యెహోవా నాకు సహాయుడు
“యెహోవా నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని ధైర్యముతో చెప్పగలము.”—హెబ్రీయులు 13:6.
1, 2. (ఎ) పౌలు మరియు కీర్తనల రచయిత, ఈ ఇద్దరు యెహోవా యందు ఏ నమ్మకమును వ్యక్తము చేసిరి? (బి) ఏ ప్రశ్నలు ఉత్పన్నమగును?
యెహోవాదేవుడు సహాయమునకు అనంతమైన మూలమైయున్నాడు. అనుభవము ద్వారా కీర్తనల రచయిత దీనిని యెరిగి యుండి ఇలా చెప్పగలిగెను. “యెహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? (కీర్తన 118:6) హెబ్రీ క్రైస్తవులకు దైవ ప్రేరిత లేఖను వ్రాసినప్పుడు అపొ. పౌలు కూడా ఇలాంటి భావాభిప్రాయములనే వ్యక్తము చేసెను.
2 గ్రీకు సెప్టాజింటు నుండి పౌలు సాక్ష్యాధారముగా తోటి హెబ్రీ ఆరాధికులకు ఆయన ఇట్లు చెప్పెను: “యెహోవా నాకు సహాయుడు. నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలము.” (హెబ్రీ. 13:6) అపొస్తలుడు ఈ విధముగా ఎందుకు వ్రాసెను? సందర్భము నుండి మనమేమి నేర్చుకొనగలము?
యెహోవా సహాయ అవసరత యందున్నాము
3. (ఎ) ఏ పరిస్థితులయందు యెహోవా పౌలుకు సహాయకునిగా నిరూపించుకొనెను? (బి) హెబ్రీ క్రైస్తవులకు ఎందుకు యెహోవా ప్రత్యేక సహాయకునిగా వారికి అవసరముండెను?
3 పౌలు స్వయం-త్యాగము చేయు సాక్షిగాయుండి, ఆయనకు యెహోవా సహాయకుడను సాక్ష్యము గలవాడై యుండెను. అనేక ఇబ్బందులలో దేవుడు అపొస్తులునికి సహాయము చేసెను. పౌలు ఖైదు చేయబడెను. కొట్టబడెను, రాళ్లతోకూడా కొట్టబడెను. క్రైస్తవ మత ప్రచార యాత్రలో ఆయన ఓడ బ్రద్ధలగుటను ఇతర అనేక అపాయములను అనుభవించెను. క్రైస్తవ మత ప్రచార యాత్రలో ఆయనకు శ్రమ, నిద్రలేని రాత్రులు, ఆకలి, దాహము, దిగంబరత్వము తెలియనివి కావు. ఆయనిట్లనెను: “ఇవియును గాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది.” (2 కొరిం. 11:24-29) హెబ్రీ క్రైస్తవులకొరకు పౌలుకు అంత శ్రద్ధ యుండెను.
4. హెబ్రీ లేఖ యందంతట ఏ ప్రాథమిక విన్నపము చేయబడినది?
4 హెబ్రీ క్రైస్తవులకు వ్రాసిన లేఖయందలి ప్రధమభాగమందు, పౌలు వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాట విన్నట్లయితేనే దైవసహాయమును అనుభవింతురని చూపించెను. (హెబ్రీ. 1:1, 2) ఈ అంశము లేఖయందు ప్రముఖముగా ప్రస్తావించబడెను. ఉదాహరణకు ఈ సలహాను బలపరచుటకుగాను అపొస్తులుడు తన పాఠకులకు ఇశ్రాయేలీయుల అవిధేయత వలన వారు అరణ్యములో ఎలా శిక్షింపబడిరో గుర్తుచేసెను. యేసుద్వారా దేవుడు వారికి సెలవిచ్చిన దానిని తృణీకరించి క్రీస్తు బలిద్వారా తొలగింపబడిన మోషే ధర్మశాస్త్రమునకు అంటిపెట్టుకొని మతభ్రష్టులయినట్లయిన హెబ్రీ క్రైస్తవులైనను శిక్షను ఎంతమాత్రము తప్పించుకొందురు!—హెబ్రీ. 12:24-27.
క్రియ యందు సహోదరప్రేమ
5. (ఎ) హెబ్రీయులకు వ్రాసిన లేఖ మరింకే సలహాను దయచేయుచున్నది? (బి) ప్రేమను గూర్చి పౌలు ఏమని చెప్పెను?
5 భావిపరలోక రాజ్య వారసులకు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వారు ఎట్లు వారి మాదిరి కర్తయగు యేసును అనుకరించవలెను. ఇట్లు దైవభీతి భయములతో పవిత్రసేవ చేయవలెను. ఎట్లు యెహోవాను సహాయకుడిగా కలిగియుండవలెనను విషయములమీద సలహానిచ్చెను. (హెబ్రీ. 12:1-4, 28, 29) ‘ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును’ క్రమముగా కూడుకొనవలెనని పౌలు తోటి విశ్వాసులను బలవంతపెట్టెను. (హెబ్రీ. 10:24, 25) ఇప్పుడు ఆయన ఇలా ఉపదేశించెను: “సహోదర ప్రేమ నిలు వరముగా ఉండనీయుడి.”—హెబ్రీ. 13:1.
6. ప్రేమను గూర్చి ఏ భావమందు యేసు తన అనుచరులకు “ఒక క్రొత్త ఆజ్ఞను” ఇచ్చెను?
6 తనననుసరించు వారినుండి యేసు అలాంటి ప్రేమను కోరెను, ఏలయనగా ఆయనిట్లనెను: “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరునూ ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:34, 35) ఇది “ఒక క్రొత్త ఆజ్ఞ” ఎందుకంటే “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనని” చెప్పిన మోషే ధర్మశాస్త్రం కంటే ఇది మరి ఎక్కువ చేయుటకు పిలుపునిచ్చినది. (లేవీయ. 19:18) ఒకడు తన్నువలె పొరుగువానిని ప్రేమించిన దానికంటే “క్రొత్త ఆజ్ఞ” మరి ఎక్కువను జరిగింది. వేరొకనికొరకు ప్రాణము పెట్టునంత స్వయం-త్యాగమునకు అది పిలుపునిచ్చినది. యేసు జీవితము మరణము అలాంటి ప్రేమకు ఉదాహరణముగా యుండెను. క్రైస్తవులను గూర్చి లోకస్థులు అనిన మాటలను ఎత్తి చూపించుచు ఆ గుర్తింపదగిన గురుతును టెర్టూలియన్ పరోక్షముగా చూపించుచు ఇట్లనెను: “ఇదిగో, ‘వారు ఎట్లు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. . . . మరియు వారెట్లు ఒకరికొరకు మరొకరు ప్రాణము పెట్ట సిద్ధముగా యున్నారని’ వారనుచున్నారు.”—అపొలజి, అధ్యా. XXXIX, 7.
7. సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత సహోదర ప్రేమ ఎట్లు సాక్ష్యాధారమైయుండెను?
7 సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత యేసు శిష్యుల మధ్య సహోదర ప్రేమ సాక్ష్యాధారముగా యుండెను కాబట్టి దూరప్రాంతములనుండి వచ్చి క్రొత్తగా బాప్తిస్మము తీసుకొని విశ్వాసులైన అనేకులు యెరూషలేమునందు మరికొంత కాలము కూడా ఉండి క్రీస్తు ద్వారా రక్షణకొరకు దేవుడు చేసిన ఏర్పాటును గూర్చి మరింతగా నేర్చుకొనగల్గిరి. “విశ్వసించిన వారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారివారి అక్కరకొలది పంచిపెట్టిరి.”—అపొ. కార్యములు 2:43-47; 4:32-37.
8. ఈనాడు యెహోవాసాక్షుల మధ్య సహోదర ప్రేమ ఉన్నదనుటకు ఏ నిరూపణ కలదు?
8 మన కాలములో అలాంటి ప్రేమ యెహోవాసాక్షుల మధ్య కలదు. ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధానంతరము అలాంటి ప్రేమ రెండున్నర సంవత్సరాలపాటు సహాయ కార్యక్రమములు చేయుటకు దేవుని ప్రజలను కదిలించినది. యుద్ధనష్టము కల్గిన ఆస్ట్రియా, బెల్జయం, బల్గేరియా, చైనా జెకొస్లవేకియా, డెన్‌మార్క్, ఇంగ్లాండు, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీసు, హంగేరి, ఇటలీ, నెదర్‌లాండ్స్, నార్వే, ఫిలిఫ్పైన్స్, పోలాండ్, రుమేనియ మొదలగు దేశముల యందలి తమతోటి విశ్వాసుల కొరకు కెనాడా, స్వీడన్, స్విడ్జర్లేండు, అమెరికా సంయుక్త రాష్ట్రములు మరియు ఇతరదేశముల యందలి సాక్షులు వస్త్రములను ఆహారము కొనుటకు డబ్బును విరాళముగా ఇచ్చిరి. ఇది కేవలము ఒక ఉదాహరణ మాత్రమే ఏలయనగా ఇటీవలనే దేవుని సేవకులు అలాంటి ప్రేమను పెరూ, మెక్సికోలలో జరిగిన భూకంపములకు, జమైకాలో సంభవించిన తుఫాను అలాగే ఇతర ప్రాంతములయందు జరిగిన విపత్తులలో నష్టపోయి వ్యధకు గురిఅయిన క్రైస్తవులయెడల చూపించిరి. ఇలా మరియు మరెన్నో విధములుగా యెహోవా ప్రజలు తమ సహోదర ప్రేమను నిలువరనిచ్చుచున్నారు.
ఆతిధ్యమియ్యుడి
9. (ఎ) హెబ్రీ. 13:2 నందు ఏ దైవలక్షణము ప్రస్తావించబడినది? (బి) ఎట్లు కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిధ్యము చేసిరి?
9 ‘దైవభీతి భయముతో పవిత్ర సేవచేయుచు’ యెహోవాను తమ సహాయకునిగా కలిగియున్న క్రీస్తు అనుచరులు కనబరుచు మరొక లక్షణమును పౌలు తర్వాత ప్రస్తావించెను. ఆయనిలా త్వరపెట్టెను: “ఆతిధ్యము చేయ మరువకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిధ్యము చేసిరి.” (హెబ్రీ. 13:2) ఎవరు “ఎరుగకయే దేవదూతలకు” ఆతిథ్యమిచ్చిరి? పితరుడైన అబ్రాహాము ముగ్గురు దూతలకు ఆతిథ్యమిచ్చెను. (ఆది. 18:1-22) వారిలో ఇద్దరు బయలుదేరి వెళ్లగా, ఆయన మేనల్లుడైన లోతు ఈ క్రొత్తవారిని సొదొమనందుగల తన ఇంటికి ఆహ్వానించెను. వారు విశ్రాంతి తీసుకొనుటకు ముందే లోతు ఇంటిని “పిన్నలు పెద్దలు” గల ఒక గుంపు చుట్టుముట్టెను. లైంగిక దుష్కామ క్రియల కొరకు తన అతిధులను వారికప్పగించవలసిందిగా లోతును వారు అడుగగా, లోతు దానికి తీవ్రముగా తిరస్కరించెను. లోతుకు ఈ విషయము ముందు తెలియకపోయినను ఆయన వారికి ఆతిథ్యమిచ్చెను. కాగా వారు యెహోవా సొదమ మీదను, గొమొర్రామీదను అగ్ని గంధకములను ఆకాశమునుండి కురిపించినప్పుడు లోతు అతని కుమార్తెలు మరణించకుండా తప్పించుకొనుటకు సహాయము చేసిరి.—ఆది. 19:1-26.
10. ఆతిథ్యమిచ్చు క్రైస్తవులు ఏ ఆశీర్వాదములను అనుభవింతురు?
10 ఆతిథ్యమిచ్చు క్రైస్తవులు అనేక ఆశీర్వాదములను అనుభవింతురు. వారి అతిధులు వివరించు సంపన్నమైన అనుభవములను విని వారి ఆత్మీయ ప్రతిఫలదాయక సహావాసము ద్వారా ప్రయోజనము పొందుదురు. తోటి విశ్వాసులను “పరదేశులు” చేర్చుకొనినందున గాయు మెచ్చుకొనబడెను. అనేకమంది యెహోవా ప్రజల ఇప్పుడు ఆలానే కొంతమంది ప్రయాణ కాపరులను చేర్చుకొని ఆతిథ్యమిచ్చుచున్నారు. (3 యోహాను 1, 5-8) పెద్దగా నియమింపబడుటకు ఆతిథ్యమిచ్చువారై యుండుటకు ఒక అర్హతయై యున్నది. (1 తిమోతి 3:2; తీతు 1:7,8) అంతేకాకుండా తన ‘అభిషక్త “సహోదరులకు” ఆతిథ్యమిచ్చి మేలు చేయు గొర్ర వంటి వారికి యేసు రాజ్యాశీర్వాదములను వాగ్దానము చేసెననుట గమనించవలసిన విషయము.—మత్తయి 25:34-40.
హింసించబడుచున్న వారిని గుర్తు తెచ్చుకొనుము
11. హెబ్రీ. 13:3 నందలి సలహా ఎందుకు సమయానుసారమైనదై యున్నది?
11 యెహోవా సహాయమును కోరి, ‘ఆయనను భయభక్తులతో సేవించుచు ప్రీతిపరచుటకు’ ఇచ్ఛయించు వారందరు బాధ నొందు తోటి విశ్వాసులను మరచిపోకూడదు. బాధనొందిన క్రైస్తవులు భరించిన శ్రమలను పౌలు అర్ధము చేసుకొనెను. అంతకు ముందు కొద్దికాలము క్రితము హింసకారణముగా శిష్యులు ఆయన యొక్క జతపనివాడును చెదిరిపోయిరి. తిమోతి అప్పుడే చెరనుండి విడుదలాయెను. (హెబ్రీ. 13:23; అపొస్తలుల కార్యాలు 11:19-21) క్రొత్త సంఘములను స్థాపించుటకు లేక ఉన్నవాటిని ఆత్మీయముగా నిర్మించుటకు క్రైస్తవ మిషనరీలు కూడా ప్రయాణములు చేయుచుండిరి. వచ్చు అనేకమంది సహోదర సహోదరీలు అన్యులు నుండి వచ్చు వారైయుండిరి గనుక, కొందరు హెబ్రీ క్రైస్తవులు వారి విషయమై సంతృప్తికరమైన శ్రద్ధను కలిగియుండక పోవచ్చును. ఆ సమయాన ఈ సలహా ఎంతో సరియై యుండెను. “మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధింపబడిన వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరములో ఉన్నారు గనుక బాధపడువారిని జ్ఞాపకము చేసుకొనుడి.”—హెబ్రీ. 13:3.
12. బాధనొందిన తోటి విశ్వాసులను మనస్సు నందుంచుకొనుటకు మనమెట్లు ఆ సలహాను అన్వయించవచ్చును?
12 హెబ్రీయులు “ఖైదు నందున్న వారిని కరుణించిరి” అయితే వారు యూదులైనను లేక అన్యుల నుండి వచ్చిన వారైనను తమ తోటి ఆరాధికులను మరువకుండవలెను. (హెబ్రీ. 10:34) అయితే మన విషయమేమి? బాధనొందు క్రైస్తవులు మన మనస్సు నందున్నారని మనమెట్లు చూపించవచ్చును? రాజ్యప్రచారపని నిషేధింపబడిన దేశముల యందు తమ విశ్వాసమును బట్టి ఖైదు చేయబడిన తోటి విశ్వాసులకు సహాయము చేయు ప్రయత్నమందు కొన్నిసార్లు ఆ యా ప్రభుత్వ అధికారులకు ఒక ఉత్తరము ద్వారా విన్నపము చేయుట సరియై యుండును. సాధ్యమైతే వారిని పేర్లను ప్రస్తావించుచు వారిని ప్రత్యేకముగా ప్రార్ధనలయందు జ్ఞాపకము చేసుకొనవలెను. వారికి కలుగు హింస మన మీద మిక్కిలి ప్రభావము చూపును కాగా వారి పక్షమున చేయు మన నమ్మకమైన ప్రార్ధనలను యెహోవా ఆలకించును. (కీర్తన 65:2; ఎఫెసీయులు 6:17-20) అదే చెరసాల గదియందు మనము లేకపోయినను, వారితో బంధింపబడిన వారముగాను సహాయము ప్రోత్సాహము ఇవ్వగలవారమైనట్లున్నాము. ఆత్మయందు జనించిన క్రైస్తవులు తప్పకుండా బాధనొందు అభిషక్తుల యెడల కరుణ చూపుదురు. (1 కొరిం. 12:19-26ను పోల్చుము.) భూనిరీక్షణగల హింసనొందు తమ సహవాసుల యెడల కూడా వీరు అదే శ్రద్ధను కలిగియున్నారు. వీరు కూడా హింసకుల చేతులలో అనేక విధములైన బాధలననుభవించుచున్నారు. మనమింకను మానవ శరీరమందుండి బాధనొందు మరియు యెహోవా ఆరాధికులుగా హింసనొందు స్ధానమందున్నాము గనుక అలాంటి మమతాభావము సరియైయున్నది.—1 పేతురు 5:6-11.
వివాహము ఘనమైనదిగా యుండవలెను
13. సారాంశమందు హెబ్రీ. 13:4లో పౌలు చెప్పినదేమి?
13 క్రీస్తు మాదిరిని అనుసరించుట, భయభక్తులతో యెహోవాకు ప్రీతికరమైన సేవచేయుట ఇతరులమీద మనకున్న శ్రద్ధ మీద అనేక విధములుగా ప్రభావము చూపవలెను. “మీరును శరీరముతో ఉన్నారని” ప్రస్తావించి, పౌలు ఇతరుల యెడల సరియైన శ్రద్ధను చూపించు అవకాశమును అందించు శరీర సంబంధమైన లేక భౌతికమైన ఆకృతిని గూర్చి చెప్పెను” (హెబ్రీ. 13:3) హెబ్రీ క్రైస్తవులకు ఆయన ఈ విన్నపమును చేసెను రోమా సామ్రాజ్యమందు లైంగిక దుర్నీతి ప్రబలమైయున్నందున ఈ సలహా ఎంత సరియైనదిగా యుండెను! లోకము యొక్క దిగజారిన కట్టడలు మరియు లైంగిక దుర్నీతి కారణముగా సంఘముల నుండి ప్రతి సంవత్సరము వేలాది మంది బహిష్కరింబడుచున్నారను వాస్తవము దృష్ట్యా ఆధునిక-దిన క్రైస్తవులు కూడా ఈ మాటలను లక్ష్యపెట్టవలసిన అవసరము కలదు.
14. వివాహము ఘనమైనదని మీరెందుకు చెప్పుదురు?
14 పౌలు కాలమందు ఎస్సెనీయులు వివాహమును ఉన్నతముగా ఎంచని వారిలో ఒకరై యుండిరి. వివాహబంధము కంటే ఒంటరిగా యుండుట మరింత పరిశుద్ధమని తప్పిదముగా ఎంచు ఈ నాటి కొంతమంది మతనాయకుల వలెనే వారు కూడా ఏకాంతవాసము చేయువారై యుండిరి. హెబ్రీ క్రైస్తవులకు చెప్పిన విషయము ద్వారా పౌలు స్పష్టముగా వివాహము ఘనమైనదని సూచించెను. నయోమి తన విధవరాండ్రుగా యున్న కోడళ్లైన రూతు ఓర్పాలకు ఇలా చెప్పుట యందు దానియెడల గల ఉన్నతి వ్యక్తపరచబడెను: “మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసుకొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయుగాక!” (రూతు 1:9) మరొక చోట పౌలు తానుగా ‘తర్వాతి కాలములలో కొందరు విశ్వాసము నుండి పడిపోయి వివాహమును నిషేధింతురని’ సూచించెను.—1 తిమోతి 4:15.
15. హెబ్రీ. 13:4నందు ఎవరు వేశ్యాసంగులు, వ్యభిచారులుగా చెప్పబడిరి, మరియు దేవుడు వారికి ఎట్లు తీర్పుతీర్చును.
15 ఒకప్పుడు పాత ధర్మశాస్త్రము క్రింద యుండి క్రొత్త నిబంధనలోనికి చేర్చుకొనబడిన హెబ్రీయులు “వ్యభిచరించవద్దు” అను ఆజ్ఞను ఎరిగియుండిరి. (నిర్గ. 20:14) అయితే వారు లైంగిక దుర్నీతి నిండిన లోకమందున్న వారిగా వారికి ఈ హెచ్చరిక అవసరమై యుండెను: “పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” వేశ్యాసంగుల యందు (జారులు) లైంగిక సంబంధముల యందు భాగము వహించు అవివాహితులు చేరియుందురు. వ్యభిచారులనగా ప్రత్యేకముగా వివాహితులైయుండి తగిన జతకాని వారితో సంబంధము కలిగియుండి తమ వివాహపాన్పును కల్మషము చేయు వారని అర్ధము. పశ్చాత్తాపము చూపని జారులు వ్యభిచారులు దేవుని తీవ్ర తీర్పుకు అర్హులు గనుక వారికి పరలోక నూతన యెరూషలేమునందుగాని రాజ్యపాలన క్రింద నిత్య జీవానందమునందుగాని ప్రవేశము లేదు. (ప్రక. 21:1, 2, 8; 1 కొరిం. 6:9, 10) వివాహ పాన్పును కలుషితము చేయవద్దని చెప్పు ఈ హెచ్చరిక వివాహిత క్రైస్తవులు తమ జతతో కలుషిత లైంగిక ప్రవర్తనను విసర్జించునట్లు చేయును. అయితే వివాహబంధములోనే సరియైన భౌతిక సన్నిహితత్వముల యందు ఏదియు అపవిత్రము కాదు.—1983 మార్చి 15 వాచ్‌టవర్ పుటలు 27-31, చూడుము.
ఉన్నవాటితో తృప్తి కలిగి యుండుము
16, 17. హెబ్రీ. 13:5లో ఏమి చెప్పబడినది, ఎందుకు ఈ సలహా హెబ్రీయులకు అవసరమై యుండెను?
16 మన మాదిరికర్తననుసరించుచు, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసినట్లయిన యెహోవా మన సహాయకుడను నమ్మకముతో మనము తృప్తి కలిగియుందుము. వస్తుదాయక విషయములను వెంబడించుటలో మిక్కిలిగా ఇమిడిపోయి యుండుట ఒక శోధనగా యుండగలదు. అయితే క్రైస్తవులు దానికి లొంగిపోకూడదు. హెబ్రీయులకు ఇలా చెప్పబడినది: “ధనాపేక్షలేని మనస్సు గలవారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి.” (హెబ్రీ. 13:5) హెబ్రీయులకు ఈ సలహా ఎందుకు అవసరము?
17 క్లౌదియ కైసరు (C.E. 41-54) పాలనలో సంభవించిన “గొప్ప కరవును గుర్తు తెచ్చుకొనిన వారై బహుశ హెబ్రీయులు ధనము విషయమై బహు చింతను కలిగిన వారై యుండవచ్చును. ఆ కరవు ఎంత చెడ్డదిగా యుండెనంటే వేరే ప్రాంతముల యందలి క్రైస్తవులు యూదయ ప్రాంతములయందున్న తమ సహోదరుల సహాయార్దమై జీవితావసర వస్తువులను పంపించిరి. (అ. కార్య. 11:28, 29) యూదా చరిత్రాకారుడైన జోసిఫస్ ప్రకారము కరవు మూడున్నర సంవత్సరాల కంటే ఎక్కువ కాలముండి, యూదయ యెరూషలేములలో బహు పేదరికమును ప్రబలజేసినది.—ఆంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్. XX, 2,5; 5,2.
18. హెబ్రీ. 13:5 నందలి సలహా మనకు ఏ పాఠమును దయచేయుచున్నది?
18 ఇక్కడ మనకేమైనా పాఠము కలదా? అవును మనమెంత బీదవారమైనను ధనాపేక్షను కలిగియుండకూడదు లేక దాని గూర్చి బహుగా చింతించకూడదు. వస్తుదాయక రక్షణను గూర్చి చింత కలిగి యుండుటకు బదులు, బహుశ దానికొరకు ఆశించుటకు బదులు మనము ‘కలిగియున్న వాటితో తృప్తి కలిగియుండవలెను: యేసు ఇట్లనెను: “కాబట్టి, మీరు ఆయన రాజ్యమును, (దేవుని) నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:25-34) “మనము కలిగియున్నవి మన జీవమునకు మూలము కాదు గనుక మనను “దేవుని యెడల ధనవంతునిగా” యుండుట యెడల ఏకాగ్రతను కలిగి యుండవలెనని కూడా ఆయన చూపించెను. (లూకా 12:13-21) ధనాపేక్ష ఆత్మీయతను బెదిరించుచున్నట్లయిన, హెబ్రీయులకు పౌలు ఇచ్చిన సలహాను లక్ష్యపెట్టి “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై యున్నదని” గుర్తుంచుకొందము.—1 తిమోతి 6:6-8.
యెహోవాయందు నమ్మికయుంచుము
19. దేవుడు యెహోషువకు ఏ అభయమునిచ్చెను, అది మన మీద ఎలాంటి ప్రభావమును చూపవలెను?
19 భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుటకు వెదుకు యేసు అనుచరులుగా మానవులయందు కాక మన పరలోకపు తండ్రి యందు మన నమ్మికయుంచవలెను. ఆయన వాగ్ధానమును మనము గుర్తుంచుకొనవలెను: “నిన్ను ఏ మాత్రము విడువను. నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీ. 13:5) ఇక్కడ యెహోషువతో “నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని” దేవుడు సెలవిచ్చిన మాటలను పౌలు ఎత్తి వ్రాయుచున్నాడు. (యెహోషువ 1:5; ద్వితీ. 31:16, 8ని పోల్చుము.) యెహోవా ఎన్నడును యెహోషువను విడనాడలేదు, ఆలాగే ఆయన యందు నమ్మకముంచినట్లయిన మనను ఆయన ఎడబాయడు.
20. (ఎ) 1990 కొరకైన వార్షిక వచనము ఏమై యున్నది? (బి) భయము లేకుండా ఏమి చేయకొనసాగవలెను?
20 రానైయున్న నెలలలో దేవుని అనంత సహాయమును గూర్చి యెహోవా సాక్షుల మధ్య నొక్కి చెప్పబడును. ఏలయనగా వారి 1990 వార్షిక వచనము ఇలా ఉన్నది: “యెహోవా నాకు సహాయుడు. . . . అని మంచి ధైర్యముతో చెప్పుము.” ఈ మాటలు హెబ్రీ. 13:6 నందు కలవు. పౌలు కీర్తనల రచయిత మాటలను ఎత్తి వ్రాయుచు హెబ్రీయులకు ఇట్లు చెప్పెను: “కాబట్టి, ‘యెహోవా నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?’ అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.” (కీర్తన 118:1) హింసింపబడినను, మనము భయపడము, ఏలయనగా దేవుడనుమతించిన దానికంటే మానవులు ఎక్కువ ఏమియు చేయజాలరు. (కీర్తన 27:1) యథార్థవంతులుగా మనము మరణించవలసి వచ్చినను, మనకు పునరుత్ధాన నిరీక్షణ కలదు. (అపొ. కార్య. 24:15) కాబట్టి, యెహోవా మన సహాయకుడను నమ్మకముతో ‘భయభక్తులతో దేవుని ప్రీతి పరచు సేవచేయుచు’ మన మాదిరికర్తను అనుసరించుటలో కొనసాగుదము గాక.
మీరు ఎట్లు ప్రత్యుత్తరమిత్తురు?
◻ హెబ్రీ క్రైస్తవులకు ప్రత్యేకముగా యెహోవా సహాయము ఎందుకు అవసరమై యుండెను?
◻ ఎట్లు యెహోవా ప్రజలు తమ “సహోదర ప్రేమను నిలువరముగా” యుండనిచ్చిరి?
◻ ఆతిధ్యమెందుకు ఇవ్వవలెను?
◻ బాధనొందు తోటి విశ్వాసులను గుర్తుంచుకొంటిమని చూపించుటకు మనమేమి చేయగలము?
◻ వివాహము నెందుకు మనము ఘనమైనదిగా యుంచవలెను?