కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 8/1 పేజీ 32
  • వార్తలలోని అంతర్భావము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వార్తలలోని అంతర్భావము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “అతి ప్రమాదకరమైన వస్తువు”
  • పట్టించుకొనక కనబడకుండా పోవునా?
  • రక్తమార్పిడి–ఎంత వరకు సురక్షితము?
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • రక్తము నీ ప్రాణమును ఎలా కాపాడగలదు? బ్రోషూరు పఠనము కొరకు ప్రశ్నలు
    మన రాజ్య పరిచర్య—1991
  • యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 8/1 పేజీ 32

వార్తలలోని అంతర్భావము

“అతి ప్రమాదకరమైన వస్తువు”

రక్తమార్పిడి ద్వారా మరణకరమైన జబ్బులు అంటించుకున్న రోగులు వేసిన కోర్టు దావాలు రక్తనిధులకు ఒక క్రొత్త తరహా వ్యాకులతను ప్రవేశపెట్టినవి. అమెరికాలోని రక్తనిధులపై, 1989 సంవత్సరము మధ్యకల్లా, 300కు పైగా కోర్టు దావాలు వేయబడినట్లుగా చెప్పబడుచున్నవి. అమెరికా రక్తనిధుల సమాఖ్య కార్య నిర్వాహక సంచాలకుడైన గిల్‌బర్ట్‌ క్లార్క్‌ ఒప్పుకొనిన దేమనగా “సంపూర్ణ రక్షణగల రక్తము కావలెనని ప్రజలు కోరుచున్నారు,” కాని అట్టి దానిక అభయమివ్వలేము.

అటువంటి వార్తనే పెరేడ్‌ మ్యాగజైన్‌ తెలుపుచున్నది. రక్తము “సురక్షితమైనదికాక, తప్పించుకొన జాలనిదై” యున్నదని రక్త నిపుణుడైన డాక్ట. చార్షెస్‌ హగ్గిన్స్‌ అంగీకరించెనని ఆ పత్రిక తెలుపుచున్నది. “వైద్యములో మనముపయోగించు అతి ప్రమాదకరమైన వస్తువు” అని ఆయన రక్తమును వర్ణించుచున్నాడు. 1989 ప్రారంభమునుండి రక్త నిధులు ప్రత్యేకముగా పరీక్షించుచున్న అంటువ్యాధులు ఐదుకు పెరిగినవి. (HTLV-I, పెద్దల T-కణములకు సంబంధించిన లుకేమియా, సిఫిలి స్‌, హెపటైటిస్‌ బి, ఎయిడ్స్‌, మరియు హెపటైటిస్‌ సి). అయినను, అమెరికా రెడ్‌ క్రాస్‌ సంస్థ అధికారి యస్‌ జెరాల్డ్‌ శాండ్లర్‌ ప్రకారము “రక్తమార్పిడిద్వారా ప్రబలు మరొక అరుదైన జబ్బును మనము కనుగొనుటకు ఎంతోకాలము పట్టదు”. ఇంత ప్రమాదకరమైనదైనను, 1990 లో సుమారు నాలుగు మిలియన్ల ఉత్తర అమెరికన్లు రక్తమార్పిడిని తీసికొనబోతున్నారు. పత్రికా సంపాదకుడైన డబ్ల్యు. గిఫోర్డ్‌-జోన్స్‌ ప్రకారము సమస్య ఏదనగా యెహోవా సాక్షులకు తప్ప, చాలామంది రోగులు రక్తమార్పిడి యొక్క అవసరతలను గురించి చర్చించరు.”

దేవుని వాక్యము అపొ.కార్యములు 15:28, 29; 21:25 లో ఆజ్ఞాపించుచున్నట్లుగా యెహోవా సాక్షులు విశ్వాసముతో అనేక దశాబ్దములుగా ‘రక్తమును’ ఏ రూపముగానైనను ‘విసర్జించుచున్నారు.’ రక్తమార్పిడిద్వారావచ్చు భయంకరమైన వ్యాధులనుండి ఇది వారికి కల్పించిన రక్షణ, యెహోవా దేవుని శాసనములకు వారు చూపు విధేయత సరైన మాదిరని తెల్పుచున్నది.

పట్టించుకొనక కనబడకుండా పోవునా?

జోయాకిమ్‌ కార్డినల్‌ మోస్‌నర్‌, ఒక వివానాస్పదమైన వ్యక్తి. ఈయన 1989 ఫిబ్రవరిలో జర్మనీ, కోలెన్‌లో క్రొత్త ఆర్చిబిషప్‌గా నియమితుడయ్యెను. ఈమధ్య ఆయన చెప్పినదేమనగా చర్చి ఒకరోజు “కనబడకుండును—బహుశ సంఘము పట్టించుకొనకుండా పోవును” అను పెద్ద భయము తనకున్నదనెను. జర్మనీ వార్తాపత్రిక రెయిన్జ్‌ పోస్ట్‌ ప్రకారము మోస్‌నర్‌, “అసలు ఎటువంటి ప్రాధాన్యతలేని దానిగా చర్చిని దృష్టించువరకు సంఘము వచ్చుట నా ఆత్మను కలవరపర్చినది.” ఆయన గుర్తించి, ఒక కారణమేమనగా “మనము భూమినిగూర్చి ఎక్కువగా మాట్లాడుదుముగాని, పరలోకమును గురించి అంతగా మాట్లాడము, ప్రస్తుతమును గురించి ఎక్కువగా మాట్లాడుదుము, శాశ్వతమును గురించి అసలు మాట్లాడము.”

క్రీస్తుమండలి మతములు ప్రపంచ సమస్యలను పరిష్కరించుటకు పరలోక శక్తిని నమ్ముటలేదు. లోక రాజకీయ, వ్యాపార విధానములతో స్నేహము చేస్తున్నవి. పైగా దేవుని ఆసక్తులకు ప్రాతినిధ్యము వహిస్తున్నామని బొంకుచున్నవి. ఇది చాలా ప్రమాదకరమైన ఫలితములను తెచ్చును. బైబిలు ప్రకారముగా అబద్ధమతములన్నియు త్వరలో కనబడకుండా పోవును. ఇది “ఈ లోక రాజులు,” “ఈ లోక వ్యాపారులు” గుర్తించకుండా పొవునట్టిది కాదు. ఈ పరిణామము యెడల వారు దుఃఖించుదురు. కావున, నీతిని ప్రేమించువారు ఈ మాటలను లక్ష్యపెట్టవలయును: “మీరు, దాని (అబద్ధమతము) పాపములలో పాలివారు కాకుండుట్లును, దాని తెగుళ్లులో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును . . . దాని విడిచిరండి.”—ప్రకటన 18:4, 9, 11. (w90 7/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి