కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 1/1 పేజీలు 20-25
  • యెహోవాకు ప్రీతికరమైన యాగములు అర్పించుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు ప్రీతికరమైన యాగములు అర్పించుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “వారి విశ్వాసమును అనుకరించుడి”
  • అబద్ధ బోధలను విసర్జించుము
  • దేవునికి ఇష్టమైన బలులు
  • లోబడియుండుడి
  • ప్రార్ధనాపూర్వకముగా యుండుడి
  • ముగింపు మాటలు మరియు వినతి
  • బహు విలువలను కలిగియున్న లేఖ
  • యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా నాకు సహాయుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • దేవునికి ఇష్టమైన బలులు అర్పించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • అలయక యెహోవా కొరకు సాక్ష్యమియ్యుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 1/1 పేజీలు 20-25

యెహోవాకు ప్రీతికరమైన యాగములు అర్పించుము

‘ఆయన (యేసుక్రీస్తు) ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదము.’—హెబ్రీయులు 13:15.

1. ఏమిచేయ వలెనని పాపులైన ఇశ్రాయేలీయులను యెహోవా బలవంతపెట్టెను?

యెహోవాకు అంగీకృత యాగములు అర్పించు వారందరికి ఆయన సహాయుడై యున్నాడు. కాబట్టి, జంతు బలులు అర్పించి ఇశ్రాయేలీయుల మీద ఒకప్పుడు ఆయన కరుణయుండెను. అయితే వారు మరలా పాపము చేసిన తర్వాత ఏమి సంభవించినది? ప్రవక్తయైన హోషేయా ద్వారా వారికి ఇలా గట్టిగా చెప్పబడినది: “ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలను సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, ‘మా పాపములన్నింటిని పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులనర్పించున్నాము.’—హోషేయ 14:1, 2.

2. ‘కోడెల వంటి పెదవులు ఏమైయున్నవి, మరియు అపొ. పౌలు హోషేయా ప్రవచనమును పరోక్షముగా ఎట్లు ప్రస్తావించెను?

2 కాబట్టి దేవుని ప్రాచీన ప్రజలు యెహోవాకు “కోడెల వంటి పెదవులను” అర్పించవలసిందిగా ప్రోత్సహింపబడిరి. అవి ఏమైయుండెను? ఎందుకు నమ్మకమైన స్తుతియాగము! దీనిని ప్రస్తావించుచు అపొ. పౌలు హెబ్రీ క్రైస్తవులు “దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము . . . అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించవలెనని” వేడుకొనెను. (హెబ్రీ. 13:15) ఈనాడు అలాంటి యాగములు అర్పించుటకు యెహోవా సాక్షులకు ఏమి సహాయము చేయగలదు?

“వారి విశ్వాసమును అనుకరించుడి”

3. సారాంశముగా, హెబ్రీ. 13:7 నందు అపొ. పౌలు ఏమని చెప్పెను, తత్ఫలితంగా ఏ ప్రశ్న ఉత్పన్నమగు చున్నది?

3 హెబ్రీ క్రైస్తవులకు పౌలు ఇచ్చిన సలహాను అన్వయించుటకు మనను మన మహా సహాయకుడైన యెహోవా దేవునికి అంగీకృత యాగములనర్పించుటకు శక్తివంతులను చేయును. ఉదాహరణకు అపొస్తలుడు ఇలా వ్రాసెను “మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉండిన వారిని జ్ఞాపకము చేసికొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుకరించుడి.” (హెబ్రీ. 13:7) “మీ పైని నాయకులుగా ఉండినవారు” లేక “పాలించు వారిగా యున్నవారిని జ్ఞాపకము చేసికొనుడి” అని చెప్పి పౌలు ఎవరిని సూచించుచున్నాడు?—న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్సు బైబిల్‌, పాదవచనము.

4. (ఎ) గ్రీకు వచనము ప్రకారముగా, “నాయకులుగా ఉన్నవారు” ఏమి చేయుచున్నారు? (బి) యెహోవాసాక్షుల మధ్య ఎవరు “నాయకులుగా” ఉన్నారు?

4 ‘నాయకులుగా’ ఉన్నవారు లేక పాలించువారిని గూర్చి పౌలు మాట్లాడెను. (7, 17, 24 వచనాలు) “ఓడను తోలుట, నడిపించుడ—అను అర్థముగల గ్రీకు పదమైన Rybernao నుండి లాటీను ద్వారా “పాలించు” అను పదము వచ్చినది. క్రైస్తవ పెద్దలు తమ “పాలనా సామర్థ్యము” ద్వారా ప్రభుత్వము చేయుచు స్థానిక సంఘముల యందు నాయకత్వమును మరియు నడిపింపు నిత్తురు. (1 కొరిం. 12:28) అయితే, యెరూషలేము నందలి పెద్దలు మరియు అపొస్తలులు గవర్నింగ్‌ బాడిగా (నిర్వహక సభగా) వ్యవహరించి సంఘము లన్నింటికి ఉపదేశమును నడిపింపును ఇచ్చిరి. (అపొ. కార్యములు 15:1, 2, 27-29) కాబట్టి, ఈనాడు పెద్దలు గల ఒక గవర్నింగ్‌ బాడి ప్రపంచవ్యాప్త యెహోవా సాక్షుల కొరకు ఆత్మీయ పర్యవేక్షణను దయచేయుచున్నది.

5. సంఘపెద్దలను మరియు గవర్నింగు బాడి సభ్యులనుగూర్చి ఎందుకు మరియు ఎట్లు మనము ప్రార్ధించవలెను?

5 స్థానిక పెద్దలు గవర్నింగ్‌ బాడి సభ్యులు మన మధ్య నాయకత్వము వహింతురు; కాబట్టి సంఘమును పాలించుటకు కావల్సిన జ్ఞానము వారికి దయచేయుమని దేవుని ప్రార్థించుచు వారిని మనము గౌరవింతుము. (ఎఫెసీయులు 1:15-17ను పోల్చుము.) ‘మనకు’ దేవుని వాక్యమును బోధించిన వారిని జ్ఞాపకము చేసుకొనుట ఎంత సరియై యున్నది! తిమోతి తన తల్లి అవ్వల ద్వారానే కాక పౌలు మరియు ఇతరుల ద్వారా ఉపదేశింపబడెను. (2 తిమోతి 1:5,6; 3:14) కాబట్టి తిమోతి నాయకత్వము వహించువారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచి వారి విశ్వాసమును అనుకరించగలిగి యుండెను.

6. ఎవరి విశ్వాసమును మనము అనుకరించవలెను, అయితే ఎవరిని అనుసరింతము?

6 హేబేలు, నోవహు, అబ్రాహాము, శారా, రాహాబు, మోషే అనువారలు విశ్వాసమును ప్రదర్శించిరి. (హెబ్రీ. 11:1-40) ఎలాంటి జంకులేకుండా మనము అలా వారి విశ్వాసమును అనుకరించవచ్చును. ఎందుకనగా, వారు దేవుని యెడల యథార్థపరులై మరణించిరి. అయితే, ఇప్పుడు మనమధ్యనూ నాయకత్వము వహించు యథార్థ మనుష్యుల విశ్వాసమును కూడా అనుకరించగలము, మన దృష్టి క్రీస్తు మీద గనుక అసంపూర్ణ మానవులను అనుసరించమనుకోండి, బైబిలు భాషాంతరము చేసిన జె. గుడ్‌స్పీడ్‌ చెప్పినట్లుగా “విశ్వాసికి ప్రాచీనకాల కధానాయకులు మాదిరి కర్తలు కాదు, ఏలయనగా అతను క్రీస్తుమీద నిలువవలెను.” అవును, క్రీస్తు మనకొరకు బాధపడి మనమాయన అడుగుజాడలలో నడుచుకొనుటకు ఒక మాదిరియుంచెను.—1 పేతురు 2:21; హెబ్రీ. 12:1-3.

7. యేసుక్రీస్తు కొరకు బాధనొందుట మీద హెబ్రీ. 13:8 మన దృక్పధము మీద ఎలా ప్రభావము చూపవలెను?

7 దేవుని కుమారుని మీద శ్రద్ధ నిలుపుడి, పౌలు ఇంకను చెప్పినదేమనగా “యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్క రీతిగా ఉన్నాడు. అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును.” (హెబ్రీ. 13:8) యేసు స్థిరమైన మాదిరినిబట్టి సైఫను యాకోబు వంటి నమ్మకమైన సాక్షులు కదల్చబడని రీతిలో యథార్థతను ప్రదర్శించిరి. (అపొ. కార్యములు 7:6-60; 12:1, 2) క్రీస్తు అనుచరులుగా మరణించుటకైనను వారు ఇచ్ఛయించిరి గనుక, వారి విశ్వాసము అనుకరించు విలువను కలిగియున్నది. ప్రాచీన కాలమందు, ప్రస్తుతమందు మరియు భవిష్యత్తు నందు సహితము దైవ ప్రజలు యేసు శిష్యులుగా మరణముననుభవించుట నుండి తప్పింపుమని వేడుకొనరు.

అబద్ధ బోధలను విసర్జించుము

8. హెబ్రీ. 13:9 నందలి పౌలు మాటలకు మీరెట్లు తాత్పర్యము చెప్పుదురు?

8 మార్పులేని యేసు వ్యక్తిత్వము ఆయన బోధలు ఆయన అపొస్తలులు బోధించిన దానికి మనము హత్తుకొనునట్లు చేయవలెను. హెబ్రీయులకు ఇలా చెప్పబడెను: “నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, జన పదార్ధములనుబట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది; భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు.”—హెబ్రీ. 13:9.

9. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యందు ఏ ఉన్నతమైన విషయములను పౌలు సూచించెను?

9 అటువంటి సంగతులు సీనాయి పర్వత ధర్మశాస్త్రమును శాశ్వతకాల దావీదు రాజరికమును స్పష్టముగా భంగపడుటకు వదిలివేయుటగా యూదులు సూచించిరి. అయితే, ధర్మశాస్త్రమును ప్రవేశపెట్టుట భయంకరమైనదిగా యున్నను, యెహోవా మరింత శక్తివంతముగా సూచనలతో, సూచక క్రియలతో, శక్తివంతమైన పనులతో, పరిశుద్ధాత్మ నిచ్చుట ద్వారా సాక్ష్యమిచ్చి క్రొత్త నిబంధనను ప్రారంభించెనని హెబ్రీ క్రైస్తవులకు చూపించెను. (అపొ. కార్యములు 2:1-4; హెబ్రీ. 2:2-4) సా.శ.పూ. 607 వలే దావీదు రాజరిక భూపాలకులు కదిలింపబడినట్లు క్రీస్తు పరలోక రాజ్యము కదలింపబడనేరదు. (హెబ్రీ. 1:8, 9; 12:28) అంతేకాకుండా అభిషక్తులు పరలోక సీయోను పర్వతమును సమీపించుదురు గనుక, యెహోవా సీయోను పర్వతము యొద్ద అద్భుతరీతిన ప్రదర్శించిన దానికి మించి మరింత భయము కల్గించు రీతిలో యుండు దాని ముందర వారిని సమకూర్చును.—హెబ్రీ. 12:18-27.

10. హెబ్రీ. 13:9 ప్రకారముగా దేనివలన హృదయ స్థిరత కలుగును?

10 కాబట్టి, హెబ్రీయులు యూదులు “నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుట” నుండి తప్పించుకొను అవసరము కలదు. (గలతీ. 5:16) సత్యమందు స్థిరముగా నిలిచియుండుటకు అలాంటి బోధల ద్వారా కాక ‘దేవుని కృపను బట్టియే హృదయము స్థిరపడును.’ కొందరు స్పష్టముగా భోజన పదార్ధములను గూర్చి బలులను గూర్చి వాదించిరి. అందుకే పౌలు, హృదయము “భోజన పదార్ధములను బట్టి” స్ధిరపరచబడదని “భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమియు ప్రయోజనము కలుగలేదని” చెప్పెను. కొన్ని ప్రత్యేక భోజనములను తినుట మరియు కొన్ని ప్రత్యేక దినములను ఆచరించుట వలన కాక దైవభక్తి మరియు విమోచన యెడల గుణగ్రహణ నుండి ఆత్మీయ ప్రయోజనములు కలుగును. (రోమా. 14:5-9) అంతేకాకుండా, క్రీస్తు బలి లేవీయ సంబంధ బలులను నిరర్ధకము చేసెను.—హెబ్రీ. 9:9-14; 10:5-10.

