కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 5/1 పేజీలు 10-15
  • యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రక్తమునుగూర్చి ఉపదేశించబడుట
  • ఇతరులు ఉపదేశించబడుటకు సహాయముచేయుము
  • తల్లిదండ్రులారా—బాగుగా ఉపదేశించండి
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • జీవములను వాస్తవముగా కాపాడు రక్తము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
  • మీ జీవవరాన్ని అత్యంత విలువైనదిగా పరిగణించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • రక్తము—జీవాధారము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 5/1 పేజీలు 10-15

యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము

“యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.”—కీర్తనలు 86:11.

1, 2. రక్తమార్పిడులను అంగీకరించకుండా వాటిని తిరస్కరించుటకు యెహోవాసాక్షులను నడుపునదేమి?

“రక్తోత్పత్తుల ఉపయోగమును తిరస్కరించుటలో యెహోవాసాక్షులు చేస్తుంది సరియైనదే కావచ్చును, ఎందుకనగా రక్తమార్పిడివలన అధికసంఖ్యలో రోగక్రిములు ప్రవేశించే అవకాశమున్నదనుట నిజమే.”—ఫ్రెంచి వైద్య దినపత్రిక క్వోటిడియన్‌ డు మెడిసిన్‌, డిశంబరు 15, 1987.

2 ఆ వ్యాఖ్యానము చదివే కొందరు, రక్తమార్పిడులు అపాయము, మరణకరమని సామాన్యంగా తెలిసికొనుటకు ఎంతోకాలము ముందే యెహోవాసాక్షులు వాటిని తిరస్కరించుట కేవలము యాదృచ్ఛికంగా తీసుకొన్న చర్యేనని భావించవచ్చును. కానీ రక్తముయెడల యెహోవాసాక్షులు తీసుకొన్న స్థానము యాదృచ్ఛికమైనదేమి కాదు, లేక రక్తము సురక్షితము కాదనుటవల్ల కలిగిన భయమునుండి తీసికొనబడిన స్థానమై, ఏదో ఒక క్రొత్త శాఖచే కనిపెట్టబడిన కట్టడేమి కాదు. బదులుగా, వారి మహా బోధకుడైన దేవుని యెదుట విధేయతతో నడవవలెనను తీర్మానమునుబట్టియే యెహోవాసాక్షులు రక్తమును తిరస్కరిస్తారు.

3. (ఎ) యెహోవాపై ఆధారపడివుండుటనుగూర్చి దావీదు ఎట్లు భావించెను? (బి) దేవునియందు నమ్మకముంచుటద్వారా దావీదు ఎటువంటి ఫలితమును ఎదురుచూచెను?

3 దేవునిపైనే ఆధారపడియున్నానని భావించిన దావీదు రాజు, ఆయనచే ఉపదేశముపొంది, ఆయన ‘సత్యమందు నడచుటకే’ తీర్మానించుకొనెను. (కీర్తన 86:11) దేవుని యెదుట తాను రక్తాపరాధి కాకుండ తప్పించుకొనినయెడల, ‘ఆయన ప్రాణము దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపు మూటలో కట్టబడునని’ ఒకసారి ఆయనకు సలహా ఇవ్వబడెను. (1 సమూయేలు 25:21, 22, 25, 29) ప్రజలు తమ విలువైన వస్తువులను రక్షించుకొని, భద్రపరచుకొనుటకు మూటకట్టి పెట్టుకొనునట్లే, దావీదు ప్రాణము దేవునివలన భద్రపరచబడి రక్షించబడగలదు. వివేక యుక్తమైన ఆ సలహాను అంగీకరించినవాడై, దావీదు తన స్వంత వ్యక్తిగత ప్రయత్నములద్వారా తన్నుతాను రక్షించుకొనుటకు ప్రయత్నించక, తన ప్రాణమునకు మూలమైయున్నవానియందు నమ్మికవుంచెను. ఆయన మాటలు ఇలా ఉన్నవి: “జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.”—కీర్తన 16:11.

4. దావీదు యెహోవాచే ఉపదేశించబడాలని ఎందుకు కోరుకొనెను?

4 అదే దృక్పథముతో, దైవిక శాసనములలో విలువైనవేవో లేక విధేయత చూపు అవసరతగలవేవో తాను వ్యక్తిగతంగా నిర్ణయించుకోవచ్చునని దావీదు భావించుకొనలేదు. “యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము . . . సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.” “యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము” అన్నట్లే ఆయన దృక్పథముండెను. (కీర్తన 27:11; 86:11, 12) కొన్నిసార్లు దేవునియెదుట సత్యమందు నడచుట అననుకూలంగా లేక గొప్ప త్యాగము చేయవలసినదిగా కనిపించవచ్చు, అయితే దావీదు సరియైన మార్గమందు ఉపదేశించబడి దానిలోనే నడచుటకు యిష్టపడెను.

రక్తమునుగూర్చి ఉపదేశించబడుట

5. రక్తము విషయములో దేవుని స్థానమునుగూర్చి దావీదు ఏమి ఎరిగియుండెను?

5 దావీదు బాల్యమునుండే రక్తమునుగూర్చి దేవుని దృక్పథమును బోధించబడియున్నాడని గమనించుట యోగ్యమైనది. ఆ దృష్టి మతసంబంధమైన మర్మముతో కూడినది కాదు. ప్రజలకొరకు ధర్మశాస్త్రము చదువబడినప్పుడు, “రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తముచేయును. ‘కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని’” అను మాటలు వినియుండెను.—లేవీయకాండము 17:11, 12; ద్వితీయోపదేశకాండము 4:10; 31:11.

6. రక్తమునుగూర్చి ఎల్లప్పుడు ఉపదేశించబడవలసియున్న అవసరత దేవునిసేవకులకు ఎట్లుండెను?

6 ఇశ్రాయేలీయులను దేవుడు తన సమాజమైన ప్రజలుగా వాడుకున్నంతవరకు, ఆయనను సంతోషపెట్టగోరువారందరు రక్తమునుగూర్చి ఉపదేశించబడవలసియుండెను. తరము వెంబడి తరము ఇశ్రాయేలీయుల బాల బాలికలందరు ఆవిధముగా ఉపదేశించబడిరి. మరి ఆ ఉపదేశము “దేవుని ఇశ్రాయేలు”గా ఏర్పాటైన, క్రైస్తవుల సంఘమును దేవుడు అంగీకరించిన తరువాత కూడా కొనసాగుతుందా? (గలతీయులు 6:16) అవును, నిశ్చయంగా. రక్తమునుగూర్చిన దేవుని దృక్పథము మారలేదు. (మలాకీ 3:6) రక్తమును దుర్వినియోగపరచుటనుగూర్చి ఆయన తెలిపిన స్థానము, ధర్మశాస్త్ర నిబంధన అమలులోకి రాకముందునుండే ఉండెను. ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తరువాత కూడ అది కొనసాగెను.—ఆదికాండము 9:3, 4; అపొస్తలుల కార్యములు 15:28, 29.

7. రక్తమునుగూర్చి దేవునిచేత ఉపదేశించబడుట మనకు ఎందుకు ప్రాముఖ్యము?

7 రక్తముయెడల గౌరవముచూపుట క్రైస్తత్వమునకు ప్రధానమైనది. ‘అది అతిశయముగా చెప్పుట కాదా?’ అని కొందరడగవచ్చును. అయినను, క్రైస్తత్వమునకు ప్రధానమైనది యేసు బలిగాక వేరొకటి మరే ఏమున్నది? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాసెను: “దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన [యేసు] రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.” (ఎఫెసీయులు 1:7) ఫ్రాంక్‌ సి. లాబక్‌చే తర్జుమాచేయబడిన ది ఇన్‌స్పైర్డ్‌ లెటర్స్‌ ఈ వచనమును ఇలా అనువదించెను: “క్రీస్తు రక్తము మనకొరకు చెల్లించబడినది, గనుక మనమిప్పుడు ఆయనవారము.”

8. “గొప్పసమూహము” జీవముకొరకు రక్తముపై ఎట్లు ఆధారపడుదురు?

8 రాబోవుచున్న “మహాశ్రమలను” తప్పించుకొని పరదైసు భూమిపై దేవుని ఆశీర్వాదములను అనుభవించ నిరీక్షించు వారందరు యేసు చిందించిన రక్తముపై ఆధారపడవలెను. ప్రకటన 7:9-14 వారిని వర్ణిస్తూ, వారికి జరిగియున్నదన్నట్లు వారినిగూర్చి ఇలా చెబుతుంది: “వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; వారు గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” ఇచ్చట ఉపయోగించబడిన భాషను గమనించుము. మహాశ్రమలలోనుండి తప్పించబడినవారు ‘యేసును అంగీకరించారు’ లేక ‘ఆయనయందు విశ్వాసముంచారు’ అని అది చెప్పుటలేదు. ఇవి ప్రముఖమైన భాగాలే. అయితే అది ఇంకొంచెము ముందుకువెళ్తూ, “వారు ఆయన [యేసు] రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనియున్నా” రని అంటుంది. ఆయన రక్తమునకు విమోచన విలువ ఉన్నందున అది అట్లు చెబుతుంది.

9. రక్తము విషయంలో యెహోవాకు విధేయత చూపుట ఎందుకు చాలా గంభీరమైనది?

9 ఒక వైద్యుడు మార్పిడి ప్రాముఖ్యమని నమ్మకముగా చెప్పినను, ఈ విలువయెడల వారికున్న గుణగ్రహింపే రక్తమును దుర్వినియోగపరచకూడదను తీర్మానమును చేపట్టుటకు యెహోవాసాక్షులకు సహాయముచేస్తుంది. రక్తము తీసికొన్నందున వచ్చు ఆరోగ్య ప్రమాదములకన్నా, ప్రాప్తించు లాభాలే ఎక్కువని ఆయన నమ్మవచ్చును. అయితే రక్తమును దుర్వినియోగపరచుటకు అంగీకరించుటద్వారా దేవుని అంగీకారమును పోగొట్టుకొనే అతిగొప్ప ప్రమాదమును క్రైస్తవులు అలక్ష్యముచేయరు. “సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము” చేయుటనుగూర్చి పౌలు ఒకసారి మాట్లాడెను. అటువంటి పాపమెందుకు ఎంతో గంభీరమైనది? ఎందుకనగా అటువంటి మనుష్యుడు “దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా” ఎంచెను.—హెబ్రీయులు 9:16-24; 10:26-29.

ఇతరులు ఉపదేశించబడుటకు సహాయముచేయుము

10. రక్తమును విసర్జించు మన తీర్మానము వెనుక ఉన్నదేమి?

10 యేసు విమోచన క్రయధనపు బలిని గుణగ్రహించు మనము, ప్రాణమును రక్షించగల ఆయన రక్తపు విలువను తృణీకరించుచు, పాపమును అభ్యాసము చేయకుండునట్లు జాగ్రత్తపడవలెను. విషయమును విపులముగా తలంచినవారిగా, హృదయమందు మన శ్రేష్టమైన ప్రయోజనములను కలిగి—మన దీర్ఘకాల శ్రేయస్సు నిమిత్తమై ఇవ్వబడినవని నమ్ముచున్న ఆయన నీతియుక్త శాసనముల విషయమై రాజీపడు దేనినైనను తిరస్కరించుటకు దేవునియెడల జీవముకొరకు మనకుగల కొద్దిపాటి కృతజ్ఞతే మనలను కదలించవలెను. (ద్వితీయోపదేశకాండము 6:24; సామెతలు 14:27; ప్రసంగి 8:12) మరి మన పిల్లల విషయమేమి?

11-13. రక్తమునుగూర్చి, తమ పిల్లలనుగూర్చి కొందరు క్రైస్తవ తల్లిదండ్రులు ఏ తప్పిదపు దృక్పథమును కలిగివున్నారు, ఎందుకు?

11 మనపిల్లలు శిశువులుగా లేక అర్థం చేసుకొనలేనంత పిన్నలుగా వున్నను, మన భక్తినిబట్టి యెహోవాదేవుడు వారిని పరిశుభ్రమైనవారిగాను, అంగీకృతమైనవారిగాను దృష్టించును. (1 కొరింథీయులు 7:14) కావున క్రైస్తవ గృహములోని శిశువులు ఇంకను రక్తమునుగూర్చి దేవునిశాసనమును అర్థము చేసుకొని దానికి విధేయత చూపుటను ఎంపిక చేసికొనలేనివారై ఉండుట వాస్తవమే కావచ్చును. ఏమైనను, ఈ ప్రాముఖ్యవిషయంలో వారికి ఉపదేశించుటకు మనము చేయగల్గిన దానినంతటిని చేయుచున్నామా? కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలనుగూర్చి, రక్తమునుగూర్చి పొరపాటు భావమును కలిగియున్నట్లు కన్పిస్తున్నందున, క్రైస్తవ తల్లిదండ్రులు ఈ విషయమును గంభీరముగా తలంచవలెను. మైనరు వయస్సులోనున్న తమ పిల్లలకు రక్తమెక్కించ బడుతుందా లేదా అను విషయంలో తమ ఆధీనంలో నిజంగా ఏమీలేనట్లు కొందరు భావించినట్లు కనబడుతుంది. ఈ తప్పిదపు దృక్పథమెందుకు?

12 అనేక దేశాలలో నిర్లక్ష్యముచేయబడిన లేక దుర్వినియోగమునకు గురైన పిల్లలను కాపాడుటకు చట్టాలు, ప్రభుత్వ సంస్థలు ఉన్నవి. యెహోవాసాక్షులు తమ పిల్లలకు రక్తమునకు మారుగా ఆధునిక మందులు ఉపయోగించి వైద్యముచేయమని కోరుతూ, తమ ప్రియమైన కుమారునికి లేక కుమార్తెకు రక్తమెక్కించుటకు అనుమతించనప్పుడు వారు పిల్లలను నిర్లక్ష్యము చేయుటలేదు, లేక దుర్వినియోగమునకు గురిచేయుట లేదు. వైద్యపరమైన దృష్టిలో కూడ మార్పిడివల్లవున్న ప్రమాదముల దృష్ట్యా, ఇది నిర్లక్ష్యము లేక దుర్వినియోగమునకు గురిచేయుటగా ఎంచబడదు. ఉన్న ప్రమాదములను తూకంవేసికొని, చికిత్సనుa ఎన్నుకొను హక్కును ప్రయోగించటమే అందున్నది. అయినను, కొంతమంది వైద్య సిబ్బంది చట్టపరమైన అవకాశములను ఉపయోగించుకొని తిరస్కరించిన వారికి మార్పిడిని బలవంతముచేయుటకు ప్రభుత్వమును కోరుదురు.

13 వైద్యసిబ్బంది న్యాయస్థానపు మద్దతుతో మైనరు పిల్లలకు రక్తమార్పిడి జరిగించుట చాలా సులభమని తెలిసికొనియున్న కొందరు తల్లిదండ్రులు, వారు చేయగలిగేది, చేయాల్సిందేమీలేదు అది వారిచేతులు దాటిన విషయమని భావించవచ్చును. అది ఎంత తప్పిదపు దృక్పథము!—సామెతలు 22:3.

14. తమ బాల్యదశనుంచే తిమోతి మరియు దావీదు ఎట్లు ఉపదేశించబడిరి?

14 తన యుక్తవయస్సునుండే దావీదు దేవుని మార్గములందు బోధించబడెనని మనము గుర్తించాము. జీవము దేవునినుండి వచ్చిన వరమని, రక్తము జీవమునకు ప్రాతినిధ్యముగా ఉందని దృష్టించునట్లు అది ఆయనను సిద్ధముచేసినది. (2 సమూయేలు 23:14-17 ను పోల్చుము.) తిమోతి “బాల్యము నుండి” దేవుని ఆలోచనయందు బోధించబడెను. (2 తిమోతి 3:14, 15) దావీదు మరియు తిమోతి నేడు చట్టపరంగా పెద్దవారని పరిగణించబడుతున్న వయస్సుకు రాకముందే దేవుని చిత్తానికి సంబంధించిన వివాదాంశములలో తమ ఆలోచనను స్పష్టంగా వ్యక్తపరచుకొనగలిగియుంటారని మీరు ఒప్పుకొనరా? అదేప్రకారము వయస్సొచ్చుటకు ఎంతోకాలము ముందే నేటి క్రైస్తవ పిల్లలు దేవుని మార్గమందు బోధించబడవలెను.

15, 16. (ఎ) మైనరు వయస్సులోనున్నవారి హక్కులను గూర్చి కొన్ని స్థలాలలో ఎటువంటి దృక్పథము వృద్ధిచెందినది? (బి) ఒక మైనరు పిల్లవానికి రక్తమెక్కించబడుటకు నడిపినదేమి?

