“స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశమునకు మీరు ఆహ్వానింపబడుచున్నారు
1989, నవంబరు నుండి స్వాతంత్ర్యమను అంశము క్రితమెన్నడులేనంతటి ప్రాముఖ్యతను సంతరించుకొంది. తూర్పు ఐరోపా దేశాలలోని ప్రజలు తాము గత 40 లేక అంతకంటె ఎక్కువ సంవత్సరాలుగా అనుభవించని దానికంటె ఎక్కువ స్వాతంత్ర్యమును అనుభవించుచున్నారు.
అయితే ఏ రాజకీయ స్వాతంత్ర్యము కంటెను ఎంతో ప్రాముఖ్యమైనట్టి ఒక స్వాతంత్ర్యమున్నది. దానినిగూర్చి దేవుని వాక్యమైన బైబిలులో మనము చదువగలము. ఒకసారి యేసు ఇట్లనెను: “మీరు. . .సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:32) అవును రోమీయులు 6:18, 22 లలో మనము చదువురీతిగా సమర్పించుకొన్న క్రైస్తవులు మానవ భయము పాపము మరియు మరణ బంధకమునుండి విడుదల పొందియున్నారు. “యెహోవా ఆత్మ యెక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండు”నని కూడా మనము చదివెదము. (2 కొరింథీయులు 3:17) నిజానికి దేవుని వాక్యము “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందు”నను తేజోవంతమైన భవిష్యత్ నిరీక్షణను కలిగియున్నది.—రోమీయులు 8:21.
ప్రస్తుత కాలమందు ఎవరైనా క్రైస్తవ స్వాతంత్ర్యమును పొందాలంటే తాను నిజమైన కృషిని చెయ్యాలి. అది అంత సులభమైన రీతిగా లభించేది కాదు. ఆ స్వాతంత్ర్యమును మనలో నుండి అపహరించుటకై ఉన్న శక్తులను బట్టి దానిని అనుభవిస్తూనే ఉండాలంటే అదనపు ప్రయత్నము అవసరము. ఆ శక్తులేమనగా: అపవాదియైన సాతాను, ఆతని దుష్టలోకము, మనము స్వతంత్రించుకొనియున్న పాపపు స్వభావములు. యెహోవా దేవుడు తన ప్రేరేపిత వాక్యముద్వారాను, తన ఆత్మద్వారాను, తన దృశ్యమైన సంస్థద్వారాను సహాయమును అందిస్తున్నాడు.—లూకా 11:13.
స్వాతంత్ర్యమును ప్రేమించువారందరికి తమ స్వాతంత్ర్యమందు వారిని బలపరచుటకు, ఈ సంవత్సరపు యెహోవాసాక్షుల జిల్ల సమావేశములు “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను మూలాంశమునకు న్యాయము చేకూర్చును. ఈ సమావేశములు మొత్తము మూడు దినములుండును. శుక్రవారము ఉదయము 10:20 ని.లకు ప్రారంభమై ఆదివారము సాయంకాలము 4:00 గం.లకు ముగియును. హాజరగువారందరు ప్రోత్సాహకరమైన ప్రసంగములు, ఆసక్తిదాయకమైన ఇంటర్వ్యూలు, ప్రయోజనకరమైన ప్రదర్శనలు, ఆకట్టుకొను బైబిలు నాటకము ద్వారా ఆత్మీయ ఉత్తేజముపొంది, బలపరచబడుదురు. అంతేగాక పాత, క్రొత్త స్నేహితుల సహవాసమువలన పొందు హృదయానందమును మరువలేము. వేలాదిమందితోకలసి మన రాజ్య సంబంధమైన పాటలను పాడుటలోను, హృదయ పూర్వక ప్రార్థనలో భాగము వహించుటయందును సంతోషించుదుము.
సమర్పించుకొన్న యెహోవా సేవకులందరు శుక్రవారము ఉదయము ప్రారంభమయ్యే ఈ సమావేశములకు హాజరగుటలో వారిని ఏదియు ఆటంక పరచనీయకూడదు. అంతేగాక బైబిలు, పాటల పుస్తకముతో పాటు, వ్రాసుకొనుటకు కావలసిన పెన్సిల్, నోట్‌బుక్‌ను తప్పక తీసుకుని రండి. స్వతంత్రులైన ప్రజలుగా మీ వాస్తవమైన ఆత్మీయ అవసరతను గుర్తించినవారై కూడా రండి.—మత్తయి 5:3. (w91 2/15)