కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 8/1 పేజీలు 28-32
  • ఎవరు దేవుని స్నేహితుడు కాగలరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎవరు దేవుని స్నేహితుడు కాగలరు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిననుసరించువాడే”
  • “హృదయ పూర్వకముగా నిజము పలుకువాడు”
  • “తన నాలుకతో కొండెములాడడు”
  • “తన చెలికానికి కీడుచేయడు”
  • “తన పొరుగువానిమీద నింద మోపడు”
  • “అతని దృష్టికి నీచుడు అసహ్యడు”
  • “అతడు యెహోవాయందు భయభక్తులుగల వారిని సన్మానించును”
  • అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు”
  • తన ద్రవ్యవ వడ్డికియ్యడు
  • “నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు
  • “ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు”
  • ఎప్పటికీ యెహోవా అతిథులుగా ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • దేవుణ్ణి ప్రేమించేవాళ్లను స్నేహితులుగా ఎంచుకోండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మంచి స్నేహితులను మనమెలా ఎంచుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 8/1 పేజీలు 28-32

ఎవరు దేవుని స్నేహితుడు కాగలరు?

మీరు దేవుని స్నేహితునిగా ఉండవచ్చును. 4,000 సంవత్సరముల క్రితం, అబ్రాహాము అను మనుష్యుడు యెహోవా దేవునియందు విశ్వాసముంచెను. ఇది అతనికి నీతిగా ఎంచబడెను, ఆ పితరుడు “యెహోవా దేవుని స్నేహితుడని” పిలువబడెను. (యాకోబు 2:23) కనుక యెహోవాయందు మీరు విశ్వాసముంచినట్లయితే, మీరుకూడ దేవుని స్నేహితుడు కాగలరు.

స్నేహితులు అతిథులవలె భోజనమునకు ఆహ్వానింపబడుదురు. వాస్తవానికి, బాగా పరిచయమున్న 23వ కీర్తనలో ఒక భాగము దేవున్ని దయార్థ గృహాధిపతిగా వర్ణించుచున్నది. అది ఇట్లనుచున్నది: “నీ శత్రువుల యెదుట నీవు [యెహోవా] నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు . . . నాగిన్నె నిండి పొర్లుచున్నది.”—కీర్తన 23:5.

మరో సంధర్భములో—ఆ కీర్తనల రచయిత—అనగా ప్రాచీన ఇశ్రాయేలీయుల రాజైన దావీదు—ఇట్లడిగెను: “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగినవాడెవడు?” (కీర్తన 15:1) అలంకారార్థముగా, యెహోవాకు అంగీకృతమైన ప్రార్థన, ఆరాధన చేయగల్గుట అని దీని భావము. ఎంత అద్భుతమైన ఆధిక్యత! అపరిపూర్ణులైన మానవులు దేవుని స్నేహితులుగా, అతిథులుగా ఉండుటకు ఎట్లు అర్హులు కాగలరు?

ఈ ప్రశ్నకు 15వ కీర్తన సమాధానమిచ్చుచున్నది. దేవుని స్నేహితులుగా మరియు అతిథులుగా ఉండగోరువారికి 10 స్పష్టమైన ఆవశ్యకతలను అది పేర్కొనుచున్నది. 2వ వచనముతో ప్రారంభించి ఈ ఆవశ్యకతలను ఒక ఒకదాని తరువాత ఒకటి పరిశీలించుదాము.

“యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిననుసరించువాడే”

అబ్రాహాము యెహోవా యెదుట నైతికంగా దోషములేని వాడిగా నడచుకొనినందువలన అతని సంతానము బహుగా విస్తరించెను. (ఆదికాండము 17:1, 2) “నడచుట” అనుమాట కొన్ని సార్లు జీవితములో ఒక ప్రత్యేక గమనమును చేపట్టుట అని భావమిచ్చును. (కీర్తన 1:1; 3 యోహాను 3, 4) దేవుని స్నేహితునిగా, అతిథిగా ఉండుటకు ఏదోఒక మతమునకు చెందియుండి, దాని శృంగారమైన కట్టడములనుబట్టి ఉల్లసించుచు, నామకార్థ ఆచరణలో పాలు పంచుకొనుట సరిపోదు. “ప్రభువా, ప్రభువా” అని చెప్పు ప్రతివాడు లేదా తాము దేవుని ఎరుగుదుమని చెప్పు ప్రతివారు దేవుని రాజ్య దీవెనలను పొందజాలరు. (మత్తయి 7:21-23; తీతు 1:16) యెహోవా స్నేహితులు, ఆయన దృష్టిలో ‘నిర్దోషులుగా నడచుకొనుచు ఆయన ప్రమాణముల కనుగుణ్యముగా నీతిననుసరించుదురు.—మీకా 6:8.

ప్రతివిధమైన అవినీతిని, లైంగిక దుర్నీతిని చెడుతనమును అది విసర్జించును. ఎందుకో దేవుడే మనకిట్లు సెలవిచ్చుచున్నాడు: “నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి.” (1 పేతురు 1:16) ఆయన ఆజ్ఞలకు కట్టుబడియుండుటకు నిరాకరించువారిని బహిష్కరించగలుగుచు, దేవుని ఉన్నత ప్రమాణములకు మీ మతము హత్తుకొనియున్నదా? నీవు నీ కుటుంబము నీతి ప్రవర్తన కలిగియుండునట్లు నీవు పట్టుదల కలిగియున్నావా? అట్లయితే, దేవుని స్నేహితులు, అతిథులకుండవలసిన తదుపరి ఆవశ్యకతను నీవు చేరుకొనుచున్నావు.

“హృదయ పూర్వకముగా నిజము పలుకువాడు”

దేవుని స్నేహమును మనము కోరినయెడల, మనము అబద్ధమాడకూడదు లేదా ద్వంద హృదయముతో ఇచ్ఛకపు మాటలను పలుకకూడదు. (కీర్తన 12:2) మనము సత్యమును కేవలం పెదవులతో మాత్రము కాక, ‘హృదయమునుండి సత్యమును పలుకవలెను’ అవును, మనము అంతరంగమందు నమ్మకస్తులమై యుండి ‘నిష్కపటమైన విశ్వాసము’ యొక్క సాక్ష్యమునియ్యవలెను. (1 తిమోతి 1:5) కొంతమంది అబద్ధమాడుదురు లేదా పరువును కాపాడుకొనుటకు అర్థసత్యాలనే పలుకుదురు. కొందరైతే పాఠశాల పరీక్షలలో మోసములకు పాల్పడుదురు లేదా పన్ను ఎగవేతకు తప్పుడు లెక్కలు చూపుతారు. సత్యము యెడల ప్రేమలేని తనాన్ని అట్టి చర్యలు బహిర్గతం చేయును. అయితే సత్యమైన యథార్థమైన చర్యలు దేవుని స్నేహితుల హృదయమునుండే బయలు వెడలును. (మత్తయి 15:18-20 ) వారు త్రోవ తప్పి నడిచేవారు లేదా మోసకరమైనవారు కాదు.—సామెతలు 3:32; 6:16-19.

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాసాడు: “ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, నవీన స్వభావమును ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:9, 10) అవును, హృదయపూర్వకముగా సత్యము పలుకువారు “నూతన స్వభావమును” ధరించుకొనగలుగుదురు. మీరు హృదయపూర్వకముగా సత్యము పలుకుచు మీరు మరియు యితరులకు సంపూర్ణంగా నమ్మకస్తులైయున్నారా? అలా ఉన్నట్లయితే, ఇతరులను గూర్చి మీరు చెప్పుదానిపై అది ప్రభావమును కలిగియుండును.

“తన నాలుకతో కొండెములాడడు”

దేవుని అతిథిగానుండుటకు ఈ ఆవశ్యకతను చేరుకొనవలెనంటే, ఇతరులనుగూర్చి మనమెన్నడు ద్వేషభావముతో మాట్లాడకూడదు. (కీర్తన 15:3) “కొండెములాడుట” అని తర్జుమా చేయబడిన హెబ్రీ క్రియాపదము “పాదము” అనుమాటనుండి వచ్చినది అనగా “తాను పెడత్రోవను పోవుటకు” “తాండవమాడినాడు” అని అర్థమునిచ్చును. ఇశ్రాయేలీయులు ఇలా ఆజ్ఞాపింపబడిరి: “నీ ప్రజలతో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను.” (లేవీయకాండము 19:16; 1 తిమోతి 5:13) మనము ఎవరిగూర్చియైన కొండెములు చెప్పిన, అతనికున్న మంచిపేరును చెరచిన యెడల, దేవుని స్నేహితులముగా మనముండలేము.

దావీదు ఇలా పలికెను: “తన పొరుగువారిని చాటున ద్వేషించువారిని నేను సంహరించెదను.” (కీర్తన 101:5) వారు చెప్పేవాటిని వినకుండ ఉంటే కొండెములు చెప్పేవారి నోరు మనముకూడ మూయించగలము. ఒకని ఎదుట మనము చెప్పడానికి యిష్టపడని దానిని ఆ వ్యక్తినిగూర్చి అతని వెనుక ఏమిచెప్పక యుండుట మంచిది. మన నాలుకను అలా ఆధీనములో ఉంచుకొంటే మంచిది. అయితే, మన చర్యలనుకూడ నియంత్రణ చేయడం ఎంతముఖ్యం!

“తన చెలికానికి కీడుచేయడు”

యేసు మాటలు ఇచ్చట గమనింపదగినవి: “కావున, మనుష్యులు మీకు ఏమి చేయవలెనని కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) దేవుని అనుగ్రహమును పొందాలంటే చెడు తనమునుండి మనము తొలగిపోవలెను. గాయకుడు ఇట్లనెను: “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలోనుండి ఆయన వారిని విడిపించును.” (కీర్తన 97:10) దేవునితో స్నేహము ఆయన సహాయము మనకు కావాలంటే, మనమాయన ప్రమాణములను అంగీకరించవలెను.

చెడుతనమును అసహ్యించుకొనుటలో వ్యాపార వ్యవహారములలోగాని ఇతర విధములుగాగాని ఎవ్వరిని మోసగించకుండుట యిమిడియున్నది. మాటతోగాని క్రియతోగాని, మనతోటివానికి హాని చేయకూడదు, కాని అతనికి మేలు చేయవలెను. జీవిత ప్రతి వ్యవహారమునకు అది సంబంధించును. దృష్టాంతమునకు, మనము వాహనమును నడుపుచుండగా పాదచారులు దాటివెళ్లు హక్కును మర్యాదగా అంగీకరించాలి. వృద్ధులకు మనము సహాయము చేయవచ్చు, నిరాశచెందినవారిని ప్రోత్సహించి, దుఃఖించుచున్నవారిని ఓదార్చవచ్చును. ఈ విషయములో యెహోవా శ్రేష్ఠమైన మాదిరి చూపెను. యేసు చెప్పియున్నట్లు దేవుడు, “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:43-48) గాయకుడు తదుపరి పేర్కొననది ఇతరుల మేలు చేయుట అనుదానితో సమానమై యున్నది.

“తన పొరుగువానిమీద నింద మోపడు”

మనమంతా పొరపాట్లు చేస్తాము, మన స్నేహితులు ఈ చిన్న తప్పులను మన్నించ యచ్ఛయించిన యెడల ఎంత కృతజ్ఞులమై యుంటాము! మన సన్నిహితుడు మన స్వల్పమైన అయితే సంకటపరచే బలహీనతలను యితరులకు తెలియజేసినప్పుడు కలత చెందుదుము. తమ స్వంత తప్పిదములనుండి అవధానమును తప్పించుటకు లేదా యితరులకంటే ఉన్నతులమని తమ్మునుతాము కనబరచుకొనుటకు కొందరు దీనిని చేస్తారు. అయితే దేవుని స్నేహితులుగా ఉండగోరువారికి అట్టి క్రియలు తగవు.

“ప్రేమ వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతిని మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును,” అని సామెతలు 17: 9 చెప్పుచున్నది. అయితే, ఒకటి తీవ్రమైన తప్పిదములను మాత్రము దాచప్రయత్నించకూడదు. (లేవీయకాండము 5:1; సామెతలు 28:13) మనము దేవుని స్నేహితులముగా ఉండగోరిన యెడల, యథార్థపరుడైన మన పొరుగువానినిగూర్చి అవమానకరమైన కథలను ‘చెప్పుటగాని’ లేదా, వాస్తమని దానిని అంగీకరించుటగాని చేయకూడదు. (1 తిమోతి 5:19) దేవుని సేవకులు, భక్తిహీనుల చేత అవమానముల ననుభవించుచుండగా దానికితోడు వారినిగూర్చి కల్పిత కథలను వ్యాప్తిచేయుటకు బదులు యెహోవా స్నేహితులు వారినిగూర్చి క్షేమాభివృద్ధికరంగా మాట్లాడుదురు. దేవుని స్నేహితులు, అతిథులు తమసహవాసుల విషయంలో జాగ్రత్త కలిగియుండవలెను, దావీదు 4వ వచనములో యిలా చేర్చుచున్నాడు:

“అతని దృష్టికి నీచుడు అసహ్యడు”

స్వప్రయోజనముల కొరకు, కొందరు గొప్పవారితోను లేదా ప్రముఖులు వారు చెడ్డవారని తెలిసినను వారితో సహవాసము చేస్తారు. (యూదా 16 పోల్చుము.) అయితే దుష్టునితో మనము సహవాసముచేస్తే యెహోవా స్నేహితులము కాజాలము. దుష్టత్వము చేయువారి సహవాసమును కోరకయుండేంతగా మనము దానిని అసహ్యించుకోవాలి. (రోమీయులు 12:9) ఇశ్రాయేలీయుల రాజైన యెహోరాము ఎంతచెడ్డవాడంటే, ప్రవక్తయై ఎలీషా అతనితో ఇట్లనెను: “సైన్యములధిపతియగు యెహోవా సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతను నేను గౌరవము చేయనియెడల నిన్నుచూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.” (2 రాజులు 3:14) దేవుని స్నేహితులుగా ఉండుటకుగాను, పౌలు హెచ్చరికను లక్ష్యపెట్టవలెను: “దుష్టసాంగత్యము మంచినడవడిని చెరుపును.—1 కొరింథీయులు 15:33.

యెహోవాతో స్నేహము విలువైనదని ఎంచితే అప్పుడు, చెడుతనము చేయువారి సహవాసమును మనము తృణీకరిస్తాము. అవసరమైన వ్యవహారములనే వారితో కలిగియుంటాము. దేవునికి వారికిగల మంచి సంబంధమునుబట్టి మనము స్నేహితులను ఎన్నుకోవాలిగాని, లోకములో వారికున్న పలుకుబడినిబట్టికాదు. దేవునియెడల భక్తితోకూడిన భయమున్న యెడల స్నేహితులను జ్ఞానయుక్తంగా మనము ఎంచుకుంటాము. ఈ విషయములో యెహోవా అతిథులు కలిగియుండాల్సిన ఏడవ ఆవశ్యకతను గమనించండి.

“అతడు యెహోవాయందు భయభక్తులుగల వారిని సన్మానించును”

దేవుని స్నేహితులముగా, అతిథులముగా ఉండాలంటే, మనము ఆయనకు భయపడాలి. సామెతలు 1:7 యిట్లనుచున్నది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము.” “యెహోవాయందు భయము” అంటే ఏమిటి? అది దేవునియెడల భక్తితోకూడిన భయము, ఆయనకు ఆయాసము కల్గించకుండుటకుగల సంపూర్ణ భీతి, దాని ఫలితంగా నిజమైన తెలివి, జీవమును కాపాడు క్రమశిక్షణ, నిశ్చయమైన నడిపింపుయగు దేవుని పరలోక జ్ఞానము లభించును.

యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయన నీతిప్రమాణములను చేపట్టినందుకు అవమానముపాలైనను దానికి హత్తుకొనియుంటారు. ఉదాహరణకు, దైవభయముగలవారు శ్రమించి పనిచేయుచు, ఉద్యోగమందు యథార్థంగా ఉన్నందున లేదా ఇతరులకు ఆత్మీయంగా సహాయము చేయుచున్నందుకు అనేకులు ఎగాతాళి చేయవచ్చును. అయితే దైవభక్తిగలవ్యక్తి అట్టి యథార్థపరులను ఎలా దృష్టిస్తాడు? ‘యెహోవాయందు భయభక్తులుగల వారిని అతడు సన్మానించి’, వారితోపాటు అతనికి అవమానము కలిగినను వారిని అతడు ఉన్నతులనుగా ఎంచును. దేవునికి భయపడు వారియెడల మీకు అట్టి గౌరవమున్నదా? దైవ అనుగ్రహమునకుగల మరో ఆవశ్యకతను పేర్కొనుచు, గాయకుడు ఇట్లనెను:

అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు”

ఇక్కడున్న సూత్రమేమంటే దేవుడు చేయుచున్నట్లుగా మనము మన వాగ్దానములను నెరవేర్చవలెను. (1 రాజులు 8:56; 2 కొరింథీయులు 1:20) మనము ప్రమాణము చేసినదానిని నెరవేర్చుట చాలాకష్టమని ఆ తదుపరి తెలిసికొన్నను, మన మనస్సును మార్చుకొనక మన ప్రమాణమును నెరవేర్చవలెను. ఇచ్చట గ్రీకు సెప్టాజింటు, సిరియక్‌ పెషిట్టౌ, లాటిన్‌ వల్గేట్‌ గ్రంథములు “పొరుగువానితో ప్రమాణము చేసిన” అని పేర్కొన్నవి. మనము చేస్తామని ప్రమాణము చేసిన లేదా సరియైన మ్రొక్కు చేసికొనిన, దానిని తప్పక నెరవేర్చవలెను. (ప్రసంగి 5:4) అయితే, మనము ప్రమాణముచేసినది లేఖనములకు విరుద్ధమని తెలిసికొనినయెడల, దానిని చేయకూడదు.

గిబ్యోనీయులు తనను మోసగించి తమతో నిబంధనచేయునట్లు చేసిరని ఆ తదుపరి యెహోషువ తెలిసికొన్నను దానిని త్రెంచివేయలేదు. (యెహోషువ 9:16-19) కనుక మనము పురుషులమైనను, స్త్రీలమైనను, యౌవనులమైనను మన మాటను తప్పక నెరవేర్చాలి. ఇతరులకు వాగ్దానముచేసి మనకు మంచి అవకాశములు తెరువబడినప్పుడు వారిని దిక్కులేని స్థితిలో విడువక యుందము. యేసు ఇట్లనెను: “మీమాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను.” (మత్తయి 5:37) మరిముఖ్యముగా యెహోవాకు సమర్పించుకొనివారు ఆయన సాక్షులుగా ఆయనను నిరంతరము సేవించుదుమని చేసిన ప్రమాణమునకు తగిన విధంగా జీవించుటకు నిశ్చయించుకొనవలెను. వాగ్దానములను నెరవేర్చుటతోపాటు, దావీదు 15వ కీర్తన 5వ వచనమందు చూపుచున్నట్లు, ద్రవ్య విషయములందును మనము లక్ష్యముంచాలి.

తన ద్రవ్యవ వడ్డికియ్యడు

వ్యాపారము నిమిత్తము అప్పు తీసికొను ద్రవ్యమును వడ్డీతోసహా తిరిగి చెల్లించాలి. అయితే ఇచ్చట దిక్కులేని వారికి ద్రవ్యము అప్పిచ్చుట అని దావీదు భావము. మోషే ధర్మశాస్త్రము ఇలా స్పష్టీకరించింది: “నాప్రజలతో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వానియెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు.” (నిర్గమకాండము 22:25; లేవీయకాండము 25:35, 36) అధిక వడ్డీని పుచ్చుకొనేవారి బారిన పేదవారు పడుటను నెహెమ్యా కనుగొన్నప్పుడు, అట్టి దోపిడీ విధానమును అతడు ఆపు చేయించెను.—నెహెమ్యా 5:1-13.

“వడ్డీ” అనే పదము కొరకు దావీదు “కాటువేయుట” అనే భావమునిచ్చు వేరొక పదమునుండి వచ్చిన హెబ్రీ పదమును వాడెను. పేరాశగల వడ్డీ వ్యాపారులు పేదవారిని, వారు కలిగియున్న కొద్దిపాటి దానిని హరించివేయుచున్నారని ఇది సూచిస్తున్నది. కనుక స్పష్టమైన రీతిగా, పేదరికములో పడిపోయినవారినుండి తిరిగి ఏమి ఆశించకుండ వారికి సహాయము చేయడం చాలా మందిది. అట్టి విషయాన్ని యేసు ఇలా స్పష్టీకరించెను: “నీవు పగటివిందైనను రాత్రివిందైనను చేయునప్పుడు, . . . బీదలను, అంగహీనులను కుంటివాండ్లను గ్రుడ్డివాండ్లను పిలువుము. నీకు ప్రత్యుపకారముచేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు.” (లూకా 14:12-14) దేవుని స్నేహితునిగా మరియు అతిథిగా ఉండగోరు వ్యక్తి పొరుగువాని పేదరికమును ఎన్నడు స్వలాభాపేక్షకు ఉపయోగించక గాయకుడు ఇంకను తెల్పుచ్నుదానితో పొందికగా నడచుకొనును.

“నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు

లంచము చెరిపే ప్రభావమును కలిగియున్నది. ఇశ్రాయేలీయులు ఇలా ఆజ్ఞాపింపబడినారు: “నీవు లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.” (ద్వితీయోపదేశకాండము 16:19) ముఖ్యంగా “నిరపరాధికి” హాని చేయుటకు బహుశ న్యాయస్థాన సాక్ష్యమును మార్చివేయుటకు లంచము పుచ్చుకొనుట నేరమైయున్నది. నిరపరాధియైన యేసును అప్పగించుటకు ఇస్కరియోతు యూదా లంచము నంగీకరించుట ఎంత తుచ్ఛమైనది!—మత్తయి 26:14-16.

ఈ విషయములో మనము నిర్దోషులమని మనము తలంచవచ్చును. అయితే సందేహాస్పదమైన వాటిని కొనుటకు మనమెప్పుడైనా శాసన ఉల్లంఘన చేసితిమా? ప్రవక్తయైన సమూయేలు ఎన్నడూ, “నోటిని అణచివేసే ద్రవ్యమును” లేదా లంచమును పుచ్చుకొనలేదు. (1 సమూయేలు 12:3, 4) మనమును దేవుని స్నేహితులముగా అతిథులముగా ఉండగోరిన యెడల ఆలాగుననే వ్యవహరించాలి.

“ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు”

యథార్థవంతులనుగూర్చిన పదిరకములు వర్ణనలను పేర్కొనిన పిదప పైమాటలతో 15వ కీర్తన ముగియుచున్నది. అవి మన మతమును అంచనా వేయుటకు మనకు బాగుగా దోహదముచేయును. ఒకవేళ అది నిజమైన విశ్వాసమైనచో, మనకు (1) యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించుటకు (2) హృదయపూర్వకముగా నిజము పలుకుట (3) ఇతరులనుగూర్చి కొండెములు పలుకకుండుట (4) కీడుచేయుటనుండి తొలగిపొవుటను నేర్పవలెను. దేవునికి అంగీకృతమైన మతము (5) యథార్థమైన పొరుగువారిమీద నిందమోపకుండ (6) నీచులతో సహవాసము చేయకుండ కాపాడును. నిజమైన మతము మనలను (7) యెహోవాకు భయపడువారిని సన్మానించునట్లు (8) సరియైన దానినిగూర్చి ప్రమాణముచేస్తే దానిని కొనసాగించుటకును (9) వడ్డీ పుచ్చుకొనకుండా పేదవారికి ఇచ్చుటకు (10) నిరపరాధికి విరోధముగా లంచము పుచ్చుకొనకుండా చేయును.

ఈ సంగతులను చదువువాడు, వినువాడు, మాట్లాడువాడు లేదా నమ్మువాడు సహితం “ఎన్నడు కదల్చబడడు” అని దావీదు చెప్పడం లేదు. “ఈ ప్రకారం చేయువాడే” అట్టి అనుభవమును పొందగలడు. క్రియలు లేని విశ్వాసము మృతమైనదై దైవ అనుగ్రహమును పొందజాలదు. (యాకోబు 2:26) 15వ కీర్తనలో పేర్కొనిన మంచి కార్యములను చేయువారు ఎన్నడు కదల్చబడరు ఎందుకనగా, యెహోవా వారిని కాపాడి ఆదుకొనును.—కీర్తన 55:22.

అయితే, పవిత్ర ఆరాధనకు 15వ కీర్తనలో పేర్కొనబడిన పది అంశములకంటే మరి ఎక్కువ అంశాలున్నవి. దేవుని “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించవలసిన విషయాన్ని గూర్చి యేసు అనుచరులు అటుపిమ్మట నేర్చుకొనిరి. (యోహాను 4:23, 24) గనుక, నేడు వీటిని చేయుచూ ఉన్న ప్రజలతో నీవును ఉండగలవా? యెహోవా సాక్షులైన వీరితో నీవు క్రమముగా సహవాసము చేయుచు, బైబిలును పఠనము చేసినయెడల, నీవు నిరంతరము దేవుని అతిథిగాను స్నేహితునిగాను ఉండగల భూపరదైసునందలి జీవిత నిరీక్షణను పెంపొందించుకొనగలవు. (w89 9/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి