కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 9/1 పేజీ 32
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబ నియంత్రణ—క్రైస్తవ దృక్పథం
    తేజరిల్లు!—1993
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 9/1 పేజీ 32

పాఠకులనుండి ప్రశ్నలు

◼ వివాహిత క్రైస్తవ దంపతులు గర్భనిరోధక మాత్రలు ఉపయోగించుట బైబిలు సూత్రములకు తగినదై యున్నదా?

క్రైస్తవ దంపతులకు పిల్లలు కలిగియుండు బాధ్యత కలదని, లేక వారు కలిగియున్నట్లయిన ఎంతమంది అను విషయములను లేఖనములు స్పష్టముగా చెప్పుట లేదు. తమ కుటుంబమును పరిమితము చేయుటకు ప్రయత్నించుటయా లేదాయని సంగతి ప్రతి జంట ఏకాంతముగా మరియు బాధ్యతాయుతముగా తీర్మానించుకొనవలెను. గర్భనిరోధకములను అవలంబించవలెనని వారు పరస్పరము అంగీకరించినట్లయిన, గర్భనిరోధక పద్ధతుల ఎంపికయు వారి వ్యక్తిగత విషయము. అయితే, వారు—తమ బైబిలు అవగాహన మరియు తమ మనస్సాక్షి ప్రకారము—ఒకానొక పద్ధతి జీవ పవిత్రతకు గౌరవము చూపునా లేదాయని ఆలోచించవలెను.

గర్భధారణతోనే ఒకవ్యక్తి జీవితము ప్రారంభమగునని బైబిలు సూచించుచున్నది; జీవదాత గర్భస్థ జీవమును, ఆ తర్వాత గర్భమందు ఎదుగు “పిండమును” సహితము చూచును. (కీర్తన 139:16; నిర్గమకాండము 21:22, 23a; యిర్మీయా 1:5) కావున, గర్భస్థ జీవమును అంతమొందించుటకు ప్రయత్నించకూడదు. అలాచేయుట గర్భస్రావము చేయుట అగును.

గర్భనిరోధక మాత్రలు ప్రపంచవ్యాప్తముగా విస్తారముగా ఉపయోగింపబడుచున్నవి. అవి శిశుజన్మమును ఎట్లు నిరోధించును? ఇవి ప్రాముఖ్యముగా రెండు రకముల మాత్రలుగా లభించును—బినేషన్‌ పిల్‌ మరియు ప్రొజెస్టిన్‌-ఓన్లి పిల్‌ మినిపిల్‌). జన్మమును నిరోధించుటలో వాటి ప్రాథమిక పని విధానమును పరిశోధన స్పష్టము చేసినది.

కాంబినేషన్‌ పిల్‌నందు హార్మోన్స్‌ ఈస్ట్రెజెన్‌ మరియు ప్రొజెస్టిన్‌ ఉండును. యుఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారము, కాంబినేషన్‌ పిల్‌యొక్క “ప్రాథమిక పని విధానమేమనగా, అది బీజోత్పత్తిని నిరోధించును.” అనగా దీనిని క్రమముగా తీసికొనిన యెడల, ఇటువంటి మాత్రలు దాదాపు అన్నిసార్లు ఓవరీ నుండి అండము విడుదలకాకుండ నిరోధించునట్లుగా కన్పించుచున్నది. ఎప్పుడైతే అండము లేక స్త్రీలింగ బీజము విడుదల కాదో, అప్పుడు స్త్రీబీజ వాహికలలో గర్భదారణ సంభవింపజాలదు. ఇటువంటి మాత్రలు “ఎండొమెట్రియమ్‌ [గర్భసంచి పొర]లో మార్పులు కల్గించును, (ఇవి బీజప్రవేశమును తగ్గించివేయు అవకాశము కలదు),” అయినను ఇది ద్వితీయశ్రేణి పని విధానముగా పరిగణింపబడుచున్నది.

ఇతర ప్రభావములను తగ్గించుటకుగాను, కొద్ది మోతాదులో ఈస్ట్రెజెన్‌ ఉండు కాంబినేషన్‌ మాత్రలు వృద్ధిచేయుట జరిగినది. ఈ కొద్దిమోతాదు కాంబినేషన్‌ మాత్రలు ఓవరీలలో ఎక్కువ పని జరుగుటను అనుమతించును. నేషనల్‌ ఇన్సిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌యొక్క కాంట్రసెప్టివ్‌ డెవలెప్‌మెంట్‌ బ్రాంచి ముఖ్యాధికారియైన డాక్టర్‌ గాబ్రియేల్‌ బెయిలి, ఇట్లనుచున్నాడు: “విజ్ఞానశాస్త్ర ప్రబల సాక్ష్యము సూచించునదేమనగా, కొద్ది మోతాదు ఈస్ట్రెజెన్‌గల మాత్రలతో సహితము, బీజప్రవేశము అడ్డగింపబడుచున్నది. ఇది 100 శాతము కాకపోయినను దాదాపు 95 శాతము జరుగుచున్నది. అయితే కేవలము బీజప్రవేశము జరిగినదను వాస్తవమును ఫలదీకరణము సంభవించుటగా చెప్పుట సరికాదు”.

ఇవ్వబడిన పద్ధతి ప్రకారము ఒక స్త్రీ కాంబినేషన్‌ మాత్రలు తీసికొనుటకు తప్పిపోయినట్లయిన, జన్మమును నిరోధించుటలో ద్వితీయశ్రేణి పని విధానము ముఖ్య పాత్రవహించు సాధ్యత అధికముగా కలదు. కొద్దిమోతాదు మాత్రలను రెంటిని వేసికొనుటకు తప్పిపోయిన స్త్రీల అధ్యయనములో, 36 శాతము మందిలో బీజప్రవేశము “తప్పిపోయినట్లు” కనుగొనబడెను. కాంట్రాసెప్షన్‌ అను పత్రిక అటువంటి సందర్భములలో “ఎండొమెట్రియమ్‌ మరియు సర్వికల్‌ మ్యూకస్‌మీద . . . గర్భనిరోధక రక్షణ కొరకు మాత్రల ప్రభావము కొనసాగవచ్చును.”

ప్రొజెస్టిన్‌-ఓన్లి పిల్‌ పిల్‌ (మినిపిల్‌) అను మరొక రకమైన మాత్రల విషయమేమి? డ్రగ్‌ ఈవాల్యూషన్స్‌ (1986) ఇలా వ్రాయుచున్నది: “ప్రొజెస్టిన్‌-ఓన్లి పిల్‌ మినిపిల్స్‌లో బీజప్రవేశ నిరోధము ప్రాముఖ్యమైన సంగతి కాదు. ఇవి ఇంద్రియము జొరబడలేనంత చిక్కని సర్వికల్‌ మ్యూకస్‌ తయారుగునట్లు చేయును; అవి వాహిక ప్రవాహ సమయమును హెచ్చింపవచ్చును అంతేకాకుండ ఎండొమెట్రియల్‌ ఇన్‌వాల్యుయేషన్‌కు కారణమగును [ఇది ఫలదీకరణముచెందిన బీజము ఎదగకుండ అడ్డగించును].”

ప్రొజెస్టిన్‌-ఓన్లి పిల్‌ పిల్‌ వాడువారిలో “సాధారణముగా 40% బీజప్రవేశము జరుగును” అని కొందరు పరిశోధకులు చెప్పుచున్నారు. కావున ఈ మాత్రలు తరచు బీజప్రవేశమును అనుమతించును. సర్విక్స్‌ దగ్గర చిక్కపర్చబడిన మ్యూకస్‌ ఇంద్రియ ప్రవేశమార్గమును అడ్డగించి ఆ విధముగా గర్భధారణను ఆపుజేయును; అట్లు కానట్లయిన, గర్భసంచిలో ఈ మాత్రలు కలుగజేయు అననుకూల పరిసరములు ఫలదీకరణము చెందిన బీజము నిలద్రొక్కుకొనుటను మరియు పిల్లవానిగా వృద్ధియగుటను అడ్డగించును.

కాబట్టి గర్భనిరోధకమునకు క్రమముగా వాడినట్లయిన రెండు ప్రధాన రకముల మాత్రలు అనేక సందర్భములలో గర్భస్రావము కాకుండ గర్భదారణను నిరోధించుటను మనము ప్రశంసించగలము. అయితే, ప్రొజెస్టిన్‌-ఓన్లి పిల్‌ పిల్‌ (మినిపిల్‌) ఎక్కువ తరచుగా బీజప్రవేశమును అనుమతించుచున్నందున, అది కొన్నిసార్లు గర్భసంచిలో గర్భధారణతో జీవమునారంభించిన బీజము నిలద్రొక్కుకొనుటను అడ్డగించు సాధ్యత అధికముగా కలదు. విజ్ఞానశాస్త్ర అధ్యయనములు సూచించునదేమనగా సాధారణముగా (గర్భనిరోధక మాత్రలచే ప్రభావమునకులోనుగాని గర్భసంచి) “ఫలదీకరణము చెందిన అరవై శాతము అండములు . . . మొదట తప్పిన పీరియడ్‌కు ముందే పోగొట్టుకొనబడుచున్నవి.” ఇలా జరుగుట ఫలదీకరణము చెందిన బీజము నిలద్రొక్కుకొనుటను అడ్డగించుటకు ఉపయోగించు గర్భనిరోధక పద్ధతులకు చాలా భిన్నమైయున్నది.

కాబట్టి, గర్భనిరోధక మాత్రలను ఉపయోగించుటనుగూర్చి దంపతులు వైద్యునితో చర్చించినట్లయిన, ఆలోచించవలసిన నైతిక సంగతులు నిశ్చయముగా కలవు. మన దేవుడును జీవ-దాతయైన వానియెదుట “మంచి మనస్సాక్షిని” కాపాడుకొనుటకు ఏకాంతమైన మరియు వ్యక్తిగతమైన ప్రశ్నలను సహితము క్రైస్తవులు నిశ్చయము చేసికొనవలెను.—అపొ.కార్యములు 23:1; గలతీయులు 6:5. (w89 6/15)

[అధస్సూచీలు]

a ది వాచ్‌టవర్‌ ఆగష్టు 1, 1977, పుటలు 478-80 చూడుము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి