కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 9/1 పేజీలు 4-7
  • బైబిలు విధి యందు నమ్మకాన్ని బోధిస్తుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు విధి యందు నమ్మకాన్ని బోధిస్తుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎవరు నిందార్హులు?
  • ‘కాలవశముచేతను, అనూహ్యమైన సంఘటనచేతను’
  • అపరిపూర్ణత యొక్క విధ్వంసకర పరిణామాలు
  • విధి యందు నమ్మకం—దాని వినాశకర ప్రభావాలు
  • దేవునితో మన సంబంధానికి ఒక అడ్డుగోడా?
  • విధి నిరంకుశత్వం నుండి స్వతంత్రులు కావడం
  • విధి విలాసమా లేక కేవలం యాదృచ్ఛికమా?
    తేజరిల్లు!—1999
  • మీ జీవితం విధిచే నియంత్రించబడుతుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • కర్మపై నమ్మకము నీ జీవితమును ఏలుచున్నదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 9/1 పేజీలు 4-7

బైబిలు విధి యందు నమ్మకాన్ని బోధిస్తుందా?

నిందారోపణ, అపవాదు! సమాజంలోని ఒక గౌరవనీయ సభ్యుడు, ఒక అబద్ధ నివేదిక ద్వారా తన పేరుకు లేక ప్రతిష్ఠకు నష్టం వాటిల్లిందని విశ్వసిస్తే, ఆయన విషయాలను సరి చేయడానికి బలవంతపెట్టబడినట్లు భావిస్తాడు. ఆయన ఆ నిందారోపణకు బాధ్యులైన వారికి వ్యతిరేకంగా చట్టరీత్యా చర్య కూడా తీసుకోవచ్చు.

మరి, విధివాదం సర్వ శక్తిమంతుడైన దేవునికి వ్యతిరేకంగా అపవాదు కంటె తక్కువేమీ కాదు. మానవజాతిని పీడించే అన్ని దుస్సంఘటనలకూ దుర్ఘటనలకు దేవుడే వ్యక్తిగతంగా బాధ్యుడని ఆ సిద్ధాంతం వాదిస్తుంది. మీరు విధిని నమ్మితే, విశ్వ సార్వభౌముడు ఈ క్రింద చదవబడే విధంగా ఒక పట్టికను సంకలనం చేశాడని మీరు ఊహించవచ్చు: ‘ఈరోజు, జాన్‌ ఒక కారు దుర్ఘటనలో గాయపడతాడు, ఫాటూకు మలేరియా వస్తుంది, మామాడూ ఇల్లు ఒక తుపానులో నాశనమౌతుంది’! మీరు నిజంగా అటువంటి దేవున్ని ఆరాధించడానికి కదిలింపబడగలరా?

‘కానీ ఒకవేళ మన దౌర్భాగ్యాలకు దేవుడు బాధ్యుడు కాకపోతే, మరి ఎవరు బాధ్యులు?’ అని విధిని నమ్మేవారు అడుగుతారు. మొదటి శీర్షికలో పేర్కొనబడిన యౌవనుడైన ఊస్మాన్‌, దీని గురించి తానే ఆశ్చర్యపోయాడు. కానీ సత్యాన్ని కనుగొనడానికి ఆయనకు అనుమానపడవలసిన లేక ఊహించవలసిన అవసరం లేదు. తన ప్రేరేపిత వాక్యమైన బైబిలు నందున్న బోధల ద్వారా దేవుడు ఈ అపవాదును తన మీది నుండి తుడిచివేసుకున్నాడని ఆయన నేర్చుకున్నాడు. (2 తిమోతి 3:16) మరి, ఈ విషయంపై బైబిలు ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాము.

ఎవరు నిందార్హులు?

వరదలు, తుపానులు, భూకంపాలు—ఇటువంటి విపత్తులు తరచూ దైవిక చర్యలు అని పిలువబడతాయి. అయినా అటువంటి వైపరీత్యాలను దేవుడు కలుగజేస్తాడని బైబిలు సూచించడం లేదు. మధ్య ప్రాచ్యంలో శతాబ్దాల క్రిందట సంభవించిన ఒక దుస్సంఘటనను పరిశీలించండి. ఈ విపత్తు నుండి తప్పించుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఇలా నివేదించినట్లు బైబిలు చెబుతుంది: “దేవుని అగ్ని [తరచూ మెరుపు అని అర్థమిచ్చే హెబ్రీ పదం] ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను.”—యోబు 1:16.

భయకంపితుడైన ఈ మనుష్యుడు ఆ అగ్నికి దేవుడే బాధ్యుడని అనుకుని ఉండవచ్చు, అయినప్పటికీ నిందించాల్సింది ఆయనను కాదని బైబిలు చూపిస్తుంది. మీకై మీరే యోబు 1:7-12 చదువుకోండి, అప్పుడు మెరుపు దేవుని వలన కాదు గానీ ఆయన వ్యతిరేకి—అపవాదియైన సాతాను కలుగజేసినదని మీరు తెలుసుకుంటారు! దుర్ఘటనలన్నీ నేరుగా సాతాను కలుగజేసినవే కావు. కానీ స్పష్టంగా, దేవున్ని నిందించడానికి ఏ కారణమూ లేదు.

వాస్తవానికి, విషయాలు అదుపు తప్పినప్పుడు ప్రజలు తరచూ నిందార్హులు. ప్రయత్నము మరియు మంచి శిక్షణ లేకపోవడం లేదా బహుశ ఇతరులను పరిగణనలోనికి తీసుకోకపోవడం వంటివి పాఠశాలలో, పనిచేసే స్థలంలో, లేక సాంఘిక సంబంధాల విషయాల్లో వైఫల్యాలకు కారణం కావచ్చు. అదేవిధంగా, అస్వస్థతలు, ప్రమాదాలు, మరణాలు అజాగ్రత్త ఫలితమైయుండవచ్చు. అంతెందుకు, వాహనం నడుపుతుండగా కేవలం సీట్‌ బెల్టు పెట్టుకోవడం కారు ప్రమాదంలో ఒకరు మరణించే సంభావ్యతను ఎంతగానో తగ్గిస్తుంది. మార్చలేని “విధి” విషయాలను నియంత్రిస్తుంటే, ఒక సీట్‌ బెల్టు ఏమాత్రం తేడాను చూపించకపోవచ్చు. సరైన వైద్య సంరక్షణ, పారిశుద్ధ్యం కూడా అకాల మరణాల సంఖ్యను విపరీతంగా తగ్గిస్తాయి. సామాన్యంగా “దైవిక చర్యలు” అని పేర్కొనబడే కొన్ని విపత్తులు కూడా, నిజానికి, మనుష్యుని చర్యలే అంటే మానవుడు భూమిని దుర్నిర్వహణ చేయడం యొక్క విషాదభరిత వారసత్వమే.—ప్రకటన 11:18 పోల్చండి.

‘కాలవశముచేతను, అనూహ్యమైన సంఘటనచేతను’

నిజమే, కారణాలు స్పష్టంగా వ్యక్తంకాని విషాదకర సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే, ప్రసంగి 9:11, వద్ద బైబిలు ఏమి చెబుతుందో గమనించండి: “మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే [“అనూహ్యమైన సంఘటన,” NW] కాలవశముచేతనే అందరికి కలుగుచున్నవి.” (ఇటాలిక్కులు మావి) అందువలన ప్రమాదాల వెనుక సృష్టికర్త ఉన్నాడని లేదా ప్రమాదాలకు గురైన వారు ఏదోవిధంగా శిక్షించబడుతున్నారని నమ్మడానికి ఏ కారణమూ లేదు.

విధివాద తర్కానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు తానే వాదించాడు. తన శ్రోతలకు బాగా తెలిసిన ఒక దుస్సంఘటనను సూచిస్తూ యేసు ఇలా అడిగాడు: “సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్న వారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను.” (లూకా 13:4, 5) ఆ విపత్తుకు కారణం దేవుడు జోక్యం చేసుకోవడం కాదు గానీ, ‘కాలవశముచేతను, అనూహ్యమైన సంఘటనచేతను’ అని యేసు స్పష్టంగా తెలియజేశాడు.

అపరిపూర్ణత యొక్క విధ్వంసకర పరిణామాలు

అయినా, వివరించడానికి సాధ్యంకాని మరణాలు, అస్వస్థతల విషయమేమిటి? మానవ స్థితిని గురించి బైబిలు ఈ ఖండితమైన వివరణనిస్తుంది: ‘ఆదామునందు అందరు మృతిపొందుచున్నారు.’ (1 కొరింథీయులు 15:22) మన పితరుడైన ఆదాము అవిధేయతా మార్గాన్ని త్రొక్కినప్పటి నుండి మానవజాతిని మరణము పీడిస్తోంది. దేవుడు హెచ్చరించినట్లే, ఆదాము తన సంతానానికి మృత్యువును ఉత్తరదాయిత్వంగా విడిచిపెట్టాడు. (ఆదికాండము 2:17; రోమీయులు 5:12) అప్పుడు చివరికి, అస్వస్థతలన్నిటికీ కారణం మనందరికీ మూలపురుషుడైన ఆదాము అని తేల్చవచ్చు. జీవితంలో మనం అనుభవించే నిరుత్సాహాలు, వైఫల్యాలకు మన వారసత్వ బలహీనతలు కూడా చాలా వరకు కారణం.—కీర్తన 51:5.

బీదరికం అనే సమస్యను పరిశీలించండి. బాధితులు కష్టతరమైన తమ పరిస్థితితో సరిపెట్టుకోవడానికి విధి యందు నమ్మకం వారిని తరచూ ప్రోత్సహించింది. ‘ఇదే మా విధి’ అని వారు విశ్వసిస్తారు. అయితే నిందించాల్సింది విధిని కాదు గానీ, మానవ అపరిపూర్ణతను అని బైబిలు చూపిస్తుంది. సోమరితనం లేక వనరుల దుర్నిర్వహణల ద్వారా తాము ‘విత్తిన దానినే కోసినప్పుడు’ కొంతమంది బీదవారౌతారు. (గలతీయులు 6:7; సామెతలు 6:10, 11) అధికారంలో ఉన్న లోభులకు బలయ్యారు గనుక అసంఖ్యాకమైన కోట్లాదిమంది బీదరికంలో జీవిస్తున్నారు. (యాకోబు 2:6 పోల్చండి.) “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 8:9) బీదరికానికంతటికీ కారణం దేవుడు లేక విధి అనడానికి ఏ సాక్ష్యాధారమూ లేదు.

విధి యందు నమ్మకం—దాని వినాశకర ప్రభావాలు

విధి యందు నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్న మరొక విశ్వాసజనక వాదన ఏమిటంటే, విశ్వాసులపై విధివాదం కలిగివుండగల ప్రభావమే. యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును.” (మత్తయి 7:17) ప్రజల బాధ్యతా భావాన్ని విధివాదం ప్రభావితం చేసే విధానాన్నిబట్టి, దాని యొక్క ఒక “ఫలము”ను మనం పరిశీలిద్దాము.

ఆరోగ్యకరమైన వ్యక్తిగత బాధ్యతా భావం ప్రాముఖ్యం. తమ కుటుంబాలను పోషించేలా తలిదండ్రులను, తమ కార్యాలను మనస్సాక్షిపూర్వకంగా నిర్వర్తించేలా పనివారిని, నాణ్యతగల ఉత్పత్తిని అందించేలా తయారీదారులను పురికొల్పే విషయాలలో అది ఒకటి. విధి యందు నమ్మకం ఆ భావం మొద్దుబారిపోయేలా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కారుకు లోపంగల స్టీరింగ్‌ మెకానిజం ఉన్నదనుకోండి. ఒకవేళ ఆయనకు నిశితమైన బాధ్యతా భావం ఉన్నట్లైతే, తన జీవం ఎడల, తన వాహనంలోని ప్రయాణికుల జీవితాల ఎడల చింతగలవాడై ఆయన దానిని మరమ్మతు చేయిస్తాడు. మరోవైపు విధి యందు నమ్మకముంచే వ్యక్తి, అది ఒకవేళ ‘దేవుని చిత్తం’ అయితే మాత్రమే ఆ కారు చెడిపోతుందని తర్కిస్తూ ప్రమాదాన్ని అలక్ష్యం చేయవచ్చు!

అవును, విధి యందు నమ్మకం అజాగ్రత్త, సోమరితనం, ఒకరు తమ చర్యలకు బాధ్యతను స్వీకరించడంలో వైఫల్యాన్ని, అనేకమైన మరితర ప్రతికూల లక్షణాలను సులభంగా వృద్ధి చేయగలదు.

దేవునితో మన సంబంధానికి ఒక అడ్డుగోడా?

అన్నింటికంటే హానికరమైనదేమంటే, విధి యందు నమ్మకం, దేవుని ఎడల ఉండే ఒకరి బాధ్యతా భావాన్ని, లేక విధ్యుక్తాన్ని అణచివేయగలదు. (ప్రసంగి 12:13) “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి” అని కీర్తనల గ్రంథకర్త సర్వ మానవజాతినీ ఉద్బోధిస్తున్నాడు. (కీర్తన 34:8) దేవుడు తన మంచితనాన్ని అనుభవించే వారు కలిగి ఉండవలసిన కొన్ని ఆవశ్యకతలను ఏర్పరుస్తాడు.—కీర్తన 15:1-5.

అటువంటి ఆవశ్యకతలలో ఒకటి పశ్చాత్తాపం. (అపొస్తలుల కార్యములు 3:19, 20; 17:30) మన పొరపాట్లను ఒప్పుకోవడం, అవసరమైన మార్పులను చేసుకోవడం అందులో ఇమిడి ఉన్నాయి. అపరిపూర్ణ మానవులుగా, మనమందరం పశ్చాత్తాపపడే అవసరమున్న విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ, తాను విధికి బలైన ఒక నిస్సహాయ వ్యక్తియని ఒకరు విశ్వసిస్తే, పశ్చాత్తాపం యొక్క అవసరతను గుర్తించడం లేక తన తప్పులకు బాధ్యత వహించడం కష్టం.

దేవుని గురించి కీర్తనల గ్రంథకర్త ఇలా అన్నాడు: “నీ కృప జీవముకంటె ఉత్తమము.” (కీర్తన 63:3) అయితే, విధి యందు నమ్మకం, తమ దుర్దశకు దేవుడే కారకుడని కోట్లాదిమందిని ఒప్పించింది. సహజంగానే, ఇది సృష్టికర్తతో నిజమైన సన్నిహిత సంబంధం కలిగివుండగల ద్వారాన్ని మూసివేస్తూ అనేకమంది ఆయన ఎడల చేదైన భావాలు కలిగివుండేలా చేసింది. ఎంతైనా, మీకు సమస్యలను, పరీక్షలనూ కలుగజేస్తున్నాడని మీరు భావిస్తున్న వ్యక్తి ఎడల మీరెలా ప్రేమను కలిగివుండగలరు? అలా, విధివాదం దేవునికి, మనుష్యునికి మధ్య ఒక అడ్డుగోడను నిలబెడుతుంది.

విధి నిరంకుశత్వం నుండి స్వతంత్రులు కావడం

ఇంతకుముందు ప్రస్తావించిన యౌవనుడైన ఊస్మాన్‌, ఒకప్పుడు విధి యందు నమ్మకానికి బానిస అయ్యాడు. అయినప్పటికీ, బైబిలు వెలుగులో ఆయన ఆలోచనా విధానం యొక్క మూల్యనిర్ధారణ చేసుకోవడానికి యెహోవాసాక్షులు సహాయం చేసినప్పుడు, ఊస్మాన్‌ విధి యందు తన నమ్మకాన్ని విడనాడేందుకు కదిలింపబడ్డాడు. దాని ఫలితంగా, గొప్ప ఉపశమనపు భావన మరియు జీవితంపట్ల ఒక క్రొత్త, అనుకూల దృక్కోణం ఏర్పడ్డాయి. అంతకంటే ప్రాముఖ్యంగా, యెహోవా “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల” దేవుడని ఆయన తెలుసుకున్నాడు.—నిర్గమకాండము 34:6.

దేవుడు, మన జీవితాల ప్రతి వివరణను పథకం వేయకపోయినా, భవిష్యత్తు కొరకు ఒక సంకల్పం కలిగి ఉన్నాడని కూడా ఊస్మాన్‌ తెలుసుకున్నాడు.a 2 పేతురు 3:13 ఇలా అంటుంది: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” ఈ వాగ్దత్త “క్రొత్త భూమి”లో భాగంగా నిరంతరమూ జీవించే నిరీక్షణను పెంపొందించుకోవడానికి యెహోవాసాక్షులు లక్షలాదిమందికి సహాయం చేశారు. వారు మీకు కూడా సహాయం చేయడానికి ఇష్టపడతారు.

బైబిలు యొక్క కచ్చితమైన జ్ఞానంలో మీరు వృద్ధిచెందేకొలది, మీ భవిష్యత్తు, మీ నియంత్రణ ఏమాత్రం లేని పూర్వనిర్ధారిత విధిపై ఆధారపడి లేదన్న దాని ఎడల మీరు మెప్పుదలను కనపరుస్తారు. ప్రాచీన ఇశ్రాయేలీయులతో మోషే అన్న మాటలు చక్కగా వర్తిస్తాయి: ‘నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచియున్నాను. నీవును నీ సంతానమును బ్రదుకుచు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి.’ (ద్వితీయోపదేశకాండము 30:19, 20) అవును, మీ భవిష్యత్తు విషయంలో మీరు ఒక ఎంపిక చేసుకోగలరు. అది విధి చేతుల్లో లేదు.

[అధస్సూచీలు]

a దేవుని పూర్వజ్ఞానం గురించిన పూర్తి చర్చ కొరకు, కావలికోట (ఆంగ్లం), జూలై 15, 1984, 3-7 పేజీలు చూడండి.

[6, 7వ పేజీలోని చిత్రం]

ఈ విపత్తులు ‘దైవిక చర్యలు’ కావు

[క్రెడిట్‌ లైను]

U.S. Coast Guard photo

WHO

UN PHOTO 186208/M. Grafman

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి