కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 4/1 పేజీలు 24-29
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రక్తముపై ఆయన వైఖరి
  • రక్తమును లోపలికి తీసుకొనుట లేక మందుగా ఉపయోగించుట
  • వైద్యపరముగా జీవరక్షణకరమా?
  • రక్తమునకు ప్రత్యామ్నాయములు ఏమైనాకలవా?
  • అత్యంత విలువైన రక్తము
  • రక్తము—జీవాధారము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
  • రక్తము నీ ప్రాణమును ఎలా కాపాడగలదు? బ్రోషూరు పఠనము కొరకు ప్రశ్నలు
    మన రాజ్య పరిచర్య—1991
  • జీవములను వాస్తవముగా కాపాడు రక్తము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
  • రక్తమార్పిడి–ఎంత వరకు సురక్షితము?
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 4/1 పేజీలు 24-29

రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?

“నీ దీర్ఘాయుస్సుకు . . . నీ ప్రాణమునకు (జీవమునకు NW) మూలమైన ఆయన [దేవుని] వాక్యమును (మాట NW) విని . . . జీవమును కోరుకొనుడి.”—ద్వితీయోపదేశకాండము 30:19, 20.

1. జీవము కొరకైన గౌరవము విషయములో నిజమైన క్రైస్తవులు ఎట్లు ఉన్నతులై యున్నారు?

జీవమును తాము గౌరవిస్తామని చెప్పుచు, అనేకమంది మరణశిక్ష, గర్భస్రావము, లేక వేటాడుటయెడల తాము కలిగియున్న దృష్టిని రుజువుగా చూపిస్తారు. అయితే, నిజమైన క్రైస్తవులు జీవముయెడల గౌరవము చూపుటకు ఒక ప్రత్యేకమైన మార్గము కలదు. కీర్తన 36:9 ఇట్లనుచున్నది: “నీ [దేవుని] యొద్ద జీవపు ఊట కలదు.” జీవము దేవుడిచ్చిన బహుమానము గనుక, క్రైస్తవులు జీవరక్తము విషయములో ఆయన దృక్పధమును కలిగియుందురు.

2, 3. రక్తము విషయములో మనము దేవుణ్ణి ఎందుకు లెక్కలోనికి తీసికొనవలెను? (అపొ. కార్యములు 17:25, 28)

2 ప్రాణవాయువును శరీరమంతటికి తీసుకువెళ్తు, బొగ్గుపులుసు వాయువును తొలగించునట్టి, వివిధ శీతోష్ణస్థితులకు అనుకూలముగా మన శరీరములను మార్చునట్టి, మరియు రోగములకు వ్యతిరేకముగా పోరాడుటకు సహాయపడునట్టి రక్తముపై మన జీవితములు ఆధారపడియున్నవి. మనకు జీవము ననుగ్రహించిన వాడు రక్తమని పిలువబడిన అద్భుతకరమైన, జీవ-పోషక ద్రవరూప కణజాలమునుకూడ రూపొందించి, దయచేసెను. మానవ జీవమును కాపాడుటలో ఆయన ఎడతెగని శ్రద్ధను ఇది ప్రతిబింబించుచున్నది.—ఆదికాండము 45:5; ద్వితీయోపదేశకాండము 28:66; 30:15, 16.

3 క్రైస్తవులు ఆలాగే సాధారణ ప్రజానీకము తమనుతాము ఇట్లు ప్రశ్నించుకొనవలెను: ‘రక్తము కేవలము దాని సహజ పనితీరులో మాత్రమే నా జీవమును రక్షింపగలదా లేక రక్తము మరింత గంభీరమైన రీతిలో జీవమును రక్షించునా?’ జీవము మరియు రక్తముయొక్క సాధారణ పనితీరుల మధ్య సంబంధమును అనేకమంది ప్రజలు గుర్తించినను, వాస్తవానికి దానిలో ఇంకా ఎంతో ఇమిడియున్నది. క్రైస్తవుల, ముస్లీముల, యూదుల నీతిసూత్రాలన్నియు జీవము మరియు రక్తమునుగూర్చి జీవదాత తానుగా వ్యక్తముచేసిన దానిపై దృష్టినిల్పును. అవును, మన సృష్టికర్త రక్తమునుగూర్చి చెప్పుటకు ఎంతో కలిగియున్నాడు.

రక్తముపై ఆయన వైఖరి

4. మానవ చరిత్ర తొలికాలములో రక్తమునుగూర్చి దేవుడేమి చెప్పెను?

4 దేవుని వాక్యమగు బైబిలులో 400 సార్లకుపైగా రక్తము ప్రస్తావించబడెను. యెహోవా ఇచ్చిన తొలి ఆజ్ఞలలో ఒకటేమనగా: “జీవించి చలించు సమస్త చరములు మీకు ఆహారమగును. . . . అయితే ప్రాణరక్తము ఇంకనుగల దాని మాంసమును మీరు తినకూడదు.” ఆయనింకను ఇట్లనెను: “మీ ప్రాణరక్తమును నేను నిశ్చయముగా లెక్క అడుగుదును.” (ఆదికాండము 9:3-5, న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌) మానవ కుటుంబమునకు మూలపురుషుడైన నోవహుతో యెహోవా అట్లు చెప్పెను. కావున, రక్తము జీవమునకు ప్రతిగా ఉన్నట్లు సృష్టికర్త దృష్టించుచున్నాడని యావత్‌ మానవజాతికి తెల్పబడెను. జీవదాతగా దేవుని గుర్తించుచున్నానని చెప్పుకొను ప్రతివాడు, అందునుబట్టి ప్రాణరక్తమును ఉపయోగించు విషయములో ఆయన స్థిరమైన స్థానమును వహించుననియు గుర్తించవలెను.

5. ఇశ్రాయేలీయులు రక్తము తీసికొనకుండుటకు ఏ ప్రబలమైన కారణముండెను?

5 ఇశ్రాయేలుకు ధర్మ నియమాళిని ఇచ్చునప్పుడు దేవుడు మరలా రక్తమును ప్రస్తావించెను. టానాక్‌ భాషాంతరము ప్రకారము లేవీయకాండము 17:10, 11 ఇట్లు చదువబడును: “ఇశ్రాయేలీయులలో లేక వారిమధ్య నివసించు క్రొత్తవారిలో ఎవరైనను ఎటువంటి రక్తమునైనను భుజించినట్లయిన, ఆ రక్తము భుజించిన వ్యక్తికి నేను విముఖుడనైయుండి, వాని సంబంధీకులలోనుండి వాని కొట్టివేతును. ఎందుకనగా మాంసముయొక్క ప్రాణము దాని రక్తములో ఉన్నది.” ఆ నియమము ఆరోగ్య ప్రయోజనములను కలిగియుండవచ్చును, అయితే దానిలో ఇంకెంతో ఇమిడియున్నది. రక్తమును ప్రత్యేకమైన దానిగా ఎంచుటద్వారా, జీవముకొరకు తాము దేవునిపై ఆధారపడుటను ఇశ్రాయేలీయులు చూపించవలసి యుండిరి. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) అవును, వారు రక్తమును విసర్జించుటకు గల ప్రధానమైన కారణమేమనగా, అది అనారోగ్యకరము కాగలదని కాదు, అయితే రక్తము దేవునికి ఒక ప్రత్యేక భావమును కలిగియున్నందున.

6. రక్తము విషయములో దేవుని కట్టడకు యేసు కట్టుబడియుండెనని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము?

6 రక్తముతో జీవమును రక్షించుకొనుట సంబంధముగా క్రైస్తవత్వము యొక్క స్థానమేమిటి? రక్తమును ఉపయోగించుటను గూర్చి తనతండ్రి ఏమిచెప్పెనో యేసుకు తెలుసు. యేసు “ఏ తప్పిదము చేయలేదు, [మరియు] ఆయన నోట ఏ కపటమును కనబడలేదు.” అనగా రక్తమును గూర్చిన నియమముతో సహా, ఆయన ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా పాటించెను. (1 పేతురు 2:22, నాక్స్‌) ఆ విధముగా ఆయన జీవము, రక్తముయెడల గౌరవము విషయములోకూడ తన అనుచరులకు మాదిరియుంచెను.

7, 8. రక్తము విషయమై దేవుని నియమము క్రైస్తవులకును అన్వయించునని ఎట్లు స్పష్టమయినది?

7 క్రైస్తవులు ఇశ్రాయేలీయుల నియమములన్నింటిని పాటించవలెనా లేదాయని నిర్ణయించుటకు క్రైస్తవ పరిపాలక సభ సమావేశమైనప్పుడు ఏమి జరిగెనో చరిత్ర మనకు చూపించుచున్నది. దైవ నడిపింపు క్రింద, క్రైస్తవులు మోషే ధర్మనియమావళిని పాటించు బాధ్యతక్రింద లేరని అయితే “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని [రక్తము చిందింపని మాంసమును] జారత్వమును విసర్జించవలెనని” వారు చెప్పిరి. (అపొ. కార్యములు 15:22-29) ఆ విధముగా వారు విగ్రహారాధనను, ఘోరమైన లైంగిక దుర్నీతిని విసర్జించునంత నైతిక ప్రాముఖ్యతగా రక్తమును విసర్జించవలెనని స్పష్టముచేశారు.a

8 తొలి క్రైస్తవులు ఆ దైవిక నియమమునకు కట్టుబడియుండిరి. ఆ విషయమునుగూర్చి వ్యాఖ్యానించుచు, బ్రిటీషు విద్వాంసుడైన జోసెఫ్‌ బెన్‌సన్‌ ఇట్లు చెప్పెను: “రక్తము తినకుండుట విషయమై నోవహుకు ఆయన సమస్త సంతతికి ఇవ్వబడి ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు తిరిగి చెప్పబడిన ఈ నిషేధము, . . . ఎప్పుడును ఉపసంహరింపబడలేదు, అయితే దానికి భిన్నముగా, అది నూతననిబంధన, అపొ. కార్యములు XV నందు స్థిరపరచబడినది; అక్కడనుండి అది శాశ్వత బాధ్యతగా చేయబడెను.” అయినను, నోవహు దినములలో లేక అపొస్తలుల దినములలో ఉపయోగమందు లేని రక్తమార్పిడి వంటి ఆధునికకాల వైద్య సంబంధమైన ఉపయోగములను రక్తమునుగూర్చి బైబిలు చెప్పు విషయము నిరాకరించునా?

రక్తమును లోపలికి తీసుకొనుట లేక మందుగా ఉపయోగించుట

9. క్రైస్తవుల వైఖరికి భిన్నముగా, ప్రాచీన కాలములలో రక్తమెట్లు వైద్యపరముగా ఉపయోగించబడెను?

9 రక్తమును ఒక మందుగా ఉపయోగించుట ఆధునికమైనదేమి కాదు. రీయె టానహిల్‌ వ్రాసిన ఫ్లెష్‌ అండ్‌ బ్లడ్‌ అను పుస్తకము, ఐగుప్తు మరియు ఇతర ప్రాంతములలో దరిదాపు 2,000 సంవత్సరములుగా, “కుష్ఠువ్యాధికి రక్తము ఏకైక నివారణగా పరిగణించబడెనని” సూచించుచున్నది. మానవ రక్తమును తీసికొనుటద్వారా మూర్ఛరోగము బాగుపడునని రోమీయులు నమ్మిరి. రక్తమును ఇట్లు ఒక “మందుగా” ఉపయోగించుటను గూర్చి టెర్టూలియన్‌ ఇట్లు వ్రాసెను: “మైదానమందలి ప్రదర్శనలో రక్తదాహముతో దుష్టులైన నేరస్థుల తాజారక్తమును సేకరించి . . . తమ మూర్ఛరోగ స్వస్థతకు దానిని తీసికెళ్లు వారిని ఆలోచించుము.” ఇది క్రైస్తవులు చేసినదానికి పూర్తిగా విరుద్ధమైయుండెను: “మనము మన భోజనముల యొద్ద జంతువుల రక్తమును సహితము కలిగియుండము . . . క్రైస్తవులకు వారి న్యాయవిచారణలలో మీరు వారికి రక్తముతో నిండిన భోజనపదార్థములను ఇవ్వజూచుచున్నారు. అది వారికి ధర్మవిరుద్ధమను విషయము మీకు బహుగా తెలుసు.” దానిలోని భావమును ఆలోచించుము: జీవమును సూచించిన రక్తమును లోనికి తీసికొనుటకు బదులుగా, తొలి క్రైస్తవులు మరణమెదుర్కొనుటకు సహితము ఇష్టపడిరి.—2 సమూయేలు 23:15-17 పోల్చుము.

10, 11. రక్తము విషయమై దేవుని కట్టడ రక్తమార్పిడి అంగీకరించుటను ఖండించునని ఎందుకు చెప్పవచ్చును?

10 నిజమే, ఆ కాలములలో రక్తమార్పిడి లేదు, ఏలయనగా రక్తమార్పిడుల ప్రయోగములు దగ్గరదగ్గర 16వ శతాబ్దములో ప్రారంభమాయెను. అయినను, 17వ శతాబ్దములో, కోపెన్‌హాగన్‌ విశ్వవిద్యాలయమందలి, శరీరశాస్త్ర పండితుడొకాయన ఇట్లు అభ్యంతరము తెల్పెను: ‘రోగముల అంతర్గత నివారణకొరకు మానవరక్తమును ఉపయోగించవలెనని వాదించువారు దానిని దుర్వినియోగపరచుచు బహుగా పాపము చేయుచున్నారు. నరమాంస భక్షకులు దండించబడుదురు. మానవరక్తముతో తమ గొంతు తడుపుకొను వారిని మనమెందుకు అస్యహించుకొనము. నోటిద్వారా లేక రక్తమార్పిడి పరికరములద్వారా, కత్తిరింపబడిన పరాయివ్యక్తి నరమునుండి రక్తము తీసికొనుటయు అటువంటిదే. ఈ చికిత్స మూలకర్తలు దైవిక నియమముద్వారా భీతావహమందు పట్టుబడుదురు.’

11 అవును, శతాబ్దముల పూర్వము సహితము, నరములద్వారా మరియు నోటిద్వారా రక్తమును తీసికొనుటను దేవుని నియమము ఖండించుటను ప్రజలు చూశారు. దేవుని వైఖరి కనుగుణ్యముగా, యెహోవాసాక్షులు గైకొను స్థానమును అర్థము చేసికొనుటకు, దీనిని గ్రహించుట ఈనాడు ప్రజలకు సహాయము చేయవచ్చును. జీవమును ఎంతో విలువైనదిగా పరిగణిస్తూ, వైద్యశ్రద్ధను గుణగ్రహించుచునే, నిజమైన క్రైస్తవులు సృష్టికర్తనుండి వచ్చిన బహుమానముగా జీవమును గౌరవింతురు, కావున రక్తము తీసికొనుటద్వారా దానిని పోషించుటకు వారు ప్రయత్నించరు.—1 సమూయేలు 25:29.

వైద్యపరముగా జీవరక్షణకరమా?

12. ఆలోచనాపరులైన ప్రజలు రక్తమార్పిడిని గూర్చి దేనిని కారణయుక్తముగా ఆలోచించవచ్చును?

12 అనేక సంవత్సరాలుగా నిపుణులు రక్తము ప్రాణములు రక్షించునని చెప్పిరి. రక్తము బాగా కోల్పోయిన కొందరు రక్తము ఎక్కించినప్పుడు బాగుపడిరని వైద్యులు వివరించవచ్చును. కాబట్టి ప్రజలు ఇట్లు అనుకోవచ్చును, ‘వైద్యపరంగా క్రైస్తవ వైఖరి ఎంత వివేకయుక్తము లేక అవివేకము?’ గంభీరమైన ఏ వైద్యవిధానమునైనను ఆలోచించుటకు ముందు, ఆలోచనాపరుడైన వ్యక్తి సాధ్యమగు ప్రయోజనములను మరియు రానైయున్న ప్రమాదములను నిర్ణయించును. మరి రక్తమార్పిడుల విషయమేమి? వాస్తవమేమనగా రక్తమార్పిడులు అనేక విపత్తులతో నిండియున్నవి. అవి మరణకరము కాగలవు కూడా.

13, 14. (ఎ) రక్తమార్పిడులు ప్రమాదకరమని నిరూపించబడిన విధానములు కొన్ని ఏమైయున్నవి? (బి) రక్తముయొక్క ఆరోగ్య ప్రమాదములను పోపుయొక్క అనుభవము ఎట్లు ఉదహరించినది?

13 ఇటీవలనే వైద్యులైన ఎల్‌. టి. గుడ్‌నొ మరియు జె. ఎమ్‌.  ఇట్లు వ్రాశారు: “రక్తమును సురక్షితము చేయుట మనకెంత తెలుసో అంత సురక్షితముగా రక్తముయొక్క సరఫరా ఉన్నదను సంగతి వైద్య సమాజమునకు తెలిసినను, రక్తమార్పిడి అన్ని సమయములలో అపాయమును కలిగియున్నది. బహుతరచుగా రక్తమార్పిడిద్వారా కలుగు సమస్య హెపటైటిస్‌ ఎ లేక బి (NANBH) కాకుండా మరొకటిగా కొనసాగుచున్నది; ఇతర సంభావ్యమైన చిక్కులలో హెపటైటిస్‌ బి, రోగనిరోధకత్వము తొలగింపబడుట, మార్పిడివలన కలుగు ప్రతిచర్య, రోగనిరోధక శక్తి అణగద్రొక్కబడుట, ఇనుము అత్యధికమగుట మున్నగునవి చేరియున్నవి.” ఆ గంభీరమైన అపాయములలో కేవలము ఒక్కదానిని ‘తక్కువలో తక్కువగా’ అంచనా వేసినను, ఆ నివేదిక తెల్పునదేమనగా: “సంవత్సరానికి దాదాపు 40,000 మందికి [ఒక అమెరికా సంయుక్త రాష్ట్రములలోనే] (NANBH) రావచ్చునని దీనిలో 10% శాతముకంటే ఎక్కువమందికి సిరోసిస్‌ (కాలేయపు వ్యాధి) మరియు/లేక హెపటోమా [కాలేయపు క్యాన్సర్‌] వచ్చు అవకాశము కలదు.”—ది అమెరికన్‌ జార్నల్‌ ఆఫ్‌ సర్జరీ, జూన్‌ 1990.

14 రక్తమార్పిడిద్వారా రోగము తెచ్చుకొను అపాయము ఎక్కువగా తెలిసిపోయినందున, ప్రజలు రక్తమార్పిడుల విషయమై తమ దృక్పధమును పునరాలోచించుచున్నారు. ఉదాహరణకు, 1981లో పోపు కాల్పులకు గురియైన తర్వాత, ఆయనకు వైద్యశాలలో చికిత్సచేసి పంపివేయుట జరిగినది. ఆ తర్వాత ఆయన మరలావచ్చి అక్కడే రెండునెలలు ఉండవలసివచ్చెను, ఆయన అనర్హుడిగా పదవీవిరమణ చేస్తాడన్నంతగా ఆయన పరిస్థితి తీవ్రరూపము దాల్చెను. ఎందుకనగా ఆయనకివ్వబడిన రక్తముద్వారా ఆయనకు సైటోమాగిలావైరస్‌ (జీవకణ విధానమును పాడుచేసి చివరకు మానసిక రోగిగా తయారుచేయు రోగము) సోకెను. కొందరిట్లు ఆశ్చర్యపడవచ్చును: ‘పోపుకు ఇచ్చిన రక్తము సహితము సురక్షితము కానట్లయిన, మనలాంటి సగటు ప్రజలకు చేయబడు రక్తమార్పిడుల విషయమేమి?’

15, 16. రక్తమును రోగ పరిశోధన చేసిననూ రక్తమార్పిడి ఎందుకు రక్షణకరము కాదు?

15 ‘కానీ వారు రోగసంబంధమైన రక్తమును పరిశీలించిచూడలేరా?’ అని ఎవరైనా అడుగవచ్చు. హెపటైటిస్‌ బి కొరకు పరిశీలించిచూచిన ఒక ఉదాహరణను విచారించుము, పేషంట్‌ కేర్‌ (ఫిబ్రవరి 28, 1990) ఇట్లు సూచించెను: “హెపటైటిస్‌ కొరకు విశ్వవ్యాప్తముగా రక్తమును పరిశీలించిన తదుపరి రక్తమార్పిడి తర్వాత అది సోకు సందర్భములు తగ్గెను, అయితే రక్తమార్పిడి తర్వాతవచ్చిన హెపటైటిస్‌ కేసులలో 5-10% ఇంకనూ హెపటైటిస్‌ బి కారణముగా వచ్చినవే.”

16 అటువంటి పరీక్షా విఫలత రక్తముద్వారా కలుగు మరొక అపాయము—ఎయిడ్స్‌ నందును చూడవచ్చును. ఈ ఎయిడ్స్‌ తెగులు, కలుషిత రక్తముయొక్క అపాయము విషయములో అనుకున్నదానికంటే అధికముగా ప్రజలను మేల్కొల్పినది. నిజమే, వైరస్‌ ఉనికిని కనుగొనుటకు రక్తమును పరిశీలించు పరీక్షలు ఇప్పుడు కలవు. అయితే, రక్తము అన్ని ప్రదేశములలో పరిశీలించబడుట లేదు, మరియు ప్రస్తుత పరీక్షలకు చిక్కకుండా ప్రజలు తమ రక్తములో ఎయిడ్స్‌ వైరస్‌తో అనేక సంవత్సరములు గడుపునట్లు కన్పించుచున్నది. కావున పరిశీలించి ఆమోదించబడిన రక్తమునుండి రోగులు ఎయిడ్స్‌ వ్యాధిని పొందగలరు—ఎయిడ్స్‌ వ్యాధిని పొందారు!

17. హాని వెంటనే కన్పించకపోయిననూ రక్తమార్పిడిలు ఎట్లు హానిచేయవచ్చును?

17 వైద్యులైన గుడ్‌నొ మరియ షక్‌ కూడా “రోగనిరోధక శక్తి అణగద్రొక్కబడుటను” గూర్చి ప్రస్తావించారు. అవును, సరిగా సమ్మిళితముచేసిన (క్రాస్‌మ్యాచ్డ్‌) రక్తము సహితము, క్యాన్సరు మరియు మరణమునకు దారితీయునట్లు రోగియొక్క రోగనిరోధక శక్తి విధానమును పాడుచేయగలదను రుజువు ఎక్కువగుచున్నది. ఆ విధముగా, కెనడాలో “కంతిని తొలగించు సమయములో రక్తమార్పిడి చేయించుకొనిన రోగులు ఆ తర్వాత తమ రోగనిరోధక శక్తిలో గణనీయమైన లోపమును అనుభవించిరని తల మరియు మెడ క్యాన్సరు రోగుల” అధ్యయనము చూపించినది. (ది మెడికల్‌ పోస్టు, జూలై 10, 1990) దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ వైద్యులు ఇలా రిపోర్టుచేశారు: “స్వరపేటిక క్యాన్సరు తిరగబెట్టు అన్ని సందర్భములలో అది రక్తము తీసికొనని వారిలో 14% గాను, రక్తము తీసికున్నవారిలో 65% గాను ఉన్నది. నోరు, గొంతు, ముక్కు లేక సైనస్‌కు సంబంధించిన క్యాన్సరు విషయములో తిరుగబెట్టుట రక్తమార్పిడి చేయని వారిలో 31% గాను, రక్తమార్పిడి చేయబడిన వారిలో 71% గాను ఉన్నది.” (ఆన్నల్స్‌ ఆఫ్‌ ఓటాలజీ, రినోలజీ & లార్నిజోలజీ, మార్చి 1989) శస్త్రచికిత్స సమయములో రక్తము తీసికొనిన వారిలో రోగనిరోధక శక్తి అణచివేయబడుట ఇతర వ్యాధులు వచ్చుటకు కారణమగుననుట కూడ అందలి వాస్తవము.—ఈ శీర్షికలోని బాక్సు చూడుము.

రక్తమునకు ప్రత్యామ్నాయములు ఏమైనాకలవా?

18. (ఎ) రక్తమార్పిడులలో చేరియున్న అపాయములు వైద్యులు దేనివైపు మళ్లునట్లు చేయుచున్నవి? (బి) ప్రత్యామ్నాయములను గూర్చిన ఏ సమాచారమును మీరు మీ వైద్యునితో పంచుకోవచ్చును?

18 కొందరిట్లు భావించవచ్చును, ‘రక్తమార్పిడులు హానికరము, అయితే ప్రత్యామ్నాయములు ఏమైనాకలవా?’ నిశ్చయముగా మనము ఉన్నత ప్రమాణముగల సమర్థవంతమైన వైద్యశ్రద్ధను కోరుదుము, కావున రక్తము ఉపయోగించకుండా గంభీరమైన వైద్య సమస్యలతో వ్యవహరించుటకు న్యాయసమ్మతమైన, సమర్థవంతమైన విధానములేమైనా కలవా? సంతోషదాయకమైన సంగతేమనగా, అటువంటివి కలవు. ది న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (జూన్‌ 7, 1990) ఇలా రిపోర్టుచేసినది: “రక్తమార్పిడిద్వారా సంక్రమించు అపాయముగల [ఎయిడ్స్‌] మరియు ఇతర అంటువ్యాధుల విషయమై ఎక్కువ జాగ్రత్తగల వైద్యులు, రక్తమార్పిడియొక్క అపాయములను, ప్రయోజనములను పునరాలోచించుచు, మొత్తానికే రక్తమార్పిడిని విసర్జించుటతో సహా, ఇతర ప్రత్యామ్నాయములవైపు తిరుగుచున్నారు.”b

19. రక్తమును నిరాకరించి ఇంకను విజయవంతముగా వైద్య చికిత్సను పొందగలవని నీవెందుకు నమ్మిక కలిగియుండగలవు?

19 యెహోవాసాక్షులు ఎంతోకాలముగా రక్తమార్పిడులను నిరాకరించుచున్నారు, ప్రాథమికముగా అందు ఆరోగ్య అపాయములున్నందున కాదు, అయితే రక్తము విషయమై దేవుని నియమమునకు లోబడుటవల్ల. (అపొ. కార్యములు 15:28, 29) అయినను, నిపుణులైన వైద్యులు తత్సంబంధమైన గండములున్నను రక్తము నుపయోగించకుండానే రోగులైన సాక్షులకు విజయవంతముగా చికిత్సచేశారు. వైద్యసాహిత్యములలో వ్రాయబడిన అనేక ఉదాహరణలలో కేవలము ఒకదానిగా, రోగులైన సాక్షులకుచేసిన గుండెమార్పిడినిగూర్చి అర్కీవ్స్‌ ఆఫ్‌ సర్జరీ (నవంబరు 1990) చర్చించినది. తమ మనస్సాక్షిని బట్టి రక్తమును ఉపయోగించకుండాచేయు అట్టి విధానమును కొందరు సాక్షులు అనుమతింతురు. ఆ రిపోర్టు తెల్పినదేమనగా: “యెహోవాసాక్షులుపై గత 25 సంవత్సరాలుగా జరిపిన గుండె శస్త్రచికిత్సల అనుభవము చివరకు రక్తముతో తయారైన వాటిని ఉపయోగించకుండా విజయవంతముగా గుండెమార్పిడి చేయుటకు దారితీసెను. . . . శస్త్రచికిత్స సమయమున, ఆ తర్వాత వెంటనే ఎలాంటి మరణములు సంభవించలేదు, మరియు ఆ వెంటనే రోగులుపై చేసిన అధ్యయనములు చూపించునదేమనగా శస్త్రచికిత్స వైఫల్యాల సంఖ్య వీరిలో అధికముగా లేదు.”

అత్యంత విలువైన రక్తము

20, 21. “రక్తము ఒక చెడ్డమందు” అను దృక్పధమును పెంపొందించుకొనకుండా క్రైస్తవులెందుకు జాగ్రత్తపడవలెను?

20 అయితే, మనలో ప్రతివారును తనకుతాను అడుగుకోవలసిన ఆత్మ-పరిశీలనా ప్రశ్న కలదు. ‘రక్తమార్పిడులను అంగీకరించుటకు నేను నిర్ణయించుకొన్నట్లయిన, ఎందుకు? నిజంగా, నా ప్రాథమిక, మూల కారణమేమైయున్నది?’

21 మార్పిడులకు సంబంధించి కలుగు అనేక అపాయములకు ఒకని గురిచేయని రక్తమునకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయములు కలవని మేము ముందే ప్రస్తావించాము. హెపటైటిస్‌ లేక ఎయిడ్స్‌ వంటి అపాయములు మతకారణములు లేకుండానే రక్తమును నిరాకరించుటకు అనేకమందిని కదిలించినవి. కొందరు దీనివిషయమై గట్టిగా మాట్లాడుదురు, అంటే వారు “రక్తము ఒక చెడ్డమందు” అను ధ్వజం క్రింద నడుచుచున్నట్లుందురు. క్రైస్తవుడు అటువంటి ధోరణి క్రిందికి ఆకర్షింపబడు సాధ్యత కలదు. అయితే అటువంటి ధోరణి ముందుకు దారిలేని రహదారిపై నడచుటవంటిదే. అదెట్లు?

22. జీవన్మరణముల ఏ వాస్తవిక దృష్టిని మనము గైకొనవలెను? (ప్రసంగి 7:2)

22 అతి ఉన్నతమైన వైద్యశాలలలో శ్రేష్ఠమైన వైద్యచికిత్స జరిగినను కొందరు వ్యక్తులు ఏదోఒక సమయములో చనిపోవుచున్నారని నిజమైన క్రైస్తవులు గ్రహింతురు. రక్తమార్పిడి జరిగినను, లేక జరుగకపోయినను ప్రజలు చనిపోవుచున్నారు. అలా చెప్పుట విధినిర్ణయ వాదము కాదు. అది వాస్తవమే. ఈనాటి జీవితములో మరణము ఒక వాస్తవము. రక్తము విషయమై దేవుని నియమమును తృణీకరించు ప్రజలు వెనువెంటనే లేక ఆ తర్వాతనైనను రక్తమునుండి తరచు హానిని అనుభవించుదురు. రక్తమార్పిడి కారణముగా కొందరు చనిపోవుచున్నారు కూడా. ఇంకను, మనమందరము తప్పక గ్రహించవలసిన దేమనగా, రక్తమార్పిడిద్వారా బ్రతికిబయట పడ్డవారు నిత్యజీవమును సంపాదించుకొనలేరు, కావున రక్తము వారి ప్రాణములను శాశ్వతముగా రక్షించునదిగా రుజువుపరచుకొనదు. మరొకవైపున, మత మరియు/లేక వైద్యకారణములనుబట్టి రక్తమును తృణీకరించినను, ప్రత్యామ్నాయ చికిత్సను అంగీకరించు అనేకులు వైద్యపరముగా మంచిగా ఉంటున్నారు. ఆ విధముగా వారు తమ జీవితమును అనేక సంవత్సరములు పొడిగించుకోవచ్చును—అయితే శాశ్వతముగా కాదు.

23. రక్తము విషయమైన దేవుని నియమములు మనము పాపులమని, విమోచన క్రయధనము మనకవసరమని ఎట్లు వివరించుచున్నవి?

23 ఈనాడు జీవించుచున్న మానవులందరు అసంపూర్ణులే మరియు క్రమేణి చనిపోవుచున్నారనునది మనలను రక్తమునుగూర్చి బైబిలు చెప్పుచున్న కీలకమైన అంశమునకు నడుపును. రక్తమును తినకూడదని దేవుడు సమస్త మానవజాతికి తెలియజేసెను. ఎందుకు? ఎందుకనగా అది జీవమును సూచించుచున్నది. (ఆదికాండము 9:3-6) ధర్మ నియమావళినందు, మానవులందరు పాపులేనను వాస్తవమును సంబోధించు నియమములను ఆయన ఉంచెను. ఇశ్రాయేలీయులు జంతుబలుల నర్పించుటద్వారా, తమ పాపములు కప్పబడవలసిన అవసరము కలదని వారు చూపించగలరని దేవుడు తెలియజేసెను. (లేవీయకాండము 4:4-7, 13-18, 22-30) ఈ దినములలో అటువంటి దానిని ఆయన మనలను అడుగకపోయిననూ, దానికి ఇప్పుడు అర్థము కలదు. విశ్వాసులందరి పాపములను పూర్ణముగా పరిహరించగల బలిని—విమోచన క్రయధనమును దయచేయుటకు దేవుడు సంకల్పించెను. (మత్తయి 20:28) ఇందువలన రక్తము విషయమై మనము దేవుని దృష్టిని కలిగియుండు అవసరము కలదు.

24. (ఎ) రక్తము విషయములో ఆరోగ్య అపాయములను ముఖ్యాంశముగా తీసికొనుట ఎందుకు తప్పిదము? (బి) రక్తము నుపయోగించుట విషయమై మన దృష్టిని నిజానికి ఏది ప్రాముఖ్యమైనదిగా చేయవలెను?

24 రక్తముతెచ్చు ఆరోగ్య సమస్యలపై ముఖ్యముగా దృష్టినిల్పుట తప్పిదమైయుండును, ఎందుకనగా అది దేవుని దృష్టికాదు. పందుల లేక ఇతర అపవిత్ర జంతువుల మాంసమును తినకుండుటద్వారా ప్రయోజనము పొందినట్లే, రక్తమును తినకుండుటద్వారా ఇశ్రాయేలీయులు కొంతమేరకు ఆరోగ్య ప్రయోజనములు పొందియుండవచ్చును. (ద్వితీయోపదేశకాండము 12:15, 16; 14:7, 8, 11, 12) అయితే, మాంసము తిను హక్కును దేవుడు నోవహుకు ఇచ్చినప్పుడు, అటువంటి జంతువుల మాంసమును ఆయన నిషేధించలేదని గుర్తుంచుకొనుము. కానీ మానవులు రక్తము తినకూడదని ఆయన ఆజ్ఞాపించెను. ఆరోగ్య సమస్యల సాధ్యతపై దేవుడు ముఖ్యముగా దృష్టినిల్పుచుండుట లేదు. రక్తము విషయమై ఆయన ఆజ్ఞకు అది ముఖ్యాంశము కాదు. ప్రాథమికముగా అది అనారోగ్యకరమని కాదుగానీ, అది అపరిశుద్ధమని ఆయన ఆరాధికులు రక్తముతో తమ జీవితముల పోషించుకొనుటకు నిరాకరించవలసి యుండిరి. కలుషితమైనదని కాదుగానీ, రక్తము ప్రశస్తమైనదని వారు దానిని తృణీకరించారు. కేవలము బలిపూర్వక రక్తముద్వారానే వారు క్షమాపణను సంపాదించగలరు.

25. రక్తమెట్లు జీవమును శాశ్వతముగా రక్షింపగలదు?

25 మనవిషయములోను అది సత్యము. ఎఫెసీయులు 1:7లో అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియుని [క్రీస్తు] యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.” దేవుడు ఒకని పాపములు క్షమించి అతని నీతిమంతునిగా దృష్టించినట్లయిన, ఆ వ్యక్తి అనంత జీవిత ఉత్తరాపేక్షను కలిగియుండును. కావున యేసు విమోచన క్రయధన రక్తము జీవమును—శాశ్వతకాలము కొరకు, అవును, నిత్యము రక్షింప శక్తిగలదైయున్నది. (w91 6/15)

[అధస్సూచీలు]

a ఆ ఆజ్ఞ ఇలా ముగిసెను: “వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. (మీరు వర్ధిల్లుదురు NW) మీకు క్షేమము (మంచి ఆరోగ్యము NW) కలుగును గాక.” (అపొ. కార్యములు 15:29) “మంచి ఆరోగ్యము” అను వ్యాఖ్యానము ఆ మేరకు ఒక వాగ్దానము కాదు, ‘మీరు రక్తమును లేక జారత్వమును విసర్జించినట్లయిన, మీకు మంచి ఆరోగ్యముండును.’ అది కేవలము ‘ఇక ఉంటాను’ వంటి మాటలవలె లేఖ ముగింపైయున్నది.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్టు సొసైటి వారిచే 1990లో ప్రచురింపబడిన రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? అను బ్రొషూరులో రక్తమార్పిడికి సమర్థవంతమైన అనేక ప్రత్యామ్నాయములు సమీక్షించబడినవి.

మీరు వివరించగలరా?

◻ యెహోవాసాక్షులు రక్తమార్పిడులను నిరాకరించుటకు ప్రాథమిక కారణమేమి?

◻ రక్తము విషయమై బైబిలు వైఖరి వైద్యపరముగా కారణరహితము కాదని ఏ రుజువు రూఢిపరచుచున్నది?

◻ రక్తము విషయమైన బైబిలు నియమముతో విమోచన క్రయధనము ఎట్లు ముడిపెట్టబడినది?

◻ రక్తము శాశ్వతముగా జీవములను రక్షింపగల ఒకేఒక మార్గమేమైయున్నది?

[24వ పేజీలోని చిత్రం]

పెద్దవిగా చేయబడిన ఎర్ర రక్తకణములు. “రక్తములో ప్రతి మైక్రోలీటరునందు (0.00003 ఔన్సు) 40 లక్షలనుండి 60 లక్షలవరకు ఎర్ర రక్తకణములు ఉండును.”—“ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా”

[క్రెడిట్‌ లైను]

Kunkel-CNRI/PHOTOTAKE NYC

[26వ పేజీలోని బాక్సు]

రక్తమార్పిడి మరియు అంటువ్యాధి

రక్తమార్పిడులు రోగిని అంటువ్యాధికి మరింత ఎక్కువ గురిచేయునా లేదాయని బహుగా పునఃసమీక్షించిన తర్వాత, డా. నీల్‌ బ్లమ్‌బెర్గ్‌ ఇలా తేల్చిచెప్పెను: “[విషయముయొక్క] 12 వైద్య అధ్యయనములలో 10, రక్తమార్పిడులు విశేషముగా మరియు వాటికవే బాక్టీరియా అంటువ్యాధుల అధిక అపాయముతో సంబంధము కలిగియున్నట్లు కనుగొనబడినవి . . . అంతేకాకుండా, కొన్ని అధ్యయనములు సూచించునట్లు రక్తమార్పిడియొక్క రోగనిరోధక ప్రభావములు ఎక్కువకాలము నిలిచియున్నట్లయిన శస్త్రచికిత్సకు కొంతకాలము ముందు జరిపిన రక్తమార్పిడి రోగియొక్క అంటువ్యాధి నెదుర్కొను శక్తిపై ప్రభావము చూపవచ్చును . . . ఈ వివరములను విపులీకరించి స్థిరపరచ గలిగినట్లయిన, శస్త్రచికిత్స తదుపరి వచ్చు తీవ్ర అంటువ్యాధులకు సర్వసాధారణమైన ఒకేఒక విశేషమైన చిక్కు సజాతి రక్తమార్పిడితో సంబంధముగలదై యున్నట్లు కన్పించుచున్నది.”

—ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ రివ్యూస్‌, అక్టోబరు 1990.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి