“స్వచ్ఛమైన భాష” అను జిల్లాసమావేశమునకు రండి
బాబెలు కాలమునుండి భాషాబేధములు విభాగించుశక్తిగా యున్నవి. అచ్చట “ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించు”కొన తలంచిన ప్రజల ఉద్దేశ్యమును భంగపరచి, యెహోవా వారి భాషను తారుమారుచేసెను. (ఆదికాండము 11:4) బెల్జియంలో జరిగిన ఒకదానిని బట్టి భాషాబేధము ఎంతటి విభాగించుశక్తిని కలిగియున్నదో చూడవచ్చును. చాలాసంవత్సరముల క్రితము లువాయిన్ లోని కేథలిక్ యూనివర్శిటి భాషాపరముగా రెండుగా చీలిపోయెను.
మనుష్యులలోని బేధములకుగల కారణములలో భాష కేవలము ఒక్కకారణం మాత్రమే. జాతీయత, తెగ, విద్య, మరియు ఆర్ధికస్థాయి యితరకారణములైయున్నవి. అయితే యెహోవాసాక్షులు విభాగించు ఈ విషయములన్నిటిని అధికమించి నిజముగా ఐక్యమైయున్నారు.
గతవేసవిలో ఆశ్చర్యముగొలుపు యిట్టి ఐక్యత పోలెండులోని కోర్జొ (కాటోవైస్ దగ్గర), పోజ్నాన్, మరియు వార్సా పట్టణములలో స్పష్టమైనది. ఇచ్చటకు దాదాపు 20 విభిన్న భాషలు మాట్లాడు సాక్షులు 37 దేశములనుండి వచ్చారు. అయినను వీరందరివలన ఆశ్చర్యకరముగా అందరము ఒకటే అనుభవము ప్రదర్శింపబడినది. దీనికి కారణమేమి? అందరు లేఖనసత్యమను స్వచ్ఛమైన భాషను మాట్లాడిరి. ఇది ప్రవచనపూర్వకముగా జెఫన్యా 3:9లో యిలా ప్రవచింపబడినది: “వారందరు భుజములు కలిపి సేవించుటకై యెహోవానామమున పిలుచునట్లు అప్పుడు నేను (యెహోవాదేవుడు) వారికి స్వచ్ఛమైన భాషనిచ్చెదను.”
కాబట్టి ఒక మంచికారణముతో 1990 జిల్లాసమావేశములకు “స్వచ్ఛమైన భాష” పేరును కలిగియున్నవి. మానవ అసంపూర్ణత, సాతాను దుష్టలోకపు ప్రభావములు, మరియు అపవాది దానిదయ్యముల కుతంత్రపు క్రియలమూలంగా స్వచ్ఛమైన భాష మాట్లాడుట ఎప్పుడు అంతసులభము కాదు. మనలను విభాగించు స్వార్ధపర స్వభావములనుండి కాపాడుకొనుటకు మనము ఎల్లప్పుడు జాగ్రత్తగా యుండవలెను.
దేవుడు మనకెందుకు ఈ స్వచ్ఛమైన భాషనిచ్చాడు? యెహోవాను “భుజములు కలిపి” (యేకమనస్సుతో) సేవించుటకైయున్నది. ఇతర తర్జుమాలు సూచించుచున్న ప్రకారము “ఒకే కాడిక్రింద” (ది జెరూసలేము బైబిలు) “ఒకే అంగీకారముతో” (మోఫత్) “ఒకే భావముతో” (ఏన్ అమెరికన్ ట్రాన్స్లేషన్) మరియు “ఆయనసేవలో సహకరించుచు” (బైయింగ్టన్) దేవుని సేవించుటకైయున్నది.
ఈ సమావేశములయందలి ప్రసంగములు, ప్రదర్శనలు, అనుభవములు, ఒకే అంశముపై పలువురు చేయు ప్రసంగములు మరియు బైబిలు డ్రామాల ద్వారా స్వచ్ఛమైన భాషను ధారాళముగా మాట్లాడుటకు మనము ప్రోత్సహింపబడి ఉత్తేజము పొందుదుము. మరియు అవి మన సహోదరులతో ఎక్కువఫలవంతముగాను మరియు ఎక్కువ అనుగుణ్యతను కలిగి సేవించుటకును అవి మనలను కదలించును.
ఈ సమావేశములు గురువారము మధ్యాహ్నము 1:00 తరువాత కొద్దిసేపటిలో ప్రారంభమై ఆదివారము సాయంత్రము దాదాపు 4:00 గంటలకు ముగియును. కావున ప్రారంభ పాటకును మరియు ఆదివారము మధ్యాహ్నము జరుగు ముగింపు ప్రార్థనవరకు జరుగు అన్ని భాగములకును హాజరగుటకు ఇప్పుడే పథకము వేసుకొనుము.
తారీఖులు మరియు సమావేశస్థలములనుగూర్చి మీప్రాంతములోని స్థానిక యెహోవాసాక్షుల సంఘమునుగాని లేక ఈ పత్రికయొక్క ప్రచారకులను గాని అడిగి తెలుసుకొనుము.
మీ బైబిళ్లు, మరియు కీర్తనల పుస్తకముతో వచ్చి నోట్స్ తీసుకొనుటకు సిద్ధముగా యుండుము. మంచి ఆత్మీయ ఆకాంక్షతోను రమ్ము, అప్పుడు యెహోవాను సేవించుటకు, మరియు స్వచ్ఛమైన భాషను మాట్లాడుటకు మీరు సిద్ధులై వెళ్లుదురు. (w90 2⁄15)