15 కొన్ని ప్రాంతాలలో పేరుకుమాత్రము పరిపక్వతకెదిగాడని ఎంచబడు మైనరు పిల్లలకు కూడ పెద్దలకున్న సమాన హక్కులు ఇవ్వబడినవి. వయస్సు లేక పరిణతిచెందిన ఆలోచనను లేక ఈ రెంటిని ఆధారంగా తీసికొని ఒక యౌవనుడు వైద్యచికిత్సవిషయంలో తన స్వంత తీర్మానము చేసికొనగలుగునంతగా పరిపక్వతకెదిగాడని ఎంచబడవచ్చును. ఇది చట్టము కానిచోట్లను న్యాయాధిపతులు లేక అధికారులు రక్తమునుగూర్చి తన స్థిరనిర్ణయాన్ని స్పష్టంగా వ్యక్తపరచుకోగల యువకుని కోరికలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వవచ్చును. ఒకయువకుడు స్పష్టంగా, ఎదిగిన భావముతో తన నమ్మకములను వివరించలేకపోతే న్యాయస్థానము తన దృష్టికి సరియైనదిగా ఎంచినదానిని ఒక శిశువుకొరకు నిర్ణయిస్తున్నట్లు నిర్ణయించవచ్చును.

16 ఒక యౌవనుడు బైబిలును కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు చదువుతుండేవాడు. కాని బాప్తిస్మం తీసికొనలేదు. “తనకైతాను వైద్య చికిత్సను తిరస్కరించగల హక్కును పొందే” వయస్సుకు కేవలము ఏడువారముల ముందు, కేన్సరు నిమిత్తమై తనకు చికిత్సచేస్తున్న ఆసుపత్రి తన తల్లిదండ్రుల కోరికను, తనకోరికను వ్యతిరేకిస్తూ రక్తమార్పిడిచేయుటకై కోర్టు మద్దతును అభ్యర్థించింది. మనస్సాక్షితో ప్రవర్తించు ఆ న్యాయాధిపతి రక్తమునుగూర్చి ఈయన నమ్మకములను విడమర్చి అడిగాడు, అంతేగాక, బైబిలులోని మొదటి ఐదు పుస్తకముల పేర్లవంటి కొన్ని ప్రాథమిక ప్రశ్నలను అడిగాడు. ఈ యౌవనుడు వాటిని చెప్పలేకపోవటమేగాక, రక్తమును తానెందుకు తిరస్కరిస్తున్నాడో తాను అర్థం చేసికొన్నట్లు దాన్నిగూర్చి కూడ స్పష్టమైన వాక్కును అందచేయలేకపోయెను. విచారకరంగా, ఆ న్యాయాధిపతి రక్తమార్పిడులకు అనుమతిస్తూ, “అతను రక్తమార్పిడులను తిరస్కరించుట తన స్వంత మత నమ్మకములను పూర్ణంగా అర్థం చేసికొనుటపై ఆధారపడినది కాదని” వ్యాఖ్యానించెను.

17. రక్తమివ్వబడు విషయంలో ఒక 14-సం. బాలిక ఏ స్థానమును తీసికొన్నది, దాని ఫలితమేమి?

17 దేవుని మార్గములలో బాగుగా బోధించబడి సత్యమందు చురుకుగా నడుస్తున్న ఒక మైనరు విషయములు ఇందుకు భిన్నంగా ఉండవచ్చు. పసితనములోనున్న ఒక క్రైస్తవరాలికి అరుదుగా వచ్చే ఇదే విధమైన కేన్సరు ఉంది. ఆ బాలిక, ఆమె తల్లిదండ్రులు వ్యాధిని అర్థం చేసికొని ఒక ప్రఖ్యాతిగాంచిన ఆసుపత్రిలో నిపుణునిద్వారా రసాయనక చికిత్సావిధానమును అంగీకరించారు. అయినను, కేసును కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయాధిపతి ఇలా వ్రాసెను: “డి.పి. తాను తిరస్కరించగలిగిన అన్ని పద్ధతులలో రక్తాన్ని నేను నిషేధిస్తానని అంటుంది. ఆమె రక్తమార్పిడిని తన శరీరాన్ని ముట్టడించి, బలత్కారము చేసేదానిగా ఎంచింది. న్యాయస్థానము తన యిష్టాన్ని గౌరవించి, రక్తమార్పిడిచేయుటకు ఆజ్ఞాపించకుండనే తనను ఆసుపత్రిలో ఉండనివ్వాలని అడిగినది.” ఆమె పొందియున్న క్రైస్తవ ఉపదేశము ఆమెకు ఈ కష్టసమయములో సహాయము చేయగలిగింది.—బాక్స్‌ను చూడుము.

18. (ఎ) రక్తము తీసికొను విషయములో వ్యాధితో బాధపడుతున్న ఒక బాలిక ఏ స్థిరమైన స్థానము తీసికొన్నది? (బి) న్యాయాధిపతి ఆమె చికిత్స విషయంలో ఏమి నిర్ణయించాడు?

18 లూకేమీయా అనే వ్యాధికి ఒక 12 సంవత్సరముల బాలిక చికిత్సపొందింది. ఆమెకు బలవంతంగా రక్తమెక్కించుటకు ఒక పిల్లల సంక్షేమ విభాగము విషయాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లింది. న్యాయాధిపతి ఇలా తీర్పు చెప్పాడు: “రక్తమును ఆమెకు బలవంతముగా ఎక్కించుటకు ప్రయత్నించిన, తన బలముకొద్ది దానిని తృణీకరించుటకు పోరాడుతానని ఎల్‌., ఉన్నదున్నట్లు యథార్థంగా చెబుతుంది. దాని విషయంలో కేకలువేస్తూ, పోరాడుతూ, తనకు లోనికి ఎక్కించబడిన సూదిని పెరికివేసి రక్తమున్న సంచిని నలిపివేస్తానని ఆమె అంటుంది. నేను ఆమె అనేదాన్ని నమ్ముతున్నాను. అటువంటి కఠిన పరీక్షకు ఆమెను గురిచేసే ఏ ఆజ్ఞను నేను జారీచేయను. ఆసుపత్రి ఈ రోగికి సూచించిన చికిత్స కేవలము శరీర సంబంధంగానే ఉందిగాని, ఆమె భావోద్రేక అవసరతలను మత నమ్మకములను గూర్చి పట్టించుకోటం లేదు.”

తల్లిదండ్రులారా—బాగుగా ఉపదేశించండి

19. తల్లిదండ్రులు తమపిల్లలయెడలనున్న ఏ ప్రత్యేక బాధ్యతను నెరవేర్చవలెను?

19 తమ కుటుంబములోని వారంత రక్తము విషయంలో దేవుని శాసనమునుబట్టియే జీవించాలని యిష్టపడేవారికి పై అనుభవములు బలమైన వర్తమానమును అందిస్తున్నవి. అబ్రాహాము దేవునికి స్నేహితుడగుటకు ఒక కారణమేమనగా ఈ పితరుడు “తన తరువాత తన పిల్లలును, యింటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించునట్లు” ఆయన ఎరిగియుండెను. (ఆదికాండము 18:19) క్రైస్తవ తల్లిదండ్రుల విషయంలోను నేడు ఇది వాస్తవం కాదా? నీవు ఒక తండ్రివి లేక తల్లివైతే మీప్రియమైన పిల్లలు యెహోవా మార్గమున నడుచునట్లు, ఎల్లప్పుడు వారిలో ‘ఉన్న నిరీక్షణ గూర్చి వారిని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను, భయముతోను సమాధానము చెప్పుటకు సిద్ధముగా’ ఉండునట్లు మీరు మీ పిల్లలకు ఉపదేశిస్తున్నారా?—1 పేతురు 3:15.

20. ప్రాముఖ్యముగా మన పిల్లలు రక్తముగూర్చి ఏమి తెలిసికొని, ఏమి నమ్మవలెనని మనము కోరుకొరుకొనవలెను? (దానియేలు 1:3-14)

20 రక్తమార్పిడులవలన ఉన్న అపాయాలగూర్చి, రోగగ్రస్తమైన ప్రమాదాలగూర్చి మన పిల్లలకు తెలిసియుండుట మంచిదైనప్పటికీ, రక్తముయెడల దేవుని పరిపూర్ణ శాసనమును ఉపదేశించుటయనగా రక్తమునుగూర్చి వారిలో భయమును కలుగజేయుట అని కాదు. ఒక న్యాయాధిపతి బాలికను ఆమె ఎందుకు రక్తముతీసికొనుటకు యిష్టపడుటలేదని అడిగినప్పుడు, ఆమె ముఖ్యంగా రక్తము చాలా ప్రమాదకరమైంది లేక భయంకరమైంది అని సమాధానమిస్తే, ఫలితమేమైయుండును? బాలిక కేవలము భావములలో ఎదగక ఎక్కువగా భయపడుతుందని, అపెండిక్స్‌వంటి జబ్బుకు ఆమెకు ఆపరేషన్‌ మంచిదని తల్లిదండ్రులు తలంచినను, దానిని అంగీకరించక భయపడి తిరస్కరించురీతిగానే ఆమె ఈ విషయంలో చేస్తుందని ఆయన ముగించవచ్చును. మనము ముందే గుర్తించినట్లు రక్త మార్పిడులకు అభ్యంతరము తెలుపుటలో క్రైస్తవుల ముఖ్యకారణము రక్తము కలుషితమైందని కాదుగాని అది జీవదాతయైన మన దేవునికి ప్రశస్తమైందనియే. మన పిల్లలు దానిని ఎరిగివుండవలెను, దానితోపాటు రక్తముయొక్క వైద్యపరమైన అపాయములు మన మత స్థానమును బలపరచుచున్నవని కూడా వారు తెలిసికొనవలెను.

21. (ఎ) తమ పిల్లలనుగూర్చి, రక్తముయెడల బైబిలు దృక్పథమునుగూర్చి తల్లిదండ్రులు ఏమి తెలిసికొనవలెను? (బి) రక్తము విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకెట్లు సహాయము చేయగలరు?

21 మీకు పిల్లలున్నట్లయిన రక్తమార్పిడుల విషయములో బైబిలుపై ఆధారపడిన స్థానంను వారు అంగీకరించి, వివరించగలరని మీకు నిశ్చయత ఉందా? ఈ స్థానం దేవునిచిత్తమని వారు నిజంగా నమ్ముదురా? దేవుని శాసనమును ఉల్లంఘించుట చాలా గంభీరమైందని, అది నిత్యజీవపు ఉత్తారాపేక్షనే అపాయంలో ఉంచగలదని వారు ఒప్పింపబడియున్నారా? వారు దాదాపుగా పెద్దవారైనను, లేక మరీ చిన్నపిల్లలైనను ఈ విషయంలను వివేకముగల తల్లిదండ్రులు తమపిల్లలతో పునఃసమీక్షిస్తారు. ప్రతి పిల్లవాడు న్యాయాధిపతిని లేక ఆసుపత్రి అధికారిని ఎదుర్కొన్నప్పుడు వారు వేసే ప్రశ్నలను, తల్లిదండ్రులు అభ్యాస కార్యక్రమంగా నిర్వహించుకొనవచ్చును. ఎన్నుకొన్న కొన్ని సత్యాలను లేక సమాధానాలను మరమనిషివలె వల్లించుట కాదుగానీ, వారు దేనిని నమ్ముతున్నారో, అలా ఎందుకు నమ్ముతున్నారో వారు తెలిసికొనియుండుట ప్రాముఖ్యము. బహుశా న్యాయస్థానం కేసును వినునప్పుడు, ఆ తల్లిదండ్రులో లేక ఇతరులో రక్తములో ఉన్న అపాయాలను, దానికి ప్రత్యామ్నయముగా అందుబాటులోనున్న ఇతర చికిత్సలనుగూర్చిన సమాచారమును అందించవచ్చును. కానీ న్యాయాధిపతి లేక ఒక అధికారి మనపిల్లలతో మాట్లాడి, వారు వారి పరిస్థితిని, వారి అభీష్టాలను ఎదిగిన మనస్సుతో అర్థంచేసికొనియున్నారా, వారిమట్టుకువారు తమ స్వంత విలువలను, గట్టి ఒప్పుదలను కలిగియున్నారా అనేది వారినుండి తెలిసికొనగోరును.—2 రాజులు 5:1-4 పోల్చుము.

22. రక్తముగూర్చి మనము దేవునిచే ఉపదేశించబడుటవలన కలుగు శాశ్వత ఫలితమేమి?

22 రక్తము విషయంలో మనమందరము దేవుని దృక్పథమును గుణగ్రహించి దానికే తీర్మానపూర్వకంగా హత్తుకొనవలసిన అవసరమున్నది. క్రీస్తును గూర్చి ప్రకటన 1:5 ‘ఆయన మనలను ప్రేమించి తన రక్తముద్వారా ఆయన మనలను పాపములనుండి విమోచించాడని’ వర్ణించుచున్నది. కేవలము యేసు రక్తపు విలువను అంగీకరించుటద్వారానే మనము మన పాపములకు సంపూర్ణమైన, శాశ్వతమైన క్షమాపణను పొందగలము. రోమీయులు 5:9 స్పష్టంగా ఇట్లు చెప్పుచున్నది: “కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.” కావున ఈ విషయంలో మనము మన పిల్లలము యెహోవాచేత ఉపదేశించబడి ఆయనమార్గములో నిత్యము నడచుటకు తీర్మానించుకొనినవారమైయుండుట ఎంత వివేకయుక్తము! (w91 6/1)

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌సొసైటి ఆఫ్‌ న్యూయార్కు ఇంక్‌., చే ప్రచురింపబడిన రక్తము మీ జీవమును ఎట్లు రక్షించగలదు?, పేజీలు 21-22, 28-31 చూడుము.

ఉపదేశమందలి కీలకాంశములు

◻ యెహోవాచే ఉపదేశించబడుటనుగూర్చి మనము ఏ దృక్పథమును కలిగియుండవలెను?

◻ రక్తము విషయంలో దేవుని శాసనమునకు లోబడుట ఎందుకు చాలా ప్రాముఖ్యము?

◻ యువకులు రక్తమునుగూర్చిన తమ నమ్మకములను స్పష్టంగాను స్థిరంగాను చెప్పగలిగియుండుట ఎందుకు ప్రాముఖ్యము?

◻ రక్తము విషయంలో యెహోవా శాసనమునుగూర్చి తమ పిల్లలు బాగుగా ఉపదేశించబడులాగున క్రైస్తవ తల్లిదండ్రులు ఎట్లు సహాయము చేయగలరు?

[14వ పేజీలోని బాక్సు]

న్యాయస్థానం మురిసిపోయింది

పేరా 17లో ప్రస్తావించబడిన డి.పి., ని గూర్చి న్యాయస్థాన నిర్ణయము ఏమి తెలియజేసింది?

“పద్నాలుగున్నర సంవత్సరముల ఈ యౌవనురాలుయొక్క వివేకము, సమతూకము, హూందాతనము, ధాటికి న్యాయస్థానం ఎంతగానో మురిసిపోయింది. తనకు మరణకరమైన కేన్సరు ఉందని తెలిసికొనుటలో ఆమె తలమునకలైయుండవచ్చును. కానీ ఇచ్చట తననుగూర్చి చెప్పుకొనుటకు ఒక పరిపక్వతకెదిగిన యౌవనురాలు న్యాయస్థానమున కొచ్చినది. ఆమె ఎదుర్కొనబోయే క్లిష్టమైన విషయమును ఆమె చాలా స్పష్టంగా తలంచినట్లు కనబడుతుంది. సలహా ఇచ్చు సభలన్నిటికి హాజరైనది, చికిత్సా విధానమును అంగీకరించినది, ఒక మానవ ప్రాణిగా ఈ వైద్యసవాలును ఎలా ఎదుర్కోవాలో సమగ్రమైన జ్ఞానమును సంపాదించుకొని: నా తీర్మానాన్ని గౌరవించండి . . . అను బలమైన అభ్యర్ధనతో ఆమె న్యాయస్థానమునకు వచ్చింది.

“తాను కలిగియున్న పరిపక్వతకు తోడుగా, న్యాయస్థానము ఆమె తీర్మానమును గౌరవించుటకు డి.పి., కావలసినన్ని ఆధారములను అందచేసినది. రక్తమార్పిడితో కూడిన చికిత్సా విధానముద్వారా ఆమె ఆత్మీయంగా, మానసికంగా, నైతికంగా, భావోద్రేకపరంగా గాయపడుతుంది. న్యాయస్థానం ఆమె యిష్టానుగుణ్యంగా ఎన్నుకొను చికిత్సవిధానమునే గౌరవించును.”

[13వ పేజీలోని చిత్రం]

ఒక న్యాయాధిపతి లేక ఆసుపత్రి నిర్వాహణాధికారి క్రైస్తవ యౌవనుడు నిజంగా ఏమి నమ్ముతున్నాడు, అలా ఎందుకు, అని తెలిసికొనగోరవచ్చును

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి