కర్మపై నమ్మకము నీ జీవితమును ఏలుచున్నదా?
సెప్టెంబరు 1988లో విపత్తు సంభవించినది. గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల తీర (డెల్టా) ప్రాంతంలో కనికరంలేని నీళ్లు తొమ్మిది మీటర్ల ఎత్తు లేచి బంగ్లాదేశ్‌లోని నాలుగు భాగములలో మూడుభాగములను ముంచివేశాయి. వేలమంది మునిగిపోయారు. సుమారు 3,70,00,000 మంది ఇండ్లులేకుండా నిరాశ్రయులయ్యారు. 60,000 కిలోమీటర్ల రోడ్లు కనిపించకుండా పోయాయి.
అటువంటి వరదలు బంగ్లాదేశ్‌ను పదేపదే ముంచివేశాయి గనుక, ఒక వార్తా పత్రిక ఆ దేశమును “దురదృష్టపు డెల్టా” అని పిలిచింది. ఆ వర్ణన, ఎందరో వ్యక్తులు అటువంటి అధైర్యపరచు విపత్తులకు కారణము విధి, లేక కర్మ అని నమ్ముదురని ప్రతిబింబిస్తుంది.
ఒకవేళ ఇతరులు జీవితమును కర్మ ఏలదని భావించినను కర్మవాద ఉద్దేశ్యములు భూగోళమంతా ఉన్నాయి. ఎందుకు అనేకమంది కర్మను నమ్ముతారు, మరియు కర్మవాదమనగానేమి?
మతముయొక్క పాత్ర
“ఫేట్” (కర్మ) అనే పదము లాటిన్ లోని ఫాటమ్ అను పదమునుండి వచ్చినది. దానికి “ముందుగా చెప్పబడినది”a అని అర్ధము. సంఘటనలు ముందే నిర్ణయించబడినవని మరియు మనుష్యులు వాటిని మార్చుటకు శక్తిహీనులని కర్మవాదులు నమ్ముతారు. ఈ ఉద్దేశ్యములు వేరువేరు మతముల ద్వారా వ్యాపించబడినవి మరియు ఇది లక్షలాది నమ్మువారి దృష్టిని రూపుదిద్దుతున్నది. లోకములోని మూడు పెద్దమతములను ఒకసారి చూసినట్లయితే, కర్మ ఒకే ముఖముతో వేరువేరు రూపములలో అనగా హిందూ మందిరములు, ఇస్లాం మసీదులు, క్రీస్తుమతసామ్రాజ్యపు చర్చీలు ఆకారములలో భిన్నముగా ఉన్నట్లే ఉన్నవి.
ఉదాహరణకు ఈ లోకములోని 90కోట్ల ముస్లీమ్‌లు, కర్మ (కిస్మత్) దేవుని చిత్తమునుబట్టి నిర్ణయించబడుతుందని అంటారు.b ఖురాన్ ఇట్లు ప్రకటిస్తుంది: “ఏ కీడు భూమిపైకి రాదు. . .అయితే మనము దానిని తేకముందు అది ముందుగానే పుస్తకములో వ్రాయబడి ఉంటుంది.” “మరియు ఒక ఆత్మ అల్లా అనుమతి లేనిదే చనిపోదు, సమయము నిర్ణయించబడినది.—సురా 57:22; 3:145.
కర్మ అనునది క్రియా ప్రక్రియల నియమము—కర్మ యొక్క వేరొకరూపము—లోకములోని 70 కోట్ల హిందూ జీవితములను ప్రభావితము చేస్తుంది. ఒక హిందువుని ప్రస్తుత జీవితములో జరుగు సంఘటనలు అతని పూర్వజన్మలో చేసిన కార్యములపై ఆధారపడి ఉంటాయని అంటారు. హిందు పురాతన గ్రంథమైన గరుడ పురాణము ఇట్లనుచున్నది. “ఒకడు తన పూర్వజన్మలో చేసిన పనులు తరువాత జన్మలో ఏవిధముగా బ్రతుకునో నిర్ణయించును, దానితో సహ తాను ఏవిధమైన శరీరక మరియు మానసికరోగములకు గురి అవుతాడో కూడా నిర్ణయించును. . .ఒక మనుష్యుడు తన కర్మను బట్టి తన జీవితములో పొందును.”
సుమారు 170 కోట్ల సభ్యులుగల క్రీస్తుమతసామ్రాజ్యపు సంగతేమి? నిజమే క్రీస్తు మతసామ్రాజ్యములో కొందరు కర్మ స్థానములో దేవుని మరియు కర్మవాదానికి బదులు పూర్వనిర్దానను నమ్ముతామని చెప్పవచ్చు. అయితే ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ అండ్ ఎతిక్స్ ఒప్పుకొనునదేమనగా: “క్రైస్తవత్వం కర్మపై ఏమాత్రము నమ్మకము కలిగిలేదని చెప్పలేము.” కొన్ని క్రీస్తుమతసామ్రాజ్యపు శాఖలు 16వ శతాబ్దపు సంస్కరణకర్తయైన మార్టిన్ లూథర్ నమ్మినదానిని ప్రతిధ్వనిస్తున్నారు. ఆయన ఒకసారి ఇట్లనెను: “మనుష్యుడు చెక్కమొద్దు, ఒక రాయి, మట్టిముద్ద లేక ఉప్పు స్తంభము వలె స్వతంత్రతలేనివాడై యున్నాడు.”
నాణెములను ఎగురవేయుట మరియు నక్షత్రములను చదువుట
అటువంటి కఠినమైన ఉద్దేశ్యములు క్రీస్తుమతసామ్రాజ్యములోని అత్యధికులలో అంత ప్రభావకరంగా లేనప్పటికి, దాని సభ్యులలో అనేకులు ఆ నమ్మకమును “ఐహికరూపములో” స్వీకరిస్తారని ఒక వేదాంతి ఒప్పుకున్నాడు. ఆ రూపములో కర్మ చిరునవ్వు ధరించుకొని అదృష్టమని పిలువబడవచ్చును. ఆ అదృష్టమును లేక కర్మను అర్ధిస్తూ నాణెములను ఎగురవేయు ఎందరినో నీవు ఎరిగియుందువు. అది కేవలము ఒక ఆచారమని వారు అన్నప్పటికి, దానిని వారు చేయుచునే యుందురు, మరియు కొన్ని సమయములలో అది వారికి పనిచేయుచున్నట్టు కనిపించును. ఉదాహరణకు, ది న్యూయార్కు టైమ్స్ ఇటీవల అమెరికా సంయుక్త రాష్ట్రములలో జీవించుచున్న ఒక వ్యక్తి లాటరీ టికెట్టు కొన్నతరువాత అతడు నాణెమును ఎగురవేయగా బొమ్మ పడిందని వ్రాసారు. అతడు ఇలా అన్నాడు: “ప్రతిసారి నేను నాణెము ఎగురవేసినప్పుడు బొమ్మపడితే తప్పకుండా నాకు ఒకమంచి విషయము జరుగుతుంది.” ఈసారైతే అతడు 257 లక్షల డాలర్లను గెలిచాడు. దీని తరువాత అదృష్టంపై లేక కర్మపై అతనికి ఉన్న నమ్మకం తగ్గుతుందంటారా?
కొందరు నాణెములు ఎగురవేయడాన్ని గూర్చి నవ్వుతారు. అయితే వారు నక్షత్రముల కదలికనుబట్టి భవిష్యత్తు పూర్వమే విధించబడినదని నమ్ముతారు. ఉత్తర అమెరికాలోనే 1,200 వార్తాపత్రికలు జోతిష్యసంబంధమైన నక్షత్రస్థానములను ప్రచురిస్తాయి. ఒక అభిప్రాయసేకరణలో సంయుక్త రాష్ట్రములలోనే 55శాతం యౌవనులు జోతిష్యం పనిచేస్తుందని నమ్ముతారని తెలిసింది.
అవును అది కిస్మెత్, కర్మ, దేవుడు, అదృష్టము లేక నక్షత్రములు అని పిలువబడినను, కర్మపై నమ్మకము భూమండల మంతటా ఉంది మరియు ఎన్నో సంవత్సరాలనుండి ఉండియున్నది. ఉదాహరణకు ఇక్కడ చూపబడిన చరిత్రాత్మక వ్యక్తులలో కేవలము ఒక్కరు మాత్రమే కర్మవాదమును నమ్మియుండలేదని మీకు తెలుసా? ఎవరు నమ్మలేదు? మరియు కర్మనుగూర్చి ఆయన అభిప్రాయము మిమ్మును ఎట్లు ప్రభావితము చేయగలదు? (w90 8/15)
[అధస్సూచీలు]
a ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్, వాల్యూమ్ 5, పేజి 290, ఇలా చెప్పుచున్నది: “ఫేట్, (కర్మ) అను ఈ ఇంగ్లీషు పదము ఫాటమ్ అను లాటిన్ పదమునుండి వచ్చినది. (ముందుగా చెప్పబడినది, ప్రవచనాత్మక ప్రకటన, భవిష్యత్తు మాట, దైవిక నిర్ణయము).”
b “కిస్మెత్ ఫేట్ అనుమాటకు సర్వశక్తిగల చిత్తము అనుభవములో మాత్రమే వేరైయున్నది; ఈ రెంటిలో దేనికైనను భిన్నముగా మానవులు ఎంతమొరపెట్టినను నిష్‌ప్రయోజనమే.”—హేస్టింగ్స్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ అండ్ ఎతిక్స్, వాల్యూమ్ V, పేజి 774.
[4వ పేజీలోని బాక్సు]
కర్మవాదమును ఎవరు నమ్మారు?
మస్కారిపుత్ర గోసల
భారతదేశపు తపస్వి,
క్రీ.పూ. 6/5వ శతాబ్దము
సిటియంయొక్క జీనో
గ్రీకుతత్వవేత్త,
క్రీ.పూ. 4/3వ శతాబ్దము
పుబ్లియస్ వర్జిలియస్ మారో
రోమీయ కవి,
సా.శ.పూ. మొదటి శతాబ్దము
యేసుక్రీస్తు
క్రైస్తవత్వముయొక్క స్థాపకుడు,
క్రీ.శ. 1వ శతాబ్దము
జాహ్మా, సహ్వాన్ కుమారుడు
ముస్లీమ్ బోధకుడు,
క్రీ.శ. 8వ శతాబ్దము
జాన్ కెల్విన్
ఫ్రెంచ్ వేదాంతి మరియు
సంస్కరణకర్త క్రీ.శ. 16వ శతాబ్దము.