దేవునికి ఇష్టమైన బలులు

11. (ఎ) హెబ్రీ. 13:10, 11 నందలి పౌలు మాటల సారాంశము ఏమైయున్నది? (బి) క్రైస్తవుల కొరకు ఏ అలంకారార్థ బలిపీఠము కలదు?

11 “లేవీ యాజకులు బలి జంతువుల మాంసము భుజించిరి, అయితే పౌలు వ్రాసిన దేమనగా: మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో (ఆలయ గుడారము) సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్ధముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట పరిహారార్ధ దినమున,” దహింపబడును. (హెబ్రీ. 13:10, 11; లేవీయ. 16:27; 1 కొరిం. 9:13) పాపమును పరిహరించుటకు క్రీస్తు బలి ఆధారముగా దేవుని సమీపించుటను సూచించు అలంకారార్ధ బలిపీఠము క్రైస్తవులకు కలదు. దాని ద్వారా యెహోవా క్షమాపణ మరియు నిత్యజీవార్థమైన రక్షణ కలుగును.

12. హెబ్రీ. 13:12-14 నందు అభిషక్త క్రైస్తవులు ఏమి చేయ బలవంతము చేయబడిరి?

12 పరిహారార్ధ దినములో సాదృశ్యతను పౌలు నొక్కి చెప్పుటలేదు అయితే ఆయన చెప్పినదేమనగా! “యేసుకూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై” యెరూషలేము “గవిని వెలుపట శ్రమపొందెను.” అక్కడ యేసు మరణించి సంపూర్ణ ప్రభావముగల విమోచనా బలిని దయచేసెను. (హెబ్రీ. 13:12; యోహాను 19:17; 1 యోహాను 2:1, 2) తోటి అభిషక్త క్రైస్తవులను అపొ. పౌలు ఇలా బలవంతము చేసెను. కాబట్టి, మనమాయన (యేసు) నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్లుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని ఉండబోవుచున్న దాని కోసరము ఎదురుచూచున్నాము.” (హెబ్రీ. 13:13, 14; లేవీయ. 16:10) యేసు వలెనే మనము కూడా నిందింపబడినను యెహోవాసాక్షులుగా మనము పట్టుదల గలవారమై యుందుము. ప్రస్తుత విధానమందును మనము భక్తిహీనతను, ‘ఇహలోక దురాశలను విసర్జించుచు నూతన లోకమువైపు చూచుచు స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రతుకుదుము.’ (తీతు 2:11-14; 2 పేతురు 3:13; 1 యోహాను 2:15-17) మనలోనున్న అభిషక్తులు నమ్మకముగా పరలోకరాజ్యమను “పట్టణమును” వెదుకుదురు.—హెబ్రీ. 12:22.

13. దేవునికిష్టమైన యాగములయందు కేవలము ఏది మాత్రమే చేరియుండలేదు?

13 ఆ తర్వాత దేవుని కిష్టమైన బలులను గూర్చి పౌలు ప్రస్తావించుచు ఇట్లు వ్రాసెను: “ఆయన (యేసు) ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమున ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఉపకార ధర్మమును చేయమరచి పోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.” (హెబ్రీ. 13:15, 16) క్రైస్తవ యాగమందు కేవలము మానవతా కృత్యములు మాత్రమే చేరియుండవు. సాధారణముగా ప్రజలు అలా చేయుదురు. ఉదాహరణకు 1988లో సోవియట్‌లో ఆర్మేనియానందు జరిగిన భూకంప బాధితులకు సహాయము చేయ అనేక దేశ ప్రజలు ముందుకు వచ్చిరి.

14. దేవునికి అంగీకృతమగు బలిని అర్పించుట ఏ పనిమీద ఒత్తిడి తెచ్చుచున్నది?

14 “భయభక్తులతో” యెహోవాకు మనము చేయు ప్రీతికరమైన సేవ యేసు ప్రదర్శించినట్లుగా స్వయంత్యాగము మీద ఆధారపడియున్నది. (హెబ్రీ. 12:28; యోహాను 13:34; 15:13) ప్రధాన యాజకునిగా యేసు ద్వారా మనము ‘దేవునికి స్తుతియాగము చేయుచు ఆయన నామమును ఒప్పుకొనుచు మన జిహ్వాఫలములను అర్పించుచున్నాము’ గనుక సేవయందు మన ప్రచారపు పని నొక్కి తెల్పబడినది. (హోషేయా 14:2; రోమా. 10:10-15; హెబ్రీ. 7:26) “విశ్వాసగృహమందు చేరిన వారిలో” అది వేరే విషయము. (గల. 6:10) ప్రత్యేకముగా మన తోటివారు విపత్తుల నెదుర్కొనినప్పుడు, అవసరతలో యున్నప్పుడు లేక కృంగినప్పుడు మనము వారికి వస్తుదాయకముగా ఆత్మీయముగా సహాయము చేయుదుము. ఎందుకు? ఎందుకనగా మనము ఒకరినొకరు ప్రేమింతుము. “అలాంటి యాగములు దేవునికిష్టమైనవి” గనుక వారు తమ నిరీక్షణను బహిరంగముగా చెప్పుట యందు బలహీనముగా లేక స్థిరముగా హత్తుకొని యుండుశక్తి గలవారై యుండెవలెనని మనము ఇచ్ఛయింతుము.—హెబ్రీ. 10:23-25; యాకోబు 1:27.

లోబడియుండుడి

15. (ఎ) హెబ్రీ. 13:17 నందలి సలహాకు మీరెట్లు తాత్పర్యము చెప్పుదురు? (బి) నాయకత్వము వహించు వారికి ఎందుకు గౌరవము చూపవలెను?

15 అంగీకృత యాగములు చేయుటకు మనము సంపూర్ణముగా దేవుని సంస్థతో సహకరించవలెను. అధికారము విషయములో విసుకు కల్గించకుండా పౌలు ఇలా వ్రాసెను: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి.” (హెబ్రీ. 13:17) మన సహకారము లోపించుట వలన కృంగిన వారిగా దుఃఖముతో యుండకుండుటకు నియమిత పెద్దలు సంఘమును నడిపించుచుండగా వారిని మనము గౌరవించవలెను. మనము లోబడకుండుటలో విఫలులగుట ఫలితముగా ఓవర్‌సీయర్స్‌కు భారము కలుగును. కాగా అది మనకు ఆత్మీయముగా నిష్‌ప్రయోజనము తెచ్చును. సహకారము ఆత్మీయ పెద్దలు సహాయము చేయుటకు తోడ్పడును, మరియు అది ఐక్యతకు రాజ్యప్రచార పని పురోగభివృద్ధికి చేయూతనిచ్చును.—కీర్తన 133:1-3.

16. మనమధ్య నాయకులుగా యున్న వారికి లోబడియుండుట ఎందుకు సరియైయున్నది?

16 నాయకులుగాయున్న వారికి లోబడి యుండుట ఎంత సరియైన విషయము. వారు మనకు కూటములలో బోధించి పరిచర్య యందు మనకు సహాయము చేయుదురు. కాపరులుగా వారు మన సంక్షేమమును వెదుకుదురు. (1 పేతురు 5:2, 3) వారు మనము దేవునితో మరియు సంఘములో మంచి సంబంధము కలిగియుండుటకు సహాయము చేయుదురు. (అపొ. కార్య. 20:28-30) జ్ఞానయుక్తమైన ప్రేమ పూర్వకమైన పర్యవేక్షణకు లోబడుట ద్వారా మనము సర్వోన్నత ఓవర్‌సీయర్‌ అయిన యెహోవా యెడల, ఆయన తర్వాతి ఓవర్‌సీయర్‌ అయిన యేసుక్రీస్తుకు గౌరవము చూపిన వారమగుదుము.—1 పేతురు 2:25; ప్రక. 1:1; 2:1-3, 22.

ప్రార్ధనాపూర్వకముగా యుండుడి

17. ఎలాంటి ప్రార్ధనలకొరకు పౌలు వేడుకొనెను, మరియు ఆయనెందుకు సరిగా వాటి కొరకు అడుగగలడు?

17 బహుశ హింస కారణముగా, పౌలు ఆయన సహవాసులు వేరువేరుగా యున్నందున, ఆయనిట్లనెను “మా నిమిత్తము ప్రార్ధన చేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తించగోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చునట్లు యిలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను.” (హెబ్రీ. 13:18, 19) పౌలు సక్రమమైన వ్యక్తియై వన్నెతరిగిన మనస్సాక్షి గలవాడైనట్లయిన తన కొరకు ప్రార్ధన చేయుమని హెబ్రీయులను అడుగ ఆయనకు హక్కు ఎక్కడుండెడిది? (సామె. 3:32; 1 తిమోతి 4:1, 2) యూదులను తట్టుకొనిన మంచి మనస్సాక్షి గల నమ్మకమైన పరిచారకునిగా ఆయనుండెను. (అపొ. కార్య. 20:17-27) తను మరలా వారి యొద్దకు రావలెనని హెబ్రీయులు ప్రార్ధించినట్లయిన వారిని తను కలుసుకొనునని కూడా పౌలు నమ్మకముతో యుండెను.

18. ఇతరులు మనకొరకు ప్రార్ధించవలెనని మనమపేక్షించినట్లయిన మనకై మనము ఏ ప్రశ్నలను వేసికొనవలెను?

18 హెబ్రీయుల ప్రార్ధనల కొరకు పౌలు చేసిన వినతి పేరు పేరునా క్రైస్తవులు ఒకరికొరకు మరియొకరు ప్రార్థించుట సరియని చూపించుచున్నది. (ఎఫెసీ. 6:17-20 పోల్చుము.) ఇతరులు మనకొరకు ప్రార్ధించవలెనని మనము అపేక్షించినప్పుడు, మనము అపొస్తలునివలెయుండి, ‘నమ్మకమైన మనస్సాక్షి కలిగియుండి అన్నింటిలో నమ్మకత్వముతో ప్రవర్తింప నిశ్చయతను కలిగియుండవలదా? మీ వ్యవహారములన్నింటిలో మీరు నమ్మకస్థులుగా యున్నారా? అలాగే, పౌలుకు వలెనే నీవును ప్రార్థనయందు అంతే నమ్మకమును కలిగియుందువా?—యోహాను 5:4, 15.

ముగింపు మాటలు మరియు వినతి

19. (ఎ) హెబ్రీయుల యెడల పౌలు ప్రార్ధనాపూర్వక ఇష్టత ఏమైయుండెను? (బి) క్రొత్తనిబంధన ఎందుకు శాశ్వతమైన నిబంధనయైయున్నది?

19 హెబ్రీయులు ప్రార్ధనల కొరకు వెదకిన వాడై పౌలు ప్రార్ధనాపూర్వకముగా తన ఇష్టతను తెల్పుచు ఇట్లనెను: “గొర్రెల గొప్పకాపరియైన యేసు అను మన ప్రభువుని నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలోనుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు, యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.” (హెబ్రీ. 13:20, 21) సమాధానకరమైన భూమిని దృష్టియందుంచుకొని “సమాధాన కర్తయగు దేవుడు” క్రీస్తును అమర్త్యమైన పరలోక జీవితమునకు పునరుత్థానుని చేసెను, కాగా అక్కడ యేసు నూతననిబంధనను స్థిరపరచిన చిందించిన రక్తము యొక్క విలువను అందించెను. (యెషయా 9:6, 7; లూకా 22:20) అది ఒక శాశ్వతకాల నింబంధన, ఎందుకనగా దేవుని ఆత్మీయకుమారులును ఆ నూతననింబంధన యందు చేరియున్న 144,000 మంది సేవలనుండి భూమిమీద యుండు వారు శాశ్వతకాల ప్రయోజనములను పొందుదురు. (ప్రక. 14:1-4; 20:4-6) మనము మహిమపరచు దేవుడు క్రీస్తు ద్వారా మనను “ప్రతి సత్కార్యమునకు సిద్ధము చేసి, ఆయన దృష్టికి బహు ప్రీతికరమైన రీతిలో ఆయన చిత్తము జరిపించునట్లు చేయుచున్నాడు.”

20. హెబ్రీయులకు పౌలు వ్రాసిన ముగింపు మాటలకు మీరెట్లు తాత్పర్యము చెప్పి వివరింతురు?

20 తన లేఖకు హెబ్రీయులు ఎట్లు ప్రతిస్పందింతురో అనిశ్చయత గలవాడై పౌలు ఇట్లనెను: “సహోదరులారా, (దాని బహు అర్ధవంతమైన సారమును విచారించుచు) మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటలను (యూదులను కాక దేవుని కుమారుని మాటను వినవలెనని) సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి (చెరనుండి) విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితో కూడా వచ్చి మిమ్ములను చూచెదను. “రోము నుంచి బహుశ వ్రాయుచు అపొస్తలుడు తిమోతితో కూడా యెరూషలేము నందలి యూదులను దర్శించవచ్చునని ఆశించెను. ఆ పిమ్మట పౌలు ఇట్లనెను: “మీపైని నాయకులైన వారందరికిని (కష్టించి పనిచేయు పెద్దలుగా) పరిశుద్ధులందరికిని (పరలోక నిరీక్షణ గలవారు) నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. (దేవుని) కృప మీకందరికి తోడైయుండును గాక.”—హెబ్రీ. 13:22-25.

బహు విలువలను కలిగియున్న లేఖ

21. ఏ ముఖ్యమైన అంశములను అర్థము చేసుకొనుటకు హెబ్రీయులకు వ్రాసిన లేఖ మనకు సహాయము చేయుచున్నది?

21 బహుశా పరిశుద్ధ లేఖనముల యందలి మరే ఇతర పుస్తకముకంటే ఎక్కువగా హెబ్రీయులకు వ్రాసిన లేఖ ధర్మశాస్త్రము క్రింద అర్పించిన బలుల ప్రాముఖ్యతను అర్ధము చేసుకొనుటకు మనకు సహాయము చేయుచున్నది. పాప మానవజాతియంతటికి కావల్సిన విమోచనను కేవలము యేసు బలి మాత్రమే దయచేయుచున్నదని ఈ లేఖ స్పష్టంగా చూపించుచున్నది. ఈ లేఖయందు ఉన్న ఒక గమనార్హమైన విషయమేమనగా, దేవుని కుమారుని వినవలెను.

22. హెబ్రీయులకు వ్రాసిన లేఖకొరకు మనము కృతజ్ఞత కలిగియుండుటకు గల కొన్ని కారణములు ఏవి?

22 అంతేకాకుండా క్రిందటి రెండు శీర్షికలలో మనము చూసినట్లుగా హెబ్రీయులకు వ్రాసిన దైవప్రేరణగల లేఖ కొరకు మనము కృతజ్ఞత కలిగియుండు యితర కారణములును కలవు. యెహోవా మన సహాయకుడని మనమెరిగియున్నాము గనుక, అది మనము పరిచర్యయందు అలసిపోకుండా సహాయము చేయుచున్నది మరియు అది మనను ధైర్యముతో నింపుచున్నది. ఇంకా దివారాత్రము పవిత్ర సేవచేయుటకు మరియు మన ప్రేమగల స్తుతి పాత్రుడైన యెహోవా దేవుని ప్రీతిపరచు హృదయపూర్వక యాగములు చేయుటకు నిష్కల్మషముగా మన పెదవులను మన జ్ఞానమును ఉపయోగించుటకు అది మనను ప్రోత్సహించుచున్నది.

మీరు ఎట్లు ప్రత్యుత్తరమిత్తురు?

◻ హెబ్రీయులకు వ్రాసిన లేఖ వారు అబద్ధబోధలను విసర్జించుటకు ఎట్లు సహాయము చేసినది?

◻ దేవునికిష్టమైన యాగములు ఏ ప్రాముఖ్యమైన పని మీద వెలుగును ప్రకాశింపజేయుచున్నవి?

◻ “పైని నాయకులుగా యున్న” వారెవరు, వారికెందుకు లోబడవలయును?

◻ హెబ్రీయులకు వ్రాసిన లేక ప్రార్ధనను ఎట్లు ఉన్నతపరచుచున్నది?

◻ హెబ్రీ క్రైస్తవులకు వ్రాసిన లేఖ బహువిలువను కలిగియున్నదని మనమెందుకు చెప్పగలము?

[23వ పేజీలోని చిత్రాలు]

దేవుని కిష్టమైన బలుల యందు ఇంటింటి పరిచర్యయందు భాగము వహించుట మరియు తోటి క్రైస్తవులకు సహాయకరమగు సలహాలిచ్చుటయు ఇమిడియున్నది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి