబడిన థెస్సలొనీకయులకు పత్రికను వ్రాయుటకు సమయమును తీసికొనెను.

ఈనాడు మనకొక మాదిరి

కొరింథులో పౌలు చేసిన తీవ్రమైన పనియొక్క వృత్తాంతము సువార్తపనిలో క్రైస్తవులందరు తీవ్రముగా నిమగ్నమైయుండుటకు ప్రోత్సాహకరంగా భద్రపరచబడినది. ప్రభువైన యేసు తానే తన శిష్యులకు “లోకమునకు వెలుగైయుండే” ఉన్నతమైన గౌరవమును ప్రతిపాదించాడని పౌలు గుర్తెరెగెను. ఈ వెలుగును వారు మరుగుచేయకూడదు. యేసు వారితో ఇట్లనెను: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్తయి 5:14-16) అనగా యేసు ప్రవచించిన ప్రకటన పనిలో పూర్తిగా భాగము వహించవలెనని దీని అర్థము. (మత్తయి 24:14; 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:6-8) క్రైస్తవ సంఘము ఉనికిలోవుండుటకు ఒక ప్రధానమైన కారణము ఈ రాజ్యసువార్తను ప్రకటించుటయే.

తొలిక్రైస్తవులు పౌలువలెనే, ప్రకటన పనిని తీవ్రమైనదానిగా పరిగణించిరి. “జీవాధిపతియైనవానిని” క్రూరముగా చంపుటతో దేవుని శత్రువులు ఈ నిజమైన వెలుగును పూర్తిగా ఆర్పివేశామని తలంచినప్పుడు, ఆయన అనుచరులు లోకమునకు వెలుగుగా బహుబలముతో ప్రకటన పనిని కొనసాగించిరి. (అపొస్తలుల కార్యములు 3:15) హింసకూడా వారి ప్రయత్నములను చల్లార్చలేకపోయినది. బైబిలు వృత్తాంతము చెప్పునట్లు: “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 5:42) ఏదియు వారిని వెనుకకు ఆపలేక పోయినది.

అలాగే, ఆధునిక కాలములలోకూడ క్రైస్తవులు సాక్ష్యమిచ్చు పనిలో తీవ్రముగా నిమగ్నులైయుండిరి. 19 వ శతాబ్ద అంతమునకు, మనఃపూర్వకమైన శ్రద్ధగల దేవుని వాక్య విద్యార్ధులు, బైబిలు సత్యములను ఇతరులతో పంచుకోవలసిన అవసరతను గుర్తించ మొదలుపెట్టారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన —జియోన్స్‌ వాచ్‌ టవర్‌ ట్రాక్ట్‌ సొసైటి—1884 లో కార్పోరేషన్‌గా మారినది. 1931 నుండి యెహోవాసాక్షులని పిలువబడుతున్న ఈ బైబిలు విద్యార్ధులు భూమిని దేవుని వాక్యజ్ఞానముతో అక్షరార్థముగా నింపివేశారు. వారు తీవ్రముగా నిమగ్నులైయుండుటవలన నలభై లక్షల బలముతో గొప్పసైన్యము తయారైనది. యెహోవా నడిపింపు క్రింద వారి సంఖ్య ఇంకను విస్తరించుననుటలో సందేహమేమియులేదు.—యెషయా 60:22.

నీవు నీ భాగమును చేస్తున్నావా?

“కోతవిస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు” అని యేసు చెప్పెను. (మత్తయి 9:37, 38) క్రీస్తు మరణ జ్ఞాపకార్థమునకు 1990 లో దాదాపు కోటిమంది హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తమైన కోతపనికి ఎంత అద్భుతకరమైన అనుకూలత ఉన్నది! కొనసాగుతున్న ఈ విస్తరణలో ఆనందిస్తూనే, ప్రతిఒక్కరు తమ్మునుతాము, ‘ఈ గొప్ప పనిలో నేను ఎంతవరకు వంతు కల్గియున్నాను?’ నేను క్రమంగా—సాధ్యమైన ప్రతివారము అలాచేస్తున్నానా? అని అడుగుకొనవలెను.

పెద్దలు ఈ పనిలో “మందకు మాదిరులుగా” నాయకత్వమును తీసికొనవలెను. (1 పేతురు 5:3) నిజమే, అనేకమంది పెద్దలు లౌకిక ఉద్యోగములతో ఉన్నారు. కొరింథులో ఉన్నప్పుడు పౌలుకు కూడా అలాగే ఉండెను. అయినను, క్రమమైన ప్రకటన కార్యముకొరకు ఆయన సమయమును కేటాయించెను. ఈనాడు అనేకమంది పెద్దలు అలాగే వారాంతములందు ఆత్మీయ కార్యములతో పూర్తిగా మునిగియున్నారు. ఇది సంఘములోనున్న వారందరిపైన శక్తివంతమైన, ప్రోత్సాహకరమైన ప్రభావమును కలిగియుండగలదు. కొన్ని నెలలలో ప్రత్యేకమైన కృషిని చేసినప్పుడు, చాలా సంఘములలోని ఎక్కువమంది ప్రచారకులు పయినీరు సేవలో ఉండగల్గిరి. ఇందులోని రహస్యమేమి? ఆ పెద్దలు ప్రకటన పనిలోను ప్రాంతీయ సేవా ఏర్పాట్లను వ్యవస్థీకరించుటలోను నాయకత్వము తీసికొనిరి.

అలాగే, పరిచారకులు కూడ ప్రాంతీయ సేవలో క్రమముగా పాల్గొనుచున్నట్లయిన సంఘముపైన ఆరోగ్యవంతమైన ప్రభావాన్ని చూపగలరు. లేఖనములు వారిని, “మాన్యులైయుండి (పనిని గంభీరముగా ఎంచువారైయుండి NW) . . . పనిని బాగుగా నెరవేర్చువారైయుండవలెనని” కోరుతున్నట్లు జ్ఞాపకముంచుకొనుడి. ఒక సహోదరుడు పెద్దగా లేక పరిచారకునిగా అర్హుడగుటకు ప్రాంతీయ సేవలో నమ్మకత్వమును ప్రదర్శించుట ప్రాముఖ్యము.—తీతు 1:8, 9.

పౌలువలె, కొందరు లౌకిక పనిని తగ్గించుకొని పయినీర్లుగా చేయగల్గుచున్నారు. కేవలము పది సంవత్సరముల క్రితము 1,37,861 మందిగా ఉన్న క్రమ, సహాయ, ప్రత్యేక పయినీర్లు 1990 లో 5,36,508 కి పెరిగిరి. నిశ్చయముగా యెహోవాయొక్క దీవెన, అంగీకారమే దీనిని నెరవేర్చినది. అయినను పయినీర్లు, కేవలము లెక్కించుకోటానికి సమయాన్ని చేయకుండా, అధిక సమయము చేస్తూ చేసిన సమయము కాలమును లెక్కించునట్లుగా ఉండుటకు జాగ్రత్తపడవలెను. పయినీరులారా, మీరు బాగుగా సిద్ధపడి, పరిచర్యలో ఫలవంతంగా ఉంటున్నారా? మీ పరిచర్య నిజముగా ఫలించునట్లు, దానియందు యెడతెగక అభివృద్ధి చేసికొనుచున్నారా?

సమతూకమైన పరిచర్యయొక్క ఫలితాలు

ప్రతినెల కావలికోట దాని జతగావచ్చు మేల్కొలుపు! ద్వారా అందించబడు జీవదాయకమైన సమాచారమును మీరు గుణగ్రహిస్తారా? నిశ్చయముగా మీరు అలా చేస్తారు. ఈ పత్రికలయెడలగల మీ మెప్పు వాటిని ఇతరులకు పంచుటలో భాగము వహించవలెనని నడిపియున్నదా? బోట్స్‌వానా లోని ఒక సహోదరి అలా చేసింది. మొదట ఆమె సత్యమును వ్యతిరేకించినప్పటికిని ఆమె భర్త ఆమెకు ఈ పత్రికలను చదివి వినిపించేవాడు. తగినకాలానికి ఆమె హృదయములో మార్పువచ్చి సాక్షిగా అయినది. చదువను రాకపోయినను పత్రికలను అందించుటలో ఆమె ప్రవీణురాలయ్యింది. ఆమె ఇలా అంటున్నది: “నాకు చదువను రాకపోయినను, నా భర్త నాకు ఈ పత్రికలను చదివి వినిపిస్తుంటాడు. అవి నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు కూడ అలా ఆనందిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.”

జీవమును కాపాడు ఈ పనిలో ప్రతివారము ఎందుకు పాల్గొనకూడదు. మీరు ఆత్మీయ అర్హతలు పొందినవెంటనే, ఈ పనిని మీరు ప్రారంభించునట్లు సహాయపడుటకు క్రైస్తవ సంఘము సంతోషించును. సువార్త పనిలో తీవ్రముగా నిమగ్నమైయుండు ఎవరైనను సమతూకమైన పరిచర్యను కలిగియుండుటకు ప్రయత్నింతురు. ఉదాహరణకు, వాచ్‌టవర్‌ సొసైటి అనేకమైన పుస్తకములను లక్షలకొలదిగా ప్రచురిస్తుంది. ఇవి ఆత్మీయ ఆహారమునకు నిలకడయైన మంచి మూలముగా ఉండునట్లు ప్రజలకు అందించబడుచున్నవి. యు కెన్‌ లివ్‌ ఫరెవర్‌ ఇన్‌ ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్త్‌? మొదలగు పుస్తకములను పరిచర్యలో అందించగలిగినంత నైపుణ్యవంతముగా మీరు ఉన్నారా?

ఆసక్తిచూపే వారి విషయమేమి? వారిని పునర్దర్శించుటకు వీలుగా మీరు మంచి రికార్డును ఉంచుకొనుచున్నారా? అటువంటి దర్శనములు అన్నిటికంటె గొప్పసంతోషదాయకమైన పనియగు గృహబైబిలు పఠనపు పనికి నడుపగలవు. మత్తయి 28:19, 20లో ‘శిష్యులను తయారుచేస్తూ, వారికి బాప్తిస్మమివ్వమని’ యేసు ఆజ్ఞాపించాడని గుర్తుంచుకొనండి. అనగా మనము వారితో బైబిలు పఠనము చేయవలెను. ఔను, పఠనమును ప్రారంభించుటకు పట్టుదల అవసరము. ఒక సాక్షి, గృహబైబిలు పఠనమును హృదయపూర్వకంగా అంగీకరించిన ఒక వృద్ధ దంపతులను కలిసికొనెను. కానివారు వరుసగా మూడు వారములు పఠనమును వాయిదా వేశారు. క్రమక్రమీణ పఠనము ప్రారంభించబడినది. తరువాత, కొంతకాలమువరకు వారము మార్చి వారము పఠనమును రద్దుచేశారు. ఏమైనను చివరకు ఆ భార్య బాప్తిస్మముపొందు స్థాయికి అభివృద్ధిచెందినది. “బాప్తిస్మము అయిన తరువాత” ఆ సహోదరుడు ఇలా జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, “ఆమె కండ్లు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి, అవి నాకును, నా భార్యకును ఆనందముతో కంటికి నీరు తెచ్చాయి.” ఔను, సువార్త పనిలో సంపూర్ణముగా నిమగ్నమైయుండుట వర్ణింపశక్యముగాని సంతోషము తెచ్చును!

నిన్నునీవు అందుబాటులో వుంచుకొనుము

మనము అనుకరించుటకు యేసుక్రీస్తు మరియు అపొస్తలుడైన పౌలు భక్తినిగూర్చిన శ్రేష్టమైన మాదిరిని చూపారు. ఆధునిక కాలములలో కూడ యెహోవాసాక్షులలో మనకు గొప్ప మాదిరులున్నవి. సువార్తను ఎరిగినవారందరికి దానిని ఇతరులతో చురుకుగా పాలుపంచుకొనుటకు కాలము ఆస్నన్నమైయున్నది. అట్టి ప్రయాసమంతయు “వ్యర్ధము కాదని” బైబిలు మనకు అభయమిచ్చుచున్నది.—1 కొరింథీయులు 15:58.

పౌలువలె, అనేకులకు భరించవలసిన ఆర్ధిక బాధ్యతలున్నవి. దీనినిబట్టి అనేకులు పయినీర్లుగా కాలేకపోవుచున్నారు. అయితే యెహోవా సహాయముతో రోమీయులు 12:11 నందు ఇవ్వబడిన మంచి సలహాను అందరు పాటించవచ్చును: “ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును (యెహోవా NW) సేవించుడి.” యెహోవా సేవలో సమయమును ఎక్కువ గడపటానికి పరిస్థితులు అనుమతించురీతిగా మారినప్పుడు, యెహోవాను నిజముగా ప్రేమించువారు పౌలువలె అవకాశమును విడిచిపెట్టక దానిని ఉపయోగించుదురు. సువార్తపనిలో తీవ్రముగా నిమగ్నమైయుండుడి! అలాచేయుట ఆశీర్వాదములను తెచ్చుటయేగాక భవిష్యత్తులో నిరంతర ఆనందము, సంతోషముతో నిత్యజీవము పొందునట్లుచేయును!—మత్తయి 19:28, 29. (w91 7/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి