కర్మ నీ జీవితమును ఏలవలెనా?
ఆ పట్టికలో కర్మను నమ్మని ఒకేవ్యక్తి యేసుక్రీస్తు. ఆయన ఉద్దేశ్యము ఏమైయుండెను?
మొదటి శతాబ్దములో యేసుయొక్క జీవన చరిత్ర (బైబిలు పుస్తకములైన మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను) చూపునదేమనగా వ్యక్తులు తమ భవిష్యత్తును ప్రభావితము చేయవచ్చును లేక వారికి ఏమి జరుగుతుందో ప్రభావితము చేయగలరు అని యేసు నమ్మియుండెను.
ఉదాహరణకు, దేవుడు “అడుగువారికి మంచి యీవులను ఇచ్చును” అనియు, “అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడున”నియు యేసు చెప్పెను. అదేవిధముగా యెరూషలేముయొక్క నివాసులు వారి జీవితములను కాపాడగల హెచ్చరికలను త్రోసిపుచ్చినప్పుడు యేసు వారి ప్రతిక్రియను కర్మపై వేయలేదు. దానికి బదులుగా ఆయన ఇట్లనెను: “కాని మీరు ఇష్టపడలేదు.”—మత్తయి 7:7-11; 23:37,38; 24:13.
యెరూషలేములో ఒక మరణపాత్రమైన ప్రమాదమునుగూర్చి ఆయన చెప్పిన దానిని బట్టి యేసుయొక్క దృష్టిని గ్రహించగలము. ఆయన ఇట్లన్నాడు: “సిలోయములోని గోపురముపడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను.” (లూకా 13:4,5) యేసు ఆ 18మంది మనుష్యుల మరణము కర్మవలన కలిగెనని చెప్పియుండలేదని గమనించుము, లేక ఆయన వారు ఇతరులకంటె ఎక్కువ దుష్టులైనందువలన చనిపోయారని చెప్పలేదు. దానికి బదులుగా ఆయన కాలములో కర్మవాదమును మనుష్యుని స్వతంత్ర ఇచ్ఛతో పొందిక చేయప్రయత్నించుచున్న పరిసయ్యులవలెకాక మనుష్యుడు తన వ్యక్తిగత భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చునని యేసు బోధించెను.
యేసు యొక్క అపొస్తలులు కూడా అదేవిధముగా, రక్షణ అవకాశము అందరికి అందుబాటులో ఉందని బోధించిరి. అపొస్తలుడైన పౌలు ఇట్లు వ్రాసెను: “రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములు బాల్యమునుండి నీవెరుగుదువు.” మరియు అపొస్తలుడైన పేతురు ఇట్లనెను: “కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి.” (2 తిమోతి 3:15; 1 పేతురు 2:3 మరియు అపొస్తలుల కార్యాలు 10:34, 35; 17:26, 27 కూడా చూడుము.) హేస్టింగ్స్ ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ రిలిజియన్ అండ్ ఎతిక్స్ చూపించునదేమనగా, రెండవ మరియు మూడవ శతాబ్దముల వ్రాతకర్తలు జస్టిన్, ఓరిజెన్, మరియు ఐరేనియస్ వంటివారు ‘షరతులేమీ లేని విధి నిర్ణయాన్ని ఎరిగియుండలేదు. వారు స్వతంత్ర ఇచ్ఛను బోధించిరి.’
అయితే, యూదులతో సహా వారిచుట్టూ ఉన్న ఇంతమంది కర్మయొక్క వివిధ రూపములను నమ్మినపుడు యేసు మరియు తొలి క్రైస్తవులు మనుష్యుని కర్మ ముందే నిర్ణయించబడిందని ఎందుకు నమ్మలేదు? ఒక కారణమేమనగా ఆ ఆలోచనయే సమస్యలను కలిగియున్నది. పేర్కొనుటకు రెండు ఏమనగా: కర్మవాదము యెహోవా దేవుని లక్షణములకు విరుద్ధముగా ఉన్నది; అది స్థాపించబడిన వాస్తములచే ఖండించబడినది. దానికంటే ఎక్కువగా, అది నీ ప్రస్తుత మరియు భవిష్యత్ జీవితమును ప్రమాదమునందుంచగలదు. ఇది ఎట్లో, నీవు సన్నిహితముగా చూచినపుడు తెలుసుకొనగలవు.
కర్మవాదముయొక్క భావములు మరియు దేవుని లక్షణములు
సా.శ.పూ. 3వ శతాబ్దములో తత్వజ్ఞాని సీటియం యొక్క జీనో ఏథెన్సులోని తన విద్యార్థులకు “కర్మయొక్క నిర్ణయాలు మరుగుచేయబడిన రీతిలో మనమంచికే అని స్వీకరించవలెను” అని బోధించెను. అయితే ఒకరోజు జీనో తన దాసుడు దొంగతనము చేశాడని తెలుసుకొన్నపుడు, తన తత్వజ్ఞానము యొక్క భావనలతో ముఖాముఖిగా ఎదుర్కొనవలసివచ్చెను. ఎట్లు? అతడు ఆ దొంగను కొట్టినపుడు, ఆ దాసుడు ఇట్లు జవాబునిచ్చెను: “అయితే నేను దొంగతనము చేయవలెనని నాకర్మలో ఉందికదా.”
జీనోయొక్క దాసుడు తలంచదగిన అంశమును లేవనెత్తెను. ప్రతి వ్యక్తియొక్క జీవన విధానము ముందే నిర్ణయించబడిందని నీవు నమ్మినట్లయితే ఒకవ్యక్తి దొంగైనందుకు దూషించడము, ఒక నారింజ విత్తనము నారింజ చెట్టయినందుకు దూషించినట్టే అవుతుంది. చివరికి ఆ వ్యక్తి మరియు ఆ విత్తనము విధించిన క్రమము ప్రకారంగానే తయారవుట సహజము. ఈవిధమైన ఆలోచనయొక్క అంతిమ పరిణామమేమైయుండును?
అయితే నేరస్థులు కేవలము వారి కర్మను అనుసరించినట్లయితే, దానిని విధించినవాడు వారి క్రియలకు బాధ్యుడైయున్నాడు. అది ఎవరైయున్నారు? కర్మవాదుల ప్రకారంగా దేవుడే. ఈ ఆలోచనతో ఒక పెద్ద అడుగుముందుకువేస్తే, మనుష్యుడి ద్వారా చేయబడిన ప్రతివిధమైన దుష్టత, హింస మరియు అరాచకమునకు మొదటి కారణము దేవుడే అయ్యుండాలి. నీవు దానిని అంగీకరింతువా?
నీడర్‌ల్యాండ్స్ థియోలజిస్క్ టిడ్‌ష్రిప్ట్ (డచ్ థియాలజి పత్రిక) లోని ఒక వ్యాసము అటువంటి కర్మవాద దృష్టినిగూర్చి ఇట్లనెను: “అది దేవుని చిత్రీకరించు విధానము, కనీసము క్రైస్తవులకు అస్వీకృతముగా ఉంది.” ఎందుకు? దైవావేశమువలన కలిగిన బైబిలు రచయితలు దేవునిని చిత్రీకరించు దానికి అది వ్యతిరేకముగా ఉన్నది. ఉదాహరణకు, దైవావేశము వలన వ్రాయబడిన కీర్తనల పుస్తకమునుండి కొన్ని వచనములను గమనించుము: “నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు.” “దుష్టులను బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యలు.” “కపట బలాత్కార్యమునుండి అతడు వారి (దేవుడు నియమించిన మెస్సియా) ప్రాణమును విమోచించును.” (కీర్తన 5:4; 11:5; 72:14) స్పష్టముగా కర్మవాదము యొక్క భావములు మరియు దేవుని లక్షణములు పరస్పర విరోధమును కలిగియున్నవి.
కర్మవాదము మరియు వాస్తవములు
అయితే ప్రకృతిసంబంధమైన విపత్తుల సంగతేమిటి? అవి కర్మద్వారా విధించబడినవి కావున నివారించుట అసాధ్యము కాదా?
వాస్తవములు ఏమి స్థాపించుచున్నవి? ప్రకృతిసంబంధమైన విపత్తులను పరిశీలించుట ద్వారా కనుగొన్నవాటిని డచ్ వార్తాపత్రిక యన్‌ఆర్‌సి హేండెల్స్‌బాల్డ్‌లో ముద్రించిన దానిని గమనించుము: “ఇంతవరకు భూకంపములు, వరదలు, కొండచరియలు విరుగుట మరియు తుఫానులు. . .ఎల్లప్పుడు ప్రాకృతికమైనవని తలంచబడెడివి. అయితే సూక్ష్మంగా పరిశీలించినపుడు, ప్రకృతితో మనుష్యుని తీవ్రజోక్యమువలన, పరిసరములు తమకు తాము విపత్తులనుండి కాపాడుకొను సామర్థ్యమును కోల్పోయినవి. ఆ కారణముచేత ప్రాకృతిక విపత్తులు మునుపటికంటె ఎక్కువ జీవితములను బలితీసుకుంటున్నవి.”—ఇటాలిక్స్ మావే.
మునుపటి వ్యాసములో ప్రస్తావించిన బంగ్లాదేశ్‌లోని వరదలు దానికి ఒక ఉదాహరణము. “నేపాల్, ఉత్తరభారతదేశము మరియు బంగ్లాదేశ్‌యొక్క విస్తీర్ణ ప్రాంతములో అడవులను నాశనముచేయుట, బంగ్లాదేశ్‌ను ఇటీవలి సంవత్సరములలో పీడిస్తున్న వరదలకు కారణము” అని శాస్త్రజ్ఞులు ఇప్పుడు చెప్పుచున్నారు. (వాయిస్ మ్యాగజైన్) మరియొక నివేదిక చెప్పునదేమనగా అడవులను కొట్టివేయుట బంగ్లాదేశ్‌లోని వరదలను, ప్రతి 50 సంవత్సరములకు ఒకసారినుండి ప్రతి 4సంవత్సరాలకు ఒకసారి వచ్చేవిధంగా పెంచింది. లోకములోని ఇతర భాగములలో కూడ మానవ జోక్యము ఇదేరీతిగా అనావృష్టి, అడవి మంటలు, కొండచరియలు విరుగుట మొదలగు విపత్కర పరిణామాలకు దారితీసింది. అవును మానవ చర్యలే తరచుగా ప్రాకృతిక విపత్తులను కలుగజేస్తాయి లేక వాటిని తీవ్ర పరుస్తాయి గాని మర్మమైన కర్మకాదు.
అది అలా ఉండగా మానవ చర్యలు దానికి వ్యతిరేకమైనది కూడా చేయగలగాలి. అదేమనగా విపత్తులను తగ్గించడము. మరి అలా జరుగుతుందా? రూఢిగా, ఈ వాస్తములను గమనించుము. యుయన్‌ఐసిఇఫ్ (ఐక్యరాజ్య సమితి యొక్క పిల్లల నిధి) తెలియజేయునదేమనగా, ఎన్నో సంవత్సరాలనుండి వందలకొలది పిల్లలు బంగ్లాదేశ్ లోపలి ప్రాంతములలో గుడ్డివారయ్యారు. ఇది మార్చబడలేని కర్మవలన కలిగినదా? ఎంతమాత్రము కాదు. యుయన్‌ఐసిఇయఫ్ యొక్క కార్మికులు, అక్కడి తల్లులు అన్నముతో సహా పండ్లు మరియు కూరగాయలను తమ కుటుంబములకు పెట్టవలెనని నమ్మించిన తరువాత, కంటి రోగము పట్టువదిలింది. ఇప్పటివరకు, ఈ ఆహారపు మార్పువలన బంగ్లాదేశ్‌లోని వందలకొలది పిల్లలు గ్రుడ్డితనము నుండి కాపాడబడ్డారు.
అదేవిధముగా, పొగత్రాగని ప్రజలు పొగత్రాగువారికంటే సగటున మూడు నుండి నాలుగు సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు. వాహనములలో ప్రయాణించువారిలో సీటుబెల్టు ధరించినవారు ధరించని వారికంటే తక్కువగా తీవ్ర ప్రమాదములకు గురి అవుతారు. స్పష్టముగా, మీ స్వంతచర్యలే మీ జీవితములను ప్రభావితము చేయును గాని కర్మకాదు.
కర్మవాదముయొక్క ప్రాణాంతకమైన పరిణామాలు
ముందు ప్రస్తావించబడినట్టుగా కర్మవాదము మీ జీవిత పరిమాణమును కూడా తగ్గించగలదు. ఎట్లు? “కర్మవాదముయొక్క భీకర ఉదాహరణములు’ అనుదానిని చర్చిస్తూ ది ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ రిలిజియన్ ఇట్లు చెప్పుచున్నది: “వ్యక్తిగత జీవితములకంటే అమూల్యమైనదిగా ఎంచబడిన విధి, నిర్ణయము (స్కిక్సాల్) అను ఆలోచనకు ప్రతిస్పందిస్తూ, రెండవ ప్రపంచ యుద్ధమునుండి ఆత్మ హత్యతో కూడిన జపానీయుల టార్పెడో దాడులు మరియు హిట్లర్ పరిపాలనలో యస్‌యస్ (స్కుట్స్‌స్టాఫెల్) నివాసస్థలములో జరిగిన ఆత్మహత్యల గూర్చి మనకు తెలుసు.” మరియు అదే మూలము ఇటీవల జరిగిన దానిని గూర్చి ఇట్లు వ్రాయుచున్నది. “ఇస్లాంను బెదిరిస్తున్నవని పరిగణించబడిన కొన్ని గురులపై మతపరంగా ప్రేరేపించబడిన ఆత్మహత్యతో కూడిన దాడులు సమీప తూర్పులోని వార్తా పత్రికలలో క్రమముగా చోటుచేసుకున్నవి.” ఆ లేఖ చెప్పినట్టుగా “ఒకడు చనిపోవలెనని వ్రాయబడకపోతే, అతనికి ఏ హాని కలుగదు” అని నమ్మి వేలమంది సైనికులు యుద్ధరంగములో ప్రవేశించారు.
అయితే గౌరవించబడిన ముస్లీమ్ బోధకులు కూడా అటువంటి నిర్లక్ష్యకర ప్రవర్తనను తిరస్కరించారు. ఉదాహరణకు ఒక కాలిఫ్ ఇలా అన్నాడు: “మంటలో ఉన్నవాడు దేవుని చిత్తమునకు అప్పగించుకోవాలి గాని, మంటలో లేనివాడు మంటలోనికి దూకనవసరము లేదు. అసంతోషకరంగా, సమూహములకొలది సైనికులు ఆ కాలిఫ్ యొక్క సలహాకు అనుగుణంగా నడుచుకొనలేదు. సుమారు ఎనిమిది సంవత్సరముల యుద్ధములో ఇరాన్ దాదాపు 4,00,000 మరణములతో బాధపడింది—ఇది రెండవ ప్రపంచయుద్ధములో సంయుక్త రాష్ట్రములలో చనిపోయిన వారికంటే ఎక్కువ. స్పష్టముగా కర్మవాదము నీ జీవిత కాలమును తగ్గించగలదు. అది నీ భవిష్యత్తును కూడా ప్రమాదములో ఉంచగలదు. ఎట్లు?
ఒక కర్మవాది, గతములోనే భవిష్యత్తు మార్పుచేసికొనను వీలులేకుండా నిర్ణయించబడినదని నమ్మును గనుక అది అతని వ్యక్తిత్వంలో ఒక ప్రమాదకరమైన లక్షణమును పెంపొందించ వచ్చును. ఏ లక్షణము? ది ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ థియోలజి ఉత్తరమిచ్చుచున్నది: “తప్పించుకొనలేని సాంఘిక క్రమములో ఒకవ్యక్తి నిస్సాహాయుడుగా, స్వల్పమైన వాడుగా భావించవచ్చును. ఇది స్తబ్దతను కలుగజేసి తద్వారా, ప్రతిదికూడా స్పష్టముకాని, శక్తిగల కర్మపై ఆధారపడి ఉందను మూఢనమ్మకముతో కూడిన వివరమును గట్టిగా పట్టుకొనుటకు నడుపును.”
స్తబ్దత ఎందుకు ప్రమాదకరమైయున్నది? అది తరచుగా ఓటమి మనోభావమునకు దారితీయును. ఇది కర్మవాదిని ఏ విషయములోను ముందడుగు వేయకుండాచేసి, దేవుని అద్భుత ఆహ్వానమునకు కూడా స్పందించకుండా చేస్తుంది: “దప్పిగొనిన వారలారా నీళ్లయొద్దకు రండి. . .చెవియొగ్గి, నాయొద్దకు రండి. మీరు వినినయెడల మీరు బ్రతుకుదురు.” (యెషయా 55:1-3) కర్మపై నమ్మకమును బట్టి ఒకడు “రమ్ము” మరియు “వినుము” అనునది చేయుటకు తప్పిపోయినట్లయితే, అతడు రానైయున్న పరదైసుగా పునరుద్దరించబడిన భూమిపై నిరంతరము “బ్రతుకు” అవకాశమును కోల్పోవును. ఎంతటి విలువైన మూల్యమును చెల్లించుటయై యున్నది!
కావున మీరు ఎక్కడ నిలిచియున్నారు? కర్మవాద అభిప్రాయములపై ఆధారపడి ప్రజలు ఆలోచించు ప్రాంతములో నీవు పెరిగినట్లయితే నీవు ఆ నమ్మకమును ప్రశ్నించకుండా స్వీకరించియుండవచ్చు. అయినప్పటికి ఈ వ్యాసములో చర్చించబడిన ప్రతికూలమైన హేతువులు, నీ ప్రస్తుత మరియు భవిష్యత్ జీవితములు నీ స్వంత క్రియలచే దిద్దబడతాయని చూచుటకు నీకు సహాయము చేసియుండవచ్చు.
నీవు చూచినరీతిగా కారణసహితమైన తర్కము, వాస్తములు, అన్నిటికంటే పైగా పరిశుద్ధ లేఖనములు నీవు మరణపాత్రమైన ఓటమి మనోభావానికి లోనగ కూడదని చూపించుచున్నవి. దానికి బదులుగా, యేసు ప్రబోధించిన రీతిగా “తిన్నని ద్వారములో ప్రవేశించుటకు వ్యధచెందుడి.” (లూకా 13:24 ది ఎంఫటిక్ డయాగ్లట్) ఆయన భావమేమైయుండెను? ఒక బైబిలు వ్యాఖ్యాత ఇట్లు వివరించుచున్నాడు: “ఈ పదము (వ్యధ చెందుడి) గ్రీకు ఆటలనుండి తీసుకొనబడినది. వారి పరుగులలో వారు శ్రమించారు, లేక వ్యధచెందారు లేక విజయమును సంపాదించుటకు వారు తమ పూర్తి శక్తిని వాడారు. జీవితములో నీవు ఓటమికి లోబడేబదులు, యేసు ఉద్భోదించురీతిగా విజయము కొరకు నీవు శ్రమించవలెను.
కావున, కర్మవాదముతో ప్రేరేపింపబడిన స్తబ్ధతను తీసివేసికొనుము. దేవుని వాక్యము ఉద్భోదించునట్లుగా జీవపు పరుగులో ప్రవేశించుము. మరియు కర్మవాదము నిన్ను నిదానించునట్లు చేయనీయకుము. (1 కొరింథీయులు 9:24-27 చూడుము) వేగమును పెంపొందించి, ఈ ప్రేరేపించబడిన ఆహ్వానమునకు వడిగా ప్రత్యుత్తరమిమ్ము. “నీవును నీ సంతానమును బ్రతుకునట్లు జీవమును కోరుకొనుము.” నీవు ఆ నిర్ణయమును ఎట్లు చేయగలవు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనుట ద్వారా అలా చేయుట విజయమునకు దారితీయును. ఎందుకనగా “యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యుకును మూలమైయున్నాడు.”—ద్వితీయోపదేశకాండము 30:19, 20. (w90 8/15)
[7వ పేజీలోని చిత్రాలు]
మోషే కర్మను బోధించలేదుగాని: “నీవు బ్రతుకునట్లు జీవమును కోరుకొనుము” అని దృఢముగా పురికొల్పెను.